విగ్రహారాధననువ్యతిరేకిస్తున్నామంటూ ధర్మాన్ని అపహాస్యం చేయాలనుకునేవారు ఆకాశం మీద ఉమ్మెయ్యాలనిప్రయత్నిస్తున్నామని తెలుసుకోవటం మంచిది.
>> Saturday, August 15, 2015
ప్రస్తుతకాలంలో ప్రచారమాధ్యమాలలో వారి ప్రచారాలు ఎలా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం అంతర్జాలం లో కూడా ఈ ప్రచారాలు తీవ్రంగా సాగుతున్నాయి.
హిందువులు సహనవంతులు కనుక సాధారణం గా తమ ధర్మం పై జరిగే అపప్రచారాలను చూసి వారి అవివేకానికి నవ్వుకుని వదలివేస్తుంటారు. ఎక్కువమంది వ్యతిరేకంగా మాట్లాడటం గాని లేక న్యాయపరంగా చర్యలకు గానీ ఉపక్రమించరు . ఇది అలుసుగా తీసుకుని కోట్లాదిమంది అనుసరించే ధర్మంపట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయటం,వ్రాతలు వ్రాయటం చేస్తున్నారు.
ఈమధ్య విగ్రహారాధన తప్పని ,పాపమని, ఇంకా కాస్తబరితెగించి విగ్రహారాధకులు మూర్ఖులని కూడా బ్లాగులద్వారా ప్రచారం చేస్తున్నారు.
ముందుగా విగ్రహారాధన గూర్చి వీళ్ల విషప్రచారం గూర్చి చూద్దాం.
భగవంతుడు ఎక్కడో మబ్బులచాటునో ,పరలోకం లోనో ఉంటాడని ఎడారి మతాల భావన.
కానీ ధర్మం ఏమి చెబుతోంది.?
భగవంతుడు సర్వశక్తివంతుడు . సర్వవ్యాపి . కనుక ఆయన అమ్దుగలడిందులేడని సందేహమువలదు ...సర్వోపగతుండు చక్రి........ అని నమ్ముతాము . కనుకనే ఆయనవిభూతులైన పంచభూతాలలోనూ, ఆయనకు ప్రతిరూపమైన సర్వజీవులలోనూ పరమాత్మను దర్శిం చవచ్చని నమ్ముతాము. గౌరవిస్తాము.
ఆ పరమాత్మపై అపారమైన ప్రేమతో నిరాకారానికి రూపమైన లింగం గాగని. కరచరణాదులతో గూడిన అర్చామూర్తులను గానీ పూజిస్తాము. పూజాసమయంలో భావనంతా పరమాత్మమయంగా ఉంటుంది కనుక ఆయన ప్రీతిచెంది భక్తులభావాలకనుగుణంగా కరుణకురిపిస్తుండాడు. అమ్మగా అపారప్రేమను కురిపిస్తాడు.
[ఐతే ఏదో గర్వభావనతో,అహంకారంతో చేసే అర్చనాదికములకు ఫలితాలుండవని అది ఓ ప్రహసనంగా మిగులుతుందని శాస్త్రవచనం.]
ఇక మనసు ఏకాగ్రతను పొందటం కోసం విగ్రహాన్ని ఒక ప్రతీకగా అనుకున్నా . సనాతన ధర్మం లోనేకాదు, ఇతరమతాలలోనూ ప్రతీకలను కొలవటం లేక పవిత్రంగా భావించటం ఉన్నదే
హిందువులు విగ్రహాలను కొలిస్తే క్రిస్టియనులు శిలువను , ముస్లిం లు నెలవంకను, ఇంకా కాబాస్టోను ను కూడా పవిత్రంగా భావించటం తెలిసినదే. అలాగే భగవద్గీత , ఖురాను, బైబిల్ గ్రంథాలను ఎవరూ కాగితం ముక్కల కట్ట గా చూడరుకదా? వాటిపట్ల అపచారం జరిగితే తీవ్రంగా స్పందిస్తారెందుకని? అవి కాగితాలతో తయారయినా తమ భావం మాత్రం అవి భగవంతుని వాక్కులని కదా? మరి విగ్రహారాధన లేదని ఎవరన్నారు?
రాల్లు రప్పలతో కట్టిన తమతమ ప్రార్థనా మందిరాలను రాల్లు మట్టే కదా అని చులకనగా చూడరు కదా? ఎందుకని ? ఆప్రతీకలు పరమపవిత్రమనే భావనవలనే కదా ? ఇక తమ ఫోటొపై త,మఎదురుగా ఎవడన్నా చండాలం వేస్తుంటే అది కాగితం ముక్కేకదా అని మిన్నకుంటాడా ? ఎవడైనా ?
ఎందుకని ?
కనుక ప్రతీకలలో తమభావాలను ఆరోపించి తాథాత్య్మం పొందటం మనిషి లక్షణం.
ఇక పరమాత్మం ను నవవిధభక్తిమార్గాలద్వారా ఆరాధించటం ఈ ధర్మం నేర్పింది. ఒకటి ఎక్కువకాదు మరోటీ తక్కువాకాదు. ఆసాధకుని మనోస్థితిని బట్టి ఆయా సాధనలలో ఫలితం వస్తుంది.
అసలు ఈసాధనా క్రమంలో చివరకు ఒంటరిగా ప్రయాణం సాగవలసినదే అనే సత్యం తెలుసుకనుక హిందువులు అన్నింటిలోనూ సాక్షీభూతంగా సాగుతూ చివరకు తనమార్గాన తాను సాగుతారు స్వేఛ్ఛగా.
ఇక గుంపులుగా కూడటం ద్వారామాత్రమే భగవంతుని చేరుతామనుకునే అపోహఉ న్న మతాలు తాముగుంపులుగా సాగుతూ మిగతావారిని చేర్చుకుని తమగుంపు మరింత విస్తరించాలనుకునే కోరికతో , ఎవరూ తమ గుంపు వీడకూడదని పలుని బంధనలు, బలప్రయోగాలు. కాదన్నవారి పట్ల ద్వేషం అసూయలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రేమాకరుణలతో కూడిన దైవమార్గాన్నుండి దూరమవుతారు.
సమర్ధసద్గురువులైన సాయినాథులు కూడా తమదగ్గరకొచ్చే భక్తులలో ఎంతో మందికి క్షేత్రదర్శనాలు పూజలు చేసుకోమని చెప్పారే ! వారికంటే గొప్ప ధర్మవర్తకులావీరు? గుంటూ రు మస్తానయ్య దర్గానుండి ,ఆజ్మీరు దర్గావరకు గుణదల మేరీ మాతనుండి సాగారమాతవరకు హిందువులు బేధభావం లేకుండా గౌరవాభిమానాలు చూపుతారు /.ఎందుకు ? ఆయామహాత్ముల నడవడిక భగవద్భక్తిపూరితమైనదని నమ్మటం వలన. సత్యం ఎక్కడున్నా నమ్మవలసినదే అనే శాస్త్రవచనం వలన. చిత్రంగా విగ్రాహారాధన వీళ్ళు ఈ క్షే త్రాల ను తప్పుపట్టరు
కలిప్రభావం వలన ఇప్పుడు సనాతనధర్మానుయూయులలో కూడా కొన్ని విపరీతాలు పొడసూపవచ్చు. అది యుగధర్మం. ఇవి కాలానుగుణంగా యుగపురుషులవలన సంస్కరింపబడుతూనే ఉన్నాయి. కానీ ధర్మం పేరుతో పవిత్రయుద్దాలు జరిపి సాటిజీవులమానప్రాణాలు తీయటానికి అంగీకరించదు ఈధర్మం.
నేడు ప్రపంచం లో నెలకొన్న భీకర అశాంతిికి కారణమెవ్వరు ? ఎడారిభూములలో ఆనాటి కాలమాన పరిస్థితులకణుగుణంగా అక్కడ ద్రష్టలవలన పుట్టి అక్కడి స్థితులను సంస్కరించి నేడు రాజ్యవిస్తరణకాంక్షతో రగులుతున్న వారి చేతులలో ఆయుధాలైనవి ఆమతాలేకదా?
ఇక్కడ భగవంతుడు కౄష్ణుడుఅవతరించి బోధించినది మరచిపోతున్నారని బుడుబుడిఏడ్పులతో వాదాలు వినిపించేవారు కృష్ణుడే పరదైవమని వాల్లవాల్లందరికీ చెప్పవచ్చు కదా ?
మాకు ఏమతం పట్ల దోషభావం లేదు ...ఆల్లూ వీళ్ళూ మాగూర్చి తప్పుడు అభిప్రాయం కలిగిస్తున్నారని మొగుడ్నికొట్టి మొగసాలకెక్కి సామెతగా వీళ్లమాటలు ఉన్నాయి వీరి రాతలు తిరగేసి చూడండి
ఎవరన్నా వారి మతం గూర్చి విమర్శలుచేస్తే మాత్రం అవి తప్పుకాదని మిగతావన్నీ ఖచ్చితం గా తప్పేననే గడసరి వాదనలు కనపడతాయి వారి వ్రాతలలో/
సర్వేజనా సుఖినోభవంతు ... అని కోరేది ధర్మం
మాభావనలనుమాత్రమే ఆచరించాలి అనుకునేది మతం.
ఇక్కడ ధర్మమేదో చూడండి
మీ మతాన్ని ,మీమార్గాన్ని అనుసరించండి... అలానే మిగతా వారి ఆచారాలను గౌరవించండి
భగవంతుడు అందరికీ సద్భుధ్ధినొసగాలని ప్రార్ధిస్తున్నాము.
జైశ్రీరాం









