శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిరుమల కొండపైకి వాహనాలను అడ్డుకుంటారా ? పిచ్చి పై స్థాయికి చేరుతున్నట్లుంది మీకు .

>> Sunday, September 22, 2013

సమైక్యాంధ్ర ఉద్యమనాయకులు రేపు తిరుమల కొండపైకి వాహనాలు వెల్లకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఈవార్త  చూస్తే ఉద్యమకారుల మతి తప్పి పిచ్చి స్థాయికి చేరుకుంటున్నట్లు అనిపిస్తున్నది

. ఈ ఉద్యమాలకు  దివ్యక్షేత్రాలకు సంబంధం ఏమిటి?  కొండకు వచ్చే భక్తులకు ఇబ్బంది కల్పించటం ద్వారా ఏమిసాధించాలని అనుకుంటున్నారు వీళ్ళు ?     ఉద్యమాలకు దైవానికి సంబంధం ఏమిటి?   మొన్న తెలంగాణ ఉద్యమంలో ఆలయాలు మూసివేసి న వాల్లు ఏంసాధించారు ? రాజకీయ విషయాలకు   రాక్షస మనస్తత్వమెందుకు? ఇలా ఇతర మతాలపట్ల చేస్తున్నారా ?   తెలంగాణా ఉద్యమంలో గాని సీమాంధ్ర ఉద్యమంలో గానీ పాల్గొంటున్న ఇతర మతస్థులు ఎప్పుడైనా ఉద్యమం పేరుతో వారి శ్రధ్ధాస్థలాలను ఈ రొంపిలోకి లాగారా ? ఆలయాలను ముసివేస్తామని ప్రకటించి మూసివేసిన తెలంగాణా ఉద్యమ సమయంలో ఎక్కడా  శుక్రవారం నమాజ్ లుకాని ఆదివారం ప్రార్ధనలు కానీ ఆగలేదే ? కనీసం ఆదౌర్భాగ్యపు ఆలోచన కూడా  ఆయామతస్థుల మనసులోకి రాలేదు.రాకూడదు కూడా . కానీ మనకు వస్తున్నాయి ఈ ఆలోచనలు . దైవదర్శనం లేకుండా చేసి రాక్షస మనస్తత్వాలను బయట పెట్టుకున్నాం . మరలా. ఇప్పుడూ  అదే తంతు . కొండపైకి  వచ్చే భక్తులకు ఇబ్బందికలిగించేలా వాహనాలను ఆపటం మొదలుపెడుతున్నారు. రేపు గుడి తలుపులు కూడా తీయొద్దంటారేమో ?కొండపైకి వెళ్ళటానికికూడా వీల్లేదంటరేమో ? ఏమో చెప్పలేం ? పిచ్చి ముదిరితే ఏస్థాయికైనా వెళ్ళొచ్చు.
ఉద్యమకారులూ! కొద్దిగా కళ్ళుతెరచి  చూడండి . దైవభక్తులకు కలిగించే బాధ భగవంతుని పట్ల అపచారమవుతుంది.   కోనేటిరాయని క్షేత్రంలో ఇలాంటి చర్యలు చేపట్టి కోరి ఆపదలను తెచ్చుకున్నట్లవుతుంది మనం..

అసతోమా సద్గమయ !

6 వ్యాఖ్యలు:

శ్యామలీయం September 23, 2013 at 1:43 AM  

నిస్సందేహంగా పిచ్చి ఆలోచనే!

venkatram September 23, 2013 at 4:13 AM  

Please note that the agitators are not stopping any devotee to go to Tirumala.

If vehicles are stoped the devotees can go through foot route.

In jammu we went to Vaishanvi Devi as well as Kalabhairavi temple by foot and return back (Total 40 KMs). Thousands of piligrims (60+ people) are going by foot although there are facilities like Horse and Pallakies.

Only old people whose health is not good they will suffer.

A real devotee never bother these problems.

Lord Venkateswara Swamy knows all these and may be want to take rest for some time (Every day he is giving Darshan for more than 20 hours).

venkatram September 23, 2013 at 4:14 AM  

Zilebi September 23, 2013 at 4:22 AM  
ఇప్పుడే డాక్టరు రమణ బాబు గారి టపా చదివి వస్తున్నా ! ఇట్లా 'సంఘ విద్రోహ కార్యములు చేసే వాళ్ళని పిచ్చి వాళ్ళు గా చెప్పడం - ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు.

జిలేబి

durgeswara September 23, 2013 at 4:31 AM  

మేంకూడా ఎగతాళి చేయటం లేదు. ఎగదన్నుకొస్తున్న ఆవేశం వ్యక్తం చేస్తున్నాం జిలేబీగారు.

Edge September 24, 2013 at 7:25 AM  

ఈ ఉద్యమాలకు పిల్లల చదువులకు సంబంధమేమిటి? ఈ ఉద్యమాలకు ఆసుపత్రులకు సంబంధమేమిటి? ఈ ఉద్యమాలకు వ్యాపారాలకు సంబంధమేమిటి? చదువుకొనే పిల్లలకు, వైద్యం అందాల్సిన రోగులకు, కుటుంబాన్ని పోషించాల్సిన ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బంది కల్పించటం ద్వారా ఏమిసాధించాలని అనుకుంటున్నారు వీళ్ళు?

ఈ ప్రశ్నలు కూడా వేస్తే, మీ ప్రశ్నలకు/ఆవేదనకు మరింత సార్ధకత చేకూరేదని నాకనిపిస్తోంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP