శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉండే అక్కినేని గారి చివరి యాత్రలో వారసులు కూడా సాంప్రదాయానుసారం ఉంటే బాగుండేదేమో !

>> Friday, January 24, 2014

తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉంటారు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎక్కడ కనపడ్డా పంచకట్టుతో తెలుగుదనం ఉట్టిపడుతుండగా నిండుగా ఉంటారు. సాంప్రదాయములపై ఆయనకు నిబద్దతమెండు. ఓసారి ఆయనంటారు ఒక ఇంటర్వ్యూలో " పెళ్ళి పీటలమీద పెళ్ళికొడుకు నిండుగా పంచెకట్టుకుని ఉంటే శోభగా ఉంటుంది గానీ ఫ్యాంటు షర్ట్ లతో పెళ్ళిపీటలమీద కూర్చుంటే ఆ అందం ఎక్కడనుండి వస్తుంది? "అని.
కాబట్టే ఎక్కడ ఏ కట్టూబొట్టూ, వస్త్రధారణ ఉండాలో అక్కడ ఉండాలి అంటారు పెద్దలు.
ఆయన ఒకమహానటుడు .. నిజజీవితాన్ని పరిపూర్ణంగా ఎలా అనుభవించాలో చక్కని ప్రణాళిక ఉన్న జీవితం గడిపి, బాధ్యతలన్నీ పూర్తిచేసుకుని ,మరణం దగ్గరకొస్తున్నదన్న విషయం  సాధారణమే కదా ? అన్న నిశ్చలత్వంతో గడిపి ప్రశాంతంగా నిద్రలో తమ దేహాన్ని వదిలేశారు. అందరికీ రాదు ఆ అదృష్టం.

ఇక వారి అంతిమసంస్కారాలను టివీలో చూస్తున్నప్పుడు  సాంప్రదాయ పద్దతులను పాటించటం లో వారసులు పెద్దగా శ్రద్దచూపకపోయారేమో ననిపించింది. అయితే పుట్టెడు దుఃఖంలో వున్న వాల్లు ఈవిషయం గమనించకపోయినా  పక్కన పెద్దవాల్లైనా వారికి సూచనలు ఇస్తేబాగుండేది.

సహజంగా పార్ధివ దేహాన్నికూడా పవిత్రంగా భావించి దహన కార్యక్రమంజరిపేప్పుడు పాదరక్షలు వేసుకోరు . కానీ నాగార్జునతోసహా అందరూ బూట్లుధరించటం బాలేదు.
ఇక ఈసంస్కారంలో పంచెకట్టుతో తడివస్త్రాలు ధరించి ఉంటారు చితికి నిప్పంటించే వారు.  కానీ అక్కడ అలా లేదు.
అన్నిటికంటే అర్ధం కాని విషయం  తండ్రికి  పెద్దకుమారుడు తలకొరివి పెట్టాలి   పెద్దవారు వెంకట్ గారుండగా  నాగార్జునగారిచే ఈకార్యక్రమం జరిపించటం ఏమిటో ? ఎందుకో? తెలియటం లేదు.
    ఈ సంస్కారాన్ని జరిపించే జంగమదేవర గంట,శంఖం తో ఒక్కసారి కనిపించారు ఆతరువాత ఈ కార్యక్రమమప్పుడు ఆయనను ఎక్కడోవెనక్కు నెట్టేసినట్లున్నారు.

ఇక  ఓ మంచి నటుని మరణం పై ఇలాంటి   విషయాల ప్రస్తావన అవసరమా ? అని కోపగించకండి.
,మనిషి పుట్టినప్పటినుండి మరలా మట్టిలో కలిసేవరకు ఒక యజ్ఞంలా  మనజీవితాలలో సంస్కారముల పరంపర కొనసాగుతుంది. దేవునిపై పెద్దగా నాకు నమ్మకం లేదని నాగేశ్వర రావుగారు చెప్పినా, సాంప్రదాయాలను పాటించటంలో మాత్రం ఆయన నిబద్దతగా ఉండేవారు. వారి పూర్ణజీవితంలో ఈ చివరిఘట్టం లో సాంప్రదాయంకూడా చక్కగా పాటిస్తే బాగుండేదనే నా భావన. పరమాత్మ వారికి దివ్యలోకాలనుప్రసాదించాలని వేడుకుంటూ... నమస్కారం

2 వ్యాఖ్యలు:

Unknown January 24, 2014 at 2:41 PM  

కోపగించడం కాదు కానీ....

సంప్రదాయం వేరు. మత విశ్వాసాలు వేరు. ఆయన పంచెకట్టుతో తెలుగు సంప్రదాయంతో కనిపించినా తాను నాస్తికుడినని, దైవాన్ని విశ్వసించనని ఎన్నో సార్లు చెప్పారు. ఆయన విశ్వాసాలని గౌరవించారు వారి పిల్లలు. ఇది అభినందించాల్సిన విషయమే కానీ ఆక్షేపించాల్సిన విషయం ఎంత మాత్రమూ కాదు. వారి కుటుంబ వ్యవహారాల్లో మనం "అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది" అని చెప్పడం లో ఔచిత్యం లేదు.

ఎవరి కుటుంబ సంప్రదాయాల ప్రకారం వారు చేస్తారు. అక్కినేని అంత్యక్రియల్లో అసలు పురోహితుడే లేడు.

ఇందులో జనాభిప్రాయానికి తావు లేదు.

venkatram rao January 25, 2014 at 12:56 AM  

Yes, I also observed (They not even shaved/removed their hair).
As they are celbraties others may also follow!!!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP