శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?

>> Monday, February 9, 2015

బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?

[from andhrabhoomi daily]

  • - ఉదయ్‌లాల్ పాయ్ sanskritimagazine.com
చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది. అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు.
గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది. ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం. సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని, సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా. అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.
బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే. వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు. చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? (సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం. వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం. కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు). పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి. ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు.
మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు. బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు. ఓబిసీలు సైతం దళితులను అణగిదొక్కినవారే. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?
చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం. ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది. ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం. ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు? ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడు, వాల్మీకి, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, తులసీదాసు, కబీర్, వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే. వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు. కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు. ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే.
అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి. ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు. పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరికి, వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? (్భరత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు. దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని). సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు.
కాశ్మీర, గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?
(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు. వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?)
భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట. ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు.
19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు. (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు). వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు? ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే. ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు, వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే. మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు. వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు. వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?
సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది. బ్రాహ్మణులు కేవలం వేదాలు, గణిత, ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయుర్వేద, ప్రాణాయామ, కామసూత్ర, యోగ, నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే. బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే, విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది. ఎంత విచారకరం!

18 వ్యాఖ్యలు:

sarath February 9, 2015 at 11:08 PM  

బ్రాహ్మణులని నాశనం చెయ్యటం ద్వారా చాలా తేలికగా భారత దేశాన్ని నాశనం చెయ్యొచ్చు. అందుకే ఈ వ్య్వస్తీకృత బురదజల్లుడు కార్యక్రమం జరుగుతుంది.
నోట్: నేను బ్రాహ్మడుని కాదుకానీ కులం పేరుతో మనుషులని అణ్గద్రొక్కే ధోరణిని నిరసిస్తాను. అది ఏ కులమైన సరే

తనికెళ్ళ సుబ్రహ్మణ్యం February 10, 2015 at 1:43 AM  

the fact is very clear

Radha Krishna Mallela February 10, 2015 at 1:49 AM  

Very good.. brought facts To the light.

తనికెళ్ళ సుబ్రహ్మణ్యం February 10, 2015 at 1:51 AM  

the fact is very clear

Srikanth M February 10, 2015 at 4:06 PM  

గత కాలములో ఏదో జరిగిందని ఇప్పుడున్న వారిని పీడించడం అన్యాయం. అప్పుడెప్పుడొ నిజంగానే బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయించారని కాసేపు అనుకున్నా, ప్రస్తుతమున్నవారు దానికి ఏవిధంగా బాధ్యులవుతారు? అలా బాధ్యులవుతారు అనుకుంటే ... మిగిలిన వారిని కూడా బాధ్యులను చేయాలి కదా? అది బ్రాహ్మణులైనా .. దేవాలయాలను ద్వంసం చేసిన వారైనా !! కాబట్టి, వాటిని వదిలేసి, ప్రస్తుతములో బ్రతకడం ఉత్తమం. కొన్ని తేడాలతో ఇప్పుడు అందరికీ అన్నీ అందుతున్నాయి. ఎవ్వరి మీద ఆంక్షలు లేవు. ఎక్కడైనా ఆంక్షలు ఉంటే, అది అంతే .. అలానే ఉండాలి అనే వారు ఎవ్వరూ లేరు. అన్నా ఊరుకునే వారూలేరు.

ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్ February 10, 2015 at 10:44 PM  

బ్రాహ్మణుల మీద కక్కబడిన విషం, చల్లబడిన బురద ఎక్కువభాగం బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి తెర-వెనక-ప్రోత్సాహంతో జరిగింది. అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ లో బ్రాహ్మణ నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తూండడం వల్ల వాళ్ళ నాయకత్వాన్ని కుదేల్ చేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి ఇలాంటి కుటిల వ్యూహం అవసరమైంది. ఇందులోని రాజకీయ/ క్రైస్తవ మతప్రచార కోణాన్ని గ్రహించలేక అప్పుడూ ఇప్పుడూ కూడా చాలామంది ఈ విషాన్ని గటగటా తాగేస్తున్నారు.

ఎవరు ఏ కాస్త బావున్నా తమకేదో అన్యాయం చేయడం వల్లనే బావున్నారనే లెఫ్టిస్టు ధోరణి వితండవాదం మన సమాజంలో గత వందేళ్ళల్లో గాఢంగా బలంగా నాటుకుపోయింది. ఎక్కడ వ్యక్తిగత ప్రతిభ , తెలివితేటలూ, శ్రమశీలం ఉన్నా అదంతా వర్గీయ డామినేషన్ గా దోపిడిగా చూసే సైకో తత్వానికి ఈ దేశం అలవాటు చేయబడింది. నానా రకాల మానవ సంబంధాలన్నింటినీ ఒక దోపిడీదారు - ఒక బాధితుడు అనే సంకుచిత నిర్వచనం కిందికి తీసుకొచ్చేశారు.

బ్రాహ్మణులు సమాజానికి గురువులు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ! ఏ గురుత్వంలోనైనా పెద్దరికం సహజంగానే ఉంటుంది. దాన్ని డామినేషన్ గా, దోపిడిగా, అణచివేతగా భావిస్తే, అలా భావించి ఆ పెద్దరికాన్ని ధిక్కరిస్తే నష్టపోయేది మనమే. అలాగే నష్టపోయాం కూడా గత వందేళ్లలో! బ్రాహ్మణుల మార్గదర్శకత్వం లేక, వాళ్ళ మాట వినేవాళ్ళు లేక అన్ని రంగాలూ పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. ఎవరూ వినేవాళ్లు లేక వారు కూడా ఈ మార్గదర్శకత్వం బాధ్యతల నుంచి విరమించుకున్నారు. తమ బతుకు తాము బతకడం అలవాటు చేసుకున్నారు.

బ్రాహ్మణులలో ధనికులున్నారు. రాజులూ ఉన్నారు. జమీందారులూ ఉన్నారు. అయితే అదంతా అరుదైన చెదురుమదురు సంఘటనలుగా, వ్యక్తిగత ప్రతిభగా ఉన్నాయే తప్ప Whole మొత్తంగా కులపరంగా బ్రాహ్మణులు ఏనాడూ సుఖజీవనం గడపలేదనేదీ, ఎవరినీ డామినేట్ చేయలేదనేదీ నిజం. నిజానికి వాళ్ళు స్థానికంగా బలవంతులైన ఇతర కులాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతూ వచ్చారు. ఉదాహరణకి - ఇప్పుడు కూడా బ్రాహ్మణులైన మమతా, జయలలితా ముఖ్యమంత్రులైనంత మాత్రాన ఆయా రాష్ట్రాల్లో బ్రాహ్మణుల పరిస్థితి బావున్నట్లా? పూర్వకాలంలోనూ అంతే.

ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్ February 10, 2015 at 10:58 PM  

మరో విషయం. బ్రాహ్మణులు ఇతరులకేదో నేర్పలేదనేది ఒక పిచ్చి తుగ్లక్ వాదన. బ్రాహ్మల చదువులు ఇతర కులాలకి ఉపయోగపడే చదువులు కావు. ఎందుకంటే అవి ఇతరకులాల వృత్తుల్లా wealth creation కి ఉపకరించే చదువులు కావు. అవన్నీ just memory games. బ్రాహ్మణులు నేర్చుకునే వేదమంత్రాలూ, తర్కం , వ్యాకరణం, ఛందస్సు, అలంకారశాస్త్రం నేర్చుకుని ఆ రోజుల్లో ఒక రైతు, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి ఏం చెయ్యగలరు? అసలు, బ్రాహ్మలకే ఆ విద్యలు కూడూ గుడ్డా పెట్టిన దాఖలా లేదు. ఈ రోజుల్లో కూడా గుడ్డా పెట్టని చదువులు ఎవరు చదువుతున్నారు? ఒకవేళ అవే తర్కం, వ్యాకరణం ఇప్పుడు నేర్పుతామంటే ఎవరైనా ముందుకొస్తారా? ఆ రోజుల్లో పరిస్థితి కూడా అదేనని ఊహించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. కనుక బ్రాహ్మణుల వల్ల మిగతా కులాలకి చదువు రాలేదనేది నిజం కాదు. ఎందుకంటే ఆ కాలపు సమాజంలో చదువు జీవితానికి అవసరమైన ఆర్థిక సాధనం కాదు,. ఇప్పటి మాదిరి!

శ్యామలీయం February 11, 2015 at 4:14 AM  

ఈ చర్చలో నేను ఎక్కువగా పాల్గొనను కాని, ఒక్క విషయం చెబుతాను. నన్నయగారు అమృతాపహరణం వృత్తాంతంలో గరుత్మంతుడితో దేవతలు పోఆడి ఎలా ఓడిపోయినదీ చమత్కారంగా వర్ణిస్తూ ఒక ముక్క అంటారు "వసువులు వసుహీన విప్రుల క్రియ పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఇక్కడి చమత్కారం శ్లేష. వసువులు దక్షిణదిక్కుకు పారిపోయారని ఒక అర్థం. మరొక ముఖ్యమైన అర్థం ఇది - డబ్బులు లేని బ్రాహ్మణులు దక్షిణలను ఆశ్రయించుకొన్నట్లుగా వసువులు దక్షిణదిక్కును ఆశ్రయింఉకున్నారు అని. అంటే నన్నయగారి కాలానికే - అనగా పదకొండు వందల ఏళ్ళ నాటికే - బ్రాహ్మణులు బ్రతుకు తెరువుకు డబ్బులు లేక వదాన్యులు ఇచ్చే దక్షిణలమీద ఆధారపడి జీవించే దీన పరిస్థితి ఉంది అని మనకు అర్థం అవుతుంది.

kasi February 11, 2015 at 4:42 AM  

ఎంత ధైర్యం మీకు ఇలాంటివి రాయడానికి
కమ్యునిస్ట్ లు , లౌకిక వాదులు నుండి మీకు తిట్లు తప్పవు .

srinu the boss February 11, 2015 at 7:39 AM  

బ్రాహ్మణులని నాశనం చెయ్యటం ద్వారా చాలా తేలికగా భారత దేశాన్ని నాశనం చెయ్యొచ్చు. అందుకే ఈ వ్య్వస్తీకృత బురదజల్లుడు కార్యక్రమం జరుగుతుంది.
@sarath:మొత్తం జనాబాలో 4% ఉండే బ్రాహ్మణులని నాశనం చెయ్యటం ద్వారా చాలా తేలికగా భారత దేశాన్ని నాశనం చెయ్యొచ్చా?ఒకవేళ చేయగలిగితే వాళ్ళు పవర్ ఫుల్ అన్నట్లే కదా?.
@శ్రీకాంత్ M>>గత కాలములో ఏదో జరిగిందని ఇప్పుడున్న వారిని పీడించడం అన్యాయం.
ans:ఇప్పుడు బ్రాహ్మణులని ఎవరు పీడిస్తున్నారు?
>>ఎవ్వరి మీద ఆంక్షలు లేవు. ఎక్కడైనా ఆంక్షలు ఉంటే, అది అంతే .. అలానే ఉండాలి అనే వారు ఎవ్వరూ లేరు. అన్నా ఊరుకునే వారూలేరు.
ans:మీరు ఏ దేశం లో ఉన్నారు.
>>బ్రాహ్మణులు సమాజానికి గురువులు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ!
@ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్:వాళ్ళే గురువులుగా ఎందుకుండాలి?
>>బ్రాహ్మణులు నేర్చుకునే వేదమంత్రాలూ, తర్కం , వ్యాకరణం, ఛందస్సు, అలంకారశాస్త్రం నేర్చుకుని ఆ రోజుల్లో ఒక రైతు, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి ఏం చెయ్యగలరు?
ans:బ్రాహ్మణులు చేసే పనే చేసేవారు?మెమరీ గేమ్స్ ఇష్టమైనవాడు నష్టమైనా లాభమైనా అదే పని చేసేవాడు
>>కాంగ్రెస్ లో బ్రాహ్మణ నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తూండడం
ans:వాళ్ళే ఎందుకు ప్రముఖులయ్యారు ?

మీలో నిజాయితి ఉంటే నిజాలు చెప్పండి?

లేదు మాకు నచ్చినట్టు చెపుతాం అంటే ఎలాగో జరగాల్సింది జరుగుద్ది

న్యాయం ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు ఎలాగో జయిస్తారు

Zilebi February 11, 2015 at 5:45 PM  

ప్రశ్న: బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?

జవాబు: దారిద్ర్యానికి చదువు కన్నా పెద్ద పీట వెయ్యడం .

లక్ష్మి లేని సరస్వతి !

జిలేబి

durgeswara February 11, 2015 at 6:39 PM  

శ్రీను గారు

మీరు బ్రాహ్మణత్వం పట్ల సరైన అవగాహన కంటే కులద్వేషం తో మాట్లాడుతున్నట్లుగా ఉంది.
బ్రాహ్మణత్వం ఓతత్వం. అది త్యాగానికి ధర్మ నిబద్దతకు చిహ్నం. అది కోల్పోయి దాన్ని కులతత్వం క్రింద జమకట్తి కులాలాహంకారాలతో ఒకరినొకరు కించపరచుకున్న దౄష్టాం తాలు ఏవో కొన్ని ఉండవచ్చు అది సార్వజనీనం కాదు. ఉదాహరణకు మీతాత ఓరైతు . ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టాడు. కానీ అప్పట్లో మీకంటే ఇంకా కిందకులాలను బాగా చిన్నచూపు చూసి ఉండొచ్చు కాబట్టి మీరంతా దోషులే అనేఅపోహవాదనలు చెసేవారు మీ చుట్టూ ఉండవచ్చు మరి వారికేం సమాధానం చెబుతారు?
అది వాస్తవమా?
ఇక గురువు లన్నవారు కులాలనుంచి రారు గుణాలనుంచి వస్తారు. బ్రాహ్మణ కులం లో పుట్టినవారందరూ గురువులుకాలెదే ?
అలాగే మిగతా మనవర్ణాలలో పుట్టినవారు కూడా గురువులయ్యారే?
మాతతాగారి గురువు మాల కిచ్చన్న గారు.
అపూర్వ శివభక్తులు ఆయన.
అవధూత మాలపిచ్చమ్మగారు తెలుసా?
ఎందుకు తెలియదు. భరద్వాజ మాస్టర్ గారి శిష్యులై జ్ఞానసాధనచేసిన తల్లి పాలుతాగినవారు మీకామాత్రం తెలియదా?
జ్ఞాన సాధనామార్గం లో నదవవద్దని ఎవరినీ నిషేధించేస్థితి హైందవంలోలేదు. ఆదికవి కాలం నుండి నుంచి ఆధునిక కాలం దాకా అన్ని వర్ణాలలో జ్ఞానసాధనామార్గం లో గురువులుగా గుర్తింపు పొందినవారున్నారు. ఇక మనదౌర్భాగ్యం కొద్దీ విదెశీ కుట్రదారులు రచించిన తప్పులతడక చరిత్రతో మనలను మనమే శతృవులుగా భావించుకునే విషం తలకెక్కిపోయింది.

ఈద్వేషాలనుండి కొద్దిగా పక్కకు తొలగిచూస్తే గాని త్యాగమయ జీవనం యొక్క విలువలు అర్థం కావు.
ఇక కుల అహంకారాలన్నారు. అవి అజ్ఞానజనితమైన మనసులలోనుండి పుట్టినవై అందరికీ ఆపాదించబడి ఇప్పుడు మన హైందవసమాజంలో బహిరంగరహస్యమైన చీలికలకు కారణమయ్యాయి.

ఎన్ని కష్టనష్టాలనైనా, దారిద్ర్యాన్నైనా భరించి ధర్మాన్ని అంతిపెట్టుకుని ఉండటం అందరూ ఎందుకు చేయలేదు.? ఎవరూ ఎవరినీ అలా ఉండవదని వారించలేదే? రేపు మీకొడుకు అలాపెరిగి ధర్మపరాయణుడుగా జీవించాలని మీరుకోరుకుంటే కాదనే దెవరు?
చెట్తుపేరుచెప్పి కాయలమ్ముకునే వారు అన్నికులాలో ఉండొచ్చు. ఈవ్యాసం వ్రాసినాయన ఉద్దేశ్యం ఏమిటో మీరింకొకసారి చూడండి మనసుతో.

Srikanth M February 12, 2015 at 2:16 AM  

@srinu the boss
//ans:ఇప్పుడు బ్రాహ్మణులని ఎవరు పీడిస్తున్నారు?//
//ans:మీరు ఏ దేశం లో ఉన్నారు.//
------------------------
పీడన అంటే మీ దృష్టిలో ఏమిటో నాకు తెలీదు. మానసికంగా చేసే దాడి కూడా వస్తుంది. అప్పుడెప్పుడో బ్రాహ్మణులు ఏదో చేశారని, ఇప్పటికి కూడా "బ్రాహ్మనిజం" అనే కాన్సెప్టును ఒక దాన్ని పదే పదే గుర్తుకు చేస్తూ వారు చేసే పనులన్నింటినీ అదే బూతద్దములోంచి చూస్తూ వారిని జడ్జ్ చేసె విధానం పీడన అవ్వదా? అది పీడనే. మానసిక దాడి. దాన్ని నేను వ్యతిరేకిస్తాను. అదే చెప్పాను.

ఇంకో విషయం, నేను పీడన అన్నది సరికాదు అన్నది ఒక్క బ్రాహ్మణుల విషయములోనే కాదు. అది ఒకప్పుడు మన గుళ్ళ మీద దాడి చేసి నాశనం చేశారు అని చెబుతున్న వారికి కూడా వర్తిస్తుంది. అందుకే ఇక్కడ అదే పనిగా "గత కాలములో ఏదో జరిగిందని ఇప్పుడున్న వారిని పీడించడం అన్యాయం." అంటు ప్రస్తావించడం జరిగింది.

"కొన్ని తేడాలతో ఇప్పుడు అందరికీ అన్నీ అందుతున్నాయి. ఎవ్వరి మీద ఆంక్షలు లేవు." -- అనే స్టేట్మెంటు దగ్గరకి వద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం వివక్ష అన్నది ఉండడానికి వీలు లేదు. ప్రభుత్వం దానికి తగినట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వెనుకబడిన వారు ఉంటే వారికోసం కొన్ని వెసులు బాట్లు, ప్రత్యేక సదుపాయాలు కల్పించి, వారి పురోభివృద్దికి తోడ్పడాలి. ప్రభుత్వం ఈ పనులు చేస్తూనే ఉంది. ఇక అవి సామాన్యులకు చేరుతున్నాయా లేదా? ఎవరైనా అవి అమలు జరగకుండా అక్రమంగా అడ్డుకుంటున్నారా అన్నది మరో విషయం. అలా ఎవరైనా అడ్డుకుంటే... వారికి వ్యతిరేకంగా పోరాడే హక్కు బాధితులకు ఉంది. వారి హక్కులు వారు పోరాడి సాధించుకోక తప్పదు. అది ఇక్కడే కాదు, ప్రపంచములో ఎక్కడైనా సరే.

సో.. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటె.. కొన్ని తేడాలున్నప్పటికీ, ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి హక్కులు అందుతున్నాయి. ఎవరికైనా అందకపోతే .. వారు పోరాడి సాధించవచ్చు. అంతే కానీ, ఎవరైనా మీ బతుకింతె మీరు ఇలానే ఉండాలి అంటే పడుండాల్సిన అవసరం అయితే లేదు. నేను దీన్నే చెప్పాలనుకున్నాను.

ఇంకో విషయం పైన "బ్రాహ్మణులు సమాజానికి గురువు" అనే కామెంటు చూశాను. నేను దాన్ని సమర్ధించడం లేదు. గురువు అనేవాడు ఙ్ఞాణం ఉన్నవాడు. అది బ్రాహ్మణుడే అయ్యుండాల్సిన అవస్రంలేదు. బ్రాహ్మణుడు అయినంత మాత్రాన గురువు అయిపోడు. ఎవరైనా కావచ్చు. ఇదే నా అభిప్రాయం.

....
ఇక నేనుండే దేశం .. భారత్ అని కొందరు, ఇండియా అని మరికొందరు, హిందూస్తాన్ అని మరికొందరూ పిలుచుకునే దేశం. దానికి అఫిషియలుగా పేరు "ఇది" అంటూ లేదు. పైన చెప్పినవాటిలో ఎవరికి ఇష్టం వచ్చింది వారు పిలుచుకోవచ్చు.

....
నేను నిజాయితీగా అన్ని విషయాలు చెప్పానండి. కానీ, నేను నిజాయితీగా చెప్పానా లేదా అన్నది అర్థం కావాలంటే మీకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మరికొంత ... రాసింది పూర్తిగా చదివి అర్థం చేసుకునే సామర్ధ్యం ఉండాలి. Delusionsతో ఏవో ఊహించుకోవడం చేయకూడదు.

కనీసం ఈసారైనా మీరు కామన్ సెన్సుతో, రాసింది పుర్తిగా చదివి అర్థం చేసుకుని, Delusionsకి దూరంగా ఉంటూ నా నిజాయితీని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

ఇంతే సంగతులు.

విన్నకోట నరసింహా రావు February 12, 2015 at 8:51 AM  

దారిద్ర్యానికి పెద్దపీట వేయడమే కాదు జిలేబీ గారూ, దారిద్ర్యాన్ని గ్లోరిఫై చేస్తారు కూడా.

srinu the boss February 12, 2015 at 10:06 AM  

@durgeshwara:నేను కామెంట్ పెట్టినవారికే చెప్పాను..పోస్ట్ రాసినవారికి కాదు దయచేసి నా కామెంట్ చూడండి...
బ్రాహ్మణత్వం అంటే మీరు చెప్పినది నిజంగా బాగుంది
మీ కామెంట్ ని బట్టి ఒక మంచి మనిషిలోని మంచి గుణమే కాని కులం కాదు అని అదే బ్రాహ్మణత్వం అని అర్ధమైంది..నేను అర్ధం చేసుకుంది కర్రెక్టేనా?
@శ్రీకాంత్ m& దుర్గేశ్వర:బ్రాహ్మనిజం అంటే బ్రాహ్మణుల కు మాత్రమే కాదు,బ్రాహ్మనిజం అంటే అది ఎ కులం అయినా మన క్రింది కులాన్ని తోక్కిపెట్టాలి అనే కాన్సెప్ట్ గా ఈ కాలం లో రూపాంతరం చెందింది...
అందుకే పైన కులం కింది కులాన్ని తక్కువగా చూస్తున్నట్టుంది
@ శ్రీకాంత్m..పీడనే. మానసిక దాడి.
ans:దీనికి రాజ్యాంగం లో పరిష్కారం ఉంటే బ్రాహ్మణులూ పీడనను ఎదుర్కోవచ్చు కదా అనే కామన్ సెన్స్ నాకు ఉంది..మరి మీ కామన్ సెన్స్ కు కనపడలేనట్లుంది!అందుకే పీడన ఒక వర్గానికే ఉందని కాబోలు మీ అనుమానం?
మానవత్వం ఉండే ఎవరైనా మనుషులే
వారికి వర్ణాలు ఆపాదించేసే మనం పీడన అనేది ఒక వర్గానికే ఉందని బాధపడడం కర్రెక్టేనా?
పీడన ఎవరికీ ఉండకూడదు అనేది సత్యం
కాని అధిక పీడన ఎదుర్కునే వాడికి చేయుతనివ్వాలి కాని పాపం వాడినే ఎవరు పట్టించుకొనే దిక్కులేదు
దాన్ని గురించి అడిగిన నాకు కామన్ సెన్స్ లేకుండా ఎక్కడికో పోయినట్లుంది

Srikanth M February 12, 2015 at 6:33 PM  

@srinu the boss,

అందుకే చెప్పాను, కామన్ సెన్సుతో, పూర్తిగా చదివి అర్థం చేసుకుని, Delusions తో ఏవో ఊహించుకోకుండా ఉంటారని ఆసిస్తున్నాను అని. పీడన ఒక వర్గానికే ఉందని నేను ఎక్కడ చెప్పాను??

బ్రాహ్మనిజం అంటే ఏదైనా కానీ నాకు అనవసరం. పీడింప బడుతున్న ఎవరైనా కానీ, అలా పీడింపబడకూడదు అనేదే నా పాయింటు. రాజ్యాంగము ప్రకారం పీడన అన్నది లేకుండా జీవించే హక్కు బ్రాహ్మణులకే కాదు అందరికీ ఉంది. కాని దాన్ని ఎవరైనా ఆయా వర్గాల వారికి అందకుండా చేస్తూ ఉంటే పోరాడాల్సిన బాధ్యత ఆయా వర్గాల పైనే ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు "బ్రాహ్మనిజం" అనే కాన్సెప్టు మీద పోరాటం చేసినట్టు, ఇతర వర్గాల వారు, ముఖ్యంగా దళితులు తమ మీద సమాజములో ఉన్న వివక్షక్కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం దళితుల సామాజిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి కొన్ని వెలుసుబాట్లు, ప్రత్యేక సదుపాయాలు కల్పించిది.

కానీ మీరు ఉక్రోశ పడుతున్నారే కానీ విషయం గ్రహించడం లేదు. బ్రాహ్మణులు లేదా ఇతర (సో కాల్డ్) అగ్రకులాల వారు ఇప్పుడు మా కులమే అందరికంటే గొప్ప కులం, మిగిలిన వారు అంతే మా కింద పడి ఉండాలి అంటే వినే వారు ఉన్నారా?? రాజకీయ, సామాజిక చైతన్యం ఇప్పుడు అన్ని కులాలలోనూ ఉంది. ఎవరూ తగ్గడం లేదు.

మీ చెప్పాలనుకున్నది నేను అర్థం చేసుకోగలను. బ్రాహ్మణులు సమాజానికి గురువులు లాంటి వ్యాఖ్యలు చదివినప్పుడు మీకు కలిగే వ్యతిరేకతనూ నేను అర్థం చేసుకోగలను. కాకపోతే, ప్రతీ దానికీ "బ్రాహ్మనిజం" అనే పేరు పెట్టి విరుచుకు పడుతూ ఉంటే .. సాధారణ బ్రాహ్మనులకి కలిగే ఫీలింగును మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

//వారికి వర్ణాలు ఆపాదించేసే మనం పీడన అనేది ఒక వర్గానికే ఉందని బాధపడడం కర్రెక్టేనా?//
నేను ఎవరికీ వర్ణాలు ఆపాదించడం లేదు. పీడన ఒక వర్గానికే ఉందనీ చెప్పడం లేదు.

అధిక పీడన పొందుతున్న వారికి చేయూతను ఇస్తూనే ఉన్నారు కదా? ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది అని ఇది వరకటి కామెంటులోనే చెప్పాను కదా? అవి వారికి అందకపోతే పోరాడాలి, దానికి చాలా మార్గాలున్నాయి కూడా.

ఇంతకి మించి ఈ కాన్సెప్టు గురించి నేను ఎక్కువ మాట్లాడ దలుచుకోలేదు. అర్థం చేసుకుని శాంతిస్తారో, అపార్థం చేసుకుని ఆవేశ పడతారో మీకే వదిలేస్తున్నాను.

జయహొ February 13, 2015 at 6:01 AM  

"మొత్తం జనాబాలో 4% ఉండే బ్రాహ్మణులని నాశనం చెయ్యటం ద్వారా చాలా తేలికగా భారత దేశాన్ని నాశనం చెయ్యొచ్చా?ఒకవేళ చేయగలిగితే వాళ్ళు పవర్ ఫుల్ అన్నట్లే కదా?"

@శీను,
దేశంలో స్కాములు జరిగితే,అది అన్యాయమనిపిస్తే ఎవరైనా ముందుకు వచ్చి పోరాడవచ్చు. కాని 120కోట్ల జనాభాలో సుబ్రమణ్య స్వామి లాంటి ఒకరిద్దరు తప్పించి ఎంత మంది ముందుకు వచ్చారు? స్వామి 2జి కేసు వాదించి నిలుపు చేయించాడు. ఒక కోణంలో చూస్తే ఎంతో మంది పవర్ ఫుల్ వర్గాల తో తలపడ్డాడు. వారి ఆగడాలను చిత్తుచేశాడు. కాని నిజంగా ఆయన అంత పవర్ ఫులా? అంటే ఆయనకేమి జన,ధన, అప్పట్లో అధికార బలం కూడా లేదు. కాని పవర్ ఫుల్ వ ర్గాలను ఒంటరిగా ఎదుర్కోవటం అంతే ఆషామాషివ్యవహారం కాదు. వారి పైన విజయం సాధించటం చిన్న విషయం కాదు. ఆ కోణంలో చూస్తే ఆయన పవర్ ఫులే కదా! ఇటువంటి పోరాట పటిమగల స్వామి వంటి కమిట్మెంట్ గల వ్యక్తులు, ఒకప్పుడు స్వాతంత్ర పోరాట సమయంలో ఎక్కువగా ఆ వర్గంలో ఉండేవారు. బ్రిటిస్ తలారులు ఉరితీసిన 148 మందిలో సగం మంది బ్రాహ్మణులే. అండమాన్ జైల్లో నరకయాతన అనుభవించిన 500 మంది స్వాతంత్ర పోరాటయోధుల్లో సగానికి సగంవారే. ఇటువంటి పోరాట పటిమగల బ్రాహ్మమణు లందరిని, హిందూ సమాజంలో సకల దోషాలకు కారణం అయినట్లు, చిత్రికరించి, ఎదోక వంకతో పక్కకు తప్పిస్తే దోచుకోనేవారికి అడ్డు ఉండదని, పవర్ ఫుల్ ప్రముఖుల వ్యూహం. నాడు బ్రిటీష్ ఇండియాలో కొంతమంది జమీందారులు బ్రిటిష్ వారికి చెంచాగిరి చేస్తూ, బ్రాహ్మణులపై బురద జల్లుడు కార్యక్రమం పక్కలనుంచి మొదలు పెట్టారు. ఈ బ్రాహ్మణ వ్యతిరేకత ఆంధ్రాతో పోలిస్తే, తెలంగాణలో లేదు. కోస్తా ఆంధ్రా,తమిళనాడు లో ఎక్కువ. కారణం ఆ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో ఉండటమే.

PMISCo RVMSSA WGL March 7, 2015 at 2:15 AM  

very imp facts.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP