శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిను నమ్మినవారికెన్నడు నాశములేదుకదమ్మ ఈశ్వరీ !

>> Tuesday, October 21, 2008


అమ్మను నమ్మినవారికెన్నడు నాశములేదు సకల పురాణాలు .భక్తుల జీవిత గాథలు ఎలుగెత్తి చాటుతున్నాయి . ఇలాంటి ఒక అనుభవం నాకుతెలిసినది మీకు వివరిస్తాను. నాకు పెల్లయిన కొత్తలో గుంటూరుదగ్గర కోవెలమూడిలో ట్యూషన్స్ చెప్పుకుని జీవిస్తున్న నాభార్యతరపుబంధువు వీరనారాయణ గారింటికి వెల్లాము. వాల్లుచాలా కష్టములలొవున్నారు. ఆయన చిన్నతనమునుంచి గుంటూరులో పలుపనులను చెస్తూ చదువుకుని పెల్లయాక కూడా ఏపనిలొ స్తిరత్వముదొరకక కాలం వెల్లదీస్తున్నారు. కోవిలమూడివాసులు కొందరిసహాయం చేసి ఆయన చేత ట్యూషంస్ పెట్టించారు. మమ్మల్నెంతో ఆదరించారు. తరువాత నాతో త్వరగా కలసిపోయి తనమనసులోబాధలన్నీ నాతోపంచుకున్నాడు. తమస్వగ్రామమయిన గంగదొనకొండలో పొలాలువున్నా నీటివసతిలేక ఇక్కడకు వలసవచ్చామని ,తమముగ్గురుఅన్నదమ్ములలో ఇద్దరు స్థిరపడ్డా తనపరిస్థితే ఇలావున్నదని,దేనిలోనూ స్థిరత్వం దొరకటం లేదని బాధపడ్డాడు. తన అన్నగారు అతనిమిత్రుడు రాజకీయనాయకుడైనకన్నాలక్ష్మీనారాయణ[ప్రస్తుతము మంత్రివర్యులు] దగ్గరవుంచి జీతం ఏర్పాటుచేసినా తానే నిలబడలేక పోయానని వాపోయాడు. ఒకసారి పీఠందగ్గరకొచ్చి అమ్మను దర్శించుకొమ్మని చెప్పివచ్చాను. తరువాత అతనువచ్చి పోవటం జరుగుతూవున్నప్పుడు, నాతోపాటు ఒకసారి భవానీ మాలను ధరించమని ,ఆతల్లి కరుణవుంటే ఎటువంటి దరిద్రాలూ తొలగుతాయని చెప్పాను. ఆయనకూడా అంగీకరించి మాలాధారణచేసాడు. అప్పటినుండి ఆయనకు ఏపనిచేసినా కలసిరావటము, తానుకూడా ఏదయినా సాధించ గలుగుతాననే నమ్మకముకలిగినది. రెండుమూడుసంవత్సరాలలో అతని అత్తగారివూరయిన లేమల్లెపాడుచేరి అక్కడ కూడా ట్యూషన్ లు చెప్పుకుంటూ ,ఇతర చిన్నచిన్న బిజనెస్ చేస్తూ సంతోషముగా కాలం గడుపుతున్నాడు. ఇలావుండగా ఒకసారి వ్యాపారం పనుమీద విజయవాడవెళ్ళినప్పుడు అతని స్నేహితుడు కనపడి, ఒక కొత్త స్వామీజీ ఆశ్రమానికి తీసుకువెళ్ళాడట. అక్కడ ఇతనికి ఏమితీవ్రంగా తలకెక్కినదో గాని ఇంటికొచ్చాక ఇంటిలోపటాలన్నీ వాళ్ళ ఆవిడ వారిస్తున్నా వినకుండా తీసివేసి ,ఇప్పుడు వీళ్ళందరూ అవతారాలు చాలించిన దేవుళ్లు, ఇడిగో ఈకొత్తస్వామీజీయే దేవుడు అంటూ ,కొత్తాదేవుడండీ... అనేపాటలు పాడుతూ అపర కల్కి ఈభగవానులు అంటూ తెలిసినవారికందరికీ బోధించటం చెయ్యసాగాడు. తాజెడ్డకోతి వనమెల్లా చెరిచిందన్నట్లు ,ఆవూర్లోవున్న తన బంధువులకు కూడా ఈ పిచ్చి ఎక్కించాడు. తరువాత ఒకసారి నేను వెళ్ళినప్పుడు నాకు కూడా వివరించటం మొదలుపెట్టాడు. నేను అనేకరకాలుగా ప్రస్నించట తో సమాధానాలు చెప్పలేక మౌనం వహించాడు. వాలావిడ మాత్రం ఏమిటొనయ్యా ఈయన చాదస్తం చక్కగా చేసుకుంటున్న అమ్మవారి పూజను ఆపుచేసాడు. నేనెంతచెప్పినా వినటం లేదు. అనిబాధపడింది. దరిద్రం తలకెక్కినప్పుడు క్షేమకరమయిన మాటలు రుచించవు నువ్వన్నాపూజచేసుకోమ్మా అనిచెప్పి నేను వచ్చేశాను. ఆతరువాత రెండుసంవత్సరాలు నేను అతనిదగ్గరకు పోవటం కుదరలేదు .

ఈమధ్యకాలములో అతనికి అతనితోడల్లునికి పెద్ద ఆలోచనవచ్చినది. ఇక్కడ ఎంతకష్టపడితే ఏముంది ,మనస్వగ్రామములో పొలంవున్నదికదా? అక్కడకు వెళ్ళి బోర్లేపించి , పల్లతోటలు ,మధ్యలో కూరగాయలు ఇలా ఏడా పెడా పంటలు పండించేస్తే మనం హైదరాబాద్ కుకూడా కూరగాయలు సరఫరాచేసి నాలుగేళ్లలో తీరిపోవచ్చుఅని చిటికెల పందిర్లు అల్లుకుని ఒకమంచి ముహూర్తమ్లో తట్టాబుట్టా సర్దుకుని ప్రకాశం జిల్లా గంగదొనకొండకు బయలుదేరారు. వెళ్ళేటప్పుడే దారిలో ఇతని బట్టలు పెట్టిన బ్యాగ్ జీపుమీదనుంచి ఎక్కడో జారిపడిపోయినది. వంటిమీదబట్టలు ,వేరేవాటిలోపెట్టిన లుంగీలు ఎర్రవి[అమ్మవారిమాలకు వుపయోగించినవి] మాత్రమేమిగిలాయి. ఇక వెల్లాక తమదగ్గరున్న డబ్బుఖర్చుచేసి బోర్లు ప్రయత్నించారు , బీడు భూములయిన వాటిలో చుక్కనీరు పడలేదు .బ్యాంకులోలోనుకూడా తెచ్చి పత్తి పంటను వేశారు. అదికాస్తా తెగుల్లతో హరీమన్నది. మరుసటి సంవత్సరం తన తోదల్లుడు పీఛేమూడ్ అంటూ ఇతన్ని వదలి తనకాపరం తరలించుకువెల్లాడు. మొండిగా ఇతను మరల పత్తి,ఆముదాలు వేశాడు, ఆరెండుసంవత్సరాలు సరిగా వర్షాలు లేవు. ఆప్రాంతమ్లో వున్న పెద్దరైతులే తరలివెళ్ళిపోతున్న సమయమది.
దీనికి తోడు ఈయన తన కల్కి భగవానులు ప్రార్ధిస్తే చాలు కనపడతారు రమ్మని బోధించటం వచ్చిన జనం ఇతనిని ఎగతాళి చేయటం ,ఇత నిని పిచ్చివానిక్రింద పరిగణించే స్టేజీకొచ్చినది పరిస్థితి. పాపం ఆఇల్లాలు మానవతి. ఎప్పుడూ ఇంతకష్టమెరగకపోయినా ఎర్రనిఎండలో కష్టపడుతున్నా ఈయనను పల్లెత్తి మాట అనకుండా , పరమ దరిద్రాన్ననుభవిస్తూకూడా భర్తకు. అండగానిలిచిఉన్నది.

ఆసంవత్సరం పంటదెబ్బతిన్నది .అదీకాకఅన్నదమ్ములకు డబ్బుచెల్లించి వాళ్ల భాగం పొలంకూడా ఇతనేకొనుక్కుని వున్నడబ్బుకూడా కాగొట్టుకున్నాడు. ఇంటిలో గడవటం కూడా కష్టముగావున్నది. ఈసమయం లో దరిశివెళ్ళిన నేను అటునుంచి వారి వూరువెళ్లాను. మిట్టమధ్యాన్నం నేను వెళ్ళెసరికి ఆయన ఎర్ర లుంగీ కట్టుకుని ఆముదపుకాయలు ఎండలోపోసి నలగగొట్టుకుంటున్నాడు. చూడగనే మనస్సు చివుక్కుమన్నది. పాపం ఇద్దరు పిల్లలు ఆవిడ సరయిన బట్టలుకూడాలేక పరిస్థితి దయనీయంగావుంది. నన్ను ఆదరించి పలకరించినా అన్నానికి రమ్మనటానికి కూడా సందేహిస్తున్నారు. నాకు పరిస్థితి అర్ధమయినది. ఎందుకొచ్చిన బాధలయ్యా బావగారూ ,హాయిగాబ్రతికేవానివి నీకేమిటీస్థితి అని అంటే ఆయనేదో చెప్పుకొస్తున్నాడు. ఆతల్లి మాత్రం నువ్వుచెప్పాక అమ్మవారిపూజ మొదలు పెట్టాక బాగున్నస్థితి ఈయన పటాలుతీపించి నతరువాత దిగజారి ఈస్థితికి తెచ్చినది అని బాధపడినది. నీవన్నా చేయవచ్చుగదమ్మా పూజ అని చెబితే ,ఆయన కిష్టం లెకుండా ఏమిచెయ్యను అని కళ్లవెంట నీరుపెట్టుకున్నది. సరేనని నేను బయలుదేరగా అక్కడికి 2 కిమీ దూరమ్లోగల పొట్లపాడు రైల్వేస్టేషన్ కు నన్నెక్కించటానికి వచ్చాడు. అక్కడ బండిరావటం 2గంతలు లేటవటంతో కూర్చోబెట్టి. మనపెద్దలు చెప్పిన మార్గాన నడవాలి. కలియుగమ్లో వీధికొకదేవుడు పూటకొక దైవం గాప్రకటించుకునేవారువస్తారని భవిష్యపురాణం ,భాగవతం, బ్రహ్మంగారి కాలజ్ఞానాదులు హెచ్చరిస్తున్నాయి ,అని నాకు చేతనయినన్ని రీతులలో చెప్పినా ,ఆయనదొకటే మాట ,ప్రస్తుతము భూమిమీద మా కల్కేదేవుడు. ఇతరదేవతలనుకొల్చేవారు తెలివితక్కువవారుఅని. బుద్ధికర్మానుసారణి అనుకుని రైలెక్కి వచ్చేశాను. అమ్మా మహామాయవు నీవు జీవులను నీమాయలోనుండి బయటపడవేయడం నీకుతప్ప అన్యులకు సాధ్యం కాదు. నిన్ను నమ్మిన జీవులకెపుడు నాశము లేదని చెప్పే శాస్త్ర వాఖ్యానికి లోటురానీయకు అని మనసులో చెప్పుకున్నాను.
ఆతరువాత వచ్చిన శుక్రవారం జరిగినదొక చిత్రం . అప్పటివరకూ మౌనంగా బాధలు భరిస్తూవచ్చిన ఇల్లాలు, ఆవేశంతో నీనుండే మనకిన్ని కష్టాలు ,అమ్మను వదలిన నాటినుండి మనకుబాధలే అని ఎదురుతిరిగి ఆశుక్రవారము అమ్మవారి పటం శుద్ధిచేసుకుని పూజ జరుపుకున్నది. ఆతరువాత వారి పుట్టినవూరు లేమల్లెపాడు వెల్లిన వీరనారాయణగారిని ఆగ్రామస్తులు మందలించి. నిన్నెవరు వెళ్ళమన్నారయ్యా ! ఎందుకు పడుతున్నావీ బాధలు వెంటనే వచ్చెయ్ .మేము పిల్లలను నీవద్దకే చదువుకోవటానికి పంపుతామని ఆత్మీయంగా చెప్పారట. ఆయన తిరిగివచ్చి తనభార్యాబిడ్దలను తీసుకుని అక్కడ పొలాలు ఆగ్రామమ్లో నే కౌలుకు అప్పగించి లేమల్లెపాడుచేరాడు. అక్కడనుండి ఆయన పరిస్థితి మరలా చిన్నగా గాడిలోపడింది. తరువాత గుంటూరుచేరి అబ్బాయిని పాలిటెక్నిక్ చేపించుకుని అమ్మాయినికూడా ఇంటర్ పూర్తిచేపించి ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంజనీరిగ్ చేపిస్తున్నాడు. తానుకూడా హైదరాబాద్ ,బాలానగర్ లోగల లయన్స్ క్లబ్ వారి కంటిఆసుపత్రిలో వుద్యోగములోచేరి చక్కగా జీవితంస్థిరపరచుకునేదారిలోవున్నాడు. అడిగినవారందరికీ అమ్మ తనను రక్షించిన విధానాన్ని ఆర్తితో చెబుతుంటారాయన. అందుకే అన్నారు తల్లీ నిన్నునమ్మిన వారిని ఎన్నడూ నీవు చేయివదలక నడిపిస్తావని. యాదేవీసర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా..నమస్తస్యై ,నమస్తస్యై .నమస్తస్యై నమోనమ:

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP