శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label పూజలు. Show all posts
Showing posts with label పూజలు. Show all posts

హనుమత్ రక్షాయాగమునకు మీ గోత్రనామాలు పంపండి

>> Saturday, December 21, 2019

భగవద్బంధూ !

           ఈడిసెంబర్ ఇరవై ఆరు న సంభవిస్తున్న సూర్యగ్రహణం  ,షష్ఠగ్రహ కూటమి భూమిపై  మానవులజీవితాలపై  దుష్ప్రభావాలను చూపనున్నది. ,వ్యక్తిగతంగానూ సామాజికంగాను అలజడులు,ప్రమాదాలకు కారణము కానున్నదని పెద్దలు సూచించున్నారు.   గ్రహస్ఠితులను మార్చగల శక్తి మనకు లేకున్నా భగవంతుని శరణుచొచ్చటం ద్వారా ఉపద్రవాలనుండి రక్షింపబడతామన్నది  వాస్తవం.  కనుకనే భక్తజనుల క్షేమముకోసమై 
"హనుమత్ రక్షాయాగం " ను ద్వాదశావృతిగా   ప్రారంభించటం జరిగినది. ప్రతిసంవత్సరం జరుగుతున్న ఈ క్రతువులో పాల్గొనటం ద్వారా  స్వామి అనుగ్రహంతో తమ సమస్యలను పరిష్కరించికున్నవారు  శీఘ్రముగా శుభములను పొందినవారెందరో ఉన్నారు. ఇందుకోసం ఎవరికి ఏమి ఇవ్వనవసరం లేదు. కేవలము భక్తితో  హనుమాన్ చాలీసా.. శ్రీరామనామ జపము, లేఖనము ద్వారా  హనుమత్ప్రభుల రక్షణను పొందవచ్చు. ఇందులకు నిదర్శనముగా  అనేకమంది భక్తుల జీవితములలో స్వామి చూపిన లీలలను ఈ బ్లాగులో వ్రాస్తూనే ఉన్నాము.
మీరు కూడా స్వామికి మీ సంకల్పమును నివేదించుకుని ,హనుమాన్ చాలీసా పారాయణము, శ్రీరామ నామ లేఖనము ప్రారంభించి  మీ గోత్రనామాలను పీఠమునకు పంపండి. మీ తరపున ఇక్కడ స్వామికి   పూజలో విన్నవించుట జరుగుతుంది.
అలాగే  9-2-2020   మాఘపౌర్ణమి నాడు జరిగే పూర్ణాహుతికి మీరుస్వయముగా రావచ్చును .అలా అవకాశం లేనివారు మీరు వ్రాసిన శ్రీరామ నామ లేఖన ప్రతులను పీఠమునకు చేరునట్లుగా  పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపవచ్చు. మీ గోత్రనామములతో  మీ తరపున యాగములో సంకల్పం చెప్పబడుతుంది.
ఇక చాలామంది గోత్రనామాలు పంపటంవరకు చేస్తున్నారు. కానీ నామలేఖనము గానీ పారాయణముగానీ చేయుటకు ఆసక్తి చూపటం లేదు. అంత బద్దకస్తుల కోసంమేము స్వామిని వేడుకొనుట పాడికాదు అనుపించుచున్నది. కనుక  మీరు మీ ఇంటివద్ద నామ లేఖనమో పారాయనమో,జపమో! చేయగలిగినవారు మాత్రమే గోత్రనామాలు పంపవలెనని మనవి
మీ కందరకు స్వామి రక్షకుడై కాపాడాతుండాలని ,సర్వశుభాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాము
జైశ్రీరాం


-------------------------------------------------------------------------------------------------------
గోత్రనామాలను
durgeswara@gmail.com       or     9948235641  watsap  ద్వారా పంపగలరు.ఇంకా వివరాలు క్రింద ఇచ్చిన పత్రికలో చూడగలరు.


 



Read more...

హనుమత్ రక్షా యాగం [ఏడవ ఆవృతి]

>> Wednesday, March 18, 2015



 













 

Read more...

వసంతపంచమి పూజలు

>> Saturday, January 24, 2015


 అమ్మ   శారదాస్వరూపమై   ఈరోజు అర్చనలందుకున్నది.  లక్ష్మీ,సరస్వతి, రాధా సావిత్రీ సమేతంగా కొలువైన అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ సన్నిధి లో ఈరోజు అర్చనాదృశ్యములివి

Read more...

ఈరోజు పీఠం లో జరిగిన ఆర్ధ్రాభిషేకం లో ..............

>> Monday, December 8, 2014

 ఈరోజు మార్గశిరమాస ఆర్థాభిషేకం అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించబడినది. తెల్లవారు జామున  రెండుగంటలనుండి అభిషేకములకోసం పార్థివలింగములను అమర్చుకుని సిధ్ధమయ్యారు కార్యకర్తలంతా. శతరుద్రీయం పారాయణం చేస్తూ  పదకొండురకాల విశేషద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు.  తదనంతరం మారేడు దళములు,పుష్పాలతో అర్చించి హారతులెత్తారు. శివనామ సంకీర్తనతో తన్మయంలో మునిగారు. ఇంతమంది చేస్తున్న స్వామి పూజచూసి ఈఅదృష్టం కల్పించినమహాదేవునికి ప్రణతులర్పించుకుంటున్నాను. అంతకంటే ఏమివ్వగలం అన్నీ తానైన తండ్రికి ?




 



http://youtu.be/_mViTeGvyag

Read more...

రా..వమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ....[మార్గశిర మాసం లో నేడు రెండవ లక్ష్మీవారపూజ]

>> Thursday, December 4, 2014


 మహాదేవ్యైచ విద్మహే....
 అమ్మ పాదాలు తాకాలని ఎదురుచూస్తున్న పూబాలలు
భక్తుల గోత్రనామాలు చెబుతుండగా  అందరూ నా పిల్లలేకదరా! అన్నట్లు చూస్తున్న అమ్మ చల్లని చూపు



Read more...

కార్తీకపౌర్ణమి రోజు సహస్రలింగార్చన,జ్వాలాతోరణం దృశ్యాలు

>> Friday, November 7, 2014

పీఠం లో  జరిగిన సహస్రలింగార్చన ,జ్వాలాతోరణం  దృశ్యాలు












Read more...

అమ్మ అనుగ్రహంతో వైభవంగా సాగిన నవరాత్రిపూజలు,అన్నపూర్ణభిక్షాశాల ప్రారంభ కార్యక్రమములు

>> Sunday, October 5, 2014

 హోమము

 కుంకుమార్చనపూజలకు సిధ్ధమవుతున్న సువాసినులు

 నమః పార్వతీ పతయే హరహర
 బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ
 అదెచూడరే.......మోహనరూపం
 మా లక్ష్మి

 బాలా...మాం పాహి

  నవగ్రహదేవతల సన్నిధి
 అంజని వరతనయా...మా వందనమిదిగో.. ఆంజనేయా
 తొలివేల్పు





 హరినామమే  ...మనకు మిగిలేధనమూ...చోరులకందని విలువైన ధనమూ
 ామ్మ ముందు సంకీర్తనా సమయంలో పరవశించి నర్తిస్తున్న బాలలు


 అమ్మ అన్నపూర్ణమ్మ భిక్షాశాలలో అమ్మవారి అన్నప్రసాద వితరణ
 ప్రసాద వితరణ దగ్గరుండి జాగ్రత్తగా చూస్తున్న మా రెండవతమ్ముడు
 సంకీర్తనలో నామొదటి తమ్ముడు


 అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణం లో సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం కలగాలని వారితరపున మొదటిబంతిలో  బాలా స్వరూపిణులైన బాలికలకు అమ్మవారి భిక్షా ప్రసాదం అందించటం జరిగింది


వీడియోlu
 http://youtu.be/7LRuOAL9Dik

 http://youtu.be/wSDJFRKfmsk

http://youtu.be/woivTGQxBag
http://youtu.be/_p72HVpI6FI



Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP