శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గురుపౌర్ణమి ని జరుపుతున్నాం సరే !పరమగురువు లు వ్యాసమహర్షులవారిని మనం మరచిపోనున్నామా ?

>> Saturday, July 12, 2014

చీకటి నుండి వెలుగులకు దారిజూపు మార్గమే గురువు. అట్టి గురుపరంపరలో వ్యాసభగవానుల వారి రూపంలో పరమాత్మ మనకు దర్శనమిచ్చారు.  కలగాపులగం గావున్న జ్ఞానరాశి యగు వేదాలను విభజించి ,అష్టాదశపురాణాలను  అందజేసి  లోకానికి మహోపకారం చేశారు.  వారి జన్మతిథిని గురుపౌర్ణమిగా నిర్ణయించాయి శాస్త్రాలు .  పరంపరానుగతంగా మనపుణ్యభూమిలో గురుపౌర్ణమి రోజు వ్యాసభగవానులను పూజించే ఆచారం కొనసాగుతూ ఉంది. వివిధకాలాలలో  వివిధప్రాంతాలలో గురుస్వరూపాలు వ్యక్తమై లోకాన్ని ఉధ్ధరించినా ,వారందరూ వ్యాసభగవానుల అరాధనను  నిర్విఘ్నంగా కొనసాగిస్తూ,ఆ ఆచారానికి భగం కలగకుండా శాస్త్రవిధిని   కొనసాగిస్తూ తమ శిష్యులందరికీ ఈ ఆచారాన్ని అందజేశారు.
ఇప్పుడు వ్యాసులవారే భవిష్య పురాణంలో సూచించినట్లుగా కలిప్రభావం తీవ్రతపెరుగుతున్నది. ఆచార్యులు,సద్గురువుల బోధనకంటే మన  తెలివితేటలతో నిర్ణయించే ఆచారేలే గొప్ప అన్నట్లుగా ప్రవర్తించేవారు,దీనిలో మంచీ చెడులను ఆలోచించేంత ఓపికలేని గుంపుమనస్తత్వంగల భక్తులు అసలు ఆచారాలను కాలదన్ని  తమ మనస్సుకు నచ్చిన విధానంలోనే .లేక తమకు ఇష్టమైన సద్గురు రూపాలలోనో గురుపౌర్ణమిని జరపటం ఎక్కువంది.
 అసలు వ్యాసభవానుని పూజించటం వదలివేసి తమకు ఇష్టమైన సద్గురు రూపాన్నిమాత్రమే పూజించటం అదే గురుపౌర్ణమి ఆచారంగా స్థిరపరచేలా చేస్తున్నారు.
సద్గురుపరంపరను పూజించటంలో ఎట్టిదోషమూ లేదు. కానీ లోకోపకారములైన ఇటువంటి సంస్కృతికు మూలమైన శాస్త్రనిర్ణయాలను నిర్లక్ష్యం చేయరాదు. అలాచేస్తే తరువాత తరాలవారికి  నిజమైన శాస్త్రవిద్యను దూరంచేసిన పాపం, వారు తరువాత ఇంకా దోషభూయిష్టమైన నిర్ణయాలేవన్నా తీసుకుంటే దానికి కారణమైన పాపమూ మనలను చుట్టుకుంటాయి.  ప్రభుత్వంలో ఒక కలెక్టర్ గారిపట్ల మనకు బాగా అభిమానం ఉన్నంతమాత్రాన ఆయన మాత్రమే ప్రభుత్వం అని తీర్మానించేసి ,నేను ఈయనను తప్ప ఏప్రభుత్వాన్ని ఆపద్దతినీ అంగీకరించనూ అంటే అది లోకోపద్రవమవుతుంది.
కనుక శాస్త్ర విధిని అనుసరించాలి. అందువలన లోకానికి మేలుకలుగుతుంది. నీ ఒక్కరి భావోద్వేగాలుకాదు, లోకశ్రేయశ్శును నిర్ణయిస్తుంది శాస్త్రం. మనం మనగురుపరంపరను వ్యాసభగవానులుగా పూజించవచ్చు. ముందు వ్యాసులవారి పూజ ఆపై మన గురుస్వరూపంపై ఆరాధన చేయటం వలన మనతరువాతి వారికీ ఈ సంస్కృతి మూలాలు అందించవచ్చు. అసలు ఏసద్గురువూ ఈ పరంపరను కాదు అని అచెప్పలేదు. చెప్పరుకూడా. ఎందుకంటే వారంతా ఒకే అంశకుచెంది ఈసంస్కృతి ని లోకోధ్ధరణకోసం  అందించిన వారు కనుక.
సద్గురువులుచెప్పినది మనం వింటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మన మనస్సుకు తోచినదేచేస్తాం. భూతదయను కలిగియుండి ,భగవద్భక్తి సహనము,ప్రేమ లతో నిరాదంబర జీవితాలను గడపమని  మనకుచెప్పిచెప్పి విసుగెత్తి  వేసారిన మన మహర్షుల,సద్గురువుల బాధ మనం పట్టించుకోము.  అదే మన్నవారిపై మాత్రం పట్టుదలగా వాదాలకు దిగుతాము.
ఎలా గురువుల అనుగ్రహాన్ని పొందగలుగుతాము మనము?
సద్గురువులు ఆచరించి,బోధించిన మార్గం అనుసరించటం ద్వారానా?  లేక
మనభావోద్వేగాలను గురువులపట్ల ఆపాదించి శాస్త్రవిధిని అతిక్రమించటమే మహాభక్తిగా భావించే ఆత్మవంచన ద్వారానా ? కాస్త వివేచించి చూడటం లో తప్పులేదుకదా !
అందుకే  వ్యాసపౌర్ణమిని  వ్యాసపౌర్ణమిగానే ఆచరిద్దాం .

ఇక్కడ  ఏదైనా ఒక్కమంచి మాట ఉన్నా అది సమర్ధ సద్గురు పరంపర అనుగ్రహం వల వారిదయగా ప్రాప్తించినదిగా చెప్పుకుంటున్నాను.
ఏదైనా దోషభూఇష్టమైన మాటలుంటే  అవి నా అజ్ఞానం వలన,అవివేకం వలన వచ్చినవిగా భావించి మన్నించమని సద్గురుపరంపరకు,సాధులోకమునకు శిరసాప్రణామములు సమర్పిస్తున్నాను
జయము జయము వ్యాసభగవానులవారికి.
జయముజయము సద్గురుమండలికి
జయముజయము లోకకళ్యాణకార దేవసంస్క్రుతికి


 

2 వ్యాఖ్యలు:

lakshman July 12, 2014 at 6:55 AM  

Well Said!

విన్నకోట నరసింహా రావు July 13, 2014 at 2:24 AM  

@ "పరమగురువులు వ్యాస మహర్షుల వారిని మనం మరచిపోనున్నామా?" @

ఆహా. దాదాపుగా.
భక్తి చుట్టూ పెద్ద వ్యాపారజాలం అల్లుకుపోయిన ఈ కాలంలో డబ్బు కురిపించే ఆర్భాటాలు హడావుడి తప్ప అసలు అంతరార్ధం మరుగున పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP