బుద్ధునిపై అపారమైన ప్రేమను ఒలకబోసేవారంతా నోరు విప్పరేం ??????!!!!??????
>> Wednesday, July 10, 2013
ఆరుబయట ఉంచిన రాగిపాత్రకు చిలుము పట్టినట్లు గా ధర్మావలంబనలోకూడా కాలానుగుణంగా కొన్ని అనాచారాలు పెరిగిపోతాయి . వాటిని సరిచేయటానికి మహాత్ములరూపంలో సద్గురుసత్తా అవతరించి ఆ తికమకలను సరిచేయటం . జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హైందవ ధర్మంలో కూడా పెరిగిపోయిన అనాచారాలను సరిచేయటానికి బుధ్ధునిగా అవతరించిన తథాగతుడు ఆయన అవతార కార్యక్రమాన్ని కొనసాగించాడు . ఆతరువాత ఆవతార కార్యక్రమాన్ని తమ అవసరాలకోసం ఉపయోగించుకోవాలనుకునే వాల్లు ఓకొత్తవాదన లేవదీశారు. హిందూ మతం లోమనం ఉండాల్సిన పనిలేదు . బౌద్ధానికి మారదాం అని. ఈమధయకాలంలో ఈ వాదన బాగా వినిపిస్తోంది కొందరు వర్గ సిద్దాంత కర్తల నోటివెంట . వ్రాతలలోకూడానూ. పోనీ వీల్లు బౌద్దమతం పట్ల ప్రేమ తోనూ ఆసిధ్ధాంతాలు నచ్చి ఇలా ప్రచారాలుసాగిస్తున్నారా ? లేక ఏదో విదేశీ మతాల కిరాయి ప్రచారాలలో భాగంగా బౌధ్ధవాదాన్ని చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తున్నది.
ఎందుకంటే ? మొన్న పరమపవిత్రమైన బుధ్ధ గయలో ఉగ్రవాద దాడి జరిగింది . ఇంతదుర్మార్గంపై స్పందనలు ఎలా ఉంటాయా? అని గమనిస్తున్నాను.మన రాజకీయ నాయకులు ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడారు. ఇది పిరికి చర్య. ఉగ్రవాదాన్ని సహించం.... ఇలా పడికట్టు పదాలతో సాగాయి వారి ఖండనలు.
ఐతే నా అనుమానం ఇప్పుడు బౌధ్ధాన్ని అభిమానిస్తున్న ,వారు, హిందుత్వమే మన ప్రథమ శతృవు అన్నట్లుగా సిధ్ధాంతీకరిస్తున్న మేధావులు నోరు విప్పటం లేదెందుకని ? ఇప్పుడు అందరి కంటే ఎక్కువగా స్పందన కనిపించాలి కదా ? వారినుండి ? ఎందువలన నోరు పెగలటం లేదు. అసలు వీల్లు బౌద్దం గూర్చి సిధ్ధాంతీకరించటానికి అర్హత కలిగిఉన్నారా ?అని సామాన్యజనం ఆలోచించరా ?
ఇక ఉగ్రవాద దాడులపై స్పందనలు బహువిచిత్రంగా ఉంటాయెందుకనో? ఇలాంటి దాడి చేసిన వారికి మాత్రమే ఈసంఘటనలతో సంబంధం ఉన్నట్లు ,ఆయామతాలకు ఉగ్రవాదంతో సంబంధమే లేనట్లు ఉంటాయి ప్రచారాలు.
ఆమధ్య నార్వే లో అనుకుంటా ఒకడు తమ మతంపై దురభిమానంతో జనాన్ని పిట్టల్ను కాల్చినట్లు కాలిస్తే వాడు ఉన్మాది అని, మతవిద్వేషం కాకపోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కింది మీడియా.
ఇలాంతి దురదృష్టకరమైన సంఘటనలో ఎక్కడన్నా హిందువు పేరు కనపడిందనుకోండి ? ఇక శివాలెత్తుతారు మన నాయకులు ,మీడియా కూడా . ఇది హిమ్దువులలోపెరుగుతున్న ఉగ్రవాద లక్షణంగానూ , వానిచర్య యావత్ హిందూ సమాజ భావన అన్నట్లుగా తమ ప్రసంగాలతో వీరంగం వేస్తుంటారు. ఎందుకని ఇలాంటి భావజాలం లో కూరుకుపోతున్నది భారతదేశం ? ఆలోచిద్దాం ఓపదినిమిషాలన్నా .
0 వ్యాఖ్యలు:
Post a Comment