శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మానవత్వం మిగులుతుందా మనుషుల్లో? ఇటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటే ?

>> Monday, March 24, 2014

గతసంవత్సరం నేను బదరీనాథ నుమ్చి తిరిగొచ్చేప్పుడు ,బాగారాత్రి వేళ దారిలో ఒక బైక్ పడిపోయి ఉంది ఓమనిషి నేలపై దొర్లుతున్నాడు. మేమెక్కిన జీప్ డ్రైవర్ పట్టించుకోకుండా  బండిఆపకుండా వెళుతుంటే ,అదేమిటయ్యా ! అతనికి ప్ర,మాదం జరిగిందేమో ? ఎవరూ లేని ఈప్రదేశంలో  అలా వదిలేసి వెళ్ళటమేమిటి ? కాస్తాపు . చూద్దాం అని అడిగాను. రేపొద్దున్నే  నెనే బండిని గుద్దానని అంటాడూ. వాడు తాగుంటే పొద్దున్నే మెలుకువచ్చాక నాడబ్బు తీసుకున్నారంటాడు. మీమానాన మీరుపోతారు .ఇరుక్కునేది నేను అని రాష్ గా సమాధానం చెప్పి మా మాట పట్టించుకోకుండా ఇంకా స్పీడుగా పోనిచ్చాడు . వీనికి మానవత్వం లేదు అనుకున్నాను అప్పుడు. కానీ అతనికి ఎదురైన అనుభవాలు అతనికి  అంత కాఠిన్యం తెచ్చాయేమో అనిపిస్తుంది ఇప్పుడు కొన్నిసంఘటనలు చూస్తుంటే.

వినుకొండలో  మా బంధువుల పిల్లవాడొకడు  బ్రతుకు తెరువుకోసం టెంట్ హౌస్ ఒకటి పెట్టుకున్నాడీమధ్య . అతనిదగ్గర   రోజువారీగా పనిచేస్తున్నారు కొందరు కుర్రవాళ్లు. అందులో  పక్క ఒక పల్లెటూరునుంచి వచ్చే వాల్లలో ఒక కుర్రవాడు బాగాపని చేస్తాడు. కాకుంటే అతనికి ఇంటిదగ్గర పనిలేనిరోజులలో వచ్చి పనిచెసి ఏరోజు డబ్బు ఆరోజు తీసుకెళతాడు. మొన్నొకరోజు అతను ఉదయాన్నే  పనిలోకి వచ్చాడు . .టెంట్ హౌస్ వద్దకు రాగానే హఠాత్తుగా కుప్పకూలి పోయాడు . కంగారు పడ్డ  వీల్లంతా  అతన్ని హాస్పటల్ కుతీసుకెళ్ళారు. హార్ట్ ఎటాక్ వచ్చిందని గుంటూర్ తీసుకెళ్ళమని చెప్పారు . వెంటనే వాల్ల బంధువులకు కబురుచేసి పిలిపించి గుటూరు తీసుకెళ్ళటమే గాక దగ్గరుండి హాస్పటల్ లో  తన జేబులో డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ఇప్పించినా దురదృష్టవశాత్తూ ఆకుర్రవాడు మరణించాడు. అప్పటికే ఓనరైన మావాడికి బాగానే ఖర్చయింది. శవాన్ని మృతుడి బంధువులు తీసుకుని వెళ్ళారు.
మరుసటి రోజు ఆవూరినుండి  చనిపోయిన కుర్రవానితో పాటు పనిలోకి వచ్చే ఇంకొక కుర్రవాడు మృతుని బంధువులతో వచ్చి ,చనిపోయిన వారి కోసం ఓనర్ గా మీరే బాధ్యత తీసుకోవాలని గొడవ  పెట్టుకొన్నారు. అదేమిటయ్యా? అతనేమన్నా నాదగ్గర నెలవారీ పనిచేస్తున్నాడా? రోజువారీగా ఇష్టం వచ్చినరోజు పని చేశాడు నాకు సంబంధం లేకపోయినా ఆపదకదా,అని నాస్వంతడబ్బుతో అంబులెన్స్ పెట్టి మరీ హాప్సటల్ కుతీసుకెళ్ళాను  ,వాల్లావిడ కూడా  ఉందికదా హాస్పటల్ కు తీసుకెళ్ళేప్పుడు,నే నింకెందుకివ్వాలి అని అతను వ్యతిరేకించాడు.   ఇవ్వకుంటే  మీరే అతన్ని కొట్టి చంపావని ,కేసుపెడతాం !  ఇంకా వినకపోతే  ఎస్ సి హెరాస్ మెంట్ కేసు కూడా పెడతామని  బెదిరింపులకు దిగారట. ఆసమయంలో దగ్గర ఎవరూ లేకపోవటం ,ఏం చేయాలో తోచక  ముందు  ఇవి తీసుకెళ్ళి అంత్యక్రియలు జరుపుకోండని పదివేలు చేతులో పెట్టి పంపాడు.
ఇక మంచికి పోతే నాకు ఇలా అయింది . నాకెందుకని గవర్ణమెంట్ హాస్పటల్ కుతీసుకెళ్ళి వాల్లబంధువులకు అప్పచెబితే పోయేది ! అని వాపోతున్నాడు టెంట్ హౌస్ ఆధారంగా బ్రతుకుతున్న  మావాడు.
మృతుడి బంధువులకు తెలుసు . ఇతను  సహాయం చేశాడని . మృతుడి పెళ్ళాం పిల్లలకు దిక్కులేకుండా పోయింది. అదివాస్తవమే! కానీ అందుకు కారణం ఎవరూ కాదు. విధి మాత్రమే కారణం.
ఇప్పుడు తమకు  విధిద్వారా జరిగిన అన్యాయానికి ఇంకెవరినో అన్యాయం చేయాలనే భావన సరైనదేనా? ఇంకెవడినో అన్యాయంగా  దోచుకోవాలనుకోవటం,అందుకోసం చట్టం ఇచ్చిన అవకాశాన్ని బ్లాక్ మెయిల్ కోసం వాడుకోవటానికి సిద్దపడే మనస్థితి  సమాజంలో ఎటువంటి పరిణామాలకు కారణమవుతుంది?
ఇలాంటి సంఘటనలమూలంగా  సామాన్యులలో  మానవత్వ భావనలు మిగులుతాయా?

ఇలాంటి అనుభవం ఎదురయ్యాక

1 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ March 26, 2014 at 12:11 AM  

ఒకసారి మార్టూరు దగ్గర కొమ్మినేనివారిపాలెం , ధర్మవరం కంకర మిల్లులకి టిప్పర్లు పెట్టాం . మార్టూరు నుండి వినుకొండ అవతల ఉన్న గ్రామానికి రోడ్డు వేయడానికి బళ్ళు తిరుగుతున్నాయి. మా డ్రైవర్ ఒకడికి ఆ ఊర్లో ఒకడు పరిచయం అయ్యాడట. వాడు వీడు కల్సి టిప్పర్ ఎక్కి కంకర తోలుతున్నారు. ఒకరోజు ఫుల్లుగా అ తాగి టిప్పర్ రోడ్డు మార్జిన్ లో బోల్తా కొట్టిచారు ఆ రెండవ వాడు క్లీనర్ ప్లేసు లో కూర్చున్నాడు. బండి పక్కకి పడడంతో డ్రైవర్ కాస్తా పోయి సామనతో సహా వాడి మీద పడ్డాడు. కాస్త దెబ్బలు తగిలాయి. హాస్పిటల్ లో చేర్చి వైద్యం చేయించాం.

అసలు వాడెవడో నాకు తెలీదు. మమా బండి ఎప్పుడు ఎక్కాడో తెలీదు కానీ వాడి చుట్టాలు వచ్చి కేసు పెడతాం అని బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర 10 వేలు గుంజుకుపోయారు.

రాను రాను లేబర్ మీద జాలి కలగడం మానేసి అసహ్యం, కక్ష పెరిగిపోయెలా ప్రవర్తిస్తున్నారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP