శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label నీతి కథలు. Show all posts
Showing posts with label నీతి కథలు. Show all posts

వివేకోదయము

>> Wednesday, December 25, 2013

పూర్వమొకానొక పట్టణమున ఒక మహారాజు నివసించుచండెను. అతనికి అహంకారము
మెండు. తన్ను మించినవారెవరు లేరను దర్పమతనికి పట్టి పీడించుచుండెను.
తనవలననే లోకమున అందరికిని తెల్లవారు...చున్నదను భావము అతడు గలిగియుండెను.
తాను భూసురుడనని, అందరికంటె గొప్పవాడనని, పలువురితో బింకములు
పలుకుచుండును. తన సంపదలు, తన భోగభాగ్యములు, తన రాజప్రసాదములు, తన
ఉద్యానవనములు, తన విలాసములు చూచుకొని ఆ రాజు గర్వోన్నతిని బొందుచుండెను.

ఇట్లుండ ఒకనాడాతని దేశమునకు ఒక సాధుపుంగవుడరుదెంచెను. అతడు
అనుష్ఠానపరుడు, సత్యనిష్ఠుడు, దైవభక్తి పరాయణుడు అయియుండెను. అతడు
ఇహపరవిద్యల రెండింటియందును గొప్ప నిష్ణాతుడు. మంచి వాగ్ధాటికలవాడు తాను
నేర్చిన బ్రహ్మవిద్యను ఇతరులకు చక్కగా చెప్పగల స్తోమత గలవాడు. ఏ విద్యయం
డతడు పరిపూర్ణ అనుభూతిని బడసెనో అట్టి ఆధ్యాత్మవిద్యను లోకములో బాగుగ
ప్రచార మొనర్చి అంధకారబంధురమైన ఆజ్ఞానవాతావరణ మందు నివసించుచచున్న
జనావలికి జ్ఞానప్రకాశ మొసంగి కడతేర్చ వలెనను సదుద్దేశ్యమంతో అతడు ఊరూర
సంచరించుచు ఉపన్యాసముల నిచ్చుచు, ధర్మబోధను వర్ణించుచుండెను. అతని పవిత్ర
జీవితమును, నిరాడంబర వ్యక్తిత్వమును, అనర్గళ వాగ్ధోరణిని, అనుష్ఠాన
పద్ధతులను చూచి జనులు అతని దివ్యవాణిని శ్రవణము చేయుటకై తండోప తండములుగ ఏ
తెంచుచుండిరి. అతడు ఏ గ్రామమునకు వెళ్ళినను, ఏ పట్టణమున అడుగిడినను
వేలసంఖ్యలో జనులు చేరుచుండిరి. ఎంతయో దూరమునుండి శ్రవణాభిలాషులై జనులు
అరుదెంచు చుండిరి.

ఈ ప్రకారముగ ఒక్క సంవత్సరకాలము గడచెను. సాధువు గారి అఖండ ఆధ్యాత్మిక
ప్రచారము యొక్క దివ్యప్రభావముచే ఎందరో జనులు పునీతులగుచుండిరి. పాపులు
పుణ్యాత్ములుగ మారిపోవుచుండిరి. దుశ్శీలురు సచ్చీలురగు చుండిరి. దొంగలు
తమ దొంగవృత్తిని మాని తమ భూతకాలిక పాపజీవితమును గూర్చి పశ్చాత్తాపడు
చుండిరి. భోగులు యోగు లగుచుండిరి. వెయ్యేల దేశమంతయు రామరాజ్యముగ పరిణతి
జెందుచున్నదా యనిపించుచుండెను. సాధువుగారి ఖ్యాతి దిగంతముల వ్యాపించెను.

అత్తరి ఆ దేశపు మంత్రివరేణ్యుడు సాధుమహాత్ముని కీర్తి ప్రతిష్ఠలకు
అచ్చెరువొంది, అతని గుణగణములను మిక్కిలి శ్లాషించి, అతనిని ఆహ్వానించి
రాజుచే సన్మానము చేయించిన బాగుండునని తలంచి ఆ విషయమున రాజున కెరింగింప
ఆతడందులకంగీ కరించెను. ఒక పుణ్యదినమున ఆ అమాత్యశేఖరుడు రాజుగారి తరపున
ఆహ్వానపత్రమును గైకొని సాధువుగారి ఆశ్రమమునకు వెళ్లి అతనికి
భక్తిపురస్సరముగ సమర్పించి, రాజనగరమునకు వేంచేయులాగున భూపాలుని తరపున
అభ్యర్థించెను. అందులకు సాధుపుంగవుడు తన సమ్మతిని తెలుపగా వెంటనే
మంత్రివర్యుడు ఒక రథముపై వారిని ఆసీనులుగ జేసి మేళతాళములతో
రాజప్రసాదమునకు గొనిపోయెను. రాజ భవనమున ప్రవేశించిన సాధుమహాత్ముని
నృపాలుడు గౌరవపుర స్సరముగ లోనికి తీసికొనిపోయి సముచితమగు ఉన్నతాసనముపై
గూర్చుండబెట్టి వివిధరీతుల సన్మానించెను.

ఇదియంతయు మంత్రియొక్క ప్రోద్బలముచే జరిగినదే గాని రాజునకు స్వతః ఆ
మహనీయుని గౌరవించవలెనను ఉద్దేశ్యము లేదు. తన్ను మించినవారు జగత్తులో
లేనేలేరను అహంభావము కలవాడు ఒకరిని గౌరవించుటకు ఉద్యుక్తుడగునా? అయినను
మంత్రిపై గల సదభిప్రాయమువలన రాజు ఆతని మాట తీసివేయలేక సాధుమహాత్ముని
సత్కరించెను.

ఇంత గౌరవము తనకు జరుగుచున్నను సాధువు ఆ సన్నివేశమును గొప్పగ తలంచలేదు.
దైవమందే మనస్సు నెలకొల్పుకొని బాహ్యదృష్థి లేనివాడై యుండెను. తన్ను
సత్కరించుచున్న రాజుపై గాని, తాను ఆసీనుడైయున్న నానాలంకార శోభితమణిమయ
దివ్యాసనముపై గాని, నవరత్నములతో తులతూగుచున్న రాజభవనము పై గాని అతడు తన
దృష్టిని పరచక కేవలము భగవత్పాదార విందములందే దానిని సంలగ్నము చేసెను.
కాని అహంభావ ప్రపూరితుడగు ఆ భూపాలుడు పరిస్థితిని అపార్థము చేసికొని,
సాధువు తన్ను కించపరెచనని భావించి పట్టరాని ఆగ్రహావేశముతో కూడినవాడై
తత్‌క్షణమే సైనాధికారిని పిలిపించి "ఓయీ! దేశమునకు ప్రభువైన నన్ను ఈ
సాధువు ఉపేక్షచేసి అవమానపరచెను. కాబట్టి ఈతనిని దేశమునుండి బహిష్కరించి
వేయు" మని ఆజ్ఞాపించెను.

రాజుయొక్క ఆ శిక్షాశాసనమును వినగానే సాధువు పకపక నవ్వెను.
ప్రకనున్నవారందరు ఆశ్చర్యచకితులైరి. రాజునకు గూడ పరమాశ్చర్యము గలిగి
"సాధువుగారూ! శిక్ష విధించగనే మీరేల నవ్వినారు?' అని ప్రశ్నింప అందులకు
సాధువిట్లు విజ్ఞతా పూర్వకముగ సమాధాన మొసంగెను - "ఓ రాజా! చిన్న దేశమునకు
ప్రభువైన నిన్ను ఒక్క క్షణకాలము ఉపేక్షించినపుడే నాకు దేశబహిష్కారణయను
ఇట్టి కఠినదండన లభించగా, ప్రభువులకు ప్రభువై, రాజులకు రాజైనట్టి
పరమాత్మను జీవితమంతయు ఉపేక్ష చేసిన నీకు ఎట్టి గోరమగు దండనము లభించునో"
యై తలంచుకొని నాకు నవ్వువచ్చినది.

ఆ వాక్యమును వినగానే రాజునకు కనువిప్పు కలిగెను. తాను ఒక చిన్న దేశమునకు
రాజైనను రేపో మాపో నశించి పోవు నాలుగు మూరలు అస్థిపంజరము కలిగియున్నను
వానిని జూచుకొని మరిసిపోయి, అహంకరించి, బ్రహ్మాండమునకు ప్రభువైన
శాశ్వతుడై నట్టి పరమాత్మను విస్మరించుట చాల పొరపాటని గ్రహించి, తన
తప్పిదమును గుర్తెరింగి సాధువు గారి పాదపద్మములపై తన శిరస్సునుంచి
క్షమాపణ వేడుకొని తనకు చక్కని బోధను ప్రసాధించినందులకు, తన నేత్రములను
తెరపించినందులకు తనకు వివేకోదయము కలిగించి అంధకారమయమగు తన జీవితమునకు
ప్రకాశమందజేసి నందులకు అతనిని వేనోళ్ల పొగడి, తగురీతి సత్కరించి పంపెను.

నీతి: ఎవరును తమతమ సంపదలను జూచుకొని గర్వించరాదు, క్షణికజీవితము
గొప్పనితలంచి ప్రభువులకు ప్రభువైన భగవంతుని విస్మరించరాదు. శాశ్వతుడైన
పరమాత్మకు వినిర్మలభక్తి భావముతో జోహారు లర్పించి, వినమ్రులై నిరంతర
దైవచింతనతో గూడుకొని, జీవితమును పవిత్రముగ నొనర్చుకొనవలెను
[శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు]

Read more...

మాయ అంటే ?

>> Tuesday, July 16, 2013

రామక్రిష్ణ  పరమహంస ఒకసారి "మాయ ను దర్శించాలనుకున్నారు . కాళి మాతను  ప్రార్దించారు . గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి 
వచ్చింది . అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది . ఆ స్త్రీ ప్రౌడఐ ఒక బిడ్డను ప్రసవించింది . కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి ,
ప్రేమతో లాలించి పెద్దచేసింది . కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది . అంత  సేపు ఆలనా,
పాలనా చూస్తూ కానీ పెంచిన బిడ్డను  చిన్న చిన్న ముక్కలుగా తరిగి,కరకరా నమిలి మింగేసింది . తానూ ఆ జలాల్లో కలిసిపోయింది .అయితే ఆ స్త్రీ ముఖములో నీటి   బుడగనుంచి ఉత్పన్నమైన  క్షణము నుంచి ,తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది రామకృష్ణులు  వంక  పలకరింపుగా  నవ్వి,  అంతర్దానమైంది  . వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు , చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు . వారెవరికీ  దృశ్యం కనిపించినట్లు లెదు. అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది . "నీవు చుసిన దృశ్యం మాయ . అయితే మాయను చూచు టకు ఒకడున్డాలి . చుచువానిని విడిచి మాయ లెదు. చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" .రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన  సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించ గలిగారు . అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఏంటో కొంత సుంకం చెల్లించాలి .అంటే అందులో పాత్రను పోషించి ,దాని కాస్త నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి  ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన అంశాలు వున్నయి. 
1. మాయ తాత్కాలికమ్. దానికి మొదలు ,మధ్య,తుది ,వున్నాయి . 
2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి. 
3. రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది . అంటే కాదు తాను సృటిన్చిన బిడ్డని , తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది . గంగ అంటే పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి  పడినట్టుగా కనిపించి తిరిగి   బ్రహ్మము లో నే కలిసి పోతుంది . పై దృశ్యము లోని   స్తేరీ మాయకు సంకెతము. ఆమె కని , ప్రేమతో పెంచిన  బిడ్డ ఆమె  ,  దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకెతము.అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భగమె. ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది . దానిని వదిలిన్చుకోవటమే అభ్యాసము. దానిక్ సాధనం విచారమనే కత్తిపీట . తన సృష్టి అనే శిశువును    ఖండించి అంతర్హితం చెయ్యాలి . అనగా దేహ భావన , ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము - అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో  కలియుట .  

----------------------------------------------sudhaaraani

Read more...

భగవానులు _నాస్తిక వాది

>> Saturday, June 20, 2009

భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ అధ్యాత్మికవాదులను , ధార్మికులను తన వాద పటిమతో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక ధృడమైన నాస్తిక వాది ఒకరు భగవాను వద్దకు వొచ్చారు.

ఆయన అలవాటు ప్రకారం - "దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా? అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు.

అతని యెడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు- "దేవుని గురించిన చింత నీకెందుకు? ఆయన గురించి ఆయనే విచారించుకొంటాడు Grin.

అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు
."
అని


ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయొమయంగా ఉంది.

అది గమనించి భగవాను అతడిని "నేనెవడిని(Who Am I)"అనెడి పుస్తకము చదవమని ఆదేశించారు.

భగవానును కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు.

" కొన్ని దినముల వరకూ దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను. అప్పుడే నేను ఆనందముగా ఉన్నను. కాని,

ఇప్పుడు "నేనెవడిని""అని ప్రశ్నించుకొని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళములో పడిపోయాను Huh.

సంతోషం కోల్పోయి నేను చాల బలహీన పడినట్లు భావిస్తున్నాను Sad"అని.



భగవాను అతని యెడ అమిత దయతో, ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు--

"నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంభందించినది కాదు. ఇంత కాలమూ నీవు నీ సహజస్థితి యైన ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు.

ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ అజ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది. కనుక అది అభివృద్ధే.

అజ్ఞానము నుండి సంశయ స్థితికి, సంశయము నుండి స్వచ్చతకు (మానసిక), స్వచ్చత నుండి అనుభూతికి, తద్వారా ఆత్మలో లీనమగుట--- ఇదీ అధ్యాత్మిక సాధన మార్గములో ఆరొహన క్రమము." అని

అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి,

ధారళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తివంతులను గావిస్తుంది భగవాను సన్నిధి.



Read more...

మంధర ,శూర్పణఖలుంటారు జాగ్రత్త.

>> Sunday, November 2, 2008

రామాయణపాత్రలపైన నాబ్లాగులో జరుగుతున్న చర్చలలో నాఅభిప్రాయమిది. నా కైతే రామాయణము జరగటానికి ఇద్దరు కారణమనిపిస్తున్నది. వాల్లు కనపడేది. రామాయణములో స్వల్పసమయమైనా చేసినది మాత్రం కొంపలు కూల్చే పెద్దపని. వాళ్ళు .1. మంధర, 2. శూర్పణఖ.

మంధర దాసి. తన పని తన యజమానైన కైకేయి క్షేమం చూడటము. పుట్టినింటినుంచివచ్చినది కనుక అమెపైన కైకేయికి చాలా ప్రేమ .కనుకనే ఇతరులకు ఇవ్వనంత ప్రాధాన్యతనిచ్చేది. ఆమె సలహాలను తీసుకునేది. కానీ అసూయా గ్రస్తమయిన హృదయాలు గలవాళ్ళు తాము మనశ్శాంతిగా వుండలేరు. ఇతరులు ప్రశాఁతముగా వుంటే తట్టుకోలేరు. వాళ్ల దుర్బుద్దిని ఇతరులకు కూడా అంటించి కొంపలు కూలి వాళ్ళేడుస్తుంటే ఆనందిస్తారు. వేరుపురుగు చేరి వృక్షంబుచెరచు అన్నట్లు... మంధర తానాశ్రయించిన కైకేయికి రాముని మీదున్న ప్రేమను విరచి ,ఆమె మనసులో స్వార్ధాన్ని రేకెత్తించింది. యుక్తాయుక్తాలు మరచిపోయేంతటి స్తాయిలో . దాని పరిణామముగా కైకేయి తన సౌభాగ్యాన్ని కోల్పోయి, అందరిచేత చీత్కరించబడి, చరిత్రలో మాయన మచ్చని తెచ్చుకున్నది. చివరకు కొడుకుచేతకూడా ఛీ కొట్టించుకోవలసి వచ్చినది. మంధర అసూయ రాముని అడవులకు పంపి రామాయణానికి ఒక కారణమయినది. ఇటువంటి స్త్రీలు మనచుట్టూవుంటారు. అత్తా కోడల్లు అన్యోన్యంగా వున్నా తట్టుకోలేరు, వాళ్ళుచాలు విబేధాలు సృష్టించి కాపురాలలో చిచ్చుపెట్టడానికి

ఇక రెండవ పాత్ర శూర్పణఖ. తాను విపరీత కామాంధురాలు. తనకు నచ్చినది తనకు దక్కాలనుకునే మనస్తత్వం. అందుకోసం ధర్మాధర్మాలను లెక్కచేయదు. రాముడు భార్యతోవున్నవాడు,అయినా తనకు దక్కాలి. రాముడు లౌక్యంగా లక్ష్మణుని చూపిస్తే ,అప్పుడన్నా గ్రహించక అతడయినా అందంగా వున్నాడుకనుక తన కామార్తిని తీర్చుకోవాలని అతనిని చేరటానికైనా సిద్ధపడుతుంది. వారిచేత అవమానించబడి. ప్రతీకారేచ్చతో తన అన్నవద్దకు పోయి పగరగిలిస్తుంది అదీ ఎలా? నిజాన్ని కప్పిపెట్టి. అన్నా! రాముని భార్య చలా అందగత్తె .దానిని నీకోసం తీసుకు రావాలని ప్రయత్నిస్తే నన్నిలా అవమానించారని అబద్దంతో అతన్ని రెచ్చగొడుతుంది. మనచుట్టూవున్న వాళ్ల్లో ఇటువంటివాళ్ళనుంచి జాగ్రత్తగా వుండకపోతే సర్వనాశనానికి సిద్దపడ్డట్ళే . తనసుఖంకోసం ,అసూయా గ్రస్తమయిన మనసుతో ఇటువంటివాళ్ళు ఎన్ని కాపురాలను కూలుస్తున్నారో ప్రతివారికి ఉదాహరణలు కనిపిస్తూనేవుంటాయి గమనిస్తే. ఇటువంటివారు దేనికైనా తెగిస్తారు.

ఈ ఇద్దరి పాత్రలు చాలా చిన్నవయినా వారి మనస్తత్వాలు ఎంతప్రమాదకరమో తెలుసుకోక కైకేయి రావణాసురులవలె, చెప్పుడుమాటలు వినే అలవాటువుంటే రామాయణ యుద్ధాలు మనయిల్లలోకూడా ప్రారంభమవుతాయి తస్మాత్ జాగ్రత్... అంటున్నారు వాల్మీకి మహర్షి.

Read more...

విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది

>> Wednesday, September 10, 2008

ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.
ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.
శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ... ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.
రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.
దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ
ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.
అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు

Read more...

ఆత్మపూజ‌, ‌ ఆత్మభోజనం

>> Saturday, June 7, 2008

ఒక మహానుభావునికి, ఆధ్యాత్మికసాధనలో తాను చాల పైస్థాయికి చేరుకున్నానని నమ్మకం కలిగి0ది. పూజలు వ్రతాలు అర్చనలన్నీ, వృధాపనులని ఆయనకు నమ్మకం ఏర్పడిపోయింది. ఆత్మపూజ ముఖ్యం , తక్కినవన్నీ
అనవసరమన్న వాదనతో మిగతావారి నమ్మకాలను అవహేళన చేస్తుండేవాడు. ఒకసారి ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఒక ఆశ్రమం లో జరిగే ఒక కార్యక్రమానికి ఈయన హాజరవడం జరిగింది. అక్కడేవో పూజలు , అభిషేకాదులతో కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. అవన్నీ చూస్తున్న కొద్దీ ఈయనకు వీరిఅజ్జానం పట్ల జాలి కలిగింది. వారిచర్యలను పరిహసిస్తూ చిన్నగా వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టాడు.

మెల్లగా కొందరు నాలాంటి బద్దకస్తులు కొందరు ఈయన ప్రక్కన చేరి, స్వామీ, తమరు మాకు వాస్తవసత్యాన్ని తెలియ జేయండి. అని కోరారు. చూడండి నాయనా, ఆత్మపూజ మాత్రమే భగవంతునికి చెందుతుంది. ఇలాంటి బాహ్య పూజలవల్ల ఒరిగేదేమిలేదు, కొబ్బరిచిప్పలు, బెల్లం ముక్కలు తప్ప. అంటూ తనపైత్య వేదాంతాన్ని వీరికి యెక్కించడం, ఆశ్రమాధిపతి ఐన స్వామీజీ గమనిస్తున్నాడు.
కర్యక్రమం ముగిసింది. భోజనాల సమయం వచ్చింది. భక్తులంతా ఆకలితో నకనకలాడుతున్నారు. వడ్డనలు ప్రారంభమయ్యాయి. మన ఆత్మజ్జాని గారుకూడా పంక్తిలో కూర్చున్నారు. విస్తర్లలోవడ్డిస్తూ వస్తున్నవారు అందరికీ అన్నీ వడ్డిస్తున్నారుగాని, ఈయన దగ్గరకొచ్చేసరికి వడ్డిస్తున్నట్లు చేతులు ఊపుతున్నారేగాని పదార్ధాలేవీ విస్తర్లో పడటం లేదు. లడ్లు, వడలు పుళిహోర దద్దోజనం కూరలు వడ్డన సాగుతోంది కానీ మన గురూజీ విస్తర్లోమాత్రం ఏమీ పడలేదు. అసలే ఆకలి మండిపోతున్నది, దానికితోడు వీరివ్యవహారం .మంటనషాలాని కెక్కింది. ఏమిటయ్య మీ వ్యవహారం? తమాషగా ఉందా? నాకొక్కడికే వడ్డించడమ్లేదు.శివాలెత్తి పోతున్నాడాయన. ఈ గొడవకు ఆశ్రమాధిపతి వచ్చారు. ఏమిటినాయనా గొడవ? ప్రశ్నించారు.మీవాళ్ళ పద్దతేమ్ బాగాలేదు స్వామీ, విషయం చెప్పాడు ఆత్మజ్జాని. ఏ0 నాయనా వారుచెప్పేది నిజమా? ప్రశ్నించారు స్వామీజీ. అవును స్వామీ, వారు ఆత్మజ్జానులు కదా! మామూలు బోజనం చేయరేమో,,ఆత్మ భోజనం మాత్రమేచేస్తారేమోనని అనుకున్నాం స్వామీ. మన్నించండి అన్నారు వినయంగా................... అంతే మనఅత్మజ్జానికిఅప్పుడర్ధమైంది.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP