శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label ఆచారాలు. Show all posts
Showing posts with label ఆచారాలు. Show all posts

ఆదివారం అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించాలనుకునే భక్తులకు స్వాగతం

>> Monday, July 16, 2018

అఖిలలోకాలకు జనని  జగన్మాత కనకదుర్గ . ఆతల్లి తానే  పలురూపాలుగా వెలసి తన సంతానాన్ని ప్రేమతో పోషించి పాలిస్తున్నది.  ప్రేమభక్తితో  ఆతల్లిని,అమ్మగా  ఆడపడుచుగా  పెద్దముత్తైదువుగా భావించి భక్తులు సేవిస్తుంటారు.
ఆషాఢ మాసంలో అమ్మను తమ ఆడపడుచుగా భావించి సారె సమర్పించే   సాంప్రదాయం  ఉన్నది. . ఈ సంప్రదాయాన్ని  పాటిస్తూ  శ్రీవేంకటేశ్వర జగన్మాత  పీఠం లో   వచ్ఛే ఆదివారం  [22- జులై]   రోజున అమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు సన్నద్ద్దమవుతున్నారు .      చీరె సారెలతో తరలివచ్ఛే భక్తులకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి  వారి సారెను  అమ్మకు సమర్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి . అనంతరం భక్తులకు అమ్మవారి   ప్రసాదాలు  అందజేయటం  జరుగుతుంది .  . ఈసందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమార్చనలు జరుపబడతాయి ,   సారె సమర్పించదలచుకున్న భక్తులు భార్యాభర్తలు ఇద్దరు  సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావలసిఉంటుంది .  ఇక ఈ  సంవత్సరం  భక్తుల కోరికమేరకు స్వయంగా   కార్యక్రమంలో పాల్గొనటానికి  వీలుకాని భక్తులకోసం వారితరఫున కూడా సారె సమర్పించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నాము. .కాకుంటే  సారెసామాగ్రి అంతా వారే సమకూర్చాలి.
ఇక సారె  తీసుకువచ్ఛే భక్తులు సమర్పించవలసినవి

పసుపు కుంకుమ ,అగరు బత్తీ ,నారికేళం ,కర్పూరం
పూలు, గాజులు ,తాంబూలము
చీర,రవికె
5 రకముల పండ్లు
స్వయముగా తయారుచేసిన రెండు రకముల తీపి వంటకాలు  [లడ్డు,అరిసెలు వగైరా ]
వెదురు బుట్ట

అమ్మవారికి సారె సమర్పించిన తరువాత  ప్రసాదంగా  చీరె రవిక  పసుపుకుంకుమ లు ఇవ్వబడతాయి వాటిని  ఇంటికి తీసుకువెళ్లి   మీకుటుంబంలో పెద్దముత్తైదువకు వస్త్రాలు మిగతావారికి సారెలో  సమర్పించగా ఇఛ్చిన ప్రసాదాలు,తాంబూలములు    పంచుకోవాలి .



ఇతరవివరాలకై   9948235641  లో సంప్రదించ వచ్చు

వచ్ఛే ఆదివారం అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించాలనుకునే భక్తులకు స్వాగతం

Read more...

ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి

>> Wednesday, January 21, 2015

ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి  [from surya daily]
లోకంలోని చీకట్లను పారద్రోలుతూ వెలుగులు పంచే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. ఇంద్రాది దేవతలు ... మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలు ఆరంభిస్తూ వుంటారు. ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆ ప్రకృతి ద్వారా జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యుడే కనుక, ప్రాచీన కాలంలో అందరూ సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడికి కౄఎతజ్ఞతలు చెప్పుకోవడమన్నట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకునే వారు. ఆహారాన్ని ... ఆరోగ్యాన్ని అందించే దైవంగా ఆయన మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాడు.

దోష నివారకుడు సూర్యుడు:
అందువల్లనే ఈనాటికీ ఉదయాన్నే స్నానంచేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించేవాళ్లు ఎంతోమంది కనిపిస్తుంటారు. సూర్యుడికి నమస్కరించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనీ ... పుణ్యఫలాలు చేకూరతాయనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. అలాంటి సూర్యభగవానుడి పూజలో కొన్ని రకాల పూలు విశిష్టమైన స్థానాన్ని కలిగి వున్నాయి.సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆ పూలతో అర్చించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుందట. గులాబీలు .. జాజులు .. పొగడలు .. పొన్నాగలు .. తామరలు .. సంపెంగలు .. గన్నేరులు .. మందారాలు సూర్యభగవానుడి పూజలో విశేషమైనటువంటి స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ పూలతో సూర్యుడిని పూజించడం వలన ఆయన సంతృప్తి చెందుతాడనీ, ఆయన అనుగ్రహంతో విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


అర్ఘ్యం వదిలి నమస్కారం:

సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. ఒకవేళ ఆ స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులతో పూజించి అనుగ్రహం పొందవచ్చు. ఆ పువ్వులు ఏంటంటే మందారాలు, సంపెంగలు, పున్నాగ పుష్పాలు, గన్నేరులు, తామర, జాజులు, గులాబీలు, నాగకేసారాలు, మొల్లలు, మొగలి పూలు, మోదుగలు, విష్ణు తులసి, కృష్ణ్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవి. ఇక ముళ్ళతో కూడిన పూలు, సువాసన లేని పూలు, నల్ల ఉమ్మెత్త పూలు, గురివింద పూలు సూర్యుడి పూజకు పనికి రావని పండితులు అంటున్నారు.

Read more...

మహాలయ పక్షం

>> Sunday, September 21, 2014

మహాలయ పక్షం
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి.

పితృకర్మలు:
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్యనాడైనా చేసితీరాలి. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుం దామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుం చుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

కర్ణుడి అన్నదానం:
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించిందిఅని అశరీరవాణి పలుకులు వినిపించాయి.కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

కనీసం కూరగాయలయినా:
మహాల య పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం. ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి.

విశిష్ట దినాలు:
భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితౄఎ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.
ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయి న వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూ ర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.

అశుభకాలం:
ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశు భమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వ చ్చే కర్కాటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షి ణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయం కరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

భాద్రపదమాసం జలమయం:
అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు. పితురులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతా పితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహా లయ పక్షమం ఆమాసపు అమావాస్యతో ముగుస్తుంది.

Read more...

భోజన విధానం

>> Monday, June 23, 2014

భోజన విధానం - విద్వాన్ కాశీభట్ల సుబ్బరామ శర్మ

భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరిమ్చినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి.  అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు.  కుర్చీ మీద కూచుని భుజించకూడదు.  భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు.  తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు.

పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు. 
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు. 
కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్రంతో భుజిమ్చారాదని అంటుంది దేవల స్మృతి. 
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు.  తలుపులు వేసుకోవాలి.  కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది. 
బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు.  వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు.  పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు. 
అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు.  అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.
ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు.
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది.  నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి.  ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.
మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది.  ప్రశాంత చిత్తంతో భుజించాలి.  భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు. 
భుజించేటప్పుడు మాట్లాడ కూడదు.  అయితే ముద్ద ముద్దకూ భగవన్నామం చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు.
భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి.  దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి.  అలాగే కుక్కలకు కూడా అన్నం పెట్టాలి. 
మొదటగా ప్రాణులకు పెట్టె భుజించాలి.  భూతబలి వేయాలి. 
అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి.
సన్న్యాసులకూ, సాదువులకూ ఆహారమివ్వాలి.
పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథ లకు, దీనులకు భోజనం పెట్టాలి.
ఆకలే అర్హత.  ఆకలి గొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్తు ధర్మం.

మాంసాహారం తమోగుణాన్ని కలిగిస్తుంది. తమోగుణం రాక్షసులది.  మనం మానవులుగా ప్రవర్తించాలి.  క్రమంగా దేవతలం కావాలి. 
ప్రాణులను హింసించడం వల్ల మాత్రమె మాంసం లభిస్తుంది.  ఇది మహా పాపం.  ఏ ప్రాణినీ హింసించ వద్దని వేదం, పురాణాలు చెబుతున్నాయి.  అహింసే ధర్మాలన్నిటిలోకీ ఉత్తమమైన ధర్మం.
ప్రాణులకు ఏ విధంగానూ కష్టం కలిగించక పోవడమే అహింస అని శంకర భగవత్పాదుల నిర్వచనం.  సమస్త జీవులకూ అభయమివ్వడమే అహింస అని మరొక భాష్యం.
హింసింపరాని ప్రాణులను తన జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు, తన శరీరాన్ని పుష్టిగా చేసుకోవడానికీ, తన సుఖాన్ని పెంచుకోవడానికీ హింసించే వాడు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం.  అటువంటి వానికి సుఖం ఎప్పటికీ కలుగదు అంటుంది మనుస్మృతి (5-45). 
ప్రాణిని చంపడానికి అనుమతినిచ్చేవాడు, చంపబడిన ప్రాణి శరీరాలను ముక్కలు ముక్కలు చేసే వాడు, మాంసాన్ని అమ్మేవాడు, కొనేవాడు, వండే  వాడు, వడ్డించే వాడు, తెచ్చే వాడు, భుజించే వాడు వీరంతా ఘాతకులే, మహాపాపం చేసే వారే అని కూడా అంటుంది మనుస్మృతి (5-51).
"పశువులను నేను బరువులు మోయదానికీ, భూమి దున్నడానికీ సృష్టించాను.  వాటితో ఆ పనులను చేయించుకొంది.  నేల నుండి పుట్టిన వాటినే భుజించండి.  వరి, గోధుమలు, ఇత్యాదులను, కాయగూరలను, కంద మూలాలను, పండ్లను భుజించండి.  భుజించడానికి అల్లా ఇచ్చిన పదార్థాలు ఇవే" - అని షేక్ షాదీ ఆజ్ఞాపిస్తున్నారు.
ఏ జీవికీ దుఃఖం కలిగించరాదు.  జీవహింసను మించిన పాపం ఏదీ లేదు. 
దేనిని నువ్వు బలి పేరుతొ చంపుతున్నావో, ఆ జీవుల మాంసం, రక్తం భగవంతుని సమీపానికి పోజాలవు.  అతని దగ్గరికి పోయేది హత్య వలన కలిగే పాపం మాత్రమె.  అహింసను సంపూర్ణంగా పాటించడమే అతని స్వీకారం, అంగీకారం అంటుంది ఓ ఆయత్.
"మాంస భక్షణం, మదిరా పానం మంచి పనులు కావు.  అట్టి పనులు ఎన్నడూ చేయవద్దు" అంటుంది మరో మతం. 
ఇలాంటివి చాలా చూపవచ్చు.  భోజన నియమాలను పాటించడం వల్ల ఆయుషు పెరుగుతుంది.  ఆరోగ్యం కలుగుతుంది.  సమస్త శ్రేయస్సులూ కలుగుతాయి.
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

Read more...

ప్రార్థన చేయు విధానములు

>> Sunday, March 9, 2014

మన భారతీయ సంప్రదాయాలు

ప్రార్థన చేయు విధానములు

ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.

ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుత, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుత – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.

Read more...

ఎన్ టి రామారావుగారి పెండ్లిపత్రిక [1942]

>> Friday, February 7, 2014

Read more...

శఠగోపనంతో ఫలితమేమిటి?

>> Tuesday, December 10, 2013


దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు.
  • శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి.
  • అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
  • శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

Read more...

సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?

>> Saturday, November 9, 2013

మన దేశానికి భారత దేశమనే పేరు కలదు.  భారత శబ్దానికి అర్థం ఏమిటి?
​భారత అనే శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి.  'భా' అనే అక్షరానికి ప్రకాశమని, 'ర' అంటే రమించడం అని, 'త' అంటే తరించడం అని అర్థం.  జ్ఞాన మార్గంలో రమించి తరించేవాడు భారతీయుడు.  అందుకే మన భారతదేశాన్ని 'కర్మభూమి' అని, ఇతర దేశాలను 'భోగభూములని' అంటారు.
కర్మభూమికి భోగభూమికి గల తేడా ఏమిటి? 
భారత దేశంలో 'కర్మ' కు ప్రాధాన్యత ఇవ్వబడినది.  కర్మను ప్రధానంగా పరిగణించి దానినే ఆచరిస్తూ జీవనం సాగిస్తారు.  ఇతర దేశాలలో 'భోగానికే' ప్రాధాన్యత.  వాటిని పొందేందుకే వారు జీవనం సాగిస్తారు. కావున ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసముంది.

కర్మ అంటే ఏమిటి? 
భారతీయ సంస్కృతిలో జన్మించిన ప్రతి హిందువు వేద శాస్త్రములనే ప్రామాణికంగా భావిస్తాడు.  మనిషి మనుగడకై వేద శాస్త్రాలు యోగ్యమైన జీవన విధానానికి తోడ్పడే కర్మలను నిర్దేశిస్తున్నాయి.  అట్టి శుభప్రదమైన కర్మలనే ఆచరిస్తూ తాత్విక చింతనతో జన్మను చరితార్థం చేసుకుంటారు హిందువులు.

హిందూ అంటే? 
సంస్కృత వ్యాకరణంలో 'హిమ్' అనే ధాతువుకు పాపము అని అర్థము.  'దూ' అనగా దూషయతి, ఖండయతి.  కనుక హిందువనగా పాపరహితుదని అర్థం.  సింధు నదికి, హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని, వీరి విశిష్టమైన ఆచారవ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మమని చెప్పబడింది.
హిందూ ధర్మం అని పిలవడం తప్పా? 
తప్పే లేదు.  సనాతన ధర్మంగా పిలవబడే మన ధర్మానికి హిందూ ధర్మమనే పేరుతొ పిలవడం తప్పుగా ఎలా భావించ వచ్చు? పేరు గురించి పెద్ద రాద్దాంతం చేసుకోవలసిన పనిలేదు కానీ, మన ఆచార వ్యవహారాలను మరచిపోయి, దిగజారిపోకుండా హిందూ అనే పేరుతొ వ్యవహరించడం దోషమేమీ కాదు.
నేటి  ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకై మన ప్రాచీన ఆచారాలను, ధార్మిక భావాలను, శాస్త్రాలను పరిరక్షించి రాబోవు తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధాన కర్తలు కావాలి.
మతం అన్నా, ధర్మం అన్నా ఒకే అర్థాన్ని సూచిస్తుందా? 
మనిషి యొక్క మతి (మనసు)లో కలిగిన భావననే మతమంటారు.  వ్యక్తిని ఆలంబనగా చేసుకుని ఉద్భవించినవే మతాలు.  మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు.  త్యాగమూర్తులైన ఋషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములంటాము. అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మమార్గం.  అందుకే మనది మతం కాదు.  సనాతన ధర్మమని గ్రహించాలి.  ధర్మమే మనకు ప్రధానం.  శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించడమే ధర్మం.  అట్టి శాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు, రాగద్వేషాలకు తావు లేదు.
సనాతన ధర్మం అన్నారు.  సనాతనం అంటే ఏమిటి? 
సనాతనం అంతే శాశ్వతంగా ఉండేదని అర్థం.
సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?
సనాతనధర్మశాస్త్రాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి.  (1) జీవన విధానం; (2) జీవిత లక్ష్యం.  ఇవి రెండూ అర్థం కాని వారి జన్మ వ్యర్థమే.  అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొంద వచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి.
పురుషార్థాలంటే ఏమిటి? 
ధర్మార్థ కామ మొక్షములే పురుషార్థములు.  ఈ లోకంలో ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు.  ఆ కోరికనే "కామః" అంటుంది శాస్త్రం.  అట్టి సుఖాన్నిచ్చే పరికరములను పొందడానికి ధనం అవసరం.  కనుక ధనాన్ని "అర్థః" అంటుంది.  అయితే ఈ ధనాన్ని 'ధర్మ' మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని, హాయిని, తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 
మనిషి జీవన విధానానికి ధర్మ, అర్థ, కామములు ప్రధానమైన అంశములైతే, మనిషి యొక్క జీవిత లక్ష్యానికి 'మోక్షమే' అత్యంత ప్రధానమైన అంశముగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి.  అట్టి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రభోధిస్తున్నాయి.

ఆశ్రమ ధర్మములంటే ఏమిటి?
ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి, జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంథా అని అర్థం.  జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం.  జీవితాన్ని అర్థం చేసుకోలేనివాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే.   అందుకే మన సనాతన ధర్మ శాస్త్రాలు మానవ జీవితాన్ని (1) బ్రహ్మచర్యాశ్రమం; (2) గృహస్థాశ్రమం; (3) వానప్రస్థాశ్రమం; (4) సన్న్యాసాశ్రమం గా పరిగణిస్తుంది.
బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి?
ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి దశ.  ఈ దశలోనే ప్రతి వ్యక్తీ తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.  శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి.  తరువాత 'ఆచార్యుడే గురువు'అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది.  ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు.
గృహస్థాశ్రమం అంటే ఏమిటి?
బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు.  ఈ గృహస్తు ఎంతసేపూ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు.  మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి.  అర్థ, కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తికి క్రమేపీ మోక్షరూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం.
ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మ శాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు.  అనంతరం వారిరువురూ భార్య, భర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టం లోకి అడుగిడుతారు.  వారికి కేవలం విలాసము, సుఖ భోగాలే లక్ష్యం కాకూడదు.
విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకీ చూస్తూ ఎడమొహం, పెదమొహం తో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు.  ఆకలిలేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతే.  కుటుంబం లోని వారు కలసి మెలసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు.

భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?

మళ్ళీ చెప్పుకుందాం ..........

భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది.  అట్టి భార్య  'హృదయంతే దదామి' అంటుంది.  అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్థం.  భర్త 'తవచిత్త మనుచిత్తం భవతు' అంటాడు.  నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం.
భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.   ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి.  ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి యుండాలి.  భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి.
భార్య యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి?
భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానములతో సేవించడం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పుతుంది.  అందుకే 'భార్యామూలమిదంగృహం' అన్నారు.  పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంత సేపూ బాగుండడం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపగించడం, ద్వేషించడం వంటి చర్యలు పనికిరావు.  పరిస్థితులు బాగా లేనపుడు కూడా వాటిని అవగాహనతో పరిష్కరించుకో గలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యొన్యతతో, సదవగాహనతో వ్యవహరించాలి.
గృహస్థుల పాత్ర కేవలం దాంపత్యమునకే పరిమితం చెందక సంతానం పట్ల సరైన అవగాహనతో తల్లి, తండ్రి అనే అత్యంత కీలకమైన పాత్రలతో సమర్థవంతంగా వ్యవహరించాలి.

తల్లిదండ్రుల యొక్క బాధ్యత?
సుపుత్రో సప్తమోరసః అనే నానుడి.  అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం.  పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి.  మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి.  కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి.
మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులు గా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.
కుటుంబంలో కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసినపుడు ఎలా ప్రవర్తించాలి?
జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని ఒడి దుడుకులను ఎదుర్కోక తప్పదు .  అవగాహనా రాహిత్యం వలన కుటుంబంలో స్పర్థలు తలెత్తుతూ ఉంటాయి.   పరిష్కరించుటకు సరియైన ఆలోచనా మార్గాన్ని ఎంచుకోవాలి.  ఒకవేళ మీ చేతులు దాటితే వాటంతట అవి సర్దుకునేందుకు కాలానికే అవకాశం ఇవ్వాలి.   సర్దుకోకపోతే అవి పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి వాటిని తట్టుకొనేందుకు మనసును సంసిద్ధ పరుచుకోవాలి. 

నన్ను మాటలతోనో, చేతలతోనో బాధపెట్టే వారిని చూడగానే నాలో ద్వేషం కలుగుతోంది.  ఇటువంటి వ్యతిరేకభావాల నుండి ఎలా బయటపడాలి?  
బాధపెట్టే వారు తటస్ఠించినపుడు మనలో వ్యతిరేక భావాలు ఉదయిస్తాయి.  పెనుగాలి తాకిడికి చెట్టు పడిపోకుండా నిలబడ గలగడం ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అలాగే, కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన గలిగిన స్థాయి వారి మానసిక స్థైర్యాన్ని సూచిస్తుంది. ఈ స్థాయి కేవలం భగవదనుగ్రహంతోనే సిద్ధిస్తుంది.  కనుక ప్రతీ గృహస్థు అనుక్షణం తనకు లభించిన దానిని భగవత్ప్రసాదంగానే స్వీకరించ గలిగే స్థాయిని అలవరచుకోవాలి.  అట్టి వ్యక్తిలో రాగద్వేషాలు తొలగి క్రమేపీ వ్యతిరేకభావాల నుండి బయట పడగలిగే స్థితి చేకూరుతుంది. 
నన్ను బాధ పెట్టే వ్యక్తి పరాయి వారైతే ఉపేక్షించవచ్చు.  కానీ వారు మనతోనే కలసిఉండే వారైతే? నా కుటుంబ సభ్యులే అయితే? నేనేం చేయాలి? 
వారి అవగాహనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి.  అలా మారకపోతే మనమే మన దృక్పథాన్ని మార్చుకోగలగాలి.  మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నపుడు పొరపాటున ఒక్కోసారి నాలుకను కరుచుకుంటాం.  ఆ బాధ వర్ణనాతీతం.  దాన్ని భరించలేం. అంతమాత్రం చేత నాలుకను బాధ పెట్టిన పళ్ళను రాలగొట్టం కదా! ఆ బాధను ఓర్చుకుంటాం.  కారణం పళ్ళు, నాలుక రెండూ మనలో భాగాలే. అలాగే కుటుంబ వ్యవస్థలో అందరూ భాగాలేనని గ్రహిస్తే ఇతరుల వల్ల కలిగే దుఃఖాలను, బాధలను కూడా పరిపక్వ దృష్టితో అంగీకరించి సర్దుకు పోగలం. 

ఈ అవగాహనతోనే మన వాక్కు, ఆలోచనలు సంస్కరించ బడతాయి.  రాగద్వేష రహిత స్థితి ఏర్పడుతుంది.  క్రమేపి మనసుకి శాంతి కలిగి అలజడి తగ్గుతుంది. 
ఇటువంటివి చదువుతున్నంత సేపూ, వింటున్నంత సేపూ బాగుంటాయి.  మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగలేకపోతున్నాం.  ఎందుకని? 
మళ్ళీ చెప్పుకుందాం ..........

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

Read more...

"అట్లు "చేయవలసినదే

>> Sunday, October 20, 2013

హిందువులు ఆరోగ్య పరంగాను, సామాజిక శ్రేయస్సుకోసం ఏర్పరచిన ఎన్నో చిన్నచిన్న పండుగలు చాలా వరకూ అంతరించిపోయారుు. మారుతున్న మనుషూల స్వభావరీత్యా, కాల గమనంలో కూడా చోటుచేసుకుంటున్న పరిస్థితుల రీత్యా కొన్ని పండుగలు పూర్తిగా అంతరించిపోయాయని చెప్పవచ్చు. అరుుతే ఋతువుల్ని బట్టి, కాలాన్ని బట్టి, సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పరచిన ప్రతి పండుగ వెనుకా ఒక అద్భుత రహస్యం దాగివుందన్నది వాస్తవం.

అంతరించిపోతున్న చిన్న పండుగల ప్రాశస్త్యాన్ని తెలియజేయ డంకోసం ఒకరిద్దరు తమ వంతు ప్రయత్నాన్ని అందిస్తున్నా ఫలితం ఆశించినంతగా ఉండటం లేదు. ఒకనాడు ఆడపిల్లలు అత్యం త ఉత్సాహంగా జరుపుకున్న అట్లతద్దె ఇంచుమించుగా అంతరించి పోయిందనే చెప్పవచ్చు. సాటి యువతుల మనసుల్ని ఒకటి చేసే అపూర్వమైన పండుగ అట్లతద్దె. అంతేకాక పెద్దల్ని, పిల్లల్ని కలిసికట్టు గా ఆడించే మంచి సరదా అయిన పండుగ. దీనిని ఆచరించడం కూడా చాలా తేలిక.

వ్రత విధానం:ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే పర్వదినాన్ని అట్లతదియ, అట్ల తద్దె అని అంటారు. ఈరోజు ఈ వ్రతం చేయగోరే వారు తెల్లవారు ఝామున లేచి చద్దె అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లి పాయ పులుసు, గడ్డపెరుగు ఉల్లిపాయతో కలిపి భుజించాలి. తాంబూ లం కూడా వేసుకుని తిన్నది జీర్ణం అయ్యేంతవరకూ ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. తోటి ఆడపిల్లల్ని కూడా నిద్రలేపుతూ చలాకీగా తిరుగుతూ ఆటపాటలు అయిన తర్వాత స్నానాదులు పూర్తిచేసుకుని గౌరీదేవిని పూజించాలి.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం అయిన తరువాత శుచిగా తిరిగి గౌరీదేవిని పూజించి, అమ్మవారికి పది అట్లు నివేదించాలి. తర్వాత ముతె్తైదువకు అలంకారం చేసి, పది అట్లు, పది పండ్లు వాయనంగా ఇవ్వాలి. ఆమె కాళ్ళకు నమస్కరించి ఆమెనే గౌరీదేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. వ్రతకథ చెప్పుకుని అక్షింతలు శిరస్సున ధరించి భోజనం చెయ్యాలి. ఇది వ్రతాని ఆచరించే విధానం.

వ్రత కథ
పాటలీపుత్రాన్ని పాలించే సుశీలుడనే రాజుకు పుత్రసంతానం ఉంది కానీ ఒక పుత్రిక కూడా ఉంటే ఎంతో బాగుండును అనుకుంటున్న తరుణంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ‘సునామ’ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అన్నలుకు కూడా సనామ అంటే ఎంతో ప్రీతి. అందువల్ల చాలా గారాబంగా పెరిగిన సునామ చాలా సుకుమారంగా ఉండేది. ఆమెకు యుక్తవయసు వచ్చింది. పెళ్ళిచేయాలన్న తలంపుతో ఎన్నో సంబంధాలు చూసేవారు. అయినా చివరి క్షణంలో తపి్పపోతూవుండేవి. ఇలా ఎందుకు జరుగుతోందో కారణం తెలీక తల్లిదండ్రులు బాధపడేవారు. ఇలా పెళ్ళిచూపులతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోయింది. అప్పుడు అశరీరవాణి ‘‘గౌరీ వ్రతాన్ని గనుక ఆచరించినట్లైతే గుణవంతుడు, సత్సీలుడు అయిన మంచి భర్తతో వెంటనే వివాహం అవుతుందని చెప్తూ వ్రత విధానాన్ని తెలిపింది.

సునామ ఎంతో ఉత్సాహంతో ఇంఇకి తిరిగివచ్చి, ఆశ్వయుజ బహుళ తదియనాడు ఈ వ్రతాన్ని ఆచరించింది. రాత్రి చంద్రోదయం అయ్యేంత వరకూ మంచినీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం చేసి వ్రతఫలాన్ని పొందాలనుకుంది. ఎంతో సుకుమారంగా పెరగడం వల్ల శోషవచ్చి, నీరసంతో పడిపోయింది. ఆమె స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సునామ సహోదరులు అక్కడికి దగ్గర్లో ఉన్న చింతచెట్టుకు గుండ్రని అద్దాన్ని కట్టి దానికెదురుగా ఎండిన రెల్లు గడ్డి కుప్పవేసి, దానికి నిప్పు పెట్టి ఆ మంట అద్దంలో ప్రతిబింబించేలా చేసారు. సునామకు సేదతీర్చి చింతచెట్టు కొమ్మలమాటు నుంచి చంద్రుడు ఉదయిస్తున్నాడు చూడు. అని నమ్మించారు. సునామ ఆ వెలుగును చూసి చంద్రోదయంగా భావించి ఆహారం భుజించింది. అన్నలు చేసిన పనికి వ్రతోల్లంఘనం జరిగి మళ్ళీ ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా కుదరక వెనుతిరగడం సునామకు మనస్థాపాన్ని కలిగించింది. ఆమె మళ్ళీ గౌరీదేవి ఆలయానికి వెళ్ళి ఇదివరలో లాగే ఆత్మహత్యకి ప్రయత్నించింది.

అప్పుడు మళ్ళీ అశరీరవాణి తన అన్నలు చేసిన తప్పును చెప్పి వ్రతభంగం అయిన కారణంచేత ఇలా జరిగిందని మళ్ళీ వ్రతాన్ని ఆచరించమనీ ఆదేశించింది. సునామ ఈసారి అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరించింది. అతి సౌందర్య వంతుడు, జ్ఞానప్రదీపుడు, సర్వలక్షణ సంపన్నుడు అయిన భర్తతో వెంటనే వివాహం జరిగింది. తల్లిదండ్రుల మనస్థాపం తీరి సునామ కోరిక నెరవేరింది.

పండుగలో పరమార్థం
యుక్తవయసుకు వస్తున్న ఆడపిల్లల ఆలోచనలు సక్రమ మార్గంలో నడిపించడానికి, భక్తి మీద మనస్సును లగ్నం చేయించడానికీ శాస్ర్తీయంగా ఈ వేడుక తోడ్పడుతుంది. ఆశ్వయుజ మాసం చలితో కూడుకున్నది. పిల్లల నరాలు బిగియ దీసి ఉంటాయి. అందువల్ల వారికి ఆహారం తినాలని అనిపించదు. పైన వివరించిన ఆహార పదార్ధాలను తెల్లవారు ఝామున భుజించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గోంగూర, నువ్వులు ఆయుర్వేద పరంగా ఉష్ణతత్వాన్ని కలిగిఉంటాయి. కనుక రాత్రి మన నిద్రలో సేదతీరిన ఉదరానికి తెల్లవారుఝామున ఈ పదార్ధాలు ఔషధాల్లా ఉపయోగపడతాయి. ఈ తిన్నది పూర్తిగా జీర్ణం అవ్వడానికి వ్యాయామంగా తెల్లవారిన నుండీ ఆటలు ఆడటం, ఊయల ఊగటం వంటివి చేస్తారు. ఇలా ఊయల ఊగటం వల్ల నరాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదపడుతుందన్న విషయం అందరికీ తెలిసినదే. ఇక ఆరోజంతా పూర్తి ఉపవాసం ఉండటంచేత, చంద్రోదయ వేళకి ఆకలి పుడుతుంది. అది జీర్ణశక్తి వృద్దిచెందిందనడానికి సంకేతం. ఇలా ఆరోగ్యపరంగా ఈ పండుగ ఎంతో మేలుచేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న పండుగలు చేయకపోవడం వల్లనే ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నది అక్షర సత్యం. ఇదే ఈ పండుగ పరమార్థం.
విద్యుత్తును ఉత్పత్తి చేసే పెద్ద విద్యుత్తు కేంద్రం ఎక్కడో ఉంటుంది. అయితే అది మీకు నేరుగా విద్యుత్తును అందివ్వలేదు. సాధారణంగా చాలా మంది విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం గురించి ఏమాత్రం పట్టించుకోరు. అసలు దాని గురించే వారికి తెలిసి ఉండదు. అయితే తమ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌లోకి విద్యుత్తుతో పనిచేసే ఏదైనా ఉపకరణానికి ఉన్న ప్లగ్‌ను పెడితే ఆ పరికరం పనిచేస్తుందనే విషయం బాగా తెలుసు. అలాగే, కుండలిని, ప్లగ్‌పాయింటే కాని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కాదు. అది 3 పిన్నులది కాకుండా ఏకంగా 5 పిన్నులున్న పాయింట్ మీరు శరీరంలోని సప్తచక్రాల గురించి వినే ఉంటారు. వాటిలో ఒకటైన మూలాధార చక్కం ప్లగ్‌పాయింట్ వంటిది. అందుకే దానికి మూలాధారం అని పేరు వచ్చింది. అంటే మౌలికమైన లేదా ప్రాథమికమైనది అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాల్లో 5 చక్రాలు ప్లగ్ వంటివి. మరి ఏడో చక్రం ఏమిటంటే, అది వెలుగిచ్చే బల్బు వంటిది. దానితో మీరు అనుసంధానమయ్యారంటే మీకు చెందిన సర్వం వెలుగుతో నిండిపోతుంది. సక్రమంగా అనుసంధానం జరిగితే రోజంతా 24 గంటలూ దీపాలు వెలుగుతూ ఉంచుకోవడమనేది ఓసమస్యే కాబోదు. మీ బ్యాటరీ డౌన్ అయిపోతుందనే భయంతో మీ శక్తిని(విద్యుత్తును)కట్టేయవలసిన అవసరమే రాదు. ఎటువంటి నదురూ బెదురూ లేకుండా అసలే మాత్రం పట్టించుకోకుండా దాన్ని అలాగే నడిపించేయవచ్చు. మీరు సరాసరి ఆ శక్తి లభించే మూలవనరుతోనే అనుసంధానమై ఉన్నారు కనుక ఇది సాధ్యం.
ఇప్పుడు కూడా మీలో శక్తి ఉంది. మీరు జీవించి ఉన్నారు అంటే, జీవనశక్తులన్నీ పనిచేస్తున్నాయని అర్థం. కాకపోతే, చాలా అత్యల్పస్థాయిలో అదీ ఆ మహాశక్తిలోని అతి స్వల్ప అంశంగా మాత్రమే పనిచేస్తుంటాయి. అలాకాకుండా ఆ మొత్తం శక్తి అంతా మీకు అందుబాటులోకి వచ్చి, దానితో సవ్యంగా అనుసంధానమై ఉంటే, దానితో మీరు సాధించగలిగే వాటికి అంతే ఉండదు. మీ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌కు సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే మీరు దీపాలను వెలిగించవచ్చు. ఏసీని పనిచేయించవచ్చు. అలాగే హీటర్, టీవీ ఒక్కటేమిటి? ఏ విద్యుత్తు పరికరాన్నయినా పనిచేయించి దానివల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు కదా. అన్నిటికీ, కేవలం ఒకే ఒక్క పవర్‌పాయింట్ (విద్యుత్తును అందించే సాధనం)చాలు. ఎన్ని పనులైనా చేయడం సాధ్యపడుతుంది. కాని, మీరు మాత్రం అనుసంధానం చెంది లేరు. మీ సొంత శక్తిని సృష్టించుకోవాలని, ఉత్పత్తి చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా రోజుకు 5సార్లు తింటున్నారు. అయినా కూడా రోజంతా నిస్సత్తువగా అలసి సొలసిపోయి ఉంటున్నారు. జీవితాన్ని సాగించడానికి పడే అష్టకష్టాలు ఇవి.
శక్తి అంటే కేవలం భౌతిక శక్తి రూపంలోనో, కార్యకలాపాల రూపంలోనే ఉండేదే కాదు. అది జీవనశక్తి, అసలు ఉనికే మహాశక్తి. ఈ అస్తిత్వానికి మూలమంతా శక్తే. అది తెలియడమంటే జీవితమూలాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండటం. శక్తి విధివిధానాలు కనుక మీరు అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఈ మొత్తం సృష్టి రచనకు సంబంధించిన సర్వం మీకు బోధపడుతుంది. అంటే మీరు అనుసంధానమై ఉన్నారంటే, ఆ శక్తి ఏ విధంగా తయారవుతుందన్న విషయం తెలియకపోయినా, అసలు శక్తి అంటే ఏమిటో, అది ఏమి చేయగలదో, దాని నుంచి మీరేమి సాధించగలరో మీకు తెలుస్తుంది. తద్వారా తిరగులేని, శక్తి మూలంతో మీరు మమేకమై ఉంటారు. కుండలిని అంటే ఇదే.
మరిప్పుడు అనుసంధానం గురించి తెలుసుకుందాం. ఏదైనా విద్యుత్తు పరికరాన్ని పవర్‌పాయింట్‌తో ప్లగ్ చేయాల్సి వస్తే , మీ చేతులు వణుకుతుంటే, గోడంతా తడిమినా మీరు ప్లగ్‌పాయింట్‌తో ప్లగ్ చేయలేరు. అదే విధంగా దేహంలోని 5 పాయింట్ల ప్లగ్‌ని ప్లగ్ పాయింట్‌తో అనుసంధానం చేయడం చాలా మందికి ఎంతో కష్టసాధ్యంగా కనపడుతోంది. ఎందుకంటే, వారి దేహం, బుద్ధి, మనస్సు, ఆలోచనలు, శక్తియుక్తులు ఏవీ స్థిరంగా ఉండడం లేదు. ఈ స్థిరత్వం సాధించడం కో సమే Äెగాభ్యాసం. తద్వారా మీరు ఆ కేంద్రంతో అనుసంధానం కాగలుగుతారు. అలా అనుసంధానం చేస్తే ఇక అపరిమితమైన మహాశక్తి ఉంటుంది. ఆ మహాశక్తిని సృజించేది ఏదో, ఎక్కడుందో మీకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. అనుసంధానం కండి, అంతే, అంతా జరిగిపోతుంది.
ఎటువంటి ఆటంకాలు లేకుండా శక్తి ప్రవాహం నిరాటంకంగా ప్రవహించడానికి అవసరమైన సక్రమ అనుసంధానం జరగడానికి తోడ్పడేదే యోగం. ఒకసారి మీరు నిరాటంకంగా సాగే ఈ శక్తి మూలాలతో అనుసంధానం కాగలిగారంటే, జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే మీ జీవితాన్ని సాగిస్తారు. అప్పుడిక అసలు జీవితం దేనికోసమే, దానిలక్ష్యంఏమిటో దానివైపే మీరు సహజంగా సాగిపోతారు. సాధారణంగా మిమ్మల్ని మాయలో పడేసే, మిమ్మల్ని వేధించే చిత్రవిచిత్రమైన ఆలోచనలు, కలలు, ఆశలు, కోరికలు, భావావేశాలు, భయభ్రాంతులు.. ఈ లోకంలోని భవబంధాలనేవే మీ మిమ్మల్ని కట్టిపడేయలేవు. వాటి బంధనంలో చిక్కుకోరు. సరాసరి సాగిపోగలుగుతారు. మహాశక్తి మూలంతో మీరిప్పుడు నిరంతరం అనుసంధానమై ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతుంది. అదే ఈ సర్వసృష్టికి మూలాధారం.
ం సద్గురు
- See more at: http://www.andhrajyothy.com/node/11266#sthash.5XvagXWk.dpuf
విద్యుత్తును ఉత్పత్తి చేసే పెద్ద విద్యుత్తు కేంద్రం ఎక్కడో ఉంటుంది. అయితే అది మీకు నేరుగా విద్యుత్తును అందివ్వలేదు. సాధారణంగా చాలా మంది విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం గురించి ఏమాత్రం పట్టించుకోరు. అసలు దాని గురించే వారికి తెలిసి ఉండదు. అయితే తమ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌లోకి విద్యుత్తుతో పనిచేసే ఏదైనా ఉపకరణానికి ఉన్న ప్లగ్‌ను పెడితే ఆ పరికరం పనిచేస్తుందనే విషయం బాగా తెలుసు. అలాగే, కుండలిని, ప్లగ్‌పాయింటే కాని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కాదు. అది 3 పిన్నులది కాకుండా ఏకంగా 5 పిన్నులున్న పాయింట్ మీరు శరీరంలోని సప్తచక్రాల గురించి వినే ఉంటారు. వాటిలో ఒకటైన మూలాధార చక్కం ప్లగ్‌పాయింట్ వంటిది. అందుకే దానికి మూలాధారం అని పేరు వచ్చింది. అంటే మౌలికమైన లేదా ప్రాథమికమైనది అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాల్లో 5 చక్రాలు ప్లగ్ వంటివి. మరి ఏడో చక్రం ఏమిటంటే, అది వెలుగిచ్చే బల్బు వంటిది. దానితో మీరు అనుసంధానమయ్యారంటే మీకు చెందిన సర్వం వెలుగుతో నిండిపోతుంది. సక్రమంగా అనుసంధానం జరిగితే రోజంతా 24 గంటలూ దీపాలు వెలుగుతూ ఉంచుకోవడమనేది ఓసమస్యే కాబోదు. మీ బ్యాటరీ డౌన్ అయిపోతుందనే భయంతో మీ శక్తిని(విద్యుత్తును)కట్టేయవలసిన అవసరమే రాదు. ఎటువంటి నదురూ బెదురూ లేకుండా అసలే మాత్రం పట్టించుకోకుండా దాన్ని అలాగే నడిపించేయవచ్చు. మీరు సరాసరి ఆ శక్తి లభించే మూలవనరుతోనే అనుసంధానమై ఉన్నారు కనుక ఇది సాధ్యం.
ఇప్పుడు కూడా మీలో శక్తి ఉంది. మీరు జీవించి ఉన్నారు అంటే, జీవనశక్తులన్నీ పనిచేస్తున్నాయని అర్థం. కాకపోతే, చాలా అత్యల్పస్థాయిలో అదీ ఆ మహాశక్తిలోని అతి స్వల్ప అంశంగా మాత్రమే పనిచేస్తుంటాయి. అలాకాకుండా ఆ మొత్తం శక్తి అంతా మీకు అందుబాటులోకి వచ్చి, దానితో సవ్యంగా అనుసంధానమై ఉంటే, దానితో మీరు సాధించగలిగే వాటికి అంతే ఉండదు. మీ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌కు సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే మీరు దీపాలను వెలిగించవచ్చు. ఏసీని పనిచేయించవచ్చు. అలాగే హీటర్, టీవీ ఒక్కటేమిటి? ఏ విద్యుత్తు పరికరాన్నయినా పనిచేయించి దానివల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు కదా. అన్నిటికీ, కేవలం ఒకే ఒక్క పవర్‌పాయింట్ (విద్యుత్తును అందించే సాధనం)చాలు. ఎన్ని పనులైనా చేయడం సాధ్యపడుతుంది. కాని, మీరు మాత్రం అనుసంధానం చెంది లేరు. మీ సొంత శక్తిని సృష్టించుకోవాలని, ఉత్పత్తి చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా రోజుకు 5సార్లు తింటున్నారు. అయినా కూడా రోజంతా నిస్సత్తువగా అలసి సొలసిపోయి ఉంటున్నారు. జీవితాన్ని సాగించడానికి పడే అష్టకష్టాలు ఇవి.
శక్తి అంటే కేవలం భౌతిక శక్తి రూపంలోనో, కార్యకలాపాల రూపంలోనే ఉండేదే కాదు. అది జీవనశక్తి, అసలు ఉనికే మహాశక్తి. ఈ అస్తిత్వానికి మూలమంతా శక్తే. అది తెలియడమంటే జీవితమూలాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండటం. శక్తి విధివిధానాలు కనుక మీరు అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఈ మొత్తం సృష్టి రచనకు సంబంధించిన సర్వం మీకు బోధపడుతుంది. అంటే మీరు అనుసంధానమై ఉన్నారంటే, ఆ శక్తి ఏ విధంగా తయారవుతుందన్న విషయం తెలియకపోయినా, అసలు శక్తి అంటే ఏమిటో, అది ఏమి చేయగలదో, దాని నుంచి మీరేమి సాధించగలరో మీకు తెలుస్తుంది. తద్వారా తిరగులేని, శక్తి మూలంతో మీరు మమేకమై ఉంటారు. కుండలిని అంటే ఇదే.
మరిప్పుడు అనుసంధానం గురించి తెలుసుకుందాం. ఏదైనా విద్యుత్తు పరికరాన్ని పవర్‌పాయింట్‌తో ప్లగ్ చేయాల్సి వస్తే , మీ చేతులు వణుకుతుంటే, గోడంతా తడిమినా మీరు ప్లగ్‌పాయింట్‌తో ప్లగ్ చేయలేరు. అదే విధంగా దేహంలోని 5 పాయింట్ల ప్లగ్‌ని ప్లగ్ పాయింట్‌తో అనుసంధానం చేయడం చాలా మందికి ఎంతో కష్టసాధ్యంగా కనపడుతోంది. ఎందుకంటే, వారి దేహం, బుద్ధి, మనస్సు, ఆలోచనలు, శక్తియుక్తులు ఏవీ స్థిరంగా ఉండడం లేదు. ఈ స్థిరత్వం సాధించడం కో సమే Äెగాభ్యాసం. తద్వారా మీరు ఆ కేంద్రంతో అనుసంధానం కాగలుగుతారు. అలా అనుసంధానం చేస్తే ఇక అపరిమితమైన మహాశక్తి ఉంటుంది. ఆ మహాశక్తిని సృజించేది ఏదో, ఎక్కడుందో మీకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. అనుసంధానం కండి, అంతే, అంతా జరిగిపోతుంది.
ఎటువంటి ఆటంకాలు లేకుండా శక్తి ప్రవాహం నిరాటంకంగా ప్రవహించడానికి అవసరమైన సక్రమ అనుసంధానం జరగడానికి తోడ్పడేదే యోగం. ఒకసారి మీరు నిరాటంకంగా సాగే ఈ శక్తి మూలాలతో అనుసంధానం కాగలిగారంటే, జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే మీ జీవితాన్ని సాగిస్తారు. అప్పుడిక అసలు జీవితం దేనికోసమే, దానిలక్ష్యంఏమిటో దానివైపే మీరు సహజంగా సాగిపోతారు. సాధారణంగా మిమ్మల్ని మాయలో పడేసే, మిమ్మల్ని వేధించే చిత్రవిచిత్రమైన ఆలోచనలు, కలలు, ఆశలు, కోరికలు, భావావేశాలు, భయభ్రాంతులు.. ఈ లోకంలోని భవబంధాలనేవే మీ మిమ్మల్ని కట్టిపడేయలేవు. వాటి బంధనంలో చిక్కుకోరు. సరాసరి సాగిపోగలుగుతారు. మహాశక్తి మూలంతో మీరిప్పుడు నిరంతరం అనుసంధానమై ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతుంది. అదే ఈ సర్వసృష్టికి మూలాధారం.
ం సద్గురు
- See more at: http://www.andhrajyothy.com/node/11266#sthash.5XvagXWk.dpuf
విద్యుత్తును ఉత్పత్తి చేసే పెద్ద విద్యుత్తు కేంద్రం ఎక్కడో ఉంటుంది. అయితే అది మీకు నేరుగా విద్యుత్తును అందివ్వలేదు. సాధారణంగా చాలా మంది విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం గురించి ఏమాత్రం పట్టించుకోరు. అసలు దాని గురించే వారికి తెలిసి ఉండదు. అయితే తమ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌లోకి విద్యుత్తుతో పనిచేసే ఏదైనా ఉపకరణానికి ఉన్న ప్లగ్‌ను పెడితే ఆ పరికరం పనిచేస్తుందనే విషయం బాగా తెలుసు. అలాగే, కుండలిని, ప్లగ్‌పాయింటే కాని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కాదు. అది 3 పిన్నులది కాకుండా ఏకంగా 5 పిన్నులున్న పాయింట్ మీరు శరీరంలోని సప్తచక్రాల గురించి వినే ఉంటారు. వాటిలో ఒకటైన మూలాధార చక్కం ప్లగ్‌పాయింట్ వంటిది. అందుకే దానికి మూలాధారం అని పేరు వచ్చింది. అంటే మౌలికమైన లేదా ప్రాథమికమైనది అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాల్లో 5 చక్రాలు ప్లగ్ వంటివి. మరి ఏడో చక్రం ఏమిటంటే, అది వెలుగిచ్చే బల్బు వంటిది. దానితో మీరు అనుసంధానమయ్యారంటే మీకు చెందిన సర్వం వెలుగుతో నిండిపోతుంది. సక్రమంగా అనుసంధానం జరిగితే రోజంతా 24 గంటలూ దీపాలు వెలుగుతూ ఉంచుకోవడమనేది ఓసమస్యే కాబోదు. మీ బ్యాటరీ డౌన్ అయిపోతుందనే భయంతో మీ శక్తిని(విద్యుత్తును)కట్టేయవలసిన అవసరమే రాదు. ఎటువంటి నదురూ బెదురూ లేకుండా అసలే మాత్రం పట్టించుకోకుండా దాన్ని అలాగే నడిపించేయవచ్చు. మీరు సరాసరి ఆ శక్తి లభించే మూలవనరుతోనే అనుసంధానమై ఉన్నారు కనుక ఇది సాధ్యం.
ఇప్పుడు కూడా మీలో శక్తి ఉంది. మీరు జీవించి ఉన్నారు అంటే, జీవనశక్తులన్నీ పనిచేస్తున్నాయని అర్థం. కాకపోతే, చాలా అత్యల్పస్థాయిలో అదీ ఆ మహాశక్తిలోని అతి స్వల్ప అంశంగా మాత్రమే పనిచేస్తుంటాయి. అలాకాకుండా ఆ మొత్తం శక్తి అంతా మీకు అందుబాటులోకి వచ్చి, దానితో సవ్యంగా అనుసంధానమై ఉంటే, దానితో మీరు సాధించగలిగే వాటికి అంతే ఉండదు. మీ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌కు సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే మీరు దీపాలను వెలిగించవచ్చు. ఏసీని పనిచేయించవచ్చు. అలాగే హీటర్, టీవీ ఒక్కటేమిటి? ఏ విద్యుత్తు పరికరాన్నయినా పనిచేయించి దానివల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు కదా. అన్నిటికీ, కేవలం ఒకే ఒక్క పవర్‌పాయింట్ (విద్యుత్తును అందించే సాధనం)చాలు. ఎన్ని పనులైనా చేయడం సాధ్యపడుతుంది. కాని, మీరు మాత్రం అనుసంధానం చెంది లేరు. మీ సొంత శక్తిని సృష్టించుకోవాలని, ఉత్పత్తి చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా రోజుకు 5సార్లు తింటున్నారు. అయినా కూడా రోజంతా నిస్సత్తువగా అలసి సొలసిపోయి ఉంటున్నారు. జీవితాన్ని సాగించడానికి పడే అష్టకష్టాలు ఇవి.
శక్తి అంటే కేవలం భౌతిక శక్తి రూపంలోనో, కార్యకలాపాల రూపంలోనే ఉండేదే కాదు. అది జీవనశక్తి, అసలు ఉనికే మహాశక్తి. ఈ అస్తిత్వానికి మూలమంతా శక్తే. అది తెలియడమంటే జీవితమూలాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండటం. శక్తి విధివిధానాలు కనుక మీరు అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఈ మొత్తం సృష్టి రచనకు సంబంధించిన సర్వం మీకు బోధపడుతుంది. అంటే మీరు అనుసంధానమై ఉన్నారంటే, ఆ శక్తి ఏ విధంగా తయారవుతుందన్న విషయం తెలియకపోయినా, అసలు శక్తి అంటే ఏమిటో, అది ఏమి చేయగలదో, దాని నుంచి మీరేమి సాధించగలరో మీకు తెలుస్తుంది. తద్వారా తిరగులేని, శక్తి మూలంతో మీరు మమేకమై ఉంటారు. కుండలిని అంటే ఇదే.
మరిప్పుడు అనుసంధానం గురించి తెలుసుకుందాం. ఏదైనా విద్యుత్తు పరికరాన్ని పవర్‌పాయింట్‌తో ప్లగ్ చేయాల్సి వస్తే , మీ చేతులు వణుకుతుంటే, గోడంతా తడిమినా మీరు ప్లగ్‌పాయింట్‌తో ప్లగ్ చేయలేరు. అదే విధంగా దేహంలోని 5 పాయింట్ల ప్లగ్‌ని ప్లగ్ పాయింట్‌తో అనుసంధానం చేయడం చాలా మందికి ఎంతో కష్టసాధ్యంగా కనపడుతోంది. ఎందుకంటే, వారి దేహం, బుద్ధి, మనస్సు, ఆలోచనలు, శక్తియుక్తులు ఏవీ స్థిరంగా ఉండడం లేదు. ఈ స్థిరత్వం సాధించడం కో సమే Äెగాభ్యాసం. తద్వారా మీరు ఆ కేంద్రంతో అనుసంధానం కాగలుగుతారు. అలా అనుసంధానం చేస్తే ఇక అపరిమితమైన మహాశక్తి ఉంటుంది. ఆ మహాశక్తిని సృజించేది ఏదో, ఎక్కడుందో మీకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. అనుసంధానం కండి, అంతే, అంతా జరిగిపోతుంది.
ఎటువంటి ఆటంకాలు లేకుండా శక్తి ప్రవాహం నిరాటంకంగా ప్రవహించడానికి అవసరమైన సక్రమ అనుసంధానం జరగడానికి తోడ్పడేదే యోగం. ఒకసారి మీరు నిరాటంకంగా సాగే ఈ శక్తి మూలాలతో అనుసంధానం కాగలిగారంటే, జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే మీ జీవితాన్ని సాగిస్తారు. అప్పుడిక అసలు జీవితం దేనికోసమే, దానిలక్ష్యంఏమిటో దానివైపే మీరు సహజంగా సాగిపోతారు. సాధారణంగా మిమ్మల్ని మాయలో పడేసే, మిమ్మల్ని వేధించే చిత్రవిచిత్రమైన ఆలోచనలు, కలలు, ఆశలు, కోరికలు, భావావేశాలు, భయభ్రాంతులు.. ఈ లోకంలోని భవబంధాలనేవే మీ మిమ్మల్ని కట్టిపడేయలేవు. వాటి బంధనంలో చిక్కుకోరు. సరాసరి సాగిపోగలుగుతారు. మహాశక్తి మూలంతో మీరిప్పుడు నిరంతరం అనుసంధానమై ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతుంది. అదే ఈ సర్వసృష్టికి మూలాధారం.
ం సద్గురు
- See more at: http://www.andhrajyothy.com/node/11266#sthash.5XvagXWk.dpuf

Read more...

20. హారతి ఇస్తాము - ఎందుకు?

>> Monday, July 8, 2013

20. హారతి ఇస్తాము - ఎందుకు?భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము.  ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది. 

ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము.  ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది.  భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము.  ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.  చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.

మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము.  అందులో పాల్గొంటున్నాము.  మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము.

ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము.  దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది.  గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి. 

హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది.  కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది.  కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక.  జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది.  కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని శోభను తెలుపడానికి అది తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది.  మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనము మన గురువునీ సంఘాన్నీ సేవించుకుంటూ అందరికి 'ప్రేమ' అనే 'సుగంధాన్ని' వ్యాపింపచేయడానికి మనస్పూర్తిగా మనలని మనము అర్పించుకోవాలి.

తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము.  కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి.  మన దేహము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది.  పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు.  హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధము - భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.

హారతికి వేదాన్తపరమైన అర్ధము; సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ మరియు అగ్ని - ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు.  సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము.  ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ మరియు ప్రకాశించడమూ జరుగుతుంది.  హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము. 

సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు.  భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము.  అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు.  మనసు భావింపలేదు.  నాలుక మాట్లాడ లేదు.  మనసు బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే.  ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు.  అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.

న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ2 యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు.  మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి.  అతని వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాము. 

==============================

ధన్యవాదాలతో,
--

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం

Read more...

19. ఓంకారము పలుకుతాము - ఎందుకు?

>> Wednesday, July 3, 2013

19. ఓంకారము పలుకుతాము - ఎందుకు?భారత దేశములో ఎక్కువగా పలుకబడే శబ్ద చిహ్నము ఓంకారము.  ఓంకారము - ధ్వనింపచేసే వారి శరీరము, మనసులపైన మరియు పరిసరాల పైన కూడా పరిపూర్ణ ప్రభావము ఉంటుంది.  చాలా మంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఓంకారముతో ఆరంభమవుతాయి.  ఓంహరిఃఓం మొదలైన అభినందనలలో కూడా అది వాడబడుతుంది.  దాని ఆకారము పూజింపబడుతుంది.  దానిపై భావన చేయబడుతుంది.  శుభసూచకంగా వాడబడుతుంది.  ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది.

ఓంకారము ఎందుకు చేస్తాము?ఓం అనేది భగవంతుని యొక్క ప్రధమ నామము.  అది అ, ఉ, మ అనే అక్షరాల కలయిక వలన ఏర్పడినది.  స్వరస్నాయువుల నుండీ వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచీ 'అ'కారముగా ఆరంభమవుతుంది.  పెదిమలు మూసుకొన్నప్పుడు 'మ'కారము తో శబ్దము ఆగిపోతుంది.  మూడు అక్షరాలూ, మూడు అవస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి), ముగ్గురు దేవతలు (బ్రహ్మ విష్ణు, మహేశ్వర), మూడు వేదాలు (ఋగ్, యజుర్, సామ), మూడు లోకాలు (భూః, భువః, సువః) మొదలైన వాటికి ప్రతీకలు.  ఇవి అన్నీ మరియు వీటన్నింటికి ఆవల ఉన్నవాడు "భగవంతుడు" రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది.  ఓంకారం ప్రణవము అని కూడా పిలువబడుతుంది ("దేని ద్వారా అయితే భగవంతుడు స్తుతించ బడతాడో" అని అర్ధము).  వేదాలలోని సారమంతా "ఓం" అనే పవిత్రాక్షరములో నిక్షిప్తమైనది.

భగవంతుడు ఓంకారము మరియు 'అథ' అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్ప బడుతుంది.  కాబట్టే మనం తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.

ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo...మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది.  మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.

ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది.  సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది.  పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము. 

ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.
(తరువాతి శీర్షిక - హారతి ఇస్తాము ఎందుకు?)

...

Read more...

18. కొబ్బరి కాయను నివేదిస్తాము - ఎందుకు?

>> Tuesday, July 2, 2013

18.  కొబ్బరి కాయను నివేదిస్తాము - ఎందుకు?భారత దేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి.  వివాహములు పండుగలు, కొత్త వాహనము, వంతెన, ఇల్లు మొదలగునవి వాడేటప్పుడు మరియు అన్ని శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబడుతుంది.  నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూజా సందర్భాలలో మరియు ప్రత్యేక అతిథులను ఆహ్వానించడానికి ఉపయోగించబడుతుంది. 

హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించ బడుతుంది.  భగవంతుని మెప్పుకై, కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికాయ పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుంది.  తరువాత ప్రసాదముగా పంచ బడుతుంది.

ఒకానొకప్పుడు మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది.  నెమ్మదిగా ఆ ఆచారము తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది.  ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది.  పైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి.  పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది.  మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి.  భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది.

దేవాలయాల్లోనూ ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు.  ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది.  సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.

కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక.  చెట్టు యొక్క ప్రతి భాగము - మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి.  ఇది భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది.  ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది.  ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది. 

కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు.  అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది.  కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది.
(తరువాతి శీర్షిక - ఓంకారము పలుకుతాము - ఎందుకు?)
...

Read more...

17 . శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?

>> Monday, July 1, 2013

17 . శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?శాంతి అంటే అర్ధము ప్రశాంతత, అదే జీవి యొక్క సహజమైన స్థితి.  సహజ స్థితి ని భంగం కలిగించేవి అన్నీ అశాశ్వతాలే.  శబ్దాలు, ఆందోళనలు మరి ఏ ఇతర అడ్డంకులు మనచే గానీ ఇతరులచే గానీ కలిగిం చబడతాయి.  ఉదాహరణకి ఒక స్థలములో ఎవరైనా శబ్దము చేసే వరకు అక్కడ ఉండేది ప్రశాంతతే.   కాబట్టి మన అన్ని ఆందోళనలు అంతర్లీనంగా శాంతిని కలిగే ఉన్నాయి.  ఆందోళనలు ముగిసిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్నందువల్ల శాంతి సహజంగానే అనుభవంలోనికి వస్తుంది.  ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది.  అందువలన ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ తన జీవితంలో శాంతిని కోరుకుంటారు.  ఐనప్పటికీ మన స్వంత ఆందోళనల చేత కప్పివేయబడినందువల్ల, అంతరంగికంగా గానీ బాహ్యంగా గానీ 'శాంతి' ని పొందడము చాల కష్టమనిపిస్తుంది.  చాల అరుదైన కొందరు మాత్రమే బాహ్యమైన ఆందోళనలు, కష్టాల మధ్య కూడా శాంతియుతంగా ఉండ గలుగుతారు.  మనము శాంతిని పొందడానికి ప్రార్ధనలు చేస్తాము.  ప్రార్ధనలు చేయడం వలన కష్టాలు ముగిసి బాహ్యఆందోళనలతో సంబంధం లేకుండా అంతరంగికంగా శాంతి అనుభవములోకి వస్తుంది.  అటువంటి ప్రార్ధనలన్నీ మూడు సార్లు శాంతి పలకడముతో ముగుస్తాయి.

మనము మూడు సార్లు శాంతి వచనము ఎందుకు చెప్తాము?'త్రివారం సత్యం' అనబడుతుంది.  ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తాము.  న్యాయ స్థానము లో కూడా, సాక్ష్యం చెప్పడానికి నిలబడినవారు "నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరి ఇంకేమి చెప్పను" అని మూడు సార్లు చెప్తారు.  మనకు శాంతి పొందాలన్న కోరిక యొక్క తీవ్రతను నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు శాంతి వచనము వల్లిస్తాము. 

అన్ని రకాల విఘ్నాలు, సమస్యలు, మరియు దుఃఖాలు మూడు విధాలుగా ఉత్పన్నమవుతాయి. 

1. అధిదైవిక: ఏ మాత్రము మన అదుపులో లేని దైవీ శక్తుల వలన ఏర్పడే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలగునవి.

2. అధిభూత: మనచుట్టూ ఉండి మనకు తెలిసిన ప్రమాదాలు, మానవ సంబంధాలు, కాలుష్యము నేరములు మొదలగునవి.

3. ఆధ్యాత్మిక: శారీరక వ్యాధులు, కోపము, నిరుత్సాహము వంటి మానసిక సమస్యలు.

మనమేదైనా ప్రత్యేకమైన పని చేసేటప్పుడు మరియు నిత్య జీవితములో పైన వివరించబడిన మూడు మూలకారణాల వలన ఏ సమస్యలు లేకుండగా లేక సమస్యలను తగ్గించమని "శాంతి ఒక్కటే ఉండుగాక!" అని భగవంతుని ప్రార్థిస్థాము.  కాబట్టి మూడు సార్లు శాంతి వచనము చేయబడుతుంది.

మొదటి సారి దూరంగా ఉన్న అవ్యక్త శక్తులను ఉద్దేశించి శాంతి వచనము చేయబడుతుంది.  మన వెనువెంట ఉన్న పరిసరాలను మరియు చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను ఉద్దేశించి రెండవసారి కొంత మృదువు గాను; తమకు తాము ఉద్దేశించి చివరి సారి బాగా మృదువుగాను శాంతి వచనము చేయబడుతుంది.
(తరువాతి శీర్షిక - కొబ్బరికాయను నివేదిస్తాము - ఎందుకు?) 

Read more...

16. శంఖము ఎందుకు ఊదుతాము?

>> Sunday, June 30, 2013

16.  శంఖము ఎందుకు ఊదుతాము?దేవాలయాలలో గానీ ఇళ్ళలో గానీ శాస్త్రోక్త పూజారంభ సమయములో ఒక్కసారి లేక అనేక సార్లు శంఖము పూరించ బడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గానీ లేక సుభసూచకమైన సందర్భాన్ని గుర్తించడానికి గానీ శంఖము ఊదబడుతుంది.  యుద్ధం ఆరంభించడానికి ముందర లేక సైన్యపు విజయాన్ని ప్రకటించడానికి గానీ శంఖారావము చేయబడుతుంది.  శంఖము దైవ పీఠము వద్ద కూడా పెట్టి పూజించ బడుతుంది.  

శంఖము ఎందుకు ఊదుతాము.  
ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో, అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవ నాదము వెలువడుతుంది.  ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము.  అది ప్రపంచానికి, దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి. 

ఒక కథనం ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళాడు.  దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకొన్నారు.   శ్రీ మహావిష్ణు 'మత్స్యావతారము' ధరించి శంఖాసురుణ్ణి సంహరించాడు.  భగవానుడు శంఖాకారములో ఉన్న అతని చెవి మరియు తల ఎముకను ఊదగా అందుండి వేదాలను ఉద్భవిమ్పచేసినట్టి నాదము వెలువడింది.  వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే.  శంఖము 'శంఖాసురుని' మరణానంతరము 'శంఖము' గా పిలవబడుచున్నది.  భగవానునిచే పూరించబడిన శంఖము 'పాంచ జన్యము' గా పిలువ బడుచున్నది.  ఆయన నాలుగు చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలలో శంఖము పట్టుకొని ఉంటాడు.  అది జీవితపు చతుర్విధ పురుషార్ధాలలో ఒకటయిన 'ధర్మము' లేక ధర్మశీలతకుప్రతీక .  అందువల్లనే శంఖారావము అధర్మముపై ధర్మము యొక్క విజయానికి సంకేతము.  శంఖాన్ని మన చెవులకి దగ్గరగా పెట్టుకొంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది. 

భక్తుల మనసులను వాతావరణమును కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమెయ్యడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది మరియొక ముఖ్య ఉద్దేశ్యము. 

పురాతన భారత దేశము గ్రామాలలో నివసిస్తూ ఉండేది.  ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది.  ప్రతి ముఖ్యమైన పూజ ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతి తో పాటు శంఖారావము చేయబడుతుంది.  సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖనాదం ఊరంతటికీ వినిపించేది.  దేవాలయానికి వెళ్ళడానికి వీలుకాని ప్రజలంతా వారు ఏ పని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి ప్రణమిల్లాలని గుర్తు చేయబడేది.  ఈ శంఖ నాదం తీరిక లేని నిత్య కృత్యాల మధ్య నున్న ప్రజల మనసులని కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందించేది. 

నాద బ్రహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మమూ, విజయము మరియు శుభసూచకాలకి ప్రతీకగా దేవాలయాల లోను, ఇళ్ళలోనూ, దైవ పీఠము వద్ద, భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచ బడుతుంది.  భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్ధమునకు కూడా శంఖము వాడ బడుతుంది. 

ఈ క్రింది శ్లోకముతో శంఖము పూజింపబడుతుంది. 

త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విద్రుతః కరే
దేవైశ్చ పూజితః సర్వైః పాంచజన్యం నమోస్తుతే
సముద్రములో పుట్టిన, విష్ణుమూర్తి చేత బట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యమను శంఖమునకు వందనము. 
(తరువాతి శీర్షిక - శాంతి వచనము మూడు సార్లు చెపుతాము ఎందుకు?)

Read more...

15. తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము - ఎందుకు?

>> Saturday, June 29, 2013

15. తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము - ఎందుకు?తామర పూవు భారత దేశ జాతీయ పుష్పముగా గుర్తింపు పొందినది.  ఈ గుర్తింపు సరైనటువంటిదే.  కొద్ది కాలము క్రితము వరకు కూడా భారత దేశపు చెరువులు, కొలనులు ఎన్నో రంగు రంగుల తామర పుష్పములతో నిండి ఉండేవి.

తామర పూవుని ప్రత్యెకమైనదిగా పరిగణించుట ఎందుకు?తామర పూవు సత్యము పవిత్రత మరియు సుందరత్వానికి ప్రతీక.  భగవంతుని స్వభావము కూడా సత్యం శివం సుందరమూ.  కనుక అతని వివిధ భాగాలు పద్మముతో పోల్చబడతాయి.  మన వేదాలు, ఇతిహాసాలు తామర పూవు అందాలని స్తుతించుతాయి.  చిత్రకళ  శాస్త్రములు కూడా తామర పూవుని వివిధ అలంకారయుత చిత్రాలుగా చిత్రీకరిస్తుంటాయి.  చాలా మంది తామర పూవు లేదా దానికి సంబంధించిన పేర్లను కలిగి ఉంటారు.  సంపదకు అధి దేవత ఐన లక్ష్మీ దేవి ఒక తామర పూవు పైన ఆసీనమై మరొక తామర పూవుని తన హస్తముతో పట్టుకొని ఉంటుంది. 

తామర పూవు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకొని పోతుంది.  అదే విధంగా మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి.  తామర పూవు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది.  దాని పరిసరాలు ఏ విధముగా ఉన్నప్పటికీ తాను మాత్రము  కళంకము లేకుండా అందంగా ఉంటుంది.  మనము కూడా బాహ్య పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండగలగటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది.  ఎప్పుడూ నీళ్ళలోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు.  జ్ఞాని దుఃఖాలతోను మార్పులతోనూ కూడుకొన్న ప్రపంచములో ఉన్నప్పటికీ వాటికి చలించకుండా ఆత్మానందములోనె లీనమై ఉంటాదనడానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది.  భగవద్గీత లోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయ బడింది.
బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే నసపాపేన పద్మ పాత్ర మివాంభసా
భగవంతుడికి అర్పించి ఫలాపేక్ష వదిలి, ఎవరు కర్మలు చేస్తారో, తామరాకుకి నీరు లాగ వారికి పాపము అంటుకోదు.

దీనివలన జనానికి ఏదైతే సహజ లక్షణమో అది సాధకులందరికీ ఆధ్యాత్మ అన్వేషకులకి భక్తులకి ఆచరించ వలసిన క్రమ శిక్షణ అవుతుందని మనము తెలుసుకొన్నాము.

యోగ శాస్త్ర ప్రకారము మన దేహాలు శక్తి కేంద్రాలయిన కొన్ని చక్రాలను కలిగి ఉన్నాయి.  ప్రతి చక్రము నియమిత దళముల పద్మమును కల్గి ఉంటుంది.  ఉదాహరణకు శిరోభాగమున గల సహస్ర చక్రము, యోగి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు వికసిస్తుంది.  దీనిని వెయ్యి దళములు గల పద్మముతో సూచిస్తారు.  అంతే కాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనము సిఫారసు చేయబడింది.

విష్ణు భగవానుని నాభి నుంచీ ఆవిర్భవించిన తామర పూవు నుండి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికై ఉద్భవించాడు.  ఆ విధముగా తామరపూవు సృష్టి కర్తకీ మరియు పరమాత్మకు గల సంబంధానికి చిహ్నంగా నిలుస్తున్నది.  ఇది బ్రహ్మదేవుని నివాస స్థానమైన బ్రహ్మలోకానికి కూడా చిహ్నము.

శుభ సూచకమైన స్వస్తిక్ గుర్తు కూడా తామర పూవు నుంచే వెలువడినట్లు చెప్పబడుతుంది.

తామర భారత జాతీయ పుష్పముగా ఎందుకు ఎన్నుకోబడినదో, భారతీయులకి ఎందుకది అంత ప్రత్యేకమైనదో మనము పై విషయాల ద్వారా చక్కగా తెలుసుకున్నాము.
(తరువాతి శీర్షిక - శంఖము ఎందుకు ఊదుతాము) kbn sarmagaru
  

Read more...

14. తులసిని -పూజిస్తాము ఎందుకు?

>> Friday, June 28, 2013

14.  తులసిని -పూజిస్తాము ఎందుకు?
హిందువుల గృహాలలో ముందర, వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో 'తులసి కోట నిర్మించబడి ఉంటుంది.  ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాల (అపార్టుమెంట్లు) లోని వారు కూడా పూల తొట్టెలలో తులసి మొక్కను పోషించుకొంటున్నారు.  ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది.  తులసి మొక్క ఆకులు, విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా పరిగణించ బడతాయి.  భగవంతునికి నివేదింపబడే నైవేద్యములో ఎప్పుడూ తులసి ఆకులు ఉంచబడతాయి.  భగవంతుడికి చేసే పూజలలో, ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార మూర్తుల పూజలలో తులసి సమర్పించ బడుతుంది.

మనము తులసిని ఎందుకు పూజిస్తాము?సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది
తులసి (దాని లక్షణాలలో)  అని అర్ధము.  భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి. 

వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.

ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత.  ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య.  ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు.  తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే.  అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. 
విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).

ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి  తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు.  అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము.  ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక.  ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు. 

ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది.  కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు.  ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.

తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది.  జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది. 


తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది.  చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.

తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:

యన్మూలే సర్వ తీర్ధాణి యదగ్రే సర్వ దేవతాః
యన్మధ్యే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహమ్
ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.
(తరువాత శీర్షిక - తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము ఎందుకని)

Read more...

13. కలశాన్ని ఎందుకు పూజిస్తాము?

>> Thursday, June 27, 2013

13. కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.  తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.  ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు.   అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది.  ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు "పూర్ణకుంభము" అనబడుతుంది.  అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.  ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.

సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో 'కలశము' ఏర్పాటు చేయబడుతుంది.  స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది.  ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.

మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు.  అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని   సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది.  ఇది అన్నింటికీ జీవన దాత.  లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.  ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది. 
ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.  చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది.  అందువల్లనే 'కలశం' శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు "అభిషేకము" తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది.  దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.

పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.  కనుక 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు.  వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము.
(తరువాతి శీర్షిక - తులసిని పూజిస్తాము - ఎందుకు?)

Read more...

12. దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?

>> Wednesday, June 26, 2013

12.  దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?
చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి.  భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.  పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు.

మనము గంటను ఎందుకు మ్రోగిస్తాము?భగవంతుడిని నిద్ర లేపడానికా? కానీ దేవుడు ఎప్పుడూ నిద్రపోదు. 
భగవంతునికి మనము వచ్చినట్లు తెలియచేయడానికా?   ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలుపవలసిన అవసరము లేదు. 
ఆయన ప్రాంగణము లోనికి రావడానికి అనుమతి కొరకా? అది స్వంత ఇంటికి వస్తున్నట్లే గనుక రావడానికి అనుమతి తీసికొన అవసరము లేదు.  భగవంతుడు మనలని ఎల్లవేళలా ఆహ్వానిస్తుంటాడు. 

మరి మనం గంటను ఎందుకు మ్రోగిస్తున్నట్లు?

గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దము మంగళకరమైన ధ్వనిగా పరిగణించ బడుతుంది.  ఇది విశ్వానికంతా భగవన్నామమయిన 'ఓంకార' నాదాన్ని ఉద్భవింపజేస్తుంది.  సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం.
వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము.  ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది.  మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి.  ఇది గంట మ్రోగించడము లోని అదనపు సంకేతము.

మనము చేసే నిత్య పూజ ఆరంభములో ఇలా చెపుతూ గంటను వాయిస్తాము.

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం 

దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను.  దాని వలన సద్గుణ దైవీ పరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక!
(తరువాయి శీర్షిక - కలశాన్ని ఎందుకు పూజిస్తాము)

Read more...

11. ఉపవాసం ఎందుకు చేయాలి?

>> Tuesday, June 25, 2013

11. ఉపవాసం ఎందుకు చేయాలి?
భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు.  కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు.  ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు.  గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.
ఉపవాసం ఎందుకు చేస్తాము?
ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?
సంస్కృతంలో ఉప అంటే 'దగ్గరగా' + వాస అంటే 'ఉండడం' అని అర్ధము.  కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం.  మరి ఉపవాసం - ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?
కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది.  అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు.  తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది.  అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది.  తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.
ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము.  ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది. 
ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును.  ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.
ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు.  ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది.  కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు.    మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా  లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు.  మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.
(తరువాతి శీర్షిక - దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?)

Read more...

10. మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?

>> Monday, June 24, 2013

10. మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?
ప్రాచీన కాలము నుంచీ భారతీయులు మొక్కలనీ వృక్షాలనీ పవిత్ర భావన తో పూజిస్తున్నారు.  ఆయా ప్రదేశము లందలి వృక్ష, జంతు స్థావరాలన్నింటినీ పవిత్ర భావనతో గౌరవిస్తున్నారు.  ఇది ఒక మూఢ ఆచారము లేక అనాగరిక చర్య కాదు.  ఇది భారత సంస్కృతి యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని మరియు మంచి సంస్కారాన్ని తెలియ పరుస్తున్నది.  పురాతన భారతీయులు ప్రకృతి మాతను పూజించారు.  ఆధునిక మానవుడు ప్రకృతిని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

మనము మొక్కలనీ, వృక్షాలనీ ఎందుకు పవిత్రంగా భావిస్తాము?మనలో జీవ శక్తి గా ఉన్న భగవంతుడే మొక్కలు, జంతువులు మొదలైన అన్ని ప్రాణులలోను వ్యాపించి ఉన్నాడు.  అందువలననే మొక్కలైనప్పటికీ, జంతువులైనప్పటికీ వాటి నన్నింటినీ పవిత్రమైనవి గా పరిగణిస్తాము.  ఈ భూమి మీద మానవుడి జీవితము మొక్కలపై మరియు వృక్షాలపై ఆధారపడి ఉంది.  అవి మన మనుగడకు అవసరమైన ఆహారము, ప్రాణ వాయువు, వస్త్రాలు, వసతి, ఔషధాలు మొదలైన ప్రాణాధార వనరులను అందిస్తున్నాయి.   మన పరిసరాలకు సుందరత్వాన్ని కలిగిస్తున్నాయి.   ఏమీ ఆశించకుండా మానవుడికి సేవచేస్తూ మనము జీవించడానికి వాటి జీవితాల్ని అర్పిస్తున్నాయి.  త్యాగానికి ఉదాహరణగా నిలబడి ఉన్నాయి.  ఫలభరితమైన చెట్టు పైకి రాయి విసిరితే ఆ చెట్టు బదులుగా ఫలాన్ని ఇస్తున్నది.

నిజానికి భూమి మీద మానవుడికన్నా ముందే వృక్ష జంతు సమూహాలు నివసించేయి.  ప్రస్తుతము వాటి పట్ల మానవుని కఠిన వైఖరి వలన వన్య ప్రాంతాలు నాశనము చేయడము వలన ఎన్నో రకాల వృక్షజాతిని నశింప చేయడము వలన ప్రపంచము తీవ్రమైన భయాన్దోళనలకు గురి అగుచున్నది.  మనము వేటికి  విలువ ఇస్తామో వాటినే రక్షించుకొంటాము.  అందుకే భారత దేశములో మొక్కలను వృక్షాలను పవిత్రమైనవిగా గౌరవించడము చిన్నప్పట్నుంచే నేర్పబడుతుంది.  అప్పుడే స్వతహాగా వాటిని మనము రక్షించుకొంటాము.

ఏ కారణముచేతనైనా ఒక చెట్టును నరుక వలసివస్తే పది చెట్లను నాటాలని భారతీయ పవిత్ర గ్రంధాలు చెప్తున్నాయి.  మనకు ఆహారము, వంటచెరకు వసతి మొదలైన వాటికి అవసరమైనంత వరకు మాత్రమే మొక్కల వృక్షాల భాగాలను వాడుకోవాలని చెప్పబడింది.  అంతే కాకుండా చెట్టును నరికిన పాపము రాకుండా ఉండాలంటే ఒక మొక్కను లేక చెట్టును కోయబోయే ముందు క్షమాపణ అడగవలసిందిగా కూడా చెప్పబడుతున్నది.  మొక్కలు, వృక్షాలు చేసే త్యాగ సేవల గురించి మరియు వాటిని పోషించవలసిన మన బాధ్యత గురించిన కథలు చిన్నతనము నుంచే చెప్ప బడతాయి.  అద్భుతమైన ప్రయోజనకర గుణాలు కల్గిన తులసి, రావి మొదలైన మొక్కలు, వృక్షాలు నేటికీ పూజింప బడుతున్నాయి.

దేవతలు మొక్కలు మరియు వృక్షాల రూపములో ఉన్నారనే నమ్మకము వలన అనేకులు వారి కోరికలను తీర్చుకొనుటకు మరియు భగవంతుడిని సంతోష పరచుటకు వాటిని పూజిస్తారు.
(తరువాత శీర్షిక - ఉపవాసం ఎందుకు చేయాలి?)

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP