నమశ్శివాయ గేయామృతము
>> Friday, February 20, 2009
పరమశివుడు పరమదయాళువు . స్తుతిస్తే ఆయన సులభంగావశమయ్యే భక్తవశంకరుడు. ఆ యనను స్తుతించే సాహిత్యము కోకొల్లలు.అందునా మనతెలుగులో ఆయనను పొగిడే పాటలలో నమశ్శివగేయామృతము మనసును పరవశింపజేసే భాషతోను ,భావముతోను నిండి ఆబోళాశంకరుని మనసు కరగజేస్తుంది. ఆ దివ్య నామాల గానామృతాన్ని మీతో పంచుకోవాలనే ఈప్రయత్నము.రండి కలసి గానము చేద్దాము మనసార .
ఓంనమశ్శివాయ నమశ్శివాయ ,నమశ్శివాయ ఓం నమశ్శివాయ.
౧ నమశ్శివాయని నామనమందున నభినుతిజేసెద ననుకడతేర్చు మా //ఓం నమశ్శివాయ//
౨ నమశ్శివాయను మంత్రము నానా,నరకములను తెగదృంచునయా //ఓం నమశ్శివాయ//
౩ అతిదీనులమై అనుదినమును నిను,మదిలోదలతుముబ్రోవుమయా //ఓం నమ //
౪ పతితపావన పన్నగధారణ,పాలనజేయవె దయామయా // ఓం నమ //
౫ ఎంతని వేడుద పంతమునాపై సుంతయుదయరాదేలనయా //ఓం నమ//
౬ శంభోహరహర మహదేవా నీశరణములేగతియంటినయా //ఓంనమ//
౭ అండాపిండ బ్రహ్మాండములంతట,నిండినజ్యోతివి నీవేనయా //ఓం నమ//
౮ ఆదియు మధ్యయు అంతము తెలియని ఆనందామృత తత్వమయా //ఓం నమ//
౯ ఇంద్రుడాదిగా సకలసురులకును ఇష్టదైవమగు మూర్తివయా //ఓం నమ//
౧౦ ఈశ్వర నామొర నాలకింపవే శాశ్వత గుణగణ సత్యాననా //ఓం నమ//
౧౧ ఉరగవిభూషణ నీదగునామము మరువగ జాలర మానసమున //ఓం నమ//
౧౨ ఋతువులు మాసము లెన్నో గడచెను,వెతలు తీర్చవెటుబోదునయా //ఓమ్ నమ//
౧౩ ఊరడించి నను గావకయుండిన ఓపజాలగతి నీవేనయా //ఓం నమ//
౧౪ఎందుకు నీదయరాదు పరాత్పర ,మందుడనని కడు కోపమా //ఓం నమ//
౧౫ ఏమియుదెలియని దీనులమైతిమి పామరముడిపియు పాలింపవే //ఓం నమ//
౧౬ ఐక్యస్వరూపము దెలిపినజాలుర,ఆనందాంబుధి మునుగుదురా //ఓంనమః//
౧౭ ఒకటిరెండు మూడక్షరములలో ,సకలంబునకును సాక్షివయా //ఓంనమః//
౧౮ ఓంకారాత్మకమయమగు బ్ర్హహ్మము ,నొందెడు మూలము దెలుపుమయా //ఓంనమః//
౧౯ఔరాఏటికి నీదయరాదుర,అంతకఠినమా హరాహరా //ఓంనమః//
౨౦అంతయు నీవైయుండగవేరే,చింతలు నాకిక ఏలనయా //ఓంనమః//
౨౧ ఆలకింపుమిక నాదగుమనవిని,అరమరసేయకాఅదిదేవ //ఓంనమః//
౨౨ అహర్నిశంబునునీదగుమంత్రము,ననుసంధింపగజేయుమయా //ఓంనమః//
౨౩కమలసంభవాద్యమరగణావన కంజలోచనా భవమోచన //ఓంనమః//
౨౪ఖగవాహనప్రియ కరుణాసాగర ,కంతుమదాప హరాహర //ఓంనమః//
౨౫ఘనమౌ నీదగు కీర్తినివినినే,మనమున నమ్మితి బ్రోవుమయా //ఓంనమః//
౨౬జ్ఞాతృ జ్ఞానజ్ఞేయము లొకటై,గాంచిన నీదయ గల్గునయా //ఓంనమః//
౨౭చదువుల లోపల చదువై వెలసిన,సారముగ్రోలిన జాలునయా / /ఓంనమః//
౨౮జననమరణములు బొరయినిపదవికి,సాక్షిమాత్రుడవు నీవేనయా //ఓంనమః//
౨౯ఝమ్మనుప్రణవనాదములోపల ,గ్రమ్మినవెన్నెల కాంతివయా //ఓంనమః//
౩౦ టక్కరి జగమున మాయకు లోబడి,చిక్కితి నిన్నెటుగాంతునయా //ఓంనమః//
౩౧డబ్బుకొరకు నిను చేరలేదయా ,మబ్బుదొలంగెడు మార్గమేదయా //ఓంనమః//
౩౨ ఢంకాది మహానాదానందా,సంకటముల తొలగింపుమయా //ఓంనమః//
౩౩ తలచితలచి వేసారితి నీదయ,కలుగదాయె నిక నేమిసేతు //ఓంనమః//
౩౪ తారక యోగము దారినెరింగిన ధన్యులు నీదయగాంతురయా //ఓంనమః//
౩౫ దరిజేరుట ఇక ఎన్నడుతండ్రీ,తాపమయనిక తాళజాల //ఓంనమః//
౩౬ దారుణమగు నీసంసారాంబుధి,తీరము జేరగ జాలనయా //ఓంనమః//
౩౭ దుఃఖముదొలగెడు మార్గము నామది,తోపగజేయర దురితహరా //ఓంనమః//
౩౮ దండము దండము నీపాదములకు ,భండనభీమా భవహరహర //ఓంనమః//
౪౦ నరకస్వర్గము లాదిద్వంద్వముల,బొరయని తత్వమెస్థిరమయ్యా //ఓంనమః//
౪౧ నానారూపములందియు దేనిని,నంటకవెలిగెద నద్భుతముగ //ఓంనమః//
౪౨ నిజముగ నినుమది నెరిగినదాసులు,నిఖిలమెరింగినవారయ్యా //ఓంనమః//
౪౩ నీవేకర్తవు నీవేభర్తవు,నీవేహర్తవు నీవేనయా //ఓంనమః//
౪౪ నీవే యజుడవు,నీవే విష్ణువు నీవేహరుడవు నిరుపమగుణ //ఓంనమః//
౪౫ నీకంటే పరదైవము లేదుర ,నిన్నేగొలచెద నిర్ధ్వంద్వా //ఓంనమః//
౪౬ నేను నీవెవడు ద్వైతము తొలగిన ,నీవే నేనైయుందునయా //ఓంనమః//
౪౭ నీవే నేనై నెగడిన తదుపరి ,నేమియుతెలుపగ జాలనయా //ఓంనమః//
౪౮ అన్ని మతంబుల కాదిమూలమిది ,కన్న జన్మమిక సున్నయ్యా //ఓంనమః//
౪౯ ఆనందము దివ్యానందము బ్రహ్మనందముపరమానందము //ఓంనమః//
౫౦ పలుమరుమది నినుగొలచెడు ఘనులకు కలిగెడుభాగ్యమి దేనయా //ఓంనమః//
[ మిగతాది రేపు ]
3 వ్యాఖ్యలు:
నమస్తే,
చక్కటి సంకీర్తనను ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ సంకీర్తన mp3 ఉంటే దయచేసి ప్రచురించగలరు.
మూర్తి
its very good we are trying for mp3
Could you please post the remaining part and if possible mp3 also
Thank you...
Post a Comment