శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label ప్రవచనములు. Show all posts
Showing posts with label ప్రవచనములు. Show all posts

ఆకాశదీపం సర్వపాపహరణం

>> Monday, November 17, 2014

ఆకాశదీపం సర్వపాపహరణం
ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం.

నేనేమి చేయగలను?
ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే ఫలే ఏ నివసంతి
జీవా దృష్టా్య ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః
ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.

దీప త్రయంబకుడు:
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెబుతున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ, కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేకొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు.

కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.
నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్టా్వ ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థత పూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.అందుకే కార్తీక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read more...

పాదధూళి విలువ

>> Friday, October 25, 2013




''భాగ్యవశాత్తు భీమారథినదిలో గోణాయికి నామదేవుడు లభించాడు. అట్లే శ్రీసాయిబాబా పదునాదేండ్ల తరుణ వయస్సులో మొదట షిరిడీ గ్రామంలోని వేపచెట్టు క్రింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు" అని వ్రాశారు శ్రీహేమాద్‌పంత్‌. ఆ ఇరువురి జన్మచరిత్రలు ఎవరికీ తెలియవు.
సాయిబాబా వలె నామదేవుడు భక్తిమార్గాన్ని ప్రోత్సహించాడు. సాయివలె నామదేవుడు పేదరికాన్ని వరించాడు కావాలని. 
పరశువేది
నామదేవుని ఇంటి సమీపంలో పరిస్సాభగవత్‌ అనేవాడుండేవాడు. భగవత్‌రఖుూబాయిని ప్రార్థించి ఇనుమును బంగారంగా మార్చే పరశువేదిని సంపాదించాడు. భగవత్‌ భార్య నామదేవుని దారిద్య్రాన్ని చూచి, ఆ పరశువేదిని నామదేవ్‌ భార్యకు ఇచ్చి, ఇనుమును బంగారంగా మార్చుకొనుమని, తిరిగి పరశువేదిని ఇచ్చివేయాలని చెప్పింది. నామదేవునకు ఈ సంగతి తెలిసి చంద్రభాగా నదిలోనికి దానిని విసిరాడు. భగవత్‌ ఆతని భార్య ఆ పరశువేదిని తిరిగి ఇమ్మన్నారు. నామదేవ్‌ ''అయ్యా భగవత్‌! నీకు ఆ రాతిమీద అంత మక్కువ ఉంటే నదిలో మునిగితెస్తాను"అని మునిగి కొన్ని వందల రాళ్లను తెచ్చి ''ఇందులో నీ రాయి ఏదో గుర్తించు అన్నాడు. ప్రతిరాతిని లోహానికి తాకించగా, లోహం బంగారంగా మారసాగింది. అందరూ ఆశ్చర్యపోయారు. భౌతిక సుఖాల కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని భగవత్‌ గుర్తించాడు. నామదేవ్‌ కాళ్లపై పడ్డాడు. ''నీ చేతిని నా శిరస్సుపై ఉంచు. ఇక దేనినీ కోరను" అన్నాడు భగవత్‌. మహారాజులను చేయగలిగిన శక్తులు ఉన్నా బీదరికంలోనే బ్రతకటం సాయికి, నామదేవునికి ఇష్టం.
మంచి స్నేహితుడు
నామదేవుడు మహాభక్తుడు. అంతకు మించి జ్ఞాని పాండురంగని అనుమతితో జ్ఞానేశ్వరునితో తీర్థయాత్రలు చేసిన మహనీయుడు. ఆ సమయంలో వారి స్నేహం గాఢమయింది. జ్ఞానేశ్వరుడు శరీరాన్ని విడిచిపెడదామనుకున్నాడు. నామదేవుడు ఇతరులతో అలంది గ్రామానికి బయలుదేరాడు జ్ఞానేశ్వరుడు.
జ్ఞానదేవుని చివరి దినాలను నామదేవ్‌ తన అభంగాలలో వ్రాశాడు. తన వియోగానికి దుఃఖించవద్దని, పాండురంగని సేవలో తరింపుమని జ్ఞానదేవుడు నామదేవునితో పలికాడు. అయినా నామదేవుని దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ''నా గుండె ఎండిన కాసారంలా ఉంది. ఒట్టి శూన్యం నన్ను ఆవరించింది. జ్ఞానదేవుని తత్వజ్ఞానం, అతని బుద్ధి వైభవం, అఖండభక్తి భావన నన్ను కష్టాల కడలి నుండి గట్టెక్కించింది. ఆ చిరునవు్వ ఒక నేను చూడలేనా?" అని పరితపించాడు నామదేవుడు.
''ఓ నామదేవ్‌! నేనూ ఈశ్వరుడినే. మా ఇద్దరిని విడిగా చూడకు. నేను నీ చెంతనే ఉంటాను అన్న విఠలుని వాణి వినబడింది. అయినా వామదేవుని దుఃఖాన్ని ఎవరు తీర్చ గలరు? విఠలుడు దేవతలతో పరివేష్ఠింపబడి ఉన్న జ్ఞానేశ్వరుని చూపించాడు. అప్పుడు నామదేవుడు శాంతించాడు. 50సంవత్సరాలు జ్ఞానేశ్వరుడు బోధించిన మార్గంలో నడిచాడు నామదేవుడు. అంతటి స్నేహబంధం ఆ ఇద్దరిది.
పండరీపురంలో నామదేవుని ఇంటిని ఇప్పటికి చూడవచ్చు. పాండురంగని ఆలయం వద్ద ఇతని సమాధి ఉన్నది. భగవద్భక్తుల పాదధూళిని ధరించాలని భావించటం వలన అలా సమాధి ఏర్పాటయింది.
నామదేవుడు ''ప్రపంచ దీప్తిఅని జ్ఞానేశ్వరుడే కొనియాడాడు.      - యం.పి. సాయినాథ్‌

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

>> Sunday, May 5, 2013

33. కులము, శాఖ, ఛాత్రుడు, చరణము

మనం సాధారణంగా వాని కులగోత్రాలను విచారించాలి అని అంటూ ఉంటాము. ఒక ఋషి వంశము నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఋషి గోత్రమునకు చెందిన వారవుతారు. ఇట్లు ఒక గోత్రము నందు పుట్టి పరస్పర సంబంధములున్న వారు కులము. ఇట్టి కులముల నుంచే పూర్వము విద్యాశాలలు ఏర్పడినవి. ఆ రోజులలో వాటిని గురుకులములని కాక, ఋషికులములని వ్యవహరించేవారు. గురుకులమని చెప్పినప్పుడు గురుశిష్యుల మధ్య రక్తసంబంధము లేదు. పురాతన విద్యాశాలలో గురుశిష్యుల మధ్య బాంధవ్యం ఉండేది. సాధారణంగా తండ్రియే గురువుగా ఉండేవాడు. ఋషికులములలో తమ పితరులలోని ఋషికి సంవేద్యమైన విద్యను ప్రచారం చేసేవారు.

తరువాత కాలములో ఋషికులములు పరస్పర మంత్రములను, విద్యలను ఒకరికొకరు మార్చుకొనేవారు. ఇట్లు అనేక ఋషులు అనుగ్రహించిన మంత్ర సముదాయములను ఏకసంఘముగా అధ్యయనము చేయడం వలన శాఖలు ఏర్పడినవి. చారిత్రకముగా ఋషికులముల తర్వాత విద్యాశాలలు వచ్చినవి. వానికి గురుకులములతో సంబంధముండేది. ఈ విద్యాశాలలు ఒక శాఖకు ఏర్పడినవి. విద్యను అధ్యయన, అధ్యాపనలు చేసేవి. అందువల్ల విద్యార్ధులు పరస్పరము రక్తసంబంధాలకు అతీతమైన శాఖాసంబంధము కలవారైనారు. తర్వాత గురుకులములు విస్తరించి ఒక వేదమునకు సంబంధించిన శాఖలే కాక, అన్ని వేదములూ వేదాంగములూ చెప్పడం ప్రారంభించినవి.


పాణిని వ్యాకరణం శిష్యుణ్ణి ఛాత్రుడని చెబుతున్నది. ఛత్రమంటే గొడుగు. ఎండావానల నుండి గొడుగు ఎట్లా కాపాడుతుందో గురువు ఛాత్రుణ్ణి దుస్సాంగత్యము నుండి కాపాడి రక్షిస్తున్నాడు. ఈ ఛాత్రపదం గురువు గొప్పదనాన్ని, అతనికి శిష్యునియందు ఉండే ప్రేమను తెలుపుతుంది. చదువులు ఒక్క జ్ఞానం కోసమే కాదు, శీలరక్షణకు కూడా.


పాణినిలో చరణమనే పదాన్ని చేస్తాం. చరణమంటే పాదం. పరమపదమంటే మహోన్నత స్థానం. పదము దేహరక్షణా, జీవరక్షణా చేస్తున్నది. ఈ అర్ధంలోనే గురుకులాన్ని చరణమన్నారు.


అధ్యాపకుడు వేదాలను వల్లె వేసి శిష్యులకు ఘనాంతం బోధిస్తే శ్రోత్రియుడౌతాడు. వేదమంత్రము తెలుసుకొనుటతోబాటు వాని అర్ధము, విశిష్టత గూర్చి ప్రవచనము చేయగలిగిన వాడు ప్రవక్త. ఒకే గురుకులంలో చదువుకొనేవారు సతీర్థులూ, సబ్రహ్మచారులూ. ఉత్తరభారతంలో గురుభాయీలు అన్న పదప్రయోగం ఉన్నది.

34. గురుదక్షిణ

విద్యాభ్యాసానంతరము శిష్యుడు గురువుకి ఇవ్వవలసిన గురుదక్షిణ గూర్చి మనువు చెప్తున్నాడు. గురుదక్షిణ శిష్యుని తాహతుకు తగ్గట్లు ఇవ్వవలెను. గోవులు, భూమి, స్వర్ణము, వస్త్రములు, ధాన్యము, కూరగాయలు, ఛత్రములు, పాదుకలు ఇవి ఏవైననూ సరే జీవనోపాధికోసం ఆర్జించు అధ్యాపకుడు శ్రాద్ధక్రియలకు అనర్హుడు. అతని శిష్యుడూ అనర్హుడే. జీవనోపాయాన్ని ఉద్దేశించి వేతనము గ్రహించి బోధన చేసేవాడిని ఉపాధ్యాయుడని మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది.

విద్యావ్యాప్తితో రక్తసంబంధమున్న కులములు అంతటితో ఆగక పెద్ద గురుకులములుగా మారినవి. ఈ గురుకులములు వేదవేదాంగములను అర్హులైన వారికి బోధించేఇ. క్షత్రియులు, వైశ్యులు ఈ గురుకులములకు విద్యార్థులై వచ్చేవారు.

కాలక్రమేణ విద్య అనే పదం ఒక ఆధ్యాత్మిక విద్యకేగాక ఇతర విద్యలకూ (అనగా నేటి కళలు, శాస్త్రవిజ్ఞానము) సూచకమై వానినీ గురుకులములలో బోధించసాగిరి. ఛాందోగ్యోపనిషత్తులో అట్టి కళలు, విజ్ఞానమునకు సుదీర్ఘమైన సూచిక ఒవ్వబడినది. ఆ సూచిక నిజముగా విస్మయజనకంగా ఉంటుంది. కొన్ని వేల ఏండ్ల క్రితం వానిని గురుకులములలో నేర్పేవారు.

అట్టి విద్యలలో కుశలుడైనప్పటికీ, నారదడు అభ్యాసము లేని కారణమున ఆత్మజ్ఞానము లేకపోయెనే అని విషాదగ్రస్థుడయ్యాడు. నారదుడు తాను నేర్చిన విద్యలను సనత్కుమారునికి ఈ విధంగా చెబుతున్నాడు. అవి నాలుగు వేదములు, ఇతిహాసము, పురాణములు. వీనిని నారదుడు పంచమవేదమని చెబుతున్నాడు. నారదుడు మహామేధావి. అందుకే ఆయన ఎన్నో విద్యలను నేర్వగలిగినాడు. అంత నేర్చినా ఆత్మానంద స్థితిని చేరుకోలేకపోయానని తెలుసుకొనే వివేక వినయములు కలిగినవాడు నారదుడు. అందుకే ఆత్మ విద్యోపదేశము కొఱకై సనత్కుమారుని ఆశ్రయించారు నారదుడు. విద్య యొక్క ప్రయోజనం ఈశ్వరతత్త్వము ఎరుగుటయే అని దీనిని బట్టి తెలుస్తోంది.

ఇట్లు విద్యలధికమైనందున గురుకులములు వ్యాపించి ఉపాధ్యాయుల సహాయంతో వివిధ కళలను విద్యార్ధులకు బోధించేవారు. ఇట్టి గురుకులవాసములను ఆదర్శముగా ఉంచుకొనియే రవీంద్రనాథఠాగూర్ తన శాంతినికేతనాన్ని స్థాపించారు.

నారదుడికి ఏర్పడిన కొరత ఆనాటి విద్యార్ధులకందరికీ ఏర్పడి ఉండదు. ఆనాటి విద్య ఈశ్వర సంబంధమూ, ఆత్మ సంబంధమై ఉన్ననూ ఒక సామాన్య విద్యార్ధిని విద్యాభ్యాసకాలమున ఏకధాటిలో అతనికి ఆగమ్యమైన జ్ఞానమార్గమునకు ఆ కాలపు ఆచార్యులు బలవంతపరిచి ఉండరు. విద్యార్ధులకు బ్రహ్మ విద్య చెప్పబడినప్పటికీ వెంటనే వారికి అనుభవము కలుగవలెనన్న నిర్బంధము లేకుండెడిది. విద్యాభ్యాసము పూర్తి అయిన వెంటనే పెళ్ళి చేసుకుని సంతాన ప్రాప్తి, వైదిక కర్మానుష్టానములచే చిత్తపరిపాకమును పొంది సన్యాసము పుచ్చుకొని ఆత్మ విచారము చేయవలెననుటయే వేదవిహిత మార్గము.

---------------------------------------------------------------------------------------------

 

35. ధర్మము బ్రహ్మము

ఈ లోకములో నియమ జీవనమునకు ఏర్పడినది ధర్మము. బ్రహ్మం పారలౌకికము. ధర్మ మార్గములో ధార్మిక కర్మల మూలముగా ఒక సామాన్య జీవుడు బ్రహ్మ విచారం చేయగలడు. ధర్మమేమిటి అని విచారించి తెలుసుకొని, అనుష్టించుటకే పూర్వమీమాంస పరమైన కర్మమార్గ శాస్త్రమూ, బ్రహ్మమును గూర్చి విచారించి తెలుసుకొని అనుభవించుటకు ఉత్తరమీమాంసపరమైన వేదాంతమూ ఉన్నవి. ఆ కాలపు విద్యాస్థానములలో వేదాంతము ఎక్కువగా చెప్పినా, విద్యార్ధులకు ఏదో ఒకదానిలో అభిరుచి
కలిగించడం తప్ప, వారు వెంటనే వేదాంత లక్ష్యమునకు పాటుపడతారని కాదు. విద్యార్ధి గృహస్థుడు కాగానే ధర్మశాస్త్రానుసారం గార్హస్థ్య జీవనం గడిపేవాడు. ఇట్లా గృహజీవనం గడుపుతూ పక్వమయ్యేసరికి, అతడు ఆత్మశాస్త్రాన్ని అభ్యసించేవాడు. నారదుడు అసామాన్యుడు, అందుచేతనే ఆయన విద్య పూర్తి కాగానే, బ్రహ్మాన్వేషణ చేస్తూ సనత్కుమారుని ఆశ్రయించారు. ఆయన గృహస్థ జీవనం అవలంబించలేదు.

ఆనాటి విద్యావిధానం ప్రకారం సామాన్య జీవుడు ధార్మిక మార్గములో కర్మ చేస్తూ చిత్తశుద్ధి కలిగిన పిదప ఆత్మాన్వేషణా తత్పరుడయ్యేవాడు.


32. వైదికమే అన్ని విద్యలూ
ఒక ముఖ్య విషయం చెప్పాలి. పూర్వకాలంలో అన్ని విద్యలూ వైదిక విద్యలే. కళగానీ, విజ్ఞానంగానీ అన్నీ వేద సంబంధమైనవి. ఒక్కొక్కటి పదునాలుగు వేదవిద్యలకు సంబంధించినవి. వాని ప్రయోజనం వైదిక మార్గపరమైన జీవనమే. కొందరు వేదవిభాగములన్నిటినీ అంగీకరించక పూర్వమీమాంసా తత్పరులుగానే ఉండేవారు. వేదములను పూర్తిగా నిషేధించిన చార్వాకులూ ఆ కాలంలో ఉన్నారు. మరికొందరు వేదములను నిషేధించనూలేదు, ఒప్పుకోనూలేదు. వారు సాంఖ్యము, యోగము పాటించేవారు. వీనినీ వేదములతో పాటు నేర్పేవారు. తర్వాత వచ్చినది బౌద్ధము. అది అవైదికము. వేదప్రమాణమును బుద్ధుడు ఒప్పుకోలేదు. బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆ విద్యాస్థానాలలో కూడా పదునాలుగు వేదవిద్యలను నేర్పేవారు.


(సశేషం ......)


సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.


Read more...

దివ్యత్వానికి నాంది

>> Saturday, April 13, 2013




కొంత నిర్దిష్టమైన కాలాన్ని, శక్తినే మనం 'జీవం' అంటాం. శక్తి వేరే విషయమైనా కాలమనేది మాత్రం మన ప్రమేయం లేకనే గడిచిపోతుంది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే ఒక నెల. సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరిగితే ఒక సంవత్సరం. ఈ సూర్యునితో, చంద్రునితో ఈ భూమి ఉన్న స్థానాన్ని బట్టి అది మన వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్యచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ భూమి ముఖ్యంగా సూర్యుని శక్తి వల్లే నడుస్తున్నది. మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే. సూర్యుని శక్తి ఎంత గ్రహించగలవన్న దానిని బట్టే నీకెంత శక్తి ఉన్నదో అనేది. అందువల్ల సూర్యుని చుట్టూ భూ పరిభ్రమణం కాలాన్నే కాక, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశములైన కాలమూ, శక్తి అనేవి రెండూ సూర్యుని వల్ల నిర్దేశింపబడినవి. అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యంత మహత్వపూర్వమైనది.

కాని, సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరించకపోయినా, చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉండడం వల్ల మనపై దాని ప్రభావం కూడా ఎక్కువే. మన పుట్టుకే చంద్రుని గతిపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గతికీ పూర్తి సంబంధం ఉన్నది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణపరమైనది కాదు, అది అయస్కాంతపరమైనది. ఈరోజు విద్యుత్తు దేనినో తిప్పడం, తిరగడం మూలంగానే తయారవుతున్నది-వేరే మార్గంలేదు.

అదే విధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణల ద్వారా శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నది. అందువల్ల భౌతికంగా బయట నుంచి జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే సూర్యునిపరంగా ఆలోచించాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రునిపరంగా ఆలోచించాలి. మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే చాంద్రమానాన్ని లేక సౌర చాంద్రమానాన్ని అనుసరించాలి.

భారతీయ స్కృంతీపరంగా దీనిని పంచాంగం అంటారు. మనకు భౌతిక, అంతర్గత శ్రేయస్సులు రెండింటిపైనా ఆసక్తి ఉంది కాబట్టి మన పంచాంగం సౌరచాంద్రమాన పరమైనది. అది చంద్రుని చలనాన్ని, సూర్యుని చుట్టూ భూమి చలనాన్ని, స్థితిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ విధంగా క్యాలెండర్ తయారు చేసుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు అటువంటిదొకటి ఉందని కూడా ఈకాలంలో చాలామందికి తెలియదు.

ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్లలో ఇది ఒకటి. ఈ క్యాలెండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ఉగాది భారతీయ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం. ఇప్పుడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఎందుకంటే వాటి పెరుదలకే అవసరమైన కిరణజన్య సంయోగ క్రియ ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కాని భూమిపై ఉండవలసిన వాటినన్నిటినీ నాశనం చేశాము కాబట్టి వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలమైంది. అసలు వేసవి అంటే ఎడారులలోనే అసౌకర్యంగా ఉండాలి. భూమి మీద జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉత్సాహంగా జరగవలసిన సమయమిది. ఎఱుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది.

పాత, కొత్త ఏదీ లేదు
ఈ అనంత విశ్వంలో, పాత సంవత్సరం కొత్త సంవత్సరం అంటూ ఏమీ లేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితాన్ని లెక్కించుకోవానికి ఏర్పర్చుకున్నవి. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే మానవునిగా పురోగమించామా లేదా గమనించాలి. మీ వ్యాపారం వృద్ధి చెంది ఉండవచ్చు. బాగా సంపాదించి ఉండవచ్చు. అది కాదు అసలు విషయం.

మానవునిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానన్నా మెరుగయ్యామా? వచ్చే సంవత్సరం ఇప్పటికన్నా మెరుగయ్యామా తెలుపడానికి ఒక చిహ్నం కావాలి. అన్నిటికన్నా మీరు మెరుగైన మానవులు కావాలి-ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా- అన్ని రకాలుగా ఉత్తమమైన మానవునిగా కావాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆ విధంగా అడుగులు వేస్తే మీలో మానవత్వం పొంగి పొర్లి దివ్యత్వం సంభవిస్తుంది. నా ఆశీస్సులు.

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-8

>> Thursday, March 21, 2013

31. భాష శబ్దనియమానికే

ఒక విషయం ఇతరులకు చెప్పుటకు భాష ముఖ్యమైన ఉపకరణం. ఋగ్వేదం మనకు ఆదిగ్రంధం. అందులో భాషారూపములు నిర్ణయించే వ్యాకరణము ఎంత చక్కగా నిర్ధారింపబడినదో చూసి పాశ్చాత్యులు ఆశ్చర్యచకితులౌతున్నారు. వ్యాకరణ విధులు మాత్రమే కాక మంత్ర స్వరూపములను కూడా విద్యార్ధులు నేర్చుకునేవారు. ఒక్కొక్క అక్షరమునీ ఎట్లు ఉదాత్త అనుదాత్తస్వరములలో పలుకవలెనో చెప్పించేవారు. మంత్రములు ఋషులకు ఏ విధముగా అనుగ్రహింపబడినవో అదే విధముగా స్వరశుద్ధముగా శిష్యులకు నేర్పించేవారు. ఎన్నో యుగముల తర్వాత కూడా ఆ స్వరశుద్ధి నేటికీ ఉంటూ, అదేవిధంగా వేదాధ్యయనము ఈ రోజు వరకూ ఈ దేశంలో చేయబడుట అత్యంత ముదావహము.

32. లిపిలేని బోధ
వ్రాత లేకుండా చదువు. ఈ కాలపు బళ్ళలో ఉండే బ్లాక్ బోర్డులూ, చాక్ పీసులూ, పలకలూ, బలపాలూ, పెన్సిల్, పెన్, నోటు బుక్కులు, ఆ కాలంలో లేవు. విద్యారంభ సమయంలో అక్షరాభ్యాసం చేస్తున్నాము. రెండువేల యేళ్ళ క్రితం ఉన్న అవ్వైయార్, వళ్ళువరూ, వ్రాత చదువులో ముఖ్యాంగమనీ సంఖ్యలూ, అక్షరములూ విద్యకు రెండు కళ్ళు అనీ చెప్పారు. వేదకాలంలోనూ, తర్వాత కొన్ని శతాబ్దాల కాలమూ, చదువు వాఙ్మూలకముగానే జరిగేది. విద్యార్ధి చెవులతో విని నోటితో చెప్పేవాడు. వేదమంత్రములు శృతులు. అవి విని నేర్చుకొనేవి. వానిని వ్రాయరాదు. ఆ దివ్యనాదం లోకంలో ప్రతిశబ్ధించి లోకక్షేమాన్ని ప్రసాదించాలి.

ఈ వేదరక్షణకు ఒక వర్గం నిర్దేశింపబడినది. వారు ఏ వృత్తులనూ అవలంబించరాదు. అప్పుడప్పుడూ చదివితే మంత్రములు మనస్సులో పూర్తిగా వ్యాపించక పైపైన ఉంటూ పూర్ణ ప్రయోజనము ఇవ్వలేకపోతాయి. మంత్రోఛ్చాటన చేసేటప్పుడు ఆ శబ్దం ప్రాణశక్తితో మేళవిస్తేనే మంత్రం ఫలవంతమవుతుంది. పుస్తకాలలో వేదాలుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూసుకొనవచ్చును కదా అనే అజాగ్రత్త, అవజ్ఞా ఏర్పడుతుంది. మంత్రములు ఆంతరంగిక సత్యములు అనడానికి వీలులేకపోతుంది. ఈ కారణం చేతనే పూర్వం వేదాలు పుస్తకాలకెక్కలేదు. వినికిడితోనే వాళ్ళు వేదాలు నేర్చుకున్నారు.

విద్యార్ధికి ఉండవలసినది ఒక్క తెలివే కాదు, శీలసంపద కూడా. అపుడే అతడు మంత్రచైతన్యాన్ని అనుభవంలోకి తీసుకొని పోగలడు. జీవితం శుద్ధంగా ఉంటేగానీ జ్ఞానానుభవం కలుగదు. అందులకే విద్యార్ధులకు బ్రహ్మచర్యం వ్రతంగా ఉన్నది. విద్యాభ్యాసమే ఒక వ్రతం. అది దీక్షతో ఆరంభమవుతుంది.

పుట్టేటప్పుడు బ్రాహ్మణుడూ శూద్రుడే. ఉపనయనకాలంలో ద్విజుడౌతున్నాడు. విద్యాభ్యాసంతో విప్రుడౌతున్నాడు. ఈ మూడిటితో అతడు శ్రోత్రియుడౌతున్నాడు అని శాస్త్రం చెబుతున్నది.

బ్రహ్మమనే వేదములలో మగ్నుడై, బ్రహ్మపదనాచ్యుడైన పరమాత్మజ్ఞానంలో నిష్ఠుడైతే బ్రాహ్మణుడౌతాడు. మన దేశంలోని చదువులు ఒట్టి జీవనోపాధికి మాత్రం నిర్దేశించినవి కావు. చదువు ఆత్మజ్ఞానానికీ జననమరణరూప సంసారతారణకూ ఏర్పడినది. గురువు మంత్రాన్ని ఒకమారు చెప్పి శిష్యులను ఐదుమార్లు చెప్పమనేవారు. గురువు ఒక్కమారు చెప్పగా శిష్యుడు దానిని మరల చెప్పగలిగితే అతడు ఏకసంథాగ్రాహి.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-7

>> Tuesday, March 19, 2013


Inline image 1

27. లౌకిక విద్యలోనూ ఉత్తమ ఆచార్యులు

పైన చెప్పబడిన లక్షణాలు ఒక వైదిక ఆచార్యునికే కాక, లౌకిక విద్యలను నేర్పే ఆచార్యుల జీవితంలోనూ ఉండేది. విశేష శాస్త్రజ్ఞత, అత్యుత్తమ శీలసంపదా ఆ లౌకిక ఆచార్యులకు ఉండేవి. వారికి ఆత్మానుభవం లేకపోవచ్చును. ఉత్తమ మానవులకు ఉండవలసిన గుణసంపత్తి విస్తారంగా వారిలో ఉండేవి. కొందరికి కొంచెం కోపస్వభావమూ, కొంచెం పక్షపాతమూ ఉన్నా శిష్యులు వారిని విద్యాప్రాప్తి కొరకు వెన్నంటేవారు.

నాట్యాన్ని నేర్పేవారిని నాట్యాచార్యులనేవారు. వారికి విద్వత్తు మాత్రమేకాక సౌశీల్యము ఉండేది. సంగీతంలో సింహంవంటీ వాడు ఉస్తాద్ తాన్ సేన్. అక్బరు ఆస్థానంలో గాయకుడు. అతని గురువు హరిదాసస్వామి - ఋషితుల్యుడు.


దక్షిణదేశంలో తిరువైయార్ లో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన పేరు మహావైద్యనాథశివన్. ఆయన గొప్ప నైష్టికుడు. సంధ్య, శివపూజ ఒక్కరోజు వదలలేదు. ప్రయాణం చేసేటప్పుడు అతని దేవతార్చన పెట్టె సకాలంలో రాకపోతే, ఉపవాసముండేవాడు. కచేరీలు సాయంత్రం మూడు నుంచి ఆరు వరకు చేసేవాడు. సాయం సంధ్య కొఱకు కచేరీల సమయం నియమించుకున్నాడు, సాయంత్రం సంధ్య చేసి తిరిగి 6.30 కి కచేరీ ప్రారంభించేవాడు.

అతని సోదరుడు రామస్వామి, వైద్యనాథన్ యొక్క ఆర్ధిక విషయాలు, కోర్టువిషయాలూ చూసుకునేవాడు. ఆయన విద్వాంసుడు. 63 శైవనాయన్మార్లపై పెరియపురాణీయ కీర్తనలను వ్రాశాడు. తన కుటుంబ విషయాలన్నీ రామస్వామికి అప్పగించి వైద్యనాథశివన్ కచేరీలు, శివపూజ, గాయత్రీ పురశ్చరణలతో గడిపేవాడు.  ఆయన ఒక శిష్య పరంపర కావాలని కోరుకోక పోయినా, ఒక ఇరవై మంది శిష్యులు ఎప్పుడూ ఆయనను పరివేష్టించి ఉండేవారు. వారికి ప్రత్యేకంగా ఈయన పాఠాలు చెప్పలేదు. ఆత్మార్ధం ఆయన పాడుకునే పాటలు విని శిష్యులు ఘనవిద్వాంసులయ్యారు. వీరంతా ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఆయన వీరివద్ద గురుదక్షిణ తీసుకున్నదీ లేదు.


నాట్యశాస్త్రం, గానకళ, ధనుర్వేదం ఇలాంటి శాస్త్రాలను చెప్పేవారిని ఆచార్యులని పిలిచేవారు. ఇక వేదవేదాంతాలను బోధించేవారిని ఏమనాలి? వారిని ఈశ్వరునికి ప్రతినిధిగా శిష్యులు భావించారంటే ఆశ్చర్యమేమిటి??


28. సంఘగతంకాదు వ్యక్తిగతమే
మనదేశంలో విద్య మహోన్నత స్థితిలో ఉండేది అంటే విద్య ఒక వ్యాపారం కాకపోవడం వలనే. విద్య వ్యక్తిగతంగా ఉండేది, దానికి సంఘాలు, స్థాపనలూ లేవు. ఈ విధానం రెండు మూడు శతాబ్దాల క్రితం కూడా ఉండేది. ఈకాలంలో కూడా గురుకులవాసంలాంటి విధానాన్ని ఒకరిద్దరు అవలంబిస్తున్నారు.

బుద్ధుని కాలం నుంచీ నలంద, తక్షశిల విద్యాస్థానాలూ, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఒక్కచోటులో అనేక శాస్త్రములు నేర్పడం అనేది ఎరుగని విషయం. గురుకులవాసాలు వ్యక్తిగతంగా ఉండేవి. వారికి సాహాయ్యకంగా ఒకరిద్దరు ఉపాధ్యాపకులు బహుశా ఉండేవారు.

(సశేషం .....)


సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-6

>> Monday, March 18, 2013

Inline image 1

19. తల్లితండ్రుల గొప్పతనం

ఒక ఆచార్యుడు పదిమంది ఉపాధ్యాయుల కంటే గొప్ప. నూరుగురు ఆచార్యుల కంటే తండ్రి గొప్ప అని మనుస్మృతి చెబుతున్నది. తల్లికి ఇంకా విశిష్ట స్థానము. తల్లి వేయిమంది తండ్రులకన్నా గొప్ప!!

యాజ్ఞవల్క్య మహర్షి కాలంలో ఉపనయనం, తండ్రియైనా సోదరుడైనా చేసేవారు. వీరిద్దరూ లేకపోతే ఇతరులు. లేకపోతే తండ్రీ, సోదరుడూ మృతులైనారు అని కాదు అర్ధం, వీరికి తగిన యోగ్యత లేకపోతే ఉపనయనం ఇతరులు చేసేవారు. తండ్రికానీ, సోదరుడు కానీ వేదములలో ఒక శాఖనైనా అధ్యయనం చేసి ఉండాలి. అధ్యాపనం చేసి ఉండాలి. బ్రాహ్మణునికి అనుచితమైన వృత్తులలో వాళ్ళుండరాదు. ఈ ప్రమాణాన్నిబట్టి ఈ కాలంలో ఏ తండ్రికీ తన పుత్రునికి ఉపనయనం చేసే యోగ్యత లేదు.

కొన్ని స్మృతులలో పెద్దలకూ పూజ్యులకూ, గురువనే అభిదానమున్నట్లు చెప్పబడినది. తండ్రి, తాత, సోదరుడు, తండ్రి తల్లి యొక్క సోదరులు, చెల్లెండ్ర మామగారు, రాజు, విద్యావంతులు, శీలపరులు అయిన బ్రాహ్మణులు, తల్లి, ఆచార్యపత్ని, మేనత్తలు, పిన్నమ్మలు, జ్యేష్టసోదరి - అందరూ గురువులే. ఇంతమందీ గురువులైనా ఆచార్యునికొక విశిష్ట స్థానం, విద్యాదానము చేయుటచేత అతడు పితృ సమానుడు. అతనికి గౌరవం అధికం. గురువుకు సంబంధించినదే గౌరవము.

ధర్మ శాస్త్రములూ, ఆత్మ విద్య చెప్పేవాడు కాదు గురువు. ఏ విద్య చెప్పినా అతడు గురువే అని మనువు అంటున్నాడు.  ఇక సద్విద్య బోధించే గురువు యొక్క మహత్త్వమెట్లు చెప్పుట అని ఆయన ఆశ్చర్యచకితుడౌతున్నాడు.

20. వృద్ధాః శిష్యాః గురుర్యువా

ఆచార్యుడు వయస్సులో చిన్నవాడైనా అతనిని పెద్దవానిగా చూడాలని ధర్మశాస్త్రముల నిర్దేశము. అందుచే అతడు గురువు. మనకంటే చిన్నవారి వద్ద మనం శాస్త్రపఠనం చేయడంలో నిషేధమేమీలేదు. జ్ఞానానికి, ఆత్మోపలబ్ధికి వయసు అడ్డురారాదు. ఇందులకు ఉపష్టంభకముగా మనువు ఒక కథ చెబుతున్నాడు.

అంగీరస మహర్షి పుత్రుడు తన చిన్నాయనలకు ఆచార్యునిగా ఉండేవాడు. విద్యాభ్యాసకాలంలో ఆయన వారిని 'వత్సలారా' అని సంబోధించాడట. పినతండ్రులు కోపగించుకొని దేవతలతో ఫిర్యాదు చేశారు.

దేవతలన్నారటః "మీరు ఫిర్యాదు చేయడం సరికాదు, మీకు విద్య అంటే ఏమో తెలియదు. మీ అన్న కుమారుని వద్ద మీరు విద్యోపదేశం పొందుతున్నారు అమ్టే మీరు పసివారు, అతడు వృద్ధుడు అని అర్ధం. వయసు ముదిరి వెంట్రుకలు తెల్లనైనందున ఒకడు వృద్ధుడు కాడు. వేదవిజ్ఞానం కలవాడే వృద్ధుడు."

చిక్కిశల్యావస్థలో ఉన్న వయోవృద్ధులు, యోగులు దక్షిణామూర్తి స్వామి వద్ద ఆయన మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటే తమ సంశయములను పోగొట్టుకుంటున్నారు.

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుఛ్చిన్నసంశయాః


డబ్బున్న వారికి మనం గౌరవం ఇస్తాం. అత్తలు, మామలు, వదినలు మనకంటే చిన్న వారైనా వారికి వృద్ధులకిచ్చే గౌరవం ఇస్తాము. వయస్సుతో నిమిత్తం లేకుండా యజ్ఞాయాగాదులు చేసిన వారిని పెద్దలని గౌరవిస్తాము. కట్టకడపట విద్వాంసుడు, వయోవృద్ధుడు కాకపోయినా, జ్ఞానవృద్ధుడైనందువలన మనం గౌరవిస్తాము. ఈ కడపట చెప్పిన వానికి అతిశయ గౌరవం ఇవ్వాలని శాస్త్రములు చెబుతున్నవి.

21. తల్లి, తండ్రి, ఆచార్యుడు

ఈ ముగ్గురూ ఈశ్వరాంశములగా మనం గౌరవించాలి. కొన్ని ధర్మశాస్త్రములు తల్లితండ్రులకంటే ఆచార్యునికి ఒక విశిష్ట స్థానం ఏర్పరచినవి. మాతృభక్తిచేత ఇహలోకములోనూ, పితృభక్తి చేత అంతరిక్షముననూ, ఆచార్యభక్తిచేత బ్రహ్మలోకమునూ పొందగలరని మనువు అంటూన్నాడు. వీరియందు నెరిపే భక్తి ఎంత శ్రేష్తమో వీరియందు చేసే అగౌరవము అంత పాపకరము.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

------


Inline image 1
22. అధ్యాపకుడు

ఒక శిష్యుణ్ణి ఆచార్యుడు మూడువిధములుగా దిద్దగలడు. ఒకటి బోధ, రెండవది అనుగ్రహము. మూడవది మంత్రోపదేశము. వేద సంస్కారములు, అనుగ్రహం గురించి శాస్త్రములు ఏమీ చెప్పలేదు. ఒకటి గురువు మంత్రోపదేశము చేసియు, వైదిక సంస్కారముల మూలముగానూ, శిష్యుని శుద్ధి చేసి, పూర్ణవిద్యలనిచ్చుట. రెండవది సంస్కారముల ప్రసక్తి లేక విద్యను మాత్రం బోధించుట.

ఆచార్యుడే సంస్కారములను చేసి విద్యాబోధచేసి వేదాంత తత్పరునిగా చేయుటకూడా కలదు. వీరిరువురూ అధ్యాపకులే. వేతనమును గ్రహించువానిని ఉపాధ్యాయుడని అంటారు.

23.ఉపాధ్యాయుడు

జీవనోపాధికై కాక విద్యాబోధనే లక్ష్యంగా ఉంచుకున్న ఆచార్యుల సంఖ్య తగ్గుతూ రాగా ఉపాధ్యాయులు ఏర్పడ్డారు. ఉత్తర భారత దేశంలో వేదాధ్యాపనం చేసేవారు. తమని ఉపాధ్యాయులమని పిలుచుకోవడం ప్రారంభించారు. అందులో న్యూనత ఉందని వారనుకోలేదు.

బెంగాలులో ఛటర్జీ, బెనర్జీ, ముఖర్జీలు ఉన్నారు, వారిలో కొందరు తమను ముఖోపాధ్యాయులు, చతురోపాధ్యాయులు, వందోపాధ్యాయులు (బందోపాధ్యాయులు) అని వివరముగా వ్యవహరించుకుంటూన్నారు. ముఖమంటే వేదం. వేదాలు ముఖంలోనించే వస్తాయి. ముఖోపాధ్యాయ ముఖర్జీ అయినది. చతురోపాధ్యాయ చతుర్వేదములకు అధ్యాపకుడు. అతడు ఛటర్జీ అయినాడు. రామకృష్ణపరమహంస ఛటోపాధ్యాయ వంశములో పుట్టినవారు. ఆయన భార్య శారదా దేవి ముఖోపాధ్యాయ వంశమునకు చెందినవారు. వంద్యోపాధ్యాయ అంటే వందనీయుడైన్ ఉపాధ్యాయుడు. వంద్య బంద్య గా మారి, బెనర్జీ అయినది. ఈ పదాలకన్నిటికీ గౌరవార్ధకమైన 'జీ' తగిలింపబడినది.

ఉపాధ్యాయులు గౌరవనీయులు. బ్రిటిష్ ప్రభుత్వంలో గొప్ప పండితులకు 'మహామహోపాధ్యాయ' అనే బిరుదు ఉండేవి. వీరికి ఆచార్యుడికి ఉండవలసిన లక్షణములు, గుణములూ ఉండేవి. వారు గురుకులమును నడిపేవారు. కొందరు తమ స్వార్జితాన్ని కూడా ఖర్చు చేసి ఈ గురుకులాలను నడిపేవారు.

24. విద్యాదానమే ఈశ్వరార్చన
ప్రజలు జీవనానికై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు. ఆ వృత్తులు తప్పు అనో, తక్కువ అనో వాళ్ళు అనుకోవడం లేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాలా హీనంగా పరిగణించేవారు. దీనికి కారణం ఆత్మతృప్తికి, ఆనందానికీ చేయవలసిన పనిని ఉదరపోషణార్ధం చేయటం సముచితము కాదని. అంటే వాళ్ళు విద్యాదానం భగవదారాధన కింద లెక్కకట్టేవారు.

శాస్త్రములు ప్రతిఒక్కరూ తమ కులధర్మాన్ని పాటిస్తూ జాతికి విధించిన వృత్తితో ధనార్జన చేయాలని విధించినవి. బ్రాహ్మణుడు చేయవలసిన వృత్తి ఏది? తమిళంలో బ్రాహ్మణులని 'ఆరుతొళిలర్' అని అంటారు. అతడు ఆరు విధాలైన వృత్తిని అవలంబించవచ్చు అని అర్ధం. బ్రాహ్మణుడు షట్కర్మ నిరతుడు. అవి ఏవి? ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం, ఇవికాక ఇతర వృత్తులలో అతడు కుశలత సంపాదించి వానిని ఇతరులకు నేర్పాలి. అంటే బ్రాహ్మణుడు అన్ని వృత్తులను తెలుసుకొని ఉండాలి అని కాదు. తన అధ్యాపక వృత్తికి భంగం లేకుండా, అనుష్టానాలకు నిరోధం కాక నాలుగైదు వృత్తులలో కౌశల్యం సంపాదించి ఇతరులకు వానిని నేర్పాలని భావం. బ్రాహ్మణులు ఈ విధంగా ఉండేవారని ఇతిహాసాలూ, పురాణాలూ చెబుతున్నాయి. బ్రాహ్మణులు, ఆయుర్వేదము, అర్ధశాస్త్రము, నాట్యశాస్త్రము, ధనుర్వేదము మొదలైనవాటిని నేర్చి ఇతరులకు బోధించేవాళ్ళు.

ఆయా జాతులకు తగిన వృత్తిని నేర్పాలే కానీ ఆ వృత్తులను అతడు అవలంబించరాదు. ఆ విద్యను ధనార్జనకు కానీ, జీవనోపాయమునకు కానీ అతడు వినియోగించరాదు. శిష్యులిచ్చే దక్షిణతో అతడు తృప్తి పడాలి. అతని ధ్యేయం అధ్యాపకమే కానీ ఆర్జన కాదు. అతని కులమునకు ఉచితమైన వృత్తి ఇతరులకు విద్యను బోధించుటే. అధీతిబోధారణలు, ఈశ్వరప్రణిధానము బ్రాహ్మణునకు విధించిన కర్మ.

కొందరు దీనిని తెలుసుకోకుండా బ్రాహ్మణులను నిందిస్తారు. అత్మార్ధం, లోకసంగ్రహం కోసం బ్రాహ్మణునికి ఎన్నో విధులు, అనుష్టానాలు, అననుకూలాలూ ఉన్నాయి. కష్టాలు, క్లేశాలు లెక్కచేయక బ్రాహ్మణుడు లోకక్షేమార్ధమే తన కాలాన్ని వినియోగించాలి.

25. ప్రతిగ్రహం

బ్రాహ్మణుడు ఆరు వృత్తులు అవలంబించవచ్చని చెప్పాం. (అంటే పరమాచార్య స్వామి వారి వాక్కు ఈ మాట...). రెండిటిని అధ్యయనం, అధ్యాపనం గురించి మనం చర్చించాము. మిగతా నాలుగు, యజ్ఞం, యాజనం, దానం, ప్రతిగ్రహం. యజ్ఞం ఆత్మార్ధం చేసుకొనేది. యాజనం ఇతరుల కోసం చేసేది. యజ్ఞం, దానంలో రాబడి లేదు. ఖర్చే. యాజమానముల, ప్రతిగ్రహనలో (తీసుకొనుత) రాబడి ఉన్నది. కానీ ఒక ముఖ్య విషయం ఏమిటంటే యాజక, ప్రతిగ్రహాల్లో దాతయొక్క పాపాలు గ్రహీత అనుభవించవలసి వస్తుంది.

దానాలు తీసుకొనే పక్షంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికొక పెద్ద చిట్టా ఉంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం ఉన్నది. బ్రాహ్మణులకు భీతి కలిగించేటందుకు కాదు ఈ విధిని ఏర్పరిచినది. ఈ శాస్త్రములను వ్రాసినదీ బ్రాహ్మణులే. యాజనం కంటే యజ్ఞమే శ్రేష్టం. అది ఆత్మార్ధం చేసేది. దక్షిణకోసం కాదు. కానీ యాజన కూడా అతని విధియే. అందుమూలముగా వచ్చిన దక్షిణను అతను పుణ్యకార్యాలకై వెచ్చించాలి.

కాబట్టి బ్రాహ్మణునికి ఆరు వృత్తులున్నా అందులో ఆదాయానికి ఆస్పదం లేదు. యాజన ప్రతిగ్రహాల్లో వచ్చే ధనం ధర్మకార్యాలకై వినియోగం చేయాలి. అధ్యాపనలో రాబడి ఉన్నా విద్యను దానం చేయాలే కానీ దాని మూలముగా ఆర్జన చేయరాదు. అట్లు చేస్తేనే అది ఈశ్వరార్చన అవుతుంది. ఆచార్యుడు అట్లా దక్షిణ తీసుకున్నా శిష్యుడు తాను చెప్పిన విద్య పూర్తిగా గ్రహించినాడన్న నమ్మకము కలిగిన మీదటనే దక్షిణ తీసుకునే వారు.

జనకుడు యాజ్ఞవల్క్యునికి శిష్యుడు. ఒక్కొక్క ఉపదేశము పూర్తికాగానే జనకుడు గురువునకు దక్షిణలు ఇస్తున్నాడు. దక్షిణ ఇచ్చినప్పుడల్లా, యాజ్ఞవల్క్యుడు దక్షిణను తిరిగి జనకునికే ఇచ్చేసేవాడు. "నా తండ్రి అభిప్రాయం ఏమంటే ఉపదేశం పూర్తిగా ఇచ్చినపిదపే దక్షిణని గ్రహించాలి", అని యాజ్ఞవల్క్యుడు జనకునితో చెప్పాడు. ఈ బృహదారణ్యకోపనిషత్తు నాలుగవ అధ్యాయం మొదటి బ్రాహ్మణములో చెప్పబడియున్నది.



(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

-----------------------------
 Inline image 1

26. ఇతర దేశాలలో లేని వ్యవస్థ

ఇతరదేశాలలో బోధకులు (టీచర్) ఉండవచ్చును. కానీ మన గురు, ఆచార్య సాంప్రదాయాలకూ వానికీ అజగజాంతరము. ఇతర దేశాలలో గురువును ఈశ్వర భావంతో చూసే పద్ధతి లేదు. అతడు ఈశ్వర ప్రతినిధి అన్న భావం లేదు. సర్వసంగపరిత్యాగం చేసి అతని వద్దకు వెళ్ళాలన్న నియమమూ లేదు. 'అతడు చక్కగా బోధ చేస్తాడు,అతనికి అనేక విషయములు తెలుసు, ఆ విషయములను ఇతరులకు అందముగా చెప్పగలడు." ఆ దేశాలలో విద్యార్ధికి దీనికి మించిన భావము లేదు. ఆ బోధకులూ తమను ఆ విధంగానే భావించుకొంటూ తదనుసారం ఉంటే చాలని నిలిచిపోతారు.

మనదేశాల్లో అట్లా కాదు.......... "గురు లక్షణములు ఉన్నతముగా ఉండాలి. అతనికి యోగ్యత, ఆత్మానుభవం ఉండాలి. అతడు కుశాగ్రబుద్ధిగానూ, శాస్త్రసంపన్నుడిగానూ, విశేషజ్ఞుడిగానూ ఉండవలసి ఉంటుంది. అంతేకాదు తనకు తెలిసిన దానిని ఇతరులకు తెలుపగలిగిన బోధనశక్తి, శీలసంపదా, ఆచార అనుష్టానాలు కలిగి ఉండవలెను".

అనగా ఆచార్యునికి మూడు లక్షణములు ఉండవలెను. ఒకటి శాస్త్ర సిద్ధాంతములను అతను చక్కగా తెలుసుకొని ఉండవలెను. "అచినోతిః శాస్త్రార్ధం". రెండు, తెలుసుకొని స్వయంగా ఆచరించవలెను. "స్వయం ఆచరేత్". మూడవది, తాను తెలుసుకొని ఆచరిస్తున్న ఆచారములను ఇతరులచే అనుష్టింప చేయవలఎను. "ఆచారేస్థానయత్యపి".

ఒక శాస్త్రం చక్కగా తెలుసుకొన్న వాడు విద్వాంసుడు మాత్రమే. వానికి ఆచార్య స్థానం లేదు. జీవితం శాస్త్రబద్ధముగా నడుపుకున్న నాడే అనుష్ఠాత. మరొక మెట్టుదాటినాడంటే, అతడు అనుభవి అవుతాడూ. అప్పటికీ అతను ఆచార్యుడు కాలేడు.  అతను తాను నేర్పిన శాస్త్రములను ప్రచారం చేసి ఇతరులను అనుష్టింపచేస్తేనే ఆచార్యుడౌతాడు. అందుచేత ఆచార్యుని అనుష్టానమూ, అనుభవమూ, ప్రచారకత్వమూ మూడూ ఉండాలి.

మనం నేర్చుకొనే విద్య నిర్దుష్టంగా ఉండవలెను. మన జీవితము కూడా ఆ విద్యను అనుసరిస్తూ నిర్వద్యముగా ఉండవలెను. అందుచే ఆచార్యుడు తాను నేర్చుకొన్న దానిని ఆచరించి ఇతరులచే ఆచరింపచేయవలెను. ఈ విధమైన ఆచార్యులు మన దేశంలో పూర్వం ఎంతో మంది ఉండేవారు.

"అర్ధసంపద లేని వారికి ఈ లోకం లేదు" అని మహాత్ముడైన తిరువళ్ళువారే చెప్పారు. కానీ మనపూర్వాచార్యులు అర్ధాన్ని అర్ధించకుండా విద్యాదానం చేసేవారు. విద్యాభివృద్ధియే వారి ధ్యేయం. జీవిత లక్ష్యం. వారు స్వార్ధత్యాగులు, నిష్కామముగా ఉండేవారు. ఇట్టి త్యాగమున్నందునే వారికి అసమానమైన ఆధ్యాత్మిక సంపత్తి ఉండేది. తైత్తరీయం 'త్యాగేనైకే అమృతత్వమానశుః" అని అంటున్నది.

ఈ దేశంలో ఆచార్యునికి ఎనలేని గౌరవం ఉండేది. అర్ధసంపత్తి లేకపోయినా చిత్తశుద్ధి కల ఆచార్యుని ఎవరు గౌరవించరు? అతడు ఒక పర్ణశాలలో అవిరళ విద్యాదానం చేస్తూ తన జీవితాన్ని భవ్యంగా గడిపేవాడు. "సర్వసంగపరిత్యాగం చేసి ఆచార్యుని అనుసరించు" అని అంటే అతనికి ఎంత విశిష్టత ఉండవలె? ఆచరణ లేని శాస్త్రకౌశల్యం మాత్రం ఉంటే చాలునా?. అతని జీవితం అనవద్యంగానూ, ఆదర్శంగానూ ఉంటేకానీ, శిష్యునికి అతనిలో ఈశ్వర భావం రాదు. అట్టి ఆచార్యుడే - ఆచార్యదేవోభవ - దేవుడౌతాడు.

(సశేషం .....)



సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-5

>> Sunday, March 17, 2013

గురువు, ఆచార్యుడు అనేవి ఒక ఉత్తమ స్థితిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పే పదములు. యజ్ఞ హోమాదులు చేసేవారినీ, మంత్రదీక్షనిచ్చే వారినీ ఆచార్యుడు అంటారు. గానకళ, నృత్యకళలలాంటివి నేర్పే వారిని గురువు అని అనడమూ కలదు. తమిళ దేశంలో వాద్యార్ అనే పదం ఒకటి వాడతారు. సాధారణంగా బళ్లలో చదువు చెప్పేవారినీ, ఇళ్ళలో పూజలు, శ్రాద్ధాదికములు పెట్టే వారిని వాద్యార్ అని అంటారు. ఈ వాద్యార్ అనే పదం సంస్కృతంలోని ఉపాధ్యాయ అనే పదం నుండి పుట్టింది. తమిళంలో 'ఆశిరియర్' అన్న పదం ఒకటి ఉంది. అది ఆచార్య పదోద్భవం, కథాశిరియర్ అని వాడుకలో ఉన్నది.

అధ్యాయం అన్న పదం ఒక పుస్తకంలోని విభాగాన్ని సూచించేది. ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం అని గ్రంధ విభాగాలను సూచిస్తారు. ఇవన్నీ ఈ మధ్య వచ్చినవి. అధ్యయనం, అధ్యాయం అనే పదాలు వేదాధ్యయనాన్ని సూచించే పదాలు. జీవితంలో అన్ని ముఖ్య విషయాలూ వేద సంబంధమైనవే. ఒక పుస్తకాన్ని ఎన్నో విభాగాలుగా విభజించినప్పుడు వాటిని కాండము, ఖండము, సర్గము, పటలము, పర్వము, పరిఛ్చేదము, ఉఛ్చ్వాసము, ఉల్లాసము, అంగము, ప్రకరణము, స్కందము అని ఎన్నో పేర్లతో పిలుస్తారు.

మనం పాఠం అనే పదాన్ని వాడితూ ఉంటాము. పాఠాలు చెప్పేచోటు పాఠశాల. ఈ పాఠమనేదీ వైదికమే. కానీ వేదాలన్నీ అబద్ధాలు అని చెప్పే బడి కూడా నేడు పాఠశాలయే. నాస్తిక్యమునకు ఒక బడి స్థాపిస్తే అదీ పాఠశాలయే. బ్రహ్మయజ్ఞమే పాఠం. వేదములను అధ్యయనం చేయడమే పాఠం.

వేదములను వల్లించేవాడు పాఠి. వేదాలను పఠించే ఒక మార్గాన్ని ఘనం అని అంటారు. ఆ వల్లెవేసేవాడు ఘనాపాఠి. వేదములు కలసి చుదువుకొనేవాడు సహపాఠి. ఈ పదములన్నీ వేద సాంప్రదాయము నుంచి పుట్టినవే.

17. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు

అధ్యాయాన్ని చెప్పేవాడు అధ్యాపకుడు. వేదములను బోధించడం అధ్యాపనం, నేర్చుకొనేది అధ్యయనం. ఉపాధ్యాయుడు అధ్యాపకునికి సహకారి. అతనిది తక్కువ స్థానం, స్మృతుల ప్రకారం రెండు రకాలైన వేదబోధకులున్నారు. ఒకడు ఆచార్యుడు, ఒకడు ఉపాధ్యాయుడు. ఈ భేదాన్ని మనుస్మృతి చెబుతుంది.

జీవనోపాధికోసం ఆచార్యుడు వేదాధ్యాపనం చేయటంలేదు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి చెప్పి వేద్దధ్యయనం అవిఛ్చిన్నంగా జరగాలని అతడు గురుకులం స్థాపిస్తున్నాడు. శిష్యుడు అధ్యయనం పూర్తి అయిన పిదప దక్షిణ విషయం ఎత్తితే అప్పుడు గురువు ఏదైనా అడగవచ్చు. సాధారణంగా అధ్యయనానికి పెన్నెండు ఏళ్ళు పడుతుంది. సత్పాత్రులకు విద్యాదానం చేయడమే అతని వ్రతం. గురుకులవాసంలో ఉన్నంత వరకు శీలమునకు, నియమ జీవనమునకు గురువు బాధ్యత వహించేవాడు.

ఒకప్పుడు మన దేశంలో ఇలాంటి గురుకుల వాసములు ఉన్నాయన్న విషయమే గర్వకారణంగా ఉన్నది. ఆచార్యులమని పేరు పెట్టుకొన్న మేము (శంకర భగవత్పాదుల నుంచి వస్తున్న గురుపరంపర.) ఈ విషయం గురించి చెప్పడం, ఇలాంటి గురుకుల వాస విధానం పూర్తిగా నశించరాదనియే.

18. జీవనోపాధికోసం వేదాధ్యాపనం

జీవనోపాధికోసం వేదాధ్యాపనం చేసేవారిని ఉపాధ్యాయుడని మనుస్మృతి పేర్కొంటున్నది. డబ్బు తీసుకుని వేదవిద్య చెప్పేవాడు భృతక అధ్యాపకుడు. వేదభాగాన్ని ఒకటి చెప్పి ప్రతిఫలంగా అతడు వేతనం తీసుకుంటున్నాడు.

యో౨ధ్యాయపతి వృత్యర్ధం ఉపాధ్యాయస్స ఉచ్యతే

పూర్వకాలంలో వేతనాన్ని ఉద్దేశించి అధ్యాపన చేసేవారు చాలా తక్కువ. గురుకుల వాసములు డబ్బు ప్రసక్తి లేకుండా ఉత్తమ ఆచార్యులచే నడపబడేవి. ఐతే కూలికి చెప్పే అధ్యాపనం గురించి కూడా ధర్మశాస్త్రములు చెప్పటం చూస్తున్నాము.

గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు - ఈ పదములను ధర్మశాస్త్రములు నిర్వచించినవి.

బ్రహ్మోపదేశం మొదలు వేదాంత పర్యంతము చదువుచెప్పేవాడు గురువు. ఆచార్యుడు బ్రహ్మోపదేశం చేయక, శాస్త్రములను మాత్రం నేర్పేవాడు. ఒక ఉదాహరణ, గర్గాచార్యులు కృష్ణునికి ఉపనయనం చేశారు. ఆయన విద్యాభ్యాసం సాందీపుని వద్ద జరిగింది. ధర్మశాస్త్రములు ఏ భాషలోనైనా ఉపదేశమిచ్చేవాడు గురువనీ, శాస్త్రములు నేర్పేవాడు ఆచార్యుడనీ చెప్పుతున్నవి.

ఒక సాంప్రదాయానికీ, పద్ధతికీ చెందినవాడు ఆచార్యుడు. అతడొక సిద్ధాంతాన్ని సమగ్రంగా బోధిస్తున్నాడు. ఉదాహరణ శంకర భగవత్పాదులు. ఏ సాంప్రదాయానికీ చెందని వాడు గురువు, ఉదాహరణ - దత్తాత్రేయుడు. అందుకే ఆయనని దత్తగురువు అని అంటారు. దత్తాచార్యుడని అనడం లేదు. ఒక సిద్ధాంతాన్ని బోధిస్తూ గురువు వలె అనుగ్రహశక్తి ఉన్న భగవత్పాదులను శంకరాచార్యులు, శంకర గురువు అని వ్యవహరిస్తారు. మనుస్మృతిలో ఆచార్యుని లక్షణములు గురువుకి కూడా చెప్పబడినవి.

ఉపనీయతు యః శిష్యం వేదం అధ్యాపయేత్ ద్విజః
సకల్పం సరహస్యం చ తం ఆచార్యం ప్రచక్షతే

పరబ్రహ్మకు రూపం లేదు. గుణం లేదు. రూపం గుణం ఉంటే కానీ మనస్సు ధ్యానించలేదు. అందుచే పరబ్రహ్మ గురుమూర్తి రూపంలో నయన గోచరమై మనలను అనుగ్రహిస్తున్నాడు. గు అంటే గుణములు, రు అంటే రూపము. గురువంటే గుణ రూపములతో మనలను అనుగ్రహించే పరబ్రహ్మము.

పూర్వం బ్రహ్మోపదేశం మొదలు శాస్త్రపర్యంతం పుత్రునికి పుత్రునికి తండ్రియే ఉపదేశిస్తున్నందువల్ల అతనిని గురువనే వారు. రామాయణంలో, కావ్యములలో తండ్రిని గురువనే వ్యవహరించారు. కొన్ని విద్యలు కొన్ని కుటుంబాలకే పరిమితమై ఉండేవి. తండ్రికి తెలియని విద్యలు నేర్చుకోవడానికి ఇతరులను ఆశ్రయించేవారు. ఈ కారణంగా తండ్రికాక గురువు బ్రహ్మోపదేశం చేయడం, విద్యాభ్యాసం గురుకులాలలో జరగడం ఏర్పడింది.

తండ్రికి అన్ని శాస్త్రములు తెలిసినా, కుమారుడు ఇంట్లో ఉంటే సరిగా చదువుకోడేమో అని, గురుకులవాసాలలో ఒక నియమ జీవనమూ, శాస్త్రాభ్యాసము వీలౌతుందని గురుకులవాసమునకు పంపేవారు. విద్యార్ధి అన్నభిక్షకై వెళ్ళి సాధారణ జీవనం గడిపేవాడు. అలాంటప్పుడు గురువే బ్రహ్మోపదేశమూ చేసేవాడు.

ఈ కాలంలో తల్లి తండ్రులకు పిల్లల చదువుగూర్చికానీ శీలం గురించి కానీ చింత లేదు. వారికే డబ్బే ప్రధానం, ఏ చదువు చదివినా, ఏ దేశం పోయినా అభ్యంతరం లేదు. కుమారుడు పుష్కలంగా ధనార్జన చేయాలి. వారి లక్ష్యమంతా అదే. తండ్రులు పిల్లలను చదువుకోసం విదేశాలకు పంపకపోతే స్వయంగా తామే పోతారు. విదేశాలకు పోయిన్ ధనార్జన చేసేటప్పుడు ఈ తల్లితండ్రులకు ఒక్కపైసా కూడా ఆ కుమారుడు పంపకపోవచ్చును. ఇది ఈనాటి విద్యావిధానము.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-4

>> Friday, March 15, 2013


Inline image 1

14. రామానుజ సాంప్రదాయంలో

రామానుజ సాంప్రదాయములో పరస్పరము మర్యాద చేసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. మనం నీవు-మీరు అని వ్యవహారంలో చెప్పుకుంటే వారు దేవరీర్ (తమిళం) అన్నపదం వాడతారు. తమని దాసులు అని చెప్పుకుంటారు. ఇతర సాంప్రదాయస్తులను 'స్వామీ' అని పిలుస్తారు. వైష్ణవులలో వృద్ధులను 'పెరుమాళ్' అని వ్యవహరిస్తారు. వారి మర్యాద ఒక్కొక్కప్పుడు విపరీత ప్రమాణంలో ఉంటుంది.

ఈ విషయంలో చెప్పుకునే కథ తమాషాగా ఉంటుంది. ఒక మఠాధిపతి క్రింద శిష్యుడొకడు ఉండేవాడు. గురువు స్థానంలో తాను రావాలని అతనికి ఆశ. గురువు కోసం అతనొక గోతిని త్రవ్వినాడి. గురువు దగ్గరకు వెళ్ళి 'దేవతలైన తాము (దేవరీర్) స్వయంగా గోతిలో దూకుతారా? లేక ఈ దాసుణ్ణి ఆ కైంకర్యం చెయ్యమంటారా? అని మర్యాదతో అడిగాడట.


వైష్ణవాలయాలలో ఆళ్వారుల సన్నిధులుంటాయి. అందులో ఆండాళ్ సన్నిధి విశేషమైనది. తెంగల శాఖకు చెందిన మనవాళముని, పిళ్ళైలోకాచార్యుల సన్నిధులు ఉంటాయి. వడగలైశాఖకు చెందిన ఆలయాలలో వేదాంతదేశికుల సన్నిధి ఉంటుంది. రామానుజులు శ్రీపెరంబదూరులో జన్మించారు. ఆ క్షేత్రంలో రామానుజులకే ప్రాధాన్యం. పెరుమాళ్ళకు రెండవ స్థానమే. అచట రామానుజులకు పదిరోజుల ఉత్సవం చేస్తారు. రోజూ ఆరాధన, ఆయన సన్నిధి మీద బంగారు విమానం కట్టారు.


శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళుకు ప్రముఖస్థానం. ఆమెను గోదాదేవి అని అంటారు. మధురలో మీనాక్షికే ప్రాధాన్యం. సుందరేశ్వరునికి ద్వితీయస్థానం. నమ్మాళ్వార్ జన్మస్థలం కురుకూరు. ఆయన గౌరవార్ధం దానిని ఇప్పుడు 'ఆళ్వార్ తిరునగరి' అని పిలుస్తున్నారు. ఆయనకూ విశేష ఉత్సవాలు చేస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయాచార్యులలో నాదముని, ఆలవిందార్, మనక్కాల్, నంబి, తిరుక్కాచ్చినంబి, కూరత్తాళ్వార్, భట్టర్, నాచ్చియార్ ముఖ్యులు. ఆలయాలలో వీరి సన్నిధిలో పూజలు, ఉత్సవములు జరుగుతూ ఉంటాయి. శివాలయాలలో నాయన్మారులకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు.


ఇంతకూ చెప్పవచ్చినదేమిటంటే వైష్ణవ సాంప్రదాయములో ఆచార్యభక్తి అధికమని, రామానుజుల శిష్యులు వారికి అతివేలంగా భక్తిని నెరపేవారు. ఆయనకోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుదీసేవారు కాదు. అట్టివారిలో కూరత్తాళ్వార్ ఒకరు. వారి గ్రామం కంచికి సమీపంలో ఉన్న 'కూరం'.


రామానుజుల కాలంలో ఉన్న చోళరాజు పరమశైవుడు. రామానుజులు విష్ణ్వాధిక్యమును బోధించే ఆచార్యులు. చోళుల రాజధాని గంగైకొండచోళ పురం. రామానుజులు శ్రీరంగంలో ఉన్నారు.  రాజు రామానుజులను తమ సిద్ధాంతాన్ని గూర్చి చర్చ చేయడానికి ఆహ్వానించారు. కూరత్తాళ్వారు పరమశైవుడైన చోళరాజు తన గురువుకు ఏమి అపకారం చేస్తాడో అని భయం వేసింది. అందులో ఆ కాలపు రాజులు నిరంకుశులు.


కూరత్తాళ్వార్ రామానుజుల వేషంలో రాజువద్దకు వెళ్ళాలని నిశ్చయించారు. రామానుజులు ధరించే కాషాయాలను శిష్యుడు ధరించాడు. రామానుజులు శ్వేత వస్త్ర ధారియై కర్ణాటక దేశంలోని తిరునారాయణపురం వెళ్ళారు. ఈ సంభవాన్ని స్మరిస్తూ ఇప్పటికీ 'వెళ్ళైచ్చాత్తుపడి' (తెల్లని వస్త్రములు ధరించుట) అనే ఉత్సవం చేస్తారు.


చోళరాజు సమక్షంలో కూరత్తాళ్వార్ శివాధిక్యాన్ని ఒప్పుకోలేదు. రాజు ఉగ్రుడై కూరత్తాళ్వార్ కండ్లను పీకించాడు. కూరత్తాళ్వార్ సంతోషంగా శిక్షను అనుభవించాడు. చోళరాజు మరణానంతరం రామానుజులు తమిళ దేశానికి మరలివచ్చారు. శిష్యుని దురవస్థకు ఎంతో చింతించారు. రామానుజులు మొదట కంచిలో వరదరాజస్వామిని సేవించేవారు. శ్రీరంగంలో ఉన్నప్పుడు రంగనాథస్వామిని సేవించారు. కానీ వరదరాజులు అంటే వారికి విశేషానురాగం. నీవు నీ దృష్టి కోసం వరదరాజును ప్రార్ధించు అని కూరత్తాళ్వార్
తో చెప్పారు. కూరత్తాళ్వార్ భగవద్దర్శనం కావాలంటే ఇంద్రియాలు నిగ్రహించాలి. రాజు పుణ్యమా అని కండ్లు పోయి, ఇంద్రియాలలో ఒక ఇంద్రియ నిగ్రహం స్వతఃసిద్ధమైనది. దృష్టి మరలా మరలా వస్తే ఈ ప్రపంచములో చూడడానికి ఏముంది? కానీ మీ ఆజ్ఞ జవదాటరాదు. మీరు చెప్పినట్లు చేస్తాను. వరదరాజు నాకు మళ్ళీ కళ్ళు ఇవ్వనీ, కానీ నా గురువులైన మిమ్మల్నీ, వరదుణ్ణీ చూడగలగితే చాలు. ఆ కండ్లకు ఇతర విషయాలు గోచరం కారాదు' అన్నాడట. ఆయన కోరినట్లే వరదరాజు ఆయనకి వరదానం చేశాడు.

రామానుజులకు పూర్వమున్నవారు ఆళవందార్. వారికి కర్మ శేషమున్నందువలన పరమ ప్రాప్తికి ఆలస్యమైనది. ఆ కర్మ శేషాన్ని తాను అనుభవిస్తానని ఒక శిష్యుడు ప్రార్ధించాడు. ఆళవందార్ తరఫున ఆ శిష్యుడు రాచపుండుతో బాధపడి గురువు యొక్క కర్మ శేషాన్ని తొలగించాడు.

ఈ గురుపరంపర కథలలో ఒకటి - కొంచెం హాస్యంగానే ఉంటుంది.

రామానుజులకు వడుకనంబి అని శిష్యుడొకడు ఉండే వాడు. ఇంట్లో అతను గురువు కోసం పాలను వేడి చేస్తూ ఉన్నాడు. వీధిలో రంగనాథస్వామి ఉత్సవ మూర్తి వెళుతూ ఉంది. 'స్వామిని దర్శించు' అని రామానుజులు శిష్యుని కేకవేశారు. శిష్యుడు వినిపించుకోలేదు. రామానుజులు శిష్యుణ్ణి దర్శనం ఎందుకు చేయలేదు అని మందలించారు. శిష్యుడన్నాడట.."మీ పెరుమాళ్లకు చేస్తున్న ఈ క్షీరసేవ మధ్యలో వదిలి వెళ్లడం భావ్యమా??" అని.

గురుభక్తి ఉండే శిష్యుడు గురుసేవలో సంతోషంగా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. పరశురాముడు శత్రువులకు విరోధి. కర్ణుడు అతని వద్ద ధనుర్వేదం నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషంలో వస్తాడు. పరశురాముడు ఒకరోజు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతూఉండగా, ఒక కీటకం కర్ణుడి తొడ క్రింద చేరి తొలచనారంభించింది. గురువుకు నిద్రాభంగం అవుతుందని కర్ణుడు కదలక మెదలక కూర్చున్నాడు. అమితంగా రక్తస్రావం అయినది. పరశురాముడు నిద్ర నుండి లేచి కర్ణుడు బ్రాహ్మణవేషధారి కానీ, బ్రాహ్మణుడు కాదని తెలుసుకుంటాడు. మిగతా కథ మీకు తెలుసు.

ఆళ్వారులలో మధుర కవి ఒకరు. ఆయన 11 పాశురములు వ్రాశారు. వానిని నాలాయిర ప్రబంధంలో చేర్చారు. (నాలుగువేల స్తోత్రములు కల గ్రంధం). పాశురములు విష్ణుపరముగా ఉన్ననూ, మధురకవి వ్రాసిన పాశురములు నమ్మాళ్వారు గురించి చేసిన స్తోత్రములు. నమ్మాళ్వార్ కు 'ప్రపన్నజనకూటస్థుడు' అని బిరుదు ఉండేది.

మధురకవి బ్రాహ్మణుడు. నమ్మాళ్వార్ బ్రాహ్మణేతరుడు. మధురకవి ఉత్తరదేశంలో పర్యటిస్తున్నప్పుడు, దక్షిణభాగం నుంచి ప్రసరిస్తున్న ఒక కాంతి పుంజాన్ని చూశాడు. ఆ వెలుగును అనుసంధానంచేస్తూ వేయిమైళ్ళు దక్షిణదిశగా పయనం అయి వెళ్ళాడు. తిరుక్కరుకురై (ఆళ్వార్ తిరునగరి) చేరి అక్కడ ఒక గుహలో నుండి కిరణములు వెలువడుతున్నవి అని కనిపెట్టాడు. మధురకవి వెళ్ళి చూడగా ఆ గుహలో నమ్మాళ్వార్ ధ్యాననిష్టలో ఉన్నారు.

ధ్యానానంతరము, మధురకవి సంజ్ఞల మూలముగా ఆత్మతత్త్వము గురించి అడిగాడు. నమ్మాళ్వార్ కూడా సైగలతోనే సమాధానమిచ్చారు. అదే మధురకవికి మంత్రోపదేశం ఇచ్చినట్లైనది. "నమ్మాళ్వార్ పెరుమాళ్ళను గురించి స్తోత్రం చేస్తాను" అని పదకొండు పాశురములు వ్రాశారు. ఈ గురుభక్తి చాటే మధురకవి పాశురములను, పెరుమాళ్ల స్తోత్ర గ్రంధమైన "నాలాయిరము" లో చేర్చినారు. రామానుజులు తప్పించి తనకు వేరే దేవుడు లేరని వేదాంతదేశికులూ తమ గురుభక్తిని వ్యక్తం చేశారు.

15. శిక్కులలో గురుభక్తి

ఆచార్యుడు ఉన్నచో దైవం వేరే అక్కరలేదు. దేవుడు కూడా గురువుకి సమానం కాదు అని దాదాపు అన్ని సంప్రదాయములూ చెబుతాయి. శిక్కులు గురువు ఉంటే శిష్యుడు ఉండాలనీ, శిష్యుడు ఉంటే శిక్ష ఉండాలనీ అభిప్రాయపడతారు.

గురుగోవింద్ సింగ్ ఖాల్సాని స్థాపించినప్పుడు నరబలి ఇవ్వడానికి సభ్యులలో ఒకరిని ముందుకు రమ్మని అర్ధించారు. శిష్యుడొకడు ముందుకు వచ్చాడు. వానిని లోనికి తీసుకునిపోయి కొంతసేపటికి రక్తసిక్తమైన కత్తితో వచ్చి ఇంకొకరిని రమ్మన్నారు. ఈ విధంగా ఐదు మార్లు లోపలికి తీసుకువెళ్ళి, ఐదుమార్లూ రక్తసిక్తమైన హస్తములతో బయటికి వచ్చారు గురుగోవింద్. పిదప ఆ ఐదుగురినీ బయటపెట్టి, మీ భక్తిని పరీక్షించడానికే ఈ పన్నాగం అని వివరించారు. నిజంగా ఆ ఐదుగురిని ఆయన చంపలేదు. ఆ రక్తం ఏదో గొర్రె రక్తం. ప్రాణత్యాగానికి సమ్మతించిన ఆ ఐదుగురినీ ఖాల్సాలో ముఖ్య సభ్యులుగా ఎన్నుకొన్నాడు.

గురుభక్తి సంపూర్ణముగా ఉన్న శిష్యునికి గురువు లక్షణములు స్వయంగా వరిస్తాయి. శిష్యులు మహాత్ములై స్వయంగా గురువులైన తర్వాత కూడా శిష్యరికం భజిస్తూ వారి గురువులను ఆరాధించడం మన సాంప్రదాయం.

(సశేషం .....)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.


అనువాదు  [శ్రీ విారు. ముంబై]

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు - 3

>> Thursday, March 14, 2013


Inline image 1
8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?

అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.

అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.

కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II


"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".

ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.

జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II

మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

---------------------------------------------
 


Inline image 1

11. ఆదిశంకరుల గురుభక్తి

'ఆచార్య' అనే పదం చెవిలో పడితే చాలు, మనకి జ్ఞాపకానికి వచ్చేది శంకరాచార్యులే. ఆయన తన గురువు గోవింద భగవత్పాదాచార్యులను, వారి గురువైన గౌడపాదాచార్యులను దక్షిణామూర్తి స్వరూపంలో చూసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నమస్కారక్రియగా వ్రాశారు. శంకరులవారే స్వయంగా దక్షిణామూర్తి అవతారము. కానీ వారు వ్రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతీ శ్లోకంలోనూ, "తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అన్న వాక్యం నాలుగవ పాదంలో జోడించి నమస్కరిస్తున్నారు.

తమ గురుభక్తిని ఒక శ్లోకంలో శంకరులు ఈ విధంగా వ్యక్తం చేశారు.

"ఈ మూడు లోకాలలోనూ జ్ఞానదాతయైన సద్గురువుతో పోల్చదగిన వస్తువు లేదు. వరుసవేది అయః పిండాన్ని బంగారంగా మార్చగలదు. కానీ రాతిని మరొక వరుసవేదిగా అది రూపొందించలేదు.

గురువు అనగా తనను ఆశ్రయించిన వారిని తనంతటి వానిగా చేయగలడు. అందుచేత గురువుకు సాటి ఎవరూ లేరు."

కాశీలో పరమేశ్వరుడే ఛండాల రూపంలో శంకరుల ముందు నిలిచినపుడు, "ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురాత్యేషామనీషామఘ" ఆత్మజ్ఞాని ఛండాలుడైనా సరే, నాకు గురువే - ఉద్ఘాటించారు. తానే జగదాచార్యులు అయినప్పటికీ, అందరి సమక్షంలో ఈ విధంగా వినయంగా చెప్పుకున్నారు.

12. రామానుజాచార్యుల వారి గురుభక్తి
రామానుజులు తన గురువు యొక్క ఆదేశమునకు విరుద్ధంగా తనకు ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. (ఆయన గురువు తిరుకోటియూర్ నంబి). కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ గురువు గారికి రామానుజులు వినమ్రుడై ఉండినారు. ఆయన గురువు ఉపదేశం ఇవ్వడానికి పూర్వము, రామానుజులను 18 మార్లు శ్రీరంగం నుండి తిరుకొట్టియూరుకు వచ్చిపొమ్మన్నారు. కానీ రామానుజులు ఏ విధమైన అనిఛ్చకానీ, అఔకర్యం కానీ గురువుకు వ్యక్తం చేయలేదు.

గురువుకు స్మార్తులు నాలుగు సార్లు సాష్ఠాంగ నమస్కారము చేస్తారు. వైష్ణవులు 'గురువు చాలు' అని చెప్పేంతవరకు నమస్కారాలు చేస్తూనే ఉంటారు. ఒకమారు తిరుకోటి నంబి నదిలో స్నానం చేస్తున్నారు. నదీతీరంలోని ఇసుక సూర్యరశ్మికి వేడిగా ఉంది. ఉష్ణం అసహనంగా ఉన్నా రామానుజులు లెక్కచేయక మండే ఇసుకలో తిరుకోటినంబికి నమస్కారాలు చేస్తూనే వున్నారట. శిష్యుని కష్టం చూసి గురువు ఇక చాలు అని నమస్కారాలు నిలిపారట.

13. శంకరుని శిష్యులు
భగవత్పాదుల శిష్యులు స్వయంగా మహాత్ములు. కానీ వారి గురుభక్తి అసమానము.  శంకరుల శిష్యులలో తోటకాచార్యులు - భవ ఏవభవాన్ - నీవు స్వయంగా భవుడవే (శివుడవే), నీవు వృషధ్వజుడివి అని తోటకాష్టకంలో స్తుతి చేశారు.

ఒకప్పుడు వ్యాసుల వారు శంకరులను పరీక్షింపదలిచి వృద్ధ వేషంలో బ్రహ్మసూత్రభాష్యంపై వాదానికి వచ్చారు. అపుడు వారి సమక్షంలో పద్మపాదాచార్యుల వారున్నారు. వారి వాదం అతి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు - 'శంకరః శంకర స్సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం' - అని పద్మపాదులు తమ గురువును హెచ్చరించారు.

పిదప పద్మపాదులు శంకరభాష్యంపై ఒక విసృతిని రచించారు. దానిని పంచపాదిక అని అంటారు. అందులో శంకరులు వారు 'అపూర్వ శంకరులు' అని పిలిచి తమ గురుభక్తిని వెల్లడి చేశారు.

పద్మపాదుల అసలు పేరు సనందుడు. ఆయనది చోళదేశం. వారు కాశీలో ఆదిశంకరులకు 16 ఏళ్ళు నిండక ముందే శిష్యులయ్యారు. భాష్యములన్నీ అప్పటికే శంకరులు పూర్తి చేసి జీవితాన్ని చాలించాలని అనుకున్నారు. ఆ సమయంలోనే వ్యాసుల వారు శంకరులతో భాష్యసంవాదం చేసి, మెచ్చుకొని వారికి మరొక 16 ఏళ్ళు ఆయుర్దానం చేసి, 'భాష్యాలు వ్రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు, పండితులతో చర్చ చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరణ చేయడానికి, దేశమంతటా సిద్ధాంతం వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఆ కథ అట్లా ఉండనీయండి.

శంకరులు కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేస్తున్నారు. గంగకు ఆవలి తీరంలో పద్మపాదులు ధౌతవస్ర్తాలను ఎండపెడుతున్నారు. పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటుట కొఱకు శంకరులు ఎండిన మడి బట్టలను తెమ్మన్నారు. మధ్యలో నది ఉన్నదన్న సంగతి కూడా సనందుడు మరిచిపోయాడు.

నీళ్లలో నడుస్తూ ఉంటే గంగాదేవి ఆయన మునగకుండా పాదముల క్రింద తామర పుష్పములను ప్రభవింపజేసింది. తాను నడుస్తుంటే తన పాదముల క్రింద పద్మములు విచిత్రంగా వస్తున్నవన్నదీ, శంకరులు నీవు గంగను ఎట్లా దాటావు అని అడిగేంతవరకూ ఆయనకి దేహస్ఫురణ లేదు.

మీ స్మరణ మాత్రాన ఈ సంసారార్ణవం జానుధగ్ధమౌవుతుంది. (మోకాలి లోతు) గంగను తరించడం ఒక లెక్కయా?? అని సనందనుడు బదులు చెప్పారట. అప్పటి నుంచీ వారికి పద్మపాదులన్న పేరు స్థిరమయింది. ఈశ్వరావతారమైన భగవత్పాదుల వారి శిష్యుడు పద్మపాదులవటం సమంజసంగానే ఉంది.

(సశేషం .....)

Read more...

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

>> Wednesday, March 13, 2013

Inline image 1
6. పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు
దీక్షలు పలు రకములు. దీక్షా మార్గములు ఎన్నో ఉన్నా, గమ్యం ఒక్కటే. ఒకే గురువు తన శిష్యులలో ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం నిర్దేశించవచ్చు. కానీ ఆచార్యుడు మాత్రం శిష్యులకు ఒకే సాంప్రదాయమును ఉపదేశిస్తాడు.

గురువులు శిష్యులను మంత్ర, తంత్ర, యోగాద్వైత మార్గములలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చును. తిరుమంత్రం అనే గ్రంధంలో తిరుమూలర్ అనే సిద్ధుడు వివిధ మార్గములను విశదీకరించి యోగ జ్ఞానములతో ముగింపు చేశాడు. తిరుమూలర్ తో ఒక గురుపరంపర ఆరంభమైనది. ఈ పరంపరలో సారమామునివర్ ఒకరు. ఆయన తిరుచినాపల్లిలో ఒక మఠాన్ని స్థాపించాడు. ఈ మఠానికి ఒక సమయంలో మౌనగురువు అనే ఆయన అధిపతిగా ఉండేవారు. తాయుమానివర్ కి ఈయనే గురువు. తాయుమానివర్ క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందినవాడు. మౌనగురువు అనంతరం ఈ మఠం ధర్మపుర అధీనం కిందకు వచ్చింది.


దక్షిణామూర్తి స్వామి సనకాది మునులకు మౌనవ్యాఖ్యా రూపంగా జ్ఞానబోధ చేస్తున్నాడు. తాయుమానవర్ కూడా అన్నిమార్గాలు చిట్టచివర మౌనమార్గంలో లయిస్తాయని చెప్తున్నాడు.

మన నిజతత్త్వం మౌనమే. ఆ మౌనాన్ని మరచిపోలేని సంసారంలో పడుతున్నాము. సంసారం అంటే మాయ. అమ్మవారే మహామాయ. ఆ మహామాయయే జ్ఞానాంబికగా అవతరించి మన అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంది. ఈ జ్ఞానబోధకే ఆమె గురుస్వరూపిణి అవుతున్నది. ఆ జగన్మాత మనకి జ్ఞానమనే క్షీరాన్ని ఇస్తున్నది. ఈ లోకంలో, చెట్టూ, చేమలూ, పక్షులూ, పండ్లూ, వివిధ వస్తుజాలమూ అంతా ఆమె సృష్టియే. ఎన్నో రంగులు, ఎన్నో వాసనలు, ఎన్నో రూపాలు మనుష్యులలో ఎన్నో మనోభావాలు. అంతా ఆ మహామాయ విలాసమే. ఆమెయే లిపి రూపంగానూ, భాషారూపముగానూ, శాస్త్రరూపముగానూ ఉన్నది. అన్నిటికి ఆవల మౌనం, మహామౌనం. మౌనగురువుగా ఆమె అవతరించి శిష్యునికి జ్ఞానబోధ చేస్తుంది. "ఏకంసత్" అని.

7. గురువూ ఆచార్యుడూ ఒక్కరే
మొత్తం మీద నేను చెప్పేది (అంటే పరమాచార్య స్వామి వారు..), మనకి జ్ఞానం దానం చేసే వారిని గురువు, ఆచార్యుడూ అని పిలుస్తున్నాము. మహత్త్వమున్నందున గురువు అని పేర్కొంటున్నాము. శ్రోత్రియుడూ, అనుష్టానపరుడూ, సంప్రదాయజ్ఞుడూ అయిన వానిని ఆచార్యుడు అంటున్నాము. ఆచార్యుడు సాంప్రదాయ మర్మములను మనకి తెలిపి మనలను అనుష్టాన పరులుగా చేస్తున్నాడు. గురువు తన మహత్వం చేతా, అనుగ్రహం చేతా మనకు జ్ఞానం దానం చేస్తున్నాడు. ఆచార్యుడు శాస్త్ర సాంప్రదాయాల మూలకముగా మనకు ఆచార అనుష్టానాలను తెలిపి జ్ఞానం పొందడానికి తోడ్పడుతున్నాడు.

ఈ విధంగా ఆచార్యునికీ, గురువుకీ కించిత్ భేదమున్నప్పటికీ, పాత్రత ఉన్న ఆచార్యుడు గురువు కూడా కాగలడు. ఆచార్యుడు ఒక సాంప్రదాయానికి చెంది తదనుసారులైన ఆచార అనుష్టానాలను బోధిస్తున్నా, తన వరకూ ఒక విధానానికి కట్టుబడక ఈశ్వరానుభవమూ, ఆత్మానుభవమూ పొంది ఉండినట్లైతే, అతడు అనుగ్రహదానం చేయగలడు. మన ఆచార్య పురుషులందరూ ఈ కోవకి చెందిన వారే.

ఆధ్యాత్మిక జీవనారంభంలో కొన్ని కట్టుబాట్లు ఉండవలసినదే. అపుడే మనసుకు ఒక నిలకడ ఏర్పడగలదు. అందులకు మన పెద్దలు యమ నియమాలు చెప్పారు. ఈ కట్టుబాట్లు ఉన్నంత వరకూ మనమందరమూ శిష్యులమే. నిర్భందముగా అనిపించే ఈ నియమాలు కొంత కాలానికి సహజమైపోతాయి. అతనికి నియమ పాలనం చేస్తున్నానని కూడా అనిపించదు. అపుడు అతడు ఇతరులను కూడా ఆ మార్గములో ప్రవేశపెట్టగలడు. అట్టివాడు చేసే ఉపదేశాలు ఇతరులని గాఢంగా ప్రభావితులను చేయగలవు.

ఆచార్యుల స్థానంలో వచ్చిన ఈకాలం గురువులకు విద్వత్తు ఉంటే చాలు, ఆచార అనుష్టానాలు వారికి అక్కర్లేదు. పూర్వకాలంలో విద్వత్తు,
ఆచార అనుష్టానాలున్నవారినే ఆచార్యుడు అని పిలిచేవారు. అనుష్టానము అంగమే కానీ లక్ష్యం కాదు. అనుష్టానం అనుభూతిలో ముగియాలి. అట్టి అనుభూతి పరునకు ఆచారం స్వాభావికమైపోతుంది.

అనుష్టానము ఉన్నప్పుడే విద్యకు పూర్ణత. అనుష్టానానికి పూర్ణత్వం అనుభూతియే. అనుభూతి కలవాడే గురువనీ, అనుష్టానపరుడు మాత్రమే ఆచార్యుడనీ చెబితే అదీ సరికాదు. నిజమైన ఆచార్యునికి ఆచరమూ, అనుష్టానము రెండూ ఉంటాయి. బాహ్య జీవనం అనుష్టాన బద్ధముగా ఉంటూ, ఆంతరంగికముగా అతడు ఏ కట్టుబాటూ లేక కైవల్యంలో ఉంటాడు. అట్టివాడే మార్గదర్శకముగా ఉండగలడు. అతడు ఆంతరంగ మౌనం భజిస్తూ, బయత ఉపదేశ, ఉపన్యాస కార్యావళిలో మగ్నుడై ఉంటాడు.

గురువు-ఆచార్యుడు ఇద్దరూ ఒక్కటే. ఆదికాలం నుంచి వీనిని పర్యాయపదాలుగానే వాడుతున్నారు. ఉపనిషత్తులు వేదశిఖరములు. వానిలో పూర్తిగా ఆచార్య పదప్రయోగమే చేయబడినది.  ఆచార్య దేవోభవ అనీ, ఆచార్యునికి అతను కోరిన దక్షిన ఇవ్వవలెననీ, ఆచార్యవాన్ పురుషోవేదా - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఉపనిషత్తులు చెబుతున్నవి. అయినప్పటికీ ఆచార్యునితో సహవాసం చేస్తూ విద్యాభ్యాసం చేసే విధానాన్ని గురుకులవాసమని అన్నారు కానీ ఆచార్యవాసమని అనలేదు. ఆచార్యుని కృతజ్ఞతా పూర్వకముగా ఆరాధించే దినమును గురుపౌర్ణమి అన్నారు. వ్యాసాచార్యులు, శుకాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందభగవత్పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు వీరినందరినీ చేర్చి 'గురుపరంపర' అని వ్యవహరిస్తున్నాము. వారిని ఆచార్య పరంపర అని అనడం లేదు. ఇదే విధంగా రామానుజ, వల్లభాచార్య, మధ్వాచార్య సాంప్రదాయములలో కూడా గురువందనమనే అంటారు.

శైవ సిద్ధాంతాన్ని పాటించే గురువులను కూడా ఆచార్యులనే అంటారు. మైకండాచార్య, సంతనాచార్య మొదలైనవారు శైవసిద్ధాంతానికి చెందిన వారు. గురువులు సిద్ధిపొందినదినము తమ గురుస్మారకముగా ఆరాధన చేస్తారు. అదే గురుపూజ అంటారు.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

[అనువాదం ః  శ్రీ వి]

Read more...

ఆచార్యుడు_ గురువు [ పరమాచార్యుల అద్భుత ఉపదేశం]

>> Tuesday, March 12, 2013

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ హనుమతే నమః
గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!
పెద్దలందరికీ నమస్కారము,

పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.


1. గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".

ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.

ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".
ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం
ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.

గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.

మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.

తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ
విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు.  అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.

ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.

ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.

ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.

ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.

పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.

(సశేషం...)

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

---------------------------------------------------

 3. గురువు - ప్రపంచము
ఒక గురువు క్రమపద్ధతిలో బోధ చేయడానికి ఇష్టపడక పోవచ్చును. కానీ శిష్యులను ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడా మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటప్పుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే రక్షిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకున్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ ఉంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశమే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కలిగిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసములు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివి ఉన్నాం. ఒక మహాత్ముని ముందు ఒకడు ఎంతో కాలం పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ ఉన్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే ఒక మహాత్ముని వద్ద కబీరు రామ మంత్రోపదేశం పొందాలని పరితపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరంటారు. రామానందులు తనకి మంత్రోపదేశం ఇవ్వరేమో అని అతనికి తోచింది. ఎట్లాగైనా ఆయన వద్ద మంత్రోపదేశం పొందాలని ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తములో రామానందులు గంగా స్నానానికి వచ్చారు. కబీరు గంగా నది స్నాన ఘట్టంలో మెట్లమీద పడుకొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందున రామానందుల వారు పడుకుని ఉన్న కబీరు మీద పాదములు మోపారు. కబీరు దానినే 'పాదదీక్ష'గా స్వీకరించాడు. (దీక్ష గురించి తర్వాత చెబుతాను..) ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన రామరామ అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తముగా గట్టిగా ఉఛ్చరించారు. కబీరుకు అదే ఉపదేశమైనది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందుల వారి నుండి పొందాలని కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే రామానందుల వారు ఉద్దేశ పూర్వకముగా కబీరుకు మంత్రోపదేశము చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పం వలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉఛ్చారణవలనా "గురుశిష్య సంబంధం" ఏర్పడినది అని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశం చేసిన వానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యుల మధ్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూ లేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా అనుద్దేశపూర్వకముగా ఒక మంత్రము ఉఛ్చరించినా గురువు అనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుడిని సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్ర శక్తి గురువు అనుగ్రహానికి మూలము అని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువు అయితే, శిష్యుడు పరిపక్వమున్నవాడు అయితే, వాగ్రూపక మంత్రోపదేశమే అక్కర్లేదు. కానీ గురుశిష్యుల మధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అది ఎట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్ష దీక్ష అవుతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కలిగిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిశ్యుని శిరస్సుని స్పృశించడం కూడా దీక్షయే. దీనిని హస్త మస్తక దీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ స్థూల క్రియలు. గురువు సంకల్పం మాత్రాన "ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి" అని అనుకున్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్య సంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది. 

---------------------------------------------------------------

to సత్సంగము
Inline image 1

4. దీక్ష
ఉపదేశమూలకముగా గురు-శిష్య సంబంధం ఏర్పడుతున్నదనే విషయం గురించి ఇంతవరకూ చెప్పాను. శాస్త్ర పరిభాషలో దీనినే "దీక్ష" అంటారు. తమిళంలో దీనిని "దీక్కై" అని చెబుతారు. ఉపదేశమూలకముగా గురువు నుంచి ఒక చైతన్యము శిష్యుడిలో ప్రవేశించి, తీవ్ర సంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మ మార్గములో ఒక అన్వేషణకి పురికొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవడం లేదు. ఈ చైతన్యము శిష్యునిలో ప్రవిష్టమై, అతనిని ఆధ్యాత్మంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి, మంత్రసిద్ధి కలుగజేస్తున్నది.

గురువు ఒక్కమారైనా సరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకముగానో, హస్తమస్తక స్పర్శనం చేతనో, అనుకంపన చేతనో గురుశిష్య సంబంధమైన దీక్షని ఇచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూ ఉంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుడిని సమక్షంలో ఉంచుకుని దీర్ఘ కాలం అతనికి విద్యను, అనుష్టాన విధానాలను బోధించాల్సి ఉంటుంది. గురువు విషయం అట్లా కాదు. అతనికి శిష్యునితో స్థూల సంబంధం అక్కర్లేదు. అతనికి ఒక్క క్షణం ఉంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడా అక్కర్లేదు. అతని అనుగ్రహం దీక్షామూలకముగా ప్రసరించి, శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మం చేస్తుంది. శిష్యునికి సిద్ధి ప్రాప్తించేవరకు, గురువు అనుగ్రహం అన్నికాలాలలోనూ అతనితో ఉంటుంది.

దీక్ష ఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాదులలో, పురాణాలలో తండ్రియే గురువని చెప్పబడినది. తండ్రి ఘనుడైనా సరే, కాకపోయినా సరే, మహాత్ముడైనా సరే కాకపోయినా సరే, తనయునికి అతను దైవసమానుడే. వేదాలు పితృదేవోభవ అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా ఉంది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీ మంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించడానికి ఈ ఆచారము కూడా కారణము.

ఇదే కాదు, అక్షరాభ్యాసకాలంలో, తండ్రి కుమారునికి "ఓమ్ నమో నారాయణాయ" అని అష్టాక్షరియో, "ఓం నమః శివాయ" అని పంచాక్షరీయో ఉపదేశం చేసే ఆచారం మనలో ఉంది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువు అవుతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞానలాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి గురువు యొక్క లాఘవం కానీ, అనుభూతి రాహిత్యంకానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యం అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గురించి చెప్తున్నప్పుడు, కంచి మఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికి వస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుర్రవాళ్లని చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు ఇంకా రాలేదు అని బదులిచ్చాడు. రెండవ వాడు "ఆ! వచ్చారు" అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయములో అబద్ధము చెప్పావు అని నేను అడుగగా, "గురువు రానిదేమో నిజమే! ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లవుతుంది. అందుచేత నిజం చెప్పి గురువు యందు దోషం చూపేదాని కన్నా, అబద్ధం చెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లు చెప్పాను" అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనా సరే, శిష్యునికి అఖండమైన, అనన్యమైన భక్తి ఉంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే ఉంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండవలె. గురువు లేకుండా తీసుకున్న మంత్రమో, చదివిన విద్యయో, "భార్యకు ఆమె ప్రియుడి చేత కలిగిన సంతానము వంటిది, అతనిని కుమారుడని పిలుచుకోవచ్చు, కానీ వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు".

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపక దీక్ష - మంత్రోపదేశము, కటాక్షముతో అనుగ్రహించే దీక్ష - నయనదీక్ష, శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదులు - అంటే భగవంతుని పాదములు శిరసా గ్రహించి, ఆ పాదములే తాను అయినవాడు అని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదుల వారిని శిరసా ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన, శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

--------------------------------------------------------

to సత్సంగము

Inline image 1

5. అంబికానుగ్రమే దీక్ష
సచ్చిదానందమని మనం చెబుతూ ఉంటాము. చిత్ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞాన స్వరూపిణి. లలితాసహస్ర నామాలలో చిదేకరసరూపిణి అని ఒక నామం ఉన్నది. ఏకరసము చిత్తే. శ్రీకాళహస్తిలో అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని అంటారు.

గురురూపములో వచ్చి మనల్ని అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు "దేశిక రూపేణ దర్శితభ్యుదయాం" అని అమ్మవారిని కీర్తించారు. దేశికుడంటే గురువే. వైష్ణవ సాంప్రదాయ ఆచారములో వేదాంతదేశికులొకరు. భగవత్పాదుల శిష్యుడు తోటకాచార్యులు ఆయన చేసిన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్ర నిష్ణాత. దేశికుని రూపములో అంబ అవతరించి శిష్యుణ్ణి స్పర్శ, నయన, స్మరణ దీక్షలతో అనుగ్రహిస్తున్నది.

స్పర్సదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్య దీక్ష అనీ, స్మరణదీక్షని కమఠ దీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే, ఆ శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తిచెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశం చేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ ఉండినదనీ, దీక్ష పిదప మరల అతను జన్మిస్తున్నాడనీ కాదు దీనర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా ఉండినప్పటికీ, అతనికి ఆ ఎరుక లేకపోవడం చేత, అతను అజ్ఞానము నందు ఉండినాడు. దీక్షా మూలముగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒక కోడి గుడ్లు పెట్టి దానిపై కూర్చుని పొదిగినప్పుడు, గుడ్డును పగులగొట్టుకొని పొర నుండి బయటపడే కోడిపిల్ల వలే, శిష్యుడూ, గురువు అనుగ్రహించిన కుక్కుట దీక్షా మూలముగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానం అనే అండాన్ని భేదించుకొని, జ్ఞాని ప్రపంచములో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకుంటున్నాడు.

నీళ్లలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతూ ఉంటాయి. చేపలు ఆ గ్రుడ్లపై కూర్చుని పొదగడంలేదు. తేలుతూ ఉన్న ఆగుడ్లని అవి చూసినంత మాత్రాన, అవి చేపపిల్లలౌతాయని మన శాస్త్ర సాంప్రదాయం. అందుకే గురువు యొక్క వీక్షా దీక్షని మత్య్స దీక్ష అని అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్ల నుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే ఉంటుంది. దాని స్మరణ బలం చేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకి వస్తాయి. అందుకే గురువు యొక్క స్మరణ దీక్షను కమఠ దీక్ష అని కూడా అంటారు.

అంబిక ఏ విధముగా దేశిక రూపములో ఈ మూడురకాలైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది??
అంబిక (అమ్మవారు) అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపాలలో ఆవిర్భవించి ఉన్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో..

శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః


"అమ్మా!! నీ పాదాలను ఆ శృతి శిరస్సులనబడే ఉపనిషుత్తులే తలదాల్చి ఉన్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై ఉంచి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటూన్నారు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సాంప్రదాయమే.
జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శ దీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మదురలో మీనాక్షి అమ్మ ఉన్నది, ఆమె మీన నేత్ర. ఆమె మనకి అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞాన దీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశీలో విశాలాక్షి ఉన్నది, ఆమె సర్వకాలములలోనూ మనల్నే స్మరిస్తూ, స్మరణదీక్షా ప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష.

ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధాలైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞానదానం చేస్తూఉన్నది.

(సశేషం ......)

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!


సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
[ అనువాదంః  శ్రీ వి]]

Read more...

శ్రీ శంకరవేదం

>> Monday, December 12, 2011



వేదాలు అపౌరుషేయాలా? కర్మాచరణ, తత్త్వ చింతనలలో ఏది ఉత్తమం? కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం నిజమా? కల్పనా? ఇవీ ప్రశ్నలు, సందేహాలు, విచారణాంశాలు. ఈవిషయాలనే నిరంతరం చర్చించే వేదిక మండనమిశ్రుడి యిల్లు. జగత్తుకు సమాధానం అందించటం జ్ఞాని బాధ్యత. ఆ బాధ్యతను తలకెత్తుకున్నది పరమేశ్వర స్వరూపమైన శంకరాచార్యులు. మండనమిశ్రుడి వాదనలు, శంకరుల స్పష్టమైన భావ శరపరంపరలో ఛిన్నమైన వైనం, ప్రపంచం సాధించుకున్న అద్వైత స్థితి. శ్రీ శంకర భగవత్పాదుల ఆలోచనలు సర్వకాలికాలు. అవేంటో విందాం.

"వేదాలలో కర్మకాండ కంటే ఆత్మవిచారణకే పెద్దపీట. తొలిదశలో సాధకుడికి కర్మాచరణం, ఆధ్యాత్మసాధనకు తోడ్పడవచ్చు. కర్మలు ఆత్మవిద్యకు ఆలంబనం కాదు. అంతరంగము బ్రహ్మమేనని తెలుసుకోవటానికి, అదేనీవు, ఆ బ్రహ్మము నీవే, వేదం నుంచే అన్నీ పుడుతున్నాయి అనే మాటలు, ప్రమాణాలు కాదా! అసలు వున్నదే ఆత్మ! సృష్టికి పూర్వమే సత్యం వున్నది. అంటే ఆత్మన్నా, సత్యమన్నా ఒకటే కదా! ప్రత్యేక రూపం లేనిది, అన్ని రూపాలు తనే అయినది సత్యం. కనుక సత్యమే ఆత్మ! అది కాలాద్యవచ్ఛిన్నం.

ఏమీ లేదనేదే ఆత్మ
నేనే బ్రహ్మము అనుకోవటం అసలు ధ్యానం. పది యింద్రియాలు, మనసు కలిపి నేను అనుకుని ధ్యానిస్తే, అది బ్రహ్మానుభవానికి దారితీస్తుంది. మేనులోని అసలు నేనును అనుభవ పరిథిలోకి తెస్తుంది. కర్మకాండలను ఆచరించినందువలన కలిగే శ్రమకు ఫలితం లభిస్తే, మోక్షమూ అటువంటిదే. కానీ బ్రహ్మభావన, జ్ఞానంగా అనుభూతం అవుతుంది. ఆ స్థితిలో నిలకడగా వుండగలగటమే ఎరుక. ప్రపంచం, నిత్య, సత్య, శాశ్వతమనే భావన మనసు ఆడుకునే ఆట. ఆత్మను చూసిన వారెవరున్నారు? ఆత్మ, సాక్షాత్ ఆకారంగా వున్నదనుకున్న వాడికి, దేహము ఆత్మగానే అనిపిస్తున్నది. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదని అర్థం. లేదు అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా ఆత్మ అని కదా స్ఫురణ! అదే అహం స్ఫురణ! సగుణం వున్నంతకాలం వ్యత్యాసం, వైరుధ్యం తప్పవు. నిర్గుణం అనుభవం అయినప్పుడు సందేహమూ కలుగదు. కనుక సమాధానం అవసరం వుండదు.

అసలైన రాజయోగి
యోగనిష్ఠలో, ఆత్మనిష్ఠలో, బ్రహ్మనిష్ఠలో వున్నవాడికి ఎంతటి బాహ్య సౌందర్యమూ అకర్షణీయం కాదు. యోగేశ్వర కృష్ణుడి సంచారమంతా బ్రహ్మచర్యమే. బాహ్యచర్య కాదుకదా! కృష్ణుడు అందరినీ అకర్షించాడు. ఆయన ఎవరి ఆకర్షణకూ లోబడలేదు కదా! కారణం, ఆయన ఆత్మజ్ఞాని కనుక. అంటినదీ, అంటించుకున్నదీ లేదు. ఆయనకున్న లోలత్వమంతా బ్రహ్మజ్ఞానం పట్లనే. వైరాగ్యంలో జీవుడు, కామాంతకుడు కావాలి. బ్రహ్మజ్ఞానమంతుడికి యితర విద్యలన్నీ కరతలామలకం. ముంజేత కంకణాలు. అవే ఆయనను అనుసరించి, ఆయన సేవలో ధ్యనవంతము, ప్రామాణికమూఅయి, శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి.

మరొక్కవిషయం. కర్మకాండకు వేదాలే ఆధారం. మహనీయుల బోధలన్నీ ఒక కాలాన్ని, దేశాన్ని, ప్రదేశాన్ని అనుసరించి విభిన్నంగా వినిపిస్తుంటయ్. మనమే సమన్వయం చేసుకోవాలి. సంఘర్షణకు తావులేని రీతిలో విషయాన్ని అర్థం చేసుకోవాలి. జీవుడు ఆత్మాభిముఖుడు కావటానికి కర్మకాండ సహాయపడుతుంది. సాధనాకాలంలో తనంతట తానే, సర్వమూ తాత్కాలికమేనని, సత్యమే సర్వమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ ఎరుక కలిగిన తర్వాత జీవుడి మనసు కర్మకాండ నుంచి బయటపడి, బ్రహ్మజ్ఞానం వైపు మరలి, కడగా అక్కడూ లయం అవుతుంది. అదే జీవన్ముక్తి. కర్మకు అతీతమైనవాడికి ప్రపంచమూ లేదు, దాన్ని గురించిన ఆలోచనా లేదు.

స్థిమితంగా వుంటాడు. పరబ్రహ్మము చైతన్యమనీ, ప్రపంచమంతా దాని చ్ఛాయేనని, మాయగాఅనుభవం కలిగి, సంస్థితుడై వుంటాడు. శరీరగౌరవాన్ని కాపాడే గోచిగుడ్డనీ, అరచేతిలో భిక్షాపాత్రనీ, మనసంతా వేద ధ్వనుల ప్రతిధ్వనులనీ... అన్ని వేళలా, దివ్యవైరాగ్యాన్నీ అనుభవించగలవాడే యోగిరాజు. నిజానికి వాడే అసలైన రాజయోగి!

[ ఆంధ్ర జ్యోతి దినపత్రిక నుండి]

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP