శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విగ్రహారాధననువ్యతిరేకిస్తున్నామంటూ ధర్మాన్ని అపహాస్యం చేయాలనుకునేవారు ఆకాశం మీద ఉమ్మెయ్యాలనిప్రయత్నిస్తున్నామని తెలుసుకోవటం మంచిది.

>> Saturday, August 15, 2015

ఈదేశం లో ధర్మం మీద దాడిచేయాలని ప్రయత్నించే  శక్తులు అనుసరించే వ్యూహాలు పలురకాలుగా ఉంటాయి. అందులో  వందల సంవత్సరాలు భయంకరమైన  అత్యాచారాలతో అణచివేతలతో ఎడారులనుంచి వచ్చిన ఓ మతంఅనయూయులు సాగించిన దుష్కృతాలరక్తచరిత్ర ఓ వైపు తేనెపూసిన కత్తులలా తమ వ్యూహాలను అమలుచేసి రెండొందల సంవత్సరాలకుపైగా ఈ దేశాన్ని దోచిన ఆంగ్లేయులు తమ పాలనలో దేశాన్నే కాదు మెల్లమెల్లగా ఇక్కడ మనుషుల మనసులను నిర్వీర్యం చేసే పథకాలు అమలుచేశారు. అందులో ప్రధానమైనది ఇక్కడవారిలో తమ సంస్కృతి,సంప్రదాయాలు, ధర్మం పట్ల అయోమయం,చులకనభావం ,కలిగించడం కోసం అపప్రచారాలు చేయటం ,అటువంటీ విద్యావిధానాలు అమలుపరచటం  ఇలా అమలయ్యాయి వారి వ్యూహాలు.  వాల్ల పరిపాలనలు అంతమయినా  వారు నాడువేసిన విషప్రచారపు వ్యూహాలు మాత్రం అమలుచేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతకాలంలో ప్రచారమాధ్యమాలలో  వారి ప్రచారాలు ఎలా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం అంతర్జాలం  లో కూడా  ఈ ప్రచారాలు  తీవ్రంగా సాగుతున్నాయి.
 హిందువులు సహనవంతులు కనుక సాధారణం గా  తమ ధర్మం పై జరిగే అపప్రచారాలను చూసి వారి అవివేకానికి నవ్వుకుని వదలివేస్తుంటారు. ఎక్కువమంది వ్యతిరేకంగా మాట్లాడటం గాని లేక న్యాయపరంగా చర్యలకు గానీ ఉపక్రమించరు . ఇది అలుసుగా తీసుకుని కోట్లాదిమంది అనుసరించే ధర్మంపట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయటం,వ్రాతలు వ్రాయటం చేస్తున్నారు.
  ఈమధ్య విగ్రహారాధన తప్పని ,పాపమని, ఇంకా కాస్తబరితెగించి విగ్రహారాధకులు మూర్ఖులని కూడా  బ్లాగులద్వారా ప్రచారం చేస్తున్నారు.

ముందుగా విగ్రహారాధన గూర్చి వీళ్ల విషప్రచారం గూర్చి చూద్దాం.
భగవంతుడు ఎక్కడో మబ్బులచాటునో ,పరలోకం లోనో ఉంటాడని ఎడారి మతాల భావన.
 కానీ ధర్మం ఏమి చెబుతోంది.?
భగవంతుడు సర్వశక్తివంతుడు . సర్వవ్యాపి . కనుక ఆయన అమ్దుగలడిందులేడని సందేహమువలదు ...సర్వోపగతుండు చక్రి........ అని నమ్ముతాము . కనుకనే ఆయనవిభూతులైన పంచభూతాలలోనూ,  ఆయనకు ప్రతిరూపమైన సర్వజీవులలోనూ పరమాత్మను దర్శిం చవచ్చని  నమ్ముతాము. గౌరవిస్తాము.

 ఆ పరమాత్మపై అపారమైన ప్రేమతో నిరాకారానికి రూపమైన లింగం గాగని. కరచరణాదులతో గూడిన అర్చామూర్తులను గానీ పూజిస్తాము. పూజాసమయంలో భావనంతా పరమాత్మమయంగా ఉంటుంది కనుక ఆయన ప్రీతిచెంది భక్తులభావాలకనుగుణంగా కరుణకురిపిస్తుండాడు. అమ్మగా అపారప్రేమను కురిపిస్తాడు.

[ఐతే ఏదో గర్వభావనతో,అహంకారంతో చేసే అర్చనాదికములకు ఫలితాలుండవని అది ఓ ప్రహసనంగా మిగులుతుందని శాస్త్రవచనం.]

ఇక మనసు ఏకాగ్రతను పొందటం కోసం విగ్రహాన్ని ఒక ప్రతీకగా అనుకున్నా . సనాతన ధర్మం లోనేకాదు, ఇతరమతాలలోనూ ప్రతీకలను కొలవటం లేక పవిత్రంగా భావించటం ఉన్నదే
 హిందువులు విగ్రహాలను కొలిస్తే  క్రిస్టియనులు శిలువను , ముస్లిం లు నెలవంకను, ఇంకా కాబాస్టోను ను కూడా పవిత్రంగా భావించటం తెలిసినదే. అలాగే  భగవద్గీత , ఖురాను, బైబిల్ గ్రంథాలను ఎవరూ కాగితం ముక్కల కట్ట గా చూడరుకదా? వాటిపట్ల అపచారం జరిగితే తీవ్రంగా స్పందిస్తారెందుకని? అవి కాగితాలతో తయారయినా తమ భావం మాత్రం అవి భగవంతుని వాక్కులని కదా? మరి విగ్రహారాధన లేదని ఎవరన్నారు?
  రాల్లు రప్పలతో కట్టిన తమతమ ప్రార్థనా మందిరాలను రాల్లు మట్టే కదా అని చులకనగా చూడరు కదా? ఎందుకని ? ఆప్రతీకలు పరమపవిత్రమనే భావనవలనే కదా ? ఇక తమ ఫోటొపై త,మఎదురుగా ఎవడన్నా చండాలం వేస్తుంటే అది కాగితం ముక్కేకదా అని మిన్నకుంటాడా ? ఎవడైనా ?
ఎందుకని ?
కనుక ప్రతీకలలో తమభావాలను ఆరోపించి తాథాత్య్మం పొందటం మనిషి లక్షణం.

ఇక పరమాత్మం ను నవవిధభక్తిమార్గాలద్వారా ఆరాధించటం ఈ ధర్మం నేర్పింది. ఒకటి ఎక్కువకాదు మరోటీ తక్కువాకాదు. ఆసాధకుని మనోస్థితిని బట్టి ఆయా సాధనలలో ఫలితం వస్తుంది.
 అసలు ఈసాధనా క్రమంలో చివరకు ఒంటరిగా ప్రయాణం సాగవలసినదే అనే సత్యం తెలుసుకనుక హిందువులు అన్నింటిలోనూ సాక్షీభూతంగా  సాగుతూ చివరకు తనమార్గాన తాను సాగుతారు స్వేఛ్ఛగా.
 ఇక   గుంపులుగా కూడటం ద్వారామాత్రమే భగవంతుని చేరుతామనుకునే అపోహఉ న్న మతాలు తాముగుంపులుగా  సాగుతూ మిగతావారిని  చేర్చుకుని తమగుంపు మరింత విస్తరించాలనుకునే కోరికతో , ఎవరూ తమ గుంపు వీడకూడదని పలుని బంధనలు, బలప్రయోగాలు. కాదన్నవారి పట్ల ద్వేషం అసూయలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రేమాకరుణలతో కూడిన దైవమార్గాన్నుండి దూరమవుతారు.

సమర్ధసద్గురువులైన సాయినాథులు కూడా తమదగ్గరకొచ్చే భక్తులలో ఎంతో మందికి క్షేత్రదర్శనాలు పూజలు చేసుకోమని చెప్పారే ! వారికంటే  గొప్ప  ధర్మవర్తకులావీరు?   గుంటూ రు మస్తానయ్య దర్గానుండి ,ఆజ్మీరు దర్గావరకు  గుణదల మేరీ మాతనుండి సాగారమాతవరకు హిందువులు బేధభావం లేకుండా గౌరవాభిమానాలు చూపుతారు /.ఎందుకు ? ఆయామహాత్ముల నడవడిక భగవద్భక్తిపూరితమైనదని నమ్మటం వలన. సత్యం ఎక్కడున్నా నమ్మవలసినదే అనే శాస్త్రవచనం వలన. చిత్రంగా విగ్రాహారాధన  వీళ్ళు   ఈ క్షే త్రాల ను  తప్పుపట్టరు
కలిప్రభావం వలన ఇప్పుడు సనాతనధర్మానుయూయులలో కూడా కొన్ని విపరీతాలు పొడసూపవచ్చు. అది యుగధర్మం.  ఇవి కాలానుగుణంగా యుగపురుషులవలన సంస్కరింపబడుతూనే ఉన్నాయి. కానీ ధర్మం పేరుతో పవిత్రయుద్దాలు జరిపి సాటిజీవులమానప్రాణాలు తీయటానికి అంగీకరించదు ఈధర్మం.
 నేడు ప్రపంచం లో నెలకొన్న భీకర అశాంతిికి కారణమెవ్వరు ? ఎడారిభూములలో ఆనాటి కాలమాన పరిస్థితులకణుగుణంగా అక్కడ ద్రష్టలవలన పుట్టి అక్కడి స్థితులను సంస్కరించి నేడు రాజ్యవిస్తరణకాంక్షతో రగులుతున్న వారి చేతులలో ఆయుధాలైనవి ఆమతాలేకదా?
ఇక్కడ భగవంతుడు కౄష్ణుడుఅవతరించి బోధించినది మరచిపోతున్నారని బుడుబుడిఏడ్పులతో వాదాలు వినిపించేవారు  కృష్ణుడే పరదైవమని వాల్లవాల్లందరికీ చెప్పవచ్చు కదా ?
మాకు ఏమతం పట్ల దోషభావం లేదు  ...ఆల్లూ వీళ్ళూ   మాగూర్చి తప్పుడు అభిప్రాయం కలిగిస్తున్నారని  మొగుడ్నికొట్టి మొగసాలకెక్కి సామెతగా  వీళ్లమాటలు ఉన్నాయి  వీరి రాతలు తిరగేసి చూడండి
 ఎవరన్నా వారి మతం గూర్చి విమర్శలుచేస్తే మాత్రం అవి తప్పుకాదని మిగతావన్నీ ఖచ్చితం గా తప్పేననే గడసరి వాదనలు కనపడతాయి వారి వ్రాతలలో/

సర్వేజనా సుఖినోభవంతు     ... అని కోరేది ధర్మం
మాభావనలనుమాత్రమే ఆచరించాలి అనుకునేది మతం.
 ఇక్కడ ధర్మమేదో చూడండి
మీ మతాన్ని ,మీమార్గాన్ని అనుసరించండి... అలానే మిగతా వారి ఆచారాలను గౌరవించండి
 భగవంతుడు అందరికీ సద్భుధ్ధినొసగాలని ప్రార్ధిస్తున్నాము.
జైశ్రీరాం


11 వ్యాఖ్యలు:

శ్యామలీయం August 15, 2015 at 6:24 AM  

నా శైశవంలో జరిగిన సంఘటన.
మహమ్మదు ప్రవక్తగారి పవిత్రకేశం అపహరణకు గురైంది.
మహమ్మదీయులు భూమ్యాకాశాలు దద్దరిల్లేలా ఆందోళన చేసారు.
చివరకు భారత ప్రభుత్వం దానిని వెదకి పట్టుకుంది.
ఇంతకంటే వివరాలు గుర్తులేవు.చ్
పవిత్రకేశం పట్ల ఆరాధన విగ్రహారాధన కాదన్నమాట!
అన్ని మతాలలోనూ పవిత్రభావనలూ, పవిత్ర వస్తువులూ, పవిత్రజంతువృక్షాదులూ, పవిత్రక్షేత్రాలూ వగైరా కనిపిస్తాయి.
కాని కొందరు పనిగట్టుకొని అరకొరచదువుతో అతితెలివితో రాముడి విగ్రహానికి నమస్కరించటమూ, శివలింగానికి పూజచేయటమూ వంటివి మాత్రమే విగ్రహారాధన అని ప్రచారం చేస్తున్నారు.
ఈ సనాతనధర్మంలో పుట్టిన కొందరు (అతి)తెలివిగలవారు తాము మేథావులం అనిపించుకోవాలని ఇలాంటి ప్రచారానికి తాళం వేస్తున్నారు!

Marxist Hegelian August 16, 2015 at 8:40 PM  

దేవుణ్ణి నమ్మేవాళ్ళు అతను ఉన్నాడని నమ్మితే చాలు కదా, పూజ చేస్తేనే కరుణిస్తాడని అనుకోవాలా?

Haribabu Suranenii August 17, 2015 at 6:55 AM  

@Marxist Hegelian
మార్క్సిజం గొప్పదని నమ్మేవాళ్ళు మార్క్సు భజనలతో లెనిన్ కీర్తనలతో యెంగెల్సు పుఋఆణాలతో సరిపెట్టకుండా నాబోటివాళ్ళకి వర్గరహితసమాజం గురించి చెప్పి ఒప్ప్పించవచ్చును కదా!

Haribabu Suranenii August 17, 2015 at 6:58 AM  

@Marxist Hegelian
మార్క్సిజం గొప్పదని నమ్మేవాళ్ళు మార్క్సు భజనలతో లెనిన్ కీర్తనలతో యెంగెల్సు పుఋఆణాలతో సరిపెట్టకుండా నాబోటివాళ్ళకి
వర్గరహితసమాజం గురించి చెప్పి ఒప్ప్పించవచ్చును కదా!

Marxist Hegelian August 17, 2015 at 5:03 PM  

@Hari, apprehension is more important than education. నువ్వు చలం గారి మైదానం చదివావు. కానీ నీ ఆలోచనలు చెలియలికట్టలోని రత్నావళి ముసలి భర్త స్థాయిలో ఉన్నాయి. నీకు నేను ఏమి బోధించగలను?

చలం గారు బ్రహ్మసమాజంలో చేరకముందు ఆయన కూడా విగ్రహారాధన చేసేవాడు, అంటరానితనాన్ని కూడా పాటించాడు. ఆయన పిలక పెంచుకుని పూర్తిగా బ్రాహ్మణ వేషంలో ఉండేవాడు, సంధ్యా వందనం చేసేవాడు, అన్నం తింటున్నప్పుడు దళితుడు కనిపిస్తేనే భోజనం నుంచి లేచిపోయేవాడు. ఆయన బ్రహ్మసమాజంలో చేరి దళితులతో కలిసి భోజనాలు చెయ్యడం మొదలుపెట్టిన తరువాత, ఎన్నడూ సంధ్యా వందనం చెయ్యని బ్రాహ్మణులు కూడా ఆయన్ని విమర్శించారు. నియమాలు నిష్టగా పాటించనివాళ్ళు కూడా, ఆయన విగ్రహారాధన చెయ్యకపోవడాన్ని తప్పుబట్టారు.

durgeswara August 17, 2015 at 8:07 PM  

ఇప్పుడు విషయం చలం గురించి కాదు. ఆయన అరుణాచలం వెళ్లక ముందు తరువాత విషయాలు కాదు.
లెనిన్ విగ్రహాలు, మార్క్స చిత్రపటాలు అవసరమా? అవిలెకుండా భావనలను ప్రచారం చేసుకోవచ్చు కదా ?
వాల్లకు సమాధులు వాల్ల జన్మదినాలకు పూలదండలు ఇలా అవసరమా అని అదగండి

Marxist Hegelian August 17, 2015 at 9:17 PM  

నా గదిలో మార్క్స్ చిత్రపటం లేదు, లెనిన్ చిత్రపటం లేదు. కానీ వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి.

పొట్టి శ్రీరాములుకి విగ్రహం పెట్టడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో లెనిన్‌కి విగ్రహం పెట్టడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. విగ్రహాలు అనేవి కేవలం మనుషులు చేసినవి, మనుషులు కూలిస్తే కూలిపోయేవి. ఒక విగ్రహానికి ఒక పోలీస్‌నీ, తుపాకీనీ కాపలా పెడితే cement బొమ్మలకి ఏ శక్తీ ఉండదని ఋజువైపోతుంది.

durgeswara August 18, 2015 at 4:46 AM  

మార్క్స్ లెనిన్ కూడా ఎర్రజండా పట్టుకున్నారు,దానిపై గుర్తులు పెట్టుకున్నారు . దానినుంచి స్పూర్తి నింపాలని ప్రయత్నించారు. ఆసంకేతాలద్వారా ప్రేరన కలిగించారు. బహుషా వాళ్లు మీ అంత మేధావులు కాదేమో ? మీరిప్పుడు ప్రయ్త్నించండి అన్ని మార్క్సిస్ట్ సంఘాలకు చెప్పండి ఆ పతాకాలు గుర్తులు వదిలివేయమని. మేము చెప్పేది మీకు ఇప్పటికీ అర్ధం కాక ఏదో మీవరకు మీగూర్చి చెప్పుకుంటూన్నారు . ఇక ఆపండి

Haribabu Suranenii August 18, 2015 at 5:43 AM  

@Marxist Hegeliyan
మరి అన్నేళ్ళు లెనిన్ శవాన్న్ని వూరబెట్టి పెపంచంలోని,ఆంధ్రా ఉంచి కూడా వెళ్ళి చూసి యెక్కిళ్ళు పెట్టారుగా!అది సింబల్ కాదా?

ఒక కవి లెనిన్ కావ్యం అని కవితాత్మకంగా మహాకవితవం ఒలకబోసి కీర్తించాడు,అది ఆరాధన కాదా?

ముందు నీ సాటి కమ్యునిష్తులతో అవన్నీ అపమని చెప్పి ఒప్పించి అప్పుదు హిందువూల మీదకి రా.

నీకిదివరకే చాలేంజి చేశా కమ్యునిజం శాస్త్రీఎయమైనదని నిరూపించమని,గుర్తుందా?

Marxist Hegelian August 18, 2015 at 7:44 AM  

ఆ జెండాలకి ఎవరైనా పూజ చేసారా? పూజ జరిగితే అది భావవాదం అవుతుంది కానీ అక్కడ అలా ఏమీ జరగలేదు కదా

Haribabu Suranenii August 18, 2015 at 9:15 PM  

@Marxist Hegelian
నేనడుగుతున్నది లెనిన్ శవానికి చేసిన పూఒజల గురించి,అతని గురించి కవిత్వాలూ కావ్యాలూ రాసిన దాని గురించి!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP