ప్రమాదాలకాలం ఇది..హనుమంతుని స్మరణచేసి ఇంటినుండి కదలండి.
>> Saturday, July 23, 2011
ప్రసుతం భూమ్మీద గ్రహస్థితుల ప్రభావం వలన ప్రమాదకర సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెల్లవారి పేపర్ చూస్తే రోడ్లు రక్తమోడుతున్నవార్తలే ఎక్కువగా ఉంటున్నాయి . మనకు తెలిసినవి కాక ఇంకెన్ని దుర్ఘటనలో !?
ఈమధ్య మన మితృడు కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ మాట్లాడుతూ మాస్టర్ గారూ ! ప్రమాదలు జరగటం సహజం ఎక్కడొ ఎవరికో జరుగుతుంటాయనుకున్నాను ,కానీ ఇప్పుడు మాత్రం ఎందువల్లనో ఈ దుర్ఘటలు ఎక్కువయ్యాయని పిస్తున్నది. నాకు మొన్నజరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసిన మితృలు ఫోన్ చేసి పలకరించేప్పుడు వారివారి కుటుంబాలలోను తెలిసినవాల్లకు ఈమధ్య జరిగిన యాక్సిడెంట్ లగూర్చి చెబుతుంటే విస్తుపోయాను. ఇంతమంది ఇన్నిప్రమాదాలు జరిగాయని చెబుతున్నారంటే ఇంకా మనకు తెలియని ఎన్నిసంఘటనలున్నాయో కదా !
ఇంతమంది అజాగ్రత్త గా ఉండరుకదా ! అయినా ఏదో బలమైన కారణం ఉందని మీలాంటివాల్లు చెబుతున్నది నిజమనిపిస్తున్నది ..అని తన పరిశీలనగూర్చి చెప్పారు.
ఈమధ్య మాజిల్లాలో పోలీసులరికార్డ్ ప్రకారం మాజిల్లా పరిధిలోనే నిరుడు ఆరువేలమందికి పైగా దుర్ఘటనలబారినపడ్డారు అనితెలుస్తున్నది.
మనమేకాదు వాహనాలెక్కే ఎవడూ ప్రమాదాలు జరగాలని కోరుకోడు. అందరూ ఏల్లతరబడి డ్రైవింగ్ చేస్తున్నవారే. కానీ కాల ప్రభావం ,గ్రహస్థితులప్రభావం మాత్రం మానవులమీద శుభాశుభాలను ప్రసరిస్తున్నది. దీనికి మన తెలివితేటలు,మేధస్సు, నైపుణ్యాలు లొంగనంత అతీతాలేమీ కాదు . కనుక పెద్దలు మనకిచ్చిన శాస్త్రజ్ఞానాన్ని ఉపయోగించుకుని తప్పుకోవటమే. పెనుతుఫానులొచ్చినప్పుడు మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో పెళ్లగించబడతాయి. తలవంచిన తుంగమొక్క కుమాత్రం ఏమీకాదు. ఇదీఅంతే . అహంకారం వీడి భగవంతునికి శరణాగతులంకావటమే తెలివైనపని.
ఇక ఈసమయంలో మనం భగవధ్యానం,పూజా లేదా స్మరణ చేసి మన నిత్యవిధులకు కదలటం క్షేమకరం
ముఖ్యంగా హనుమధ్యానం.చాలీసా పారాయణం చేసి ప్రయాణాలకుపక్రమించటం ,గడపదాటటం మంచిదని నా అభిప్రాయం .దీనికొరకేమీ మనం భారీ ఖర్చులుచేయాల్సినపనిలేదుకదా ! కాస్త శ్రధ్ధా,భక్తి.వినయము ఇవి చాలు. మితృలు దీనిని సహృదయతతో స్వీకరించి స్వామినాశ్రయించి ఆయన రక్షణలో శ్రేయస్సును పొందగలరని మనవి.
0 వ్యాఖ్యలు:
Post a Comment