శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏడుకొండలా సామీ..ఎక్కాడున్నావయ్యా ??!!!!!!!! ఇప్పుడేడ్చి ఏం లాభమయ్యా ??

>> Friday, May 16, 2014

ఎన్నికలపండగ రాగానే సీటుకోసం పోటిపడి కోట్లు గుమ్మరించైనా సీటు కొనుక్కున్నారు, ఇక పోటీలో డబ్బు ,మద్యం   నువ్వా? నేనా ? అన్నట్లు పోటాపోటిగా పంచారు.  తమ తెలివితేటలపై అపారనమ్మకంతో అనేక వ్యూహాలు,కుట్రలు రచించారు. తీరా పోలింగ్ అయిపోయాక ఇప్పటిదాకా నమ్ముకున్న తెలివితేటలపై నమ్మకాలు సన్నగిల్లాయి. ఇక తీర్థయాత్రలు,పూజలు, యాగాలు , మొక్కుల తో దేవుడి సాష్టాంగాలు పడుతూ గట్టెక్కించమని వేడుకోవటం మొదలెట్టారు. ఇందులో అగ్రభాగం తిరుపతి వెంకన్న స్వామి కరుణకోసం  తహతహ లాడారు.
ఆపదమొక్కులవాడా !! ఓ తిరుమలేశా !! అని ఆర్తనాదాలు చేశారు లోపల  లోపల. ఇందులో ఆపార్టీ..ఈపార్టీ అనేంలేదు.అన్నిపార్టీల అభ్యర్థులూ ఉన్నారు.

మొన్న రాత్రి ఓపార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి   పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని  ఎప్పుడు రమ్మంటారో ! మాస్టారిని అడగమని వారి తరపువారిద్వారా అడిగారు. ఎన్నికలయిపోయాయి . కౌంటింగ్ ముందు వచ్చి నాఫలితమేముంది ? ఆ దర్శనమేదో నిజంగా భక్తిఉంటే ముందుగానే  వచ్చేవారుకదా ? అన్నాను. వారినమ్మకం వారిది. వస్తాను అన్నప్పుడు దైవదర్శనానికి వద్దనటం భావ్యం కాదుకదా ? అని వారి తరపున అడిగిన మనపీఠానికి వచ్చే కార్యకర్త అభ్యర్థించారు.

అలావద్దు అని చెప్పే అర్హత మనకు లేదు ,కానీ వాల్లు పటాలంతో వస్తే ఇక్కడ అనాచారమవుతుంది . కనుక ఆభ్యర్థి వారి భర్త ఇద్దరు మాత్రమే రావాలి. ఇక్కడ వారెవరికీ ఆవిషయం తెలియపరచకుండా . అని షరతు పెట్టాను. వాల్లువచ్చారని తెలియగానే స్థానికంగా ఉన్న ఆపార్టీ కార్యకర్తలు రావటం.వాళ్లలో స్నానాలుకూడా చేయకుండా అనాచారంతో వచ్చినవాళ్లను మనం మందలించటం. వాళ్ళు అలగటం. ఇదొక తలనొప్పి . అని చెప్పాను,

విషయం తెలిసి ఆ అభ్యర్థి కూడా భర్తతో కేవలం డ్రైవర్ తో కలసి ఉదయాన్నే పూజకొచ్చారు.వా  రొచ్చేప్పటికి అభిషేకం జరుగుతున్నది, వారినీ కూర్చోబెట్టి అభిషేకం,పూజా జరిగాయి. వచ్చేప్పుడు వారు రెండు కొబ్బరికాయలు,డజను అరటిపండ్లు,రెండుమూరలు మల్లెపూలు తెచ్చారు. పూజానంతరం ఇక్కడ దక్షిణలు తీసుకునే సాంప్రదాయం లేదు కనుక హుండిలో ఆయన యాభైరూపాయలు  వేస్తున్నారు. నాకు చాలా జాలి  వేసింది.  ఇద్దరూ డాక్టర్లు. వాల్లకున్న యావదాస్థినీ ఖర్చు పెట్టారట్లుంది . జనం పూర్తిగా నాకేశారులా ఉంది. చేతిలో డబ్బుకూడా లేని స్థితికి వచ్చారు. ఏమి ఖర్మ పట్టింది వీరికి అనిపించింది.

 యథాప్రకారం ఆయన ప్రసాదం  తీసుకునేప్పుడు వారి పూర్వీకులు చేసిన పుణ్యకార్యక్రమాలగూర్చి చెప్పగా ,మేము కలలో కూడా ఊహిమ్చలేదండి ఇలా రాజకీయాలలోకొస్తామని అని ఆవిడ చెబుతుండగా అప్పటికే అక్కడకొచ్చిన స్థానిక లీడర్ స్వామీ!  వీరి విజయంకలగాలని ఆశీర్వదించండి అని అడిగారు.

స్వామీ ! ఆవిడ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవిడ ఏదడిగినా ఆవిడ ఏదిమేలో అదే ఇస్తుంది. యతోధర్మస్థతో జయః అన్నారు పెద్దలు . మధ్యలో ఇంకొకరు ఏదోచెస్తామనటం అబద్దమవుతుంది. అన్నాను.

 ఆవిడతో అమ్మా! మీపిల్లలకైనా ఒకరోజు చాక్లెట్ ఇచ్చిన మీరే ఇంకొకరోజు ఇంజక్షన్ కూడా చేయవలసి రావచ్చు. నొప్పికలిగిందని ఏడ్చి వాడు తనపై మీకు ప్రేమలేదనుకున్నా అది లేనట్లా? అలానే భగవంతుడు ఎప్పుడు ఏది ఇస్తే అది ఆయన అనుగ్రహంగానే భావించాలి. మీ పూర్వీకుల పుణ్యఫలం వలన ఈరోజు మీకు సమాజంలో ఈ ఉన్నతస్థితి కలిగింది. అలానే మనం చేసే అపచారాలు మన పుణ్యఫలాలను కొట్టి వేస్తుంటాయి. అది మనమైనా, మననాయకుడైనా ...............తప్పదు.  మనం ఈరోజు మొక్కుతున్న భగవంతుని పట్ల మన నాయకులు అపచారం  చేస్తుంటే కనీసం నోరు మెదపం. పవిత్ర స్థలాలో   చేసే అపచారాలప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది కట్టి కుడువక తప్పదుకదా ?  అని నర్మగర్భంగా చెప్పాను. వాళ్లకు అర్ధమైంది.  ప్రసాదం తీసుకుని వెళ్ళారు.


ఇక రాష్ట్రంలో మరో చోట మనకు   ఆప్తుడైన  ఓ అభ్యర్థి పోటీచేశారు. ఆయనకుసరైన ప్రత్యర్ధే లేరు   గెలుపు నల్లేరుపై నడక అన్నారు . కానీ నాకుమాత్రం ఎందుకో ఇతనికి కష్టాలున్నాయనిపించినది. సరే వారి ప్రయత్నాలన్నీ అయ్యాక పోలింగ్ అయ్యాక, స్థానిక ఫలితాలొచ్చాక. కళ్ళు తిరిగాయి. పరిస్థితి టైట్ . అతనికోసం స్వామి వారికి పూజజరిపించమని కోరగా ఆయన ,ఆయన కుటుంబం  శ్రీవేంకటేశ్వర స్వామివారికి అంకిత భక్తులని తెలుసు కనుక ,ఇనుముతో సహవాసం చేస్తే అగ్నికికూడా సమ్మెటదెబ్బలు తప్పవుగనుక వారితరపున ఈరోజు  ఉదయం అర్చనలు సాగించాము స్వామికి . నిన్నరాత్రే ఆయన పుణ్యఫలం ఆయనను తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలోనే గడిపేట్లుగాచేసింది . భారీ మెజార్టీ అనుకున్నది కాస్తా పరువుగా బయటపడేట్లు  చేసింది.

ఇందాక వారు మాట్ళాడినప్పుడు చెప్పాను. ఇప్పుడు స్వామి అనుగ్రహం మిమ్మల్ని ఈరోజు ఇలా కూర్చో బెట్టింది. మీ అధినేతో,మీ ప్రయత్నాలు మాత్రమో ! మీకీ విజయాన్నివ్వలేదు..    కనుక మనం ఎవరైనా స్వామి పట్ల అపచారంగా ప్రవర్తిస్తే ఎవరినైనాసరే తప్పు అనాల్సిందే. అప్పుడే స్వామిపట్ల మన భక్తిశ్రధ్ధలున్నాయని గుర్తు. అనిచెప్పాను. ఆయనా స్వామిభక్తుడు కనుక అర్ధం చెసుకున్నాడనుకుంటున్నాను.

అయితే గెలిచినవాళ్లంతా మహాపుణ్యాత్ములు, ఓడినవారంతా పరమ పాపులని నేననటం లేదు. తను తనపూర్వీకులు చేసిన పుణ్యకర్మలవల్ల లభించిన సంపదలు, చెడుకర్మలవల్ల ,దైవాపచారాలవలన తొలగిపోయి కష్టాలు సంప్రాప్తిస్తాయని చెప్పటం నాఉద్దేశ్యం,

తిరుమల భూమిపై ఉన్న మహాశక్తిక్షేత్రం. సాక్షాత్తూ జగన్నాయకుడైన శ్రీహరి లీలాస్థలం. ఇక్కడ  చెసుకున్నవారికి చెసుకున్నంత. భక్తితో ఉన్నవాడికి కలిగే మేలు ఎలానో అహంకరించేవాడికి అంతకీడు జరుగుతుంది
.
ఒకాయన శ్రీ కృష్ణదేవరాయలుటైపులో ఆలయంలోనే అభిమానుల చే పాద నమస్కారాలందుకుని అపారపుణ్యాన్ని పోగొట్టుకుని ఆరునెలలు గడవకముందే ఆప్తులచేతిలోనే అవమానాలపాలై  గంపెడు సంతానం  ఉన్నా చివరదశలో ఎవరూ లేనివాడిలా అశువులు బాశాడు.
 ఇంకొకాయన రోప్ వేలతో తిరుమలను విహారస్థలంగా చేయాలనే తిక్కలఆలోచనలతో క్షేత్రపాలకుల అగ్రహానికి గురై వాహనంతో సహా పైకి లేచి పరమాత్మ అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డా పదిసంవత్సరాలు తనస్థితిని చూసి తనే జాలిపడేలాగడిపాడు.

 ఇంకొకాయన వెంకన్నకు ఏడుకొండలెందుకు ? రెండు చాలు, మిగతావి తమ విశ్వాసానికి చెందినవారికివ్వాలనే దురూహతో ప్రయత్నాలుచేసి   ..... చుక్కల్లో కెక్కినాడె చక్కనోడు...అని అభిమానులచేత పాటలు పాడించుకున్నాడు.

తనకు ఎవరూ సాటిరారనే అహంకారంతో శ్రీవారి సన్నిధిలోనే జేజేలు కొట్టించుకుని,పాదరక్షలతోనే పరమపవిత్రధామంలో ప్రవేశించే ప్రయత్నంతో విర్రవీగి న ఇంకొక లీడర్ కు ఎన్నికలో సాటిలేదు,వార్ వన్ సైడ్ ,ఆయనే సి ఎమ్ అని అన్ని సర్వేలు,పత్రికలూ చెప్పినా   చివరకు ,,,,,అంతా భ్రాంతి యేనా........ జీవితానా వెలుగింతేనా ???? అంటూ పాడుకుంటున్నాడు.

శ్రీవారి పట్లచేసిన అపచారానికి ఫలితం ఎంత కర్కశంగా ఉంటుందో ఇంకా కొంతకాలం తరువాత మనకు మరిన్ని ఉదాహరణలు కనపడతాయి

గెలిచినవారికి, ఓడిన వారికి చిన్న మనవి. మీకున్నది చూసుకుని గర్వంతో పవిత్రక్షేత్రాలలో విఱవీగి ప్రవర్తించకండి.క్షేత్రానికి,అక్కడి పవిత్రతకూ,భక్తులకూ బాధకలుగనివ్వకండి . లేదంటే వందతప్పులూ కాయబడతాయి. వందపూర్తయ్యాక తప్పులూ ఉండవు. శిశుపాలుడూ ఉండడు.

ధర్మోరక్షతిః రక్షితః


జైశ్రీరాం










4 వ్యాఖ్యలు:

Zilebi May 16, 2014 at 12:46 PM  



మీరు మరీ ఇట్లా యెహోవా స్టైల్ లో ఓ పాపుల్లారా అన్నట్లు భయ పెట్టేస్తే ఎలాగండీ ! కాస్త కనికరించండి !!


జిలేబి

Ram May 18, 2014 at 10:43 PM  

అయ్యా జిలేబి గారు, నమస్కారం,

మీరు నాకంటే పెద్దవారో చిన్నవారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినది చెప్తాను తప్పుంటే క్షమించండి.

మీరన్నట్టు వారి విశ్వాసంలో తప్పు చెస్తే ఏదో పెట్టెలో చెప్తే సరిపోతుంది అంటారట. మన ధర్మం ప్రకారం తప్పు చెస్తే దానికి తగిన ఫలం తప్పక అనుభవించవలసినదే. కానీ భగవంతుని ఆశ్రయించిన వారు,ఆ కష్టాన్ని సులభంగా దాటుతారు.

అసలు తప్పే చేయకపోతే దాని ఫలం పొందం కదా! అందుకే మన పెద్దలు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. హెచ్చరికలు చేస్తారు. దానిని మనం భయపెట్టడం అనుకోకూడదు కదా. వారి సూచనలు పాటించి కష్టాలు పొందకుండా చూసుకోవాలి. తద్వారా భగవంతుని పూజ మన కష్టాలను గట్టెక్కించడానికి కాకుండా ఆయనను చేరడానికి ఉపయోగపడుతుందని వారి ఆశ.

Ram May 18, 2014 at 10:44 PM  

అయ్యా జిలేబి గారు, నమస్కారం,

మీరు నాకంటే పెద్దవారో చిన్నవారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినది చెప్తాను తప్పుంటే క్షమించండి.

మీరన్నట్టు వారి విశ్వాసంలో తప్పు చెస్తే ఏదో పెట్టెలో చెప్తే సరిపోతుంది అంటారట. మన ధర్మం ప్రకారం తప్పు చెస్తే దానికి తగిన ఫలం తప్పక అనుభవించవలసినదే. కానీ భగవంతుని ఆశ్రయించిన వారు,ఆ కష్టాన్ని సులభంగా దాటుతారు.

అసలు తప్పే చేయకపోతే దాని ఫలం పొందం కదా! అందుకే మన పెద్దలు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. హెచ్చరికలు చేస్తారు. దానిని మనం భయపెట్టడం అనుకోకూడదు కదా. వారి సూచనలు పాటించి కష్టాలు పొందకుండా చూసుకోవాలి. తద్వారా భగవంతుని పూజ మన కష్టాలను గట్టెక్కించడానికి కాకుండా ఆయనను చేరడానికి ఉపయోగపడుతుందని వారి ఆశ.

hari.S.babu May 19, 2014 at 4:35 AM  

చర్చికి వెళ్లినప్పుదు చెప్పులు విప్పాలని తెలుసు గానీ, తిరుమలలఓ విప్పాలని తెలియలేదు పాపం. ఆ, ఈ తొక్కలో హిందూ గాడ్ మా జీసస్ కనా పవర్ఫుల్లా అనుకుని ఉంటాడు.అనుభవించాడు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP