కాపాడినది తల్లి కనకదుర్గమ్మ ఈరోజు నన్ను కనికరించి
>> Friday, August 16, 2013
పిపీలకాది బ్రహ్మపర్యంతము జీవులగమనము ఎవరి ఆజ్ఞానుసారం నడుస్తున్నదో ఆ తల్లి జగన్మాత పాదపద్మములకు నమస్కారము.
అనుకోకుండా మొన్న శుక్రవారం [9 వతేదీ] న అర్చనానంతరము అమ్మ సన్నిధినుండి బయటకు వస్తూ కొబ్బరినీళ్లపై కాలు జారి పడటం వలన ఎడమ కాలు ఎముక విరిగినది. వెంటనే పిల్లలు కారుతీసుకు వచ్చి నరసరావుపేట ఆర్దోపెడిక్ శ్రీనివాసరెడ్డిగారి హాస్పిటల్ కు చేర్చటమూ అక్కడ సరజరీచేసి రాడ్ వేసి కుట్లువేయటమూ జరిగినది. వారంరోజులుగా అలవాటులేని హాస్పటల్ వాతావరణం చికాకు కలిగించగా డాక్టర్లకు మల్లొస్తాను అని చెప్పి నిన్న గురువారం రాత్రికి ఇంటికి చేరాను. ఈరోజు చక్కగా మా అవిడచే వరలక్ష్మీవ్రతం జరిపించి ఆవిడ నివేదించిన ప్రసాదాలను స్వీకరించి సంతుష్టాంతరంగ అయినదాతల్లి . నాకుమాత్రం ఈరోజు లోపలికెల్లి దర్శించుకునే భాగ్యం ప్రసాదించలేదు. వారం రోజులుగా అతల్లి సేవకు దూరం అయ్యేంత పాపకర్ముడనయ్యాను.
ఇక మాతాతగారి వద్దనుండి పీఠంలో చిన్నపొరపాట్లు జరిగినా వెంటనే దాని దృష్టాంతాలు కనపడుతుంటాయి .
నాకు తెలిసి ఈమధ్య కాలంలో నేను చేసిన పాపపుపని ఒకటున్నది. మందిరంలో ఈమధ్య చీమలు ఎక్కువయ్యాయి. ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు చేసి మట్టిని తోడూతున్నాయని కోపంతో చీమల మందు చల్లాను. అప్పుడూ మనసులో బాధకలుగుతున్నా , మరి మందిరాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత నాదేకదా అని సర్ధిచెప్పుకున్నాను.
ఇక రెండవది నేను మొహమాటానికి వెళ్ళి ఓ పెద్దావిడ [భర్తనుకోల్పోయి ఇంకా పుట్టింటివారు తీసుకెళ్ళి వస్త్రాలు పెట్టకముందే ] ఇక్కడకు రావాలని చాలారోజులుగా కోరుతున్నందున ఆవిడ తురీయాశ్రమం లో ఉన్నవారుకనుక రావటానికి అనుమతించాను. ఇది దోషమని మావాల్ల వాదన.
ఇక ఆలయంలో ఇతరులు తెచ్చిన నైవేద్యలను శుధ్ధిగా చేశారా ?లేదా ? అనివిచారించి నివేదనకొరకు తీసుకుంటాము. అయైతే మా పిల్లవాడొకడు ఆరోజు తెచ్చిన నైవేద్యం పీఠ ఆవరణలోకి రాగానే క్రిందపడిపోయింది. ఆపిల్లవాడు మళ్ళీ ఇంటికెళ్ళి నైవేద్యం తీసుకునిరావటం, కాదంటే బాధపడతాడని ఆనైవేద్యాన్ని లోపలికి తీసుకెళ్లటం . ఇక్కడ దోషం ఆపిల్లవానిదికాదు. మానాయనమ్మ చెబుతుండేది అమ్మవారి పూజ కత్తిమీద సాములాంటిది .వళ్లు దగ్గరపెట్టుకును ఉండాలని.
వీటన్నిటికంటే ఇంకో ప్రాబ్ల్మ్ ఉంది. మాగ్రామంలో రాములవారి మేడ గ్రామరక్షాదేవత యంత్రము పునరుధ్ధరణలేక జనంలో అలజడి, ఒకరిపైఅ మరొకరికి అనవసర ద్వేషాలతో గ్రామం ఎదుగుబొదుగులేక కునారిల్లుతున్నది.
ఈ మధ్య లో మనమన్నాకాస్తపట్టీంహుకుందామని ,గ్రామంలో యువతను సమీకరించి ప్రయత్నాలు చేశాను. మరుసటిరోజే ఈ దుర్ఘటన జరగటం. ఆరోజు రాత్రి నన్ను ఆసుపత్రికి తీసుకెల్లిన తరువాత మా అమ్మగారి కి స్వప్నంలో పూర్వమెప్పుడో మా గ్రామంలో గతించిన వ్యక్తులు తగాదాకు వచ్చినట్లు కనపడి ఏడి వాడు? కొద్దిఓ మాచేతనుంచి తప్పించుకున్నాడు .లోపల వాల్ల నాయనమ్మ వాన్ని నెట్టి కాపాడింది. బయటకొస్తే వాడిసంగతి చూసేవారం అని తగాదాలాడుతున్నారట . మాఅమ్మ గారు ఏడూస్తూ రాత్రల్లా స్వప్నంలో వాల్లతో తగాదాడుతున్నదట. పొద్దుటే ఏడుస్తూ హాస్పటల్ లో ఉన్న నాకు ఫోన్లో చెప్పటం జరిగింది
ఏదో పెద్దప్రమాదం జరగవలసినది అమ్మ సన్నిధిలో ఉండటం వలన తప్పుకోగలిగాను అని నమ్ముతున్నాను. ఇందుకు కారణం నావలన ఏదైనా జీవికి జరిగిన అపకారం కావచ్చు. లేదా నా కర్తవ్యపాలనలో లోపం కావచ్చు ,లేదా నాదికాని పనిని తలకెత్తుకున్నందుకుకావచ్చు , కానీ కాపాడబడినది మాత్రం ఆతల్లి అనుగ్రహం వలన మాత్రమే నిస్సందేహమిది.
జై జగన్మాతృకే

1 వ్యాఖ్యలు:
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
మీకు త్వరగా నయం కావాలని, రామదండుని ఎప్పటిలాగే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను.
మనోహర్ చెనికల
Post a Comment