శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అవినీతి పరులైన అధికారులు,ఉద్యోగులు మాత్రమే కాదు ..అహంకారం,అసహనపరులైన భక్తులూ ..తిరుమల పాలిట చీడపురుగులే.

>> Thursday, January 30, 2014

కలియుగంలో భక్తులనుద్ధరించటానికై  వెలసిన దివ్యస్థలం తిరుమలకొండ ఈ యుగాన మానవుని బలహీనతలవలన కష్టతరమైన సాధనా మార్గాలో ఆథ్యాత్మిక ప్రయాణం  అందరికీ అందదు. బిడ్డ తన దగ్గరకు నడవలేనప్పుడు తండ్రి తనస్థానం నుంచి కదలి వచ్చి బిడ్డనుదరిచేర్చుకున్న రీతిలో వైకుంఠవాసుడు తరలివచ్చి కొలువై ఉన్నదివ్యస్థలి ఇది.   అందుకే అన్నమాచార్యులు "కట్టెదుటా వైకుంఠము కాణాచైన కొండా"అని తిరుమలకొండగూర్చి చెప్పారు. ఇక కలి పురుషుడు తన ప్రతిన ప్రకారం ఆ పరంధాముణ్ణి పవిత్రమనస్సుతో చేరుకోకుండా అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తుంటాడు. ఆ మాయా ప్రభావం వలన పవిత్రపుణ్యక్షేత్రాలలో కూడా  నీచ జనగణం తిష్ఠవేసుకుని కూర్చుంటున్నది.

  ఇప్పుడు సేవాగుణం ద్వారాకాక నికృష్టరాజకీయ అధికారాలతో ఇక్కడ క్షేత్రపాలకులుగా  అధములు దిగబడుతున్నారు. వారిననుసరించి  ఆయన ప్రసాదించిన ఉద్యోగంతో బ్రతుకుతున్న ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడా శ్రీవారి పట్ల అపారమైన భక్తి కలిగిన అధికారులూ అప్పుడప్పుడు వస్తుంటారు. ఇంటివద్ద భోజనం చేసివచ్చి పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా శ్రీవారి సేవలో తరిస్తున్న ఉద్యోగులూ  ఉన్నారు, కానీ సంఖ్యస్వల్పం. .    అవినీతి వైరస్ పాకి పోయి ఉన్న  ఈబాపతు, రాజకీయనాయకులు,ఉద్యోగులు తిరుమలను వ్యాపారస్థలంగా మారుస్తున్నారు.

  ఇక ఇంకొక వైపు  అహంకారం ,అసహనం పెనవేసుకున్న  ఉన్మాదభక్తులు   పలు
దుశ్చర్యలకు తెగబడుతున్నారు.తిరుమల లో సమస్యలకు ఒక్క అధికారులను,రాజకీయ నాయకులనే బాధ్యులుగా చూడకూడదు. అంతకంటే ముందు భక్తులమని చెప్పుకుంటున్న  మనం తిరుమలపట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మావలోకనం చేసుకోవాలి.

మొన్న తిరుమలలో  వైకుంఠ ఏకాదశి నాడు  దర్శనం లేదని గొడవ  చేసిన భక్తులపై  టిటీడి అధికారులు కేసులు పెట్టడాన్ని అందరూ విమర్శించారు. అది తప్పే. అయితే ఇక్కడ మీడియాగోలలో ఒక విషయం మరుగునపడింది.
గొడవ చేసినది ఎవరు? .   సామాన్యభక్తుల్లా దర్శనాలకోసం వచ్చినవారు కాదు. సిఫారసులేఖలతో వచ్చినవారు .[ఇందులో దర్శనాలు ఇప్పిస్తామని డబ్బుదండుకునే దళారీలూ ఉన్నారట] తమకు సిఫారసు లేఖలున్నాయి గనుక తమకు దర్శనం కల్పించాల్సిందే అని ధర్నాకు దిగారు. ఇక్కడ విఐపీలుగా దర్శనానికి వస్తున్నవారికి ఎంత అహంకారం ఉందో ఇక్కడ సిఫారసు లేఖలతో వచ్చేవారికీ అంతే అహంకారం ఉంది.
 వీళ్ళ అధికారాలను చూసి వీల్లొచ్చేస్సరికే చ్చేసరికే స్వామివారు  వీరి కోసం ఎదురుచూడాలనేది  వీళ్ళఅభిమతమా?   జగత్ప్రభువు సన్నిధికి వెళ్లాలంటే ఎంతగౌరవం, వినయం,భక్తి,అణకువ ఉండాలో వీళ్లకు తెలియదు.

ఇక మొన్న శుక్రవారం రోజున పైఉన్మాదభక్తులను ఆదర్శంగా తీసుకుని  అంగప్రదక్షిణం  సేవలో పాల్గొన్న భక్తులు తమకూ దర్శనం ఇప్పిమ్చాల్సిందేనని ఆలయంలోలోనే గొడవకు దిగారు. అది  శుక్రవారం స్వామివారి అభిషేక సమయం.వీరివలన స్వామి వారి అభిషేకానికి అంతరాయం ఏర్పడింది. ఏమాత్రం  బుధ్ధీజ్ఞానం లేని చర్య ఇది. నిజమైన భక్తుడెవడూ ఇంత అపచారానికి సాహసించడు. శుక్రవారం తప్ప మిగతారోజులలో అంగప్రదక్షిణం చెసిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇస్తారు . శుక్రవారం దర్శనం ఉండదని ముందుగానే నిర్ణయించబడింది. ఐనా  ఇలా అరాచకానికి పాల్పడే మనస్తత్వం భక్తి కాదు ఉన్మాదానికి ప్రతీక.  వీరి మూర్ఖపు చర్య వల్ల శుక్రవారం అంగప్రదక్షిణం రద్దుచేయబడింది.    శుక్రవారం స్వామి ఆలయంలో అంగప్రదక్షిణం   చేసే అద్భుత అవకాశం  భక్తులకు ఇకపై లేకుండా పోయింది. ఈపాపానికి బాధ్యులు ఫలితం అనుభవించాల్సిందే .

ఇక ఈరోజు వార్త లలో ఆయనెవరో మద్దూరి గారట. ఆయన దర్శనాలు,టిక్కెట్లూ ఇప్పిస్తాననగానే క్యూకట్టి డబ్బు సమర్పించుకున్న వారిలో  స్వామీజీ లు కూడా ఉన్నారని తెలుస్తుండటం కలియుగమాయలకు పరాకాష్ఠ.
దేవదేవుడిని ఎలా దర్శించాలో బోధించవలసిన పనిలో ఉన్నవారే   ఇలా దిగజారితే  వీళ్లను  కపటకాషాయవేషధారులనే పిలవవలసి వస్తుంది. ఇటువంటి ఆథ్యాత్మిక గురువుల శిష్యరికంలో తగలడ్డ శిష్యపరమాణువులు ఇంకెంత  గొప్పవారవుతారో?
ఇక తిరుమల కొండపై యాత్రీకులకు సేవచేస్తామని స్థలం తీసుకుని నిర్మించిన మఠాలలో భారీ అద్దెలకు గదులు ఇస్తూ  కోట్లుసంపాదిస్తున్న నిర్వాహకుల ఆథ్యాత్మిక సేవ ఏమని చెప్పాలి?
ఇటువంటి  వ్యాపారులను కొండపైనుండి తరిమితేగాని   ఆథ్యాత్మికరంగానికి సగం దరిద్రం వదలదు.

తిరుమల పట్ల మనం చూపేశ్రద్ద,అక్కడ మన అణకువ, వినయం తోకూడిన ప్రవర్తన మాత్రమే శ్రీవారి అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి . అడ్డదారిలో వెళ్ళెదర్శనాలు మన పుణ్యాణ్ని క్షయింపజేస్తాయి. ఆయన కన్నీతెలుసు .శిశుపాలుడి వందతప్పులు పూర్తయ్యేదాకా లెక్కించినట్లు మన పుణ్యరాశి ఖర్చయినదాకా లెక్కలు వేసి ఆపై ఘోరమైన శిక్షలకుగురిచేస్తారు క్షేత్రపాలక దేవతలు. జాగ్రత్త .

3 వ్యాఖ్యలు:

Anonymous January 30, 2014 at 7:47 PM  

బాగా చెప్పారు.

hari.S.babu January 30, 2014 at 9:49 PM  

ఈ అరాచకాలు ఇన్ని అరుగుతూ తిరుమల అపవిత్రం అవుతుంతే ఆప లేని వాళ్ళూ యధాసక్తి ఇంకా పాపాన్ని పెంచుతున్న వాళ్ళూ యెవరో ముస్లిము స్కూలు కట్టుకుంటే అపవిత్రం అవుతుందని వీరంగాలు వేస్తున్నారు.మన అనుష్ఠానం సరిగ్గా ఉంటే వేరే మతం వల్ల మన మతానికి హాని యెలా జరుగుతుంది?యే మతమయినా ఫాలో అయ్యేవాళ్ళ డొల్లతనాన్ని బట్టే అభాసు పాలవుతుంది.

hari.S.babu January 30, 2014 at 9:50 PM  

ఈ అరాచకాలు ఇన్ని అరుగుతూ తిరుమల అపవిత్రం అవుతుంతే ఆప లేని వాళ్ళూ యధాసక్తి ఇంకా పాపాన్ని పెంచుతున్న వాళ్ళూ యెవరో ముస్లిము స్కూలు కట్టుకుంటే అపవిత్రం అవుతుందని వీరంగాలు వేస్తున్నారు.మన అనుష్ఠానం సరిగ్గా ఉంటే వేరే మతం వల్ల మన మతానికి హాని యెలా జరుగుతుంది?యే మతమయినా ఫాలో అయ్యేవాళ్ళ డొల్లతనాన్ని బట్టే అభాసు పాలవుతుంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP