శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనంత శక్తికి సంకేతం శివలింగం

>> Wednesday, November 12, 2008

పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు. ఆది అంతము లేని ఆయనను లింగాకారములో ప్రతీకగా చేసుకుని పూజించటం లో ఆంతర్యమిదే. ఆకాశము అనంతమైనది ఆకాశాన్ని గమనిస్తే అర్ధగోళాకారములో విశ్వాన్ని మొత్తాన్ని ఆవరించినట్లు కనిపిస్తుఁది. కనుకనే
శివలింగం ఊర్ధ్వభాగం అదేరూపములో ఉంటుంది. తద్వారా విశ్వరూపుడైన పరమాత్మ సంకేతరూపమయినది శివలింగము. అలాగే జ్యోతియొక్క ప్రజ్వలనము కూడా ఊర్ధ్వ దిశగానుంటుంది. జ్ఞానస్వరూపయిన పరమాత్మ ను లింగరూపం లో పూజించటం జ్ఞానశక్తిని ఆరాధించటానికి సంకేతమే.
అంతేకాక అంతమయిన శక్తిని నిలువజేసే ఆకారము కూడా లింగరూపము లోనే సాధ్యమవుతుంది. ప్రపంచములో ఎక్కడయినా చూడండి మహాశక్తియైన అణుశక్తి నినిల్వచేసే అణుకేంద్రాలలో రియాక్టర్లు ఎప్పుడూ లింగాకారమ్లోనే నిర్మిస్తారు.కారణమేమిటి? ఆ ఆకారములోనే అంతశక్తిని నిలువచేయటం సాధ్యమవుతుంది. మరొక ఆకారంలో కుదరదు. పరమాత్మలోని అనంతశక్తిని లింగరూపములో స్థాపించి ఆరాధించటంఈ లో వైజ్ఞానిక రహస్యం దాగున్నది. ఆది అంతము లేని వాడయిన అనంతుడయిన పరమేశ్వరుని అదేభావనకలిగించే చిహ్నముగా ఏర్పరచారు ఋషులు. ప్రకృతి సహితం కొండలను ,పర్వతాలను ఆశక్తికి సంకేతంగా చూపుతుంది.
ఇంతవిజ్ఞానదృష్టి లేని అల్పులు ,తమకు తోచిన తమ మనసు కనుగుణమయిన చరిత్రగ్రంధాలను వ్రాసినవారు ముఖ్యముగా ఈ కలియుగములో కలిపురుషుని ప్రభావితులు కుహన మేధావులు తమశక్త్యాను సారంగా వక్రభాష్యాలు వ్రాశారు.
ఈసంకేతము ప్రతిమతములోనూ కనపడుతుంది. ఏనుగులు కదిలించలేనంత పెద్దశివలింగాన్ని కాబా స్టోన్ గా ముస్లిములు ఆరాధిస్తారు. భవిష్య పురాణములో మక్కేశ్వర మహాలింగముగా వర్ణించబడ్ద శివస్వరూపము ఇదే. మామూదుడు అను శివకింకరుడు కలిలో జన్మించి అనంత శక్తిశ్వరూపుడైన పరమేశ్వరుని వైపు ప్రజలను మల్లిస్తాడని వ్రాసివున్నది చదవాలి మనం . ఏరూపం లేని వానిగా అనంతానికి ప్రతీకగా పరమేశ్వరుని అల్లాగా ముస్లింసోదరులు కొలుస్తారు. ఆయన తప్ప మరొకరు లేరని గాఢంగా నమ్ముతారు. అందువలనె ఆ ముక్కంటి తలలోని నెలవంక ఆర్ధానక్షత్రము నకు[ఈశ్వరునికిష్టమయిన నక్ష్త్రము] దగ్గరగా వున్న రోజులలో పవిత్రమయిన రంజాన్ ఉపవాసాలతో ఆ అనంతగుణగనుని ప్రార్ధిస్తారు. నెలవంకను పవిత్ర చిహ్నంగా భావిస్తారు. అని పెద్దలు వివరిస్తుంటారు.

13 వ్యాఖ్యలు:

Anil Dasari November 12, 2008 at 9:28 AM  

మీ దృక్కోణాన్ని వివరించే పద్ధతి బాగుంది కానీ దానితో విభేదించే వారిని అల్పులు, కుహనా మేధావులు అనటం మీ స్థాయికి తగ్గట్లుగా లేదు మాస్టారు.

Anonymous November 12, 2008 at 9:47 AM  

శాస్తలలొ కుడా పవిత్ర కాబా,ప్రవిత్ర మహమ్మద్ ప్రవక్తా గురించి రాయడం అశ్చర్యం ,అనందంగా ఉంది,
అ మహనీయ ప్రవక్త మహమ్మద్ నామం అన్ని లొకలలొ మారుమ్రేగుతుండ్డం(అమీన్) సంతోషంగా వుంది.ప్రవక్త నామం చిరస్మనీయం.
అయన గురించి వేదాలో ఇంకా ఏమి చేప్పరొ తేలుసుకొవాలి అని ఉంది.

మీరు ముస్లిమ్ లకు వ్యతిరేకం అనే ఉద్దెశంతొ మీమల్ని దుషించాను,
నా తేలివి తక్కువ తనం తొ మీ వంటి పేద్దల మనస్సు బాధా పేటినందుకు మనస్పురిగా క్షమపణలు కోరుకుంటున్నాను,

ఈ రోజు నుంచి మీతొ సన్నిహితంగా ఉండాలి అని అశిస్తున్నాను మీ సమాధనం కొసం ఏదురుచుస్తున్నాను.
నన్ను మనస్పుర్తిగా క్షమిస్తారని అశిస్తు
రసుల్ రఫి

Kathi Mahesh Kumar November 12, 2008 at 5:12 PM  

హమ్మయ్య! మొత్తానికి ముస్లింలూ హిందూ మతంలో భాగమే అన్నమాట.ఇక ఏగొడవా వుండదు.

ఇప్పుడు కేవలం కుహానామేధావులూ,హేతువాదులూ మాత్రం వ్యతిరేకంగా మిగిలారన్నమాట.వాళ్ళనీ దారితప్పిన తర్కశాస్త్రం,సాంఖ్యాశాస్త్ర కోవిదులలో కలుపుకుంటే పోలా, చచ్చినట్లు పడుంటారు!

మీరు చెప్పింది విజ్ఞానదృష్టి అన్నంతవరకూ బాగానే ఉంది. కానీ,మిగతావారు చెప్పేది వక్రభాష్యం, అలాచెప్పేవాళ్ళు అల్పులు అనే భావనుంది చూనారూ, అక్కడే సమస్య మొదలు.

Burri November 12, 2008 at 5:58 PM  

చాలా మంచి విషయం, నెనర్లు. శివలింగాన్ని ఇంటో ఉంచితే ప్రతిరోజు పూజ చేయాలట కదా! చేయలేకపోతే గుడిలో ఇవ్వాలిట కదా! ఎందుకు అలా?

durgeswara November 13, 2008 at 5:46 AM  

అబ్రకదబ్రగారికి
ఇక్కడ మీరు విబేధిస్తున్నారని నేననుకోవడం లేదు.మీరు వ్రాసిన వాటిలో ఎక్కడా మీకు తెలిసినదే సత్యం అనే పిడివాదనను నేను గమనించలేదు.అనుమాన ప్రమాణముతో ఇది నిజమా, కాదా? అన్న తర్కం అన్వేషణ కనపడుతున్నాయి.సత్యమేదో తెలుసుకోవడానికి ప్రయత్నించే మార్గంలో కనపడ్ద రాయిమీదల్లా బంగారాన్ని గీచి చూస్తున్నట్లని పిస్తుంది నాకు.అంటె ఏదో ఒకరోజు మీకు సరయిన గీటురాయి దొరికినప్పుడు దానిపై పరిశీలించి సత్యాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాను. అంతే తప్ప ఎదుటివారు చెప్పేది ఖచ్చితంగా తప్పు అన్నమొండివాదన నాకెక్కడా కనిపించలేదు మీలో .ఇక పోతే నేను చెప్పేది మాత్రం సత్యమని ప్రమాణ మేమిటి ?నిజమే .నాలాంటి అల్పమానవులు చెప్పేది పూర్ణసత్యంకాదు. నేను నాభావనను చెప్పటం లేదు. తమజీవితాలను సత్యాన్వేషనలో సమిధలుగా మార్చి మానవజాతికి వెలుగు దారి చూపిన ఋషిపరంపర ఇచ్చిన సత్యాన్ని విని తెలియజేసుకుంటూన్నది మాత్రమే. దీనిని కూడా అనుమానదృక్పథమ్తో పరిశీలించిన వివేకానందుడు,ఆధునికకాలంలో మనకు తెలిసి చలం,త్రిపురనేని,నెహ్రూ.పులుపులశివయ్య లాంటి వారిలో కొందరికి కొద్ది ముందుగా కొందరికి జీవిత చరమాంకములో ఆసత్యం గోచరమయి నది. రేపుమీరు కూడా ఆసత్యాన్ని అంగీకరించరని నమ్మకమేమిటి? జీవితమనే ప్రయోగశాలలో ఫలితాలు వెంటనే తేల్చి చెప్పలేము,రసాయనశాస్త్రప్రయోగశాలలో లాగా మూడు నిమిషాలలోనో ,సినిమాలోలాగా మూడుగంటలలోనో. కాని పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది.నాకు తేనెపూసిన కత్తిలా మాట్లాడటమ్ చేతకాదు. అయినా అదిసత్యమయినా కఠినంగా చెప్పరాదన్న వేదవాక్యానికి విరుద్దమే.మీకున్న దూర్వాసుని కోపం మీకెంతమాత్రం మంచిదికాదన్న నావాళ్ల మాటలు నాకు గుర్తుతెచ్చారు. ప్రకృతి పరమగురువు అందులో 24 మందిచేత ఏవిధంగా తాను బోధనపొందినది దత్తాత్రేయులవారు తెలియచేసారు.వారి అనుగ్రహంతో పౌర్ణమి తిథిలో మీద్వారా పరుషవాక్యాలు తప్పని ఆగురుపరంపర బోధిస్తున్నదని భావించి నాతప్పును ఇకమీదట జరగనివ్వనని తెలుపుకుంటున్నాను.

విరజాజి November 13, 2008 at 5:58 AM  

గురువుగారూ, ఆ భగవంతుని అనంత తత్వాన్ని తెలియజేసే ఆకారమే శివలింగమని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది. పోయిన సోమవారం రోజు మహా లింగాభిషేకం చేసే అదృష్టం మాకు కలిగింది. అభిషేకం చేస్తూండగానూ, ఆఖరున అలంకార సహిత స్వామినీ మీరు నా బ్లాగులో చూడవచ్చు.

http://virajaaji.blogspot.com/2008/11/blog-post_13.html

durgeswara November 13, 2008 at 6:30 AM  

కత్తి మహెష్ గారూ

ముస్లిమ్ లేకాదు క్రిష్టియన్లయినా భగవంతుని విశ్వసించే జీవులన్నీ హిందూ ధర్మములో భాగమే.ఈశపుత్ర నామ కుమారీగర్భసంభవ....అని మూసాచార్యుడు తన మతాన్ని అంటె ఇక్కడ సిద్ధాంతాన్ని ఎలాచెబుతాడో కూడా భవిష్యపురాణములో వ్రాసివున్నది. అనమ్తమైన కాలగణన చేయకలిగిన మనఋషులు భూత వర్తమానాలనే కాదు,భవిష్యద్ విషయాలను కూడా ముందే తెలిపారు. సాంఖ్యులు,తర్కవేత్తలు నిజాన్ని నిగ్గుతేలచడానికి దాని ప్రామాణికత పెంచడానికి ఆశిద్ధాంతాలను సృష్టించి వుపయోగించిన ఋషులే కాని సత్యాన్ని మరుగున పడేద్దామన్న వారు కాదు. వారి స్తాయి లోవాదనలకు మనం పోవాలంటె అమ్ట మానసిక వున్నతి కావాలి.హేతువాదులంతా దీనికి హేతువేదని వాదించి హేతువేదో తేల్చేవారేకాని ఆపేరుతో హేతువనేదే లేదు అని వాదించేవారుకాదు.
ఇక సమస్య ఎక్కడ? తెలుసుకోవాలన్ని జిజ్ణ్జాస తో పరిప్రశ్నించేవారితో సమస్యలెందుకు వస్తాయి.నాకు తెలిసింది మాత్రమే పూర్ణమ్.నా అల్పబుద్దికి అందనిది అసంపూర్ణం అని ాని అనంతమయిన ప్రమాణాలకు కూడా తన వేలి జానలతోనో బెత్తలతోనో సరిపోవాలనుకుని ,అదికుదరనప్పుడు ఆసత్యాన్ని తట్టుకోలేక ఈర్ష్యా అసూయలలు మనసులో వుంచుకొని వాదిస్తే వస్తాయి. ఇక్కడ మేమంతా అల్పజ్ణ్జానులమే,తెలుసుకోవడానికి ముందువరుసలో వుంటాము. కాని మాహాపురుషులు చూపిన మార్గాన్ని తప్పుబట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు,అవహేళన చెయ్యాలనే ప్రయత్నం జరిగేటప్పుడు అడ్డుకోలేని విశ్వాసఘాతకులము కాలేము.కనుక నాతో ఎవరికి సమస్యరాదనుకుంటాను.

durgeswara November 13, 2008 at 7:57 AM  

రఫీ
ఎంతమాట ,నేను నిన్నుక్షమించటమేమిటి? నువ్వు తనుకోరుకున్నది ఇస్తే ఎగిరిగంతులేసే చిన్నపిల్లవాడిలా,ఇవ్వకపోతే ఇల్లెగిరేలా అరిచిగీపెట్టి తల్లిదండ్రులను తిట్టె పసిపిల్లవాని వానిలా కనిపిస్తున్నవే కాని నాకుపరాయిగా అనిపించలెదు.భగవంతుని పట్ల పూర్ణవిశ్వాసమున్ననీకు సత్యమార్గాన్వేషణలో మొదటిమెట్టుమీదనే వున్నవారికి వుండవలసిన లక్షణాలె వున్నాయి కాని,కావాలనిఇతరులను దూషించే లక్షణమున్నదని నాకనిపించటంలేదు. కనుక నువ్వు తప్పు చేశావనే ఆలోచనను మనసులోంచి తుడిపివెయ్యి. కొద్దిగా మందలిద్దామని కఠినంగా మాట్లాడాను ఇంతకుముందు,దానిని మన్నించు.

ఇక ముందు నేను నీ మనసుకు కష్టం కలిగించేవానిలా తోచాను.ఇప్పుడు ఇష్టమయిన వానిలా అనిపిస్తున్నాను కారణమేమిటి? పెద్దలు చెప్పినది చర్చిద్దాము .మనమొక పిల్లిని పెమ్చుకుందామని తెచ్చాము ఇంటికి. ఒకరోజు అది ఒక ఎలుకను కొరింది,దానితో మనకు ఆనందం కలిగింది. మరొక రోజు అదేపిల్లి మనయింటిలో కోడిని మెడకొరికి చంపింది ఇప్పుడు బాధకలిగింది.ఎందుకు? ఒకేపిల్లి చేసిన ఒకేపని మనకురెండూసార్లు రెండువిధాలుగా భావాలకు కారణమయినది.ఇది మనసు చేసే మాయ . సత్యం ఏమిటిక్కడ? బాధకు,ఆనందానికి కారణం పిల్లికాదు.మనమనసే.అనిచెబుతున్నారు మహనీయులు. ఇక ఇది పుణ్యభూమి ఇక్కడ పుట్టిన మనందరం జగద్గురుపరంపరకు ఆజ్ఞానధారకు వారసులం . మనం ఆమార్గం నుంచితొలగి మనలనుమనమెద్వేషించుకుంటే ఈపుణ్యభూమినుండి జ్ఞా నభిక్షను ఆసించే మిగతా ప్రపఁచానికి మనమెమివ్వగలము.
ఇఅక నెను ఇస్లామును ద్వేషిస్తున్నవాడినెమోనని భావించానన్నావు. వాస్తవానికి ఈభూమిపై హిందువులెవరూ ఇస్లామును కాని ఇతరులను కాని ద్వేషించటం లేదు. నువ్వొచ్చి మాగుంటూరులో మస్తానయ్య బాబా దర్గాదగ్గరకాని, శిర్డిసాయి మందిరాలలొ అల్లామాలిక్ అన్న ఆమహనీయుని పూజిఁచేవారిలోకాని ,పల్లెటూర్లలో పీర్లపండగకు పీర్లు మోసి గంతులేసి ఆనఁదించేవారిలోకాని పరిశీలించి చూడు. 80 శాతం హిందువులే కనపడతారు. ఎక్కడ,ఎరూపములో వున్నా భగవత్ శక్తికి మోకరిల్లి తమ విధేయతను భక్తిభావాన్ని మనసా సమర్పించుకోవటం హిందువులకు జన్మతో వచ్చిన ఆమాటకొస్తే ఈ పవిత్ర దేశములొ పుట్టిన ప్రతి ప్రాణికీ జన్మతా వచ్చే సంస్కారమే. మనం మనమనసుకు లయమయ్యే సిద్దాంతం ,లేదా మార్గం ద్వారా భగవంతుని చేరేందుకు చేసే ఏప్రయత్నమయినా అంగీకరిస్తాము. మరి అటువంటప్పుడు ఏ ద్వేషాలెమిటి? ఎందుకు కలుగుతున్నాయి. ప్రపంచములో ఎక్కడెక్కడ అధర్మము ప్రబలుతుందో అక్కడ మహాత్ములను జన్మింపజేసి ధర్మ బోధచేపిస్తాడు పరమాత్మ. ఎడారి భూములు,సంచారజీవనాలతో ఒక ధర్మము నైతికతలేని జీవనఁగడుపుతున్న మానవ సమూహాలకు అక్కడ అవసరాన్ని అనుసరించి మహమ్మదులవారు,జీసస్ ఇలా మహాత్ములు ఉద్బవించారు. వారందరూ మనకు గురుపరం పరలోనివారే. మనదేశములో పుట్టిన నానక్ ,అక్కోల్ కోటస్వామి,తాజుద్దీన్ బాబా ,శిరిడీ సాయి ,వీరబ్రహ్మేంద్రులు,రాఘవేంద్రులలాంటి మ హనీయులు ఆకోవలోనివారే. వారందరి బోధలు మానవాళికి శిరోధార్యమే. [ప్రతిదేశానికి ఒక ప్రవక్త నియమింపబడ్డాదు 8:48...దివ్యఖురాన్]అలాపంపనిదేశమేలెదు [xxxv:24..khuraan] కనుక ప్రపంచములోని అందరు ప్రవక్తలను సర్వులూ గౌరవించవలసినదే 11:28 ...... ఇవి దివ్యసూక్తులు. కనుక ప్రపంచములో భగవత్ సిద్దాంతాలన్నన్నింటిని గౌరవించవలసిన విధి మానవులందరిది. అలాకాక తమకు తెలిసిన దానిని మాత్రమే పవిత్రము మిగతావి భగ్వత్ మార్గాలు కావు అని ప్రచారం చేస్తే మానవులలో ప్రేమలు నశించి ద్వేషభావాలేర్పడతాయి. తద్వారా ఇప్పుడుజరుగుతున్న అనర్ధాలేర్పడతాయి. తమగుంపును పెంచుకోవాలనె రాజకీయతపనలను భగవంతుని మార్గములో మిళితము చేసిన వారి చర్యలవల్ల ,ఇతరులను వారిమార్గాన్నుంచి మల్లించేందుకు చేసే చర్యలు మతప్రరాచాలద్వారా ,అటుమహనీయులు చూపిన మార్గానికి దూరమయి ,మనసులు వేరయి కలియుగములో కలిపురుషుని ప్రభావానికి [సైతాన్ ] లోనయి మానవులు ఎలా నశింపబడతారో కూడా మనఋషులు ముఁదే భవిష్యద్దర్శనంచేసి హెచ్చరించారు భవిష్యపురాణాది గ్రంథాలలో .
కనుక మహనీయుల బోధనలను వల్లెవేసి వాటిపై వాదించటం కాదు మనంచేయాల్సినది .ఆచరించటం. మార్మోగాల్సినది వారిమాటలు మనమనసులో ,పల్లవించాల్సినది మననడతలో. భగవ్త్సేవలో మరొక భగవత్ బంధువునికలిపినందుకు ఆసర్వేశ్వరునకు ప్రణామాలర్పిస్తూ మరొకసారికలుసుకుందాము సెలవు.

durgeswara November 13, 2008 at 8:15 AM  

మీరు భగవంతుని మూర్తిని ఏభావనతో ఎంటికి తెచ్చారు? భగవఁతుడనా లేక అలంకారవస్తువనా ? ఒకచుట్టాన్ని ఇంటికి పిలిస్తే ఎన్నోమర్యాదలు చేస్తాము, మరి సాక్షాత్తూ భగవంతుని ఆహ్వానించితే కనీసమర్యాదలు చేయవద్దా? అవి మనకు చేతనయినంతలో చాలు. పొద్దుటనే నీల్లు పోసుకుంటాము కదా/ అప్పుడు వెళ్ళి పూజగదిలో పదినిమిషాలు వెచ్చించలేమా?.కొద్దిగా నీళ్ళు తీసుకుని నమస్సివాయాని ఆయన తలపై పోసి రెండుపూలు పెట్టి నమస్కరిస్తే ఆయింటిలో లేమిఅన్నది లేకుండా చేసే కరుణాస్వభావుడాయన, ఆమాత్రం చేయలేమా. మనకున్న బోడి నాలుగుసమస్యలకే సమయంచలలెదనే బద్దకంతో ఈమాత్రం పనికి కూడా వెరచి ఎవరో సృష్టించిన అపోహ ఇది. మనం పిలిచి పలకరించలకపోతే లోకాలన్నీ చూడాల్సిన ఆయనకు మనమీద శ్రద్ధచూపేసమయం అవసరం వుంటాయా?
రఘునాధరెడ్డిగారూ మీరు నిరభ్యరంతరంగా శివలింగాన్ని పూజించండి. శుభం

Anonymous November 13, 2008 at 8:57 AM  

గురువు గారు,
మహ ప్రవక్త మహమ్మద్ (స.లం) ను గురించి పురణాలొ ఎమి వివరించారు అని తెలుసు కోవాలి అని వుంది దయచేసి తేలియజేయగలరు.
అతి పవిత్రమైన కబా ను పవిత్ర శివలింగం అన్నారు దానిని గురించి వివరించండి

రసుల్ రఫి

Anonymous November 13, 2008 at 12:12 PM  

దుర్గేశ్వర గారూ,

క్రింది వ్యాఖ్య చదవబోయే ముందు ఒక ముఖ్య విషయం! ఇది పరిప్రశ్నయే గానీ, అహంకారపూరిత, వ్యంగాత్మక ప్రశ్న/అభిప్రాయం కాదు అని మనవి.

శివుడి ని లింగ రూపంలో ఎందుకు ఆరాధిస్తాం అన్న ప్రశ్న కు ఇచ్చే వివరణ కు విజ్ఞాన దృష్టిని ఆపాదిస్తే, ఆ వివరణ కు సాధికారత వస్తుందా? ఆధ్యాత్మికత గురించి మాట్లాడటానికి నేను అర్హుడిని కాదు కానీ; మతాలూ, విశ్వాసాలూ, శాస్త్రాలూ, విజ్ఞానశాస్త్రం మొదలగునవి ఒక రకం గా చూస్తే ప్రపంచం గురించిన వివరణలు.(a set of claims about the world we live in)

బిగ్ బ్యాంగ్ థియరీ కి మన ఉపనిషత్తుల లోని కొన్ని శ్లోకాలకీ సారుప్యత ఉందని ఎక్కడో విన్నాను. ఇప్పుడు విజ్ఞానశాస్త్రం లోని సిధ్ధాంతాలకి, ఉపనిషత్తుల కీ మధ్య ఈ యాధృఛ్ఛిక సంబంధాన్ని గురించి మాట్లాడుకోవడం చాల మంచి పరిణామమే, కానీ ఉపనిషత్తులను *వివరించడానికి* విజ్ఞానశాస్త్రాన్ని సరి కాదు అని నా ఉద్దెశ్యం.

జీససు ను చర్చిలో చూస్తాము, ఆయన అన్ని చర్చిల లోనూ శిలువమీదనే దర్శనం ఇస్తారు. ఇలా ఎందుకని ఎవ్వరయినా అడిగితే, సమాధానం గా ఒక వివరణ/కథ ఉంది, అది ఏంటో చాల మందికి తెలుసు. సరిగ్గా అలాంటి ప్రశ్నే శివుని విషయం లో అడిగితే, కోకొల్లలు గా సమాధానాలు వస్తాయి, ఆ వేర్వేరు సమాధానాలతో మనకు ఏ మాత్రమూ సమస్యలు ఉండవు కూడాను!! నా దృష్టిలో అదే భారతీయ సంప్రదాయాల గొప్పదనం.

ఇక కుహనా మేధావుల విషయానికి వస్తే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఊరి బయట చెరువుకెళ్ళి సంధ్యావందనం చేస్తున్నారనుకోండి. అదే సమయాని కి రోదసినౌక లో కొందరు గ్రహాంతర వాసులు అక్కడికి వచ్చారు అనుకుందాము(గ్రహాంతర వాసులు ఉన్నారా, వారి ఉనికి నేను నమ్ముతాన అన్నది ఇక్కడ అప్రస్తుతం), వారికి మన భాష తెలియదు, అసలు ఆచారాలు అన్న భావనే తెలియదు, కాబట్టి సంధ్యావందనం చేస్తున్న మిమ్మల్ని చూసి వారి భాషలో "హిప్ కాపి" అంటారు అనుకుందాం. ఇక్కడ వారి తప్పేమీ లేదు. వారికి మన విషయాలేమీ తెలియదు కాబట్టి, వారి అలోచనలకూ, మాటలకూ ఒక పరిధి ఉంది.(They are constrained by what they know, or what they don't)

ఇక్కడ సమస్య ఏంటంటే, వారు మీ సంధ్యావందనాన్ని చూసి "హిప్ కాపి" అనడం కాదు. మనకు సహనం ఎక్కువ, అలాంటి వారిని చూసి జాలి పడతాం లేకపోతే నవ్వుకుంటాం. సమస్య, వారన్న "హిప్ కాపి" వివరణ ని మన ఊళ్ళోని వాళ్ళు నేర్చుకుని, దానిని నిజమని నమ్మి, అదే విజ్ఞానం అని తెలిసినవాళ్ళందిరినీ మభ్య పెడితే ఏంజరుగుతుంది? రేపటి నుంచి ఎవరు సంధ్యావందనం చేసినా జనం "ఓహో, ఇదే హిప్ కాపి" అని అంటారు. ఇలాంటి వెన్నెముక లేని మేధావులని ఏమంటారు? మీరన్న కుహనా మేధావులు అనే మాట, చాల మర్యాదాపూర్వకమైనదని నా ఉద్దేశ్యం.

శివలింగం మీద చర్చకు ఆహ్వానిస్తూ మీరు గతంలో రాసిన టపాలో, ఇదే జరిగింది. పాశ్చాత్య ప్రపంచం లో "ఇండాలజి" పేరిట మన సంస్కృతిపై జరుగుతున్న దాడిలో భాగమే; శివ లింగం గురించీ, వినాయకుని తొండం గురించీ, రామకృష్ణ పరమహంస గురించీ అసభ్యకర వర్ణనలు, కించపరిచే వర్ణనలు. ఇలా తెలుగు భాషలో రాయలేని ఈ వర్ణనల్లో వర్ణనలో భాగమే, ఇక్కడ ఒకానొక పాఠకుడు రాసిన వ్యాఖ్య.

మీ బ్లాగు చదవటం ద్వారా మీరు సాత్త్వికులని తోస్తున్నది. మీ మంచితనం అనుసరణీయం. కానీ, మీలాంటి అర్హులైన వారు, ఇలాంటి చెత్త ని చూసీ, ఖండించకుండా ఉండమనీ, మౌనం గా జనం రాసే చెత్త ని భరించమనీ, పల్లెత్తు మాట కూడా అనవద్దనీ మీకు మితవాదులు కొన్ని ఉచితసలహాలు పడేస్తారు. సలహాలు ఉచితమే కాబట్టి, నాదీ ఒక చిన్న సలహా. మీరు కుహనా మేధావులు అన్నపుడు మీ ఉద్దేశ్యం మనుషులను నొప్పి పెట్టటం కాదు. వారు నమ్మే వినాశకర సిధ్ధాంతాలని. కాబట్టి మిమ్ములని మీరు ఎప్పుడూ చిన్నబుచ్చుకోకండి, అది తప్పు కాదు.

భస్మాసుర

durgeswara November 14, 2008 at 6:16 AM  

భస్మాసురగారూ
మీరు వ్రాసినది చాలాలోతయిన విషయం.మీరన్నట్లు భగవంతుడు విజ్ణ్జానశాస్త్రాలకు,వాదనలకు అందనివాడే.సందేహంలేదు.ఇక ఆపరమాత్మ నడిపే జగన్నాటకంలో అన్ని పాత్రలూవుండాలి లేకుంటే నాటకం రక్తికట్టదు.అలాగే మనపాత్రలన్ని.

chiranjeevi July 11, 2010 at 9:21 AM  

Naakunna chinni burra prakaaram, naa abhipraayam chebuthunnanu. thappunte sorry.

Poorva bharatha desamlo, kulaalu(varnaalu) yevaripani vaau chesukoni poyevaaru. ippatilaagaa anni thelusukovaalanikaaka, vaari vruththilone naipunyam saadinchevaau.

Medhavulu(rushulu anukundaam) yenno prayogaluchesi koththa vishayaalu kanugunevaaru. Aa vishayaalu saamanyulaku chechadaaniki daivam ane peru vaadukunevaaru(ex: tulasi, pasupu etc). Yendukante vere vaariki explain cheyyalanna ardham kaadu kaabatti. ave aacharalu ayyayi.

Alagani nenem hethuvaadini kaanu. bhagavanthudu lekundaa sruste ledani nammevaadini.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP