శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తెలుగు బ్లాగు లోకానికి నేచేసిన సహస్రనామార్చన

>> Wednesday, May 2, 2012

బ్లాగులోకంలోప్రవేశించి మూడుసంవత్సరాలు దాటుతున్నది. ఇక్కడ కొచ్చి ఏదైనా పదిమందికి ఉపయోగపడే పని ఏకొద్దిగానైనా చేశామా ? అని ఆలోచించు కుంటున్నాను. లోకహితం కోరి మహాపురుషులైన మన ఋషిపరంపర అందించిన మహావిజ్ఞానం గూర్చి నాకుతెలిసిన తక్కువ పరిజ్ఞానాన్ని వ్రాసుకుంటూ అందుకు వందలరెట్లు ఎక్కువగా బ్లాగులోకం నుంచి నేర్చుకున్నాను . ఎక్కడో ఏజన్మ లో అనుబంధమో తెలియదు గానీ ఎందరో ఆత్మీయమితృలను సంపాదించుకోగలిగాను. మాష్టారూ ! అంటూ ఆప్యాయంగా పలకరించే యువతరం అభిమానాన్ని పొందగలిగాను.
బ్లాగులోకంలో హేమాహేమీలైన తాడేపల్లి,చదువరి, సత్యన్నారయణ శర్మ, భాస్కర్ రామరాజు,రామిరెడ్డి,నల్లమోతు శ్రీధర్,వలబోజు జ్యోతి,కొత్తపల్లి,సుజాత,మధురవాణి పద్మ, మాగంటి ,మళ్ళిన నరసింహారావు , జయదేవ్ ,రాజశేఖర్, చిలుమకూరి,ాఅదిలక్ష్మి, ఆంధ్రామృతం,భరద్వాజ,యోగి, అయ్యంగారి, నాగేంద్ర ,కశ్యప్,వీవెన్, విజయశర్మ ఇలా అనేకమంది మితృలతో[పేర్లన్నీ వ్రాయలేకపోయినందుకు క్షమించాలి .. ఈమధ్య వంశీ గారన్నట్లు నేను కూడా పెద్దముండా వాడ్నవుతూ పేర్లు వెంటనే గుర్తుకు రావటం లేదు ] కలసి తెలుగు బ్లాగులోకంలో నేనూ రెండుమాటలు వ్రాయగలిగాను. ఇక నాగప్రసాద్,మనోహర్,శ్రీకర్,నాగమురారి,చక్రవర్తి , చింతలపాటి శ్రీకృష్ణ , కృష్ణాస్ ,రాజశేఖర్,త్రినాధ్ ఇలాంటీ యువతరం తో బ్లాగులోకంలోనేకాక బయట ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోగలుగుతున్నాను .
కలి పురుషుని ప్రభావంతో భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానంపై కలిసేన జరుపుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకొంటున్న ధర్మ వీరులతో నేనూ గొంతుకలపగలుగుతున్నాను . మహర్షులిచ్చిన ఆథ్యాత్మిక సంపదతో మానవుని జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకొనవచ్చు అనే నమ్మకం కలిగిన నేను దాన్నిఆస్తికుల జీవితంలో ప్రయోగాత్మకంగా నిరూపించుకునే ఆథ్యాత్మికప్రయోగాలను అందించి ఉడతాభక్తిగా సహాయ పడగలుగుతున్నాను ...పొరపాటు ..పొరపాటు. నేనూ భగవత్ లీలలపై ఈ రూపేణా శ్రధ్ధాశక్తులు పెంచుకోగలుగుతున్నాను.
కత్తిమహేష్ ,సాంబారు గారు, లాంటి విమర్షకులకు నేను భారతీయసైధ్ధాంతిక భావజాలంతో చర్చలు ,వాదనలు జరిపానేకాని వారందరూ నాకు సోదరసమానులేగాని అన్యంకాదు .కొందరికి నావాదనల వలన శతృవుగా కనిపించానేమోకాని ! నామనసులో మాత్రం ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం పొడచూపకుండా జాగ్రత్తపడుతూనే ఉన్నాను.
వెయ్యిన్నెనిమిది పోస్ట్లులు దాటి ,లక్షమందిపైగా వీక్షకుల అభిమానానికి నోచుకుని ,ఆథ్యాత్మికంగా పలువురితో కలసిపనిచేస్తూ ..హరినామ సంకీర్తనా పథంలో నడుస్తూ నేను ఇతరులకిచ్చినది ఇసుకరేణువంత మాత్రమే నైతే ఇక్కడనుండి పొందుతున్నది కొండంత.

ఇంత పెద్ద బంధువర్గాన్ని ప్రసాదించిన తెలుగు బ్లాగ్ లోకానికి నేను ఋణపడే ఉంటాను జన్మాంతం వరకు

జైశ్రీరాం
జైశ్రీరాం

12 వ్యాఖ్యలు:

madhu May 2, 2012 at 2:44 PM  

Meelanti Goppamanusunna manushulni Blog loka param ga chudatam Naa purva janma adrustame!!! saati maanavula patla Mee ee drukpadam ananya nee yam!
Devudu eppatiki meeku manchi cheyalani aakaankshistu...
Mee Abhimani.
Madhu

Kottapali May 2, 2012 at 5:59 PM  

Keep up the good work sir. Happy Anniversary

జ్యోతి May 2, 2012 at 6:14 PM  

అభినందనలు.. వార్షికోత్సవ శుభాకాంక్షలు

వనజ తాతినేని/VanajaTatineni May 2, 2012 at 6:48 PM  

ఆత్మ సంతృప్తికి మించినది మరేది లేదు. మీరు మనఃపూర్వకంగా ..చేసిన పనికి .. మీకు సంతోషం ఇచ్చి ఉంటుంది.
బహుజన హితాయ -బహుజన సుఖాయ..
ధన్యవాదములు దుర్గేశ్వర గారు.

buddhamurali May 2, 2012 at 7:59 PM  

కత్తిమహేష్ ,సాంబారు గారు, లాంటీ విమర్షకులకు నేను భారతీయసైధ్ధాంతిక భావజాలంతో చర్చలు జరిపానేకాని వారందరూ నాకు సోదరసమానులేగాని అన్యంకాదు
...............
బాగుంది. ఒకరి అభిప్రాయాలను మీరు వ్యతిరేకించ వచ్చు, మీ అభిప్రాయాలను ఇతరులు వ్యతిరేకించ వచ్చు .. కానీ చర్చ, అభిప్రాయాన్ని వెళ్ళ డించడం హుందాగా ఉండాలి . అన్ని బ్లాగ్స్ లోను ఇలానే హుందాగా తమ అభిప్రాయాలు, వ్యతిరేకతలు చెప్పుకోవాలని కోరుకుంటూ ........

జాహ్నవి May 2, 2012 at 11:43 PM  

గురువు గారికి, వార్షికోత్సవ శుభాకాంక్షలు.

shiva shankar May 3, 2012 at 12:13 AM  

chala manchi prayatnam chestunnaru. mee blog regular chustanu.

Anonymous May 3, 2012 at 3:44 AM  

happy anniversary.

Anonymous May 3, 2012 at 5:36 AM  

happy birth day

Anonymous May 3, 2012 at 8:20 PM  

నేనెవరో మీకు తెలియకపోయినా బాధలేదు, శుభాకాంక్షలు అందుకోండి

durgeswara May 4, 2012 at 4:00 AM  

పేరుపేరునా మీ అందరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను

anrd May 5, 2012 at 2:18 AM  

వార్షికోత్సవ శుభాకాంక్షలండి.
మరెన్నో వార్షికోత్సవములతో, మరెన్నో చక్కటి టపాలు అందిస్తారని ఆశిస్తున్నానండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP