శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్లాగ్ లోక హిరణ్యకశిపునింట ఓ భక్త ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు

>> Wednesday, February 10, 2010


విష్ణుని మహిమలను ,ఆయన లీలలను వర్ణించనెవరి తరముకాదు . ఏంటో ఒక్కోసారి లోక కళ్యాణకరమైన ఆయన లీల అసలర్ధంకాదు , కానీ తెలుసుకున్నతరువాత ఆశ్చర్యపోతాము . వేడిన వారికి దరశనమీయవు !వలదని నిన్ను వారించువారిని వదలక వెంట తిరిగెదవయ్యా ! అంటూ భక్తులు పాడుకుంటూనే ఉన్నారు యుగయుగాలుగామహాభక్తులు . ఎవరు ద్వేషిస్తారో వాళ్లచేతనే పలుమార్లు తన నామాన్నుచ్ఛరింపజేసే చిత్రమైన లీలలు చేస్తాడాయన.

అప్పుడెప్పుడొ హిరణ్యకశిపుని నృసింహమూర్తిగా సంహరించినప్పుడు ఆదుష్టుని రక్తం విశ్వాంతరాలకు ఎగజిమ్మగా ఆరక్తపు తుంపరలు మెల్లగా భూమిపైవాలుతూ రాక్షసాంశలుగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాయి ,ప్రతియుగాన,ప్రతి తరాన . మానవ జన్మ తీసుకున్నా తమలో ఇంకి కరుడుగట్టిన విష్ణుద్వేషం మరచిపోకుండా ఆజీవి ,లోకాన విష్ణుద్వేషిగా పాతవాసనలను ప్రదర్శిస్తూనే ఉంటుంది .

ఇలా ఒకానొక రక్తబిందువు ఈయుగంలో ,ఈతరం లోనూ తెలుగుగడ్డమీద ఓ బ్లాగ్లోక మేధావిగా జన్మించినది. విద్యాబుద్దులు నేర్చి అన్నివిషయాలను చదివే పరిజ్ఞానం సంతరించు కున్నాడు. . తన పరిజ్ఞానాన్నంతా జనంలో విష్ణువుపైన ద్వేషం కలిగేలా చేయగలగటానికి , ఆపేరు చెబితేనే మండిపడే తన పూర్వలక్షణాన్ని అనుసరించి ప్రదర్శిస్తున్నాడు. .రాక్షసులు కూడా అద్భుత పాండిత్యాన్ని సంపాదించటం లోను సాధన చేయటం లోనూ ఏమాత్రం తక్కువవారుకాదు. మొండిపట్టుదల తీవ్ర తామసిక లక్షణాలతో అనుకున్నది సాధించగలరు. కాకుంటే ఆ జ్ఞానాన్నంతా భగవంతుని పట్ల ద్వేషంతో ఆత్మ వినాశనానికి ఉపయోగించుకుంటారు . పరమదయాళువైన ఆస్వామి తన పూర్వ భక్తుడు ఈ జన్మలోనూ పతనం కావటం సహించక వారి క్షేమం కోసం మరలా మరలా వారిచేత తన నామాన్ని స్మరింపజేసే రీతిలో తనలీలలు సాగిస్తాడు.


ఇక్కడ ఆ హిరణ్యకశపాంశ తో జన్మించిన ఆజీవి తన రచనలలో. వాదనలలో ప్రస్ఫుటంగా విష్ణుద్వేషం కన్పిస్తూ ఉండటం నాకనుమానం కలిగించింది .ఎందుకు ఈ జీవి ఇంతగా భగవద్వేషాన్ని ప్రదర్శిస్తున్నడా? అని ఎంతాలోచించినా గాని ,ప్రశ్నించి చూసినా గానీ సమాధానం రాలేదు . ఎందుకో హఠాత్తుగా ఈ విషయం స్ఫురణకు వచ్చి ఆలోచించాను . ఓసారి ఈ హిరణ్యకశిపుని ఇంట ఉన్న భక్తప్రహ్లాదుని ఫోటొ చూడటం తటస్థించింది . వాని ముఖం లో తేజస్సు ,భగవద్భక్తుని లక్షణాలను చూడగానే పోల్చుకున్నాను . సందేహం లేదు .ఈయనచే భగవన్నామ స్మరణ పలుమార్లు చేపించడానికే ఈయనకు జన్మించిన ప్రహ్లాదాంశమని అనుకోవచ్చు. ఈయనకు సహచర్యం చేస్తున్న ఆసాధ్వి నాటి లీలావతి అంతటి వందనీయ మాతృమూర్తేనని నాభావం .

ఇక ఇక్కడనుంచి మనం శ్రీహరి లీలా విలాసాన్ని చూడవచ్చు . ఈ హిరణ్యకశిపుడు పైకి కన్పించినట్లుగా నాస్తికుడేమీకాదు . నాస్తికత్వం ఒక ముసుగుమాత్రమే . లోపల చూస్తే ఆయన కూడా ఏదో రూపం మీద నమ్మకమున్నవాడే . కానీ సర్వాంతర్యామియగు హరి నామాన్ని సహించలేని ఈర్ష్యాద్వేషాలు కరుడుగట్టి ఉన్నాయి మనసున . కానీ కరుణాంతరంగుడైన శ్రీహరి లీలలకు ఇదే వేదికవనుంది.

ఇప్పుడు పెరుగుతున్నా బాలప్రహ్లాదుడు " హరి నీవే ...సర్వాత్మకుడవు " అనిపాడకా మానడు .అదివిని ఈయన మనస్సు అగ్నిపర్వతంలా కుతకుతలాడక మానదు .అదొక హింస ......పాపం. విష్ణువొక చిల్లరదేవుడు ... ఎవరా గోవిందుడు అని గర్జించి ప్రశ్నించిన నోటితోనే ., ముకుందా....ముకుందా .కృష్ణా ,,ముకుందా ...ముకుందా అని మురిపెంగా బిడ్డను పిలచి లాలించక తప్పని స్థితి కల్పించాడు స్వామి . ఎంతకాదనుకున్నా అంతరంగం లో ప్రేమతరంగాలు మిళితమై భగవన్నామం ప్రేమ పూరితంగా జపించబడుతుంది . ఇది తెలిస్తే ఇంకా నరకం . ఛీ ..ఛీ దానవ వైరి ఆ హరి నామం నేనునా నోట పలకటమా థిక్.... అని ఇంతెత్తెగిరినా సరే ,తప్పదు. నాన్నా !అని ఆబుడతడు పిలవగనే నాయనా !అని హరినామంతో వాడిని పిలవక తప్పనిస్థితి కల్పించాడు లీలానాటకసూత్రధారి.

పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ భక్తి ప్రవర్ధమానమై మన బాల ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తమునిగా ఎదుగుతున్నప్పుడు అది సహించలేక ,నిరోధించలేక ప్రేమద్వేషాలనేవిరుధ్ధభావలమధ్య నలుగుతూ విష్ణుద్వేషం యొక్క ఫలితం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అభినవ హిరణ్యకశిపునకు . ఎలాగోలా వానిని విష్ణువుపట్ల విరక్తునిగా మార్చాలని మార్చలేకపోయినా నాస్తికునిగానైనా మార్చి భగవ్ద్భావానికి దూరం చేయటం కోసం ,,ఒరే ద్వుడులేడు ..గీవుడు లేడు ,అని మన రాక్షస చక్రవర్తి అనగానే ..అయ్యో భగవంతుడు లేకున్న ఇదంతా ఎలాసృష్టించబడినది తండ్రీ అని మన బాలభక్తుడంటాడు . అయితే ఏడిరా ! చూపించు ? అని ప్రశ్నించగానే ..... ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు .... అంటూ ప్రహ్లాదుడు వివరణ ఇస్తుంటే దేహం కంపిస్తూ హృదయం రగిలిపోతూ ... అబ్బా ! ఆదృశ్యాన్ని ఊహించికుంటుంటే చాలు మనసు పులకించి పోతోందికదా ! అది అంతే .నారాయణ నీలీలా నవరసభరితం అంటూ మనం పాడుకుంటూ వేచిచూద్దాము .
ఇంకా హిరణ్యాక్ష ,రక్తబీజ ,మహిష,మహాకాయ, తాటక ,సుబాహు మారీచాది రాక్షసయూధముఖ్యుల అంశలుకూడా ఇక్కడ మనకు తటస్థిస్తున్నాయి . మరక్కడేమి మాయచేశాడో మహామాయకు అధినాయకుడు, తెలియదుకదా మనకు.

యుగయుగాన జరిగే విష్ణుమాయను ఊహించతరమా ! మనబోంట్లకు


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP