కలిసేన నాపై " కత్తి"గట్టిందెందుకు ?
>> Wednesday, March 10, 2010
ఇక నా వంతు ప్రయత్నమేమి చేయాలి ? ఎవరుకొత్తగా చెప్పేదేమీ లేదు . ఆ అవసరం అసలే లేదు . కావలసినదంతా మహాత్ములు ఇచ్చే ఉన్నారు. దానినుపయోగించుకుని భౌతికంగా ఈలోకంలో భగవంతుని ఉనికిని మన జీవితయానం లో గమనించి ఆయనపట్ల శద్దను పెంచుకోవటమే . ఈ విపత్కర స్థితిలోను కలి ప్రభావం వలన సనాతనమైన ఈ ధార్మిక ప్రవాహాన్ని అనుసరిస్తూ, సాధారణమానవులను ఈ దివ్యప్రవాహం తో మమేకం చేస్తూ మహనీయులెందరో తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. కలి ప్రభావం వలన కాస్త కూస్త సాధనచేసి అల్పశక్తులను పొందిన కొంతమంది రకరకాల సిద్దాంతాలను జనం ముందుకు తెస్తూ గందరగోళ పరుస్తున్నారు.
ఒకాయన సాధనచేసి నువ్వు భగవంతుడవౌతావని అంటాడు. కృష్ణుడు ,రాముడు మానవమాత్రులేనంటాడు. వాల్లంతా సాధనతో దేవుల్లయ్యాడంటాడు. [కృష్ణుడు పసిపిల్లవానిగా పూతన ప్రాణాలు హరించినప్పుడు భగవంతుడే .కంసాది దానవులను నిర్మూలించినప్పుడు భగవతుడే .మహాభారత యుద్దభూమిలో విశ్వరూపాన్ని చూపినప్పుడూ భగవంతుడే. యన ఏ సాధనతోను భగవంతుడు గా గుర్తించబడలేదు.. అని సప్రమాణం గా భాగవతాదిగ్రంథాలు ,గీతాబోధ స్పష్టం గాచెప్పినా ఈయన తనకొలతలతో చిన్నగా చేయాలనే ప్రయత్నం,వ్యాఖ్యానాలు తమతమ ఆలోచనలతో వ్రాస్తుంటారు.] మరొకవైపు భగవద్భక్తులైన సద్గురువులు యథాతథంగా భగవంతుని మాటలను అంగీకరించాలని వివరిస్తున్నా ఇటు వంటి వారి కెక్కవు. మరికొందరు శిష్యులను హఠాత్తుగా శక్తి పాతాలతో నేరుగా భగవత్ సన్నిధికే పంపుతామంటారు. ఇంకొకరు కొత్తరకం యోగం ,ధ్యానం అంటారు . ఇలా ఆథ్యాత్మిక రంగం గందరగోళంగా కనిపిస్తున్నది బయటనుంచి చూసేవారికి .
ఈ లోపల కొత్తాదేవుడండీ ! అంటూ మరో బృందగానం మొదలవుతుంది . ఇక మహాభారత కాలంలో సాక్షాత్తు పరమాత్మకు సన్నిహితునిగా ఉన్న అర్జునుడు శివున్ని కొలచి నా వాల్లు ఏబేధం చూపక అనుగ్రహించిన వైనం చదివినా కొందరింకా ఆబేధాలను మరచిపోలేదు.. ఇక మానవాళిని అనుగ్రహించటమే ధ్యేయంగా భూమిపై పలుప్రాంతాలలో అక్కడ అవసరాన్ని బట్టి దత్తాంశతో జన్మించి మానవు లకు మోక్షమార్గాన్ని బోధించిన సద్గురువుల బోధలను, తమ తమ వ్యాఖ్యానాలతో మరుగు పరచి విస్తరణవాద సిద్దాంతాలుగా మలచి దానిని ప్రచారమ్ చేసి ఈధర్మం నుంచి జనాన్ని వేరు చేసే గుంపుదాడులు . మాసిద్దాంతాన్ని నమ్మకపోతే నరకటానికైనా సిద్దమనే పద్దతి ఒకటైతే.మిగతా మార్గాలలో భగవంతుని వైపు వెళ్ళేవాళ్లంతా పాపులు కనుక, మీ పాపము మాగుంపులో చేరితే పోతుంది. మావలెనే మానవులందరినీ మార్చాలనే సంకల్పంతో మీకోసం మేము శ్రమిస్తున్నాము కాబట్టి మీరు మీధర్మాన్ని విడచి మా గొర్రెపిల్లలవలే అగుడీ... అని రకరకాల వ్యూహాలతో ముంచుకొస్తున్న ముప్పొకటి. వీరందరినీ తట్టుకుని నిలబడి ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్న జనం,వారికి సనాతన ధర్మాన్ని వివరిస్తూ సాగుతున్న సత్ పురుషులు,సాధుపుంగవులు కలి సేన దాడులతో అల్లల్లాడుతున్నవైనం మనకు కనపడుతున్నది. ఈ తాకిడుతట్టుకుని మాహాత్ములు తమ దివ్యసంకల్పాలతో మానవజాతిని మోక్షమార్గం వైపు మళ్ళించే పని సాగిస్తూనే ఉన్నారు. వారిని ఎగతాళి చేసినా,అవమాన పరచినా అసలు పట్టించుకోకున్నాగాని వారి ప్రేమ భావతరంగాలు మనలను సన్మార్గం లో నడచేప్పుడు పడిపోకుండా చేయిపట్టుకుని నడుపుతూనే ఉన్నాయి. కాబట్టే భూమాత ఈ కలి ఆగడాలను ఇంతవేదనతోనైనా తట్టుకుని ఉన్నది. మన ప్రాచీన రుషులు నడచి బాగా నలగిన బాటే శ్రేయస్కరము తప్ప మరొకటి మానవాళికి మార్గము కాదు. వారు చెప్పని కొత్త సిద్దాంతాలు మనకవసరం లేదు .
ఉడుత భగవత్ కార్యానికి ఇసుకరాల్చి ధన్యమయిన చందంగా మనం మన ప్రయత్నం చేయాలి. మనుషులు పరుగుపందెం గా జీవితాన్ని మార్చుకుని ఉన్నారు .ఇన్ని ఆధునిక సౌకర్యాలొచ్చినా భగవంతుని సేవించే సమయం చాలక ఏదో మొక్కుబడిగా ,భయంతోనో ,భక్తితోనో ఆయనగూర్చి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతున్నది . మనసులో భగవంతుని పట్ల భక్తి ఉన్నా ఏదో ఒక సందర్భం ఉంటేగాని అభ్యాసపూర్వకంగా ప్రతిరోజూ దైవనామస్మరణ చేయరు. [అందరూ అనికాదు నా ఉద్దేశ్యం] ఎక్కువమంది స్థితి ఇలా ఔతున్నది. కాబట్టి ప్రతిరోజు ఏదో కొద్దిసేపైనా ఆభగవంతుని దివ్యనామాన్ని స్మరిస్తుంటే ఖర్మ ఫలాలు తొలగి జీవితం లో ఎదురయ్యే ఆటకాలను దాటగలుగుతారు. దానికోసమే సద్గురువులు అనేకమంది సత్సంగాలు భజనలు, పూజాదులు లోకంలో చేపిస్తున్నారు. ఆరీతిలోనే ఎలాగూ పీఠములో చేస్తున్న సేవను నా ఒక్కడికోసమే గాక పలువురికోసం పంచుకోవటం లో తప్పేముంది ?. కనుకనే అనుకోకుండా ఈ అంతర్జాలం లోకి ప్రవేసింపబడ్డ నేను ఇక్కడ నాతో పాటు కార్యక్రమాలలో పాల్పంచుకునేందుకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇక్కడ బాగా గమనించి చూడండి . నేనెప్పుడూ మీ కోసం నేనే సాధన చేస్తానని చెప్పలేదు. ఈకార్యక్రమంలో మీగోత్రనామాలతో ఇక్కడ పూజ జరపాలంటే ఆకార్యక్రమానికి అనుసంధానంగా పంపినవారు భగవన్నమమో ... మంత్రమో ,రోజూ..జపించాలని స్పష్టం చేస్తున్నాను. రోగి ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సెలైన్ ఎక్కిస్తాము .తరువాత ఆహారం తీసుకుని రోగిశక్తివంతుడు కావాలి . అదీ నా నమ్మకం .అలానే స్వయంగా భగవంతుని శరణువేడాలి ఎవరైనా .మిగతావారు చేసే సహాయం స్వల్పం మాత్రమే నని నా అభిప్రాయం. అయితే వీరబ్రహ్మేంద్ర ,రాఘవేంద్ర ,సాయి నాథులవంటి సద్గురువులు ఈ నియమానికి లోబడరు. వారు సమర్ధులు కనుక తమ అనుగ్రహం చేత ఏమైనా చేయగలరు. నేను చెప్పేది సాధారణ సాధకుల విషయం . నాకైతే అటువంటి శక్తి ఇసుమంతా కూడా లేదనేది సత్యం . కాబట్టి స్వయంగా మీరు ఈసాధన చేయండి ఈ పద్దతిలో అని చెబుతూ వివిధ సందర్భాలలో కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నాను .. ఇది నాతె లివితేటలతో చెబుతున్న విషయం కాదు . మహాత్ములు మహర్షులు మనకిచ్చిన మహా సంపద . ఫలానా నామాన్ని .లేదా ఫలానా మంత్రాన్ని ఇలా [సంఖ్యప్రధానం కాకపోయినా ఒక అభ్యాసం కోసం చెబుతుంటాము] జపించి చూడండి . మీసమస్య ఎలా మీరే పరిష్కరించుకోగలుగుతారో చూడండి అని చెబుతున్నాను. ఇదొక ఆథ్యాత్మిక ప్రయోగం ,ఫలితం పొందాకైనా వాళ్లు భగవంతుని పట్ల ద్విగుణీకృతప్రేమభావంతో భక్తిని పెంచుకుని ఆయనను సేవిస్తూ తమతమసాధనలను సాగిస్తారు. అందుకోసం నేను చేసే ఈపని వల్ల వాళ్ల పుణ్యం లో నాకూ కొద్దిగా భాగం వస్తుందికదా అన్న నాస్వార్ధం ఉండొచ్చు.
నేనెప్పుడూ ఈ కార్యక్రమాలకోసం మీరు డబ్బు ఇవ్వాలని అడగలేదు . ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ,పూజలు ఆ సందర్భంగా జరిగే అన్నదానములు చూసి తమంత తాముగా మాతరపున ఈకార్యక్రమం లో ఖర్చుచేయమని కోరినవారిని స్వయంగా మీరే వచ్చి ఆన్నదానమో మరొక కార్యక్రమానికో ఖర్చుపెట్టమని ఆహ్వానిస్తూ ఉంటాను. అలా రాలేని వాల్ల తరపున ఖర్చుపెట్టినా నయాపైసలతో సహా లెక్కరాసి ఉంచాను .అయినా ఈ రెండున్నర సంవత్సరాలలో ఓ ఇరవైమంది అలా ఖర్చుతాముభరించి కార్యక్రమాలకు తోడ్పడ్డారు అంతే . అందులో కొందరు ఇక్కడకొచ్చి స్వయంగా నిర్వహించారు. అయితే ఈకార్యక్రమాలు అత్యంతాశ్చర్యకరంగా అద్భుత ఫలితాలనిచ్చాయి .
ఖండాంతరాలలో నివాసముంటూ కష్ట సమయం లో తోడెవరూ లేరని బాధపడుతున్న ఒకరికి శివాభిషేకం చేసుకోండి అన్నాను . ఆయన సమస్య మబ్బులా విడిపోయిందన్నాడు. మరొకరు సంకటం లో హనుమంతుని స్తుతి మీరుచెప్పినవిధగా చేశాను నాసమస్యను స్వామి తొలగించాడని చెప్పారు. ఒకతల్లి ! తనబిడ్ద అమెరికాలో ఆరునెలలుగా ఉద్యోగయత్నాలు ఫలించక బాధపడుతున్నాడని ఆవేదనతో అడిగితే , అమ్మా! ఈబాధ మనం మనం పంచుకుంటే లాభమేముంది ? ఆ బాధేదో ఆయనముందు వ్యక్తం చేయి అని, ఇలాంటి కష్టసమయం లో ఏమిచేయమని పెద్దలు చెప్పారో దాన్నే ఇక్కడ ఆతల్లిని ,అక్కడ ఆ అబ్బాయిని చెయ్యమని చెప్పాను . చిత్రంగా హనుమత్ రక్షాయాగం జరుగుతున్నప్పుడు నలభై రోజులదీక్షతో అతనుసాధనచేస్తూ ముప్పై తొమ్మిదో రోజు కూడా ఇంకా ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేయగా నేను స్వామి ని నమ్మావు ఇంకా నలభైఎనిమిది గంటల సమయమున్నదికదా అని ఓదార్చాను. నిజ్జంగా నలభై రోజులు పూర్తయ్యేసరికి అప్పటిదాకా అతని నిరీక్షణ కు ఫలితానిచ్చాడు పవనసుతుడు. అతను అతని తమ్మున్ని పంపి మొన్న కార్తీకమాసం లో అన్నదానం పంచాక్షరీ జపహోమం జరిపించాడు . మద్రాసునుంచి వచ్చిన ఆ అబ్బాయి దీపమాలికతో నిర్మించిన శివలింగం ఫోటోలు తీస్తుండగా ఆదీపాలమీదనుంచి జ్యోతిప్రవాహం వస్తున్న ఫోటో కనపడి మమ్మల్ని ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేయటమే కాక మా భక్తిశ్రద్దలను మరింతగా పెంచింది .ఆఫోటో పైన స్లైడ్ షో లో ఉంది చూడండి . చదువులలో ధిట్ట అయిన ఓ విద్యార్ధి ఏడుసంవత్సరాలుగా తనను వేధిస్తున్న తలనొప్పి నుండి నలభైరోజుల హనుమత్ రక్షాయాగం లో చాలీసా పఠనం వలన విముక్తికలిగిందని సంతోషంగా ఉన్నాడు. తన ఉన్నతవిద్యాభ్యాసం కున్న ఆటంకాలు లలితా పారాయణం ద్వారా తొలగిపోయాయని ఓ సోదరి చెప్పింది . విష్ణు సహస్రనామ పారాయణం నారాయణయాగం తో మరికొందరు తమ ఇబ్బందులు తొలగించుకున్నామని చెప్పారు. ఇలా ఇంక కొంతమంది కూడా .ఇక్కడ పైన చెప్పిన క్రియలన్నీ నా స్వంత తెలివితేటలతోనో నేను కనిపెట్టినవేమీ కాదు. తరతరాలుగా మనకు వారసత్వ సంపదగా వస్తున్న మహానిధులే . సాధన వారిది . ఫలితమిచ్చిన వాడు దయామయుడైన భగవంతుడు. ఇక్కడ నేను నాకు తెలిసిన దానిని చెప్పటం వరకు మాత్రమే సహాయ పడ్డాను. బాగా చదివితే కలెక్టర్ వు అవుతావని ఎవరైనా చెప్పొచ్చు . కాని సాధించిన వానిది, కరుణించిన వానిదే ఫలితమంతా . అలాగే చుట్టుపక్కల పల్లెలలో పట్టణాలలో అక్కడ స్థానిక దేవాలయాలలో జరిపిన కార్యక్రమలు ఒక్కక్కచోట ఒక్కో సత్ఫలితాలనిచ్చాయి . ఫాక్షన్ గ్రామంగా పేరుబడ్ద వి .అప్పాపురం లో జరిపిన హనుమదభిషేకాలు విబేధాలుబాపి ఊరికి మేలు జరిగేలా ఫలించాయి. కొన్నిచోట్లదేవాలయాలు ఆగిపోయినవి పూర్తయ్యాయి . ఇక విద్యార్థులకోసం మేము జరుపుతున్న పూజలతో విద్యార్ధులలో నెలకొన్న అనవసర భయాలు తొలగిపోయి వారిలో ఆత్మ విశ్వాసాని స్వామి మా వెంటవున్నాడనే నమ్మకాన్ని పెంచి విజయాలు సాధించేందుకు తోడ్పడుతున్నాయి. ఇక్కడైనా మేము సోమరిపోతులకు స్వామి అనుగ్రహం లభించదు శ్రమించాలని అటువంటి వారికే ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నాము.వారికి వచ్చిన సత్ఫలితాలతో నమ్మకంకుదిరితే హనుమంతునిలా సద్గుణాలతో జీవించాలని మద్యపాన ధూమపానాదులు స్వామికి ఇష్టముండవని తప్పుడుపనులకు పాల్పడకుండా జీవించాలని బోధిస్తున్నాము.నమ్మి ఆశ్రయించిన పిల్లలు ఫలితాలు చెబుతుంటే స్వామి కరుణకు మేము పులకించిపోతున్నాము . అయితే ఎక్కడా పిల్లలను కాని ,పెద్దలను గాని మీరు ఇప్పటివరకు ఆచరిస్తున్న ధర్మాలు తప్పనిగాని, అవివదిలేయమనిగాని ఎక్కడా చెప్పలేదు..
ఇక ఒక్కోసారి ఒక్కో రూపంతోఈ పూజలేమిటి ?ఏం సీజనుకొక దైవమా అని ఎగతాళి చేసడొకాయన. ఇక్కడ చిన్నవిషయం గమనించాలి .కరెంట్ అనే ఒకేశక్తి అనేక పనులను జరుపుతుంది ,ఫాన్ తిప్పగలదు,ఫ్రిడ్జ్ లో శీతలీకరించగలదు,పొయ్యిలో మండించగలదు .ఇలా అనేక పనులుచేయగలదు. మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా నానమ్మకు కోడలుగా బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే. బహురూపాలుగా వ్యక్తమవుతున్నది ఒకే పరమాత్మ అన్న గమనిక ఈసనాతనధర్మంలో ప్రతి సాధారణ మనిషికి ఉంది . కనుకనే ఏ రూపంలో భగవంతుడున్నా అంగీకరించే జ్ఞానవంతమైన జాతిగా మిగిలింది. సహనంతో పరులను అక్కున చేర్చుకుంటున్నది ఆదరిస్తున్నది .ఈ గడ్డపై ప్రతిబిడ్డా ఈ భావాన్ని ఉగ్గుపాలతో నేర్చుకుంటుంది. కనుక వివిధరూపాలు వివిధ ఆరాధనారీతులన్నీ ఒకటేననే నమ్మిక మాకందరకూ ఉంది .అదే ఈ జాతి దైవీభావాలతో వర్ధిల్లటానికి కారణం .
ఇక్కడ నేను ఎవరికీ గురువును కాను ,ఆ పదానికి అర్హత నాకులేదు అనేది స్పష్టం . అందుకే నేను ఇక్కడ ప్రవేశించిన మొదట్లోనే అందరికీ మనవిచేసాను నన్ను గురువుగారు అనిపిలవద్దు అని. అది కొద్దిమంది మహాత్ములపట్లమాత్రమే వాడదగ్గపదం అని . దీనిపై వ్రాసిన పోస్ట్ ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_8411.html
భగవంతుని పేరుతో జరిగే మోసాలకు ,అనాచారాలకు నేను వ్యతిరేకం అనేది నా పాతపోస్ట్ లు చదివినవారికి తెలుసు. వీధివీధికొకరు తామే దేవుళ్లమని ప్రకటించుకునేవారు పుట్టుకొస్తారని కాలజ్ఞానం లో తాతగారు చెప్పినట్లుగానే ప్రస్తుత కాలంలో కొత్తాదేవుడండీ ! అని పాటలుపాడే గుంపులను నేనెప్పుడూ అంగీకరించను.
అటువంటి ప్రమాదం లో ఇరుక్కున్న మా బధువొకాయనను ఎలా బయటపడేశామో ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2008/10/blog-post_21.html
నిన్నొక పెద్దాయన అడిగాడు .నువ్వేమన్నా ఈధర్మానికి రక్షకుడవా ? నువ్వు ప్రయత్నించకపోతే ఈధర్మం ఏమైనా నశించి పోతుందా? అని తిడుతూ వ్రాసాడు. అందుకు నాసమాధానమిదిగో.
అయ్యా ! నేనంత మూర్ఖున్ని కాను, అంత ఒల్లుబలిసి మాటలు మాట్లాడటానికి . నేనెంత ? నాబ్రతుకెంత ? . భగవత్ స్రుష్టియగు ధర్మం ఆధారంగా జన్మించి జీవిస్తున్నాము . ధర్మం సనాతనం . మనిషి సూర్యున్ని సృష్టించాను ,రక్షించానంటే వాడు మూర్ఖుడో ,పిచ్చివాడో అయ్యుండాలి . ఇక ఒక సమాజంలో రక్షణకోసం ఒక వ్యవస్థ ఉంటుంది. అయినంతమాత్రాన రక్షణ అనేది దానిపని కదా అని ఊరుకోక ,ఏ అర్ధరాత్రో ఎవడో ఒక దొంగవెధవ మనకల్లబడితే దొంగ ..దొంగ అని అరుస్తాము కదా .అందులో తప్పులేదుకదా . అలాగే ఇసుకరేణువులు రాల్పినంత మాత్రాన ఉడత వారధికట్టగలుగుతుందా . ఏ పూర్వపుణ్యమో ఈధర్మంలో జన్మించినందుకు నావంతు ధర్మావలంబనలో ఉన్నాను. భజనచేసే భక్తబృందంలో నా గొంతుకూడా కలుపుతున్నాను . తప్పుకాదు కదా !
ఇక నువ్వు చెప్పేది నిజమా , మిగతా ధర్మాలు అవలంభించేవారు అవి వదలి రావాలా ? నీది మతోన్మాదం కాదా ? అన్నారాయన
స్వామీ ! నేను చెప్పేపద్దతిలో భగవంతుని కృపను పొందవచ్చు అనటం లో తప్పులేదు .నేను చెప్పినపద్దతి మాత్రమే సరైనది అనేది మూర్ఖత్వం . లోకంలో ఉన్న ఇతర మతాలను ప్రతిపాదించిన వారెవరూ పరాయివారు కారే ? వాల్లంతా దత్తావతారాలైన సద్గురువులని నేను పూర్తిగా నమ్మి ఉన్నాను. వారినవమానించే స్థితికి దిగజారలేదునేను. ఆవిషయమ్ భవిష్యపురాణం వివరిస్తున్నది. ఆయాప్రాంతాలలోని మానవాళిని ఉద్ధరించటానికి ఆ సద్గురువులెలా అవతరిస్తారో ! ఏమి చేస్తారో అని.. కానీ వారిపేరుతో ప్రపంచం లో భగవంతుడు మాకు తెలిసిన మార్గం లో తప్ప మిగతామార్గాలలో కనపడడు . అలా ప్రయత్నించేవారు పాపులు .వారిని మార్చాలి,లేక నశీంపజేయాలనే వాదాలను ,ప్రచారాలను ఖచ్చితంగా నిరసిస్తాను. కనుకనే నాకు అని మతాలలో స్నేహితులున్నారు. వారెవరినీ నేనుచేసే కార్యక్రమాలలో బలవంతంగా పాల్గొనమనిగాని, మీమతం మార్చుకొమ్మనిగాని ఏరోజు చెప్పలేదు. కాబట్టే వాల్లు నాకింకా స్నేహితులుగానే ఉన్నారు.అలా అనుమానంతో నన్ను ధూషించిన వారితో నాసమాధానం తరువాత వాల్లు తమ తప్పుతెలుసుకున్నవైనం ఈక్రింది పోస్టుల వ్యాఖ్యలలో చూడండి.
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_6830.html
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_12.html
నియమానుసారంగా రోజు నమాజ్ చేసే ఆస్థికులను, పగలల్లా పనిపాటలు చేసుకుని సాయంత్రం అర్ధరాత్రి వరకు ప్రార్ధనలు చేసుకునే భక్తులువారి ధర్మనిష్ఠకు నేనెప్పుడూ ముగ్దుడనవుతుంటాను.
గుంటూరు మస్తానయ్య దర్గా దగ్గర నేను ధ్యానం చేసుకుంటుంటే పక్కనే నమాజ్ చేసుకుంటున్న వారు నాసోదరులుగానే భావనవస్తుందిగాని వేరుగాదు. అల్లామాలిక్ అని స్మరించే సాయి మాకు సద్గురువే. వచ్చిన చిక్కల్లా ఆ మహాత్ములు చూపిన బాటనకాక ఈసనాతన ధర్మాన్ని పతనం చేయాలని యత్నిస్తున్న నికృష్ఠబుద్దులతోనే.
నీతండ్రిని నువ్వుప్రేమించు ,నాతండ్రిని నేనుప్రేమిస్తాను. మనిద్దరం వారిద్దరిని గౌరవిద్దాము .అనేది ఈ సనాతన ధర్మం ఈధర్మాన్ననుసరిస్తున్నవారందరికీ నేర్పిన నీతి. నేను నాతండ్రినిని ప్రేమిస్తాను,నువ్వు నాతండ్రిని గౌరవించు మనిద్దరంకలసి నీతండ్రిని లేకుండా చేద్దాం అన్నది ప్రస్తుతం కలిసేన సిద్ధాంతం. కనుక నేను నాధర్మాన్ని అచరిస్తాను . మిగతా మత ధర్మాలను గౌరవిస్తాను . ఏది లోకానికి శ్రేయోదాయకమో విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం.
ఇలా ఇంటర్ నెట్లో పూజలు ప్రచారాలేమిటి? ఇదొక మోసం జాగ్రత్త అని విమర్శలొస్తున్నాయి. ఇంటర్నెట్ ను ఈ సనాతనధర్మాన్ని విమర్శించేవాల్లకు మాత్రమే పరిమితం చేశారేమో నాకు తెలియదు .లేక గుత్తకుతీసుకున్నారో నాకు ఎవరూ చెప్పలేదు. సామూహికంగా నమాజులు, ప్రార్ధనలు పూజలుచేసుకుని భగవంతుని ప్రార్ధిస్తున్నారు లోకంలో . తమ భావాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, టీవీలు .అలాగే ఇతరప్రసారసాధనాలద్వారా ఇతరులకు తెలుపుకుంటున్నారు. సామూహికంగా జరిపే ప్రార్ధనలకు పెద్దఎత్తున జనాన్ని తరలిస్తున్నారు .ఈ అంతర్జాలంలో లెక్కలేనన్ని ఇతర మతాలకు చెందిన మతసంబంధమయిన సైట్లున్నాయి. ఆయా మతబోధకులు తాము చేసే ప్రార్ధనలకు ఆహ్వానిస్తూ తమ సైట్లలో వివరాలుంచారు. ఇప్పుడు సనాతనమైన ఈ ధర్మం అవలంబిస్తున్నానుగనుక నేను ఇక్కడ నాభావాలను వెల్లడించకూడదా ? పోనీ నానుంచి ఎవరు మోసపోయారు? నేను ఒక్కనెలకు సంపాదించే నాజీతమంతా ఇస్తాను ఎవరైనా రహస్యంగా వచ్చి నాగూర్చి విచారణ జరిపి నిర్ధారించి అప్పుడు నాపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించండి . నేను చేసే పని ని ప్రోత్సహించే వారంతా మూర్ఖులుగా జమకట్టి నోరు అదుపులేకుండ పేలుతున్నవారు ,తాము ఏపాటి జ్ఞానులో, వీల్లతో చదువులోనో మరేదన్నా నిర్ధారణ పరీక్షలోనో పోటీపడి నిరూపిచుకుంటామంటే నేను వీల్లందరినీ ఒప్పిస్తాను . ఇక ఈదేశం లో హేతువాదులుగా చలామని అయ్యే వాల్లంతా రహస్యంగా నిధులుపొందేది ,పనిచెసేది , అదీ! ఎవరిని కించపరచాలని పనిచేసేది అందరికీ తెలిసినదే. ఇప్పుడు నాపై కత్తిగట్టి నేను మోసాలు చేస్తున్నానని ,ఇతరులను వేధిస్తున్నానని అభాండాలతో దౌర్భాగ్యపు ప్రచారానికి దిగినవారు వాటిని సప్రమాణంగా నిరూపిస్తే నేనిక్కడ నుండి నిష్క్రమించటానికి సిద్దం. అసలు ఇప్పుడు నేనెందుకిక్కడ టార్గెట్ అయ్యాను వీళ్లకు? . నేను ఇంటర్నెట్లో ప్రవేసించిన మొదటిలోనే నాపై దాడులు చేసారు మానసికంగా నన్ను చికాకు పరచాలని . అంతకు మునుపు ఈ ధర్మానికి సంబంధించిన ఎవరు బ్లాగుల్లోకొచ్చినా వారిని హేలనచేసి వివిధ వ్యాఖ్యానాలతో చికాకుపరచి తమంత తాముగా బ్లాగులు మూసుకునేట్లు చేసినచరిత్రవుంది వీరికి ఎవరొ ఒకరిద్దరు అప్పటిదాకా మొండిగా పోరాడుతుండేవారు వీల్లకు సమాధానమిస్తూ . ఈసనాతన ధర్మాన్ని రెండునాలకలధోరణితో విమర్శిస్తూ సాధారణ ధర్మావలంబులకు ఈధర్మం పట్ల అపనమ్మకం ,చులకన భావన కలగజేయటం వీల్ల లక్ష్యం . నాపై దాడి ఫలించలేదు . ఎందరో మేధావులైన ఆస్తిక మితృలు , తల్లులు ,నన్ను తమకుటుంబసభ్యునిగా అభిమానించి అదరిస్తున్నారు. యువత నన్ను మాస్టారూ అని గౌరవించి తమ సమస్యలగూర్చి సలహాలడుగుతూ గౌరవిస్తున్నారు పెద్దలు ఆశీర్వదించి నన్ను ప్రోత్సహిస్తున్నారు. దానికి తోడు సనాతన ధర్మావలంబులైన బ్లాగర్ల సంఖ్యపెరిగి ధార్మిక విషయాలపట్ల చర్చలు పెరిగాయి . ఇది కలిసేనకు కంటగింపు . భగవన్నామముగాని ,తత్సంబంధిత క్రియలుగాని ఏమాత్రం సహించలేని కలి సేన అన్నిరంగాలలో ధర్మం మీద విరుకుపడుతున్నట్లే ఇక్కడా తమ దాడి జరుపుతున్నది . ఈ ఉడతూపులకు భయపడి పారిపోయే పిరికితనం లేదిక్కడెవరికీ . మేము సర్వసంగ పరిత్యాగులము గాము ,భగవంతుని ఆశ్రయించి సంసారరణరంగం లో శస్త్రధారులమై నిలబడ్దయోధులము .
పైకి ఇది నాపై జరుగుతున్న దాడి అనిపిస్తున్నప్పటికీ వాస్తవమేమిటో గుర్తించండి .
[నాగూర్చి నేను ఇంత వివరంగా వివరించ గలిగే అవకాశం కల్పించిన వారికి ధన్యవాదములు .]
భగవత్సేవలో నాప్రయాణం ఏనాడు పక్కదారి పట్టకుండా కాపాడమని ఆ పవనసుతుని కోరుతూ .........
13 వ్యాఖ్యలు:
పోప్ పై ఆరోపణలు-దర్యాప్తు http://sanghamitran.blogspot.com/
మీ ప్రయత్నం అభినందనీయం. మంచి పని చేస్తున్నారు. అభినందనలు.
durgeswara గారు,
ఏవరో ఏదో వాగారని మీ లాంటి పేద్దలు అనవసరంగా అలాంటి వారికి వివరన ఇస్తు వారికి లేని ప్రాధాన్యత ఇస్తున్నారు మీరేంటో మాకు తేలుసు మీరు వాటిని పట్టించుకోకుండా మీ తరహా లో సాగిపోండి వాటి కి సమాధానం ఏలా ఇవ్వాలో ఇచ్చెవారు సరైన రితిలో ఇస్తున్నారు ..
మీరు ఇంత వివరణ ఇవ్వ వలసిన అవసరం లేదు. మీ గురించి తాడెపల్లి గారు ఆ బ్లాగులోనె చెప్పారు కదా. కిరస్తానీ సేన కి అదే ఉద్యొగం. అలా చేస్తే వారికి డబ్బులు వస్తాయి అని అందరికి తెలుసు కదా! మీ రెందుకు పూజలు మాను కొని ఇంత పెద్ద టపా రాస్తున్నారు. ఆ అవసరమే లేదు.
This is a good one!
నదీ ప్రవాహం ఎవరికోసం ఆగదు... కొందరు దాహం తీర్చుకుంటారు... కొందరు కాళ్ళు కడుక్కుంటారు... ఎవరి సంస్కారం వారిది.. ఎవరి ఆలోచన వారిది. అంత మాత్రం చేత నది ప్రవహించడం మానదు. సద్గురువుల బోధనలు, మీవంటి మహాత్ముల కార్యాలు అటువంటివే. ఏ ఒక్కరి కోసం మీ కార్యాన్ని ఆపకండి. సూర్యుడిని నువ్వెంత అని వెక్కిరించి పైకి వుమ్మితే, అది ఆయనకు ఏ విధంగానూ నష్టం కాదు. తిరిగి వుమ్మినవాడి మీదే పడుతుంది. భగవంతుడు కార్య కారణ స్వరూపుడు. మీరు చేసే చిన్న పనయినా పెద్దమొత్తంలో సమాజంపై ప్రభావం చూపుతుంది. మీరు అధైర్య పడవద్దు స్వామీ..
There is a hell of difference between your and those inferior. Let 100 dogs bark do not look at it, just ignore. It is nature of a dog to bark.
Go ahead with your sincere prayers.
A semi-Atheist
దుర్గేశ్వరగారూ. నమస్తే. మీరు ఇంత సుదీర్ఘ వివరణ ఇవ్వాలిసిన అవసరం లేదండి. సూటిగా అలోచించగలవారెవరూ మీమ్మలి శంకించటంలేదు. ఎవడో ఏదో ఎక్కడో వాగాడని మీరు ఎందుకు ఇంత బాధపడి, ఆ చెత్త వ్యాఖ్యలకి లేని విలువ కలిగిస్తున్నారు. ఏనుగు వెడుతుంటే మొరిగేవి అనేకం. ఏనుగు తనదారిన తాను వెడుతుంది. ఆ మొరుగుళ్ళు ఏనుగు లెక్కచేయదు. చెయ్యకూడదు.
మీరు వ్రాస్తున్న వ్యాస పరంపర కొనసాగించండి. వద్దనటానికి, బ్లాగుల్లో ఇదే వ్రాయాలి, ఇది వ్రాయకూడదని చెప్పటానికి చెప్పేవాడెవడు. ఇష్టమైన వారు చదువుకుంటారు ఆనందిస్తారు. అది చాతకానివాళ్ళు ఆవతలకి పోవాలి. అంతేకాని వెర్రి మొర్రి వ్యాఖ్యలు, వ్రాసినవారిని కించపరిచే సాంప్రదాయం మొదలుపెట్టి ఒక చండాలపు ఒరవడి సృష్టించటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా విషయం మీద చేవ ఉంటే సవ్యంగా ఒక పధ్ధతి ప్రకారం చర్చ చేయాలి. అంతేగాని నేను చెప్పేదే రైటు మిగిలినవాళ్ళందరూ చెప్పేది నేను వినను అనే తీవ్ర అహంకారులులు, వితండవాదులు చర్చలకు అనర్హుల. అందుకే అటువంటి విపరీత వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరంలేదు.
పైన వ్యాఖ్యలు వ్రాసిన శ్రీకర్ జగదీష్ లతో నేను ఏకీభవిస్తున్నాను. మీ మనసుకు నచ్చిన పని మీరు చెయ్యండి, నలుగురికీ చెప్పండి.
ఇంగితం వుండే వాళ్ళు తప్పుబట్టితే బాధ పడాలి గానీ ... తల తోక లెకుండా మతిలేని వాళ్ళ వ్యాఖ్యానాలకి బాధపడ వద్దండీ.... మీరు బాధ పడితే మేమూ బాధ పడాల్సి వస్తుంది...మీకు చెప్పే వయస్సు కాకపొయినా -- కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు ....మీకు ఆ శ్రీనివాసుని క్రుప ఎప్పుడూ వుంటుంది.
ఇంగితం వుండే వాళ్ళు తప్పుబట్టితే బాధ పడాలి గానీ ... తల తోక లెకుండా మతిలేని మతిలేని వాళ్ళ వ్యాఖ్యానాలకి బాధపడ వద్దండీ.... మీరు బాధ పడితే మేమూ బాధ పడాల్సి వస్తుంది...మీకు చెప్పే వయస్సు కాకపొయినా -- కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు ....మీకు ఆ శ్రీనివాసుని క్రుప ఎప్పుడూ వుంటుంది.
పనికిమాలిన హేటువాద మొరుగుళ్ళకు మీరు అనవసరంగా స్పందిస్తున్నారేమో అనిపిస్తోంది. ' నీతి హీనుని వద్ద నిర్భాగ్యులుందురు ' అన్నట్టు అక్కడ మెచ్చుకునే వాళ్ళూ అదే టైపు ' బ్లాధములే '1 . వాళ్ళలా ఇంకోరి నమ్మకాల మీద పెంట వేసి సూకరానందము పొందడం మీకు చేయరు, చేయలేరు కూడా. దానికి కొన్ని అనువంశిక లక్షణాలు జన్యుపరంగా వుండాలి. :)
మీరు చేస్తున్నది మంచి పని. వీలైతే ఆ సూకర మూకకు కూడా సద్భుద్ధి కలగాలని ప్రార్థించండి/పూజలు చేయండి. :)
ఒకరకంగా , మీరు వాళ్ళు చేసే పనిని రిపీటెడ్ విమర్శించడం ద్వారా నీచులకు ప్రాముఖ్యత , చీప్ పబ్లిసిటీ ఇస్తున్నారు, అదే వాళ్ళకు కావాల్సింది కూడా. కాబట్టి దయచేసి లుచ్చాలకు విజిటర్ రేటింగ్ పెరిగిందన్న సూకరానందాన్ని కలిగించకండి అని ఇచటి ' పరమ బ్లాగవతోత్తములందరికీ'2 మనవి చేసుకుంటున్నారు.
నోట్: 1,2 - కొత్త పద ప్రయోగం ఎలావుందంటారు?
శంకర్
dharmo rakshathi rakshithahaa.......
ఈ భాగం చాలా బాగా రాసారండీ. మలక్పేట రౌడీ పైన చెప్పినట్లుగా.
మీ ఆత్మకి మీరే సాక్షులు. మిమ్మల్ని టార్గెట్ చేస్తా ఆ ఆరోపణలు చేయటం నాకు చాలా విస్మయాన్ని కలిగించింది. సాధారణంగా మోసాలు చేసే వాళ్ళ గురించి హెచ్చరిస్తే నేను సమర్ధించే వాణ్ణి కానీ, ఇలా నోరుంది కదా అని, ఏదో మెయిల్స్ లో మీరు గోత్ర నామాలు అడుగుతున్నారనీ, మీరు చేపట్టే కార్యక్రమాలకి కొందరెవరో కొంచెం మనీ ఇచ్చారు కదా అనీ, వెనకా ముందూ చూసుకోకుండా ఆ రాతలు రాయటం మిక్కిలి ఆక్షేపణీయమే కాకుండా, మనిషి హేతు వాదం నుంచి తీవ్ర వాదం వైపు వెళ్ళే చాయలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఆ రాతల్లో.
కామన్ సెన్స్ నుంచి మనిషి దూరమై పోయి, కారు కూతలన్నీ రాస్తూ ఉంటే, they may win the war, but they loose the battle.
అంత చిన్న విషయం ఎందుకు అర్ధం కావట్లేదో.
మన మటుకు మనం మంచిని ప్రోత్సహించే పనులు చేస్తే చాలు, అందులో భాగంగా స్వశక్తి ని ప్రోత్సహిస్తా, మూఢ నమ్మకాలకి మనుషుల్ని దూరంగా ఉంచితే చాలు. ఇలా మాట్లాడితే దేవుడే మూఢ నమ్మకం కదా అంటారేమో, ఖర్మ.
Post a Comment