శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label వ్యాసమంజరి. Show all posts
Showing posts with label వ్యాసమంజరి. Show all posts

విశ్వసిస్తేనే భగవద్దర్శనం

>> Tuesday, April 15, 2014


భగవంతుడు సాధు రక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం ఏ రూపంలోనైనా గోచరించగలడు. అదే భగవంతుని అవతార విశిష్టత. ఆయనను సంపూర్ణంగా విశ్వసించకపోతే బాధపడక తప్పదు. విశ్వసిస్తే ఆత్మగత సంబంధం ఏర్పడుతుంది. దేవుడి శక్తి మనలో నిండి ఉంటుంది. కనుక అప్పుడు ఎవరిలోనైనా దైవత్వం కనపడుతుంది.ఇలాంటి భావం అందరిలో ఏర్పడకపోవడానికి కారణం, దేవుడు లేడని కాదు మనకు దేవుడు కనపడాలన్న కోరిక బలంగా లేకపోవడం. కోరికలు మహారాజును కూడా కటిక పేదవాడిగా మార్చగలవు. కనుక భక్తులు కోరికలకు దూరంగా భగవంతుడికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకు అవసరమైనవన్నీ భగవంతుడే అడక్కుండా సమకూరుస్తాడు. మనం కోరుకున్న కోరికలలో ఏవైనా తీరలేదంటే అవి మనకు మేలు చేయనివని దేవునికి అనిపించి ఉండాలి. అందుకే పరమాత్మ మనకు అనుగ్రహించలేదని తెలుసుకోవాలి.

ఈనాడు భగవంతుని గురించి వినడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయినా వారిలోని అశాంతిని పారదోలుకోలేకుండా వున్నారు. ఎన్నో ఉపదేశాలు వింటున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాలు వ్యక్తిగతంగా, సామాజిక పరంగా చేస్తున్నారు. అయినా వారిలో శాంతి లేదు. వినడమొక్కటే సరిపోదు. భక్తితో భగవంతుడిని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది. మనఃపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించే వారికి అసంతౄఎప్తి అనేది వుండదు. తన గురించి మనకెంత తెలుసునని ఆయన ఆలోచించడు, ఆయనకోసం మనమెంత తపిస్తున్నామనేదే ఆయన వీక్షణ. దేవుడు మన భక్తి విషయంలో సదా మేల్కొనేట్టుగా మన పూజలు వుండాలి. అంతేగానీ ఉన్నాడో లేడోనని పదిమందిని పోగేసి మీమాంసలు చేయవద్దు.

సంశయాత్ములకు భగవంతుడు సందేహాస్పదుడే! దైవ కార్యాలకు వచ్చే విఘ్నాలను దైవమే పోగొట్టాలి. తన శక్తి పైన గాక పరమాత్మ శక్తి పైన ఆధారపడి జీవించే వాడు భక్తుడు. మూడవ నేత్రం ముక్కంటికే గాదు, మనుష్యులందరికీ ఉంది. అదే జ్ఞాన నేత్రం. ఎవరికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారు గర్వాన్ని దగ్ధం చెయ్యగలరు. ‘సర్వం జ్ఞాన ప్లవే నైవ వృజినం సంతరిష్యసి’ జ్ఞానమనే తెప్పచే పాపరాశిని దాటగలవని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం వుంచిన వాడికి జగమంతా వెలుగులే!

Read more...

గోవులను కాపాడుకుందాం

>> Tuesday, January 28, 2014


భగవంతుడు మనుషులను పుట్టించడానికి పూర్వమే మన బ్రతుకు చక్కగా సాగడానికి గోమాతను పంపించాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, సకల శాస్త్రాలు  గోమాతను కొనియాడాయి. ఆమెను ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. హిందూ సం ప్రదాయంలో గోపూజ ప్రధానమైనది. గోవు శరీరంలో సమస్త దేవతలు నెలకొని వున్నారని మన…పురాణాలు చెప్తున్నాయి. గోవునునడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలయా ల్లో గోవు మూత్రాన్ని వాడతారు. గోవు ఆశ్చర్యకరమైన ప్రయోగశాల అన్నారు పెద్దలు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, మేధో సంపత్తిని వృద్ధి చేస్తుంది. పాల నదులు ప్రవహించిన ఈ బంగారు గడ్డపై పాపాల నదులు, గోమాత రక్తపుటేరులు పారుతున్నాయి. చారిత్రక దృష్టితో పరి కించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసకాలంలోనే కనపడుతుంది. అంతకుముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని మాట.ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. ఆంగ్లేయులు ఆవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా చేశారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలంపై అలికేవారు. కారణం ఆ స్థలంలో మరెన్నడూ హిందువులు దేవాలయం కట్టరాదని చేసేవారు.

పశువులను `నిరుపయోగం' అని ప్రకటించి వాటిని వధ చేస్తుండటం చాలా దు:ఖకరమైన విషయం. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు 20,000 పశువులు దొంగచాటుగా రవాణా అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక పశువధశాల నుంచి 20 కోట్ల రూపాయలు ఎగుమతులు అవుతున్నాయనుకుంటే అక్కడ వధకు గురయ్యే పశువులతో తయారుచేయదగిన ఎరువులు, శక్తి విలువ 910 కోట్ల రూపాయలను మనం కోల్పోతున్నామన్న మాట. ఆ రకంగా ఆర్థిక వినాశనం కొనితెచ్చుకుంటున్నాము. భారతదేశంలో వ్యవసాయ అస్ధిరతకు గురై, పేదరికం మరింత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదానినిబట్టి పశువధ కారణంగా భూకంపాలు తరచుగా ఏర్పడి జనవినాశనానికి కారణభూతమవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుంగనూరు సంతతి ఆవు సుమారుగా అదృశ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంతతి అరుదుగానే లభిస్తోంది. ఈ స్వదేశీ సంతతికి చెందిన ఆవులు నేడు 32 తెగలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

ముజఫర్‌ హుస్సేన్‌ అనే రచయిత `ముస్లింలు - శాకాహారము' అనే గ్రంథం రాశాడు. ప్రముఖ ఇస్లాం పండితుడు అల్థాజ్‌ అలి (కీ.శ.1058-1111)తన `ఆహ్యాఉల్‌-దీన్‌' అనే గ్రంథంలో `గోమాంసం విషకరమైనది(మార్‌‌జ), ఆవు పాలు ఆరోగ్యవంతమైన ఆహారము (సఫా), ఆవు నేయి ఔషధగుణాలు కల్గినది' అని పేర్కొన్నాడు. బాబర్‌ తన కుమారుడు హుమాయూన్‌ పేరిట రాసిన వీలునామాలో `తుజుక్‌-ఇ-బాబరీ'లో భారతీయులు మత విశ్వాసాలు కలిగినవారు. వారి మనోభావాలను గౌరవించి మొగల్‌ సామ్రాజ్యంలో గోహత్యను జరుగనీయవద్ద'ని పేర్కొన్నాడు. గోవును చంపిన వారి చేతులు నరికేయమని మైసూరు దివాన్‌ హైదరాలి 1829లో శాసనం చేశాడు. 1857లో బహదూర్‌షా జఫర్‌ ఢిల్లీ చక్రవర్తి అయిన సమయంలో గోవధ నిషేధాన్ని ప్రకటించాడు. ఆగస్టు 1న జరిగిన బక్రీదు పండుగనాడు ఒక ఆవుకూడా వధింపకపోవడం గమనార్హం. భారతదేశంలోని అత్యధిక ముస్లింలందరి పూర్వీకులు హిందువులే. ఆవు దేశావసరం. అది మత సంబంధమైన జంతువు కాదు. ఆనాడు భారతదేశంలో ఉన్నది హిందువులు మాత్రమే. హిందూమతాన్ని గౌరవించే వారు కనుక ఆవు వాళ్ల సొత్తయింది. కనుక గోవు కేవలం హిందువులకే కాదు అన్ని మతాల వారికీ, అన్ని జాతుల వారికీ తల్లే.

ఆంగ్లేయుల కుట్ర :
17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశం వచ్చేనాటికి మనదేశంలో జనాభాకంటే గోసంపద, పశుసంపద అధికంగా ఉండేది. ఆవు భారతీయ వ్యవసాయానికి కేంద్ర బిందువు. మనది గోఆధారిత వ్యవసాయం. ఆంగ్లేయులకు ఈ స్థితి ఆశ్చర్యం, అసూయ కల్గించాయి. వారి దృష్టిలో ఆవు అంటే మాంసాన్నిచ్చే జంతువు. స్వతహాగా వారు గోమాంస భక్షకులు. రాబర్‌‌టకై్లవ్‌ క్రీ.శ.1760లో కలకత్తాలో రోజుకు 70 వేల పశువులను సంహరించే మొట్టమొదటి గోవధశాలను ప్రారంభించారు. క్రైస్తవ మతప్రచారకుల సహకారంతో విదేశీ పండితులు వేదాలు, ప్రాచీన సాహిత్యానికి తప్పుడు వ్యాఖ్యానాలనిస్తూ భారతదేశంలో ప్రాచీన కాలంలో గోమాంస భక్షణ జరిగిందని ప్రచారంచేసి, పుస్తకాలను ముద్రించారు. వేదాలపై భాష్యం చెప్పిన మాక్‌‌సముల్లర్‌ ఈ కోవకు చెందినవాడే.

స్వాతంత్య్రోద్యమంలో గోవు :
  • స్వాతంత్య్రం వచ్చిన 5 నిమిషాలలోనే ఒక కలముపోటుతో (శాసనముతో) గోహత్య నిలిపివేయబడును : లోకమాన్య బాలగంగాధర తిలక్‌
  • నా దృష్టిలో గోరక్షణ స్వరాజ్య సముపార్జనకంటే ఎంతమాత్రం తక్కువకాదు : మహాత్మాగాంధీ
  • వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గోసంతతికి నష్టం కలిఇతే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. : సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌

  • మహాభారతంలో `అషై్టశ్యర్మమయీ లక్ష్మీ వసతే గోమయే సదా' అంటే ఎనిమిది రకాల ఐశ్యర్యాలతో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ గోమూత్రం-గోమయంలో ఉందని అర్థం.'

    గోవు, విశిష్టత… :
    ప్రాణులలోకెల్లా సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవు కాకుండా మరే పశువు పాలలోనైనా పాషాణం(ఆర్సెనిక్‌) ఉంటుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువలన వీటిని బంగారము, వెండి అంటారు. ఆవుపాలు దాని మూపురంగుండా స్రవించి లభిస్తాయి. మూపురంలో స్వర్ణనాడి ఉంది. ఆవు దూడ పుట్టిన మూడురోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడిఉంటుంది. ఈ కారణంగానే ఆవుపాల వలన శరీరంటో స్ఫూర్తి కలుగుతుంది.

    గోమూత్రంతో లాభాలు:
    క్రిమి నియంత్రణ; నివారణ ఔషధాలు తయారవుతున్నాయి. గోమూత్రంలో వేప, జిల్లేడు, తులసి, మారేడు, కానుగ మొదలైన ఒక రకపు ఆకులు 15 రోజుల నానబెట్టి రాగి పాత్రలో మరగించాలి. సగంవరకు దిగిన తర్వాత సీసాలలో పోసి పెట్టుకోవాలి. ఒక లీటరు ఈ ద్రవంలో 100 లీటర్లు నీరు కలిపి పంటపై పిచికారీ చేస్తే కీటకాలు లేకుండాపోతాయి. అలా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. గోమూత్రంలో 10 రెట్లు నీరు కలిపి చెట్లు, మొక్కలపై పిచికారీ చేస్తే కీటకాల నుంచి వాటిని రక్షించవచ్చు.

    పేడతో ఉపయోగాలు:
    పేడవలన ప్రపంచంలో సర్వశ్రేష్టమైన జీవశక్తి కలిగిన సేంద్రీయ ఎరువు తయారు కొబడుతున్నది. పేడ నుండి గ్యాసు పోయిన తర్వాత నిజానికి మిగిలిన ఆ మడ్డిలోనే ఎరువులను తయారుచేసే గుణాలెన్నో ఉంటాయి. ఏనిమల్‌ వెల్‌ఫేర్‌ బోర్‌‌డ ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాసు, 80 టన్నుల సేంద్రీయ ఎరువు, 200 లీటర్ల సేంద్రీయ కీటక నివారణ ఔషధం లభ్యమవుతాయి. పిడకలు కాల్చడం వలన 6 కోట్ల 80 లక్షల టన్నుల పంటచెరకు ఆదా అవుతోంది. ఇంత పంటచెరకు అంటే 15 సంవత్సరాల వయస్సు కలిగిన 14 కోట్ల చెట్లన్నమాట. ఆశ్చర్యం! ఊహించని ఎంత పెద్ద ఆదాయమిది.

    కదిలే శక్తికేంద్రం ఆవు :
    మన దేశంలో నేడు గ్యాస్‌, విద్యుత్‌ కొరత చాలా ఉంది. మన వద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక భారీ వ్యయంతో కూడిన సాధనాల ద్వారా గ్యాసును నేడు మనం ఉత్పత్తి చేసుకొంటున్నాం. విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం, గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయంచేత గ్యాసు ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. గోమయ, గోమూత్రాలతో గ్యాసు ఉత్పత్తిని ప్రారంభిస్తే దానివలన ఎంతో వంటచెరకు, పిడకలు మిగిలిపోతాయి. పరిశోధనచేసి గ్యాసును సిలిండర్లలో నింపి దేశవ్యాప్తంగా సరఫరాలు కూడా చేపట్టవచ్చు.ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. కనీసం ఒక్కొక్కరు కాకపోయినా నాలుగు కుటుంబాలు కలిసి పాలిచ్చే పదిగోవులు ఉంచే ఏర్పాటుచేసి చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో తమతమ కుటుంబాలలో చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవించవచ్చు దానితోపాటు తమ చుట్టుపక్కల పర్యావరణ కాలుష్యం లేకుండా చూసుకోవచ్చు. పశ్చిమదేశాల్లో మన సాయూహిక జీవన విధానం ఎడల ఆకర్షణ పెరుగుతోంటే, మనమేమో ఇక్కడ పక్క ఇంటివారిని కూడా చూసి, పలకరించము. ఒకరంటే ఒకరికి పడని వైఖరి సిటీల్లో వేళ్లూనుకుపోయింది. ఎంతసేపూ డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడే తప్పించి, పుట్టినందుకు జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గం అన్వేషించడం మానేశారు. ఈ ధోరణి మారినప్పుడే నగరాల్లో దొంగతనాలు, దాడులు, హత్యలు తగ్గుతాయి.

    గో సంరక్షణకు మనం ఏమి చేయాలి? :
    ఆవు ప్రాముఖ్యతను తెలియజేసే సాహిత్యాన్ని చదివి తెలుసుకోవాలి. రోజూవారీ జీవితంలో గోఉత్పత్తులు, పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ, పండ్లపొడి, అగరవత్తులు.. ఇలాంటి వినియోగవస్తువుల వాడకా న్ని ప్రోత్సహించాలి. గోమూత్రం ద్వారా తయారయ్యే మందులను ఇంట్లోని సభ్యులందరూ వాడేట్లు ప్రోత్స హించాలి. దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్టు చూ డాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్టు చూడాలి. గోవధ, తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

    గోసంరక్షణకై ప్రభుత్వ చర్యలు :
    ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోసంతతి రక్షణకై కేంద్రస్థాయిలో చట్టం చేయాలి. కేంద్ర, రాషా్టల్ల్రో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పర్చాలి.
     
    surya daily

Read more...

జీవన సౌధాన్ని నిర్మించుకో

>> Sunday, January 5, 2014

ఒకసారి మదన మోహన మాలవ్యా హైదరాబాద్ నవాబు వద్దకు వచ్చి బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు విరాళం ఇవ్వవలసిందని చేయి చాచి అర్థించారు.  కోపోద్రిక్తుడైన నవాబు, “ఒక హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు నన్నే విరాళం అడుగుతావా? ఎంత ధైర్యం నీకు?” అని అంటూ కాలి చెప్పును తీసి ఆయనపై విసిరారు.  మాలవ్యా మారు మాట్లాడకుండా ఆ చెప్పునే కానుకగా రెండు చేతులతో అందుకుని, నేరుగా బజారు వీధికి చేరుకున్నారు.  అక్కడ ప్రజలను పిలచి నవాబు తనకు ఎంతో ప్రేమతో ఇచ్చిన పాదరక్షను వేలం వేస్తున్నాననీ, నవాబు మీద గౌరవం కలిగిన వారెవరైనా తగిన మూల్యం చెల్లించి, దానిని దక్కించు కోవచ్చుననీ ప్రకటించారు.  ఈ కబురు క్షణాలలో నవాబు చెవిన పడింది.  వేలంలో తన పాదరక్ష తక్కువ ధరకు అమ్ముడు పొతే తనకు అవమానమని భావించిన నవాబు, వెంటనే ఒక సహాయకునికి పెద్ద మొత్తం ఇచ్చి, దానితో ఆ చెప్పును కొని తీసుకురావలసిందిగా ఆదేశించాడు.  ఆ విధంగా లభించిన డబ్బును మాలవ్యా తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి వినియోగించారు.

మరొక సారి మాలవ్యా ప్రయాణిస్తున్న దారిలో ఒక బ్యాంకు నష్టాలలో పడి, కల్లోలంలో ఉంది.  మడుపరులందరు తమ డబ్బు తమకు ఇచ్చేయవలసిందని బ్యాంకు మీద విరుచుకు పడడంతో నిర్వాహకులు తలబాడుకుంటున్నారు.  ఆ సమయంలో మాలవ్యా బ్యాంకు లోపలకు వెళ్లి, తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వవలసిందిగా బ్యాంకు పెద్దలను కోరారు.  “పండిట్ జీ, మా బ్యాంకు దివాలా తీసే స్థితిలో ఉందని తెలిసి కూడా మీరు ఇలా అడగడం న్యాయమేనా?” అని వారు ఆయనను ప్రశ్నించారు.  మాలవ్యా వారితో, “ఓ అయిదు లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వండి చాలు, నగదు అవసరం లేదు” అని అన్నారు.  ఆ కాలంలో అయిదు లక్షల రూపాయలంటే ఈ కాలంలో కోటాను కోట్ల కింద లెక్క.  వారు దిమ్మెర పోయారు.  “భయం లేదు.  నా మీద నమ్మకముంచండి! మీకంతా మంచే జరుగుతుంది.  నేను చెప్పినట్లు చెయ్యండి” అన్నారు మాలవ్యా. వారు భయపడుతూనే, ఆయన అడిగినట్లుగా చెక్కు రాసి ఇచ్చారు.

మర్నాడు ఈ వార్తా హిందూస్తాన్ టైమ్స్ దినపత్రికలో ప్రముఖంగా అచ్చయింది.  దానితో డిపాజిటర్లకు బ్యాంకు మీద విశ్వాసం అనూహ్యంగా పెరిగింది.  ఎంత పటిష్ఠంగా ఉండకపోతే, బ్యాంకు అంత విరాళం ఇవ్వగాలుగుతుమ్డనే ఆలోచన వారిని పునరాలోచనలో పడవేసింది.  వారంతా తిరిగి బ్యాంకుకు రావడం మొదలు పెట్టారు.  ఏడాది లెక్కలు ముగించే నాటికి బ్యాంకు లాభాలతో పరవళ్ళు తొక్కుతోంది.  చెక్కు మాలవ్యా వద్దనే భద్రంగా ఉంది.   బ్యాంక్ యాజమాన్యం స్వయంగా వారి వద్దకు వచ్చి, ధన్యవాదాలను తెలియజేసి, పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది. 

స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రను పోషిస్తూనే, వార్తా పత్రికా రంగంలో, విద్యా రంగంలో విశేష కృషి చేసిన మాలవ్యా, హిందువులకు ప్రత్యెక విశ్వవిద్యాలయం ఆవశ్యకతను 1900 సంవత్సరంలో గుర్తించారు. వజ్ర సంకల్పబలంతో 1916 ఏప్రిల్ 1వ తేది నాటికి పూర్తీ స్థాయిలో ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించ గలిగారు.  నేడు 1,370 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, 14 రంగాలలో, 127 శాఖలతో, 16,000 మంది విద్యార్థులతో, 1,300 మంది అధ్యాపకులతో దేశానికి మకుటాయ మానంగా నిలుస్తున్న బెనారస్ హిందూ యూనివర్సిటి, హిందూ జాతికి మాలవ్యా ఇచ్చిన అపురూపమైన కానుక.  దీనికిప్పుడు 13 లక్షల పుస్తకాలతో కేంద్ర గ్రంధాలయం ఉంది.  38 చిన్న గ్రంధాలయాలున్నాయి.  మరో మూడేళ్ళలో నూరు వసంతాలు పూర్తీ చేసుకోబోతున్న ఈ సరస్వతీ నిలయం మాలవ్యా పండితుని దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా వారణాసి నగరంలో దర్శనమిస్తోంది. 

Read more...

‘ఆదిత్య హృదయం’ పరమపవిత్రం

>> Friday, January 3, 2014


పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుశ్యును పెంచే అమోగమైన అక్షర సాధనం అదిత్య హృదయం. ఈ అమోగమైన స్తోత్రరాజాన్ని శ్రీ రామ చంద్రునికి ఆగస్త్యమహర్షి మంత్రాల వంటి మాటల తో వివరించాడు.ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించే వానిగా, ప్రత్యక్షదెైవముగా సూర్య భగవానుడు పేరు ప్రఖ్యాతి కాంచినాడు.అదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంధము. శ్రీమద్‌ రామాయణ మహాకావ్యమంద లి యుద్దకాం డలో 105వ సర్గలో సూర్య భగవానుని స్తుతి కి ‘‘ఆదిత్య హృదయం’’ అని నామకరణం చేశారు. వీటిలో ఆదిత్య నామం  శ్రీరామాయణ కర్తఅయిన వాల్మీకి మహార్షి కి చాలాఇష్టం.అదిత్యులు12మంది. అందులోవిష్ణువు ము ఖ్యుడు ఆదిత్యులలో ‘‘నేను విష్ణువు’’ను అని గీతాచార్యెడెైన శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను.‘‘ఆదిత్యానా మహం విష్ణుం’’ అందువలన ఆదిత్య హృదయంను విష్ణువు స్తోత్రముగా భావిస్తారు.

ఆదిత్యహృదయం విశేషపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే యిహలోకమున అన్ని రకాల సంపదులు, పరమున పుణ్యలోకములను పొందును. సంతానం లేనివారు ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుచుట్టూతిరు గుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికివిజయంలుగుతుంది. కఠిక దారిద్ర్యంచే బాధ పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల  సంపదలు కలుగుతాయి.ఆనారోగ్య రుగ్మతలతో బాధపడుచున్నవారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణ ము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో బాధపడేవారు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. . శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.

దీని తో శ్రీరాముడు చింతాక్రాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి చూస్తున్న ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే. ఓరామ!నీకు మహాపవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. దీని వల్ల నీ వు యుద్ధమును రావణున్ని సులభంగా జయించగలవు. మహా పుణ్యప్రదము,జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుశ్శు ను కలుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశిం చెదను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, తొమ్మిండుగురు ప్రజాపతులు ను, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యువును, యముడును, చంద్రుడును, సముద్రుడును అను వీరందరును ఇతడే. పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు,అశ్వినీ దేవతలు, మరుత్తులు,మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యడే అంతర్యామియై ఉన్నాడు. బంగారు రూపముగల అండమును గర్భమునందు గలవాడు. బంగారంతో సమానమైన అంతఃకరణ గలవాడవును, చల్లవాడవును, శత్రుసంతానములను పోగొట్టువాడవును, లోకమునకు వెలుతురు కలుగజేయువాడువును, అదితియొక్క కుమారుడవు ను, మంచును పోగొట్టువాడవును అను నీకు భక్తితో నమస్కనించి స్తోత్రమును చేయుచున్నాను. ఋగ్వేదము, యజుర్వేదము,సామవేదము, ఆధర్వణవేదము అను నాలుగు వేదములయొక్క సారము అయిన వాడవునుచ సమస్త వేదములును నీవే అయినవాడువును సముద్రజలముపెై శయనించు వాడవును,దక్షిణాయనమున వింధ్య పర్వతతమున సంచరించువాడవును అయిన భక్తి సేవించుచున్నాను అని శ్రీరాముడు అనెను.

సమస్త నక్షత్రములకును, గ్రహములకును అధిపతివయిన వాడవును లోకమునుకు ఆధారభూతుడవును, స్వర్గము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశము, దిక్కులు, భూమి, సముద్రము అన్నియు నీ వీర్యముచే నిలిచి ఉన్నవి. ఇంద్రుడు, ధాత, భృగుడు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, ఆర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత,విష్ణువు అను పేరుగల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కరిరస్తున్నాను. ప్రళయ కాలమున యిశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరల సృష్టించి కిరణములచే లోకానికి తాపమును కలుగజేసి వర్షములను కురిపించి సర్వజయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను.ఈ విధంగా ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.
- రావుల రాజేశం

Read more...

సుబ్రహ్మణ్యం,సుబ్రహ్మణ్యం! షణ్ముఖనాథా! సుబ్రహ్మణ్యం !

>> Sunday, December 8, 2013



సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు.


పూర్వం స్వాయంభువమనువునకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావము నందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు చేయ పూనుకునెను.


ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా, ప్రియవ్రతుడు..”ఈ జీవితము అశాశ్వతము, భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము, జీవితము క్షణభంగురము, నేను రాజ్యము చేయకోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను” అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు, “ఓ రాజా! నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు చేయుట వలన ఎట్టి లాభమూ లేదు. కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చేయుము” అని చెప్తారు.


బ్రహ్మౌపదేశము మీద, ప్రియవ్రతుడు తపస్సుని విరమించి, మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను. పుత్రసంతతి కోసం అతడు పుత్రకామేష్ఠి చేయగా పుత్రుడు కలిగెను. కానీ ఆ పిల్లవాడు మరణించి ఉండెను. ప్రియవ్రతుడు ఆ శవమును భుజముపై వేసుకొని, శ్మశానమునకు వెళ్ళి ఖననం చేయ ప్రయత్నంలో ఉండగా, ప్రియవ్రతుడు, ఆయన వెంట వచ్చినవారు అందరూ ఎంతగానో దుఃఖించిరి. ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశములో ఒక మెరుపు కనిపించెను. నిలకడగా చూస్తే అది మెరుపు కాదు, ప్రకాశించుచున్న దివ్యవిమానము. ఆ విమానము ప్రియవ్రతుని సమీపమునకు చేరెను. ఆ విమానము నుండి ఒక తేజోమూర్తి యైన స్త్రీమూర్తి దర్శమిచ్చి ప్రియవ్రతునితో …”నేను ఆదిపరాశక్తి ఆరవ అంశతో అవతరించినదానను కావున నన్ను షష్ఠీ దేవి అని పిలుస్తారు. దేవసేన అని మరిఒక పేరు కూడా కలదు. నేను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ధర్మపత్నిని. నా దర్శనము వృధా కాదు. ఎవరికేమి కావలసినా ఈయగలను. నీ కుమారుడిని బ్రతికించెదనని”, ఆ ప్రియవ్రతుని కుమారునికి ప్రాణము పోసెను. అంతట ఆ పిల్లవాడికి సువ్రతుడు అని నామకరణం చేసెను. ప్రియవ్రతుడు ఎంతగానో సంతోషించెను. ఇంకా దేవసేనా అమ్మవారు ప్రియవ్రతునితో ఇట్లు పలికెను..” ఓ ప్రియవ్రతా! మీరందరు షష్ఠి వ్రతము చేయుడు. మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు షష్ఠీ వ్రతమునారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగును” అని సకల జనులకు వరమునిచ్చి అమ్మవారు అంతర్ధానము అయ్యెను.


వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును. స్వామి అనుగ్రహం వల్ల, సమస్త శుభములు సర్వులకూ లభించును.


సుబ్రహ్మణ్యస్వామి వారి క్షేత్రాలు తమిళనాడులో ఆరుపడైవీడు అనే పేరున, స్వామి వారి ఆరు ముఖములకు ప్రతీకగా ఆరు క్షేత్రాలలో స్వామి వెలిశారు. అవే పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, తిరుప్పరంకుండ్రం, పళముదిచ్చొళై. తమిళనాట అనేక మంది భక్తులు విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు.


అలాగే కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని, ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఇది సత్యం సత్యం పునః సత్యం.

అలాగే మన తెలుగునాట కూడా, అనేక పుణ్యక్షేత్రాలలో స్వామి వెలసి ఉన్నారు. తిరుమలలో ఆనంద నిలయములో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడిగా కొలిచే పెద్దలు ఎందరో ఉన్నారు. అందుకే అక్కడ స్వామి పుష్కరిణి అనే నామము, తిరుమలేశునికి స్వామి అనే నామము వచ్చాయి అని పెద్దలు విశ్వసిస్తారు. అలాగే కృష్ణా జిల్లాలోని మోపిదేవి, తూర్పుగోదావరిజిల్లాలో మల్లవరం క్షేత్రము మొదలైనవి. ఈ మల్లవరం క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని గురించి పూజ్య గురువు గారు అనేకసార్లు ప్రవచనములలో చెప్పి ఉన్నారు. అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయములో గుట్టపై వెలిసిన స్వామి.


కొలిచిన వారికి కొంగుబంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షములు మనందరిమీదా వర్షించాలని, బయటా, మనలోపలా ఉన్న ఆసురీ ప్రవృత్తిని సంహరించి, మనల్ని ధర్మమార్గములో నడపాలనీ, మన సనాతన ధర్మమును పరిరక్షించాలనీ, గురుగుహా స్వరూపములో మన అజ్ఞానతిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.

మార్గశిర శుక్ల షష్ఠిని “కుమార షష్ఠి” గా జరుపుకోవడం మన తెలుగునాట సాంప్రదాయం. ఈ సందర్భంగా, శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము. ఇక్కడ వ్రాయబడిన కుమారస్వామి వైభవం, తత్వ విశేషాలు, గురువుల నుండి విన్నవి, సుబ్రహ్మణ్య ఉపాసనా గ్రంధము నుండి గ్రహించినవి, స్వామి వారు ఇచ్చిన బుధ్ధి ప్రచోదనం మేరకు వ్రాయబడినది. ఇందు దోషములు ఏమైనా ఉంటే పెద్దలు తెలియజేయగలరు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి / కుమార స్వామి వారి వైభవం:
షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.

మనకి వైదిక వాఙ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య గణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృ తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు... ఎలా పిలిచినా ఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం. ఇందులో అమ్మవారు-అవ్యక్తం, అయ్యవారు-వ్యక్త స్వరూపాలకు సంకేతం అయితే, గణపతి-మహత్తత్వం, కుమారస్వామి-అహంకారం. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినది అని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనే భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈ సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి“నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.

ఈ 'అహం'తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.

పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.

అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి తత్త్వం.

కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు ఉన్నాయి. పరతత్వం-అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్ కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు అయ్యాడు.

కాలస్వరూపం: వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు - ఆరు ఋతువులు. పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

జ్ఞానస్వరూపుడుః సుబ్రహ్మణ్యస్వామి వారు రాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం – కుమారస్వామి. ఆరుకోణాల చక్రం -  బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని ‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.

“పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ” అనే పద్యంలో పోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట), శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)” అంటూ ప్రార్ధించారు. ఈ మాటలో కూడా కవితా శక్తి నిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన స్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా, మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.

కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా I
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II

మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణం లో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God of War” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి-రావణుడికి, పాండవులకి-కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు…అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.  మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.

అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలా విశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు.

కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీ గుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం…..”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈ కుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివ పార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమే కుమారుని సంభవం.

అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణం స్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణం అయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.

ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.
ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న positive energy కి ప్రతీక. వల్లీ, దేవసేనా అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.

“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా! మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని స్కందుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందిన మహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన ‘తిరుత్తణి’ లో కుమారస్వామి ఒక వృధ్ధ గురురూపంలో కనిపించి “ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూ…అని చెప్పి ఆయన నోటిలో పటికి బెల్లం వేసి” వెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో ‘గురుగుహ’ అనే నామముతో ముద్రాంకితం చేశారు. “శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ! శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీశ! గురుగుహ! దేవసేనేశ!” ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.

అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్ అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.

చివరిగా నడిచేదేవుడు, కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట. ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించి మరో చక్కని మాట విన్నాను. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకి అవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు, మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే….అదే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి, మూర్తీభవించిన అందం, తేజస్సు, చిరునవ్వు, అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, నను గన్న తండ్రి, భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు, సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత, ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అంత్యమున తనలో కలుపుకునే స్వామి…..అటువంటి మన కుమారస్వామి అనుగ్రహ కటాక్షములు భక్తులు ఎల్లరకు కలగాలనీ, సుబ్రహ్మణ్యస్వామి వారు త్వరగా అవతరించాలనీ, ఈ జగత్తులోనూ మరియు మనలోనూ ఉన్న ఆసురీ, అవైదిక, అధార్మిక శక్తులను సంహరించి, ధర్మస్థాపనం చేయాలనీ స్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.

by    chandrasekhara raju   garu

Read more...

ఆది వరాహస్వామిచే కాపాడబడిన భూమి ఎక్కడ ఏ సముద్రంలో ముంచబడింది

>> Wednesday, September 11, 2013

ఒకానొక గ్రూప్ లో ఈ క్రింది ప్రశ్న చూసాను. చాలా మంచి ప్రశ్న.
ప్రశ్న: ఆది వరాహస్వామిచే కాపాడబడిన భూమి ఎక్కడ ఏ సముద్రంలో ముంచబడింది. భూమి నీరు ఒకే చోట ఉన్నాయి కదా? దయచేసి తెలుపగలరు.

జవాబు :

దీనికి సమాధానం చెప్పాలంటే పురాణములోని పై పై మాటలు చెప్పెయ్యవచ్చు. దాని వలన ఈ సమాధానం చదివే వారిలో కుతూహలం అంతటితో ఆగిపోవచ్చు. లేదా ఇవన్న్నీ కాకమ్మ కథలు తార్కికంగా లేదు అనే తేలిక భావన కలగవచ్చు. అందుకని విషయాన్ని వివరించి చదువరుల అవగాహనని కొంత పైకి తీసుకువెళ్ళి ఆ తరువాత సమాధానం చెప్పాలి. దాని వలన చదివే వారిలో రావలసిన కొన్ని మంచి మార్పులు ఇది చదివిన వారి జీవితంలో కొనసాగుతాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించగలరు.

భాగవతము మొదలైన పురాణములలో సృష్టికి సంబంధించిన కొన్ని కొన్ని వైజ్ఞ్యానికములైన కథలు ఉన్నాయి. అవి గుప్తములు రహస్యములు. అంటే అందరికీ తెలియకూడనివి అని కాదు. అందరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయములే అయినప్పటికీ మనసు చేత అర్థం చేసుకోవటానికి కష్టం (దాదాపు ఋషులంతటి ప్రజ్ఞ్య గలవారికి సాధ్యం ), అనగా ఒకరకంగా సామాన్యులకు దురూహ్యములు. ఈ కథలలో వేద ప్రతిపాద్యమైన విషయములు ఎన్ కోడెడ్ గా 'నిక్షిప్తం' చెయ్యబడ్డాయి. అయినప్పటికీ సామాన్యులు కూడా ఆ శక్తిని పొందాలని అటువంటి విషయాలని మనకి ఒక కథ లాగా అందించారు. బయటికి అది కథ లాగా కనిపించినా అది అర్థం అయినా కాకపోయినా ఆ కథలను అలాగే చదవటం వలన జీవులు ఉద్ధరించబడతారు. వేదములో ఇవ్వబడిన మంత్రాలతో సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. [నిజానికి కొన్ని వేదమంత్రాలు కూడా మామూలుగా అర్థం కాని రహస్యమైన విధానంలో ఉంటాయి. ఋషులు ద్రష్టలు మాత్రమే వాటిని అర్థం చేసుకుని చెప్పగలరు. వాటిని పాశ్చాత్యులు కొందరు సంస్కృతం నేర్చేసుకుని అనువదించేద్దామని ప్రయత్నించి తప్పులు తడకలుగా అర్థం చేసుకున్నారు. అదే సంస్కృత మంత్రాలు యథా తథంగా చదివితే ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అందువలన మనము వ్యాసుడు, పోతన వంటి వారు రాసిన భాగవతం మొదలైన పురాణాలు యథాతథంగా చదివే ప్రయత్నం చెయ్యాలి. అనువాదాలు కాదు ! ]

మనము భౌతిక శరీరములతో భౌతికమైన [Matter] పదార్థములతో నిండిన లోకములో ఉన్నాము. మనము చూసే మనుష్యులు పశు పక్ష్యాదులు, మట్టి, నీళ్ళు, గాలి, రంగు రంగుల అగ్ని అన్నీ కూడా భౌతికమే. దీనినే (1) భూలోకము [Plane of Matter] అంటారు. మనం చూసే గ్రహ గోళాలు అన్నీ - మనం చూస్తున్న సూర్య బింబము, చంద్రుడు, గ్రహములు, తారకలూ, పాలపుంత ఇవి అన్నీ భౌతిక పదార్ధం తో నిండి ఉన్నవే. ఇవన్నీ భూలోకం గానే పిలువబడతాయి. మనమున్న భూమి అనబడే గోళం అందులో ఒక భాగం మాత్రమే అని అర్థం అయ్యిందనుకుంటాను.

దీని కంటే సూక్ష్మమైన లోకములు ఉన్నాయి. ఆ సూక్ష్మమైన లోకములు ఆధారముగా స్థూలమైన భూలోకం నిలబడి ఉంది. అంటే - మనకి మనసు ఉంది కదా, ఆ మనసు వలన, దానిలోని తెలివి వలన మన శరీరం కల్పిమ్పబడింది. అలాగే భౌతికంగా మనం చూస్తున్న ప్రతీ వస్తువుకీ ఒక మనస్సు దాని ప్రకృతి లక్షణములుగా/తెలివి/mind గా పని చేస్తుంటుంది. ఈ మనస్సు భౌతిక ద్రవ్యముతో తయారవక శక్తిమయముగా [Force/Energy] ఉంటుంది. మనసు దేహమును తయారు చేసుకుని భూలోకంలోకి పుడుతూ ఉంటుంది. దేహాన్ని కోల్పోయినప్పుడు తిరిగి కేవల మనోమయ కక్ష్యలలో నిలబడుతూ ఉంటుంది. శక్తి / Force పదార్ధమును / Matter ను నడిపిస్తుంది. భౌతికమైన దేహములు ఇంకా కల్పిమ్పబడనప్పుడు కేవలం మనోమయ కక్ష్యలో ఉన్న జీవులు గల లోకమును (2) భువర్లోకము [Plane of Force] అంటారు. మనమున్న భూలోకంలోనే వేరొక కక్ష్యలో భువర్లోకం కూడా ఉన్నది. వేరే ఎక్కడో ఇంకొక లోకంగా కాదు. భూమి జీవులందరికీ భువర్లోకము అంతర్లీనముగా ఆధారముగా ఉన్నది.

ఇంకా ఇంతకంటే సూక్ష్మమైన లోకమొకటి ఈ భువర్లోకమునకు ఆధారం గా ఉంటుంది. దాన్ని (3) సువర్లోకము (Plane of consciousness) అంటారు. నేనున్నాను అనే అస్తిత్వము సచేతనములమైన మనకెలా ఉన్నదో అచేతనములు విచేతనములు అయిన వస్తువులలో కూడా ఉంటుంది. ఆ అస్తిత్వమును ప్రజ్ఞ్య (consciousness) అని అంటాము.

వీటికి పైన ఇంకా సూక్ష్మతరము సూక్ష్మతమము అయిన వెలుగు లోకములు వీనికి ఆధారభూతముగా ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయి అని అర్థం చేసుకోవటం మన ఊహకి కొంచం కష్టమైన విషయం. వాటి పేర్లు 4-మహార్లోకము, 5-జనోలోకము, 6-తపోలోకము, 7-సత్యలోకము.
సత్యలోకం లో బ్రహ్మ దేవుడు ఉంటాడు. ఈ లోకములలో పైకి వెళ్ళిన కొద్దీ చైతన్యం పెరుగుతుంది. ఇంకా పైన వైకుంఠ లోకం ఉంటుంది.

అలాగే భూలోకం కంటే బాగా పదార్థమయమైన బరువైన అజ్ఞ్యాన జనితములైన చీకటి లోకములున్నాయి. వాటిని (-1)అతల (-2) వితల (-3) సుతల (-4) తలాతల (-5) మహాతల (-6) రసాతల (-7) పాతాళ లోకములుగా చెబుతారు. వెళ్ళిన కొద్దీ వీటిలో చాలా చీకటి ఉంటుందిట. ప్రతీ లోకములోనూ ఆయా లోకానికి సంబంధించిన జీవులుంటారు.

ఈ పదునాల్గు లోకములలో ఒక దానిలోనుండి ఇంకొక దానిలోనికి మార్గాలున్నా మామూలు జీవులందరూ వారి వారి లోకాన్ని దాటి వెళ్ళలేరు.

బ్రహ్మ గారు పడుకున్నప్పుడు వీటిలో [1 to 4] భూ, భువ, సువ, మహర్లోకములు కరిగిపోతాయి. అలాగే [-1 to -5] మహాతలం దాకా ఉన్న క్రింద లోకములు కూడా ఉండవు. అవన్నీ కరిగిపోయి ఒకే పదార్థంగా 'జలము'లతో నిండి ఉంటాయి. ఆయ లోకములకు, వాటి అధిపతులకు, అందులోని జీవులకు అది ప్రళయం. అప్పుడు సూర్యుడు కూడా ఉండదు కాబట్టి అంతటా అజ్ఞ్యానమనే చీకట్లు ఉంటాయి. ఇక్కడ 'జలము'లంటే మనం తాగే నీళ్ళు, మన భూమి మీద ఉండే సముద్రాలు కాదు. ఒక మూలపదార్ధం వంటిది.

అలా పూర్వ కాలంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారు నిద్రకు ఉపక్రమించే సమయంలో అనేక వరములచేత సకల లోకములలోనూ అజేయుడై సంచరించగల హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భౌతిక లోకములను [1,2,3] తస్కరించి (-6) రసాతలంలో దాచేసాడట. తిరిగి మరుసటి పగలు [బ్రహ్మ కల్పం] లో సృష్టి మొదలెట్టినపుడు బ్రహ్మ గారు 1,2,3 లోకాలు సృష్టి చేద్దామని సంకల్పించగానే బ్రహ్మ నాసిక నుండి సర్వ వ్యాపకుడైన నారాయణుడు యజ్ఞ్య వరాహ మూర్తిగా అవతరించి ఆ 'జలములను' చీల్చుకుంటూ అధోలోకములకు వెళ్లి రసాతలములో భూగోళమును దాచిన రాక్షసుని కనుగొని సంహరించి అక్కడి నుండి 'భూమి' [అనగా 1,2,3 లోకాల సముదాయం] ని ఉద్ధరించాడట, అనగా ఆయా లోకముల పునర్ కల్పన ఆ 'వరాహకల్పం'లో వరాహమూర్తే చేసినట్టు.

నీటిలోనే మంచు గెడ్డ కట్టినట్టుగా ఆ దివ్యజలములలో క్రమముగా భౌతిక లోకములు పునరుత్పన్నమయ్యి వాటి యందు బ్రహ్మగారి సృష్టి తిరిగి మొదలయ్యింది.

ఇలాంటివి మనకు తెలియాలంటే గురువులను ఆశ్రయించాలి. మన తార్కిక దృష్టికి అర్థం కాని విషయాలు చాల ఉన్నాయి. మన తెలివి భూలోకమును భువర్లోకమును కూడా దాటలేదు కదా. రేపొద్దున్న ఎవరో పాశ్చాత్యుడు వచ్చి మేము పాలపుంత చివరి దాకా టార్చ్ లైట్ వేసి వేదికాము, మాకు మీ పురాణాల్లో చెప్పిన పదునాల్గు లోకాలు కనిపించలేదు అంటే సమాధానం చెప్పగలమా? అసలు వాడు అది అనే లోపల వాడికి కూడా ఈ అవగాహన కలిగిస్తే గొడవే లేదు.

Read more...

సూర్యదేవుని ఎందుకు అరాధించాలి

>> Saturday, August 31, 2013


భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్షదైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది.నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధంమీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు.

విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం.
ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.

పంచభూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.

మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారిపోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మతలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు.

సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.
మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అం దుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియ దు. అలా తెలియకుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగు తుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగి పోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలో పలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

పంచభూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.

ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.
జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి.
మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు,
యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే
జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్యకాంతి
ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.
Email | Print |

Read more...

ఉపనిషత్తులు అంటే ఏమిటి?

>> Monday, August 5, 2013

ఉపనిషత్తులు అంటే ఏమిటి?
1. జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.
2. ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.
3. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము.
ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?
సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి.  అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది.
ఉపనిషత్తులను 'రహస్యం' అని ఎందుకు పిలుస్తారు?
'ఉపనిషత్' శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి 'రహస్యము' అను అర్థం.  రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే.  కాని దాని 'రహస్యం' అని అనం.  ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం.  ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం.  ఆత్మా అనేది 'నేను, నేను' అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు.  అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు.  ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.
ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలను వ్రాయండి?
1. జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం.
2. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.
3. జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.
4. అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే "గ్రంథం" అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన "విద్య" అని ఇంకొక అర్థం - ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.
"ఓం శాంతిః 
శాంతిః  శాంతిః" అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?
ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది.  వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.

శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక
దుఃఖాలు అంటారు.

పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక
దుఃఖాలు అంటారు.

అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక
దుఃఖాలు అంటారు.

పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాల
దుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.
పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః
ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా
శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?
శ్వేతాశ్వతరోపనిషత్తు
నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?

ఋగ్వేదం    - ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు
యజుర్వేదం  - అహంబ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు
సామవేదం   - తత్వమసి - చాందోగ్యోపనిషత్తు
అథర్వణవేదం - అయమాత్మాబ్రహ్మ - మాండూక్యోపనిషత్తు 


[kBn sharmagaaru]
 

Read more...

శ్రీరామాభిరామం

>> Thursday, April 18, 2013



భారతేతిహాసాలలో శ్రీరాముని విశిష్ట లక్షణాలను కొనియాడని ప్రబంధమూ లేదు. పరమ పురుషుడైన ఆ రవికులతిలకుడు చూపని ఉన్నత గుణమూ లేదు. సకల సద్గుణాల కలబోత జగదేక నేత శ్రీరాముడు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు. ధర్మవర్తనుడై సదా చరించటమే శ్రీరాముని ప్రకృతి. శ్రీరాముడు జగమెరిగిన మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడు సీతాపతిగా ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజన మార్గదర్శనం చేశాడు. ఒక భర్తగా చూపవలసిన లాలిత్యాన్ని, భార్యతో ఉండే సాన్నిహిత్యాన్నీ, జీవన మాధుర్యాన్నీ రాముడు చూపినంతగా మరెవ్వరూ చూపలేదంటే అతిశయోక్తి కాదు.

అభిరాముని విశిష్ట వ్యక్తిత్వం
రాముడు అంటేనే ఆనంద కారకుడు. అభిరాముడు అంటే అందం, ఆనందం, ధర్మనిరతి ఒకే చోట కూడితే అది రాముని విశిష్ట వ్యక్తిత్వం అవుతుంది. రాముడు సదా పూజనీయుడు.. అంటే ఒక విధంగా కాదు. సర్వ విధాలుగా..ప్రభువుగా మన్నిక గొన్నవాడు. రామరాజ్యంలో ప్రజలకు కష్టాలు, కడగండ్లు లేవు. రాఘవుడు భ్రాతృప్రేమను సోదరులకు ఎంతో ఆదరంతో పంచినవాడు. భర్తగా సీతమ్మకు హృదయాభరణమైనవాడు. పుత్రునిగా తండ్రియైన దశరథునకు ప్రియతముడు.

ఇక, భక్తి సామ్రాజ్యంలో తనను ఆశ్రయించిన భాగవతోత్తములైన హనుమ వంటివారికి తన హృదిలో ఉన్నతమైన స్థానాన్ని సమకూర్చినవాడు. రామునిలో మెచ్చదగిన గుణాలు, ఎంచగలిగిన సుగుణాలు, ఒకటా, రెండా...రఘువంశ సుధాంబుధి చంద్రుడు.. ఎంచలేని ఉత్తమగుణ సంజాతుడు. అమిత బలపరాక్రముడైనా, అహంకార మన్నది మనకు రామయ్యలో ఎంత వెతికినా కనపడదు.

అవక్ర పరాక్రముడైనా, అకారణంగా మరొకరిపై రామయ్య తన కోదండాన్ని ప్రయోగించలేదు. మహర్షి విశ్వామిత్రుని యాగరక్షణలోనూ, జలధిపై వారధి నిర్మించే సమయాన రామునిలోని కార్యదక్షుడు మనకు దర్శనమిస్తాడు. ఎటువంటి ఆతృత, సందిగ్ధత శ్రీరామునిలో మచ్చుకైనా ఈ ఘట్టాలలో మనకు కానరావు. అందుకే రాముడు, వీరుడు, ధీరుడే కాదు, సారధర్మ కులోద్ధారుడు! ఉత్తమ ధర్మానికి నిలువుటెత్తు రూపంగా శ్రీహరి దశావతారాలలోనే గొప్పదైన రామావతారం వింతకాంతులీనింది. అందుకే "రామో విగ్రహవాన్ ధర్మః'' అన్న ఆర్యోక్తి మనకు నిత్యస్మరణీయమై నిలిచింది.

పితృవాక్యపరిపాలకుడు
శ్రీరాముని పితృవాక్యపరిపాలన అవనిలో అందరికీ శిరోధార్యంగా విరాజిల్లే మహోన్నత గుణం. తండ్రి యానతిని శిరసావహించి విశ్వామిత్రునితో యాగరక్షణకు వెళ్లిన రాముడు, మార్గమధ్యంలో తాటకను సంహరించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించినప్పుడు "గురువర్యా! మీ వాక్కులను త్రికరణ శుద్ధిగా పాటించమని మా జనకుని ఆజ్ఞ. మా తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించి ఈ తాటకను తక్షణం వధించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను'' అని చెప్పటంతోనే రాముడు తండ్రి మాటకు ఎంత గౌరవమిచ్చాడో మనకు అవగతమవుతుంది.

దశరథుని సమక్షంలో తన పినతల్లి అయిన కైక తనకు దశరథుడిచ్చిన రెండు వరాలను గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు పలికిన మాటలు శ్రీరాముని ఉన్నత హృదయానికి, ఉదాత్త చరితానికి అద్దం పడతాయి. శ్రీరాముడు ఆ సందర్భంలో కైకతో "అమ్మా! నాకు ఏమాత్రం రాజ్యకాంక్ష లేదు. నేను అయోధ్యలోనే ఉండి రాచమర్యాదలు పొందాలనీ ఆశించటం లేదు.

కేవలం ధర్మాన్నే ఆశ్రయించిన నన్ను ఋషితుల్యునిగానే పరిగణించవలసిందిగా నా ప్రార్థన. తల్లిదండ్రులకు శుశ్రూష చేయటం, వారి ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించటాన్ని మించిన ప్రశస్తమైన ధర్మాచరణం పుత్రులకు ఈ భూలోకంలో లేనే లేదు కదా'' అన్న మాటలతో శ్రీరాముని ఉన్నత వ్యక్తిత్వంలోని అమృతత్వం వెల్లడవుతుంది. తన తమ్ముళ్ళైన భరతలక్ష్మణశతృఘ్నుల పట్ల శ్రీరామునికి అమితమైన సోదర ప్రేమ. శ్రీరాముడు కైకకు మాట ఇచ్చి "అమ్మా! నేను వనవాసాలకు వెళ్లేందుకు ఇచ్చిన మాట తప్పను.

భరతుని కోసం నేను రాజ్యాన్ని, సమస్త సంపదలను, చివరికి అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాను'' అని పలకటం శ్రీరాముని సోదర ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. చిత్రకూట పర్వతానికి సైన్యంతో కలిసి వస్తున్న భరతుణ్ణి చూసి ఆగ్రహించిన లక్ష్మణునితో "ఓ లక్ష్మణా! భరతున్ని నీవు కోపంతో ఎటువంటి మాటలు అనవద్దు. ఒకవేళ నీవు అతనిపై ఆగ్రహిస్తే, నాపైనే నీవు కోపగించినట్లుగా భావిస్తాను'' అనటం శ్రీరాముని అపారమైన సోదర ప్రేమకు మచ్చుతునక

. అంతేగాక, యుద్ధ రంగంలో మూర్చిల్లిన లక్ష్మణుని చూసి చిన్న పిల్లవాడిలా రాముడు విలపించిన విధం సోదరులంటే రామునికి పంచప్రాణాలు అన్న విషయాన్ని బలపరుస్తుంది. ధర్మ నిరతికి ఉత్కృష్ట ఉదాహరణం శ్రీరాముని దివ్యచరితం! పుణ్యజీవనులకు ముదావహమైన ఆ గాధ స్మరణీయం సతతం! కమనీయమైనది లోకాభిరాముని అద్వితీయ వ్యక్తిత్వ దర్శనం! అది ఈ ధరణి నిలిచి ఉన్నంతవరకూ ఉజ్జ్వలంగా ప్రకాశించే విశిష్ట గుణాదర్శనం!

Read more...

సంకీర్తనాచార్య! అన్నమాచార్య విచ్చేయవే!

>> Saturday, April 6, 2013



తాళ్ళపాక అన్నమయ్య! తెలుగు పద భారతికి తన అపూర్వమైన భావనా పటిమతో, నవ్య నవనీతమైన సుమధుర గీతికలతో వెలుగు హారతులద్ది, భాషా ప్రవర్ధమానానికి ఎనలేని కృషి సల్పిన వాగ్గేయ ధురీణుడు. తెలుగు పద కవితకు సొబగులద్ది, ఆ సొగసులకు అద్భుత పదసిరులనే విరుల పరిమళాన్ని అద్దిన పద కవితా పితామహుడు. తన సంకీర్తనా ప్రక్రియతో తేటతెలుగుపాటకు ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ మధురిమలకు అద్బుత పదసిరులను విరుల పరిమళాన్ని గుబాళించిన పదకవితా పితామహుడు. వాడుక భాషలో గేయరచన చేసి సామాన్యజనులకు పాట పాడుకునే అవకాశాన్ని కలిగించిన స్తవనీయుడు! భాష యొక్క పరమార్థాన్నీ, నిజమైన ప్రయోజనాన్నీ గ్రహించి తాను రాసిన వాటిలో అత్యధిక సంకీర్తనలను సామాన్యులు, పల్లెపట్టుల్లో నివసించే గ్రామీణులు పాడుకునే జానపద బాణిలో సృజించి సరికొత్త వాజ్ఞయాన్ని సృష్టించిన మహనీయుడు.

అందరిలోనూ శ్రీనివాసుడే...
తాను దర్శించిన సకల దేవతా స్వరూపాలలోనూ శ్రీవేంకటేశ్వరుని దర్శించిన భక్తశిరోమణి అన్నమయ్య. పల్లవి, చరణాలతో కూడిన గేయ రచనకు ఆద్యుడై, శ్రీనివాసుని పదారవింద అనుభూతినీ, ఆ హరిపద మకరంద ఆసక్తినీ తన సంకీర్తనలలో సరళమైన భాషలో వెలయించిన ఘనుడు అన్నమయ్య. సకల వేదాల సారాన్నీ తన సంకీర్తనలుగా చేసి వేదాలలోని ఉత్తమ గుణాలను అమృత గుళికలుగా చేసి మనకు అందించాడు సంకీర్తనాచార్యుడు. అన్నమయ్య సంకీర్తనలు వెంకట పద ముద్రాంకితాలు.

రాముడైనా, కృష్ణుడైనా, నారసింహుడైనా, అన్నమయ్య పదాలలో వేంకటేశ్వరునిగా ఒదిగి వేంకట పద ముద్రాంకితులు కావలసిందే. వేంకటాచలవల్లభునిగా, భక్తజన సన్నిభునిగా వెలుగొందవలసిందే. బాలకృష్ణుడైనా, తిరుమలగిరిపై వేంకటాద్రి ఇంద్రనీలమణిలా ప్రకాశించవలసిందే. ఘోర విదారణ నృసింహుడైనా వేంకటగిరిపై వెలుగుతూ అందపు నవ్వులు చల్లవలసిందే. తాను రాసిన ప్రతి సంకీర్తన హరి వైభవాన్నీ, ఆ తిరువేంకట విభుని ప్రాభవాన్నీ చాటిన వాణీ వీణా నాదాలుగా నినదించేలా చేసి, అద్భుత భావ సౌందర్యం ప్రతిఫలించే గీతికలుగా తీర్చిదిద్దిన అక్షర శిల్పి అన్నమయ్య.

అంతేగాక హరి తనకే సొంతమనే భావనకు ప్రతిబింబంగా 'నేనొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది' అంటూ ఒకింత ఆడంబరం ఒలకబోస్తాడు. అయితే, అన్నమయ్యకు ఉన్నది ఆడంబరం కానే కాదని, అణువణువునా నిండిన శ్రీనివాస పదానుభూతి అని, తన్మయత్వంతో కూడిన అలౌకిక భావన మాత్రమేనని అవగతమవుతుంది. భక్తిస్ఫోరకమైన 'అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' అంటూ ఆర్తితో కీర్తించిన సంకీర్తనలలో భక్తి గంగ ఉప్పొంగుతుంది.

అలతి పదాలతో అనంతమైన భావాన్ని వెలయించటం అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత. భగవంతుని కీర్తించటంలో భక్తికి ప్రాధాన్యతనిస్తూ ధన్యత చెందిన భక్త కవులు మన విశాల సంస్కృతిలో కోకొల్లలుగా కనబడతారు. అన్నమయ్య సంకీర్తనల్లోని వైవిధ్యం భారతీయ వాగ్గేయకార రచనల్లోనే అగ్రగణ్యంగా విరాజిల్లుతోందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అన్నమయ్య సంకీర్తనల్లో దేవభాషగా పిలువబడే సంస్కృత సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడై సకల సుగుణాలకు నెలవైన శ్రీరాముని 'దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘు పుంగవం రామం' అంటూ కీర్తిస్తాడు. హిరణ్యకశిపుని భంజించిన నారసింహుని "జయజయ నృసింహ సర్వేశ! భయహర వీర ప్రహ్లాద వరద'' అంటూ ప్రణతులర్పిస్తాడు.

తన్మయ హృదయంతో 'కేవల కృష్ణావతార కేశవా! దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవ' అంటూ గోపాలకృష్ణుని సన్నుతి చేస్తాడు. ఇక అన్నమయ్య ఘనవిశేషణాలతో ఆగణిత భవహరుడైన శ్రీహరిని కీర్తించాడు. "ఆగమ పుంజ పదార్థుని ఆపత్సఖ సంభూతుని నాగేంద్రాయత తల్పుని నానాకల్పుని కోరుదు నామది ననిశము'' అంటూ సాగుతుంది ఘనపద విభూషితమైన ఆయన పదం.

సంకీర్తనా మాణిక్యాలు
జానపదులకు ప్రాణప్రదుడై అద్భుత సంకీర్తనా మాణిక్యాలను సృజించిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. పల్లెపట్టుల్లో జనం పాడుకునే సువ్విపాటలు, గొబ్బిపాటలు, కోలాటం పాటలు అన్నమయ్య హృదయసాగరం నుంచి ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డాయంటే అతిశయోక్తి లేదు. శ్రమజీవులు అలసట తొలగటం కోసం ఆలపించే దంపుళ్ళ పాటలు అన్నమయ్య రాసిన విధం పులకింపచేస్తుంది. కన్నెపిల్లలు వెన్నదొంగపై ముద్దుగా ఆలపించే 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో' వంటి సంకీర్తనలకు ప్రాణం పోసింది అన్నమయ్యే.

ఇక అన్నమయ్య తత్వామృతాలు జగత్ప్రసిద్ధాలు. "తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా..', 'ఎంత విభవము కలిగే నంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవితము' వంటి అన్నమయ్య తత్వాలు మనకు జ్ఞానబోధ చేసి మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలతాయి.అన్నమయ్య సంకీర్తనలు సాహిత్య ప్రధానమైనవని కొందరూ, సంగీతం పాలు తక్కువని వాదించేవారు కొందరూ ఉన్నారు. ఈ అల్పమైన విషయాలను పక్కనపెడితే అనల్పమైన అన్నమయ్య సాహిత్య సేవ, భక్త పారవశ్యం తెలుగుజాతికి ఎన్నటికీ శిరోధార్యమే.

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ) అన్నమయ్య వర్ధంతి. తన తండ్రికి తీర్థవిధిని నిర్వర్తిస్తూ అన్నమయ్య పుత్రుడు, వాగ్గేయకారుడు అయిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఆర్తితో లిఖించిన "దినము ద్వాదశి నాడు..తీర్థ దివసము నేడు.. జనకుండ..! అన్నమాచార్యుండ..! విచ్చేయవే..'' అనే సంకీర్తనను స్మరిస్తూ తెలుగు నేలపై ఆ భాగవతుని తిరిగి అవతరించమని అర్థిస్తూ, అన్నమయ్యకు భక్తిభావాంజలితో ప్రాంజలి ఘటిద్దాం.

వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

Read more...

అనురాగ సుగంధం దాంపత్య బంధం

>> Saturday, March 23, 2013


సృష్టిలో అత్యంత మధురమైన బంధం భార్యాభర్తల అనుబంధం. ధరిత్రిలో నవచరిత్రను లిఖించేలా వీరి మమతానుబంధం కొనసాగుతూ ఉంటుంది. ప్రత్యేకించి భారతావని తన ఘనమైన సంస్కృతిలో దాంపత్య బంధానికి సమగ్రమైన నిర్వచనం చెప్పింది. భార్యాభర్తలు ఒడంబడికలు, ఒప్పందాలకు బద్ధులై జీవితం గడిపేవారు కారని, అనుబంధానికి, అరమరికలు లేని అవగాహనకు మేలిమి నిదర్శనాలని సోదాహరణంగా చూపిన, ఎలుగెత్తి చాటిన విశిష్ట సంస్కృతి మన దేశాన వేదకాలం నుంచీ ఉంది.

'నాతిచరామి' అన్న వాగ్దానానికి తన మనస్సాక్షినే సాక్షిగా భర్త నిలిపితే, తన సర్వమూ, సర్వస్వమూ పతిదేవుడే అని తలపోస్తుంది సతీమణి. తమ వైవాహిక బంధం ఎన్నాళ్లు నిలుస్తుందో అని ఆ విషయాన్ని ఒక బరువుగా విదేశీ విష సంస్కృతిలో భావిస్తే, భార్యాభర్తలు చిరకాలం కలిసి ఉండటమే నిజమైన పరువు అని భావించే సుధామయ జీవనశైలి భారతీయులకే సొంతం. వైవాహిక బంధంతో ఒక్కటయ్యాక నువ్వు నేను అన్న భావం భార్యాభర్తల్లో ఉంటే అది దాంపత్యమే కాదంటుంది సనాతన భారతీయం.

పరస్పర ప్రేమానుబంధం
భర్తకు భార్య చరణదాసి అయితే, భార్యకు భర్త అనురాగ సేవకుడు. మేలిమి క్షీరంలా భర్త క్షేమం కోసం, అతని శ్రేయస్సు కోసం భార్య నిరంతరమూ తపిస్తుంది. అతని సన్నిధిలోనే తనకు సకలమూ అని తలపోస్తుంది. భర్త కూడా తన అనురాగ దేవత అయిన భార్యను ఎలా ఆనందపెట్టాలి, ఏ విధంగా తమ జీవితాన్ని నిత్యమూ నవ్యమైన రీతిలో ఎలా గడపాలి అన్న విషయంలో నిరంతరమూ పరితపిస్తూ ఉంటాడు. ఉద్యోగబాధ్యతలు కావచ్చు, వ్యాపార నిర్వహణ కావచ్చు. ఎంత దూరాన ఉన్నా, అతని యోచన, ఆలోచన తన అర్ధాంగి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. తాను మైళ్ల దూరంలో ఉంటే కనీసం భోజనమన్నా చేసిందో లేదో అని ఆందోళన పడుతూనే ఉంటాడు.

దాదాపు పాతికేళ్లు వచ్చేవరకు ఒకరికొకరు తెలియకపోయినా దాంపత్య బంధంతో ఒక్కటయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటిగా ఉండటమే సృష్టిలోని చిత్రమైన బంధం. విచిత్రమైన అందం. ప్రకృతి, పురుషుడు వేరువేరు కాదు. ఇద్దరూ కలిస్తేనే ఈ చరామయ జగత్తు. అదే విధంగా దాంపత్య బంధంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న ప్రశ్నే లేదు. ఇద్దరూ సమపాళ్లలో సంసారరథాన్ని లాగే చక్రాలే. ఆ చక్రాలకున్న ఇరుసే వీరి అనుబంధంలోని ఔన్నత్యం. అవగాహనలోని పరిణతిని చాటే తత్వం. మనం అధిదేవతలుగా నిత్యమూ కొలిచే దైవాలనే ఉదాహరణలుగా తీసుకుంటే దాంపత్య బంధంలో వారి అరమరికలు లేని మహిమాన్విత తత్వం వెల్లడవుతుంది. శివపార్వతులొక్కటిగా దర్శనమిచ్చే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిబింబాలు. ఇక, విష్ణుమూర్తి తన హృదయసీమ మీదే తన అర్ధాంగి మహాలక్ష్మిని కొలువుంచుకుని పరవశిస్తూ ఉంటాడు.

సర్దుకుపోతేనే సుఖసాగరం
భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉండాలంటే ఒకరిమీద ఒకరికి అవగాహన, గౌరవం ఉండాలి. నా మాటే నెగ్గాలి అన్న పంతాలు, పట్టింపులు ఉండకూడదు. భర్త ఏదన్నా విషయం చెబితే వెంటనే నచ్చకపోయినా, అందులోని భావాన్ని భార్య గ్రహించాలి. అలాగే, భార్య ఏదన్నా విషయం చెబితే, తనకు హితవుగా లేకపోయినా, అందులోని ఆంతర్యాన్ని గ్రహించి భర్త సర్దుకుపోవాలి. అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండాలన్న నిబంధనేమీ లేదు. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా! అదే విధంగా మన ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, బంధువర్గానికీ, మిత్రబృందానికీ సంబంధించిన విషయాలు కావచ్చు.

భాగస్వాముల్లో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలనేదే లేదు. అటువంటి సమయాల్లోనే కాస్త పట్టూ, విడుపు ధోరణి అవలంబిస్తే ఈ విశాలమైన వసుధలో ఉన్న సుధ అంతా వారిరువురిదే! ఆలూమగల మధ్య అప్పుడప్పుడు పొడసూపే భేదాభిప్రాయాలు అద్దం మీద ఆవగింజలాంటివి. అంటే ఎక్కువకాలం ఆ తేడా వాళ్ల మధ్య నిలవదనేది భావం. అలాగే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే నేటి రోజుల్లో ఆర్థికపరమైన విషయాల్లో మరింత పరిణతి అవసరం. నీ డబ్బు, నా డబ్బు అని అస్తమానం బేరీజు వేసుకుంటే ఇద్దరికీ మిగిలేది అశాంతి, కరువయ్యేది అమూల్యమైన మనఃశాంతి!

ఇద్దరూ సమానులే
అదే విధంగా, పండగలకీ, శుభకార్యాలకీ వెళ్లేటప్పుడు సాధారణంగా పొడసూపుతూ ఉంటాయి ఆలుమగల మధ్య అకారణ భేదాలు. ఒకరికి విలువైనదిగా, వెళ్లక తప్పనిదిగా అనిపించే కార్యం మరొకరికి అనవసరమైనదిగా అనిపించవచ్చు. అంతమాత్రాన, జీవిత భాగస్వామిపై ఆ భావాన్ని రుద్దడం సమంజసం కాదు. తాను రావడం కుదరదనేది మృదువుగా చెప్పి, అవతలివాళ్లు నొచ్చుకోకుండా ఆ శుభకార్యానికి పంపించాలి. విజ్ఞత, తెలివితేటలు భార్యభర్తల్లో ఏ ఒక్కరికో సొంతం కాదు. ఒక్కొక్కసారి భర్త సరియైన నిర్ణయం తీసుకోవచ్చు. మరొకసారి భార్య తీసుకునే నిర్ణయమే ప్రయోజనకారి కావచ్చు.

అందుకే జీవితాన్ని కలిసి పంచుకునే భాగస్వాములు కలివిడిగా ఉండాలిగానీ విడివిడిగా ఉండటం సబబు కాదు. దంపతుల్లో ఏ ఒక్కరూ తమ భాగస్వామిలోని లోపాలను ఎవ్వరి ముందూ ప్రకటించకూడదు. చివరికి సొంత అన్నదమ్ములైనా, అప్పచెల్లెళ్లయినా మూడో వ్యక్తులే కాబట్టి, వారి ముందూ వ్యతిరేకంగా ఏమీ అనకూడదు. అది రెండోవారి హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. తమ భాగస్వామిలోని సుగుణాలను మాత్రం వీలున్నంతగా నలుగురి ముందూ ప్రస్తావించాలి. అది హితకరం, సంసారసౌధానికి బలాన్ని పెంచే మూలధనం. అది ఎదుటివారి హృదయసీమకు మలయసమీరంలా సోకుతుంది. సంసారంలో ఆనందం అర్ణవమవుతుంది.అరమరికలు లేని భార్యాభర్తల బంధం ఈ ధరిత్రికి మనోహరమైన అందం! అది అద్వితీయమైన అనుబంధం! భువనమనే కమనీయ వనంలో ఎన్నటికీ వసివాడని సుమ సుగంధం!

వ్యాఖ్యాన విశారద
వెంకట్ గరికపాటి
తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకులు

Read more...

కోరికలు త్యజిస్తేనే సన్మార్గం

>> Saturday, November 5, 2011


ఆధ్యాత్మికత అంటే కేవలం సర్వసంగ పరిత్యాగులకే పరిమితమైనదని భావించరాదన్నారు అవతార్ మెహెర్‌బాబా. మనం మన ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, జీవిత లక్ష్యమైన భగవదైక్యం పొందడానికి సాధనచేయాలని మెహెర్‌బాబా తన భక్తులకు అనేక సందేశాలలో ఉద్బోధించారు.

ఆధ్యాత్మికత సాధన మార్గంలో బాహ్యంగా అనేక భోగభాగ్యాలను త్యజించడమే కాదు అంతర్గతంగా కూడా ఐహిక వాం«ఛలపై మమకారం నశించాలని మెహెర్‌బాబా బోధించారు. మనం నిత్యం చూసే ఆకర్షణలన్నీ ఒక మిథ్య అని బాబా వర్ణించారు. ఆ ఆకర్ణణలు ఎంతటి శక్తివంతవైనా వాటికి లోబడక నిత్యజీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా ప్రాపంచిక విధులన్నిటినీ నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ భగవన్మార్గంలో పయనించాలని బాబా తన భక్తులకు సూచించారు. ఈ విషయమై మెహెర్‌బాబా చెప్పిన ఒక కథాంశాన్ని ఆయన సన్నిహిత మండలి సభ్యుడు ఏరుచ్ జెస్సావాలా ఇలా వివరించారు.

సద్గురు దర్శనం
ఒక చక్రవర్తి తన రాజ్యంలో ఉన్న ఒక సద్గురువు దర్శనార్థం తన కుటుంబీకులు, బంధు మిత్రులందరితో కలిసి ఆయన ఉండే ఆశ్రమానికి వెళ్లాడు. సద్గురువు ఆశ్రమానికి చాలా దూరంలోనే తన అశ్వ, గజ బలాలన్నింటినీ నిలిపివేసి రాజు తన పరివారంతో నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్లాడు.

ఆ ఆశ్రమం బయట ఉన్న కాపలాదారుడికి తాను ఈ రాజ్యానికి చక్రవర్తినని, సద్గురువు దర్శనార్థం వచ్చానని, దయచేసి ఆయన దర్శనం ఇప్పించాలని వినయపూర్వకంగా వేడుకున్నాడు. సద్గురువు నుంచి పిలుపు వచ్చే దాకా వినయంగా అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత సద్గురువును దూరం నుంచి నిలబడే దర్శించుకుని తన బంధు మిత్రులను సద్గురువుకు పరిచయం చేశాడు. సద్గురువు చాలా సంతోషించి అందరినీ కూర్చోబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.

సాధారణంగా సద్గురువులు పెద్దగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయరు. కుశల ప్రశ్నలతోనే వారు అనేక విషయాలు మన నుంచి గ్రహిస్తారు. అనంతరం సద్గురువు లేచి నిలబడి సెలవు ప్రకటించారు. క్షేమంగా వెళ్లమని అందరికీ ఆశీసులిచ్చాడు. అయితే చక్రవర్తి రెండు చేతులూ జోడించి తమరి సందేశ వాక్కులు ఏమైనా ఇవ్వాలని సద్గురువును వేడుకున్నాడు. ఇందుకు సద్గురువు నవ్వుతూ, నా సందేశం కావాలా అంటూ సరే నాకు గుర్తున్న ఒక కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించమని చక్రవర్తికి తెలిపాడు.

రాజ్యం నీళ్లతో సమానం!
రాజా...నీకు వేటంటే ఇష్టమనుకుంటాను అని సద్గురువు రాజును ప్రశ్నించగా అవును...తనకు వేటంటే ఆరోప్రాణమని రాజు బదులిచ్చాడు. తాను చెప్పబోయే కథ కూడా మంచి వేటగాడైన ఒకానొక చక్రవర్తి గురించేనని సద్గురువు కథ చెప్పసాగాడు. అరణ్యంలో మృగాల వేటకు వెళ్లిన ఒక చక్రవర్తి సాయంత్రం దాకా వేటాడి గురి తప్పి, దారి తప్పి , తన వెంట వచ్చిన సైన్యానిది మరో దారైపోగా ఎడారి లాంటి ప్రాంతంలో ఒంటరివాడై పోయాడు. తానెక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఆ చక్రవర్తిది. తన రాజ్యం సరిహద్దులు కూడా అతను దాటేశాడు. దప్పికతో, అలసటతో చక్రవర్తి నేలకొరిగాడు.

ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందా అన్నట్లుంది అతని పరిస్థితి. ఈ సమయంలో ఒక కుండ నిండా నీళ్లు పట్టుకుని నేను ఆ చక్రవర్తి ఎదుట ప్రత్యక్షమయ్యాను. అయితే మంచినీళ్లు ఇవ్వడానికి తగిన మూల్యం చెల్లించాలని నేను చక్రవర్తికి షరతు విధించాను. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని..మీరు ఇచ్చే మంచినీళ్లకు వెల ఎంత చెల్లించమంటే అంత చెల్లిస్తాను అని మూలుగుతూ చక్రవర్తి జవాబిచ్చాడు.ఓ అలాగా! నీ రాజ్యంలో సగభాగం ఇవ్వాలని నేను షరతు విధించాను. అదెంత భాగ్యం...అలాగే తీసుకోండి. కానీ, మంచినీళ్లు దయచేసి ఇప్పించండని చక్రవర్తి ప్రాధేయపడ్డాడు.

మంచినీళ్లు తాగిన చక్రవర్తి బలం పుంజుకున్నాడు. తన రాజ్యానికి వెళ్లేదారి నా నుంచి తెలుసుకుని బయలుదేరాడు. అయితే కొంత దూరం వెళ్లేసరికి చక్రవర్తికి మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాని ఎంత ప్రయత్నించినా చక్రవర్తికి మూత్ర విసర్జన చేయడం కష్టమవుతుంది. అప్పటికే చక్రవర్తి తన రాజ్యంలోకి ప్రవేశించాడు. మూత్ర విసర్జన కాకపోవడంతో చక్రవర్తికి విపరీతమైన కడుపునొప్పి రావడంతోపాటు దేహంలో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నొప్పి తట్టుకోవడం కంటే మరణమే మేలని చక్రవర్తి భావిస్తాడు.

ఇదిగో ఈ సమయంలో నేను తిరిగి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. నీ బాధ ఏమిటని చక్రవర్తిని అడిగాను.నన్ను చూడగానే పరమానంద భరితుడైన చక్రవర్తి మూత్రవిసర్జన చేయలేకపోతున్నానని, విపరీతమైన కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. ఎలాగైనా ఈ బాధ నుంచి ఉపశమన కలిగించమని చక్రవర్తి నన్ను వేడుకున్నాడు.

ఈ బాధకు నా దగ్గర మందు ఉందని చక్రవర్తికి చెప్పాను. అయ్యా! దయచేసి ఆ మందును నాకు వెంటనే ఇప్పించండి. మీకేమి కావాలన్నా తక్షణం చేస్తాను..ముందు నాకు నొప్పి తగ్గించండి అని చక్రవర్తి వేడుకున్నాడు. నీ రాజ్యంలో మిగిలిన సగభాగం నాకు ఇవ్వమని షరతు విధించాను. అలాగే తీసేసుకోండి. ఎలాగైనా నా ప్రాణాలను మాత్రం కాపాడండి అని చక్రవర్తి ప్రాథేయపడ్డాడు. అతనికి జ్ఞానబోధ చేసి ఆ బాధ నుంచి తప్పించాను అంటూ సద్గురువు తన కథ ముగించాడు. ఇదే నేను నీకు ఇచ్చే నా సందేశం అని సద్గురువు రాజుకు తెలియచేశాడు.

నీ రాజ్యంలో సగభాగం విలువ నీ దేహంలో ఉన్న నీటితో సమానం. మిగిలిన సగ రాజ్య భాగం నీ దేహం నుంచి విసర్జించే నీటితో సమానం....ఇదే రాజుకు సద్గురువు ఇచ్చిన దివ్య సందేశం. నీతి నిజాయితీలతో నీ విధులు నిర్వర్తించు అంటూ సద్గురువు రాజును దీవించి పంపివేశాడు.

Read more...

కృష్ణ తత్వం

>> Wednesday, August 24, 2011

కృష్ణ తత్వం
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
పనిషత్తుల కాలంలో ఉద్భవించిన సత్యం, శివం, సుందరం, ప్రేమ పవనాలు అనంతరకాలంలో ఒకే ఒక మహా మహితాత్మునిలో కేంద్రీకృతమై భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా, రాజకీయంగా స్పందింపజేశాయి. గీతాకారుడైన శ్రీకృష్ణుని వాక్కులు నేటికీ భారతీయ జీవనంపై అమోఘమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతినుంచి శ్రీకృష్ణుని పాత్రను తొలగిస్తే మిగిలేది అత్యల్పం అంటారు స్వామి రంగనాథానంద. మన ధర్మం, తత్వశాస్త్రం, భక్తిమార్గం, వాఞ్మయం, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం, సంగీతం- జాతి సంస్కృతి నాగరికతలకు సంబంధించిన అన్ని అంశాల్లో శ్రీకృష్ణుని ముద్ర గోచరిస్తుంది. బహుజన హితం, బహుజన సుఖం లక్ష్యంగా సుసంపన్నమైన వ్యక్తిత్వం కలిగినవారే అవతారపురుషులు. కృష్ణావతారం పరిపూర్ణమైనది. ఆయనను 'పరిపూర్ణ పురుషుడు' అంటారు వేదాంతులు. ఆయన రసస్వరూపుడు. గురువు, నేత, రాజనీతివేత్త, మహర్షి, యోగి, విశ్వసారథి. చివరకు విధిచేతిలో లొంగిన మానవోత్తముడు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనలనే త్రిపుటి కృష్ణావతార పరమార్ధం. ఈ ఉద్యమానికి శ్రీకృష్ణుడు విశ్వరథ సారథ్యం వహించాడు. ఆయనలో ఒకపక్క మానవత్వం తొణికిసలాడగా, మరోపక్క దివ్యత్వం ప్రకాశించింది.

శ్రీకృష్ణుడు అవ్యక్తధర్మానికి వ్యక్తరూపం. అతడికి ఎవరితోనూ ఘర్షణ లేదు. ఘర్షణ పడినవాళ్లు కూడా తమ దుష్టత్వం వల్లనే విభేదించారు తప్ప కారణం ఉండికాదు. ధృతరాష్ట్రుడు దుష్టుడైనా కృష్ణుడి హితవాక్కు అనుసరించలేకపోవడం జరిగిందిగాని, ఘర్షణ పడలేదు. దుర్యోధనుడు కూడా రాయబార ఘట్టాల్లో పాండవులను నిందించినా కృష్ణుణ్ని నిందించడం చేతకాలేదు. అతడు పాండవులకు ఎంత హితుడో తమకూ అంత హితుడేనని వారికి తెలుసు. ఈ సత్యాన్ని భరించగల హృదయ వైశాల్యం వారికి లేకపోయింది.

కృష్ణుడి జీవితంలో ఇతరులకు అతడి నిమిత్తంగా సన్నివేశాలు ఉన్నాయిగానీ అతడికి సంబంధించిన సన్నివేశాలు చాలా అరుదు. చివరకు యాదవ వినాశనంగాని, తన కాలికి తగిలిన బాణంగాని అతడి మనసును తాకిన సన్నివేశాలు కాలేకపోయాయి. అతడి జీవితంలోని సుఖదుఃఖాలకు సంబంధించిన సందర్భాలేవీ అతడి మనసును తాకలేకపోవడం మానవాతీతమైన లీల. కృష్ణుడి జీవితంలో తనకోసం ఆచరించిన ధర్మమూ కనిపించదు. తమ స్వధర్మాన్ని లోకహితంగా ఆచరించడానికి సంకల్పించినవారు సాధువులు. స్వధర్మాన్ని స్వార్థానికి వినియోగించుకునేవారు దుష్కృతులు. సాధువులకు రక్షణ ఇచ్చేందుకు, దుష్కృతులను శిక్షించేందుకు అన్ని కాలాల్లో దిగివస్తూనే ఉంటానని కృష్ణుడు చెప్పాడు. కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది.

కృష్ణతత్వాన్ని పరిశీలించడం అంటే- సముద్రం లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడమే. మహాభారతం కృష్ణుని పరంగా ఒక దర్శనం. భారతంలో ఇమడ్చటానికి అవకాశం లేక పోయిన కృష్ణుని లీలామయ జీవితాన్ని వ్యాసుడు భాగవతంలో కీర్తించాడు. ఆయన బోధించిన జీవనతత్వాన్ని భగవద్గీతలో వివరించాడు. భారతీయుల ఆధ్యాత్మిక, లౌకిక ఆకాంక్షలకు ఆ మహాపురుషుని జీవితంలో సమాధానాలు లభిస్తాయి.



Read more...

ప్రశ్నలెన్నైనా సమాధానమొక్కటే...

>> Thursday, August 4, 2011

- [అప్పరుసు రమాకాంతరావు]
శివుడవో మాధవుడవో ఎవరనీ నిర్ణయించేదిరా అని త్యాగయ్య సంశయపడ్డాడు. వ్యాసుడు, పరాశరుల్లాంటి వారికీ; శుక శౌనక మహామునులకే అర్థం కాని పరమార్థ పరబ్రహ్మమది. పరమాత్మతత్వం తనకు కూడా తెలియదని పోతనామాత్యుడు వాపోయాడు. ఎవరా పద్మభవుడు? ఏడీ... ఎక్కడ ఉంటాడు? ఏమో ఎవరికి తెలుసు. కోటానుకోట్ల సూర్యులను సృజించినవాడు ఎంతటి శక్తిమంతుడో ఊహించనైనా లేము. వేదాలు, సమస్త వాఞ్మయాలు నిర్వచించలేని నిరామయుడు ఆ దైవం! అణువిచ్ఛేదం వల్ల ఉత్పన్నమైన మహాభీకర భీభత్సంతో పోలుద్దామనుకొంటే- విశ్వంలోని లెక్కించ తరం కాని అణువుల లయకారకుడు ఆ దైవమే! పంచభూతాలు త్రిగుణాత్మకాలు దైవ కారకాలే కాని దైవం కాదట! అసలు భగవంత తత్వం సాకారమైనదో నిరాకారమైనదో తెలియదాయె. మూర్తిగా మార్చుకొని భక్తిగానం చేద్దామంటే దైవానికి రూపమే లేదని ఉపనిషత్తులంటున్నాయి. ఇంద్రియాలకు కనిపించడు. చింతించటానికి కూడా అలవి కాదు. చలించనిదే దైవం... మరైతే ఎల్లెడలా ఎలా వ్యాప్తి చెందగలడో అర్థం కాదు.

వ్యాసభాగవతంలో చెప్పినట్లు దశావతారాల మూలమైన విష్ణువే దైవం అనుకొంటే శివుడెవరు? ఏకం (ఒక్కడే) నిరంజనుడనుకొందామంటే త్రి(ముగ్గురు) మూర్తులెవరు? దైవస్థానం వైకుంఠమా, కైలాసమా, బ్రహ్మలోకమా? అమృత బిందూపనిషత్తులో అన్నమే పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. కాని, అన్నం మానవ కృషితో ఉద్భవించినది కదా? ఎన్నెన్ని ప్రశ్నలు, ఎన్నో శోధనలు, మరెన్నో సాధనలు... అవేవీ కూడా పరమాత్మజ్ఞానాన్ని కల్పించడం లేదు. అంధులకు సూర్యుడు కనిపించనట్లు మానవులెవరూ నిరంజనుని తెలియలేకున్నారు. ఆది అంతం లేనివాడని కఠోపనిషత్తు అంటోంది. అంతం లేనిది ఉండొచ్చు కాని ఆది లేకుండా ఎలాగో... అర్థం కాని అద్భుతం! రుద్రులు సూర్యులు వసువులు విశ్వదేవతలు అశ్వినీదేవతలు దైవం కాదని మహర్షులన్నారు. గంధర్వుడివా యక్షుడివా సిద్ధుడివా? కాదు కదా! వారంతా నీవు సృజించినవారే. మరి కాలానివా? అలానైనా భావించాలనుకొంటే భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలకు అతీతుడవని పరాశరుడన్నాడు. మృత్యువువా? అది కూడా కాదని తెలుస్తోంది. దేహంలోని ఆత్మకు జనన మరణాలు లేవట! విష్ణు సహస్రనామాలు స్మరించి దైవాన్ని తెలుసుకొందామనుకొంటే శివసహస్ర నామాలు దైవ రూపాలంటున్నారు. పరమాత్మకన్నా ఆదిపరాశక్తి గొప్పదని కొందరు బోధిస్తున్నారు.

తెలియదగినవాడే దైవం అంటారే.... మరి ఎవరివని తెలుసుకోవాలి. దైవం రూపమేమిటి? స్థానమేది? ఆధారం ఎక్కడ? ఏదీ తెలియదాయె. వేదరూపివా? వేదాలను సృజించిన బ్రహ్మ నీ నాభి నుంచి ఉద్భవించాడు మరి! అనురాగదేవతవా? రాగానురాగాలకు అతీతుడవట! ఈ ఆలోచనలకూ ఇన్ని సంశయాలకూ, శోధనలకూ సాధకులకూ అతీతుడవైన ఆదిదేవా! మరి మానవాళి ఎలా తెలుసుకోవాలి? ఎలా చేరాలి? దైవజ్ఞానం పొందడమే దైవసాన్నిధ్యం కలగడమని శంకరాచార్యుల వారన్నారు. ఆలోచనలు అనుమానాలు ప్రశ్నలు విడిచి సర్వభూతదయ కలిగి ఉండాలనీ, దైవకార్యాలను ఆచరించాలనీ సూచించాడు. దైవమే ప్రాప్తిగా చేసుకొని మంచి కార్యాలు చేయాలి. దేహంలోని దేహం బయట ఉన్న శత్రువర్గాలను విడచి పెట్టగలగాలి. సుఖ దుఃఖాల్లో స్థితప్రజ్ఞుడై ఉండాలి. ఈ సాధనల వల్ల దైవం ఎవరు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

Read more...

నేను! నేను!! నేను!!!

>> Sunday, May 22, 2011

నేను! నేను!! నేను!!!
- నాయుని కృష్ణమూర్తి
మనలో అహంకారం ఎక్కువ. మన మనసును అహంకారం శాసిస్తోంది. 'అహంకారం' అంటే 'నేను' అనే గర్వం.

- 'నేను' ఈ కుటుంబానికి యజమానిని. అందరికీ తిండి పెడుతున్నాను. కాబట్టి నామాట ప్రతి ఒక్కరూ వినాలి. నన్ను ఎదిరించకూడదు. నన్ను తక్కువచేసి మాట్లాడకూడదు'

'నేను' కాబట్టి ఈ పనిని చెయ్యగలిగాను'

ఇలా 'నేను' ప్రతిరోజూ, ప్రతివ్యక్తి మాటల్లోనూ, చేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది అవతలి వ్యక్తులు భరించలేని స్థాయికి కూడా వెళ్తుంది. వాళ్ళు భరించలేకపోవడానికి వాళ్ళలో కూడా 'నేను' అన్న అహంభావం ఉండటమే కారణం!

రహూగణుడు అనే రాజు తత్వజ్ఞానం కోసం కపిల మహాముని దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నది పల్లకిలో. పల్లకిని నలుగురు బోయీలు మోస్తున్నారు. పెద్దంత దూరం వెళ్లిన తరవాత బోయీలు అలసిసోయారు. ఒక్కొక్కరికి కాస్సేపు విశ్రాంతి ఇవ్వడానికి ఒక అదనపు బోయీ కావాలి. చుట్టూ చూశారు. దోవపక్కన చేనుకు ఒకడు కాపలా కాస్తున్నాడు. వాణ్ని తమకు సహాయంగా రమ్మన్నారు. అతడు వెంటనే వచ్చి పల్లకిని మోయడానికి సిద్ధపడ్డాడు. ఒక బోయీకి కాస్సేపు విశ్రాంతి లభించింది.

వచ్చిన కొత్తవ్యక్తి జడ భరతుడు. అహంకారం, మమకారం, మిథ్యాజ్ఞానం ఏమీలేనివాడు. భరతుడికి పల్లకి మొయ్యడం కొత్త. పల్లకిలో కుదుపులు మొదలయ్యాయి.

లోపల కూర్చొని ఉన్న రహూగణుడికి కోపం వచ్చింది. 'ఓరీ బుద్ధిహీనుడా! పల్లకి మొయ్యడం కూడా నీకు చేతకాదా? నిన్ను కఠినంగా శిక్షిస్తేగాని నీకు బుద్ధి రాదు' అని తిట్టాడు.

భరతుడు తలపైకెత్తి రాజు వంక చూస్తూ 'రాజా! నీ పల్లకి మోసే భారం నా శరీరానిదేగాని, అందులోని జీవుడిది కాదు. కాబట్టి నేను నీ పల్లకి మొయ్యడంలేదు. స్థూలత్వం, కృశింపు, వ్యాధులు, మనోవ్యధలు, ఆకలిదప్పులు, భయరోషాలు, జరామరణాలు, నిద్రాజాగరణలు, అహంకార మమకారాలు దేహంతోపాటు పుడతాయి. దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. 'ఈ దేహమే నేను' అని నేను అనుకోవడంలేదు. కాబట్టి నేను జీవన్మృతుణ్ని. యజమాని, సేవకుడు అనే సంబంధం విధికృతమైంది. ఆ వ్యవహారం శరీరానికే పరిమితం కాని జీవుడి వరకు రాదు.

రాజు అనే అహంభావంతో నువ్వు నన్ను శిక్షిస్తానంటున్నావు. ఉన్మత్తత, జడత్వం స్వభావంగా ఉన్న నన్ను నీ శిక్ష ఏం చేస్తుంది? స్తబ్ధుణ్నయిన నాపట్ల నీ ఆగ్రహం, శిక్ష రెండూ వ్యర్థమే!' అన్నాడు.

భరతుడికి మించిన గురువు ఉండడని రాజుకు తెలిసిపోయింది. దిగ్గుమని పల్లకి దిగి భరతుడి కాళ్లకు మొక్కి తత్వబోధ చెయ్యమని వేడుకొన్నాడు.

భరతుడిలాగా మనమందరమూ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అంత స్తబ్ధులుగా ఉండి ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం కష్టం.

కాని కొంతవరకైనా జ్ఞానం సంపాదించుకొని, అహంభావాన్ని ఒకింత అదుపులో పెట్టుకోగలిగితే మనం మరికొంత సుఖంగా జీవించగలం. ఎదుటివాళ్లు కొంతస్వేచ్ఛగా వూపిరి పీల్చుకోగలుగుతారు.

Read more...

ఆపద వేళల...

>> Wednesday, April 21, 2010

ఆపద వేళల...
- సి.వేదవతి
మనం సాగిస్తున్న ఈ జీవనయాత్ర ఎంత సుందరమైనదో అంత కష్టతరమైనది. పుట్టిన దగ్గరనుంచీ, ఎన్నెన్ని అనుభవ పరంపరలు! మరింకెన్నెన్ని అనుభూతుల స్పర్శలు! కొన్ని కసుక్కున గుచ్చి బాధించే కసాయి ముళ్లు- మరికొన్ని అప్పుడే రేకలు విచ్చుకొన్న పూలపిల్లలు వచ్చి చల్లగా తాకినప్పటి మృదుల స్పర్శలు!

చల్లదనాన్ని ఆస్వాదించడానికి మనకు ఏ తోడూ లేకపోయినా ఫరవాలేదు. కానీ, ముల్లు గుచ్చుకొన్నప్పటి కరకు బాధ ఉన్నదే- దాన్ని ఓర్చుకోవటం మాత్రం ఒక్కరివల్లా కాదు. ఏ మూలనుంచో ఒక ఆపన్న హస్తం వచ్చి ఆదుకోవాలి! పళ్లబిగువున మనం అనుభవిస్తున్న బాధకు మరేపక్కనుంచో ఒక ఉపశమన మంత్రం వచ్చి మన చెవిలో వినిపించాలి. వచ్చి పడిన కష్టం ఎంతటిదైనా, దాని తీవ్రతను ఎంతో కొంత తగ్గించి మనకు స్వాంతన కూర్చే కారుణ్యమయ హస్తస్పర్శ వచ్చి మనలను చల్లగా తాకాలి.

కష్టసమయంలో మనం ఆశించే ఈ తోడ్పాటు ఏ దిశనుంచి వస్తుంది? మనకు అయిన వాళ్లెవరో వచ్చి మనలను ఆదుకోవాలి. సాధారణంగా వారు మనకు రక్తసంబంధీకులైన బంధువులో, మనకు మానసిక బంధంతో చేరువైన ఆప్తమిత్రులో అయి ఉంటారు. అందుచేత అవసర సమయాల్లో ఆసరా కోసం మనం వారిపైనే ఆధారపడాలని ఆశపడతాం.

వారు ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారన్నదీ అసంభవమైన విషయమే. వారు కూడా మనకుమల్లేనే మానవమాత్రులే. వారికీ మనకు మల్లేనో, ఇంకా ఎక్కువగానో సమస్యలు ఉండి ఉండవచ్చు. అదీ కాక- బంధువులు, మిత్రులు మనకు చేసే సహాయానికి కొన్ని పరిమితులు ఉంటాయి. వారికైనా, ఎల్లవేళలా మనకు సహాయపడటానికి ఉండేది కొద్దిపాటి శక్తి మాత్రమే!

మరి ఎలాగ? స్వశక్తికానీ, భౌతికమైన మరే సహాయ సంపత్తికానీ మనను ఆదుకోలేని దుస్థితి ఏర్పడితే... ఎలాగ మరి?

భయపడవలసిన పనిలేదు. సర్వశక్తిమంతమైన ఆపద్భాంధవ తత్వం ఒకటి సదా మనను వెన్నంటే ఉంటుంది. అది భౌతిక దృష్టికి అందదు కనుక- మనం గుర్తించలేకపోవచ్చు. నమ్మినవారి దృష్టిలో, సర్వవ్యాపకమైన ఆ పరమశక్తి దివ్యరక్షాకవచమై అన్నివేళలా మనలను ఆదుకొంటూనే ఉంటుంది. అది ఒక అపారమైన కారుణ్యతత్వం! ఎక్కడెక్కడ దైన్యం ఉంటుందో, ఎక్కడెక్కడ జ్వలితార్తి రగుల్కొంటూ ఉంటుందో- అక్కడక్కడ చినుకు చినుకై జల్లులాడే కృపావర్షమది!

ఆపత్సమయంలో మనం ఒకసారి స్మరించినా చాలు- కరిగి కరిగి నీరయ్యే నీలమేఘమల్లే మనలను చల్లగా తాకి ఆర్తిని హరింపజేసే ఆ దయామృతాన్ని ఏమని పిలవాలి? ఒక వూరా, ఒక పేరా? ఏ పేరుతో పిలిచినా పలుకక మానదు కదా! ఎక్కడ ఉన్నా- మనం పిలవగానే పరుగుపరుగున రాక మానదు కదా!

మన కంటికి కనుపించదు కానీ- ఆపద వేళలో, ఆకటివేళలో మనకు తోడునీడై నిలుస్తుంది, ఆర్తిహరమైన ఆ పరమాత్మతత్వం... పరమకారుణ్య భగవత్తత్వం!


[ఈనాడు ,నుండి]

Read more...

ధర్మసూక్ష్మాలు

>> Tuesday, April 20, 2010

సమస్త ధర్మాలకు వేదమే ఆధారమని మహర్షులు ప్రబోధించారు. ధర్మమనేది మానవజాతికి వెన్నెముకవంటిది. ధర్మాన్ని విడిచిన మనిషి మనిషిగా జీవించలేడు. ధర్మసూత్రాలతోనే సమాజం వికసిస్తుంది. ఈ మానవ మర్యాదలతోనే సమాజం హద్దుల్లో ఉంటుంది. అందుకే మన పూర్వీకులు మానవ సమాజ సర్వతోముఖ వికాసం, ప్రగతి, అభ్యుదయాల్ని కాంక్షించి ధర్మశాస్త్రాలు రచించి అందించారు. వాటిని పరిశీలించి పాలించడమే మన ధర్మం.

రుషులు త్రికాలజ్ఞులు. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో ఏమి జరుగుతుందో వారికి తెలుసు. అందుకే వారు రచించిన గ్రంథాల ద్వారా సమస్త మానవజాతిని ధర్మమనే మణిహారంలో ముడివేయాలనుకున్నారు. శాస్త్ర ధర్మాలు మనకు బోధించారు. శాస్త్ర నిషిద్ధ కర్మలను చేయకూడదు. వేదం జూదం ఆడవద్దని ఆదేశించింది. దుష్టకార్యాలు చేయవద్దని హెచ్చరించింది. శ్రేయం కలిగించే ధర్మ సూక్ష్మాలు అన్ని కాలాల్లో అందరికీ వర్తిస్తాయి. ఈ ధర్మ జ్ఞానం వేద ప్రతిపాదిత జీవన విధానం వల్ల మనకు కలుగుతుంది.

మనం ఈ లోకంలో అనుభవించే సుఖాలన్నీ భగవంతుడిచ్చినవే. దుఃఖాలన్నీ మనం కోరి తెచ్చుకొన్న పాప ఫలాలే. గృహస్థులు ధర్మబద్ధంగా వస్తువులు సంపాదించుకొని వాటిని త్యాగభావంతో అనుభవించాలి. ఇది నాదికాదనే పరార్థ భావన ఉండాలి. ఇది అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలని వేదమంటుంది.

మనిషి కోరికలకు లొంగిపోకూడదు. విషయసుఖాలు మనిషిని బంధిస్తాయి. అందుకే వివేకవంతుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. కోరికలు తగ్గించుకుంటే మనిషి విశ్రాంతిగా ఉంటాడు. దుఃఖానికి కారణం కోరికలేనని బుద్ధుడన్నాడు. అవి తీర్చే కొద్దీ కొత్తవి పుట్టుకొస్తాయి. అందుకే వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు నిగ్రహించుకోవాలి. సంయమనం పాటించాలి. సాధారణ జీవనం సుఖదాయకం. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. అందుకే రుషులు ధర్మాన్ని అతిక్రమించవద్దని పదేపదే హెచ్చరించారు. ధర్మమే ప్రధాన లక్ష్యమని ఉపదేశించారు.

భార్యబిడ్డలు, బంధుబాంధవులు, మనం ప్రేమించిన వస్తువులన్నీ మనల్ని విడిచిపోతాయి కాని- ధర్మం మాత్రం ఎప్పుడూ విడవదు. ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాల్లో మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షాన్ని విడిచి మధ్యలోని అర్థ కామాల వెంట నేటి మనిషి పరుగులు తీస్తున్నాడు. అశాంతికి లోనవుతున్నాడు. బాధ్యతలను విడిచి హక్కుల కోసం ఆరాటపడుతున్నాడు. మన పూర్వులు అందించిన సురక్షిత మార్గాన్ని విడిచి తాత్కాలిక సుఖాల కోసం అన్వేషిస్తున్నాడు. సహజమైన సుఖశాంతుల్ని విడిచి కృత్రిమమైన ఆనందాలకోసం అర్రులు చాస్తున్నాడు. సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. జీవనాన్ని భగ్నం చేసుకుంటున్నాడు.

మానవ జన్మ మనకు దివ్యవరంగా లభించింది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మహా పురుషులను ఆశ్రయించాలి. ఆత్మ పరమాత్మల జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా ముక్తి దొరకదు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి [ఈనాడు నుండి]

Read more...

ధ్యానం-సాధనా గానం

>> Monday, April 19, 2010



- [చక్కిలం విజయలక్ష్మి]
ధ్యానం విషయంలో చాలామంది అపోహలో ఉంటారు. కళ్లు మూసుకుని వూరికే కూర్చుని ఉండటమనీ, శూన్యంలోకి గానీ లేదా ఒక వస్తువునుగానీ తదేకంగా చూస్తూ ఉండటమనీ భావిస్తారు. ఇది కొంతవరకు మాత్రమే సరైనది. పూర్తిగా సమర్థించవలసినది కాదు. ఆరోగ్యం వేరు, ఆధ్యాత్మిక విషయం వేరు. పూర్వం రుషులు, విజ్ఞులు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాలను సమ్మేళించి బోధిస్తూ వచ్చారు. ఎందుకంటే మరీ తీవ్ర తపోధనుల విషయం పక్కనపెడితే- ఆధ్యాత్మిక సాధన యావత్తూ సాధకుడి ఆరోగ్యంతోనే ముడివడి ఉంది. గౌతమ బుద్ధుడు కూడా ఒకానొక సందర్భంలో నిరాహారం వల్ల ఆరోగ్యం సహకరించక ధ్యానం నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఆహారం మన ఆధ్యాత్మికతకు తోడ్పడే స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి మన ఆహారంగా, ఆరోగ్యంగా మారే దశ వచ్చేవరకు- సాధకుడు ఆరోగ్యానికి ఆధ్యాత్మికత కంటే అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. శరీరం ఖలు ధర్మసాధకం అన్నారు మరి. భగవత్‌ స్పృహ బొత్తిగా లేని వ్యక్తి మౌనంగా, కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ ఉండటమనేది ధ్యానం అనిపించుకోదు. ఆలోచనల తీవ్రత తగ్గి ఆ రీత్యా అలజడి మందగించి, కొంతవరకు మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు. అంతే! ఏ పనైనా అవగాహనతో చేసినప్పుడే పూర్తి ఫలితాలు లభిస్తాయి. ధ్యానం కేవలం ఆరోగ్యం కోసం చేసినట్లయితే... మంచిదే. దానికి హృత్‌-పూర్వక నమస్కారం. కానీ మనం ఆ అంతర్యామి కోసం చేస్తున్నాం. అక్కడికి దారి వేసే ఆధ్యాత్మికత కోసం చేస్తున్నాం. ఆ మౌలిక సూత్రాల ఆధారంగానే మన పయనం సాగాలి. ఆ ధ్యేయ వస్తు జ్ఞానంతోనే మన అన్వేషణ సాగాలి. దీనికంతా ధ్యానం ఒక మార్గం మాత్రమే. గమ్యం తెలిసి ఉండాలి. ఆ గమ్యాన్ని ఎందుకు చేరాలనుకుంటున్నామో ఆ స్పృహ ఉండాలి. అప్పుడు ప్రారంభించాలి ధ్యానం.

ధ్యానం భావనామయ ప్రపంచ వ్యవహారం. మనసు కూడా దాటి మహా శూన్యంలోకి, మహా మౌనంలోకి నిరామయంగా వెళ్లిపోయే అద్భుత దశ. ఈ దశ కేవలం ఆలోచనల మందగింపుతోనో, మళ్లింపుతోనో రాదు. ఆ మహాశూన్యంలోకి మళ్లింపదలచిన మనోపుష్పానికి 'భగవత్‌ స్పృహ' అనే పరిమళం కావాలి. అది లేకపోతే మనసు కాగితం పువ్వే.

నిజమే. అందరికీ అనుకున్నప్పుడే భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడదు. ప్రేమించాలనే ఆశ ఉంటుంది. ఆయనను సాధించాలనే తపనా ఉంటుంది. కానీ ఎండమావిలాంటి మనసు భక్తిజల రహితంగా ఉంటుంది. బండరాయిలా ఉంటుంది. దానికి స్పందన కావాలి. ఆర్ద్రత కావాలి. పరమ ప్రేమ అనే అరణి రగలాలి. అప్పుడు... అప్పుడు... హృదయం హోమగుండం అవుతుంది. భగవంతుడనే యజ్ఞఫలం కోసం యజ్ఞం ప్రారంభమవుతుంది. అందుకు గురువనే రుత్విక్కును అన్వేషించాలి. భగవంతుని పొందాలనే తపన మనలో నిజాయతీగా అంకురించినప్పుడు గురువే మనను వెతుక్కుంటూ వస్తాడు. లేదా మనం తన దగ్గరకు వెళ్లేలా చేస్తాడు. జీవాత్మ పరమాత్మల సంయోగానికి సుముహూర్తం కుదిరిపోతుంది. గురువు మనలో మంత్రోపదేశంతో ఆధ్యాత్మిక బీజాలు నాటుతాడు. సాధనా బలంతో దాన్ని పెంచి పోషించుకుని ఫలాలనందుకోవాలి. ఈ పూర్తి యజ్ఞంలో మన తను ధన ప్రాణాలు గురువుకే అంకితం చేయాలి. అప్పుడు ఆయన చూపే మార్గమే ధ్యానసాధన.

అందుకే... భగవంతుని పట్ల ప్రేమ, పూర్ణ అవగాహన పెంచుకునే ప్రయత్నానికి నాందిగా గురువును ఆశ్రయిద్దాం. ఆయన ఆశీస్సులు పొందుదాం!

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP