శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వయసులో ఉండగా మీరెప్పుడన్నా పిల్లలకు రామాయణం చెప్పారా??? ఇప్పుడేడ్చి ఏం లాభం ?!!!!

>> Wednesday, February 25, 2015

నిన్న మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి మరలా స్కూలుకు  వెళుతున్నాను. [నేను పనిచేసేది మాపక్కగ్రామమైన తిమ్మాపురం ప్రభుత్వపాఠశాలలో] . తిమ్మాపురం మలుపు దగ్గర కూర్చుని వున్న ఓ వయో వృధ్ధుడు పంతులుగారూ ! అని కేకవేశాడు . బండి ఆపిచూశాను బాగా పెద్దవయస్సు. కర్రసహాయంతో వచ్చి ,నన్ను కాస్త మావూరిదాకా తీసుకెళ్లయ్యా ! అనడిగాడు. అయ్యో దానిదేముందండి . ఎక్కండి  .మీరు జాగ్రత్తగా కూర్చో గలరా ? అనడిగాను . మోటారు సైకిల్ కదా! గతుకులు వచ్చినప్పుడు బాలెన్స్ గాఉండగలడా అని నా అనుమానం. పరవాలేదు కూర్చుంటానన్నాడు. ఎక్కించుకున్నాను .
బండి చిన్నగా పోనిస్తూ . ఇంత ఎండకు వస్తున్నారెందుకు ? అడిగాను.
ఒంట్లో బాగా ఉండటం లేదయ్యా ! నూజండ్ల వెళ్ళి మాత్రలు తెచ్చుకుంటున్నాను అనిచెప్పారాయన.
 మీరెళ్లకపోతే ఏమైంది ? మీ పిల్లలెవరినన్నా పంపవచ్చు కదా ? అన్నాను.
ఇప్పుడెవరయ్యా ! ఎవరి సంగతి వారుచూసుకోవడమే ?  మాగురించి పట్టించుకుంటారా? పొలమిచ్చాను. ఆస్తులిచ్చాను ? అవసరమైతే అప్పులిప్పించి అవీ తీర్చాను. ఇవాల్ల వాళ్లకు మమ్మల్ని చూద్దామని అనిపించటం లేదు.  .చూడాలన్నా కోడల్లు పడనియ్యరు ............................................. ఇలా   ఆయన బాధనంతా నాకుచెబుతూ  ఉన్నారు.
మీకు పిల్లలెంతమందండి ?
ఆరుగురు కూతుర్లు . ఇద్దరు కొడుకులు  .
అందరూ ఇక్కడె ఉన్నారా?
లేదయ్యా ! ఆడపిల్ల వాళ్లవాళ్ల ఊర్లలో ఉంటిరి. మగపిల్లలిద్దరూ ఊర్లోనే  .

ఇద్దరూ ఇక్కడ  ఉన్నారుకదా ! వాళ్లుగాని,వాళ్లపిల్లలు గానీ  మీకు ఈ పనులు చేసిపెట్టరా ?

హు....  ఈకాలంలో అంతా  ఆస్తులు పంచుకుంటారు గానీ ముసలాల్లకు అండగా నిలబడుతున్నదెవరు?  విచారం వ్యక్తం చేశారాయన.
 ఏమండి. మీరు తప్పంతా మీ   పిల్లలదంటున్నారు ! మీ రు వాల్లకు చిన్నప్పుడెప్పుడన్నా కూర్చోబెట్టి రాముని కథలను చెప్పారా ? తండ్రి  పట్ల రాముడెలా ఉన్నాడు! అన్నపట్ల లక్ష్మణభరతశతృఘ్నులెలా ఉండేవారు ? భర్తతో అమ్మ సీతమ్మ ఎలా మెలగింది .ఎప్పుడైనా చెప్పారా ?
వ్యక్తికి తల్లిదండ్రులపట్ల ఉండవలసిన బాధ్యత రాముణ్ణిచూసైనా నేర్చుకుంటారని ఊరూరా గుడి కట్టారు.
మనమేమో పండుగరోజు తలుపులు తీసి  పానకంవడపప్పు పంచుకుని ఆతరువాత గుడిముఖం కూడా చూడకపోతుంటిమి?
ఎప్పుడు చూసినా మాపిల్లలకు ఎన్నెకరాలు ఇవ్వాలి ఎన్నిలక్షలు పంచివ్వాలనే యావతప్ప ,వాడికి నాలుగు మంచి మాటలు నేర్పుదామని ఆలోచనకూడాలేకుండా ఎప్పుడూ ...పని..డబ్బు ..తప్ప ధర్మం గూర్చి ఆలొచించక  ....ఈరోజు  .. నాపిల్లలకు   ధర్మబుధ్ధి లేదు  అని బాధపడితే  లాభమేముంది ?>
మీతరం వాళ్లు నయం ఇప్పుడు మాతరం ఇంకా ఘోరం   .. మాతరం తరువాత పిల్లలకు రాముడెవరో తెలియకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పే చదువులలో  , ఇంట్లో ఉన్న వాతావరణం లోనూ ఇలాంటి ధార్మిక విషయాలు నేర్పే అవకాశాలు ఉండటం లేదు.   అని ఆయనను ఓదార్చాను.
అవునయ్యా ! మహానుభావులు ..ఆరోజులలో రాములవారు తల్లిదండ్రుల మాట జవదాటాడా!! అంటూ ఆయనా  మాటలు కలుపుతున్నాడు. మాపాఠశాల దగ్గర బండి ఆపాను.

ఆయన బండి దిగి  ....  కొడుకులు చూద్దామన్నా కోడల్లు చూడనియ్యరయ్యా ..ఏంచేస్తారు పాపం. అన్నాడు.
ఆడపిల్లలకూ ధర్మం గూర్చి. సీతమ్మ తల్లిలాంటి స్త్రీమూర్తులగూర్చి చెప్పాలి .అప్పుడే ఏ ఇంట్లో  వృధ్ధులకు నిరాదరణ ఉండదు అన్నాను.
అవునయ్యా  ! మా ఆడపిల్లలకు ఎలా చెప్పిపంపించామని ........ వివరించబోయాడు.
ఆయన గుడ్డిప్రేమకు   విసుగొచ్చింది.
చూడండి .. మనం ధర్మం గూర్చి నేర్పిఉంటే ఆడ,మగ పిల్లలిద్దరికీ నేర్పుతాము. ఇప్పుడు మీమగపిల్లలెలాఉన్నారనిబాధపడుతున్నారో!!
 ఇక అక్కడ మీ ఆడపిల్లలగూర్చి వాళ్ళ అత్తగారిళ్లదగ్గర ముసలాళ్ళ నడిగితే తెలుస్తుంది  . వెళ్ళిరండి  అని.. స్కూల్ లోకి ప్రవేశించాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP