శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూజ కాగానే మంగళహారతి పాడతారెందుకు..?

>> Friday, July 29, 2011





పూజకుకూడా మొదలుపెట్టటం నుంచి ముగింపు వరకు కొన్నిపద్దతులున్నాయి . . ప్రారంభంలో తలమీద నీళ్లు చల్లుకుంటూ. "అపవిత్రపి పవిత్రోవా.."అనే మంత్రం స్మరిస్తాము. . దీనితో పూజ ప్రారంభమవుతుంది. ఇళ్లలోనూ దేవాలయాల లోనూ పూజ పూర్తిఅయ్యాక మంగళహారతి ఇవ్వడం పూజావిధిలో భాగం. దీనితో పూజ పరిసమాప్తమవుతున్నట్లుగా భావిస్తాం.

ఇంటిలో పూజ మన ఒక్కరికే (కుటుంబానికి) సంబంధించిన పూజ. కనుక పూజ కాగానే మంగళహారతి ఇచ్చి పూర్తి చేస్తాం.అదీ ఉదయం సాయంత్రాలలో . దేవాలయాల్లో దేవుడికి ఒకే ఒక్క పూజకానీ, ఒకే ఒక్కరి పూజ కానీ కాదు. కాబట్టి, మంగళహారతి అనేది అనే పర్యాయాలు ఇస్తారు. దేవాలయాల్లో జరిగేదంతా మంత్రపూర్వకంగా జరుగుతుంది. కనుక మంగళహారతి "సర్వః ప్రజామ్నే గోపాయ.." అంటూ మంత్రపూర్వకంగా వినిపిస్తుంది.

ఇళ్ళలో మంత్రపూర్వకంగా పూజ జరిగినా భగవంతుని గానంతో సేవించాలి ఆయన గాన ప్రియుడు కాబట్టి ఆయనకు మంగళహారతి సమయంలో రాగయుక్తంగా, మంచిగొంతుతో అందరూ కలిసి పాటపాడి వినిపిస్తారు.

పూజ అయిన తర్వాత మంగళహారతి పాటను పాటడం అంటే నాకు వచ్చిన సంగీతం పాండిత్యం ఈ కంఠ మాధుర్యం, ఈ భక్తీ, శ్రద్ధా, నా కుటుంబ శ్రేయస్సు, అన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వల్ల వచ్చినవే.

కనుక, వీటినన్నింటినీ నీకే అంకిత మొనర్చుకుంటున్నాను దేవా! అని తన్మయంత్వంతో తెలుపడమే అవుతుంది. ఈ విషయాన్ని జ్యోతిసాక్షిగా సర్వాంతర్యామి అయిన దేవుడికి తెలుపడం పూజ అయినదని ప్రకటించడం మంగళ హారతి ఇవ్వటంలో అంతరార్ధం .

Read more...

అముక్త జీవులు

>> Thursday, July 28, 2011

అముక్త జీవులు
- అప్పరుసు రమాకాంతరావు
రమాత్మునిపై భక్తి ఆధ్యాత్మికం. ప్రాపంచిక విషయాలకు ద్వేష అనురాగాలకు ఈ భక్తితత్వం విరుద్ధమైనదే కాక అతీతమైంది కూడా! భక్తిభావం సంపూర్ణంగా అంతర్గతమైన విషయం. అటు భక్తిని కలిగి ఉంటూ ఇటు ప్రాపంచిక విషయాలపై ఆపేక్ష గలవారినీ మనం గమనిస్తూనే ఉంటాం. గాఢమైన కోరికలతో సతమతమయ్యేవాడు ప్రపంచంలో అందరికంటే దుఃఖితుడిగా జీవిస్తాడు. మన కోరికలు, ప్రాపంచిక సుఖాలపై ఆశ, చంచలమైన ప్రవృత్తి సంతానంపైనా ప్రభావం చూపిస్తాయి. 'బాగా సంపాదించు. అన్ని అధికారాలను హస్తగతం చేసుకో! అందరిలోకీ ప్రథముడిగా జీవించు... అప్పుడే సంతోషంగా బతుకుతావు'- అంటూ తరవాత తరానికి హితబోధ చేస్తున్నాం. అలాంటి బోధనలను అనుసరిస్తే జీవితం దుఃఖభాజనమవుతుందే కాని, సుఖం దరిచేరదు.

ఇలాంటి భిన్న ప్రవృత్తి గలవాడిగా భారతంలో ధృతరాష్ట్రుడు మనకు కనిపిస్తాడు. తన సోదరుడు పాండురాజు పట్ల అతడెన్నడూ ప్రేమ ప్రదర్శించలేదు. కురురాజ్యం సర్వంసహా తన ఆధీనంలో ఉండేటట్లుగానే ఆయన పావులు కదుపుతూ వచ్చాడు. తన కొడుకులతో సమానంగా పాండురాజు తనయులను ధృతరాష్ట్రుడు చూడలేదు. గుడ్డివాడిని కనుక ఏదీ చూడలేక పోతున్నానంటూనే తన సంతానం చేసే దుర్మార్గపు చేష్టలను సహిస్తూ వచ్చాడు. వారిలో అసూయాద్వేషాలను పెంచి పోషించాడు. విచిత్రమేమంటే- విదురుడు వినిపించే నీతివాక్యాలను విని ధృతరాష్ట్రుడు ఆనందం వ్యక్తం చేసేవాడు. అక్రూరుడివల్ల ఇతరులపట్ల పగ, ద్వేషం ఉండకూడదని తెలుసుకున్నాడు. అయినా రాజ్యం పంపకాల విషయంలో, దుర్యోధనుడి కుయుక్తులకు సంబంధించీ అతడెప్పుడూ ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకొనేవాడు. ధార్తరాష్ట్రీయులు పాండవులపట్ల ప్రవరిస్తున్న తీరును తప్పుపట్టలేకపోయేవాడు. 'నీవు చేసే కార్యం తప్పు సుయోధనా' అంటూనే... 'ఆ తరవాత నీ ఇష్టం!' అంటూ కొడుకుపట్ల అనురాగం ప్రదర్శించేవాడు. శ్రీ కృష్ణుడు భగవత్‌ స్వరూపుడని భీష్మపితామహుడు చెబితే ధృతరాష్ట్రుడు ఆయనపట్ల భక్తిభావం పెంచుకొన్నాడు. పాండవులను ఎల్లప్పుడూ కాపాడగలుగుతున్నది శ్రీకృష్ణుడని ధృతరాష్ట్రుడికి తెలుసు. నీతి, ధర్మం నిలిచి ఉన్నచోట శ్రీకృష్ణుడు ఉంటాడనీ ఆయనకు తెలుసు. అయినా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో పుత్రవాత్సల్యం- కళ్లతో సహా ఆయన మానసాన్నీ గుడ్డివాడిని చేసింది. పాండవులను తమ కుయుక్తులతో అరణ్యవాసం పంపేటప్పుడు సుయోధనాదులను ఆయన వారించలేదు. ఒక సందర్భంలో సంజయుడు- ధృతరాష్ట్రుడు పాండవులపట్ల ప్రవర్తిస్తున్న తీరును విమర్శిస్తాడు. గోపాలుడు విష్ణు అంశగల అవతారమని తెలిసీ పాండవులను హింసకు గురిచేస్తూ పరోక్షంగా నీవూ పాపం మూటకట్టుకుంటున్నావని సంజయుడు నిందిస్తే- ధృతరాష్ట్రుడు చెప్పిన సమాధానం మానవులకు ఎప్పటికీ గుణపాఠంగా భాసిస్తుంది.

'నన్నేం చేయమంటావు సంజయా! నిన్న, నేడు, రేపు కూడా నాలాంటి ద్వివిధ భావాలుగల వ్యక్తుల ఉనికి ఉంది, ఉంటుంది. ఇలా జీవించడం తప్పని నాకు మాత్రం తెలియదా? మమతానురాగాలతో బతకకూడదు. పరోక్షంగా నేను నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నానని తెలుసు. దీని పరిణామం చివరలో ఎలా ఉంటుందీ ఊహించగలను. అయినా సంజయా! నేను కడుపు తీపితో బతుకుతున్నాను. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్న గరికపోచను. ఏ కలుపు మొక్కకో తగిలి నా ప్రయాణం ఆగిపోతుంది. పారమార్థిక సముద్రంలో లీనంకాగల లక్ష్యాన్ని చేరుకోలేను' అన్నాడు. ఈ సమాధానం మనలనందరినీ మేల్కొలుపుతుంది.

ఇంతా తెలిసి ధృతరాష్ట్రుడు తన బుద్ధిని మార్చుకోలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుని అవతారమని ఆయనకు అవగాహన ఉంది. ఆయనపై భక్తి ఉంది. శ్రీకృష్ణుడి రాయబారం సందర్భంలో ఆయన విరాట్‌ స్వరూపాన్ని చూడటానికి తహతహలాడాడు. ఆ విశ్వరూపం వీక్షించడానికి చూపునివ్వాలని పరమాత్ముని కోరాడు. విశ్వరూపం చూసిన కళ్లతో ప్రాపంచిక పాపాలను చూడనంటూ తిరిగి తనను గుడ్డివాడిగా చేయమని కోరిన జ్ఞాని ధృతరాష్ట్రుడు. ఇంతచేసి కొడుకులకు నచ్చజెప్పి మహాభారత యుద్ధాన్ని నివారించలేకపోయాడు. భక్తికన్నా కొడుకులపై అనురక్తి ఆయనను బలహీనుణ్ని చేసింది. యుద్ధంలో తన వాళ్లనందరినీ కోల్పోయాడు. అయినా అరిషడ్వర్గాల్లోని అసూయను ద్వేషాన్ని ఆయన పోగొట్టుకోలేదు. యుద్ధం తరవాత గదా కౌశలాన్ని మెచ్చుకొనే మిషతో భీముణ్ని కౌగలించుకొని చంపాలని చూశాడు. చివరికేమైంది? తనయులతో సహా బంధువర్గానికి దూరమై పాండవుల ప్రాపకంలో జీవచ్ఛవంగా జీవించాడు. అన్నీ తెలిసీ అపమార్గంలో పయనించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అలాంటి వ్యక్తిత్వాలు ఏనాడూ అభిలషణీయాలు కావు. పుణ్యఫలితం తెలిసీ పాపం చేయడం క్షమించరానిది. పరమాత్మను విస్మరించి ప్రాపంచికాలపై అనురాగం పెంచుకోవడం ముక్తజీవులకు తగనిది.

Read more...

పూజలో భగవంతునిపై మనసు లగ్నం కావటం లేదు ఎలా ?

>> Wednesday, July 27, 2011

మనసును లగ్నం చేసేదెలా?

జపం చేసుకోవాలనుకుంటే మనసు నిలకడగా ఉండటం లేదు. ఏం చెయ్యమంటారు?
- బి. మన్మోహన్, హైదరాబాద్


ఇది ఎక్కువ మంది తరచుగా వేస్తున్న ప్రశ్న. సాధారణంగా మనం చేసే పనులు, మాట్లాడే మాటలు మనస్సును అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. రోజంతా భగవత్సంబంధం లేని మాటలతో, పనులతో కాలం గడుపుతూ పూజ, జపం, పారాయణ చేసుకునే గంట, అరగంట సేపు మాత్రం భగవత్సంబంధాన్ని కల్పించికుంటే మనస్సు భగవంతుని మీద లగ్నం కావటం ఇంచుమించు అసాధ్యం. ఎక్కువ సమయాన్ని ఏ విషయాల మీద గడుపుతామో ఆ విషయాలే అన్ని సమయాల్లోను గుర్తుకు వస్తాయి.

కొంచెం విషయ లంపటం తగ్గించుకొని, భగవంతుడు కావాలనుకునే వారు చదవవలసిన అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంధం 'భగవద్గీత'. గీతలో భగవానుడు అంతిమోపాయంగా చెప్పిన 'శరణాగతి' (సర్వధర్మాన్ పరిత్యజ్య..)పై నిగూఢంగా ఉండిపోయిన ఎన్నో అమూల్య విషయాలను వెలికి తీసి 'శ్రీ వచన భూషణం' అనే సూత్ర గ్రంధాన్ని 14వ శతాబ్దంలో శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు అనుగ్రహించారు. ఈ రెండు గ్రంధాలు నిత్యమూ అధ్యయనం చేస్తే మనస్సుకు నిలకడ వస్తుంది.

ఆంధ్రజ్యోతి నుండి

Read more...

అమ్మను కొడతావా !!!! నిన్నూ.......................

>> Tuesday, July 26, 2011


అమ్మను కొడతావా !!!! నిన్నూ.......................

Read more...

సంతానలేమితో బాధపడుతున్నారా ? ఈ క్షేత్రాన్ని దర్శించండి .

>> Monday, July 25, 2011

శ్రీ గురుభ్యో నమః
నమస్కారము,

ఈ క్రింది స్తోత్రములు అందరికీ ఉపయోగపడగలవని ఇక్కడ జతచేస్తున్నాను.
౧. సూర్య భగవానుడు, ఆయన పుత్రుడు అయిన శనీశ్వరునికి చెప్పిన ఒక గొప్ప స్తోత్రం - వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం.

౨. గర్భ రక్షామ్బిక స్తోత్రం - తమిళ నాడు లో కుంభకోణం దగ్గరలో ఉన్న శ్రీ గర్భ రక్షామ్బిక (తిరుక్కవుగావుర్ అనే వూరు లో, ఈ పదమునకు అర్ధం తమిళం లో గర్భ రక్షా అని...) అమ్మ వారి ఆలయం ఉన్నది. అక్కడ అమ్మ వారు గర్భ రక్షామ్బిక అమ్మ గాను, అయ్య వారు ముల్లైవ నాథర్ అనే పేరుతో ప్రసిద్ధము. ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి వారికి కేవలం మల్లె నూనె తో అభిషేకం చేస్తారు.
ఇది శౌనక మహర్షి విరచించిన గర్భ రాక్షాంబికా స్తోత్రం. ఈ స్తోత్రం గర్భం దాల్చబోయే వాళ్ళు, గర్భం దాల్చిన తల్లులు ఎవరైనా చదివితే, చక్కగా ముద్దులొలికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లానో, చిన్ని కృష్ణుడి లాంటి పిల్లలు పుడతారు. ఈ ఆలయం లో అమ్మ వారి దగ్గర ఉంచి మంత్రించిన నూనె ఇస్తారు. దానిని గర్భం దాల్చిన తల్లి యొక్క ఉదరమునకు వ్రాసుకుంటే చక్కగా ప్రసవం అవుతుంది అని నమ్మకం. సత్సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే దంపతులు ఎవరైనా ఉంటే, వాళ్ళు అక్కడికి వెడితే, మంత్రించిన నెయ్యి ప్రసాదం గా ఇస్తారు. దానిని దంపతులు ఇద్దరూ, ౪౦ రోజులు నిద్రించే ముందు సేవిస్తే వెంటనే గర్భం దాల్చడం జరుగుతుంది అని నమ్మకం. ఈ విధంగా పిల్లలు కలిగిన తర్వాత అక్కడ అమ్మ వారి ఎదుట ఒక ఊయల ఉంటుంది, అందులో పుట్టిన పిల్ల/పిల్లా వాడిని ఉంచి అమ్మ వారి ఆశీస్సులు పొంది రావాలి. ఆ మందిరం ఎంతో ప్రశాంతముగా ఉంటుంది.

ఇట్లు
మోహన్ కిషోర్

వంశ వృద్ధికర దుర్గా కవచం

ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమః

శనైశ్చర ఉవాచ:-

భగవాన్ దేవ దేవేశ కృపయా త్వం జగత్ప్రభో

వంశాఖ్య కవచం బ్రూహి మహ్యం శిష్యాయా తే అనఘ

యశ్య ప్రభావాత్ దేవేశ వంశ వృద్ధిర్హి జాయతే II

సూర్య ఉవాచ:-

శృణు పుత్రా ప్రవక్ష్యామి వంశాఖ్యాం కవచం శుభం

సంతాన వృద్ధిర్ యత్ పఠనాద్ గర్భ రక్షా సదా నృణామ్ I


వంధ్యాపి లభతే పుత్రం కాక వంధ్యా సుతైర్యధా

మృత వత్సా సుపుత్రస్యాత్ స్రవత్ గర్భ స్థిర ప్రజా I

అపుష్పా పుష్పిణీ యస్యా ధారణాశ్చ సుఖ ప్రసుః

కన్యా ప్రజా పుత్రిణీ ఏతత్ స్తోత్రమ్ ప్రభావతః I

భూత ప్రేతాధిజ బాధా యా బాధా కలి దోషజా

గ్రహ బాధా, దేవ బాధా యా శత్రు బాధా కృత చ యా I

భశ్మీ భవంతి సర్వస్తాః కవచస్య ప్రభావతః

సర్వ రోగ వినశ్యంతి సర్వే బాల గ్రహశ్చ యే II

అథ దుర్గా కవచమ్

ఓం పూర్వ రక్షతు వారాహీ చ ఆగ్నేయం అంబికా స్వయమ్

దక్షిణే చండికా రక్షేత్ నైరుత్య హంస వాహినీ II

వారాహీ పశ్చిమే రక్షేత్ వాయవ్యాం చ మహేశ్వరీ

ఉత్తరే వైష్ణవీ రక్షేత్ ఈశాన్యం సింహ వాహినీ II

ఊర్ధ్వం తు శారదా రక్షేత్ అథో రక్షతు పార్వతి

శాకంబరీ శిరో రక్షేత్ ముఖం రక్షతు భైరవీ II


కంఠమ్ రక్షతు చాముండా హృదయం రక్షతాత్ శివ

ఈశాని చ భుజౌ రక్షేత్ కుక్షిమ్ నాభిమ్ చ కాళికా II

అపర్ణాః ఉదరం రక్షేత్ బస్తిం శివ ప్రియా

ఊరూ రక్షతు కౌమారీ జయా జానుధ్వయం తధా II

గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మణీ పరమేశ్వరీ

సర్వాంగాని సదా రక్షేత్ దుర్గా దుర్గార్తి నాశినీ II

నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః

పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః II

ఓం హ్రీం హ్రీం హ్రీం - శ్రీం శ్రీం శ్రీం - ఐం ఐం ఐం

మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపాయై

నవ కోటి మూర్త్యై దుర్గాయై నమః - హ్రీం హ్రీం హ్రీం

దుర్గార్తి నాశినీ సంతాన సౌఖ్యం దేహి దేహి II

వంధ్యత్వం మృతవత్సత్వం హర హర - గర్భ రక్షం కురు కురు

సకలాం బాధాం కులజాం బాహ్యజం కృతమకృతాం చ నాశయ నాశయ


సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ

సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహా II

ఫల శృతిః

అనేన కవచేనాంగం సప్త వారాభి మంత్రితం

ఋతు స్నానో జలంపీత్వా భవేత్ గర్భవతీ ధ్రువం

గర్భ పాత భయే పీత్వా ధృఢ గర్భా ప్రజాయతే

అనేన కవచేనాధ మార్జిత యా నిశాగమే

సర్వ బాధా వినిర్ముక్తా గర్భిణీస్యాత్ న సంశయః

అనేన కవచేనేహ గ్రంధితం రక్త దోరకం

కటి దేశే ధారయంతి సుపుత్రా సుఖ భాగినీ

అసూత పుత్రమింద్రాణి జయంతం యత్ ప్రభావతః

గురుపాధిష్టం వంశాఖ్యం కవచం తదిధం సదా

గుహ్యాత్ గుహ్యతర చేదం న ప్రకశ్యం హి సర్వతః

ధారణాత్ పఠనధస్య వంశఛ్చేధో న జాయతే

ఇతి శ్రీ జ్ఞాన భాస్కరే వంశ వృద్ధికర దుర్గా కవచం సంపూర్ణం.

___________________________________________________________________________________________



శౌనక మహర్షి విరచిత గర్భరక్షా స్తోత్రం


ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమః

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్

ప్రజా కర్తా, ప్రజా పతే

ప్రగృహ్షీణివ బలిం చ ఇమం

ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ

ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం

సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం

చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా

ప్రగృహనంతు బలిం ద్విమం

యుష్మాకం ప్రీతయే వృతం

నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా

ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం

యుష్మాగం తేజసాం వృధ్య

నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా

శివ పుత్రా మహా బల

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II


స్కంద షణ్ముఖ దేవేశా

పుత్ర ప్రీతి వివర్ధన

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా

ప్రత్యూషో మరుత నల

దృవూ ధురా ధురశ్చైవ

వసవోష్టౌ ప్రకీర్తితా

ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం

నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే

బహు పుత్రీ మహా బలే

భూత శ్రేష్టే, నిశావాసే

నిర్వృతే, శౌనక ప్రియే

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II


రక్ష రక్ష మహాదేవ,

భక్తానుగ్రహకారక

పక్షి వాహన గోవిందా

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II

*****

** ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.

· 2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు

9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు






స్తోత్రాలను ఈ క్రింది లింకులనుండి పొందండి

http://mail.google.com/mail/?ui=2&ik=23fc06d729&view=att&th=131621d98e78b471&attid=0.1&disp=safe&realattid=f_gqj0pkfz0&zw

http://mail.google.com/mail/?ui=2&ik=23fc06d729&view=att&th=131621d98e78b471&attid=0.2&disp=safe&realattid=f_gqj0pqcu1&zw

Read more...

దినపత్రిక "దిహిందు" లో జూన్ పదునాలుగున వచ్చిన ఈవ్యాసం చూశారా ?


దినపత్రిక "దిహిందు" లో జూన్ పదునాలుగున వచ్చిన ఈవ్యాసం చూశారా ? కనీసం ఇప్పుడైనా వాస్తవదృష్టితో ఆలోచించాలి భారతధార్మిక క్రియలను విమర్శించే కబోధులు


Ancient fire ritual has positive impact on environment: Scientists

PTI
Share · print · T+
The 'Athirathram' ritual being performed in Panjal near Thrissur in April, 2011. Photo: By Special Arrangement
The Hindu The 'Athirathram' ritual being performed in Panjal near Thrissur in April, 2011. Photo: By Special Arrangement

A 4,000 year old fire ritual conducted in the remote village in Kerala in April this year has a positive impact on the atmosphere, soil and other environment effects, according to scientists who are now ready with their findings.

The “Athirathram” ritual held on April 4— 15 at Panjal village in Thrissur district was the focus of a detailed study by a team of scientists led by Prof V P N Nampoori, former director of the International School of Photonics, Cochin University of Science and Technology.

The scientists had focused on the fire ritual’s scientific dimensions and impact on the atmosphere, soil and its micro—organisms and other potential environmental effects.

The yagna seems to have accelerated the process of seed germination and also the microbial presence in air, water and soil in and around the region of the fire ritual is vastly diminished, according to a statement released by the Varthathe Trust, who organised the ritual.

The team had planted three types of seeds — cowpea, green gram and Bengal gram — on all four sides of the ritual venue at varying distances. They found that the growth was better in case of pots kept closer to the fire altar.

This effect, the study says, was more pronounced in the case of Bengal gram with growth about 2,000 times faster than in other places.

According to Nampoori, sound is a vibration and continuous positive vibrations through chanting, accelerates the process of germination.

“The findings would not only help dispel superstitious notions associated with Vedic rituals but also help in continuation of such tradition for the betterment of nature and the environment,” says Nampoori.

He added that further research on the phenomenon were on which could prove that some bio—amplifier generated in the atmosphere because of the ritual, had a selective effect on Bengal gram.

The study focused on counting bacterial colonies at three locations — within the yagnashala, 500 metres and 1.5 kilometres from the yagnasala. Microbial analysis made before, during and four days after the yagna revealed that the air in the vicinity of the yagnashala was pure and had very low count of microbe colonies.

The research team also found that microbial activities in the soil and water around the yagnashala were remarkably less compared to normal ground.

The “Athirathram” ritual which literally means “building up of the fireplace and performed overnight” and usually held to propagate universal peace and harmony, was first documented 35 years ago by US—based Indologist Frits Staal.

Staal, currently Emeritus Professor of Philosophy and South and Southeast Asian Studies at the University of California, Berkeley had in 1975 organised and recorded the ritual in detail with the help of grants and donations from the Universities of Havard, Berkely and Finland”s Helsinki University.

The research team conducted tests near the fire altars of the 1918 and 1956 Athirathram, still preserved in the backyards of Namboothiri homes, reveal that the bricks continue to be free of microbial presence.

“It’s an indication that the effect of the ritual is long—lasting. Studies are on to find out if other positive changes on the atmosphere are transitional or permanent,” say researchers.

An analysis conducted on the dimensions of temperature from the flames of the pravargya by Prof A K Saxena, head of photonics division, Indian Institute of Astrophysics, Bangalore, found that the fire ball that formed during the ritual had a particular wavelength with an unusually high intensity similar to what is observed in typical laser beams at about 3,870 degree centigrade.

It may be possible to have stimulated emission at this wavelength (700 nm) and gain from plasma recombination. It needs to be studied further, he says.

The members of the team of scientists’ team at the Panjal Athirathram 2011 included experts from various disciplines and included Dr Rajalakshmy Subrahmanian (Cusat), Dr Parvathi Menon (M G College, Thiruvanathapuram), Dr Maya R Nair (Pattambi Government College), Prof Saxena ( Indian Institute of Astrophysics, Bangalore) and Prof. Rao (Andhra University).

The scientific team members were supported by Zarina (Research Scholar, CUSAT), Ramkumar (Biotechnologist), Asulabha (Biotechnologist) and a number of postgraduate, graduate and school students.

Read more...

ఇది పిచ్చికుక్కల సీజన్ అవి కరవనువచ్చు ,కాల్చనూవచ్చు ..బహుపరాక్

>> Sunday, July 24, 2011


మనం ప్రతిసంవత్సరం ఈసీజన్లో పిచ్చికుక్కల దాడులగూర్చి వీటివలన జనం భయాందోళనలను గూర్చీ పత్రికలలో చదువుతుంటాం . చాలాజాగ్రత్తగా సందులు గొందులలో చూసుకుని నడుస్తుంటాం . ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి ఎక్కడొ ఒకచోట ఎవరినో ఒకరిని కరుస్తూనేఉంటాయి .అందువలనే ఈ సీజన్ అంటే అంతభయం
అయితే ఆ భయం ఇప్పుడు బహుదా...శతదా ...సహస్రధా ..విస్తరించి జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది . దీనికీ ఓశాస్త్రీయ కారణం ఉంది . కొన్ని పిచ్చి కుక్కలను జనం వెంటపడి కొట్టిమరీ చంపుతారు .అలాచంపేప్పుడు జనంపట్ల తీవ్రమైన క్రోధంతో మరణించిన కొన్ని పిచ్చికుక్కలు మానవజన్మ ఎత్తాయి. అంతటితో ఆగక అవిరాజకీయాల్లో చేరాయి . అవకాశం కోసం వేచిచూస్తున్న వీటికి కాలం కలిసొచ్చింది . ఇంకేం తమలో ఉన్న రేబిస్ వైరస్ ను జనంలోకెక్కించే పనిలో పడ్డాయి. ఒకటేమో అంతుచూస్తామంటుంది . మరొకటి ఆత్మహత్యలొద్దంటూనే పెద్దమొత్తంలో జనాన్ని చంపి చావాలంటుందిది.ఇంకొకటెమో నార్వేలో జనాన్ని హతమార్చిన తమ జాతి కుక్కలాగా జనాన్నికాల్చటానికి సిద్దమవ్వమంటాయి. వెరసి మొత్తం బజార్నపడి కరుచుకుందాం రమ్మంటాయి. కొన్ని గుంటనక్కలు కూడా ఇదేవిధంగా ఈవిధంగానే మానవజన్మనెత్తి రాచకీయల్లో చేరి బాగావెనకేసుకున్నవి,వెనుకేసుకోవాలనుకున్నవి ఉన్నాయి. ఇవి ఊళలు వేస్తూ పిచ్చిఎక్కించేందుకవసరమైన సరంజామా కొనేందుకు ఆర్ధికంగా అండదండలందిస్తుంటాయి . ఈకుక్కలు,నక్కలతో కల్లోలమవుతున్న మనజీవితంలో,మనలోకి ఈవైరస్ సోకకుండా కాపాడే నాథుడేవరా , మంచి వాక్సిన్ ఇచ్చి కాపాడే వైద్యుడెవరా అని ఎదురు చూడవలసిన రోజొచ్చింది. ఖర్మ.

Read more...

నృసింహస్వామి పానక తీర్థం సేవిస్తే ?......

>> Saturday, July 23, 2011

FILE
శ్రీమంగళగిరి నృసింహస్వామి దేవునికి, అహోబిల నరసింహ దేవునికి నైవేద్యంగా పెట్టే పానక తీర్థాన్ని సేవిస్తే... దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది. పానకాల స్వామి, పానకాల నరసింహ స్వామిగా పేరొందిన మంగళగిరి నరసింహుడు, అహోబిలులకు పెట్టే పానక నైవేద్యాన్ని సేవించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

ఇంకా పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వస్తుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. జీవితంలో శత్రువుల బాధ కలుగదు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది.

అలాగే ఆలయాల్లో ఇచ్చే పంచామృత అభిషేక తీర్థాన్ని సేవించడం ద్వారా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. ఆలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాల్లో నాలుగు రకాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీటిని జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం అంటారు.

జలతీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వ రోగాలు నివారించబడతాయి. అన్నికష్టాలు, దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.

ఇక కషాయ తీర్థాన్ని కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలామాలినీ దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయాల్లో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత కషాయం రూపంలో ఈ తీర్థాన్ని పంచుతారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయని పురోహితులు చెబుతున్నారు.

[webdunia.com

Read more...

ప్రమాదాలకాలం ఇది..హనుమంతుని స్మరణచేసి ఇంటినుండి కదలండి.


ప్రసుతం భూమ్మీద గ్రహస్థితుల ప్రభావం వలన ప్రమాదకర సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెల్లవారి పేపర్ చూస్తే రోడ్లు రక్తమోడుతున్నవార్తలే ఎక్కువగా ఉంటున్నాయి . మనకు తెలిసినవి కాక ఇంకెన్ని దుర్ఘటనలో !?
ఈమధ్య మన మితృడు కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ మాట్లాడుతూ మాస్టర్ గారూ ! ప్రమాదలు జరగటం సహజం ఎక్కడొ ఎవరికో జరుగుతుంటాయనుకున్నాను ,కానీ ఇప్పుడు మాత్రం ఎందువల్లనో ఈ దుర్ఘటలు ఎక్కువయ్యాయని పిస్తున్నది. నాకు మొన్నజరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసిన మితృలు ఫోన్ చేసి పలకరించేప్పుడు వారివారి కుటుంబాలలోను తెలిసినవాల్లకు ఈమధ్య జరిగిన యాక్సిడెంట్ లగూర్చి చెబుతుంటే విస్తుపోయాను. ఇంతమంది ఇన్నిప్రమాదాలు జరిగాయని చెబుతున్నారంటే ఇంకా మనకు తెలియని ఎన్నిసంఘటనలున్నాయో కదా !
ఇంతమంది అజాగ్రత్త గా ఉండరుకదా ! అయినా ఏదో బలమైన కారణం ఉందని మీలాంటివాల్లు చెబుతున్నది నిజమనిపిస్తున్నది ..అని తన పరిశీలనగూర్చి చెప్పారు.
ఈమధ్య మాజిల్లాలో పోలీసులరికార్డ్ ప్రకారం మాజిల్లా పరిధిలోనే నిరుడు ఆరువేలమందికి పైగా దుర్ఘటనలబారినపడ్డారు అనితెలుస్తున్నది.
మనమేకాదు వాహనాలెక్కే ఎవడూ ప్రమాదాలు జరగాలని కోరుకోడు. అందరూ ఏల్లతరబడి డ్రైవింగ్ చేస్తున్నవారే. కానీ కాల ప్రభావం ,గ్రహస్థితులప్రభావం మాత్రం మానవులమీద శుభాశుభాలను ప్రసరిస్తున్నది. దీనికి మన తెలివితేటలు,మేధస్సు, నైపుణ్యాలు లొంగనంత అతీతాలేమీ కాదు . కనుక పెద్దలు మనకిచ్చిన శాస్త్రజ్ఞానాన్ని ఉపయోగించుకుని తప్పుకోవటమే. పెనుతుఫానులొచ్చినప్పుడు మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో పెళ్లగించబడతాయి. తలవంచిన తుంగమొక్క కుమాత్రం ఏమీకాదు. ఇదీఅంతే . అహంకారం వీడి భగవంతునికి శరణాగతులంకావటమే తెలివైనపని.

ఇక ఈసమయంలో మనం భగవధ్యానం,పూజా లేదా స్మరణ చేసి మన నిత్యవిధులకు కదలటం క్షేమకరం
ముఖ్యంగా హనుమధ్యానం.చాలీసా పారాయణం చేసి ప్రయాణాలకుపక్రమించటం ,గడపదాటటం మంచిదని నా అభిప్రాయం .దీనికొరకేమీ మనం భారీ ఖర్చులుచేయాల్సినపనిలేదుకదా ! కాస్త శ్రధ్ధా,భక్తి.వినయము ఇవి చాలు. మితృలు దీనిని సహృదయతతో స్వీకరించి స్వామినాశ్రయించి ఆయన రక్షణలో శ్రేయస్సును పొందగలరని మనవి.

Read more...

విగ్రహపూజ సాధనమేనా?

>> Friday, July 22, 2011

విగ్రహపూజ సాధనమేనా?

విగ్రహ పూజను ఒక సాధనంగా భావించాలా, ధ్యేయంగా భావించాలా?
-

విగ్రహపూజను ఒక సాధనంగా, అభ్యాసంగా భావించి చేస్తుంటే అది మనోశుద్ధికి తోడ్పడి, తద్వారా కొంత కాలానికి, నిర్గుణోపాసనకు దారితీసి, అంతిమంగా మోక్షానిస్తుందని కొంతమంది చెప్పుతుంటారు. కాని ఇది సరికాదు. ఒకసారి మీ ఇష్ట దేవతా విగ్రహాన్ని ఇంటిలోనో, ఆలయంలోనో ప్రతిష్ఠించిన తరువాత దాన్ని 'విగ్రహం' అని పిలవకూడదు. అర్చామూర్తి అనాలి. ఆ మూర్తి సాక్షాత్ భగవంతుడే.

భగవత్ స్వరూపాలు అయిదింటిలో పరమపదవాసుడు వ్యూహవాసుదేవుడు, విభవావతరాలు, అంతర్యామి, అర్చామూర్తి- అన్నా సాక్షాత్ భగవన్మూర్తులే. ఒకదానికంటే ఒకటి ఏమీ తక్కువ, ఎక్కువ కాదు. కలియుగంలో అర్చామూర్తి సౌలభ్యమూర్తి. విగ్రహంలో దేవుణ్ణి చూడటం కాదు. విగ్రహాన్నే(అర్చామూర్తి)దేవుడిగా చూడాలి. ఇలా చేస్తే విశ్వమంతా పరమాత్మను చూడగలం. మాధవసేవగా మానవ సేవ చేసి తరించగలం. జీవితం ఉన్నంత వరకు అర్చామూర్తిని ఆరాధించాలి.

[ఆంధ్రజ్యోతి నుండి]

Read more...

ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాష కు ఎట్టిదుస్థితి వచ్చింది ?!

పాపం 'సుధర్మ'..!

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన సంస్కృతానికి మన దేశంలో ఎంత మాత్రం ఆదరణ ఉందో 'సుధర్మ' పత్రిక కష్టాలను చూస్తే తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద సంస్కృతంలో వెలువడుతున్న ఏకైక పత్రిక ఇదొక్కటే. మైసూరు కేంద్రంగా వెలువడుతున్న ఈ పత్రిక ఇటీవలే 42వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. సుధర్మ ఎప్పుడు మూత పడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని, అందుకే పత్రికను దాతలు ఎవరైనా ఆదుకోవాలని యాజమాన్యం ప్రకటించింది."ప్రాచీన భాషను గౌరవించే ప్రతి ఒక్కరిపై సుధర్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

భాషాభిమానులు సహాయపడితే పత్రిక ముద్రణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు జరిగిపోతాయి. దీంతో పత్రికను మరికొన్నాళ్లు కొనసాగించవచ్చు..'' అంటూ ఆ పత్రిక సంపాదకులు కేవీ సంపత్ కుమార్ తెలిపారు. 1970 జూలై15న సుధర్మను సంపత్‌కుమార్ తండ్రి పండిట్ వరదరాజ అయ్యంగార్ స్థాపించారు. ప్రస్తుతం పత్రిక సర్క్యులేషన్ రెండువేలు. సుమారు 75 దేశాలకు ఈ పత్రిక వెళుతుంది. సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య అంశాలతోపాటు తాజా వార్తా విశేషాలతో పాఠకులను అలరిస్తున్న ఈ పత్రిక వెల ఒక్క రూపాయి మాత్రమే ఉండటం విశేషం.

[andhrajyothi .news]

Read more...

తల్లీ ! నామీద ప్రసన్నురాలవు కమ్ము.

>> Tuesday, July 19, 2011


దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

భావం, తల్లీ సమస్త జగత్తుకూ తల్లివైననిన్ను ప్రాతః కాలముననే
స్మరించుచున్నాను. తెల్లని వస్త్రములు ధరించి, చందనాది అంగరాగములు
పూసుకుని, సుకుమారమైన పూల దండలు ధరించి ఉన్న ఓ తల్లీ నీకు నిత్యమూ ప్రాతః
కాలమునందు నమస్కరిస్తున్నాను. తల్లీ నీ ఐశ్వర్యమునేమని కొలచెదను,
దిగ్గజముల భార్యలైన ఆడ ఏనుగులు బంగారు కలశములతో ఆకాశ గంగను పట్టితెచ్చి ఆ
జలములతో నిత్యమూ నిన్ను అభిషేకము చేస్తూ ఉంటాయి. ఐశ్వర్యములలో హద్దుగా
మదము కలిగిన ఏనుగులను వాకిటకట్టుకున్నవాని ఐశ్వర్యమును చెబుతారు, తల్లీ
మరి నీకో దిగ్గజముల భార్యలే స్వయంగా నిత్యమూ అభిషేకం చేస్తూ ఉంటాయి.
తల్లీ ముల్లోకాలలోనూ కల గొప్పనైన ఐశ్వ్యర్యమును ప్రసాదించగల తల్లివి,
నామీద ప్రసన్నురాలవు కమ్ము.

Read more...

జ్ఞానదానం

నమస్కారం
సువర్ణపురాన్ని హేమంతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ఆ రాజ్య ప్రజలు ఏ కష్టం లేకుండా ఆనందముగా గడిపేవారు. అయితే ఆ రాజు కొంచెం అహంకారి. ఒకసారి ఆ రాజు తన జన్మదినం సందర్భముగా నిరుపేద యువకులకు డబ్బు దానంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి ఊరి నుంచి పేద యువకుల పేర్లను సేకరించి పంపమని ఉత్తర్వులు పంపాడు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యువకుల వివరాలు రాజసౌధానికి చేరాయి. వాటిని రాజు స్వయముగా పరిశీలించి అందరికీ సమానముగా అందేలా ధనాన్ని పంపించాడు. కొన్నిరోజుల తరువాత కోసంగి అనే గ్రామానికి చెందిన గ్రామ పెద్ధ, విశ్వంభరుడనే యువకుడి గురించి వివరాలు తెలియజేస్తూ, "అతను కడుపేదవాడు, అనాథ. అయితే దానం తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాడు" అని రాసి పంపాడు. దానిని చదవగానే ముందు రాజుకు కోపం వచ్చింది. వెంటనే విశ్వంభరుడనే వ్యక్తిని తన ఆస్థానానికి తీసుకు రావలసిందిగా ఆదేశాలను జారీచేశాడు. ఆ మరుసటి రోజుకల్లా భటులు విశ్వంభరుడిని రాజు ముందు ప్రవేశపెట్టారు. "ఎంత అహంకారం నీకు, మేమిచ్చే దానాన్ని తిరస్కరిస్తావా ?" అని కోపముగా అడిగాడు రాజు. "ప్రభువుల వారు నన్ను క్షమించాలి. మీరిస్తున్న దానం తాత్కాలికమైనది. అందుకే అది నాకు అక్కరలేదు" అని వినయంగా చెప్పాడు విశ్వంభరుడు. ఆ సమాధానముతో ఆలోచనలో పడ్డాడు ఆ రాజు. "మహా ప్రభూ! మీరిచ్చిన ధనంతో నేను ఆరునెలల పాటు ఏ ఇబ్భందీ లేకుండా జీవనం గడుపుతానేమో........ మరి ఆ తరువాత నా పరిస్థితి యథావిధిగా మారిపోతుంది. అందుకే మీరు నాకు జీవితమంతా పనికొచ్చే శాశ్వతమైన దానం ఇవ్వండి" అని అడిగాడు. ఆ మాటలకు రాజు "అలాంటి దానం కూడా ఉంటుందా?" అని ఆశ్చర్యంగా అడిగాడు. అపుడు విశ్వంభరుడు "జ్ఞానదానం ప్రభూ! లోకములోనున్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే దానం. ఎంతో మంది మాయామోహాలకు లోనై జనన-మరణం అనే జీవిత చక్రాల మధ్య ఊగిసలాడుతున్నారు. వీటికి పరిష్కారం ఒక్కటే అది జ్ఞానదానం. దయచేసి మాకు జ్ఞానదానం ప్రసాదించండి" అని అభ్యర్థించాడు. అప్పుడు రాజు సంశయంలో పడ్డాడు. అందరూ ఏమవుతుందో అని ఆత్రుతతో చూస్తున్నారు. ఏమయింది ప్రభూ! అలా దిగులుగా వున్నారు అని అప్పుడే వచ్చిన తన ఆస్థానపండితులలో ఒకరు అడిగారు. అపుడు రాజు జరిగినది చెప్పి, నా దగ్గర ఇవ్వడానికి ధనం మాత్రమే వున్నది కాని ధనం వలన జ్ఞాన దానం చేయలేము కదా అని, ఏదయినా ఉపాయం చెప్పమన్నారు. అప్పుడు ఆ పండితుడు, "ప్రభూ! జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆ 33 కోట్ల దేవతలకు కూడా లేదు, చివరకు మీకు మాకు కూడా లేదు. మేము శాస్త్రపాండిత్యం మాత్రమే చెప్పగలము కాని జ్ఞానాన్ని బోధించాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఒక్క సిద్ధ మహా గురువుకు మాత్రమే సాధ్యం. మేము పుస్తక జ్ఞానాన్ని మాత్రమే చెప్పగలము కాని సిద్ధ గురువులు పుస్తక జ్ఞానముతో పాటు సొంత అనుభవమును (Practical Experience) జోడించి చెప్పగలరు. జీవుడిని సిద్ధుడిని చేయగల శక్తి ఒక్క సిద్ధ గురువులకు మాత్రమే వున్నది. " కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ధనముతో లోకకళ్యాణం కోసం ఒక సిద్ధ గురువును ఆశ్రయించి జ్ఞానదానం చేయండి ప్రభూ అని విన్నవించుకున్నారు. అదియే శాశ్వత దానం ప్రభూ!........ అప్పుడు రాజు చాలా సంతోషముతో వారిరువురిని మెచ్చుకుని లోకకళ్యాణం కోసం శ్రీకారం చుట్టారు.
బత్తుల సురేష్

Read more...

పద్మనాభుని కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదా!?

>> Monday, July 18, 2011


ప్రపంచంలోనే అత్యధిక ధనిక ఆలయంగా వార్తల్లోకెక్కిన అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో రోజు రోజుకీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరో నేలమాళిగను తెరిస్తే అరిష్టమని పండితులు తెలిపిన నేపథ్యంలో, కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదని వార్తలు వస్తున్నాయి.

తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి వుందని ప్రచారం జోరందుకుంది.

మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు వస్తున్నాయి.

ఇంకా ఆరో నేలమాళిగకు సముద్రానికి లింక్ ఉందని, ఆరో నేర మాళిగను తెరిస్తే అరిష్టంతో పాటు ప్రళయం కూడా సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే తరహాలో కోనేటిలోని నిధులపై చెయ్యేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు భయాందోళనలకు గురవుతున్నారు.

ఆలయం, ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని ఒకవేళ ఆ గదులను తెరిస్తే.. సముద్ర నీరు ఆ మార్గాల ద్వారా చొచ్చుకువచ్చి, ముంచేస్తుందని వివిధ ఆసక్తి కర కథనాలు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. పద్మనాభుని ఆలయంలోని నేలమాళిగలలో బయటపడిన నిధులు ఆలయానికే చేరాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అనంతుని ఆలయంలో లభించిన సొత్తు ఆయనకే చేరుతుందని భక్తులు చెబుతున్నారు. ఆలయంలో లభించిన ఆస్తులు కనుక పద్మనాభుడైన ఆ దేవుడికే చెందాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు విష్ణు సహస్ర నామాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

అయితే, పద్మనాభ ఆలయ నిధులను జాగ్రత్తగా మతపరమైన, సామాజిక పరమైన అవసరాలకు ఉపయోగించాలని రాజకుటుంబానికి చెందిన మహేంద్రవర్మ కోరుకుంటున్నారని ఆయన తరపు న్యాయవాది కేకే వేణుదోపాల్ కోర్టుకు చెప్పారు. వాటిచో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించడం సబబన్నారు. ఇంకా కేరళలో హిందూ మత పునరుజ్జీవం కోసం వాటిని ఉపయోగించాలని మరికొందరు కోరుతున్నారు.

తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభుని సంపద లెక్కించాలని కోర్టు కెక్కిన సుందర రాజన్ మృతి చెందాడు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాలిగల్లో ఇటీవల లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ సంపద గురించి బయట ప్రపంచానికి తెలియడానికి ప్రధాన కారణమైన, నేలమాలిగలు తెరవాలని న్యాయపోరాటం చేసిన ఐపీఎస్ అధికారి సుందరరాజన్ (70) ఆదివారం మరణించారు.

ఆ జన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ రెండు రోజుల పాటు జ్వరంలో బాధపడి హఠాత్తుగా మృతి చెందారు. కానీ తన సంపదను బయటకు తీసి లెక్కించడంపై అనంత పద్మనాభుడు కన్నెర్ర చేశాడా? లేక నేలమాలిగల్లోని నిధులకు కాపలా ఉన్నట్లు చెబుతున్న నాగరాజస్వామి కాటేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఇంటలిజెన్స్ విభాగంలో, ఇందిరాగాంధీ భద్రతా విభాగంలో పనిచేసిన సుందర రాజన్ న్యాయవాద వృత్తి చేపట్టారు. పద్మనాభస్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణలో పారదర్శకత కోసం కోర్టు కెక్కారు. ఆయన న్యాయపోరాటం కారణంగానే అనంత పద్మనాభుడి అనంత సంపద గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే ఆలయం కింద గల ఆరు నేలమాలిగల్లో ఐదింటిని తెరవగా, ఆరో దానిపై నాగబంధం ఉండటంతో తెరవకుండా ఉంచిన సంగతి తెలిసిందే.
[ webdunia.com ]news

Read more...

గురుపౌర్ణమిపూజలు

>> Saturday, July 16, 2011




గురుపౌర్ణమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహింపబడ్దాయి. దత్త దర్శనం గ్రంథపారాయనంచేసిన భక్తులచేత స్వామికి పూజలు జరిపి.అనంతరం గాయత్రీ హోమం నిర్వహించబడింది

Read more...

మన సోదరి అమ్మఒడి బ్లాగర్ ఆదిలక్ష్మి గారి దుఃఖం మనకు విషాదం

>> Friday, July 15, 2011

మనందరకు చిరపరిచితులు ,అమ్మఒడి బ్లాగర్ జీవితాన భగవంతుడు విషాధాన్ని కల్పించాడు. వారి ఒక్కగానొక్కపాప వీరిని దుఃఖసాగరంలో ముంచి పరమాత్మసన్నిధికి తరలి వెళ్లింది. వారి దుఃఖాన్ని మన తెలుగుబ్లాగర్ల కుటుంబానికి కలిగిన విషాధం గా భావిస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటూన్నాను

Read more...

ఈ ఆషాడమాసము / శూన్య మాసం లో ఎందుకని శుభకార్యములు చేయరాదు?

>> Tuesday, July 12, 2011

నమస్కారం

ఈ ఆషాడమాసము / శూన్య మాసం లో ఎందుకని శుభకార్యములు చేయరాదు?
ఒకవేళ చేస్తే ఏమిఅవుతుంది?
నిజముగా కీడు చేసేటువంతటి బలము ఆషాడమాసమునకు ఉన్నదా?
ఉంటె ఎటువంటి కారణముల వలన?

--
రామానుజం సుధీర్ కుమార్

----------------------------------------------------------

నమస్తే
శ్రీ గురుభ్యోన్నమః
మీరడిగిన ప్రశ్నకై సమాధానం వెతుకుతుంటే అంతర్జాలంలో ఇది కనబడింది, చదివి
సబబే అని నిర్ణయించుకుని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
మన ప్రాచీనులు ఈ పన్నెండు నెలల కాలంలో నాలుగు నెలలకి ‘శూన్యమాసం' అని
పేరు పెట్టి ఆయా మాసాల్లో శుభముహూర్తాలు ఉండరాదని చెప్పారు..అవి వరుసగా
మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్యా భా ద్ర పదం, ధనుః పౌష్యం అని నాలుగు
అయితే విథున ఆషాఢం (మిథున రాశిలోకి సూర్య సంక్రమణం). ‘‘ఆషా ఢ మాసం'గా
పరిగణిస్తూ ‘శూన్యమాసం’గా చెప్తారు.(మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్య
భాద్రపదం, ధనుః పౌష్యం - నాలుగూ కూడా శూన్య మాసాలే). ఇపుడు చెప్పబోతొంది
వీటి గురించే.అసలు ‘శూన్యం’ ఎందుకు అయ్యింది? అని ఆలోచిస్తే సంవత్సరానికి
నెలలు పన్నెండు. ప్రతి 2 నెలలకి ఒక ఋతువుగా సంవత్సరానికి ఋతువులు ఆరు.

చైత్రం, వైశాఖం - వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగుర్చి, కోయిల కూతలు,
మామిడి పూత, మల్లెపూలు కనుపిస్తాయిజేష్ఠ, ఆషాఢం - గ్రీష్మ ఋతువు : ఎర్రని
ఎండలు, ఒక్కో సారి వర్షాలు కూడా. అంటే ఆ ఎండలతో పాటుగా కురిసే వర్షామే
‘తొలకరి వర్షం' అంటాం.ఆ తొలకరి వర్షం ఎంతో ఆహ్లాదంగా, ఆనందకరంగా
వుంటుంది. ఆ వర్షానికి తడిసిన నేల చక్కని సుగంధాన్ని వెదజల్లుతుంది. ఆ
వాసన మైమరపిస్తుం ది. ఆ తొలకరి జల్లు పడితే, నేల తడిస్తే వ్యవసాయదారులకి
పని మొదలైనట్లే. అంటే దున్నటం ఆరంభం. విత్తనాలు నాటటానికి వీలుగా
నాగళ్లతో పని ప్రారంభిస్తారు. (వ్యవసాయ ప్రధా నంగా నడిచే భారతదేశంలో
రైతులకి కీలకమైన పని ప్రారంభం ఇక్కడ నుండే ప్రారంభం).

ఇలాంటి పరిస్థి తిలో ఉన్నపుడు ఈ ఆషాఢ మాసంలో పెళ్లి కనుక చేస్తే ఆ కొత్త
జంట తమ కాలాన్ని మర్చిపోయి భర్త పొలం పని మానేసి కొత్త పెళ్లాం చుట్టు
తిరుగుతారని (వ్యవసాయమే జీవనాధారంగా గల ఆ రోజుల్లో తలచి) ఆలోచంచి
ఆషాడాన్ని శూన్య మాసంగా అంటే ముహూర్తాలు లేకుం డా పెద్దలు ఆదేశించారు. ఈ
సమయంలో వివాహాలు చేసినట్లయితే తిండి గింజలకి అవకాశం కలిగించే వ్యవ సాయం
మూలనపడగలదని బాగా ఆలోచించి ఆ మాట అన్నారు.ఈ సమయంలో స్ర్తీలు గర్భం
ధరిస్తే వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకునే కొత్త జంటలు వారి వారి
తల్లిదండ్రుల వద్ద ఉండాలనే సంప్రదాయానికి పెద్దలు శ్రీకారం చుట్టారు.

ఎందుకంటే ఆషాఢంలో మహిళ గర్భం దాలిస్తే, ఆమె పురుడు నడి వేసవి కాలంలో
వచ్చినట్లయితే పుట్టే శిశువు ఆ వేడిమి భరించలేదని, సరి అయిన పాలు, నీళ్లు
దొరక వని ఆలోచించారు అంటే చలికాలం వర్షా కాలంలో పుట్టి న పిల్లలంత
ఆరోగ్యంగా వేసవిలో పుట్టిన పిల్లలుండ రుట! అంటే రెండు వైపుల వారికి
(స్ర్తీ, పురుషులకి) ఇబ్బంది కలిగించే ఆషాఢాన్ని ‘శూన్య మాసమంటు’ పేరు
పెట్టడం సబబే అని పెద్దలు శూన్య మాసమని నిషేధిం చారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శూన్యమాసములో ఏమీ ప్రారంభించగూడదా? అనుకుంటే
ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే అనేక కార్యకలాపాలు శుక్రునితో
ముడిపడి ఉంటాయి. ఈ మాసంలో శుక్రుడు ‘రవి’తో (సూర్యునితో) కలిసి
అస్తంగతుడైనాడు. శుక్ర మూఢమి కనుక శుక్ర బలం లేనందున అవి ఏమీ మొదలు
పెట్టకపోవటం మంచిది.
సుధీర్ కుమార్ గారూ.. మీరు గుంపులో ఉన్న ఇతర జ్యోతిష్య శాస్త్ర పండితులు
జ్యోతిష్య పరమ్గా మిగిలిన విషయాలు చెప్పాలి.

హరిహరనందన్ గార్కి ధన్యవాదములతో,

naagendra kumaar ayymgaari

Read more...

గురుపౌర్ణమి వస్తోంది . గురువుఅనుగ్రహానికై ప్రయత్నం మొదలెట్టండి.

>> Wednesday, July 6, 2011


గురుపౌర్ణమి ఈనెల 15 నవస్తోంది . సద్గురువుల కృపాకటాక్షం ప్రసరించేందుకు ముముక్షువులు ఈ పర్వదినాన గురుపూజలు ,ఉత్సవాలతో ఆరాధనలుచేస్తారు . ఈ పర్వదినానికి ముందుగా గురుచరిత్ర,దత్తదర్శనం,లేదా వారి వారి సాంప్రదాయాలననుసరించి ఆయా సద్గురురూపాల చరిత్రలను సప్తాహంగా పారాయణం చేస్తారు. కలియుగంలో సద్గురువులను గుర్తించటం బహుకష్టం. బాధగురువులు వీధికొకరు దొరుకుతారుగాని మన చేయిపట్టుకుని నడిపి పరమాత్మచెంతకు చేర్చగల బోధగురువుల అనుగ్రహం కోసం తీవ్రంగా యత్నించాల్సి ఉంది. అయితే మన అల్పజ్ఞానంతో జ్ఞానులను గుర్తించటం లో పొరపాటు జరిగే ప్రమాదముంది కనుక గురుచరిత్ర పారాయణం ద్వారా సద్గురువుల అనుగ్రహం శీఘ్రమే మనపై ప్రసరిస్తుంది. దూడదగ్గరకు గోవు పరిగెత్తినట్లు వారే కదలివచ్చి మనకు దర్శనం ప్రసాదిస్తారు అని పెద్దలమాట. లోకానికి వెలుగునిస్తూ వేదాలను విభజించి,పురాణేతిహాసాలను అందించి ,భవిష్యత్ సూచించి న కరుణాహృదయుడు వ్యాసభగవానుల వారి ని స్మరిస్తూజరుపుకునే ఈ వ్యాసపౌర్ణమి కి దత్తస్వామి పూజలు గాయత్రీ హోమములతో గురుభక్తులు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో ఈవేడుకను జరుపుకుంటారు. సద్గురువుల అనుగ్రహం మీకందరకు కలగాలని ఆశిస్తూ మీఅందరికీ ఇదే ఆహ్వానం . దత్తాంభజే ...గురు దత్తాం భజే

Read more...

కొత్త శక్తినిచ్చే బీట్‌రూట్‌ రసం

>> Monday, July 4, 2011

కొత్త శక్తినిచ్చే బీట్‌రూట్‌ రసం
క్రీడాకారులకు సంజీవని
వృద్ధులు, బలహీనులకు వరం
లండన్‌: ముదురు ఎరుపు...గులాబీ రంగులు సమ్మిళితమైన వర్ణంలో ఆకర్షణీయంగా కనిపించే బీట్‌రూట్‌ రసం క్రీడాకారులకు సంజీవనిలా పనిచేస్తుంది. సైకిలిస్టుల వంటివారికి ఈ రసం నూతనోత్తేజాన్ని....కొత్తశక్తిని ఇస్తుంది. ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

బీట్‌రూట్‌ రసంలో 'నైట్రేట్‌' సహజంగానే పుష్కలంగా ఉంటుంది. క్రీడాకారుల పనితీరుపై ఈ నైట్రేట్‌ చూపే ప్రభావం అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కసారి నైట్రేట్‌ శరీరంలోకి ప్రవేశిస్తే కలిగే పరిణామాలు అద్భుతం. ఒక్కసారిగా రక్తనాళాలు వెడల్పవుతాయి. తద్వారా మరింత అధికమొత్తంలో ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను పీల్చుకునేందుకు వీలుకలుగుతుంది. అంతేకాదు, రక్తపోటును తగ్గించడం, వృద్ధాప్యంలో కలిగే అలసటను మటుమాయం చేయడంలో బీట్‌రూట్‌రసానికి సాటిలేదు. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ మూలంగా కలిగే ప్రయోజనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు కొందరు సైకిలింగ్‌ ఛాంపియన్లను ఎంపికచేసుకున్నారు. వీరందరికీ నైట్రేట్‌ను వేరుచేసిన బీట్‌రూట్‌ రసాన్ని ఒకసారి...నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న రసాన్ని మరోసారి ఇచ్చి పనితీరును విశ్లేషించారు. నైట్రేట్‌ సహిత బీట్‌రూట్‌ రసాన్ని ఒక్కో పింట్‌ చొప్పున తీసుకున్న సైక్లింగ్‌ నిపుణుల పనితీరు అత్యద్భుతంగా ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది.

Read more...

వూబకాయానికి రోబోపిల్‌తో విరుగుడు!

వూబకాయానికి రోబోపిల్‌తో విరుగుడు!
వైర్‌లెస్‌ సంకేతాలతో కరగనున్న కొవ్వు
భారత్‌లో శాస్త్ర, వైద్య రంగం మధ్య సమన్వయంలేదు
'న్యూస్‌టుడే'తో సింగపూర్‌ శాస్త్రవేత్త లూయీస్‌ ఫీ వెల్లడి
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వూబకాయులకు శుభవార్త! శరీరంలోని కొవ్వును కరిగించే రోబో పిల్‌ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. దీనికి సంబంధించిన పరిశోధనల్లో మంచి పురోగతి ఉందని సింగపూర్‌లోని నాన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయ పరిశోధకుడు, రోబోటిక్‌ ఎండోస్కోపీ రూపకర్తల్లో ఒకరైన డాక్టర్‌ లూయీస్‌ ఫీ 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యాంశాలివీ..

న్యూస్‌టుడే: రోబోటిక్‌ ఎండోస్కోప్‌లో వాడుతున్న 'రోబోటిక్‌ ఆర్మ్స్‌' ప్రత్యేకతలేమిటి?
లూయీస్‌ ఫీ: సింగపూర్‌ ప్రభుత్వం దాదాపు రూ.6 కోట్లు ఆర్థిక సహకారం ఇచ్చింది. నేను, డాక్టర్‌ లారెన్స్‌తో పాటు మరో ఆరుగురు నిపుణులు పనిచేశాం. ఎండోస్కోపీ చివరి భాగంలో 'రోబోటిక్‌ ఆర్మ్స్‌' రెండింటిని ఏర్పాటుచేశాం. 360 డిగ్రీల్లో తిరిగేలా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేశాం. వీటి మందం ఆరు మిల్లీమీటర్లు. 20కి పైగా అత్యాధునిక సెన్సర్ల సాయంతో ఇది పని చేస్తుంది. భవిషత్తులో ఒకసారి వాడి పడేసే రీతిలో.. రోబోటిక్‌ ఆర్మ్స్‌ మందాన్ని తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. ఒక్కో పరికరాన్ని రూ.2500 కన్నా తక్కువకే తీసుకురావాలనేదే మా లక్ష్యం. ఈ పరిశోధనలో సాంకేతికపరంగా మేము, వైద్యపరంగా ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు సంయుక్తంగా పనిచేశాం. భవిష్యత్తులోనూ మరిన్ని పరిశోధనలు చేయాలనుకుంటున్నాం.

న్యూ: రోబోటిక్స్‌ రంగంలో మీ భవిష్యత్తు పరిశోధనలు ఏమిటి?
లూ: రోబోటిక్స్‌లో అనేక అంశాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఊబకాయం తగ్గించే అంశంపై ప్రస్తుతం 'రోబోటిక్‌ పిల్‌' రూపొందిస్తున్నాం. ఇది పూర్తిగా వైర్‌లెస్‌ సంకేతాలతో పనిచేస్తుంది. కడుపులోకి తీసుకున్నాక వైద్యనిపుణులు ఇచ్చే సంకేతాలతో అది తెరుచుకుంటుంది. అందులో నుంచి ఒక బెలూన్‌ బయటకు వచ్చి జీర్ణాశయంలోని ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. రెండు నుంచి నాలుగు వారాలపాటు కడుపులోనే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని రకాల తరంగాలను పంపడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ విధానాన్ని జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో మానవులపైనా పరీక్షించి చూస్తాం. ఇది పూర్తిగా సురక్షితం. ఈ రోబోపిల్‌ను రూ.500 కన్నా తక్కువ మొత్తానికే ఇవ్వాలన్నది మా ఆకాంక్ష.

న్యూ: వైద్యరంగ పరిశోధనలపై మీ అభిప్రాయం?
లూ: శాస్త్రసాంకేతిక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆ స్థాయిలో వైద్యరంగం అభివృద్ధి చెందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, పేదలకు అందుబాటులో ఉండటంలేదు. ఈ అంతరం పోవాలి. ఇంజినీరింగ్‌, వైద్యరంగ నిపుణులు సమన్వయంతో కృషి చేస్తే తక్కువ ధరకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు. భారతదేశంలో శాస్త్రరంగంలోనూ, వైద్యరంగంలోనూ నిపుణులు ఉన్నారు. ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేదు. దీన్ని సాధించగలిగితే అద్భుతాలను ఆవిష్కరించవచ్చు.

ఈనాడు న్యూస్

Read more...

2 నిమిషాల్లో రేచీకటి మాయం

2 నిమిషాల్లో రేచీకటి మాయం
ఫ్రెంచి శాస్త్రవేత్తల నూతన సాంకేతిక పరిజ్ఞానం
లండన్‌: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రేచీకటిని రెండు నిమిషాల చికిత్సతోనే దూరం చేస్తామంటున్నారు ఫ్రెంచి శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రేచీకటి వ్యాధికి చుక్కల మందు, మరీ తీవ్రమైతే శస్త్రచికిత్స చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6.7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. త్వరలోనే వారందరికీ ఉపశమనం కలిగిస్తామని నేత్ర వైద్య నిపుణుడు ప్రొఫెసర్‌ ఫిలిఫ్‌ డెనిస్‌ తెలిపారు. కంటిలోని తెల్ల గుడ్డు లోపల ఎక్కువగా స్రవించే ద్రవాన్ని శబ్ద తరంగాల ద్వారా నియంత్రించి రేచీకటిని నిర్మూలిస్తామని ఆయన వివరించారు. ''ఈ విధానం వల్ల నొప్పి కలగదు. సంప్రదాయ, లేజర్‌ చికిత్సల కన్నా ఎంతో మేలైనది. రెండు నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది'' అని 'ఐ టెక్‌కేర్‌' చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫాబ్రిస్‌ రొమానో తెలిపారు. ఈ సంస్థ పారిస్‌లో జరిగిన 'వరల్డ్‌ గ్లాకోమా కాంగ్రెస్‌' లో తొలి 20 మంది రోగులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ చికిత్సకు ఖర్చు సుమారు రూ.35 వేలు ఖర్చవుతుంది. బ్రిటన్‌లో వచ్చే ఏడాది నుంచి ఈ చికిత్సను అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫాబ్రిస్‌ పేర్కొన్నారు.

ఈనాడులో వార్త

Read more...

అద్భుతాల ధామం

>> Saturday, July 2, 2011

అద్భుతాల ధామం
- సామవేదం షణ్ముఖశర్మ
ధ్యాత్మిక చైతన్యానికీ భక్తి ఉద్యమానికీ ప్రధాన కేంద్రం పురీ జగన్నాథక్షేత్రం. ఒరిస్సా రాష్ట్రంలోని ఈ పురుషోత్తమక్షేత్రం అనాదిగా ఎన్నో ప్రత్యేక విశిష్టతలు కలబోసుకొని ప్రపంచాకర్షణ సాధించింది. కృష్ణభక్తి ఉద్యమకర్త చైతన్య మహాప్రభువు సేవించి తరించి ముక్తిపొందిన పవిత్రధామమిది. ఆదిశంకరులు దర్శించి పరవశించి, తన నాలుగుపీఠాల్లో ఒకదాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు.

విశిష్టమైన ఉత్కళ కళలకీ, జీవనరీతికీ ఆధారంగా ఉన్నదైవం పురీ జగన్నాథుడు. యుగయుగాలుగా విభిన్నరీతుల్లో విష్ణువు పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

'కాశీగంగ, బృందావన మృత్తిక, జగన్నాథ ప్రసాదం- ఈ మూడూ సాక్షాత్తు గోవిందరూపాలు' అని శ్రీరామకృష్ణ పరమహంస పలికేవారు. ఇది శాస్త్ర వచనం కూడా. అందుకే పురీ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మి అధ్యక్షతన వండే దివ్య ప్రసాదమిది- అని ధార్మిక గ్రంథాలమాట. ఈ ప్రసాదాన్ని జాతిభేదాలు లేకుండా ప్రతివారూ స్వీకరిస్తారు. దీనితో పితృశ్రాద్ధాదికాలూ ఆచరించి ధన్యత పొందవచ్చునని పురాణ వచనం. ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇక్కడి అన్నప్రసాదానికి ఉంది. 'ఇందులో ప్రతి మెతుకూ గోవిందుడే' అన్నారు పరమహంస.

సర్వం శ్రీ జగన్నాథం... ఈ నానుడి ప్రసిద్ధం. విభేదాలకీ, తారతమ్యాలకీ తావీయకూడని నియమం ఉన్న ఈ పావనభూమి ఎన్నో ఆలయాలతో, తీర్థాలతో విరాజిల్లుతోంది. 'కేవలం జగన్నాథస్మరణతో అన్నీ పవిత్రమవుతాయి' అనే సద్భావన ఇక్కడి సత్సంప్రదాయాలకు ప్రాణం పోస్తోంది.

రథయాత్ర సమయంలో లక్షలాది జనవాహిని సమక్షంలో, రాజుసైతం చీపురుతో రథాన్ని శుభ్రపరచడం- 'భగవంతుని ముందు రాజైనా సేవకుడే' అనే భావాన్ని ప్రకటిస్తుంది.

విశ్వరథాన్ని నడిపే పరమాత్ముని దర్శించడానికి ప్రతీకగా జరిగే రథోత్సవం ఒక మహద్విశేషం. 'నందిఘోష'రథంపై జగన్నాథుడు, 'తాళధ్వజ'రథాన బలభద్రుడు, 'దర్పదళన'మనే రథంలో సుభద్రాదేవి విశాలరాజమార్గాన దివ్యశోభలతో సాగుతూ జనసముద్రాన్ని కృపాసముద్రంతో ముంచెత్తుతారు.

'చలన ధర్మం కలది' కనుక రథం. ఈ అర్థం అటు జగతికీ, ఇటు శరీరానికీ అన్వయిస్తుంది. 'కదిలేది' ఒకటున్నదీ అంటే, 'కదిలించేది' మరి ఒకటున్నదని స్పష్టం. ఆ కదిలించే విశ్వచైతన్యమే విష్ణువు.

జగతిరథాన్ని కదిలించే జగన్నాథుని దర్శించడమే ఈ యాత్రలోని ఆంతర్యం. రథానికున్న అశ్వశిల్పాలు, ధ్వజాలు, అలంకారాలు... అన్నీ శాస్త్రబద్ధంగా మలచారు. ఆగమశాస్త్రాల ప్రకారంగా విశ్వాన్ని నడిపే బహుదేవతాశక్తులు, మంత్రమూర్తులు వీటిలో ఉన్నారని ప్రమాణవాక్యాలున్నాయి.

'ఒకప్పుడు రాధాదేవిని కలిసిన రుక్మిణీ సత్యభామాదులు బృందావనంలోని బాలకృష్ణలీలలను చెప్పమని కోరారట. రాధారాణి ఆ లీలలను పరవశంతో వర్ణిస్తుంటే, తన్మయులై వింటున్నారు ద్వారకారాణులు. అదే సమయంలో ఆ భవనంవైపు చెల్లెలు సుభద్రతో, అన్న బలరామునితో అటు వస్తున్న వాసుదేవుడు ద్వారం వద్దనే నిలబడి రాధాప్రసంగాన్ని విన్నాడు. వింటూనే ఆ ముగ్గురూ తాదాత్మ్యంతో శిల్పాలవలే నిలబడ్డారు. ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు ఈ ముగ్గురు మూర్తులు నిరంతరం భక్తులను అనుగ్రహించేలా ఆరాధ్యదేవతలై కలకాలం ఉండాలని కోరాడట. ఆ ముచ్చట తీర్చడానికై స్వామి అవతారానంతరం ఈ క్షేత్రాన వెలశా'డని ఒక పురాణోక్తి.

ఎన్నోవిధాలుగా పురాణాలు బోలెడు కథలు చెప్పినా, వాటన్నింటి సారంగా ఉన్న సమన్వయం సూత్రం ఒకటే: 'పరిపూర్ణుడైన వాసుదేవ బ్రహ్మం జగన్నాథుడు. విష్ణ్వంశరూపుడు సంకర్షణుడు బలభద్రుడు. వైష్ణవీమాయాశక్తి సుభద్ర. వీరితోపాటు జ్ఞానజ్వాలామూర్తిగా ఉన్న సుదర్శనుడు' ఈ నాలుగు రూపాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటూ, జగతిని రక్షించే భగవన్మూర్తులుగా ఈ క్షేత్రంలో భాసిస్తున్నాయని మహర్షులమాట.

భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో, ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఒక ప్రముఖ క్షేత్రతీర్థస్థలం ఈ ప్రాచీన విష్ణుధామం.



Read more...

ఆషాఢ వైభవం

ఆషాఢ వైభవం
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
నసులు కలిసిన మనుషుల్ని విడదీసి, మనసైన తలపుల్ని కలబోసే మాసం ఆషాఢం. నవజంటలకు లోలోపల తహతహల మధనం పుట్టించే మన్మధాస్త్రం. అల్లుడు అత్తగారి గడప తొక్కరాదు, కొత్త కోడలు అత్తగారి ముఖం చూడరాదు. ఇదీ ఆషాఢం పట్టింపు. పట్టింపు ఉన్నా అల్లుడికి ఆషాఢపట్టీ పేర బహుమానం కూడా లభించడం విశేషం. ఆషాఢ మాసం ఎడబాటు కలిగిస్తేనేం 'విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా' అన్నారు పింగళి.

ఆషాఢంలో ఆలుమగల విరహ సందేశాలను పరస్పరం అందించడానికి మేఘాలను పంపింది కవికుల గురువు కాళిదాసు. హేమమాలి అనే యక్షుడు కుబేరునిచే శాపగ్రస్తుడై ఆషాఢ మాసం తొలిరోజున చిత్రకూట పర్వతం మీద కొండచరియను కమ్ముకొని దంతాలతో కోరాడే ఏనుగువలె కనబడుతున్న మేఘాన్ని చూశాడని కాళిదాసు వర్ణన. సాధారణంగా మేఘ దర్శనం ప్రియురాలి సాంగత్యం కోసం కోరిక పుట్టిస్తుంది. గాలి అనుకూలంగా వీస్తుంటే చాతక పక్షులు, కొక్కెర పిట్టలు మధురంగా చెవులకు ఇంపుగా కూస్తుంటే అల్లనల్లన నల్లమబ్బులు అలముకునే మాసం ఆషాఢం. అయితే ఆషాఢ మేఘాలు అంతగా కురిసేవి కావు. దట్టంగా కమ్ముకొని హడావుడి చేసి మెల మెల్లగా చెదిరిపోతాయి. అందుకేనేమో నమ్మించి మోసం చేసేవాళ్లను, అతివినయం ఒలకబోసే వాళ్లను ఆషాఢభూతులంటారు. అబ్బూరి వారు 'తరలిరా ఆషాఢ లక్ష్మి మెరుపుతీగెలు తొలుకు రథమున మురిపెమున దిక్కాంతలలరగ తరలిరా మేఘముల పథమున...' అంటూ ఆషాఢ మేఘాలకు ఆహ్వానం పలికారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి 'ఆషాఢయోషామణీ కేశపాశాన అల్లుకున్నది తటిద్వల్లియో' అని ఆషాఢంలో మెరిసే మెరుపుతీగల్ని సంభావించారు.

పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఏదైతే వస్తుందో అప్పట్నుంచి ఆషాఢారంభం. ఇలా రెండు నక్షత్రాల ప్రత్యేకతగల నెల ఇది. ఆషాఢం అనే మాటకు బ్రహ్మచారుల చేతనుండే మోదుగుదండం, మలయపర్వతం అనే అర్థాలూ ఉన్నాయి. ఆషాఢం శూన్యమాసం. శుభకార్యాలను వాయిదా వేయించే మాసం. అయితేనేం సాంస్కృతిక వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. కొన్నిప్రాంతాల్లో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణ విశేష ఫలాలను ఇస్తాయని విశ్వాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి శయనైకాదశి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధియందు శయనించే తొలి ఏకాదశిగా ఇది ప్రసిద్ధి. ఈరోజు నుంచే చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఆషాఢ శుద్ధ విదియనాడు జగన్నాథ రథయాత్ర. సుభద్ర బలభద్రులతో కూడిన జగన్నాథుడు రథం మీద ఊరేగింపుగా వెళ్ళడం ఆనవాయితీ. ఆర్షవాఞ్మయానికి మూలపురుషుడైన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాసపూర్ణిమ. వ్యాసభగవానుని జగద్గురువుగా అర్చించే గురుపూర్ణిమ. ఆషాఢ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి. పాపనాశిని. ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో పవిత్ర సందర్భాలకు నెలవు ఆషాఢం. ఒరిస్సాలో ఆషాఢ పంచమి హిరాపంచమిగా వ్యవహరిస్తారు. వివాహ వేడుకలకు ఆరంభ దినం ఇది. ఆషాఢంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాయనం ఆరంభిస్తాడు.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP