గురుపౌర్ణమి వస్తోంది . గురువుఅనుగ్రహానికై ప్రయత్నం మొదలెట్టండి.
>> Wednesday, July 6, 2011
గురుపౌర్ణమి ఈనెల 15 నవస్తోంది . సద్గురువుల కృపాకటాక్షం ప్రసరించేందుకు ముముక్షువులు ఈ పర్వదినాన గురుపూజలు ,ఉత్సవాలతో ఆరాధనలుచేస్తారు . ఈ పర్వదినానికి ముందుగా గురుచరిత్ర,దత్తదర్శనం,లేదా వారి వారి సాంప్రదాయాలననుసరించి ఆయా సద్గురురూపాల చరిత్రలను సప్తాహంగా పారాయణం చేస్తారు. కలియుగంలో సద్గురువులను గుర్తించటం బహుకష్టం. బాధగురువులు వీధికొకరు దొరుకుతారుగాని మన చేయిపట్టుకుని నడిపి పరమాత్మచెంతకు చేర్చగల బోధగురువుల అనుగ్రహం కోసం తీవ్రంగా యత్నించాల్సి ఉంది. అయితే మన అల్పజ్ఞానంతో జ్ఞానులను గుర్తించటం లో పొరపాటు జరిగే ప్రమాదముంది కనుక గురుచరిత్ర పారాయణం ద్వారా సద్గురువుల అనుగ్రహం శీఘ్రమే మనపై ప్రసరిస్తుంది. దూడదగ్గరకు గోవు పరిగెత్తినట్లు వారే కదలివచ్చి మనకు దర్శనం ప్రసాదిస్తారు అని పెద్దలమాట. లోకానికి వెలుగునిస్తూ వేదాలను విభజించి,పురాణేతిహాసాలను అందించి ,భవిష్యత్ సూచించి న కరుణాహృదయుడు వ్యాసభగవానుల వారి ని స్మరిస్తూజరుపుకునే ఈ వ్యాసపౌర్ణమి కి దత్తస్వామి పూజలు గాయత్రీ హోమములతో గురుభక్తులు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో ఈవేడుకను జరుపుకుంటారు. సద్గురువుల అనుగ్రహం మీకందరకు కలగాలని ఆశిస్తూ మీఅందరికీ ఇదే ఆహ్వానం . దత్తాంభజే ...గురు దత్తాం భజే
0 వ్యాఖ్యలు:
Post a Comment