ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాష కు ఎట్టిదుస్థితి వచ్చింది ?!
>> Friday, July 22, 2011
పాపం 'సుధర్మ'..!
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన సంస్కృతానికి మన దేశంలో ఎంత మాత్రం ఆదరణ ఉందో 'సుధర్మ' పత్రిక కష్టాలను చూస్తే తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద సంస్కృతంలో వెలువడుతున్న ఏకైక పత్రిక ఇదొక్కటే. మైసూరు కేంద్రంగా వెలువడుతున్న ఈ పత్రిక ఇటీవలే 42వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. సుధర్మ ఎప్పుడు మూత పడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని, అందుకే పత్రికను దాతలు ఎవరైనా ఆదుకోవాలని యాజమాన్యం ప్రకటించింది."ప్రాచీన భాషను గౌరవించే ప్రతి ఒక్కరిపై సుధర్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
భాషాభిమానులు సహాయపడితే పత్రిక ముద్రణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు జరిగిపోతాయి. దీంతో పత్రికను మరికొన్నాళ్లు కొనసాగించవచ్చు..'' అంటూ ఆ పత్రిక సంపాదకులు కేవీ సంపత్ కుమార్ తెలిపారు. 1970 జూలై15న సుధర్మను సంపత్‌కుమార్ తండ్రి పండిట్ వరదరాజ అయ్యంగార్ స్థాపించారు. ప్రస్తుతం పత్రిక సర్క్యులేషన్ రెండువేలు. సుమారు 75 దేశాలకు ఈ పత్రిక వెళుతుంది. సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య అంశాలతోపాటు తాజా వార్తా విశేషాలతో పాఠకులను అలరిస్తున్న ఈ పత్రిక వెల ఒక్క రూపాయి మాత్రమే ఉండటం విశేషం.
[andhrajyothi .news]
0 వ్యాఖ్యలు:
Post a Comment