పూజ కాగానే మంగళహారతి పాడతారెందుకు..?
>> Friday, July 29, 2011
ఇంటిలో పూజ మన ఒక్కరికే (కుటుంబానికి) సంబంధించిన పూజ. కనుక పూజ కాగానే మంగళహారతి ఇచ్చి పూర్తి చేస్తాం.అదీ ఉదయం సాయంత్రాలలో . దేవాలయాల్లో దేవుడికి ఒకే ఒక్క పూజకానీ, ఒకే ఒక్కరి పూజ కానీ కాదు. కాబట్టి, మంగళహారతి అనేది అనే పర్యాయాలు ఇస్తారు. దేవాలయాల్లో జరిగేదంతా మంత్రపూర్వకంగా జరుగుతుంది. కనుక మంగళహారతి "సర్వః ప్రజామ్నే గోపాయ.." అంటూ మంత్రపూర్వకంగా వినిపిస్తుంది.
ఇళ్ళలో మంత్రపూర్వకంగా పూజ జరిగినా భగవంతుని గానంతో సేవించాలి ఆయన గాన ప్రియుడు కాబట్టి ఆయనకు మంగళహారతి సమయంలో రాగయుక్తంగా, మంచిగొంతుతో అందరూ కలిసి పాటపాడి వినిపిస్తారు.
పూజ అయిన తర్వాత మంగళహారతి పాటను పాటడం అంటే నాకు వచ్చిన సంగీతం పాండిత్యం ఈ కంఠ మాధుర్యం, ఈ భక్తీ, శ్రద్ధా, నా కుటుంబ శ్రేయస్సు, అన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వల్ల వచ్చినవే.
కనుక, వీటినన్నింటినీ నీకే అంకిత మొనర్చుకుంటున్నాను దేవా! అని తన్మయంత్వంతో తెలుపడమే అవుతుంది. ఈ విషయాన్ని జ్యోతిసాక్షిగా సర్వాంతర్యామి అయిన దేవుడికి తెలుపడం పూజ అయినదని ప్రకటించడం మంగళ హారతి ఇవ్వటంలో అంతరార్ధం .
3 వ్యాఖ్యలు:
బావుంది ఇందులోని మరో ప్రయోజనం ఏమంటే కర్పూర,పంచ తైలాలతో ఇచ్చే హారతిలో వెలువడే ఆవిరి వాసనలు గుడిలోని బొగ్గుపులుసువాయువుని,ఇతర క్రిములను నిర్వీర్యము చేస్త్త్హాయి.ఈ రకంగా పుణ్యమూ/పురుషార్ధము పొందానికి ఆలయాల్లో తరచుగా హారతి ఇస్త్త్హారు.
Manchi vishayam thelusukunnam..Thanks..andee!
ILANTI MANCHI VISHAYALU INKA TELUPANDI
Post a Comment