తల్లీ ! నామీద ప్రసన్నురాలవు కమ్ము.
>> Tuesday, July 19, 2011
దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
భావం, తల్లీ సమస్త జగత్తుకూ తల్లివైననిన్ను ప్రాతః కాలముననే
స్మరించుచున్నాను. తెల్లని వస్త్రములు ధరించి, చందనాది అంగరాగములు
పూసుకుని, సుకుమారమైన పూల దండలు ధరించి ఉన్న ఓ తల్లీ నీకు నిత్యమూ ప్రాతః
కాలమునందు నమస్కరిస్తున్నాను. తల్లీ నీ ఐశ్వర్యమునేమని కొలచెదను,
దిగ్గజముల భార్యలైన ఆడ ఏనుగులు బంగారు కలశములతో ఆకాశ గంగను పట్టితెచ్చి ఆ
జలములతో నిత్యమూ నిన్ను అభిషేకము చేస్తూ ఉంటాయి. ఐశ్వర్యములలో హద్దుగా
మదము కలిగిన ఏనుగులను వాకిటకట్టుకున్నవాని ఐశ్వర్యమును చెబుతారు, తల్లీ
మరి నీకో దిగ్గజముల భార్యలే స్వయంగా నిత్యమూ అభిషేకం చేస్తూ ఉంటాయి.
తల్లీ ముల్లోకాలలోనూ కల గొప్పనైన ఐశ్వ్యర్యమును ప్రసాదించగల తల్లివి,
నామీద ప్రసన్నురాలవు కమ్ము.
0 వ్యాఖ్యలు:
Post a Comment