పూజలో భగవంతునిపై మనసు లగ్నం కావటం లేదు ఎలా ?
>> Wednesday, July 27, 2011
మనసును లగ్నం చేసేదెలా?
జపం చేసుకోవాలనుకుంటే మనసు నిలకడగా ఉండటం లేదు. ఏం చెయ్యమంటారు?
- బి. మన్మోహన్, హైదరాబాద్
ఇది ఎక్కువ మంది తరచుగా వేస్తున్న ప్రశ్న. సాధారణంగా మనం చేసే పనులు, మాట్లాడే మాటలు మనస్సును అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. రోజంతా భగవత్సంబంధం లేని మాటలతో, పనులతో కాలం గడుపుతూ పూజ, జపం, పారాయణ చేసుకునే గంట, అరగంట సేపు మాత్రం భగవత్సంబంధాన్ని కల్పించికుంటే మనస్సు భగవంతుని మీద లగ్నం కావటం ఇంచుమించు అసాధ్యం. ఎక్కువ సమయాన్ని ఏ విషయాల మీద గడుపుతామో ఆ విషయాలే అన్ని సమయాల్లోను గుర్తుకు వస్తాయి.
కొంచెం విషయ లంపటం తగ్గించుకొని, భగవంతుడు కావాలనుకునే వారు చదవవలసిన అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంధం 'భగవద్గీత'. గీతలో భగవానుడు అంతిమోపాయంగా చెప్పిన 'శరణాగతి' (సర్వధర్మాన్ పరిత్యజ్య..)పై నిగూఢంగా ఉండిపోయిన ఎన్నో అమూల్య విషయాలను వెలికి తీసి 'శ్రీ వచన భూషణం' అనే సూత్ర గ్రంధాన్ని 14వ శతాబ్దంలో శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు అనుగ్రహించారు. ఈ రెండు గ్రంధాలు నిత్యమూ అధ్యయనం చేస్తే మనస్సుకు నిలకడ వస్తుంది.
ఆంధ్రజ్యోతి నుండి
0 వ్యాఖ్యలు:
Post a Comment