శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సంతానలేమితో బాధపడుతున్నారా ? ఈ క్షేత్రాన్ని దర్శించండి .

>> Monday, July 25, 2011

శ్రీ గురుభ్యో నమః
నమస్కారము,

ఈ క్రింది స్తోత్రములు అందరికీ ఉపయోగపడగలవని ఇక్కడ జతచేస్తున్నాను.
౧. సూర్య భగవానుడు, ఆయన పుత్రుడు అయిన శనీశ్వరునికి చెప్పిన ఒక గొప్ప స్తోత్రం - వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం.

౨. గర్భ రక్షామ్బిక స్తోత్రం - తమిళ నాడు లో కుంభకోణం దగ్గరలో ఉన్న శ్రీ గర్భ రక్షామ్బిక (తిరుక్కవుగావుర్ అనే వూరు లో, ఈ పదమునకు అర్ధం తమిళం లో గర్భ రక్షా అని...) అమ్మ వారి ఆలయం ఉన్నది. అక్కడ అమ్మ వారు గర్భ రక్షామ్బిక అమ్మ గాను, అయ్య వారు ముల్లైవ నాథర్ అనే పేరుతో ప్రసిద్ధము. ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి వారికి కేవలం మల్లె నూనె తో అభిషేకం చేస్తారు.
ఇది శౌనక మహర్షి విరచించిన గర్భ రాక్షాంబికా స్తోత్రం. ఈ స్తోత్రం గర్భం దాల్చబోయే వాళ్ళు, గర్భం దాల్చిన తల్లులు ఎవరైనా చదివితే, చక్కగా ముద్దులొలికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లానో, చిన్ని కృష్ణుడి లాంటి పిల్లలు పుడతారు. ఈ ఆలయం లో అమ్మ వారి దగ్గర ఉంచి మంత్రించిన నూనె ఇస్తారు. దానిని గర్భం దాల్చిన తల్లి యొక్క ఉదరమునకు వ్రాసుకుంటే చక్కగా ప్రసవం అవుతుంది అని నమ్మకం. సత్సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే దంపతులు ఎవరైనా ఉంటే, వాళ్ళు అక్కడికి వెడితే, మంత్రించిన నెయ్యి ప్రసాదం గా ఇస్తారు. దానిని దంపతులు ఇద్దరూ, ౪౦ రోజులు నిద్రించే ముందు సేవిస్తే వెంటనే గర్భం దాల్చడం జరుగుతుంది అని నమ్మకం. ఈ విధంగా పిల్లలు కలిగిన తర్వాత అక్కడ అమ్మ వారి ఎదుట ఒక ఊయల ఉంటుంది, అందులో పుట్టిన పిల్ల/పిల్లా వాడిని ఉంచి అమ్మ వారి ఆశీస్సులు పొంది రావాలి. ఆ మందిరం ఎంతో ప్రశాంతముగా ఉంటుంది.

ఇట్లు
మోహన్ కిషోర్

వంశ వృద్ధికర దుర్గా కవచం

ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమః

శనైశ్చర ఉవాచ:-

భగవాన్ దేవ దేవేశ కృపయా త్వం జగత్ప్రభో

వంశాఖ్య కవచం బ్రూహి మహ్యం శిష్యాయా తే అనఘ

యశ్య ప్రభావాత్ దేవేశ వంశ వృద్ధిర్హి జాయతే II

సూర్య ఉవాచ:-

శృణు పుత్రా ప్రవక్ష్యామి వంశాఖ్యాం కవచం శుభం

సంతాన వృద్ధిర్ యత్ పఠనాద్ గర్భ రక్షా సదా నృణామ్ I


వంధ్యాపి లభతే పుత్రం కాక వంధ్యా సుతైర్యధా

మృత వత్సా సుపుత్రస్యాత్ స్రవత్ గర్భ స్థిర ప్రజా I

అపుష్పా పుష్పిణీ యస్యా ధారణాశ్చ సుఖ ప్రసుః

కన్యా ప్రజా పుత్రిణీ ఏతత్ స్తోత్రమ్ ప్రభావతః I

భూత ప్రేతాధిజ బాధా యా బాధా కలి దోషజా

గ్రహ బాధా, దేవ బాధా యా శత్రు బాధా కృత చ యా I

భశ్మీ భవంతి సర్వస్తాః కవచస్య ప్రభావతః

సర్వ రోగ వినశ్యంతి సర్వే బాల గ్రహశ్చ యే II

అథ దుర్గా కవచమ్

ఓం పూర్వ రక్షతు వారాహీ చ ఆగ్నేయం అంబికా స్వయమ్

దక్షిణే చండికా రక్షేత్ నైరుత్య హంస వాహినీ II

వారాహీ పశ్చిమే రక్షేత్ వాయవ్యాం చ మహేశ్వరీ

ఉత్తరే వైష్ణవీ రక్షేత్ ఈశాన్యం సింహ వాహినీ II

ఊర్ధ్వం తు శారదా రక్షేత్ అథో రక్షతు పార్వతి

శాకంబరీ శిరో రక్షేత్ ముఖం రక్షతు భైరవీ II


కంఠమ్ రక్షతు చాముండా హృదయం రక్షతాత్ శివ

ఈశాని చ భుజౌ రక్షేత్ కుక్షిమ్ నాభిమ్ చ కాళికా II

అపర్ణాః ఉదరం రక్షేత్ బస్తిం శివ ప్రియా

ఊరూ రక్షతు కౌమారీ జయా జానుధ్వయం తధా II

గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మణీ పరమేశ్వరీ

సర్వాంగాని సదా రక్షేత్ దుర్గా దుర్గార్తి నాశినీ II

నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః

పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః II

ఓం హ్రీం హ్రీం హ్రీం - శ్రీం శ్రీం శ్రీం - ఐం ఐం ఐం

మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపాయై

నవ కోటి మూర్త్యై దుర్గాయై నమః - హ్రీం హ్రీం హ్రీం

దుర్గార్తి నాశినీ సంతాన సౌఖ్యం దేహి దేహి II

వంధ్యత్వం మృతవత్సత్వం హర హర - గర్భ రక్షం కురు కురు

సకలాం బాధాం కులజాం బాహ్యజం కృతమకృతాం చ నాశయ నాశయ


సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ

సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహా II

ఫల శృతిః

అనేన కవచేనాంగం సప్త వారాభి మంత్రితం

ఋతు స్నానో జలంపీత్వా భవేత్ గర్భవతీ ధ్రువం

గర్భ పాత భయే పీత్వా ధృఢ గర్భా ప్రజాయతే

అనేన కవచేనాధ మార్జిత యా నిశాగమే

సర్వ బాధా వినిర్ముక్తా గర్భిణీస్యాత్ న సంశయః

అనేన కవచేనేహ గ్రంధితం రక్త దోరకం

కటి దేశే ధారయంతి సుపుత్రా సుఖ భాగినీ

అసూత పుత్రమింద్రాణి జయంతం యత్ ప్రభావతః

గురుపాధిష్టం వంశాఖ్యం కవచం తదిధం సదా

గుహ్యాత్ గుహ్యతర చేదం న ప్రకశ్యం హి సర్వతః

ధారణాత్ పఠనధస్య వంశఛ్చేధో న జాయతే

ఇతి శ్రీ జ్ఞాన భాస్కరే వంశ వృద్ధికర దుర్గా కవచం సంపూర్ణం.

___________________________________________________________________________________________



శౌనక మహర్షి విరచిత గర్భరక్షా స్తోత్రం


ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమః

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్

ప్రజా కర్తా, ప్రజా పతే

ప్రగృహ్షీణివ బలిం చ ఇమం

ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ

ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం

సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం

చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా

ప్రగృహనంతు బలిం ద్విమం

యుష్మాకం ప్రీతయే వృతం

నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా

ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం

యుష్మాగం తేజసాం వృధ్య

నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా

శివ పుత్రా మహా బల

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II


స్కంద షణ్ముఖ దేవేశా

పుత్ర ప్రీతి వివర్ధన

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా

ప్రత్యూషో మరుత నల

దృవూ ధురా ధురశ్చైవ

వసవోష్టౌ ప్రకీర్తితా

ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం

నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే

బహు పుత్రీ మహా బలే

భూత శ్రేష్టే, నిశావాసే

నిర్వృతే, శౌనక ప్రియే

ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II


రక్ష రక్ష మహాదేవ,

భక్తానుగ్రహకారక

పక్షి వాహన గోవిందా

సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II

*****

** ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.

· 2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు

· 8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు

9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు






స్తోత్రాలను ఈ క్రింది లింకులనుండి పొందండి

http://mail.google.com/mail/?ui=2&ik=23fc06d729&view=att&th=131621d98e78b471&attid=0.1&disp=safe&realattid=f_gqj0pkfz0&zw

http://mail.google.com/mail/?ui=2&ik=23fc06d729&view=att&th=131621d98e78b471&attid=0.2&disp=safe&realattid=f_gqj0pqcu1&zw

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP