శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విగ్రహపూజ సాధనమేనా?

>> Friday, July 22, 2011

విగ్రహపూజ సాధనమేనా?

విగ్రహ పూజను ఒక సాధనంగా భావించాలా, ధ్యేయంగా భావించాలా?
-

విగ్రహపూజను ఒక సాధనంగా, అభ్యాసంగా భావించి చేస్తుంటే అది మనోశుద్ధికి తోడ్పడి, తద్వారా కొంత కాలానికి, నిర్గుణోపాసనకు దారితీసి, అంతిమంగా మోక్షానిస్తుందని కొంతమంది చెప్పుతుంటారు. కాని ఇది సరికాదు. ఒకసారి మీ ఇష్ట దేవతా విగ్రహాన్ని ఇంటిలోనో, ఆలయంలోనో ప్రతిష్ఠించిన తరువాత దాన్ని 'విగ్రహం' అని పిలవకూడదు. అర్చామూర్తి అనాలి. ఆ మూర్తి సాక్షాత్ భగవంతుడే.

భగవత్ స్వరూపాలు అయిదింటిలో పరమపదవాసుడు వ్యూహవాసుదేవుడు, విభవావతరాలు, అంతర్యామి, అర్చామూర్తి- అన్నా సాక్షాత్ భగవన్మూర్తులే. ఒకదానికంటే ఒకటి ఏమీ తక్కువ, ఎక్కువ కాదు. కలియుగంలో అర్చామూర్తి సౌలభ్యమూర్తి. విగ్రహంలో దేవుణ్ణి చూడటం కాదు. విగ్రహాన్నే(అర్చామూర్తి)దేవుడిగా చూడాలి. ఇలా చేస్తే విశ్వమంతా పరమాత్మను చూడగలం. మాధవసేవగా మానవ సేవ చేసి తరించగలం. జీవితం ఉన్నంత వరకు అర్చామూర్తిని ఆరాధించాలి.

[ఆంధ్రజ్యోతి నుండి]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP