శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నృసింహస్వామి పానక తీర్థం సేవిస్తే ?......

>> Saturday, July 23, 2011

FILE
శ్రీమంగళగిరి నృసింహస్వామి దేవునికి, అహోబిల నరసింహ దేవునికి నైవేద్యంగా పెట్టే పానక తీర్థాన్ని సేవిస్తే... దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది. పానకాల స్వామి, పానకాల నరసింహ స్వామిగా పేరొందిన మంగళగిరి నరసింహుడు, అహోబిలులకు పెట్టే పానక నైవేద్యాన్ని సేవించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

ఇంకా పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వస్తుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. జీవితంలో శత్రువుల బాధ కలుగదు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది.

అలాగే ఆలయాల్లో ఇచ్చే పంచామృత అభిషేక తీర్థాన్ని సేవించడం ద్వారా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. ఆలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాల్లో నాలుగు రకాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీటిని జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం అంటారు.

జలతీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వ రోగాలు నివారించబడతాయి. అన్నికష్టాలు, దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.

ఇక కషాయ తీర్థాన్ని కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలామాలినీ దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయాల్లో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత కషాయం రూపంలో ఈ తీర్థాన్ని పంచుతారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయని పురోహితులు చెబుతున్నారు.

[webdunia.com

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP