ఇది పిచ్చికుక్కల సీజన్ అవి కరవనువచ్చు ,కాల్చనూవచ్చు ..బహుపరాక్
>> Sunday, July 24, 2011
మనం ప్రతిసంవత్సరం ఈసీజన్లో పిచ్చికుక్కల దాడులగూర్చి వీటివలన జనం భయాందోళనలను గూర్చీ పత్రికలలో చదువుతుంటాం . చాలాజాగ్రత్తగా సందులు గొందులలో చూసుకుని నడుస్తుంటాం . ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి ఎక్కడొ ఒకచోట ఎవరినో ఒకరిని కరుస్తూనేఉంటాయి .అందువలనే ఈ సీజన్ అంటే అంతభయం
అయితే ఆ భయం ఇప్పుడు బహుదా...శతదా ...సహస్రధా ..విస్తరించి జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది . దీనికీ ఓశాస్త్రీయ కారణం ఉంది . కొన్ని పిచ్చి కుక్కలను జనం వెంటపడి కొట్టిమరీ చంపుతారు .అలాచంపేప్పుడు జనంపట్ల తీవ్రమైన క్రోధంతో మరణించిన కొన్ని పిచ్చికుక్కలు మానవజన్మ ఎత్తాయి. అంతటితో ఆగక అవిరాజకీయాల్లో చేరాయి . అవకాశం కోసం వేచిచూస్తున్న వీటికి కాలం కలిసొచ్చింది . ఇంకేం తమలో ఉన్న రేబిస్ వైరస్ ను జనంలోకెక్కించే పనిలో పడ్డాయి. ఒకటేమో అంతుచూస్తామంటుంది . మరొకటి ఆత్మహత్యలొద్దంటూనే పెద్దమొత్తంలో జనాన్ని చంపి చావాలంటుందిది.ఇంకొకటెమో నార్వేలో జనాన్ని హతమార్చిన తమ జాతి కుక్కలాగా జనాన్నికాల్చటానికి సిద్దమవ్వమంటాయి. వెరసి మొత్తం బజార్నపడి కరుచుకుందాం రమ్మంటాయి. కొన్ని గుంటనక్కలు కూడా ఇదేవిధంగా ఈవిధంగానే మానవజన్మనెత్తి రాచకీయల్లో చేరి బాగావెనకేసుకున్నవి,వెనుకేసుకోవాలనుకున్నవి ఉన్నాయి. ఇవి ఊళలు వేస్తూ పిచ్చిఎక్కించేందుకవసరమైన సరంజామా కొనేందుకు ఆర్ధికంగా అండదండలందిస్తుంటాయి . ఈకుక్కలు,నక్కలతో కల్లోలమవుతున్న మనజీవితంలో,మనలోకి ఈవైరస్ సోకకుండా కాపాడే నాథుడేవరా , మంచి వాక్సిన్ ఇచ్చి కాపాడే వైద్యుడెవరా అని ఎదురు చూడవలసిన రోజొచ్చింది. ఖర్మ.
2 వ్యాఖ్యలు:
మొన్నటినుండీ చూస్తున్నాను. వీళ్ళెవరండి మనందరి తరఫున కాల్చే'స్తాం' అని నిర్ణయాలు వెలువరించడానికి? నాకు తెలిసినంతవరకూ ఈ కేశవ్ అనేఅయనకి నిన్నమొన్నటివరకూ నార్వే అనే దేశమొకటుందని కూడా తెలిసుండదు. అక్కడేoజరిగింది? ఎందుకు? అనేవాటి గురించైతే అస్సలు ఇహ అడగనేఅఖ్ఖర్లేదు. మరి ఈయన ఏవాదో? (సమైక్య, తెలెంగాణా) ఈ తరహా వ్యాఖ్యలు చేసే వదరుబోతుల్ని ఆయా వాదాలప్రజలు ఎలా వెనకేసుకొస్తున్నారో. హే ఓటరు దేవా నువ్వే నీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలయ్యా.
స్వామీ ! పిచ్చికుక్కలంటే అంతే వాటికి ఎందుకు ఏమిటీ అనే విషయాలు అనవసరం . వాటిమనసువాటి ఆధీనంలో ఉండదు.
Post a Comment