శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ ఆషాడమాసము / శూన్య మాసం లో ఎందుకని శుభకార్యములు చేయరాదు?

>> Tuesday, July 12, 2011

నమస్కారం

ఈ ఆషాడమాసము / శూన్య మాసం లో ఎందుకని శుభకార్యములు చేయరాదు?
ఒకవేళ చేస్తే ఏమిఅవుతుంది?
నిజముగా కీడు చేసేటువంతటి బలము ఆషాడమాసమునకు ఉన్నదా?
ఉంటె ఎటువంటి కారణముల వలన?

--
రామానుజం సుధీర్ కుమార్

----------------------------------------------------------

నమస్తే
శ్రీ గురుభ్యోన్నమః
మీరడిగిన ప్రశ్నకై సమాధానం వెతుకుతుంటే అంతర్జాలంలో ఇది కనబడింది, చదివి
సబబే అని నిర్ణయించుకుని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
మన ప్రాచీనులు ఈ పన్నెండు నెలల కాలంలో నాలుగు నెలలకి ‘శూన్యమాసం' అని
పేరు పెట్టి ఆయా మాసాల్లో శుభముహూర్తాలు ఉండరాదని చెప్పారు..అవి వరుసగా
మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్యా భా ద్ర పదం, ధనుః పౌష్యం అని నాలుగు
అయితే విథున ఆషాఢం (మిథున రాశిలోకి సూర్య సంక్రమణం). ‘‘ఆషా ఢ మాసం'గా
పరిగణిస్తూ ‘శూన్యమాసం’గా చెప్తారు.(మీన చైత్రం, మిథున ఆషాఢం, కన్య
భాద్రపదం, ధనుః పౌష్యం - నాలుగూ కూడా శూన్య మాసాలే). ఇపుడు చెప్పబోతొంది
వీటి గురించే.అసలు ‘శూన్యం’ ఎందుకు అయ్యింది? అని ఆలోచిస్తే సంవత్సరానికి
నెలలు పన్నెండు. ప్రతి 2 నెలలకి ఒక ఋతువుగా సంవత్సరానికి ఋతువులు ఆరు.

చైత్రం, వైశాఖం - వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగుర్చి, కోయిల కూతలు,
మామిడి పూత, మల్లెపూలు కనుపిస్తాయిజేష్ఠ, ఆషాఢం - గ్రీష్మ ఋతువు : ఎర్రని
ఎండలు, ఒక్కో సారి వర్షాలు కూడా. అంటే ఆ ఎండలతో పాటుగా కురిసే వర్షామే
‘తొలకరి వర్షం' అంటాం.ఆ తొలకరి వర్షం ఎంతో ఆహ్లాదంగా, ఆనందకరంగా
వుంటుంది. ఆ వర్షానికి తడిసిన నేల చక్కని సుగంధాన్ని వెదజల్లుతుంది. ఆ
వాసన మైమరపిస్తుం ది. ఆ తొలకరి జల్లు పడితే, నేల తడిస్తే వ్యవసాయదారులకి
పని మొదలైనట్లే. అంటే దున్నటం ఆరంభం. విత్తనాలు నాటటానికి వీలుగా
నాగళ్లతో పని ప్రారంభిస్తారు. (వ్యవసాయ ప్రధా నంగా నడిచే భారతదేశంలో
రైతులకి కీలకమైన పని ప్రారంభం ఇక్కడ నుండే ప్రారంభం).

ఇలాంటి పరిస్థి తిలో ఉన్నపుడు ఈ ఆషాఢ మాసంలో పెళ్లి కనుక చేస్తే ఆ కొత్త
జంట తమ కాలాన్ని మర్చిపోయి భర్త పొలం పని మానేసి కొత్త పెళ్లాం చుట్టు
తిరుగుతారని (వ్యవసాయమే జీవనాధారంగా గల ఆ రోజుల్లో తలచి) ఆలోచంచి
ఆషాడాన్ని శూన్య మాసంగా అంటే ముహూర్తాలు లేకుం డా పెద్దలు ఆదేశించారు. ఈ
సమయంలో వివాహాలు చేసినట్లయితే తిండి గింజలకి అవకాశం కలిగించే వ్యవ సాయం
మూలనపడగలదని బాగా ఆలోచించి ఆ మాట అన్నారు.ఈ సమయంలో స్ర్తీలు గర్భం
ధరిస్తే వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకునే కొత్త జంటలు వారి వారి
తల్లిదండ్రుల వద్ద ఉండాలనే సంప్రదాయానికి పెద్దలు శ్రీకారం చుట్టారు.

ఎందుకంటే ఆషాఢంలో మహిళ గర్భం దాలిస్తే, ఆమె పురుడు నడి వేసవి కాలంలో
వచ్చినట్లయితే పుట్టే శిశువు ఆ వేడిమి భరించలేదని, సరి అయిన పాలు, నీళ్లు
దొరక వని ఆలోచించారు అంటే చలికాలం వర్షా కాలంలో పుట్టి న పిల్లలంత
ఆరోగ్యంగా వేసవిలో పుట్టిన పిల్లలుండ రుట! అంటే రెండు వైపుల వారికి
(స్ర్తీ, పురుషులకి) ఇబ్బంది కలిగించే ఆషాఢాన్ని ‘శూన్య మాసమంటు’ పేరు
పెట్టడం సబబే అని పెద్దలు శూన్య మాసమని నిషేధిం చారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శూన్యమాసములో ఏమీ ప్రారంభించగూడదా? అనుకుంటే
ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే అనేక కార్యకలాపాలు శుక్రునితో
ముడిపడి ఉంటాయి. ఈ మాసంలో శుక్రుడు ‘రవి’తో (సూర్యునితో) కలిసి
అస్తంగతుడైనాడు. శుక్ర మూఢమి కనుక శుక్ర బలం లేనందున అవి ఏమీ మొదలు
పెట్టకపోవటం మంచిది.
సుధీర్ కుమార్ గారూ.. మీరు గుంపులో ఉన్న ఇతర జ్యోతిష్య శాస్త్ర పండితులు
జ్యోతిష్య పరమ్గా మిగిలిన విషయాలు చెప్పాలి.

హరిహరనందన్ గార్కి ధన్యవాదములతో,

naagendra kumaar ayymgaari

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP