శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమెరికాలో ఉండే మనవాళ్ళు సంకల్పం ఎలా చెప్పుకోవాలి ? [ఓ చర్చ ]

>> Saturday, September 18, 2010

చర్చ: అమెరికాలో నివాసముంటున్నా మన సాంప్రదాయాలు,ఆచారాలు పాటిస్తున్న మన
కుర్రాల్లు కొందరికి ఒక సందేహం వచ్చింది . అక్కడ
నిత్యపూజాదికములలో ,సంధ్యావందనాదులలో సంకల్పం ఎలా చెప్పుకోవాలి ?
ముఖ్యంగా నదీమతల్లులను ఉదహరించేప్పుడు . ఈ సంకల్పాన్ని తెలియజేయాలని
వారు కోరుతున్నారు. పెద్దలంతా మీ అభిప్రాయాలను తెలపాలని మనవి .

------------------------------------------------------------------------

ఇక్కడ సంకల్పంలో--

"అస్మిన్ వర్తమాన
చాంద్రమానేన....నామసంవత్సరే...అయనే....ఋతౌ....మాసే...పక్షే....ఏవం
విధగుణవిశిష్టాయాం...తిథౌ....వాసరే శుభయోగే శుభనక్షత్త్రే శుభకరణే
భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే కృష్ణాగోదావర్యోర్ మధ్యదేశే... "
గట్రా గట్రా చెప్తాం.

సప్తద్వీపాలని మహాభాగవతంలో వర్ణించబడిన జంబూద్వీపాదులలో అమెరికా
సంయుక్తరాష్ట్రావళి ఏ ద్వీపం కిందకొస్తుందనేది ఆలోచించాల్సి ఉంది.
ఒక్కొక్క ద్వీపమూ మళ్లీ వర్షాలుగా విభజించబడింది. ఒక్కొక్క వర్షమూ మళ్లీ
ఖండాలుగా విభజించబడింది. కనుక భరతవర్షమూ, భరతఖండమూ ఒకటి కాదు. ఈ విషయం
మనకు బ్రహ్మాండపురాణం ద్వారా తెలియవస్తున్నది.

మేరుపర్వతానికీ, కృష్ణాగోదావరులకూ బదులు ఇహ అక్కడ స్థానికంగా ఏ పర్వతాలూ,
నదులూ ఉంటే వాటి పేర్లు చెప్పుకోవడం సముచితం. వాటి ఆంగ్లనామధేయాలు మనకు
సమ్మతం కాకపోతే వాటికి సంస్కృతంలో సృజనాత్మక ప్రతిభతో సరికొత్తగా నామకరణం
చేసి వ్యవహరించుకోవడం ఉత్తమం. ఈ మధ్య కొంతమంది పురోహితులు Apple ని
నైవేద్యంగా సమర్పించేటప్పుడు "కాశ్మీరఫలం సమర్పయామి" అని చదువుతున్నారు.

-----------------------------------------------------------------------

నేననుకుంటున్నాను - మన పూర్వీకులు భౌగోళిక విశేషాల్ని సంకల్పంలో
స్మరించడానిక్కారణం - ఆ రోజుల్లో రాజ్యాలకు నిర్దిష్టమైన శాశ్వతమైన
సరిహద్దులుండేవి కావు. తఱచుగా దండయాత్రల మూలాన సరిహద్దులు మారిపోతూండేవి.
అందుచేత మానవకల్పితమైన రాజ్యసీమల మీద ఎక్కువ ఆధారపడదల్చుకోక వారు మనకీ
భౌగోళిక విశేషాల పఠనాన్ని అలవాటు చేశారు. కానీ నా దృష్టిలో మన
నివాసప్రాంతాల యొక్క ఆధునిక నామధేయాల్ని సంకల్పంలో నిరభ్యంతరంగా
వాడుకోవచ్చు. పాతకాలపు డొంకతిరుగుడు మానేసి "ఆంధ్రదేశే/ తమిళదేశే/
అమెరికాదేశే" అని చదువుకుంటే నష్టమేమీ లేదు. అసలు అన్నింటికన్నా మన పేరూ,
గోత్రమూ చాలా ముఖ్యం మిహతావి గౌణం .
---------------------------------------------------

krauncha dveepam- USA


--------------------------------------------------------------
eemadyana americalo TTD mariyua marikonni dhaarmika saMsthala aadhvaryaMlO
konni kaaryakramaalu, yaagaau jarigaayi. daani veediyolu unnavaaru
aasamayaMlO saMkalpaM elaa cheppukunnaarO choosi telapagalaru

--------------------------------------------------------------------------------------
నేను వినినంతలో అమెరికాలకు క్రౌంచద్వీపం అని వాడుతున్నారండీ

-----------------------------------------------------------------------------------

చాలా మంచి ప్రశ్న. నాకూ చాలాకాలంగా ఇదే సందేహం. సంస్కృత పండితులు ఎవరైనా ఈ
సమస్యను తీరిస్తే చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. అసలు మన ఖండాలను పూర్వం ఎలా
పిలిచేవారు? నేడు అమెరికా,ఆఫ్రికా వంటి వాటిని మనం సంస్కృత నామాలతో పిలవాలంటే
ఎలా పిలుచుకోవచ్చు?
ఇక మామూలు సంకల్పానికే తెలియటంలేదు, మహా సంకల్పము మాటేమిటి?

--------------------------------------------------------------------------------------
ఇప్పటి యూఎస్ ఏ - జంబూద్వీపంలోని రమ్యక, అరణ్యక, కురువర్షాలలో, సిద్ధపురి
అనే పట్టణానికి దక్షిణాన వ్యాపించి ఉన్నదని కోట వెంకటాచలం గారు
పేర్కొన్నారు.
కెనడా దక్షిణభాగము, అమెరికా ఉత్తరభాగము - రమ్యక , అరణ్యక వర్షాలు, నీల
పర్వతం, శ్వేతపర్వతాలకు సమీపంగా.అమెరికా దక్షిణ భాగము - కురువర్షము, శృంగవాన్ పర్వత సమీపంగా.

-----------------------------------------------------------------------------------

అమెరికా మనకి పాతాళ లోకం కింద లెక్క ...మన సాహిత్యం లొ ని పాతాళ లోక
ప్రస్తావనలన్ని అమెరికా కి వర్తిస్తాయి


-----------------------------------------------------------------------------------
ఈ విషయంపై నేను అమెరికాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని పూజారిని
అడిగితే వారు ఈ విధంగా చెప్పుకోమన్నారు..
క్రౌంచద్వీపే .. ఐంద్రేయ వర్షే.. మరింకేదో ఉంది .. పూర్తిగా తెలుసుకుని
వ్రాస్తాను. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, ద్వీపాల గురంచి జరుగుతున్న
విషయంలో నేను కూడా క్రౌంచ ద్వీపానికే ఓటు వేస్తాను అని చెప్పడానికి

------------------------------------------------------------------------------------
క్రౌంచద్వీపం అమెరికాయే అనడానికి ప్రమాణం ?

అసలు ఈ ద్వీపాలూ, పర్వతాలూ, నదుల డొంకతిరుగుడంతా అవసరం లేదనుకుంటా. ఆయా
దేశాల, ప్రదేశాల యొక్క వర్తమాన వ్యవహారనామాలతో సంకల్పం చెప్పుకోవచ్చును.
తప్పేంటి ?

"......పృథివ్యాః పశ్చిమార్థగోళే ఉత్తర అమెరికాఖండే సంయుక్తరాజ్యేషు
మేరీలాండ్ రాజ్యే...." ఇత్యాదిగా చెప్పుకోవచ్చును.


-------------------------------------------------------------------------

"అస్మిన్ వర్తమాన వ్యావహారిక ..." అనుకుంటున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా
అమెరికాఖండే ఇత్యాదిగా చెప్పుకోవటం అన్న ఆలోచన కూడా బాగుందండీ.

-------------------------------------------------------------------------

typing my explonation will take mch time,so iam planing a audio file to
xplain this soon sir..iam in a hurry of changing my residence tomorrow.so
iam a bit busy till 5th of september.pl.bear wth me sir......


------------------------------------------------------------------------------

ఇవి మా మితృల మధ్య జరిగిన చర్చలో కొన్ని అభిప్రాయములు ..మీ ఆలోచనకూడా చెప్పండి [అనవసర వివాదాలకోసం కాకుండా ]



12 వ్యాఖ్యలు:

భాను September 19, 2010 at 1:10 AM  

avunandi. monna oka function lo maaku ede doubt vachindi.

Malakpet Rowdy September 19, 2010 at 10:23 AM  

నేనయితే క్రౌంచ ద్వీపే, అమేరికా ఖండే, మిస్సిస్సీపీ కొలొరేడో మధ్య దేశే ( ఆస్టిన్ నగరం ఆ రెండు నదుల మధ్యలో ఉంది) అని చదువుతా

Malakpet Rowdy September 19, 2010 at 10:25 AM  

షికాగో లో ఉన్నప్పుడు "షికాగో, మిస్సిస్సీపీ" మధ్య దేశే అని, న్యూ జెర్సీలో హడ్సన్, మిస్సిసీపీ మధ్య దేశే అని చదివా :))

సుజాత వేల్పూరి September 19, 2010 at 9:42 PM  

మేము అక్కడున్నపుడు మా పూజారి గారూ పూజల సమయంలో క్రౌంచ ద్వీపమనే చదివించారు!

మలక్ పేట్ రౌడీ,
మేము ఒక్లహోమాలో ఉన్నపుడు "ట్రినిటీ,కొలరాడోర్మధ్యదేశే"అని చదివానొక సారి ఇంట్లో పూజలో! (ట్రినిటీ డలాస్ చివర్లో ఉంటుంది కదాని) మా వారు కాదన్నారు. అర్కన్సాస్ నది అని చదవాలట. అర్కన్సాస్ నదే కొలరాడోలో కొలరాడో నదిగా మారుతుంది కదా అంటే కుదరదన్నాడు

కాంత్ September 19, 2010 at 9:44 PM  

"క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐందు ఖండే, మేరోః పశ్చిమ దిగ్భాగే, మిసిసిపీ/మిస్సోరీ/??? తూర్పు/పశ్చిమ ఉత్తర/దక్షిణ ప్రదేశే" అని చెప్పుకోవచ్చనుకుంటాను

శ్రీనివాస్ September 20, 2010 at 12:05 AM  

స్వర్ణ బ్రహ్మనాయుడు , కామేశ్వరమ్మల కుమారుడనైన స్వర్ణ సప్ర్తగిరి శ్రీనివాసులు అనబడు నేను సతీసమేతముగా నీ పూజని భక్తి శ్రద్ధలతో ముగించాను స్వామీ. మమ్ము అనుగ్రహించు. అని ఏ పూజలోనైనా నేను తెలుగులో సంకల్పం చెప్పుకుంటా. ఏమండి సంస్కృతంలోనే చెప్పుకోవాలా?

durgeswara September 20, 2010 at 7:50 AM  

నాయనా శ్రీనివాసూ

అక్కడ చెప్పుకోవడం ఎలా అనేది చర్చగానీ , ఇలా చెప్పుకోకూడదు అనే నిషేధాజ్ఞలేవీ లేవే ?

శ్రీనివాస్ September 20, 2010 at 8:04 AM  

నేను అనేది ఏంటంటే ఫలానా ప్రదేశంలో ఉన్నాను అని చెప్పుకోవాలా అని :))

కాంత్ September 20, 2010 at 8:36 AM  

సుజాతగారు,
మా నాన్నగారు చెప్పిన ప్రకారం, జీవనదులని మాత్రం సరిహద్దులుగా తీసుకోవాలి. ఇండియాలో అయితే "గంగా గోదావరీ మధ్యదేశే" అంటాము గాని మిగతా చిన్న నదులని ఉపయోగించం. అలాగే, ఇక్కడ కూడ. గూగ్‌ల్‌లో major rivers in US అని వెతకండి, లేదా http://alliance.la.asu.edu/maps/USRIVCD.PDF చూడండి.

కొత్త పాళీ September 21, 2010 at 6:27 PM  

బాగుందండీ మీ చర్చ.
నేనుకూడా కొన్ని దేవాలయాల్లో క్రౌంచద్వీపే ఐంద్రకవర్షే అనడం విన్నాను.
ఇహ నదుల విషయం - ఇక్కడ చాలా చోట్ల పిల్లకాలవల్లాంటివే తప్ప జీవనదులు తక్కువ.
ఫిలడెల్ఫియాలో ఉన్నప్పుడు డెలవేర్ నదీ తీర ప్రదేశే అనుకునే వాళ్ళం - ఒక పక్కన డెలవేర్ నది ఉంది - ఇంక అవతల పక్కన ఎన్ని వందల మైళ్ళు వెళ్తే ఇంకో జీవనది దొరుకుతుందో!
ఇప్పుడు మిషిగన్‌లో పంచమహా సరోవరాణాం మధ్య దేశే (Five great lakes) అని చెప్పుకుంటున్నాం.
మరోమాట, అమెరికాలో సంఖ్యా పరంగా ఎక్కువ ఉన్నా, మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా నివాసం ఉంటున్నారు కాబట్టి ఇలా సంకల్పం చెప్పుకోడానికి ఒక ఆల్గారిథం సృష్టాంచిల్సిన అవసరం ఉన్నదని నా ప్రతిపాదన.
ఎవరన్నా వ్యాపార దక్షులుంటే ఒక వ్యాపార ఐడియా - మా జీపీయెస్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంకల్పం కూడా చెబుతుంది!!

ఇందు September 22, 2010 at 1:29 PM  

నేను ఐతే గూగుల్ లో బాగా వెదికి ఒక ఫార్మెట్ లో వ్రాసుకున్నా.....'క్రౌంచ ద్వీపే,రమణక వర్షే,ఐద్ర ఖండే,రాకీ-అపలాచియన్ పర్వత మధ్యే,మేరో పశ్చిమ పార్స్వే,ముస్సొరి-మిసిసిస్పి మధ్య ప్రదేశే అని సంకల్పం చెప్పుకుంటున్నా!!

Avadhany October 31, 2023 at 8:17 PM  

ఈ సంకల్పాలు, సంధ్యావందనాలు భావనా ప్రాధాన్యమైన. అందు చేత, మన సాంప్రదాయ పద్ధతి లో సంకల్పం చెప్పుకుంటూ, గంగా యునైటెడ్ వసతి, అనే భావనతో సంకల్పం చెప్పుకోవచ్చు. ఎలాంటి మార్పులు అవసరం లేదు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP