శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

2 నిమిషాల్లో రేచీకటి మాయం

>> Monday, July 4, 2011

2 నిమిషాల్లో రేచీకటి మాయం
ఫ్రెంచి శాస్త్రవేత్తల నూతన సాంకేతిక పరిజ్ఞానం
లండన్‌: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రేచీకటిని రెండు నిమిషాల చికిత్సతోనే దూరం చేస్తామంటున్నారు ఫ్రెంచి శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రేచీకటి వ్యాధికి చుక్కల మందు, మరీ తీవ్రమైతే శస్త్రచికిత్స చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6.7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. త్వరలోనే వారందరికీ ఉపశమనం కలిగిస్తామని నేత్ర వైద్య నిపుణుడు ప్రొఫెసర్‌ ఫిలిఫ్‌ డెనిస్‌ తెలిపారు. కంటిలోని తెల్ల గుడ్డు లోపల ఎక్కువగా స్రవించే ద్రవాన్ని శబ్ద తరంగాల ద్వారా నియంత్రించి రేచీకటిని నిర్మూలిస్తామని ఆయన వివరించారు. ''ఈ విధానం వల్ల నొప్పి కలగదు. సంప్రదాయ, లేజర్‌ చికిత్సల కన్నా ఎంతో మేలైనది. రెండు నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది'' అని 'ఐ టెక్‌కేర్‌' చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫాబ్రిస్‌ రొమానో తెలిపారు. ఈ సంస్థ పారిస్‌లో జరిగిన 'వరల్డ్‌ గ్లాకోమా కాంగ్రెస్‌' లో తొలి 20 మంది రోగులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ చికిత్సకు ఖర్చు సుమారు రూ.35 వేలు ఖర్చవుతుంది. బ్రిటన్‌లో వచ్చే ఏడాది నుంచి ఈ చికిత్సను అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫాబ్రిస్‌ పేర్కొన్నారు.

ఈనాడులో వార్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP