శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొత్త శక్తినిచ్చే బీట్‌రూట్‌ రసం

>> Monday, July 4, 2011

కొత్త శక్తినిచ్చే బీట్‌రూట్‌ రసం
క్రీడాకారులకు సంజీవని
వృద్ధులు, బలహీనులకు వరం
లండన్‌: ముదురు ఎరుపు...గులాబీ రంగులు సమ్మిళితమైన వర్ణంలో ఆకర్షణీయంగా కనిపించే బీట్‌రూట్‌ రసం క్రీడాకారులకు సంజీవనిలా పనిచేస్తుంది. సైకిలిస్టుల వంటివారికి ఈ రసం నూతనోత్తేజాన్ని....కొత్తశక్తిని ఇస్తుంది. ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

బీట్‌రూట్‌ రసంలో 'నైట్రేట్‌' సహజంగానే పుష్కలంగా ఉంటుంది. క్రీడాకారుల పనితీరుపై ఈ నైట్రేట్‌ చూపే ప్రభావం అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కసారి నైట్రేట్‌ శరీరంలోకి ప్రవేశిస్తే కలిగే పరిణామాలు అద్భుతం. ఒక్కసారిగా రక్తనాళాలు వెడల్పవుతాయి. తద్వారా మరింత అధికమొత్తంలో ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను పీల్చుకునేందుకు వీలుకలుగుతుంది. అంతేకాదు, రక్తపోటును తగ్గించడం, వృద్ధాప్యంలో కలిగే అలసటను మటుమాయం చేయడంలో బీట్‌రూట్‌రసానికి సాటిలేదు. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ మూలంగా కలిగే ప్రయోజనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు కొందరు సైకిలింగ్‌ ఛాంపియన్లను ఎంపికచేసుకున్నారు. వీరందరికీ నైట్రేట్‌ను వేరుచేసిన బీట్‌రూట్‌ రసాన్ని ఒకసారి...నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న రసాన్ని మరోసారి ఇచ్చి పనితీరును విశ్లేషించారు. నైట్రేట్‌ సహిత బీట్‌రూట్‌ రసాన్ని ఒక్కో పింట్‌ చొప్పున తీసుకున్న సైక్లింగ్‌ నిపుణుల పనితీరు అత్యద్భుతంగా ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP