శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ కథాప్రవచనాన్ని పరిశీలించి ఆశీర్వదిస్తున్న హనుమ ప్రతినిధి

>> Thursday, June 30, 2011


హనుమాన్ కథా పారాయణం చేస్తున్న భక్తబృందాన్ని పలకరించి ఆశీర్వదిస్తున్న హనుమత్ పరివారం..ఇది భక్తి యొక్క శక్తికి ప్రత్యక్షప్రమాణం .ఈ వీడియో చూడండి


Read more...

సంగీతం- మోక్షసాధనం

>> Tuesday, June 28, 2011


సంగీతం- మోక్షసాధనం
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
శిశువులు, పశువులు, సర్పాలు- సంగీతానికి పులకించని జీవి లేవు. సంగీతం మానవులకు మోక్షసాధనం కూడా! మోక్ష పథగామికి నాదోపాసన సులభతర పథమని వేద, శాస్త్రపురాణాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ పాశ్చాత్య విద్వాంసుడు 'మెమాహిన్‌' భారతీయ సంగీతాన్ని అధ్యయనం చేసి 'భారతీయ సంగీత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందడమే' అంటూ శ్లాఘించాడు. సామవేదానికి అనుబంధమైన గాంధర్వవేదం అనే ఉపవేదంనుంచి సంగీతకళ ఆవిర్భవించింది. గంధర్వులు దీన్ని మొదట అభ్యసించడంవల్ల దీనికి గంధర్వగానమని పేరు వచ్చిందంటారు. బ్రహ్మ మానసపుత్రుడు నారదమహర్షి. అష్టాక్షరి మంత్రజపియైు నిరంతర భగవన్నామ గానం చేస్తూ ముక్కోటి దేవతలకు వందనీయుడయ్యాడు. ప్రపంచంలో సనాతనమూ, శాశ్వతమూ, సత్యమూ అయిన ప్రణవం సంగీతానికి ప్రతీక. అటువంటి సంగీత మాధుర్యాన్ని తన చేతిలోని 'మహతి' అనే వీణను మీటుతూ లోకాలను పరవశింపజేశాడు. అద్వైత సిద్ధికి, అమరత్వలబ్ధికి సోపానమైన గాన శాస్త్రాన్ని ఔపాసన పట్టినాడు ఆంజనేయుడు. నాదంనుంచే నవరసాలూ ఉద్భవించాయి. నాదాన్ని బ్రహ్మ- విష్ణు- శివాత్మకంగా సారంగదేవులు 'రత్నాకరం'లో పేర్కొన్నారు. ఇక మురళీ గానలోలుడు శ్రీకృష్ణుడు తన మధుర మురళీగానంతో అందరినీ రసాప్లావితం కావించడమేకాక మోక్షపథ ప్రదర్శనం చేశాడు. సంగీతత్రయంలో మొదటివాడైన ముత్తుస్వామి దీక్షితులవారు మధుర మీనాక్షి సన్నిధానంలో 'శ్రీ మీనాక్షీ మే ముదందేహి పాశమోచని' అని గాన రసాంబుధిలో తన్మయుడై ఆ జగజ్జననిలో ఐక్యం చెందినట్లు చెబుతారు. 'శంకరీ! శంకరు చంద్రముఖీ, అఖిలాండేశ్వరి శాంభవి' అని అమ్మవారిని కీర్తిస్తూ శ్యామశాస్త్రి ముక్తిఫలం అందుకున్నట్లు చదువుకున్నాం. త్యాగరాజస్వామి తొంబై ఆరుకోట్ల శ్రీరామతారక మంత్రజపం చేసి, ఇరవైనాలుగువేల కీర్తనలను రచించి, విభిన్న రాగాల్లో స్వరకల్పన చేసి, గానంచేసి చరితార్థుడయ్యాడు. 'ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు' అని తన వినయ విధేయతలను అభివ్యక్తం చేశాడు. 'సంగీత జ్ఞానము భక్తివినా' అంటూ ఆ రెంటికీగల అన్యోన్యాశ్రిత సంబంధాన్ని చక్కగా అభివర్ణించాడు. త్యాగయ్యవంటి వాగ్గేయకారుడు 'నభూతో నభవిష్యతి' అంటూ వాగ్గేయకారులే కొనియాడారు.

చతుర్విధ పురుషార్థ సాధనలో ధర్మమోక్ష సాధనలు రెంటినీ ప్రతిపాదించిన మాధ్యమం సంగీతమే. ఆళ్వారులెందరో జానపద గీతశైలిలో మధురగాన సుధను వసుధపైన ప్రవహింపజేశారు. భక్తతుకారాం, కబీర్‌దాసు భక్తిగానం చేసి తరించారు. రామదాసు పద్యగేయ రచన చేసి రాముని కైంకర్యంచేసి హృదయంగమంగా గానం చేసి చరితార్థుడైనాడు. విరహభక్త కవయిత్రి గోదాదేవి రచించిన తిరుప్పావై చిరస్మరణీయం. భక్తజయదేవుని అష్టపదులు శ్రీకృష్ణ తత్వాన్ని సాక్షాత్కరింపజేసిన అమృతరసగుళికలు. శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ప్రస్తుతిస్తూ 32వేల కీర్తనలు రాసి గానంచేసి అచ్చమైన తెలుగుభాషను ఆంధ్రులకు ప్రసాదించిన అమృతమూర్తి పదకవితాపితామహుడు అన్నమాచార్యుడు. అశ్వమేధ క్రతువులు నిర్వహించిన సందర్భాల్లో దేవతలను సంతృప్తిపరచేందుకు వీణావాదనం చేసినట్లు కాత్యాయన శ్రీతసూత్రం, శతపథ బ్రాహ్మణం పేర్కొన్నాయి. అపరాంతక, ఉల్లోప్య, మకరి ముద్రక మొదలైన పురాతన గీతమాలికలు మోక్షసాధనకు తగిన మూలికలుగా యాజ్ఞవల్క్య మహర్షి అభివర్ణించాడు. సదాశివ బ్రహ్మేంద్రస్వామి 'పిబరే రామరసం' అంటూ భక్తిరసగాన మహిమను వివరించాడు.

విభిన్నరాగాలుగా విభజితమైన భారతీయ సంగీతంలో ఎన్నో ఓషధీగుణాలున్నాయి. ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క సమయంలో ఆలాపించడంవల్ల వ్యాధుల నివారణ సుసాధ్యమని సంగీత విద్వన్మణులు తీవ్ర పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఈ కోణంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. శ్రుతిపక్వమైన సంగీతం వింటే శారీరక, మానసిక ఆరోగ్యం ఆనందం చేకూరి ఆయువు పెరుగుతుందని సంగీత శాస్త్రకోవిధులు నిరూపించారు. చక్కని సంగీతం వింటూంటే శ్రమ అలసట తొలగిపోయి ఆయుర్‌ వృద్ధి జరుగుతుందంటారు. రక్తపోటు తగ్గుతుందంటారు. మనసులో సంయమనాన్ని నింపి, అవికార స్థితిని కల్పించి పారలౌకిక దిశానిర్దేశం చెయ్యడమే భారతీయ సంగీత ప్రధానలక్ష్యం. రాగద్వేషాలను హరించి ఆనందదాయకమైన ఆధ్యాత్మిక వేదికపైన హృదయాలను సుప్రతిష్ఠితం చేయడమే సంగీతాశయం. ప్రపంచంలోని సంగీతాలన్నింటిలోనూ ఒక్క భారతీయ సంగీతమే మోక్షసాధనకు సంపూర్ణంగా సహకరించేదంటారు. భగవిజ్జిజ్ఞాసువులకు, ముముక్షువులకు సప్తస్వర కలశం ప్రధానమైన మాధ్యమం. సంగీతసుధ లలిత సంగీతం, సంకీర్తనం, భజన, హరికథ బుర్రకథ, యక్షగానం మొదలైన పాయలు పాయలుగా ప్రవహించి రసజ్ఞులను పునీతం చేస్తున్నది.

Read more...

మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు,ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు?ప్రసారంచేస్తున్నారు?

>> Monday, June 27, 2011

అవును నాకోవిషయం అర్ధంకావటం లేదు. చాలా రోజులుగా ప్రశ్నించుకుంటూ ,ప్రశ్నిస్తూ వస్తున్నా సరైన సమాధానం రాలేదు.

మన మీడియా లో అదిప్రింట్ మీడియాగానీయండి ,ఎలక్ట్రానిక్ మీడియాకానీయండి ఒకవిషయంలో ఏకాభిప్రాయం కనపడుతుంది. అదేమిటంటే హిందువుల ఆచారవ్యవహారాలను విమర్శించటం. జాతకాలు,ముహూర్తాలు ,జ్యోతిషశాస్త్రాదులను మూఢనమ్మకాలనే రీతిలో వార్తలుగా ఇవ్వటం.అలాగే అలావిమర్శించేవారితో చర్చలు జరిపిస్తూ తాముతటస్థులమన్నట్లుగానో లేక వ్యతిరేకులమన్నట్లుగానో వ్రాస్తూ,మాట్లాడుతూ శునకానందం పొందుతుంటారు.

ఈశాస్త్రాలన్నీ ప్రామాణికం కావని వీళ్ళునమ్మినప్పుడు ఈమూఢనమ్మకాలనుంచి జనాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నప్పుడు ముందుగా వీళ్ళు ఈ నమ్మకాలను ఆచారాలను వదిలేయాలి కదా ?
కానీ పత్రికగానీ ఛానల్ కానీయండి వాటిభవనాల భూమిపూజనుండి ప్రారంభకార్యక్రమాలన్నీ కూడా ఈఆచారాలతోనే పూజలతోనే చేస్తారు.వాటి యజమానులు గుళ్ళుగోపురాలో ఇంకా వేరే ప్రార్ధనామందిరాలచుట్టో తిరుగుతూనే ఉంటారు. ఇంకా తిథులు,పంచాంగాలు ,రాశిఫలాలు అంటూ పత్రికలవాళ్లు ప్రచురిస్తుంటే ఛానల్వాళ్ళుకార్యక్రమాలు ప్రసారం చేస్తూనే ఉన్నారు . అసలు నమ్మకంలేని వాళ్ళు ఈ ప్రసారాలెందుకు ? ఎవరిని వెర్రివాళ్లను చేస్తున్నారు. ఏమాత్రం నైతిక విలువలులేని వీళ్ళ ప్రచురణలను ప్రసారాలను జనం ఎందుకు నమ్మాలి ? భర్తృహరి చెప్పినట్లుగా మనసులో ఆలోచన ఒకటి చెప్పేదొకటి ఆచరించేదింకొకటి గా సాగుతున్న వీళ్లబ్రతుకులు.......... లోకానికి ఆదర్శాలు నేర్పుతాయా ?

మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు,ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు?ప్రసారంచేస్తున్నారు?

Read more...

నాస్తికుడు- ఆస్తికుడు

>> Sunday, June 26, 2011

నాస్తికుడు- ఆస్తికుడు
- వనం వెంకట వరప్రసాదరావు
వరు నాస్తికుడు, ఎవరు ఆస్తికుడు? భగవంతుడు లేడనేవాడు నాస్తికుడా, భగవంతుడు ఉన్నాడనేవాడు ఆస్తికుడా? అసలు ఎవరు భగవంతుడు? ఏది మంచి, ఏది చెడు? ఏది ఉచితం, ఏది అనుచితం? 'న అస్తి' అంటే... 'లేదు' అనేవాడు నాస్తికుడు. దేవుడి ఉనికిని ప్రశ్నించేవాడు దేవుడు లేడనే వాడు; దేవుడు, దయ్యం అంతా 'భ్రమ' అనేవాడు మాత్రమే నాస్తికుడు కాడు. దేవుడి మీదే కాదు, తన శక్తి మీద, తన తెలివితేటల మీద తనకు విశ్వాసం లేనివాడు, ఎందులోనైనా లేదనే దానినే వినేవాడు, కనేవాడు నాస్తికుడు. తనకు దేనిపైన విశ్వాసం ఉన్నదని మాటల్లో చెబుతాడో దాన్ని ఆచరణలో చూపనివాడు కూడా నాస్తికుడే! తేలికగా లొంగిపోయేవాడు, పరాజయాన్ని అంగీకరించేవాడూ నాస్తికుడే!

'అస్తి'... అంటే ఉన్నది అనే నమ్మకాన్ని కలిగినవాడే 'ఆస్తికుడు'. ఓడినప్పుడు గెలుపుకోసం, గెలిచినప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోవడం కోసం, మళ్లీ మళ్లీ గెలవడం కోసం నిరంతరం పోరాటం చేసేవాడు; దేవుడి మీద మాత్రమే కాదు, తనమీద, తన తెలివితేటల మీద నమ్మకం ఉన్నవాడే ఆస్తికుడు! 'నా'తో మొదలై, 'నా'తోనే కొనసాగి, 'నా'తోనే అంతమైపొయ్యేవాడు, 'నా కోరికలు' 'నా సుఖం', 'నా దుఃఖం', 'నా లాభం', 'నా ఇష్టం', ఇలా... పుట్టిన దగ్గరనుంచి, చచ్చేదాకా 'నా' చుట్టూ ఎవడు పరిభ్రమిస్తాడో, 'నా ఇల్లు', 'నా వాకిలి', 'నా కుటుంబం' అంటూ ఎవడు బతుకుతాడో వాడే నాస్తికుడు! 'ఉన్నది' అని నమ్మేవాడు, ఉన్నదాని తోనే సంతృప్తి పొందేవాడు, ఉన్ననాడు, లేనినాడు ఒకేరకంగా ఉండగలిగేవాడు, తన కోసమే కాక, తన చుట్టూ ఉన్నవాళ్ళకోసం, ఇతరుల కోసం బతికేవాడు, మాటకు కట్టుబడేవాడు, మంచితనానికి పట్టుబడేవాడు, 'మనది', 'మనది' అని పలవరించేవాడు... వాడే నిజమైన ఆస్తికుడు!

'నా' చుట్టూ గిరి గీసుకుని బతికేవాడు అధముడు. 'నా'నుంచి 'మా' వరకు ఎదగగలినవాడు మధ్యముడు. 'మా'నుంచి 'మన'కు ఎదగగలినవాడు ఉత్తముడు. విచిత్రమేమిటంటే, ఇలా చూస్తే- ఆస్తికులు అనుకునేవాళ్ళలో ఎంతోమంది నాస్తికులు, నాస్తికులు అనుకునేవాళ్ళలో ఎంతోమంది ఆస్తికులు కనిపిస్తారు. వ్యక్తిత్వంలోనో, ఆధ్యాత్మిక సాధనలోనో, అనుభవంలోనో లేదా మంచితనంలోనో ఎత్తులకు ఎదిగిన కొద్దీ అంతరాలు తొలగిపోయే, అంతరంగం అందంగా వెలిగిపోయే మార్గం సుగమం అవుతుంది. అదే నిజమైన ఆస్తికత్వం! దాన్ని కలిగినవాడే నిజమైన ఆస్తికుడు! నాస్తికులుగా చలామణీ అయ్యే ఆస్తికులు, ఆస్తికులమని వంచించే నాస్తికులు ఉన్న ఈ ప్రపంచంలో అందరి మంచిని కోరేవాడు, అందరిలోనూ మంచిని చూసేవాడే అసలైన దేవుడు!

నాలుగైదు ముఖాలు, డజన్లకొద్దీ కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళే దేవుళ్లు, దేవతలు అనుకోవడం అమాయకత్వం లేదా అజ్ఞానం! ఒక మహానుభావుడు చెప్పినట్లు (ఇతరుల గురించి చెడు మాట్లాడే విషయంలో మూగవాడు, పరాయివారి స్త్రీలను, ధనాన్ని, సుఖాన్ని చెడు చూపులతో చూసే విషయంలో అంధుడు, ఇతరుల రహస్యాల గురించి, బలహీనతల గురించి వినడంలో చెవిటివాడు, ఈ మూడు అంగ వైకల్యాలు ఉన్నవాడెవరో వాడే దేవుడు అని సారాంశం)- ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేనివాడు, ఇతరుల ఆస్తినిగాని, ఆలినిగాని, ఆశతోనో అసూయతోనో చూడలేనివాడూ, పరనిందను హర్షించనివాడు, అంటే ఆత్మస్తుతిని కూడా చేసుకోనివాడూ ఈ భూమి మీద నడయాడే నిజమైన దేవుడన్నమాట! ఆ దేవుడిపట్ల ఆ లక్షణాల పట్ల విశ్వాసం, ప్రేమ, ఉన్నవాడే ఆస్తికుడు! ఎంతోమందిని ప్రభావితం చేసిన మూడు కోతుల కథలోని 'చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు' అనే నీతి ఇక్కడినుంచి పుట్టినదే!

ఏది మంచి, ఏది చెడు అంటే, ఏది సర్వకాల సర్వావస్థల్లో అందరికీ ఆచరణ యోగ్యమో అదే మంచిది! ఏది ఏ ఒక్కరికీ కీడు తలపెట్టదో, దుఃఖాన్ని కలిగించదో, దేన్ని ఆచరించడంవల్ల ఎవరికీ, ఎప్పుడూ పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదో, సకల ప్రాణులకూ ఏది సుఖాన్ని, శాంతినీ ఇస్తుందో- అదే మంచిది. అదే ఉచితమైనది. ఇంతకన్నా భిన్నమైనది ఏదైనా చెడ్డది, అనుచితమైనది. ఈ జ్ఞానాన్ని కలిగినవాడే దేవుడు. ఆ దేవుడిని ఆదరించేవాడే, అనుసరించేవాడే ఆస్తికుడు! ఈ జ్ఞానం లేనివాడే రాక్షసుడు! వాడిని ఆదరించేవాడే, అనుసరించేవాడే నాస్తికుడు!

Read more...

ఎంత దిగజారిపోతున్నారీ వైద్యులు ?

>> Saturday, June 18, 2011

వైద్యో నారాయణోహరిః అన్నారు పెద్దలు ఆరోజు . కానీ నేడుకొందరు వైద్యుల డబ్బు యావచూస్తే వీళ్లను ఎంత నీచపదంతోసంబోధించినా తక్కువే అనిపిస్తున్నది. నాకు మరీ ఇంతగా అసహ్యం కలగటానికి రెండు ఉదాహరణలు చెబుతాను. మొన్న గుంటూరు వెళ్లాను మావిడను తీసుకుని . ఆవిడకు చెవులు దిబ్బడగా ఉన్నాయని.అలాగే కంట్లోమటలుగా ఉన్నాయని చూపించాలని. కృష్ణమహల్ సెంటర్లో ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. మంచి నైపుణ్యం గలవాడు. పదిహేణేళ్లక్రితం నేను చెవినొప్పితో వినుకొండలో కొత్తగా వచ్చిన ఒక ఈఎన్టీ డాక్టర్నుసంప్రదిస్తే ఆయన చెవిలో కర్ణభేరికి బొక్కపడింది అనిచెప్పి అదరగొట్టాడు. అతనివైద్యం తీసుకునే ధైర్యం లేక గుటూరు వెళ్ళి ఆ ఈఎన్టీ డాక్టర్కు చూపించాను . ఆయన పరీక్షించి ,చెవిలో రంధ్రం పడిందని చెప్పినవాడెవడు? వానికి పెట్టండి బొక్క ,అని ఎగతాళిచేసి . ఫంగస్ చేరిందని శుభ్రంచేసి ఓటెక్ అనే డ్రాప్స్ ఇచ్చాడు .అంతే నెప్పి మటుమాయం. ఈవిషయం గూర్చి మిత్రులమధ్య మాట్లాడేప్పుడు ,గుప్తాగారనే మితృడు జాగ్రత్త దుర్గేశ్వరగారూ ! మరలా వినుకొండలో ఈపిచ్చిడాక్టర్ దగ్గరకు వెళ్ళేరు, అదేమిటీ ! రంధ్రం లేదా ? నాలెక్కప్రకారం ఉండాలి .లేకపోతే నా అనిచెప్పి ఏఫోర్చిప్స్ తోనో పొడవనైనా పొడవగలడు అని హాస్యమాడేవారు.
నేను చాలామందికి సదరు డాక్టర్ గారి గూర్చి చెప్పి ఆయనదగ్గరకెళ్లటం మేలు అని సలహా ఇచ్చేవాడిని. సరే మొన్న మా ఆవిడను తీసుకుని వెళ్లాను . ఆయన అత్యంత బిజీ[ రాజీవ్ ఆరోగ్యపథకంతో]నట . వెళ్లాం ఓపీ చీటి తీసుకున్నాం.ఒక్కనిమిషం కూడా చూడలేదు పేషంట్ ను . ఏమీలేదన్నాడు .ప్రాబ్లెం ఏమిటీచెప్పకుండానే వేరే లాబ్ కు తెస్ట్ కు వెళ్లమన్నాడు . నాకు చిర్రె త్తుకొచ్చింది . పాపం ఈలోపలింకెవరో పేషంట్ వచ్చాడు . తన టెస్ట్లన్నీ చూపాడు.ఏదో నొప్పితగ్గలేదన్నాడు. ఎక్స్ రే తీయాలి అన్నాడు డాక్టర్ .తీశారు సార్ ! అని అదీ చూపాడు. నాకు నొప్పిబాబో అనిచెబుతున్నా ..నాకేం కనపదటం లేదు [నొప్పి రోగికయితే ...వీడికి కనపడటం లేదంటాడు] నాకేం కనపడటం లేదంటూ చేంతాడంత మందులచీటీ వ్రాసి చేతిలోపెట్టాడు . నాకు అసహ్యమెసింది ఈడాక్టర్ మీద. ఓపికౌంట్ చూడాలి .లేదంటే నాకు సమయంలేదు వేరేదగ్గరకెళ్లమనాలి! అంతేగాని రోగిదగ్గర డబ్బుతీసుకుని కూడా వాడిబాధనువినలేని అఈడాక్టర్లను అడ్డంగా నరకాలి అన్నంత కోపంవచ్చింది . ఇక పద అని మావిడను తీసుకుని వచ్చేశాను . ఇక ఈకార్పోరేట్ కల్చర్లో కూరుకున్న ఈవైద్యులదగ్గర మనం మంచివైద్యం ఆశించటం శుధ్ధదండుగ అని చెప్పి మరుసటిరోజు పెదకాకాని దగ్గర కంచికామకోటి పీఠం వారిచే నిర్వహించబడుతున్న శంకరనేత్రాలయం నకు తీసుకెళ్లాను .వాళ్ళు వందరూపాయలఫీజు మాత్రమే[నిరుపేదలకు ఫీజులేదు] చక్కగా ఆధునికపరికరాలతో టెస్ట్ చేసి అవసరమైన కొద్దిమమ్దులుమాత్రమే వ్రాసిచ్చారు

ఇక రెండవ సంఘటన . ఈమధ్య మాబంధువల కొకరికి పిస్టులా సమస్యవచ్చింది . అల్లోపతి వైద్యవిధానంలో గందరగోళంగా ఆపరేషన్లు అవీ చెబుతున్నారని ఆయుర్వేదం లో వైద్యంచేపించమని సలహాఇచ్చాను/[ మా నాన్నగారు ఆయుర్వేదవైద్యం బాగా చేసేవారు] . ఆంధ్రజ్యోతి పేపర్లో సలహాలిచ్చే ఆయుర్వేద వైద్యుల సలహాలను విని వీళ్ళు నిజమైన వైద్యులు .లోకోపకారులు అనే మూఢనమ్మకాన్ని పెంచుకున్నాను, .కేరళ వైద్యం .చాలా నిష్ణాతులు .ఆయుర్వేదం కనుక పెద్దగా ఖర్చుకూడా ఉండదు . అనిచెప్పి సదరు కేరళా ఆయుర్వేదడాక్టర్ తో ఫోన్లో మాట్లాడి వీళ్లను హైదరాబాద్ పంపాను. నామాట విని వెల్లినవీళ్ళదగ్గర టెస్ట్ లనిచెప్పి ఆరువేలు గుంజారు. వాల్లు లబొదిబోమంటుంటే ఏమిటి డాక్టర్ సమస్య అని నేనడిగితే ఆపరేషన్ చేయాలి .అరవైవేలవరకు ఖర్చవుతుందని వాల్లుచెప్పినమాటవిని నాకే కళ్ళుతిరిగాయి. మహాత్ములు తమజీవితాలనుత్యాగంచేసి శోధించి మానవాళికందించిన ఆయుర్వేదవిజ్ఞానంకూడా ఈ దుర్మార్గుల చేతిలోబడి ఎంత వ్యాపారాత్మకమయిపోయిందా అని ? మనసు విలవిలలాడింది . సరే ఇక చేసిన టెస్ట్ ఉ చాలు వచ్చేయండి అనిచెప్పి , మా నాన్నగారి డైరీలు తిరగేసి దీనికి ఉన్న ఔషధాన్ని తయారుచేసి వాడించాను. అడ్దసరం ఆకులరసంలో సైంధవలవణం కలిపి తయారుచేసిన ఔషధాన్ని సిరెంజ్ ద్వారా ఆపిస్టులాలోకి ఎక్కింపజెశాను పదిరోజులలో పిశ్టులా మానుపుండుపట్టింది . చాలాశులభమైన ప్రాకృతికమైన వైద్యవిధాన్నాన్ని జనులకమ్దిమ్చి సమాజపరంచేసిన మహర్షుల మార్గాన్ని మరచిపోయి ...ఈకిరాతకులైన వైద్యుల పాలబడుతున్న మన జీవితాలను రక్షించేదెవరిక ? ఎంత దుర్మార్గాలకు తెగించారీ వైద్యులు ? నిజంగా వీళ్లను కుంభీపాక నరకంలో పడవేస్తారు చచ్చాక.

Read more...

మనల్ని నియంత్రిస్తున్నది ఎవరు?

మనల్ని నియంత్రిస్తున్నది ఎవరు?
- నాయుని కృష్ణమూర్తి
నం రకరకాలుగా ఆలోచిస్తాం. రకరకాల పనులు చేస్తాం. ఆలోచనలు, పనుల్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కేవలం మంచివే ఎందుకుండకూడదు? అలాగే అన్నీ చెడు ఆలోచనలు, చెడు పనులే ఎందుకు చెయ్యకూడదు?

ఈ ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా చెప్పలేం. 'నువ్వీ చెడ్డపని ఎందుకు చేశావయ్యా?' అంటే, 'ఏమో! నా బుద్ధికి అలా తోచింది. చేశాను' అంటాం. 'మంచిపని ఎందుకు చేశా'వంటే కూడా అదే సమాధానం.

మన సమాధానంలో 'బుద్ధి' అనేది ఒకటి కారణంగా చెబుతున్నాం. ఈ బుద్ధి ఎక్కడినుంచి వచ్చింది?

మనలో మన కళ్లకు కొన్ని అవయవాలు కనిపిస్తాయి. చెయ్యి, కాలు, ముక్కు, నోరు లాంటివి. కళ్లకు కనబడని భాగాలు కూడా మనలో కొన్ని ఉన్నాయి. 'మనసు' కనబడదు, 'బుద్ధి' పనిచేస్తుంది కాని- అది ఎక్కడ ఉంటుందో తెలీదు. 'చిత్తం' ఒకోమారు ఒక్కోరకంగా అజ్ఞాపిస్తుంది. దాని ఉనికిని గ్రహించలేం. 'అహంకారం' ఎక్కడినుంచి పుట్టుకొస్తుందో అర్థం కాదు. ఈ నాలుగింటిని- మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం- అంతఃకరణం అంటారు. అంతఃకరణమంటే అంతరంగమే. మన హృదయమే!

కాబట్టి మనం ఉపయోగించే 'బుద్ధి' అనేది మన హృదయంలోని భాగమే.

బుద్ధికి ఎనిమిది గుణాలు ఉన్నాయి. 1. సేవ చేస్తుంది. 2. వింటుంది. 3. గ్రహిస్తుంది. 4. గుర్తు పెట్టుకొంటుంది. 5. వూహిస్తుంది. 6. పొరపాటు పడుతుంది. 7. అర్థం తెలుసుకొంటుంది. 8. తత్వజ్ఞానం పెంచుకొంటుంది.

'నా బుద్ధికి అలా తోచింది, చేశాను' అని- మనం చేసే మంచిని, చెడుని బుద్ధికి అంటగట్టేస్తున్నాం కదా! మనం చేసే మంచీ, చెడూ కేవలం బుద్ధివల్లనే జరుగుతున్నాయా?

బుద్ధితోపాటు మన అంతరంగంలో ఉన్న మనసు, చిత్తం, అహంకారం... అన్నీ కలిసి మనచేత పనులు చేయిస్తున్నాయి.

ఇవి స్వతంత్రంగా పనులు చేస్తాయా? దేనికదే విడివిడిగా నిర్వర్తిస్తాయా? వీటిచేత సమష్టిగా పనిచేయించే శక్తి ఏదైనా ఉందా?

అందరూ ఒకేరకంగా ఎందుకు ఆలోచించరు? ఒకే రకమైన పనులు ఎందుకు చెయ్యరు?

తరచి ఆలోచిస్తే మనకు బోధపడేది- ఒకరికి, ఇంకొకరికి మధ్య స్థాయీభేదం ఉందని. అంతఃకరణ స్థాయిని నిర్ణయించేది ఎవరు?

ఆ శక్తినే 'అంతర్యామి' అంటారు. మనలోపల అణువణువునా నిండిపోయి ఇంద్రియాలను నియంత్రించేది, వాటిచేత పని చేయించేది- అంతర్యామి.

జీవంలో ఉండే ఆత్మ అంతర్యామి. అంటే... జీవాత్మ ఇదే! పరమాత్మ కూడా ఇదే!

ఇక్కడా, అక్కడా అని భేదం లేకుండా మన సర్వస్వంలో నిండిన జీవాత్మను లేక పరమాత్మను దర్శించడానికి మనం చేసే ప్రయత్నమే తపస్సు.

రుషులు చేసిన తపస్సుకు ప్రయోజనం- లోని 'పరమాత్మ'ను దర్శించడం. మనం కళ్లు మూసుకొని చేసే ధ్యానం ప్రయోజనం కూడా అదే! 'మనల్ని మనం దర్శించుకోవడం'. ఆ దర్శనం జరిగితే జీవాత్మకు, పరమాత్మకు భేదం కనిపించదు. సృష్టికి మనకు భేదం ఉండదు.

అనంతమైన ఈ విశ్వంలో 'నేను' ఉన్నాను. 'నా'లో అనంతమైన విశ్వం ఇమిడి ఉంది!

Read more...

సర్వదేవ నమస్కారం...

>> Friday, June 17, 2011

సర్వదేవ నమస్కారం...
- చక్కిలం విజయలక్ష్మి
గవంతుడంటే ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? సాకారుడా, నిరాకారుడా, అందరికీ అందుబాటులోనివాడేనా? నిరాకారుడే అయితే నిరాకారాన్ని ఆరాధించటం అంత సులువైన సంగతేనా? దేవుడంటేనే అర్థం కాని దశలో ఈ నిరాకారపు గందరగోళం భక్తుణ్ని బెంబేలెత్తిస్తుంది. సాకారుడే అయితే ఆయనను చర్మచక్షువుల ఎదుట సాకారం చేసుకోవటం సాధ్యమయ్యే పనేనా? ఈ మీమాంసతోనే సతమతమయ్యే ప్రారంభ భక్తుడు ఆయన ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఏం చూపెట్టినా విశ్వసించని, విశ్వసించాలో లేదో అర్థంకాని అయోమయంలో ఉంటాడు. నిజమే. పరబ్రహ్మ ఒక్కడే. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన అంశలుగా, ఆయన ప్రతినిధులుగా అనేకం మన కళ్లముందే ఉన్నాయి. ఉన్నారు. అత్యంత గహనమూ, గుహ్యమూ అయిన తన తత్వాన్ని తెలుసుకోవటమూ, సాకారంగా దర్శించటమూ అందరికీ సాధ్యంకాదు కాబట్టే- అపార కరుణతో ఆయన తన అంశలను మనకు అందుబాటులోకి తెచ్చాడు. భక్తులు ఏమాత్రం ప్రగతిలేని తమ భక్తిసాధనల పట్ల మరీ నిరాశ చెంది భగవత్తత్వంపట్ల పూర్తి విముఖం కాకుండా- తన విభూతులున్న అనేక వస్తు, జీవజాలాల్ని తన ప్రతినిధులుగా భగవంతుడు లోకానికి వరంగా అందజేశాడు.

భగవంతుడు భావనామాత్ర సంతుష్టుడు. భక్తుడికి ఒక ఆలంబననిచ్చి, అతనికి దానిమీద భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగితే- దాన్ని ఆధారం చేసుకుని సాధనలు చేస్తే, భగవంతుడిగా భావిస్తే... ఆ ప్రేమను, తపనను, ఆర్తిని 'తనకై' అన్నట్లుగానే స్వీకరిస్తాడు. ఆనందిస్తాడు. ఆశీర్వదిస్తాడు. మనం గుర్తించగలగాలిగానీ ఎల్లెడలా ఈశ్వరుని ఐశ్వర్యం, విభూతులు, ప్రతినిధులు మనను తరింపజేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఎందరో సుపుత్రులు తల్లిదండ్రుల్ని సేవించి తరించారు. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టిన ఫలం పొంది తమ్ముడి మీద గెలుపొందాడు. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి సేవించిన శ్రవణకుమారుడి కథ అందరెరిగినదే. సాక్షాత్‌ శ్రీకృష్ణుడే బయటికి రమ్మని పిలిచినా తల్లిదండ్రుల సేవ ముగించాకే వస్తాననీ, అంతవరకు ఆగమనీ విశ్రమించేందుకు ఇటుకను చూపిన పాండురంగని కథా మనకు తెలియనిది కాదు. అలాగే తులసిని పూజించి పూజించి పునీతురాలైపోయిన రుక్మిణీదేవి ఆ తులసిదళంతోనే శ్రీకృష్ణుని తూచుకుని భక్తిస్వాధీనం చేసుకుంది. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. సూర్యనమస్కారాల ప్రాశస్త్యం తెలియని భారతీయుడుండడు. గతి తప్పని బాధ్యతా నిర్వహణనూ, అలుపెరుగని గమనసామర్థ్యానికీ సూర్యుడి తరవాతే ఎవరైనా. శ్రీరాముడంతటివానికే సూర్యస్తుతి 'ఆదిత్య హృదయ స్తోత్రం' విజయాన్ని సాధించిపెట్టిన ఘనత సాధించింది. జీవపోషకుడూ, కాలనిర్ణాయకుడూ భాస్కరుడు. ఆయన రానిరోజు ప్రపంచమే అంధకారబంధురమైపోతుంది. స్వయం ప్రకాశమానుడైన ఆదిత్యుడు మానవాళికి ప్రత్యక్ష దైవం. ఆరోగ్యప్రదాత. విజయకారకుడు. అలాగే గురువులు, జ్ఞానులు, నదులు, పర్వతాలు, వృక్షాలు, వల్మీకాలు, గోమాత... ఇవన్నీ, వీరందరూ దేవుని ప్రతిరూపాలు. దైవాంశలూ విభూతులూ ఐశ్వర్యాలు. ఈ దైవ విభూతుల్ని విశ్వసిద్దాం. పూజిద్దాం. తరిద్దాం. భగవంతుడు తన ప్రతిరూపాల ద్వారా, విభూతుల ద్వారా అందించిన ఈ ప్రత్యక్ష దైవాలను నిర్లక్ష్యం చేయవద్దు. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి.'



Read more...

వితండవాద మేధావులకు వాస్తవాలు మిగుండుపడవు

>> Thursday, June 16, 2011

మిత్రులందరికీ నమస్కారములు,
Sub :- చంద్ర గ్రహణం - tv9 విశ్లేషణ
నిన్న tv9 లోని విశ్లేషణ విన్న తరువాత నాకు ఈ క్రింది విషయాలు మీతో పంచుకోవాలనిపించింది.
ప్రతిసారి ప్రస్తుత శాస్త్రజ్ఞులకు మరియు మన జ్యోతిష పండితులకు పెద్ద యుద్దమే జరుగుతువుంటుంది.
మన వేదాలలో చెప్పిన వాటిని పరిశీలించి, పరిశోధించి విదేశీలు క్రొత్త విషయాలు చెబుతూవుంటే మనవాళ్ళకు ఇదేమి మాయ రోగం, అన్నిటిని మూడ నమ్మకాలూ అని కొట్టిపారేస్తున్నారు.
మహానుభావులు మన ఋషులు, మహర్షులు ఎంతోకాలము పరిశోధించి తపనచెంది, తపస్సుచేసి వేదాలలో దాగివున్న విషయాలను జ్యోతిష గ్రంధాల రూపంలో మనకు అందించారు.
వాళ్ళు నిజమైన శాస్త్రజ్ఞులు. వాళ్ళకి ఇవ్వాలి నోబెల్ బహుమతులు. నా అబిప్రాయంప్రకారం వాళ్ళుకూడా SCIENTISTS . కాళిదాసు, వరాహమిహిరుడు,జైమిని వాళ్ళందరూ గొప్ప శాస్త్రజ్ఞులు.
ఇప్పటివాళ్ళు వాటిని పరిశీలించడం లో తప్పు ఉండవచ్చుగాని శాస్త్రం తప్పు అంటే ఎలాగా .
న్యూటన్ కనుగొన్న తరువాతే ఆపిల్ పండు క్రింద పడిందా? అంతకుముందు పడలేదా? అంతకముందు కూడా పడింది. వున్న దానిని వీళ్ళు కనుగొన్నారు, లేనిదాన్ని కాదుగదా.
కంప్యుటర్ కన్నా వేగమగా మానవుడు లెక్కలను సాదిస్తున్నాడు . ఎలా ? మనవుడులో లేని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మరి ఎక్కడా లేవు. మానవుని మెదడుతో సమానమైన కంప్యుటర్ ఎక్కడ లేదు.
మానవుని మెదడు చూసి ఈ కంప్యుటర్ కనుగొన్నారు. మానవుని కన్ను చూసి CAMERA కనుగొన్నారు . ఏ electron పరికరం యినా దానిలోని వస్తువులు COMPONENTS ఈ పంచ భూతంలోనుంచి వచ్చినవే. అదే పంచ భూతంలతో తయారయిన మానవునికి సాద్యంకానిది ఏముంది. కంప్యుటర్ లో వుండే మైక్రో చిప్స్ లాంటివి కొన్ని వేలు మన మెదడు లో వున్నాయి. వాటితో మనము ఎన్నో సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ , టీవీ లు తయారుచేసుకోవచ్చు. దానికి కావలసిన అను సందాన ప్రక్రియ మనకు తెలియాలి. అదే తపస్సు. దాని ద్వార మన ఋషులు దూర దృష్టి, దూర శ్రవణం సాదించినారు. ఒక మైక్రో చిప్ లో వుండేది సిలికాన్ అంటే మట్టి.
ఒక RESISTOR లోవుండేది కార్బోన్ , ఒక CAPACITOR లో వుండేది కాగితం,మైకా. ఇవన్నీ కూడా మట్టిలోనుంచి వచ్చినవే. అదే మట్టి మన లో కూడా వుంది.
అంటే అన్ని COMPONENTS , ELEMENTS మనలోకుడా వున్నాయి. WE HAVE TO KNOW THE CIRCUIT ONLY, THE PROCEDURE,
HOW TO LINK UP. THIS WE WILL GET BY TAPANA. తపస్సు ద్వార మనము సాదించాలి.
మన ఋషుల కు ఇవ్వాలి నోబెల్ బహుమతులు. ఎన్ని ఇచ్చినా చాలవు.
రుషిబ్యోనమః

మీ
కామరాజుగడ్డ రామచంద్రరావు

Read more...

నడిచేదైవం

>> Tuesday, June 14, 2011


సర్వశ్రుతి శిరోరత్న సముద్భాసితమూర్తయే!

వేదాంతాభోజ సూర్యాయ తస్మై శ్రీ గురవేనమః!!

నడిచేదేవుడు, జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారి 118 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. నేటికీ ఆయనను నమ్ము కున్నవారిని కన్న బిడ్డల వలె కాపాడుతూ. సనాతన ధర్మాచరణం చేసేవారికి మార్గదర్శియై ఎందరో శిష్యులకు నేటికీ ఆచార్యస్థానంలో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సద్గురువులు, వారి గురించి చెప్పడానికి ఇంత అని ఏముంది... పరమాచార్య మరో శంకరావతారమే, పరమాచార్య పరమాచార్యయే, సముద్రానికి, రామ రావణ యుద్దానికి, పరమాచార్యకు ఉపమానాలు లేవు.

విభూతిః ఫాలాగ్రే శిరసి తులసీ బిల్వవలయో

గలే రుద్రాక్షాలిః స్వితవిలసితం చారు వదనే,

కరే వామే దణ్డస్తదితరకరే జ్ఙానకరణం

పురస్తాదాస్తాం మే భరతజనతాహోపురుషికా.. (పు, శ్రీ రామ చంద్రుడు)

అన్ని మాటలేల.. ఆయన ప్రత్యక్ష శిష్యులు అన్నట్టు ఆయన "నడిచేదేవుడు"...

సమాగతో నా భవదీక్షణక్షణ

ప్రక్షీణ సర్వాక్షమలోమలాన్తరః

నిక్షిప్త చిత్తో భగవత్యధోక్షజే

ముముక్షువర్యో భవతి క్షణేన వై........ (శ్రీ క్రిష్ణ శాస్త్రి)

స్వామీ, మీ కడగంటి చూపు ఎవరిపై పడుతుందో, వాడు ఎంతటివాడైనా ఇంద్రియ చాంచల్యం నశిస్తుంది, మనస్సు శుద్ధిని పొందుతుంది, అంతః కరణము భగవత్పాదములతో లగ్నమవుతుంది ఇదంతా మీ కడగంటి చూపు ప్రసరించిన క్షణకాలంలో జరిగుతుంది.

అలాగే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు (చందోలు శాస్త్రిగారు) శ్రీ చరణులగురించి చెప్పమంటే, " అది నడుస్తున్న బ్రహ్మ పదార్థము, దానిని గురించి పలుకుట ఎలా సాధ్యము", (యతో వాచే నివర్తన్తే... మనస్సు బుద్ది, వాక్కు ఎక్కడ ఆగిపోతాయో అక్కడే పరబ్రహ్మము ఉంటుంది) అని అన్నారు.

ఇక "విశాఖ" గారు జగద్గురు బోధలు పుస్తకాలలో స్వామి గురించి రాస్తూ ఎంత పొంగిపోయారో...

చిరునగవు మొగమున చిందులాడే స్వామి

బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి!!

కఠిన నియమాలతో కరడుకట్టిన స్వామి

కామాక్షి పాదముల పరవశించెడు స్వామి!!

రుద్రనమకాలతో నిర్ణిద్రుడగు స్వామి

వేదాంత వీధులలో దేలిపోయెడు స్వామి!!

శాంతుడై దాంతుడై శాశ్వతానందుడై

సచ్ఛిష్య సందోహస్తుత్యుడై మౌనియై!!

జ్ఙానియై జ్ఙేయుడై సన్మార్గగామియై

కామకోటిపీఠ శంకరాచార్యుడై!!

షణ్మతస్థాపనాచార్యుడై వెలుగుచు

ఆశ్రయించెడు వారి కభయమిచ్చెడు స్వామి!!

చిరునగవు మొగమున చిందులాడే స్వామి

బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి!!

...............

అందరి మనస్సులలో నిత్యం నడిచే స్వామి, మా స్వామి, మన స్వామి అటువంటి స్వామి వారి 118 వ జన్మదిన వేడుకలు కంచిలో మూడురోజులనుంచి నేటివరకు కొనసాగుతున్నాయి, మనం కంచిలో లేకపోతేనేం మన మనస్సే కంచి గా మార్చి స్వామిని మన మనస్సులోనే నిలుపుకుందాం..

ఒక్కసారి, స్వామి రచించిన మైత్రీంభజతాం... కీర్తనను సర్వమానవాళి అభ్యుదయంకోసం, శ్రేయస్సుకోసం చదువుకుందాం....

సర్వం శ్రీ చంద్రశేఖర యతీంద్ర చరణారవిందార్పణమస్తు....

[naagendra ayyamgaari]

Read more...

బట్టలుతికిన నీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటివారికి కీడట జాగ్రత్త

>> Monday, June 13, 2011


మన మహిళామతల్లులు కొందరు బట్టలుతికిన తరువాత ఆ నీళ్లను కాళ్లమీద గుమ్మరించుకుంటారు. అలాచేయటంవలన ఆమె పుట్టింటివారికి కీడుజరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అందువలన మీరు జాగ్రత్తవహించాలని సోదరీమణులను కోరుతున్నాను.
ఆ ! మరీ ఛాదస్తం .నీళ్ళు కాళ్లపై పోసుకోవటమ్ తో కూడా కీడా ? మరీ మూఢనమ్మకాలని కొట్టిపారేయకండి. మనవాళ్లు ఏదిచెప్పినా దానివెనుక శాస్త్రీయ కారణాలుంటాయి . ఆలోచించే ఓపికా పరిశీలించే శ్రద్దాలేక ఈవిజ్ఞానం తెలియని సోమరిపోతులు చేసిన దుష్ప్రచారలతో మనం మన పెద్దలమాటలన్నీఅబద్దమేమోనన్న అపనమ్మకంలో మునిగిపోయాం మరి .
విషయమేమిటంటే సహజంగా విడిచిన గుడ్డలలో దుమ్ముధూళీ కణాలలో నిండుగా క్రిములు చేరిఉంటాయి.మధ్యతరగతి దిగువతరగతి ఆడవాళ్ళు స్వయంగా ఇంటిలోని బట్టలు ఉతుక్కుంటారు .అయితే సహజంగా వీరి పాదాలు పగుళ్ళు ఉంటాయి. ఎక్కువగా నీటిలోనూ తడుస్తుంటాయి . బట్టలుతుకిన నీళ్లలో నిండుగా క్రిములుంటాయి .ఆనీటిని కాళ్లమీదపోస్కుకుంటే ఆపగుళ్లద్వారా శరీరం లోకి ప్రవేశించే అవకాశం ఉంది . అలా చేరి ఆమె రోగగ్రస్తమయితే ఆమెను భర్త ఆమెను పుట్టింఇకి వెళ్లగొట్టే అవకాశం ఉంది .ఇది ఆమెపుట్టింటికి కీడేకదా !?
మామూలుగా అలా చేయొద్దని చెబితే పట్టించుకోని స్త్రీలు పుట్టింటికి కీడు అంటే మాత్రం శ్రధ్ధచూపుతారని పెద్దలు ఇలా చెప్పి ఉంటారు . ఇంతటి వైజ్ఞానిక దృష్టి,దాన్ని తరతరాలవరకు ఆచరించేలా సాంప్రదాయాలను ఏర్పరచిన మన పెద్దలకు మరో సారి నమస్కరిద్దాం.

Read more...

అన్నింటాముద్దు మరి ఆడపిల్లఎందుకొద్దు ?

>> Saturday, June 11, 2011

People always pray for a boy
FunFunky.Com

not for a girl


FunFunky.Com

blessings of elders are for male


FunFunky.Com

not for female


FunFunky.Com

but in need of wealth


FunFunky.Com

people pray to ma laxmi


FunFunky.Com

for success in education


FunFunky.Com

people pray to ma saraswati


FunFunky.Com

for removal of tension


FunFunky.Com

people pray to ma ambaji


FunFunky.Com

and to escape from the devil


FunFunky.Com

people pray to ma kali


FunFunky.Com

now tell me, why do people hesitate to have a female in the family,


FunFunky.ComFunFunky.ComFunFunky.Com

while those whom they pray to during trouble, are females?



save the girl child!!!





FunFunky.ComFunFunky.ComFunFunky.Com

if u don't forward this message, nothing will happen to u,


your life will be as normal as it is now,
you won't get any curse if u delete this mail...


but forwarding it will surely spread the beautiful message!!


let's give unconditional love to the girl child!!!



FunFunky.ComFunFunky.Com

FunFunky.Com






Read more...

చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుంది ? ఎక్కడకెళుతుంది?

>> Thursday, June 9, 2011

స్వామి నిగమానంద సరస్వతి తో బస్తర్ మహారాజా ప్రపుల్ల చంద్రదేవ్ గారి ఆస్థానవైద్యులు డాక్టర్ మిచెల్
గారు జరిపిన ఆసక్తికరమైన చర్చ .

డా //మిఛెల్ ః- మీరు అనుమతిస్తే పరలోక విషయాలగురించి కొన్ని అడగనా ?
స్వామి నిగమానంద ; చాలాకాలంపాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం
చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు. ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం.
చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపుల్నుమ్చి ముడుచుకుపోయి మస్తిష్కం మీద ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ,మనస్సునూబుద్ధినీ కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" [వాయువుకనుక దేన్నీ ఆశ్రయించకుండా] అన్న అవస్థ ఏర్పడటం వల్ల,కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది . మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకపు ఆత్మను కొందరు మరణించకముందే చూడగలుగుతారు. ఆ ఆత్మ అతన్ని [దాన్ని] నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్లటానికి సిధ్ధంగా ఉంటుంది.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది .మొదటినుంచే మస్తకం[తల]మీద ఒక తేజోమయ శరీరం ఉంటూంటుంది. దానికి సూక్ష్మమయిన దారంతో స్థూలశరీరంతో సంబంధం ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి.ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ చూపు వచ్చినవాడికి[జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి] ఈ ఆట స్పష్టంగా కనిపిస్తుంది.
లోకాలు ఏడున్నాయి. ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి స్థరాలు[పొరలు]ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళీ కర్మానుసారంగా ఒక విశేషస్తరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్తరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మపైకిలేవగల్దు.క్రిందకు పడగలదు. ఇది ఆత్మఘనంలా నిర్మాణమయి ఉంటుంది . మహర్లోకంలో అనుభవించవలసిన కారణమ్ ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది.వీతికికూడా పైన ఒకలోకం ఉంటుంది. దీన్నిగురించి ఇతర సంప్రదాయములవాల్లెరుగరు. దాన్ని నిత్యలోకం లేక భావలోకం అంటారు. ఈ లోకానికి సంబంధించినదంతా అతి విచిత్రంగానూ రహస్యమయంగానూ ఉంటుంది .

డా మిఛెల్ ః -- మంచిది స్వామీజీ ! భూతప్రేతాలనుగూర్చి మీ అభిప్రాయం ఏమిటి ?
స్వామి నిగమానంద ః --- చనిపోయిన తరువాత అసంతృప్తిగల ఆత్మకు ఉండే వాయురూపాన్నిభూతమనీ,ప్రేతమనీ అంటుంటారు. కింది స్థాయి మనిషి,లేదా ఆత్మహత్యచేసుకున్నవాడుచాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది.అతను చచ్చిపోవడమయితే జరిగింది,కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సమవత్సరాలు పడుతుంది .ఎందుచేతనంటే అతని ఆత్మ ఆసమయంలో గాఢసుషుప్తలో ఉంటుంది. భూతప్రేతాలు మనుష్యశరీరాన్ని ధరించడం సులువుకాదు. అనేకప్రయత్నాలు చేసినమీదట అది భాష్పీయ[ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పంఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుందికూడా . కానీ ఆ శరీరం సమాన్యకారణాలవల్ల కరిగిపోగలదు.పరలోక గతమయిన ఆత్మ రక్తసంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు. పమ్చభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు,. . ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని,భాజాలు,సంగీతం,లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.
డా//మిఛెయిల్ ః-- చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళేదెక్కడికి ?
స్వామి నిగమానంద ః-- సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం.స్వర్గలోకం వరకు చేరుతుంది.మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగ మిగిలిఉంటుంది .ఆవాయుశరీరాన్ని ఆధారమ్ చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంతవరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలిఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారన చేయవలసి ఉంటుంది.
డా.మిఛెల్ ః--- ఆజీవి భూలోకానికి చేరేదెలా ?
నిగమానంద సరస్వతి ః- అతను స్వర్గంలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బులద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు.దాన్ని మనుషులు తినవచ్చులేదా పశువులు తింటాయిఅలా తిండిద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లికడుపులోకి చేరుతాడు.మనిషిగాగాని లేదా పశువుగానైనా ఏదో ఒకజీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆజీవి జన్మ .అంతకుపూర్వం అనుభవించగా మిగిలిఉన్నదాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈవిధంగా ఆజీవిభోగం[అనుభవం]పూర్తవుతుంది.

Read more...

లోకాభి రాముడు

>> Tuesday, June 7, 2011


లోకాభి రాముడు
- కిల్లాన మోహన్‌బాబు
న సంస్కృతితో మమేకమైనది మనోజ్ఞ రామనామం. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సత్యవ్రతుడు, వినయశీలి, మధురభాషి. బుద్ధిలో బృహస్పతిని మించినవాడు. పరాక్రమంతో పరశురాముణ్ని పడగొట్టినవాడు. అన్నింటికీ మించి ప్రజాక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పాలించిన ప్రభువు. కుటుంబం, సోదరులు, భార్య... ఎవరైనా- ప్రజల తరవాతనే అని భావించి, ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. ప్రజామన్ననలు రామునిలా చూరగొన్న మరొక రాజు పురాణ పుటల్లో కనిపించడు. రఘుమౌళి కఠోర బ్రహ్మచర్యనిష్ఠాపరుడు. తమ రాజు అడవుల్లో అష్టకష్టాలు పడుతుంటే తాము అయోధ్యలో సుఖసంతోషాలతో ఎలా ఉండగలమని స్వచ్ఛందంగా పౌరులే పద్నాలుగేళ్లు బ్రహ్మచర్యం పాటించడం- ఆయనపట్ల అపార ప్రజాభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం!

ఏ వైరమూ లేకుండా చెట్టుచాటునుంచి తననెందుకు వధించావని వాలి ఆఖరి ఘడియల్లో ప్రశ్నిస్తే- రఘురాముడు చెప్పిన ధర్మరహస్యం రసరంజితం. పరమాత్మకు తప్ప పరమధార్మికులకు సైతం ఇది సాంతం అర్థం కాదు. పరిశుద్ధ హృదయ దర్పణంతో పరిశీలిస్తేనే ధర్మసూక్ష్మం అందులో ప్రతిబింబిస్తుంది. వాలి మెడలో ధరించిన కాంచనమాల గతంలో సాక్షాత్తు విష్ణువే దేవాంతర రూపంలో ప్రసాదించనది. ఆ మాల ధరించి యుద్ధం చేస్తే ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా ఎదిరి నిలువలేడు. ఆ వరబలం వాలికున్నంతవరకు కోదండరాముడు తలపడినా దాని ప్రభావంనుంచి తప్పించుకోలేడు. పైగా కూతురితో సమానమైన సుగ్రీవపత్నిని చెరపట్టి అధర్మానికి పాల్పడ్డ వాలి దండనార్హుడు. వానరజాతిలో అలాంటి సంప్రదాయం ఉన్నప్పటికీ భర్త మరణించిన తరవాత మాత్రమే అది సాధ్యపడుతుంది. ధర్మసంరక్షణార్థం భరతుడి ప్రతినిధిగా అధర్మపరుణ్ని అణచడం అన్యాయం కాదు. రాక్షస సంహారం కోసం తాను మానవజన్మ ఎత్తాననీ ఇందుకోసం ఇంద్రుని అంశతో వాలి ముందుగానే జన్మించినట్లు చెబుతాడు. రానున్న రామరావణ సంగ్రామంలో వానర సహాయం అనివార్యమని అంటాడు. తద్భిన్నంగా వాలి రావణునితో మైత్రి పెంచుకోవడమూ అధర్మం కిందికే వస్తుందని ఆయన విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. పితృద్రోహం, దేవద్రోహం దోషాలు అంటకుండా వధించానని వాలికి కనువిప్పు కలిగిస్తాడు.

వాల్మీకి రామాయణాన్నే అందరూ ప్రామాణికంగా స్వీకరిస్తారు. చిత్రంగా- ప్రస్తుతం ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ఈ కావ్యంలో కనిపించవు. ఉదాహరణకు- అహల్య రాయిగా మారడం, లక్ష్మణుడు రేఖలు గీయడం, శృంగిబేరపురం బోయరాజైన గుహుడు స్వయంగా నది దాటించడం, రావణబ్రహ్మ కడుపులో అమృత భాండం ఉండటం వంటివి మనకు గోచరించవు. వాల్మీకి తరవాత తులసి, భాస్కర, మొల్ల, ఇటీవల విశ్వనాథ వంటివారు రామాయణాన్ని తమదైన శైలిలో రచించి తరించారు. మూలకథకు భంగం వాటిల్లకుండా నాటకీయతకోసం మార్చిన ఘటనలు ఈ కావ్యానికి వన్నె తెచ్చాయేకాని చిన్నబుచ్చలేదు! ఇంతటి ఘనచరిత్ర కలిగిన సూర్యతేజస్వి, చంద్ర కౌముదీ వర్చస్వి, శుభయశస్వి అయిన లోకాభిరాముడికి వాడవాడలా, పల్లెపల్లెనా మందిరాలు నిర్మించి నిత్యం పూజించడం మానవాళికి దక్కిన పుణ్యఫలం!

Read more...

ప్రేమయాగం

>> Sunday, June 5, 2011

ప్రేమయాగం
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
సృష్టికి మూలాధారమైన రెండు బీజాక్షరాల పవిత్రశబ్దం ప్రేమ. ప్రాణికోటి మనుగడకు అదొక అద్భుతమైన వరం. ఎంతటివారినైనా వశం చేసుకోగలిగే తీయనైన శరం. ప్రకృతిలో ప్రతి వస్తువూ నరుడికి ఎన్నో రూపాల్లో ప్రేమను ప్రసాదిస్తోంది. నరుడు ఆ ప్రేమను తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు. ధరణి ప్రేమతో అన్నీ సహిస్తోంది. మబ్బు ప్రేమతో నీరిస్తోంది. గాలి ప్రేమతో వూపిరినిస్తోంది. అగ్ని ప్రేమతో జీవం ఇస్తోంది. ఇవన్నీ అనుభవిస్తూ కృతజ్ఞతగా కనీసం ప్రేమను ప్రకటిస్తున్నామా? లేదు. భూమిని, వాయువును, జలాన్ని అన్నిటినీ కలుషితం చేస్తున్నాం. ఇది ఇలా ఉంచి, కనీసం సాటి మనిషిని ప్రేమగా చూడలేకపోతున్నాం, ప్రేమతో పలకరించలేకపోతున్నాం.

కారణమేమీ లేకుండా మనిషిని కట్టి పడేసేది ప్రేమ ఒక్కటే! పౌరాణిక వాఞ్మయమంతా మనకు ఇదే ప్రేమసూత్రాన్ని ప్రబోధించింది. మదర్‌ థెరెసా, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, బాపూజీ వంటి మహామహుల ప్రేమామృత బిందువులనే ఇవాళ మనం రుచి చూస్తూ జీవిస్తున్నాం. భావితరాలకు ప్రేమను అందించాల్సిన గురుతర బాధ్యత మనమీద ఉందన్న సత్యాన్ని ఎన్నడూ మరువకూడదు. పిల్లలకు మనమిస్తున్న ప్రేమను ధనార్జనా వ్యామోహమనే దుర్లక్షణం ఆక్రమించేస్తోంది. పాశ్చాత్య సభ్యతా-సంస్కృతుల విషపునీడలు పడుతున్నాయి మన వాత్సల్యాలపైన. పరిహారంగా, పశ్చాత్తాపంతో రేపటి చరితకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.

ప్రేమనేది పొలాల్లో పండదు, బజారులో విక్రయించరు. చక్రవర్తిగానీ, ప్రజలుకానీ- ఎవరైనాసరే అహంకారాన్ని అంతా ఇచ్చేస్తే చాలు, అది దొరికిపోతుంది సులభంగా- అంటాడు కబీర్‌దాసు. ఈ అహంకారం పోగొట్టుకోవడానికి ఒకటే మార్గం. జ్ఞానార్జన చేయాలి. అందుకెన్నో మార్గాలున్నాయి. అవన్నీ పలు సందర్భాల్లో మన పెద్దవాళ్లు చెబుతూనే ఉన్నారు. అనుసరించలేకపోతే, ఆచరించలేకపోతే అది మన ఖర్మ.

ఇతర ప్రాణికోటిని నిశితంగా పరిశీలించండి. గోవు ఈనిన తక్షణం పుట్టిన దూడ శరీరాన్ని నాకుతూ శుభ్రపరుస్తుంది. తనలో పొంగిపొర్లుతున్న వాత్సల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది! అలాగే ప్రతి పక్షీ, జంతువూ తమ బిడ్డల్ని ఎంత ప్రేమగానో చూసుకుంటాయి. ఒక కాకి చనిపోయి కిందపడిపోతే ఎన్ని కాకులు 'కా కా' అంటూ గుంపులు గుంపులుగా వచ్చి తమ సంతాపాన్నీ, దుఃఖాన్నీ వ్యక్తం చేస్తాయో గమనిస్తూనే ఉంటాం. ఒక్క అన్నంముద్ద పడేస్తే చాలు, కుక్క మన పాదాలను ముద్దాడుతూ అక్కడే కూర్చుని ఉంటుంది. ఎంతటి మేధావులు, పండితులు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ప్రవక్తలు, బోధకులు, సాధకులు అయినా 'ప్రేమ' అనే రెండక్షరాల్లోని అపార మహిమను తెలుసుకోలేకపోతే వాళ్ల విద్యార్హతలన్నీ నిరర్థకాలే. శత్రువుల్ని మిత్రులుగా మార్చే ఈ ప్రేమను, సేవాభావాన్ని పెంచే ఈ ప్రేమను మన జీవితాల్లోకి సదా ఆహ్వానించాలి.

తనవితీరా ఆస్వాదించి అనుభవించవలసిందీ, పదుగురికీ పంచవలసిందీ ప్రేమను. అది విశ్వశాంతిని విరాజిల్లజేసే పరీమళ ప్రవాహం. ఎక్కడ ఎవరినుంచి సంప్రాప్తించినా కళ్లకద్దుకొని స్వీకరించదగిన దివ్యప్రసాదం. ప్రేమ తపస్సు, ప్రేమ ఉషస్సు, దేవతలను ప్రసన్నం చేసే హవిస్సు. అనుబంధ వారధి, అనురాగ వారిధి, ఆదర్శ జీవన రథసారథి. అది హృదయ వీణాతంత్రుల్ని మృదువుగా మీటే స్వర మంత్రాక్షరి. అహపుపొరల్ని చీల్చే ఇహలోక ఆనందఝరి. ఇంటింటా శాశ్వతంగా వెలసి ఉండవలసిన సంతోషాల సిరి. ప్రపంచీకరణ విషవలయంలో చిక్కుకున్న మన హృదయాల్లో 'ప్రేమ' వ్యాపారం, స్వార్థం, సంపాదన, అత్యాశల్లాంటి అవతారాలెత్తి కలియుగ జగతిని క్షీణ, హీన, దీన దయనీయ దశకు తీసుకుపోతోంది. వేదనకు ఔషధంగా, రోదనకు సాంత్వనంగా పనిచేసేది ప్రేమ! కమలంలోని కోమలత్వాన్నీ, వెన్నలోని మృదుత్వాన్నీ, వెన్నెలలోని చల్లదనాన్నీ, మాతృభాషలోని మాధుర్యాన్నీ ద్విగుణీకృతం చేసే ఈ ప్రేమను వర్ధిల్లజేయాలి. హృదయ సౌందర్యానికీ, ఆత్మసౌందర్యానికీ మెరుగులు దిద్దే ఈ ప్రేమయాగంలో మనం సమిధలమవుదాం. ప్రేమరాగంలో స్వరాలమవుదాం!



Read more...

సమర్థుడి ఆశ్రయం

>> Friday, June 3, 2011

సమర్థుడి ఆశ్రయం
- అప్పరుసు రమాకాంతరావు
జీవితకాలంలో ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరోఒకర్ని ఆశ్రయించక తప్పదు. మనకు ఎన్నో అవసరాలుంటాయి. వాటికోసం మరొకరిని ఆశ్రయిస్తాం. ఏ ఆశ్రయం లేకుండా మనిషి జీవించలేడు. దేనికోసమైనా ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సి వచ్చినపుడు సద్గుణుడు సమర్థుడైన వాడినే ఆశ్రయించాలని పిప్పలాదుడు రచించిన గుణార్ణవం సూచిస్తోంది. మనం ఆశ్రయం పొందాల్సిన వ్యక్తి యశోవంతుడై ఉండాలి. కార్యం సఫలం కావడానికి కొంత ఆలస్యం జరిగినా యశోవంతుడు ఆశ్రితుల కార్యాన్ని సాఫల్యం చేస్తాడు. సుగ్రీవుడు శ్రీరాముని ఆశ్రయించాడు. వాలిని సంహరించడంలో కొంత ఆలస్యమైనా కిష్కింధకు సుగ్రీవుడు రాజయ్యాడు. కైకేయి మంధరను ఆశ్రయించింది. అది హీన ఆశ్రయం. అలాంటి ఆశ్రితులవల్ల అనర్థాలు సంభవిస్తాయి. దశరథుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. లంకాధీశుడు రావణుడు పరస్త్రీ కోసం శూర్పణఖను, కాలనేమిని ఆశ్రయించాడు. ఫలితంగా సర్వనాశనమే జరిగింది.

మనిషికి వివేకం, విచక్షణ అవసరం. హీనమైన కోరికలతో ఆశ్రయిస్తే సమర్థుడైనా సరే ఆశ్రిత రక్షణ చేయలేడు. పర్ణశాలలో ఉన్నప్పుడు సీత బంగారు జింకకోసం శ్రీరాముణ్ని ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాముడితో వియోగం ఏర్పడింది. విభీషణుడి కథ మనకు తెలిసిందే. సొంత అన్నను కాదని శ్రీరాముడి ఆశ్రయం పొందాడు. యశోవంతుడు, సమర్థుడు కానప్పుడు తన రక్త సంబంధీకులను సైతం త్యజించాలని రామాయణంలోని ఘట్టాలు తెలుపుతున్నాయి. మహాపురుషుల ఆశ్రయాన్ని స్వీకరించినవారికీ గొప్పతనం అబ్బుతుంది. ఎటువంటి ఆధారం లేని శబరి శ్రీరాముడి ఆశ్రయాన్ని స్వీకరించి మహాత్మురాలిగా మారింది. మహాపురుషులూ ఒక్కొక్కసారి తమకన్నా చిన్నవారి ఆశ్రయం పొందాల్సి వస్తుంది. గోదావరి నదిని దాటాల్సిన సందర్భంలో గుహుడి సహాయాన్ని శ్రీరాముడు అర్థించాడు. మహాభారతంలో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు లాంటి వీరులూ అసమర్థులైన కౌరవుల ఆశ్రయంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. బలహీనుడైన విరాటరాజు యశోవంతుడైన ధర్మరాజు (కంకుభట్టు)కిచ్చిన ఆశ్రయంవల్ల గోగ్రహణంలో కౌరవులను ఓడించగలిగాడు. రాధేయుడు హీనాశ్రయం వల్ల హీనస్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సమకాలీన సమాజంలోనూ గొప్పవారిని, హృదయవైశాల్యం కలవారినీ, నీతిమంతులనే ఆశ్రయించక తప్పదు. సంపదలు విరివిగా లభించినా హీనుల ఆశ్రయం తగదని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. మన అవసరాలు తీరడంలో ఆలస్యం జరిగినా సమర్థులే మనకు మేలుచేస్తారు. సంపదలు కలిగి హీనుడైన మిత్రుడికన్నా సిరులు లేని యశోవంతుడు వివేకవంతుడైన శత్రువు మేలని చాణక్యుడు చెప్పిన నీతివాక్యం అన్నివేళలా ఆచరణీయం!



Read more...

జ్ఞాన సూర్యుడు

>> Thursday, June 2, 2011


నిర్వాణ శిఖరంపై మెరిసిన అమృత జ్యోతిర్నివహం. బోధివృక్షం ఛాయలో ధర్మమే తపస్సు చేసి పునీతమైంది. పాశవిక మరుభూమిలో మానవతా బీజం రాలింది. ఆ మానవతకు చరిత్ర బుద్ధునిగా నామకరణం చేసింది. ఆ మానవతలో పల్లవించిన దివ్యత్వాన్ని యుగాలుగా మానవాళి ప్రియాతిప్రియంగా ఆరాధిస్తూ వచ్చింది.

మానవాళికి కొత్తవెలుగు ఇవ్వడానికి జీవితాన్ని పణంగా పెట్టిన మహనీయుడు. సత్యాన్వేషణకు, మానవాళి విముక్తి కోసం స్వసుఖాలను త్యాగం చేసిన యుగపురుషుడు. అపరిపూర్ణమైన, నిండుతనం లేని మానవజీవితం కాలం రాకాసి హస్తాలకు అందని ఆనందం కోసం, ప్రపంచమనే చీకటి ప్రశ్నకు సమాధానం చెప్పగల జ్ఞానంకోసం యుగాలుగా అన్వేషిస్తున్నది. పరిపూర్ణత్వం కోసం, శాశ్వతత్వం కోసం జరిగే వేటలో బాధను జయించడమే కాదు, ఏనాటికీ అంతరించని ఆనందం సాధించాలన్న రెండు గమ్యాలు కలగలసి ఉన్నాయి. ఎంత సుఖాన్ని పొందినా చివరికి మిగిలేది దుఃఖం. ఇదీ ప్రపంచం. ఎన్నిజన్మలు గడిచినా అంతే.

ఉద్వేగాలు, ఉద్రేకాలు, అహంకారం, మనోచైతన్యంనుంచి దూరంగా వెళ్ళగలిగినవాడికి విముక్తి దగ్గరవుతుంది. ఉదాత్తమైన భావాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఏది కావాలనుకుంటే అదే అవుతాం. మనసు సునిర్మలమై, స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం మనల్ని నీడలాగా అనుసరిస్తుంది. అది మనల్ని వదిలి వెళ్లదు. మన గమ్యం నిర్వాణం. మన భావం, చైతన్యం ఆ ఔన్నత్యం చేరు కున్నప్పుడు- దుఃఖం, అహం వాటంతట అవే రాలిపోతాయి.

పెద్ద నక్షత్రం వైపు చిన్నగోళం సమీపించినప్పుడు, నక్షత్రం ఆకర్షణ శక్తికి లోనై ఆ గోళం నక్షత్ర పదార్థంలోకి వెళ్ళి కలిసిపోతుంది. ఆకాంక్షించే చైతన్యం నిర్వాణాన్ని గమ్యంగా నిర్దేశించుకున్నప్పుడు, మన ప్రయత్నం ఒక బిందువు వద్ద ఆగిపోయి నిర్వాణంలోకి దారి తీస్తుంది. మన భౌతిక, మానసిక చైతన్య చలనాలు మనం దాటలేని అడ్డుగోడలు కావు. వాటికి మించినవారం మనం. అవి మనల్ని రెండుగా చీల్చలేవు. నిర్వాణంనుంచి దూరం చేయలేవు.

నిర్వాణం శూన్యం కాదు. వేదాంతద్రష్టలు చవిచూసిన ఆనందమే అది. అయితే కోరికలు తీర్చుకోవడానికి విశ్వాధినేత అయిన భగవంతుణ్ని ప్రార్థించడం, ఆ కోరికలు తీరక మళ్ళీ జన్మలెత్తడం... ఇవి బుద్ధుడికి నచ్చలేదు. అన్ని పరిమితులనుంచి, అల్ప వాంఛల నుంచి అనంత, విశ్వతీర నిర్వాణస్థితిలోకి ప్రయాణించడానికి అడ్డుపడే తాత్విక సిద్ధాంతాలపట్ల ఆయన ఉదాత్త మౌనం దాల్చారు.

సామాన్య జీవితంలోని సౌందర్య రస స్పందనలకు దూరంగా నిష్క్రియాత్మకమైన, నిరాసక్తమైన, నిస్తేజమైన సందేశం బుద్ధుడు ఇవ్వలేదు. బుద్ధుడు తన ఆత్మను కాపాడుకోవడం కోసం, తన ఆత్మోపలబ్ధిలో మునిగిపోలేదు. వ్యక్తిగత విముక్తి సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఆ వెలుగులు పంచాడు. సౌందర్యం, వివేకం, సేవానిరతి- జీవజలాలు అందించే వెల్లువలా ప్రవహించాయి. కళలు, సముజ్జ్వల సమృద్ధి నిండిన నాగరికత ప్రభవించింది. బుద్ధుడు కేవలం తత్వవేత్త, నీతి సూత్రాలు వల్లించే ధర్మవేత్తకాదు. ఆధ్యాత్మిక కాంతిశిఖరాల్లో భాసించే ఒక క్రాంతదర్శి. కారుణ్య ప్రవక్త. వాత్సల్య తపస్వి.

దీనజనులపట్ల మానవాళి చరిత్రలో మొదటిసారిగా అపరిమితమైన, అవ్యాజమైన ప్రేమ, వాత్సల్యాలు ప్రదర్శించిన అవతారం బుద్ధుడనే చెప్పాలి. అశ్రువిలయంనుంచి వారిని విముక్తుల్ని చేయడమే ఆ ప్రేమ లక్ష్యం.

కేవలం ప్రవచనాలు మాత్రమే చేసి బుద్ధుడు ప్రసిద్ధికెక్కలేదు. ప్రపంచం కోసం ఏ క్షణమైనా ప్రాణాలు అర్పించడానికి సన్నద్ధంగా ఉండేవాడు. జంతు బలులను ఆపడానికి ఆయన ఎనలేని కృషి చేశాడు. 'ఒక గొర్రెను బలి ఇవ్వడంవల్ల నువ్వు స్వర్గానికి వెళ్లగలిగితే, మనిషిని బలి ఇస్తే అంతకన్నా నీకు ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి నన్ను బలి ఇవ్వండి' అని బుద్ధుడు ఒక రాజుతో అన్నాడు. రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు.

'జంతుబలి మూఢ నమ్మకం. బలికోరే దేవుడున్నాడని నమ్మడం కూడా మూఢ నమ్మకమే' అని అనగలిగిన అవతారం బుద్ధుడు. 'లోకంలో ఇంత దుఃఖం ఎందుకుంది? ఆ దుఃఖాన్ని నివృత్తి చేయలేని దేవుడు ఉన్నాడని నమ్మడం నన్ను సంతృప్తి పరచడం లేదు' అని బుద్ధుడు అన్నాడు. జగద్రక్షకుడై నిలిచాడు.

ఒక వెలుగు కిరణం మరో వెలుగు కిరణాన్ని మెచ్చుకొంటుంది. బుద్ధుడెవరో మరో క్రాంతదర్శికే తెలుస్తుంది.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP