ఎంత దిగజారిపోతున్నారీ వైద్యులు ?
>> Saturday, June 18, 2011
వైద్యో నారాయణోహరిః అన్నారు పెద్దలు ఆరోజు . కానీ నేడుకొందరు వైద్యుల డబ్బు యావచూస్తే వీళ్లను ఎంత నీచపదంతోసంబోధించినా తక్కువే అనిపిస్తున్నది. నాకు మరీ ఇంతగా అసహ్యం కలగటానికి రెండు ఉదాహరణలు చెబుతాను. మొన్న గుంటూరు వెళ్లాను మావిడను తీసుకుని . ఆవిడకు చెవులు దిబ్బడగా ఉన్నాయని.అలాగే కంట్లోమటలుగా ఉన్నాయని చూపించాలని. కృష్ణమహల్ సెంటర్లో ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. మంచి నైపుణ్యం గలవాడు. పదిహేణేళ్లక్రితం నేను చెవినొప్పితో వినుకొండలో కొత్తగా వచ్చిన ఒక ఈఎన్టీ డాక్టర్నుసంప్రదిస్తే ఆయన చెవిలో కర్ణభేరికి బొక్కపడింది అనిచెప్పి అదరగొట్టాడు. అతనివైద్యం తీసుకునే ధైర్యం లేక గుటూరు వెళ్ళి ఆ ఈఎన్టీ డాక్టర్కు చూపించాను . ఆయన పరీక్షించి ,చెవిలో రంధ్రం పడిందని చెప్పినవాడెవడు? వానికి పెట్టండి బొక్క ,అని ఎగతాళిచేసి . ఫంగస్ చేరిందని శుభ్రంచేసి ఓటెక్ అనే డ్రాప్స్ ఇచ్చాడు .అంతే నెప్పి మటుమాయం. ఈవిషయం గూర్చి మిత్రులమధ్య మాట్లాడేప్పుడు ,గుప్తాగారనే మితృడు జాగ్రత్త దుర్గేశ్వరగారూ ! మరలా వినుకొండలో ఈపిచ్చిడాక్టర్ దగ్గరకు వెళ్ళేరు, అదేమిటీ ! రంధ్రం లేదా ? నాలెక్కప్రకారం ఉండాలి .లేకపోతే నా అనిచెప్పి ఏఫోర్చిప్స్ తోనో పొడవనైనా పొడవగలడు అని హాస్యమాడేవారు.
నేను చాలామందికి సదరు డాక్టర్ గారి గూర్చి చెప్పి ఆయనదగ్గరకెళ్లటం మేలు అని సలహా ఇచ్చేవాడిని. సరే మొన్న మా ఆవిడను తీసుకుని వెళ్లాను . ఆయన అత్యంత బిజీ[ రాజీవ్ ఆరోగ్యపథకంతో]నట . వెళ్లాం ఓపీ చీటి తీసుకున్నాం.ఒక్కనిమిషం కూడా చూడలేదు పేషంట్ ను . ఏమీలేదన్నాడు .ప్రాబ్లెం ఏమిటీచెప్పకుండానే వేరే లాబ్ కు తెస్ట్ కు వెళ్లమన్నాడు . నాకు చిర్రె త్తుకొచ్చింది . పాపం ఈలోపలింకెవరో పేషంట్ వచ్చాడు . తన టెస్ట్లన్నీ చూపాడు.ఏదో నొప్పితగ్గలేదన్నాడు. ఎక్స్ రే తీయాలి అన్నాడు డాక్టర్ .తీశారు సార్ ! అని అదీ చూపాడు. నాకు నొప్పిబాబో అనిచెబుతున్నా ..నాకేం కనపదటం లేదు [నొప్పి రోగికయితే ...వీడికి కనపడటం లేదంటాడు] నాకేం కనపడటం లేదంటూ చేంతాడంత మందులచీటీ వ్రాసి చేతిలోపెట్టాడు . నాకు అసహ్యమెసింది ఈడాక్టర్ మీద. ఓపికౌంట్ చూడాలి .లేదంటే నాకు సమయంలేదు వేరేదగ్గరకెళ్లమనాలి! అంతేగాని రోగిదగ్గర డబ్బుతీసుకుని కూడా వాడిబాధనువినలేని అఈడాక్టర్లను అడ్డంగా నరకాలి అన్నంత కోపంవచ్చింది . ఇక పద అని మావిడను తీసుకుని వచ్చేశాను . ఇక ఈకార్పోరేట్ కల్చర్లో కూరుకున్న ఈవైద్యులదగ్గర మనం మంచివైద్యం ఆశించటం శుధ్ధదండుగ అని చెప్పి మరుసటిరోజు పెదకాకాని దగ్గర కంచికామకోటి పీఠం వారిచే నిర్వహించబడుతున్న శంకరనేత్రాలయం నకు తీసుకెళ్లాను .వాళ్ళు వందరూపాయలఫీజు మాత్రమే[నిరుపేదలకు ఫీజులేదు] చక్కగా ఆధునికపరికరాలతో టెస్ట్ చేసి అవసరమైన కొద్దిమమ్దులుమాత్రమే వ్రాసిచ్చారు
ఇక రెండవ సంఘటన . ఈమధ్య మాబంధువల కొకరికి పిస్టులా సమస్యవచ్చింది . అల్లోపతి వైద్యవిధానంలో గందరగోళంగా ఆపరేషన్లు అవీ చెబుతున్నారని ఆయుర్వేదం లో వైద్యంచేపించమని సలహాఇచ్చాను/[ మా నాన్నగారు ఆయుర్వేదవైద్యం బాగా చేసేవారు] . ఆంధ్రజ్యోతి పేపర్లో సలహాలిచ్చే ఆయుర్వేద వైద్యుల సలహాలను విని వీళ్ళు నిజమైన వైద్యులు .లోకోపకారులు అనే మూఢనమ్మకాన్ని పెంచుకున్నాను, .కేరళ వైద్యం .చాలా నిష్ణాతులు .ఆయుర్వేదం కనుక పెద్దగా ఖర్చుకూడా ఉండదు . అనిచెప్పి సదరు కేరళా ఆయుర్వేదడాక్టర్ తో ఫోన్లో మాట్లాడి వీళ్లను హైదరాబాద్ పంపాను. నామాట విని వెల్లినవీళ్ళదగ్గర టెస్ట్ లనిచెప్పి ఆరువేలు గుంజారు. వాల్లు లబొదిబోమంటుంటే ఏమిటి డాక్టర్ సమస్య అని నేనడిగితే ఆపరేషన్ చేయాలి .అరవైవేలవరకు ఖర్చవుతుందని వాల్లుచెప్పినమాటవిని నాకే కళ్ళుతిరిగాయి. మహాత్ములు తమజీవితాలనుత్యాగంచేసి శోధించి మానవాళికందించిన ఆయుర్వేదవిజ్ఞానంకూడా ఈ దుర్మార్గుల చేతిలోబడి ఎంత వ్యాపారాత్మకమయిపోయిందా అని ? మనసు విలవిలలాడింది . సరే ఇక చేసిన టెస్ట్ ఉ చాలు వచ్చేయండి అనిచెప్పి , మా నాన్నగారి డైరీలు తిరగేసి దీనికి ఉన్న ఔషధాన్ని తయారుచేసి వాడించాను. అడ్దసరం ఆకులరసంలో సైంధవలవణం కలిపి తయారుచేసిన ఔషధాన్ని సిరెంజ్ ద్వారా ఆపిస్టులాలోకి ఎక్కింపజెశాను పదిరోజులలో పిశ్టులా మానుపుండుపట్టింది . చాలాశులభమైన ప్రాకృతికమైన వైద్యవిధాన్నాన్ని జనులకమ్దిమ్చి సమాజపరంచేసిన మహర్షుల మార్గాన్ని మరచిపోయి ...ఈకిరాతకులైన వైద్యుల పాలబడుతున్న మన జీవితాలను రక్షించేదెవరిక ? ఎంత దుర్మార్గాలకు తెగించారీ వైద్యులు ? నిజంగా వీళ్లను కుంభీపాక నరకంలో పడవేస్తారు చచ్చాక.
3 వ్యాఖ్యలు:
@నేడుకొందరు వైద్యుల డబ్బు యావచూస్తే ...
పొరపాటు పడ్డారు..మొత్తం వైద్య రంగమే మురికై పోయింది...అందరిదీ అదే దారి..గమనించి చూడండి....
డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటేనే భయంగా వుంది ఈ కాలంలో. ఒక మామూలు జ్వరానికి కనీసం వెయ్యి రూపాయలు అవుతున్నాయి.పైగా టెస్టుల పేరుతొ పొడిపించుకోవడం, మందులకి నీరసించిపోవడం.
వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా !
యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ ! (ఆంధ్రామృతం బ్లాగులో మేలిమి బంగారం మన సంస్కృతి అనే లేబిల్ లో ౫౪ వశ్లోకము.http://andhraamrutham.blogspot.com)
ఆ.వె:- వైద్య రాజ! నీకు వందనంబులు సేతు.
యముని సోదరుండ! అందుకొనుమ!
యముడు ప్రాణముగొను. యమ సోదరుండ! మా
ధనము, ప్రాణములను గొనుదు వీవు.
భావము:- యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!
పూర్వం ప్రజానీకానికి "వైద్యో నారయణా" అని కీర్తింప బడే విధంగా వైద్యులు తమ వైద్యాన్నందించి ప్రాణాలు కాపాడేవారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనిపిస్తోంది. వైద్యం కోసం రోగి వెళ్ళితే దీనినే అవకాశంగా తీసుకొనే వైద్యులు తద్వారా అత్యవసరం అనుకొని కోదరైతే, అవసరమని కొందరైతే, అనవసరంగా కూడా అక్కలేని వైద్య పరీక్షలతో రోగి జేబు ఖాళీ చేయిస్తున్న వారు కొందరు ఉండడం నీటి డాక్టర్లలో మనం చూస్తుంటాం.
మానవ జన్మ చాలా గొప్పది. అందులోనూ వైద్య శాస్త్రం అధ్యయనం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం. అలా వైద్యులైన వారు చాలా మంది తమ స్వార్థానికి దూరంగా ఉంటూ అత్యవసర వైద్య సేవలో తమ జన్మ ధన్యం చేసుకొనే పుణ్య మూర్తులు సాక్షాత్తు మానవాకృతిలోనుండు మహనీయ పరమాత్మలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయ మనీషులే మానవాళికి ప్రథమ పూజ్యులు.
ఉ:- వైద్యము నభ్యసించి, తన వారికి కూడ సుదూరమౌచు, " నా
బాధ్యత" వైద్య సేవ యని, భక్తిగ రోగికి సేవ చేయుచున్,
సద్యశ మందుచున్న మిము సర్వ విధంబుల దైవ మెప్పుడున్
హృద్యముగా కనుంగొనుత! సృష్టిని ముఖ్యుడ! వైద్య పుంగవా!!
అని మహాత్ములైన భిషగ్వరులకు పాదాభి వందనం చేస్తున్నాను.
వైద్యాన్ని అసరాగా చేసుకొని, ధన మాన ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు మాత్రం అంతకు అంతా పరిహారం చెల్లింపక తప్పదన్న విషయం మాత్రం యదార్థం. అది దైవ శాసనం.
Post a Comment