శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బట్టలుతికిన నీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటివారికి కీడట జాగ్రత్త

>> Monday, June 13, 2011


మన మహిళామతల్లులు కొందరు బట్టలుతికిన తరువాత ఆ నీళ్లను కాళ్లమీద గుమ్మరించుకుంటారు. అలాచేయటంవలన ఆమె పుట్టింటివారికి కీడుజరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అందువలన మీరు జాగ్రత్తవహించాలని సోదరీమణులను కోరుతున్నాను.
ఆ ! మరీ ఛాదస్తం .నీళ్ళు కాళ్లపై పోసుకోవటమ్ తో కూడా కీడా ? మరీ మూఢనమ్మకాలని కొట్టిపారేయకండి. మనవాళ్లు ఏదిచెప్పినా దానివెనుక శాస్త్రీయ కారణాలుంటాయి . ఆలోచించే ఓపికా పరిశీలించే శ్రద్దాలేక ఈవిజ్ఞానం తెలియని సోమరిపోతులు చేసిన దుష్ప్రచారలతో మనం మన పెద్దలమాటలన్నీఅబద్దమేమోనన్న అపనమ్మకంలో మునిగిపోయాం మరి .
విషయమేమిటంటే సహజంగా విడిచిన గుడ్డలలో దుమ్ముధూళీ కణాలలో నిండుగా క్రిములు చేరిఉంటాయి.మధ్యతరగతి దిగువతరగతి ఆడవాళ్ళు స్వయంగా ఇంటిలోని బట్టలు ఉతుక్కుంటారు .అయితే సహజంగా వీరి పాదాలు పగుళ్ళు ఉంటాయి. ఎక్కువగా నీటిలోనూ తడుస్తుంటాయి . బట్టలుతుకిన నీళ్లలో నిండుగా క్రిములుంటాయి .ఆనీటిని కాళ్లమీదపోస్కుకుంటే ఆపగుళ్లద్వారా శరీరం లోకి ప్రవేశించే అవకాశం ఉంది . అలా చేరి ఆమె రోగగ్రస్తమయితే ఆమెను భర్త ఆమెను పుట్టింఇకి వెళ్లగొట్టే అవకాశం ఉంది .ఇది ఆమెపుట్టింటికి కీడేకదా !?
మామూలుగా అలా చేయొద్దని చెబితే పట్టించుకోని స్త్రీలు పుట్టింటికి కీడు అంటే మాత్రం శ్రధ్ధచూపుతారని పెద్దలు ఇలా చెప్పి ఉంటారు . ఇంతటి వైజ్ఞానిక దృష్టి,దాన్ని తరతరాలవరకు ఆచరించేలా సాంప్రదాయాలను ఏర్పరచిన మన పెద్దలకు మరో సారి నమస్కరిద్దాం.

3 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు June 13, 2011 at 11:16 AM  

బావుంది. ఇలా శాస్త్రీయంగా విడమరచి చెబితే అందరికీ ఎక్కుతుంది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు June 13, 2011 at 11:17 AM  

బావుంది. ఇలా శాస్త్రీయంగా విడమరచి చెబితే అందరికీ ఎక్కుతుంది.

durgeswara June 14, 2011 at 7:17 AM  

క్రిష్ణగారూ
ఇలా చెబితే వింటారు కానీ ఆచరించరు. ఈ ఆచారాలను ఇలా లింక్ చేసిన మన పెద్దలకు మానవ మనస్తత్వశాస్త్రంపై సంపూర్ణసాధికారత ఉన్నది .అందువలనే వాళ్ళు తిరుగులేనివిధంగా ఆచరించే మాటలు చెప్పారు. మనం వాళ్ళు చెప్పినది వింటే మేలు.
అలాకాక ప్రతిదీ ఎందుకు? ఏమిటీ? ఎలా? అంటూ బాబూమోహన్ లాగా పరిశోధిస్తూ పోతే మన జీవితకాలం చాలదు .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP