శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నడిచేదైవం

>> Tuesday, June 14, 2011


సర్వశ్రుతి శిరోరత్న సముద్భాసితమూర్తయే!

వేదాంతాభోజ సూర్యాయ తస్మై శ్రీ గురవేనమః!!

నడిచేదేవుడు, జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారి 118 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. నేటికీ ఆయనను నమ్ము కున్నవారిని కన్న బిడ్డల వలె కాపాడుతూ. సనాతన ధర్మాచరణం చేసేవారికి మార్గదర్శియై ఎందరో శిష్యులకు నేటికీ ఆచార్యస్థానంలో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సద్గురువులు, వారి గురించి చెప్పడానికి ఇంత అని ఏముంది... పరమాచార్య మరో శంకరావతారమే, పరమాచార్య పరమాచార్యయే, సముద్రానికి, రామ రావణ యుద్దానికి, పరమాచార్యకు ఉపమానాలు లేవు.

విభూతిః ఫాలాగ్రే శిరసి తులసీ బిల్వవలయో

గలే రుద్రాక్షాలిః స్వితవిలసితం చారు వదనే,

కరే వామే దణ్డస్తదితరకరే జ్ఙానకరణం

పురస్తాదాస్తాం మే భరతజనతాహోపురుషికా.. (పు, శ్రీ రామ చంద్రుడు)

అన్ని మాటలేల.. ఆయన ప్రత్యక్ష శిష్యులు అన్నట్టు ఆయన "నడిచేదేవుడు"...

సమాగతో నా భవదీక్షణక్షణ

ప్రక్షీణ సర్వాక్షమలోమలాన్తరః

నిక్షిప్త చిత్తో భగవత్యధోక్షజే

ముముక్షువర్యో భవతి క్షణేన వై........ (శ్రీ క్రిష్ణ శాస్త్రి)

స్వామీ, మీ కడగంటి చూపు ఎవరిపై పడుతుందో, వాడు ఎంతటివాడైనా ఇంద్రియ చాంచల్యం నశిస్తుంది, మనస్సు శుద్ధిని పొందుతుంది, అంతః కరణము భగవత్పాదములతో లగ్నమవుతుంది ఇదంతా మీ కడగంటి చూపు ప్రసరించిన క్షణకాలంలో జరిగుతుంది.

అలాగే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు (చందోలు శాస్త్రిగారు) శ్రీ చరణులగురించి చెప్పమంటే, " అది నడుస్తున్న బ్రహ్మ పదార్థము, దానిని గురించి పలుకుట ఎలా సాధ్యము", (యతో వాచే నివర్తన్తే... మనస్సు బుద్ది, వాక్కు ఎక్కడ ఆగిపోతాయో అక్కడే పరబ్రహ్మము ఉంటుంది) అని అన్నారు.

ఇక "విశాఖ" గారు జగద్గురు బోధలు పుస్తకాలలో స్వామి గురించి రాస్తూ ఎంత పొంగిపోయారో...

చిరునగవు మొగమున చిందులాడే స్వామి

బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి!!

కఠిన నియమాలతో కరడుకట్టిన స్వామి

కామాక్షి పాదముల పరవశించెడు స్వామి!!

రుద్రనమకాలతో నిర్ణిద్రుడగు స్వామి

వేదాంత వీధులలో దేలిపోయెడు స్వామి!!

శాంతుడై దాంతుడై శాశ్వతానందుడై

సచ్ఛిష్య సందోహస్తుత్యుడై మౌనియై!!

జ్ఙానియై జ్ఙేయుడై సన్మార్గగామియై

కామకోటిపీఠ శంకరాచార్యుడై!!

షణ్మతస్థాపనాచార్యుడై వెలుగుచు

ఆశ్రయించెడు వారి కభయమిచ్చెడు స్వామి!!

చిరునగవు మొగమున చిందులాడే స్వామి

బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి!!

...............

అందరి మనస్సులలో నిత్యం నడిచే స్వామి, మా స్వామి, మన స్వామి అటువంటి స్వామి వారి 118 వ జన్మదిన వేడుకలు కంచిలో మూడురోజులనుంచి నేటివరకు కొనసాగుతున్నాయి, మనం కంచిలో లేకపోతేనేం మన మనస్సే కంచి గా మార్చి స్వామిని మన మనస్సులోనే నిలుపుకుందాం..

ఒక్కసారి, స్వామి రచించిన మైత్రీంభజతాం... కీర్తనను సర్వమానవాళి అభ్యుదయంకోసం, శ్రేయస్సుకోసం చదువుకుందాం....

సర్వం శ్రీ చంద్రశేఖర యతీంద్ర చరణారవిందార్పణమస్తు....

[naagendra ayyamgaari]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP