శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుంది ? ఎక్కడకెళుతుంది?

>> Thursday, June 9, 2011

స్వామి నిగమానంద సరస్వతి తో బస్తర్ మహారాజా ప్రపుల్ల చంద్రదేవ్ గారి ఆస్థానవైద్యులు డాక్టర్ మిచెల్
గారు జరిపిన ఆసక్తికరమైన చర్చ .

డా //మిఛెల్ ః- మీరు అనుమతిస్తే పరలోక విషయాలగురించి కొన్ని అడగనా ?
స్వామి నిగమానంద ; చాలాకాలంపాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం
చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు. ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం.
చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపుల్నుమ్చి ముడుచుకుపోయి మస్తిష్కం మీద ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ,మనస్సునూబుద్ధినీ కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" [వాయువుకనుక దేన్నీ ఆశ్రయించకుండా] అన్న అవస్థ ఏర్పడటం వల్ల,కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది . మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకపు ఆత్మను కొందరు మరణించకముందే చూడగలుగుతారు. ఆ ఆత్మ అతన్ని [దాన్ని] నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్లటానికి సిధ్ధంగా ఉంటుంది.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది .మొదటినుంచే మస్తకం[తల]మీద ఒక తేజోమయ శరీరం ఉంటూంటుంది. దానికి సూక్ష్మమయిన దారంతో స్థూలశరీరంతో సంబంధం ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి.ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ చూపు వచ్చినవాడికి[జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి] ఈ ఆట స్పష్టంగా కనిపిస్తుంది.
లోకాలు ఏడున్నాయి. ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి స్థరాలు[పొరలు]ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళీ కర్మానుసారంగా ఒక విశేషస్తరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్తరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మపైకిలేవగల్దు.క్రిందకు పడగలదు. ఇది ఆత్మఘనంలా నిర్మాణమయి ఉంటుంది . మహర్లోకంలో అనుభవించవలసిన కారణమ్ ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది.వీతికికూడా పైన ఒకలోకం ఉంటుంది. దీన్నిగురించి ఇతర సంప్రదాయములవాల్లెరుగరు. దాన్ని నిత్యలోకం లేక భావలోకం అంటారు. ఈ లోకానికి సంబంధించినదంతా అతి విచిత్రంగానూ రహస్యమయంగానూ ఉంటుంది .

డా మిఛెల్ ః -- మంచిది స్వామీజీ ! భూతప్రేతాలనుగూర్చి మీ అభిప్రాయం ఏమిటి ?
స్వామి నిగమానంద ః --- చనిపోయిన తరువాత అసంతృప్తిగల ఆత్మకు ఉండే వాయురూపాన్నిభూతమనీ,ప్రేతమనీ అంటుంటారు. కింది స్థాయి మనిషి,లేదా ఆత్మహత్యచేసుకున్నవాడుచాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది.అతను చచ్చిపోవడమయితే జరిగింది,కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సమవత్సరాలు పడుతుంది .ఎందుచేతనంటే అతని ఆత్మ ఆసమయంలో గాఢసుషుప్తలో ఉంటుంది. భూతప్రేతాలు మనుష్యశరీరాన్ని ధరించడం సులువుకాదు. అనేకప్రయత్నాలు చేసినమీదట అది భాష్పీయ[ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పంఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుందికూడా . కానీ ఆ శరీరం సమాన్యకారణాలవల్ల కరిగిపోగలదు.పరలోక గతమయిన ఆత్మ రక్తసంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు. పమ్చభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు,. . ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని,భాజాలు,సంగీతం,లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.
డా//మిఛెయిల్ ః-- చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళేదెక్కడికి ?
స్వామి నిగమానంద ః-- సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం.స్వర్గలోకం వరకు చేరుతుంది.మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగ మిగిలిఉంటుంది .ఆవాయుశరీరాన్ని ఆధారమ్ చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంతవరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలిఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారన చేయవలసి ఉంటుంది.
డా.మిఛెల్ ః--- ఆజీవి భూలోకానికి చేరేదెలా ?
నిగమానంద సరస్వతి ః- అతను స్వర్గంలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బులద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు.దాన్ని మనుషులు తినవచ్చులేదా పశువులు తింటాయిఅలా తిండిద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లికడుపులోకి చేరుతాడు.మనిషిగాగాని లేదా పశువుగానైనా ఏదో ఒకజీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆజీవి జన్మ .అంతకుపూర్వం అనుభవించగా మిగిలిఉన్నదాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈవిధంగా ఆజీవిభోగం[అనుభవం]పూర్తవుతుంది.

 

15 వ్యాఖ్యలు:

Anonymous June 9, 2011 at 6:02 AM  

చాలామంచి వ్యాసం. మాతో పంచుకొన్నదుకు ధన్యవాదాలు.

p June 10, 2011 at 12:16 AM  

chala manchi vyasam dhanyavadalu.

krsna June 10, 2011 at 7:15 AM  

very good post andi. thank you. mito matladi chala kalam aindi. okasari chesi matladataanu.

saibaba August 14, 2011 at 6:59 AM  

aalochinchi ardham chesukonnavarikchi
manchi vyaasam.K.Saibaba

saikumar October 1, 2011 at 6:29 AM  

sai
maranamu gurinchi theliyani vishayalu thelipinanduku chala thanks

saikumar October 1, 2011 at 6:31 AM  

sai
maranamu gurinchi theliyani vishayalu thelipinanduku chala thanks

miriyala giri November 1, 2011 at 6:27 AM  

satyam chepparu. swami

Surya Prakash January 13, 2013 at 9:20 PM  

chala baga vishadeekarincharu.inka detail kavali .naa manasu lo inka sandeham vundhi .nirakarudu aina bagavanthudu pancha bootha lalo vunnappudu manam panchaboothalo kalusthunnam.eeboothala dwara manam malli srustikramamlo vuntunnamanede sathyamani na vaadhana. dayachesi aalochinchandi medhavulu.

SIVA KUMAR REDDY October 2, 2013 at 9:00 PM  

MARANAMU GURINCHI ETUVANTI VISHAYAMULU TALIPINANDUKU DHANYAVADHAMULU. ENKA ETUVANTI VISHAYMULU VUNTE DHAYACHESI NAKU MAIL PANPINCHANDI. ( aeusiva@gmail.com, sivareddy_99@rediffmail.com )

shrishivadev shri January 15, 2014 at 3:52 AM  

adhbhutam. ilanti vishayalu ela evari dwara telusu kovachchu.

shrishivadev shri January 15, 2014 at 3:53 AM  

adhbhutam. ilanti vishayalu ela evari dwara telusu kovachchu.

Manjula Reddy May 1, 2014 at 10:27 PM  

sir meru chala baga chepparu elage ma intidagara kuada edo undani naku anipisthundi vintha chappudu padukunnapudu meda baruvuga padatam edi emai untundi teliyacheyagalara

Jogadhenu Satyanarayana July 20, 2014 at 4:56 AM  

చాల మంచి వ్యాసం. అందరూ తప్పక తెలుసోకోవలసిన విషయం

pallem sowluraju August 14, 2014 at 10:51 PM  

neeku satyam taliyadu.neeku talisindi sagama migatadi satyam kadu.talisi taliyaka matladavadu

durgeswara August 15, 2014 at 5:27 AM  

అయ్యా సౌల్ రాజుగారూ
ఇది నేను వ్రాసిన వ్యాసం కాదు
దినపత్రికలో డాక్టర్ మిచెల్ గారు వ్రాసిన పుస్తకంపైఅ సమీక్షరాస్తూ అందులో కొన్నుభాగాలు ఇస్తూ వ్రాసిన వ్యాసం ఇది. దానిని ఉపయోగపడుతుమ్దని ఇక్కద ఉంచాను.
మాకు ఋషులు సత్యం తెలియజెప్పారు. దానినే ఆచరిమ్చాలని చెప్పారు. ఎవరు చెప్పినా,చివరకు భగవంతుని కోసమైనా మేము అసత్యప్రచారాలలో పాల్గొనరాదని హిమ్దూజాతికి ఋషులు విధించిన విశ్వశాసనం నమ్ముతాము.
భగవంతుని తరపున అనుకుని మతప్రచారాలకోసం అసత్యమైనా ప్రచారం చేయవచ్చని హిందూమతంలో ఏ ప్రవక్తలు,బోధకులు చెప్పలేదు. నేతి నేతి... ఇదికాదు...ఇదికాదు అని సత్యం అమ్చులదాకావెళ్లమని చెబుతున్న వేదధర్మం పై ఆధారపడ్దసంస్కృతి వారసులం/ దయచేసి అపనిమ్దలు వేయకండి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP