వితండవాద మేధావులకు వాస్తవాలు మిగుండుపడవు
>> Thursday, June 16, 2011
మిత్రులందరికీ నమస్కారములు,
Sub :- చంద్ర గ్రహణం - tv9 విశ్లేషణ
నిన్న tv9 లోని విశ్లేషణ విన్న తరువాత నాకు ఈ క్రింది విషయాలు మీతో పంచుకోవాలనిపించింది.
ప్రతిసారి ప్రస్తుత శాస్త్రజ్ఞులకు మరియు మన జ్యోతిష పండితులకు పెద్ద యుద్దమే జరుగుతువుంటుంది.
మన వేదాలలో చెప్పిన వాటిని పరిశీలించి, పరిశోధించి విదేశీలు క్రొత్త విషయాలు చెబుతూవుంటే మనవాళ్ళకు ఇదేమి మాయ రోగం, అన్నిటిని మూడ నమ్మకాలూ అని కొట్టిపారేస్తున్నారు.
మహానుభావులు మన ఋషులు, మహర్షులు ఎంతోకాలము పరిశోధించి తపనచెంది, తపస్సుచేసి వేదాలలో దాగివున్న విషయాలను జ్యోతిష గ్రంధాల రూపంలో మనకు అందించారు.
వాళ్ళు నిజమైన శాస్త్రజ్ఞులు. వాళ్ళకి ఇవ్వాలి నోబెల్ బహుమతులు. నా అబిప్రాయంప్రకారం వాళ్ళుకూడా SCIENTISTS . కాళిదాసు, వరాహమిహిరుడు,జైమిని వాళ్ళందరూ గొప్ప శాస్త్రజ్ఞులు.
ఇప్పటివాళ్ళు వాటిని పరిశీలించడం లో తప్పు ఉండవచ్చుగాని శాస్త్రం తప్పు అంటే ఎలాగా .
న్యూటన్ కనుగొన్న తరువాతే ఆపిల్ పండు క్రింద పడిందా? అంతకుముందు పడలేదా? అంతకముందు కూడా పడింది. వున్న దానిని వీళ్ళు కనుగొన్నారు, లేనిదాన్ని కాదుగదా.
కంప్యుటర్ కన్నా వేగమగా మానవుడు లెక్కలను సాదిస్తున్నాడు . ఎలా ? మనవుడులో లేని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మరి ఎక్కడా లేవు. మానవుని మెదడుతో సమానమైన కంప్యుటర్ ఎక్కడ లేదు.
మానవుని మెదడు చూసి ఈ కంప్యుటర్ కనుగొన్నారు. మానవుని కన్ను చూసి CAMERA కనుగొన్నారు . ఏ electron పరికరం యినా దానిలోని వస్తువులు COMPONENTS ఈ పంచ భూతంలోనుంచి వచ్చినవే. అదే పంచ భూతంలతో తయారయిన మానవునికి సాద్యంకానిది ఏముంది. కంప్యుటర్ లో వుండే మైక్రో చిప్స్ లాంటివి కొన్ని వేలు మన మెదడు లో వున్నాయి. వాటితో మనము ఎన్నో సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ , టీవీ లు తయారుచేసుకోవచ్చు. దానికి కావలసిన అను సందాన ప్రక్రియ మనకు తెలియాలి. అదే తపస్సు. దాని ద్వార మన ఋషులు దూర దృష్టి, దూర శ్రవణం సాదించినారు. ఒక మైక్రో చిప్ లో వుండేది సిలికాన్ అంటే మట్టి.
ఒక RESISTOR లోవుండేది కార్బోన్ , ఒక CAPACITOR లో వుండేది కాగితం,మైకా. ఇవన్నీ కూడా మట్టిలోనుంచి వచ్చినవే. అదే మట్టి మన లో కూడా వుంది.
అంటే అన్ని COMPONENTS , ELEMENTS మనలోకుడా వున్నాయి. WE HAVE TO KNOW THE CIRCUIT ONLY, THE PROCEDURE,
HOW TO LINK UP. THIS WE WILL GET BY TAPANA. తపస్సు ద్వార మనము సాదించాలి.
మన ఋషుల కు ఇవ్వాలి నోబెల్ బహుమతులు. ఎన్ని ఇచ్చినా చాలవు.
రుషిబ్యోనమః
మీ
కామరాజుగడ్డ రామచంద్రరావు
4 వ్యాఖ్యలు:
కార్బన్ అన్నా మట్టే, సిలికాన్ అన్నా మట్టే, ఇరన్ అన్నా మట్టే లేదా మట్టిలోంచి వచ్చినవే. కాని వాటిని ఒకే మట్టిలో లభించే వేరు వేరు మూలకాలుగా గుర్తించి, వాటి భతిక, రసాయనక ధర్మాల ప్రకారం చక్కగా విభజించి , విశ్లేషించి, ఏది ఎప్పుడు ఎలా అవసరమౌతుందో చెప్పిన వాళ్ళకు గుర్తింపు నివ్వడం తప్పెలా అవుతుంది? కాళిదాసి, వరహమిహరుడుల గొప్పతనాన్ని గుర్తించడానికి మరొకరి వచ్చిన గుర్తింపును ప్రశ్నించనవసరం లేదనుకుంటా. నోబుల్ ప్రైజ్ ఎవరో పాశ్చాత్యుడు ఏర్పరుచుకున్న బహుమతి, కావాలంటే మనమూ రాజీవ్ పథక్ ప్రైజ్/ సోనియా ప్రైజ్ పథక్ ఏర్పరుచుకోవచ్చు, మనవాళ్ళకే ఇచ్చుకోవచ్చు. ఒకరి మీద ఏడ్వటం కొంతన మనసుకు తాత్కాలికంగా స్వాంతన ఇస్తుందేమో కాని గొప్పవాళ్ళను చేసేయదు. ఇలాంటి పోలికలు అసంబద్ధంగా మరీ లేకిగా వుంటాయి, నాకు నచ్చలేదండి, హరిసేవ గారు. ఒకరు గుర్తించి కిరీటం పెడితేగాని మనవాళ్ళు గొప్పవారు కారనా?! నోబుల్ ప్రైజ్లను అడ్డుపెట్టి ప్రతిభను ఆపలేరు. గెలీలియో, అరిస్టాటిల్‌లకెవరు ప్రైజ్ ఇచ్చారని?! మన రామన్, ఖొరానాకు, చద్రశేఖర్లకుఇచ్చారుగా.
జ్యోష్యాస్త్రం లో నోబుల్ వుంటే గింటే తూర్పు-దక్షిణదిశల్లో భూకంపాలు వస్తాయని, గ్రహయుద్ధాలతో అతలాకుతలమవబోతోందని చెప్పే ఇక్కడి బ్లాగ్జ్యోతిష్వేత్తలకి 3నెల్లకోసారి ఇవ్వాల్సిందే! :P :))
మిత్రమా ! \
మీరు చిన్నవిషయం గమనించాలి. ఇది నావ్యాసం కాదు. టీవీలవాళ్ల చెత్తగోల విని ఒక మితృడు పంపిన తన ఆవేదనను ఇక్కడ అందరికీ ఆలోచనరేపుతుందని ఆయనపేరుమీదనే ఉంచాను. మీరన్నట్లు ఏదో నోబెల్ప్రైజ్లకోసం ఎదురుచూసే స్థాయివాల్లుకాదు మన పూర్వీకులు వాటన్నిటికీ అతీతమైనస్తాయిని అందుకున్నవాల్లు. మనం ఈ వ్యాసంలో మితృని ఆవేదనను అర్ధచేసుకుందాం.
Post a Comment