మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు,ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు?ప్రసారంచేస్తున్నారు?
>> Monday, June 27, 2011
అవును నాకోవిషయం అర్ధంకావటం లేదు. చాలా రోజులుగా ప్రశ్నించుకుంటూ ,ప్రశ్నిస్తూ వస్తున్నా సరైన సమాధానం రాలేదు.
మన మీడియా లో అదిప్రింట్ మీడియాగానీయండి ,ఎలక్ట్రానిక్ మీడియాకానీయండి ఒకవిషయంలో ఏకాభిప్రాయం కనపడుతుంది. అదేమిటంటే హిందువుల ఆచారవ్యవహారాలను విమర్శించటం. జాతకాలు,ముహూర్తాలు ,జ్యోతిషశాస్త్రాదులను మూఢనమ్మకాలనే రీతిలో వార్తలుగా ఇవ్వటం.అలాగే అలావిమర్శించేవారితో చర్చలు జరిపిస్తూ తాముతటస్థులమన్నట్లుగానో లేక వ్యతిరేకులమన్నట్లుగానో వ్రాస్తూ,మాట్లాడుతూ శునకానందం పొందుతుంటారు.
ఈశాస్త్రాలన్నీ ప్రామాణికం కావని వీళ్ళునమ్మినప్పుడు ఈమూఢనమ్మకాలనుంచి జనాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నప్పుడు ముందుగా వీళ్ళు ఈ నమ్మకాలను ఆచారాలను వదిలేయాలి కదా ?
కానీ పత్రికగానీ ఛానల్ కానీయండి వాటిభవనాల భూమిపూజనుండి ప్రారంభకార్యక్రమాలన్నీ కూడా ఈఆచారాలతోనే పూజలతోనే చేస్తారు.వాటి యజమానులు గుళ్ళుగోపురాలో ఇంకా వేరే ప్రార్ధనామందిరాలచుట్టో తిరుగుతూనే ఉంటారు. ఇంకా తిథులు,పంచాంగాలు ,రాశిఫలాలు అంటూ పత్రికలవాళ్లు ప్రచురిస్తుంటే ఛానల్వాళ్ళుకార్యక్రమాలు ప్రసారం చేస్తూనే ఉన్నారు . అసలు నమ్మకంలేని వాళ్ళు ఈ ప్రసారాలెందుకు ? ఎవరిని వెర్రివాళ్లను చేస్తున్నారు. ఏమాత్రం నైతిక విలువలులేని వీళ్ళ ప్రచురణలను ప్రసారాలను జనం ఎందుకు నమ్మాలి ? భర్తృహరి చెప్పినట్లుగా మనసులో ఆలోచన ఒకటి చెప్పేదొకటి ఆచరించేదింకొకటి గా సాగుతున్న వీళ్లబ్రతుకులు.......... లోకానికి ఆదర్శాలు నేర్పుతాయా ?
మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు,ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు?ప్రసారంచేస్తున్నారు?
1 వ్యాఖ్యలు:
Good Thing.. Good..question
Post a Comment