శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శని త్రయోదశి సందర్భంగా.........

>> Saturday, April 30, 2011


శని త్రయోదశి సందర్భంగా ఈరోజు నవగ్రహ పూజలు జరిగాయి ప్రత్యేకించి శని దేవునికి తిఆభిషేకం నిర్వహించబడినది ఆమ్జనేయస్వామికి ఇరవై ఒక్క ప్రత్యెక ద్రవ్యాలతో అభిషేకం సిన్దూరాభిషేకం జరిగినది.సాయంత్రము శని ప్రదోష కలం లో రుద్రాభిషేకం శివార్చన నిర్వహించబడినది.












Read more...

ఆంజనేయస్వామికి ఏ అభిషేకం చేస్తే ఏమి ఫలితాలొస్తాయి ?

>> Friday, April 29, 2011


ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి
ఆవునెయ్యి -ఐశ్వర్యం
తేనె - తేజస్సువృధ్ధి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .
విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.
రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం
సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది
అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
నవరత్నజలాభిషేకం - ధనధాన్య,పుత్ర సంతానం,పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి
పసుపునీటితో - సకలశుభాలు ,సౌభాగ్యదాయకం
నువ్వులనూనె తో అభిషేకిస్తే - ,అపమృత్యు నివారణ .
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం

Read more...

శనిత్రయోదశి ప్రత్యేకపూజలకు గోత్రనామాలు పంపండి

>> Thursday, April 28, 2011

హనుమత్ రక్షాయాగం జరుగుతున్న ఈ రోజుల్లో ఎల్లుండి శని త్రయోదశి వస్తున్నది . శుభకరమైన ఈరోజు శనీశ్వరునికి అభిషేకాదులు నిరహించుటద్వారా ఆయన ప్రభావంతో కలుగుతున్న బాధలు నివారణవుతాయి . దానికి తోడు ఇప్పుడు హనుమత్ రక్షాయాగంలో పాల్గొని హనుమాన్ చాలీసాకూడా పారాయణం చేస్తే శీఘ్రమే శుభాలు వర్షిస్తాయి. ఇప్పటివరకు ఇంకా పారాయణం మొదలుపెట్తనివారు తమగోత్రనామాలను పంపి పారాయణం ప్రారంభించండి . ఇంకావివరాలు కావాలనుకుంటే ఈబ్లాగులోనే ఉన్నాయి చూడండి.

మనం కష్టాలను ఎవరి ద్వారానో ,లేదా కొనుక్కుని కట్టుకున్న యంత్రాలద్వారానో నివారించుకోలేము. స్వయంగా భగవంతుని సేవించి మన మనోభీష్టాలను నెరవేర్చుకోగలుగుతాము, అని మీ జీవితంలో మీరు ప్రయోగపూర్వకంగా నిరూపించుకునే అవకాశమిది .

సర్వేజనా : సుఖినోభవంతు.

durgeswara@gmail.com

9948235641

Read more...

అత్యంతభక్తిశ్రద్దలతో అష్టోత్తర కలశాభిషేకం

>> Tuesday, April 26, 2011











పోయిన శనివారం హనుమంతులవారికి అష్టోత్తరశత కలశాభిషేకం హనుమాన్ చాలీసా పారాయణము అత్యంత భక్తిశ్రద్దలతో జరిగాయి. హనుమత్ రక్షా యాగంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంళో విశేషద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకములు జరిగాయి . బాలురనుండి వృధ్ధులవరకు ఆనందోత్సాహాలతో స్వామిని సేవించుకుని తన్మయులయ్యారు. తమాలార్చనలు ,పుష్పార్చనల అనంతరం హనుమాన్ చాలీసాను నూటఎనిమిది పర్యాయములు గానం చేయటం జరిగింది. ఎక్కడో మారుమూలపల్లెలనుంచికూడా వచ్చిన భక్తులు తమకు స్వామి అనుగ్రహం కలగటం వలననే ఆయనను ఇలాసేవించుకోగలిగామని సంతోషంతో వెల్లడించారు.

ఈకార్యక్రమాన్ని గుర్గావ్ లో నివాసముంటున్న మోహన్ కిశోర్ & కళ్యాణి దంపతులు స్వామి సేవలో భాగంగా నిర్వహింపజేశారు. ఈసందర్భంగా హనుమత్ రక్షాయాగంలో పాల్గొంటున్న భక్తులందరి గోత్రనామాలతో పూజజరపటం జరిగింది.

Read more...

బంపర్ ఆఫర్ .... ఐదువేలకు లక్ష ఇస్తారట

మా గ్రామాలలో ఇప్పుడు దేవుణ్ణి నమ్మటానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు . మీరు ఒక ఐదువేలు కడితే మీకు లక్షరూపాయలు ఇస్తారట . అయితే మీరో చిన్నపనిచేయాలి .వాళ్ళుచెప్పినట్లుగా వారి ప్రార్ధనాస్థలాలకు ఒకసంవత్సరంపాటు వెళ్ళి ప్రార్ధనలలో పాల్గొనాలట. ఇదీ ఒకమతంవారు చేస్తున్న దైవసేవ. ఎదురుడబ్బిచ్చి మరీ దేవుణ్ణి చూపిస్తుంటే ఇంకాగుతారా , అత్యాసపరులు ,మానసిక బలహీనులు,డబ్బిస్తే మతమేం ఖర్మ మాతృమూర్తినే మార్చేసే మనుషులు క్యూలుకడుతున్నారు . మొన్నీమధ్య పెద్దఎత్తున ఒకగ్రామంలో ఈకార్యక్రమం జరుగగా దానికి పోలీసులు స్పందించి ఆనిర్వాహకులను పిలిచి విచారిస్తే ,మేము ఇవ్వటం ఖాయం . ఇస్తామని మోసం చేయటంలేదు . తప్పనిసరిగా మానిబంధనలను అనుసరించినవారికిస్తాం . వాళ్లంతట వాళ్ళువస్తున్నారు మేమేమీ ఇళ్లలోకి వెళ్ళిలాక్కొనిరావటం లేదుకదా ? అని ప్రశ్నించారు. ఇక వీరిపై ఫిర్యాదుచేసేందుకు ఎవరూ ముందుకొచ్చేవారు లేరు , పత్రికలలో వచ్చింది కనుక ఈమాత్రమైనా అడగటం జరిగింది ,అనుకుని పోలీసులు మౌనంవహించారు.
ఇలా ఎరవేసి చేపలను పట్టే విధానమే దైవసేవ అనే ముసుగులో చేసే మతవ్యాపారం రేపు దేశానికెంత ప్రమాదకరమో తరువాత తరువాత గాని తెలిసిరాదుమనకు.

ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మనమతానికె ఎసరు పెడతారు ...హరిగోవింద ..గోవింద
అంటూ తాతగారు వీరబ్రహ్మేంద్రస్వామి వారు చేసిన హెచ్చరిక మనకళ్ళముందు కు వచ్చినా ఏమీ చేయలేం . ఎందుకంటే ఇది ఓట్లబ్యాంకుల రాజ్యం . దీనిలో నాయకులకు జాతి,ధర్మం,సంస్కృతి అనే పదాలకు అర్ధాలు తెలియవు. ఇక్కడున్నదొక్కటే కొట్టిబతకడం ..దొంగదొరై తిరగడం .

కానివ్వండి వినాశకాలే విపరీతబుధ్ధిః

Read more...

హరి భజన వినా ..... సుఖశాంతి నహీ

>> Saturday, April 23, 2011


ఒక దివ్యజ్యోతి తరళివెళ్ళిపోయింది .శివునిలో ఐక్యమైపోయింది . అయితే ఆదివ్యజ్యోతి వెలుగులుమాత్రం దారిచూపుతూనే
ఉంటాయి చీకటిలో . బాబా తానుస్వయంగా పాడిన పాటను ఇప్పుడు టీవీలో చూపించారగా వారి బోధ హృదయంలోకి చొచ్చుకెళ్ళింది.

ఆపాట.

హరి భజన వినా ..... సుఖశాంతి నహీ .

Read more...

ఈ మొక్కలే నా ఆశకు ఆధారం .

>> Friday, April 22, 2011

నేను కూడా ఒక గిన్నె నీళ్ళుపోసి పెంచిన మొక్క కూడా సుఫలాలను ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
విషయమేమిటంటే మేము పీఠం తరపున నడుపుతున్న పాఠశాలను ఈసంవత్సరం ఆపిన విషయం మీకు తెలిసినదే. మాపిల్లలను అనేకపాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు . వినుకొండలోని ప్రముఖపాఠశాల గీతాంజలిలో కొంతమంది చేరారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన పేరం రాజమోహన్ రెడ్డి అనే పిల్లవాడు కూడా ఈపాఠశాలలో చేరాడు. అక్కడే హాష్టల్ ఉంటున్నాడు .
ఈమధ్య ఆపిల్లవాడు అడచివెళుతుంటే రెండువేలరూపాయల నోట్లకట్ట దొరికిందట. పక్కన ఉన్నపిల్లలంతా ఇది బజార్లో దొరికింది మనస్కూల్లో కూడా కాదు కదా ! నువ్వే ఉంచుకో అని సలహా ఇచ్చినా వినకుండా వెళ్ళి ఆ పాఠశాల ఉపాద్యాయులకిచ్చాడట . వాళ్ళు చాలా ఆస్చర్యపోయి .ఇంత డబ్బు మాకిచ్చవేరా ? నువ్వే ఉంచుకోలేదెందుకని అడిగారట.
లేదండి ! మనది కాని సొమ్మును మనం ఉంచుకోకూడదు ,అని మా దుర్గా మాష్టర్ గారు చెప్పారు . మాపాఠశాలలో ఏవైనా వస్తువులు దొరికితే అసెంబ్లీలో పిల్లలకు చూపి ఎవరివి వారికిస్తాము . డబ్బుదొరికితే అవి ఎవరివో కనుక్కుని వారికందజేస్తాము ,ఎవరివనేది తెలియకపోతే దేవుని హుండిలో వేస్తాముగానీ ఎవరం ఉంచుకోము . అని చెప్పాడట.
ఉపాధ్యాయులు చాలాసంతోషించి నీకేదైనా బహుమానం ఇస్తాము కోరుకోమంటే నాకేమీ వద్దు అని చెప్పాడట. వాళ్ళు పాఠశాల అసెంబ్లీలో ఈసంఘటన మిగతావిద్యార్థులందరికీ చెప్పి ఈపిల్లవాణ్ని అభినందించి ఒకశాలువా కప్పి సత్కరించారట . మాపాఠశాలగూర్చి ,మాశిక్షణగూర్చి మరీమరీ చెప్పారట . ఇదిచాలదా ? మాకు

Read more...

యాగంలో పాల్గొంటున్నవారిపై స్వామి అనుగ్రహం వర్షిస్తున్నది.

>> Wednesday, April 20, 2011


హనుమత్ స్వామి పరమకృపాళువు . కొలచినవారికి కొంగుబంగారమై పిలిస్తే పలికేస్వామియని ప్రసిధ్ధిచెందాడు. ఈనాటికీ భూమిపై నివసిస్తూ ఆపదలలో ఉన్న భక్తులకు అండగాఉండి కాపాడుతున్నాడు . ఆయనను దర్శించిన సాధకులు ఈరోజులలోనూ ఎందరో ఉన్నారు. నాలాంటి సామాన్య సేవకుడు దర్శించలేరని జాలిచెంది ఆయన తన ఉనికిని తానేచాటుతుంటాడు . అలాంటి అనుభవమే ఈరోజు ఒకటి ప్రసాదించారు స్వామి. ఉదయం వాతావరణం చల్లగాఉంది . హనుమత్ రక్షాయాగం లో భాగంగా ఈ యాగంనకు అనుసంధానంగ పారాయణాదులను చేస్తున్న భక్తులతరపున అభిషేకం చేస్తూ ఉండగా ఈబుధ్ధిహీనుడికి [నాకు] ఓ చిన్న అనుమానం వచ్చింది . ఈయాగం స్వామి గమనిస్తున్నారా? పాల్గొంటున్నవారి పై స్వామి అనుగ్రహం ఉన్నదా ? అనే చంచలం మనసునకలిగింది .
పూజ అయిపోయాక కూర్చుని చాలీసా పారాయణం ప్రారంభించాను .అంతే స్వామి తన అనుగ్రహం వర్షంలా అనుగ్రహిస్తున్నారన్నట్లు గా చిరుజల్లు మొదలైంది .స్వామి ని సందేహించినందుకుమనసున క్షమాపణలు వేడుకుంటూ పదకొండుసార్లు పారాయణం చేయటం పూర్తయ్యేవరకు పడిన చిరిజల్లు పారాయణం పూర్తికాగానే ఆగిపోయింది . " ఇది తులసీదాసునకు నేనిచ్చిన వరం .ఎవరు నన్ను చాలీసాతో స్థుతించినా వారికి నేను రక్షణగా ఉంటానని వరమిచ్చాను" అని స్వామి ఇస్తున్న సంకేతంలాభావించి "బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యాదేహు మొహు హరహు కలేశవికార్ " అని క్షమాపణలుచెప్పుకున్నాను.

Read more...

భక్తాగ్రేసరుడు హనుమాన్‌

>> Tuesday, April 19, 2011

భక్తాగ్రేసరుడు హనుమాన్‌
- తటపర్తి రామచంద్రరావు
నామాన్నయితే తాను నిత్యం జపిస్తుంటాడో ఆ రామనామానికి శాశ్వతత్వం కలిగించటానికే శ్రీరామావతారానికంటే ముందుగా హనుమంతుడి జన్మకు అంకురారోపణ చేశాడు పరమశివుడు. తన అంశను తీసుకుపోయి అంజనాదేవి గర్భాన చేర్చమని వాయుదేవుణ్ని నియోగించాడు. అందుకనే వాయుపుత్రుడు, పవనసుతుడు, మారుతి అనే వివిధ నామాలతో ప్రస్తుతి పొందుతున్నాడు హనుమంతుడు.

విషయ స్పష్టతతో, స్ఫుటంగా విస్పష్టంగా మళ్ళీమళ్ళీ వినిపించేలా ప్రతి అక్షరాన్నీ పలుకగల ఉత్తమ హనువులు (దౌడలు) కలవాడు కనుక ఆయనకు 'హనుమాన్‌' అన్నపేరు సార్థకమైంది. సన్యాసి వేషంలో రామలక్ష్మణుల ముందుకు వచ్చి ఆయన మొదటిసారి మాట్లాడినప్పుడు 'లక్ష్మణా! రుగ్వేదంలో మహాపండితుడు కాకపోతే, యజుర్వేదాన్ని ఔపోసన పట్టకపోతే, సామవేదంలో దిట్ట కాకపోతే- ఇంత స్పష్టంగా ఇంకా ఇంకా వినాలనిపించేలా మృదుమధుర కంఠంతో ఇలా ఇతడు పలకలేడు సుమా! ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు. ముఖంలో, కళ్ళల్లో, నుదుటిలో, హస్త విన్యాసంలో వ్యంగ్యంలేదు. ఇతను తప్పక హనుమాన్‌ అయి ఉంటాడు' అన్నాడు శ్రీరాముడు.

కేవలం అంజనకు జన్మించడం వల్లనే ఆయన ఆంజనేయుడు కాలేదు. ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు నాభి నుంచి మొదలైన వాయువు హృదయాన్ని దాటి శ్వాసనాద తంత్రుల్ని స్పృశించి అంగుడుని అంటే అంజనను తాకుతుంది. ఈ వాయువుకు, అంజనకు పుట్టినవాడు- అంటే 'ప్రశస్తమైన వాక్కు' కలవాడు కనుక ఆంజనేయుడు!

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యదేవుడి వద్ద సర్వవేద శాస్త్రాలు అభ్యసించిన పండితుడు, దేవతల ఆశీస్సులతో సిద్ధులు పొందిన సిద్ధపురుషుడు. వజ్రశరీరుడు. ఒక్క బ్రహ్మాస్త్రానికి తప్ప ప్రపంచంలో ఏ ఆయుధానికీ తల వంచనివాడు. సుగ్రీవుడిలా రాజరికాన్ని సమర్థించగలడు. రామలక్ష్మణులతో సమానంగా ఒంటరిగా ధైర్య సాహసాలతో యుద్ధం చేయగల వీరుడు. గరుడునిలా ఎంతో ఎత్తుకు ఎగిరి సుదూర ప్రాంతాలకు చేరగలడు.

ఆత్మ పరిశీలన, మానసిక ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, వస్తుమయ ప్రపంచంపై వైరాగ్యం, సత్వసాధనం మొదలైన ఉత్కృష్ట గుణాలతో- ఆ మహాదేవుడితో సమానమైన రామభక్తుడు.

ఇంతటి మహాధీశాలికూడా లంకలో మొదట సీతాదేవి కానరాక నిరాశా నిస్పృహలకు గురై, రిక్తహస్తాలతో వెనుదిరిగితే శ్రీరాముడితో సహా అంతా హతాశులవుతారని చింతించి- ప్రాణత్యాగం చేసుకుందామనుకున్నాడు. కేవలం అది లిప్తకాలం పాటు. 'చనిపోతే దోషం, బతికుంటేనే కదా శుభాలను బడయవచ్చు' అని తనను తాను సముదాయించుకొని- ఆశావాదంతో సీతాన్వేషణలో సఫలీకృతుడయ్యాడు. రావణాసురుడు తన కళ్ళెదుటే సీతను బెదిరించి వెళ్ళిపోతే ఆమె తన జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైనప్పుడు రామ కథాగానంతో సీతాదేవిని ఊరడించి రామ సందేశాన్ని వినిపించాడు. హనుమంతుడి పాత్రలేని శ్రీరామకథ అసంపూర్ణమయ్యేది.

సీత బహూకరించిన మాలలోని ముత్యాలను కొరికి పారేసినప్పుడు ఆయన భక్తిని శంకించిన వాళ్ళకు దివ్య సందేశమిస్తూ- తన గుండెల్ని చీల్చి అక్కడ ప్రతిష్ఠించుకున్న సీతారాముల్ని చూపించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. పితృవాక్య పరిపాలనలో శ్రీరాముడికి ఎంత పేరొచ్చిందో, మాతృవాక్య పరిపాలనలో శరణాగతుడికి రక్షణ కల్పించి తన దేవుడితోనే పోరాటానికి సంసిద్ధుడై- తానూ అంత పేరు తెచ్చుకున్నాడు. రామ బాణాన్ని మించినది రామనామమని లోకానికి చాటిన దివ్యుడు.

సృష్టి మిగిలినంతకాలం రామనామ జపం ఆగదు. రామశబ్దం వినిపించిన చోటల్లా ప్రత్యక్షమయ్యే చిరంజీవి భక్తాగ్రేసరుడు... భక్త జన రక్షకుడు హనుమాన్‌!

Read more...

హనుమత్ రక్షాయాగానికి హాజరైన స్వామి పరివారం.

>> Monday, April 18, 2011

స్వామి అనుగ్రహముంటే ఆయన కార్యక్రమసమయంలో విశేషవ్యక్తులు ఇక్కడకు వస్తారని మానమ్మకం .అది నిజమని నిరూపిస్తూ మానమ్మకాన్ని పెంచే నిదర్శనాలు స్వామివారు చూపిస్తూనేఉన్నారు.
శనివారం రోజున ప్రాతఃకాలంలో నే పీఠంలో నిత్యపూజలు జరిగాక హనుమంత్ రక్షాయాగం ప్రారంభించాము .ఆపూజాసమయంలో మేము సరిగా చేస్తున్నామో లేదో పర్యవేక్షించటానికన్నట్లుగా ఇద్దరు వానరయూధముఖ్యులు స్వామి వారి పూజచూస్తూ చెట్లమీద ప్రత్యక్షమయ్యారు . మాఊరికి కోతులు ఎప్పుడో గాని రావు . స్వామి కెదురుగా ఉన్న చెట్లపై తిష్టవేసి కార్యక్రమాన్ని తిలకించారు . పూజముగిశాక స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని , స్వామి సేనాధిపతులయిన మైందద్విదులుగా భావించి ఆవానర స్వాములకే మొదటగా ఇచ్చాము .

ఇక రాత్రి ఇంకో విశేషం జరిగింది . ప్రముఖ హనుమదుపాసకులు , హనుమత్తత్వప్రచారకులు ,పరాశరసంహితపై విశేషపరిశోధనచేసి వెలుగులోకి తెచ్చి అందరికీ అందుబాటులో ఉంచినవారు , డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రిగారు పీఠానికి విచ్చేశారు. సోమవారం వినుకొండలో వేలాదిమంది భక్తులకు హనుమద్దీక్ష ఇవ్వటంకోసం వినుకొండవస్తూ అంతవత్తిడిలో కూడా హనుమత్ రక్షాయాగమ్ కార్యక్రమాన్ని పరిశీలించాలని వారు రావటం నిజంగా స్వామి అనుగ్రహమే . స్వామికి ఆంతరంగికభక్తులలాంటి వారు రావటం సాక్షాత్తూస్వామి పరివారమే వచ్చారని మనసు ఆనందంతరంగితమైనది. లాంగూలాస్త్రపూజవిధికై మామితృలు పెయింటర్ ప్రసాదగారు చిత్రించి ఇచ్చిన హనుమచిత్రం చాలాబాగుందని ఇలాంటి చిత్రం అందరికీ అందుబాటులో ఉండేలా కొన్ని కాపీలు తీసి ఇస్తేబాగుంటుందని సూచించారు. ఆయన వచ్చి యాగ వివరాలను అడిగి ఓగంట ఇక్కడగడిపి ఆశీర్వాదాలందించి వెళ్ళారు.

ఇక లోకశ్రేయస్సుకై చేస్తున్న ఈయాగం కొరకు సంకల్పించి ఎక్కడెక్కడో ఉన్న భక్తులు తాముకూడా సుందరకాండ,మన్యుసూక్త రుద్రసూక్త,హనుమాన్ చాలీసా పారాయణాదులు ప్రారంభించామని తెలుపుతుంటే స్వామి దయాహృదయాన్ని వర్ణించటానికి మాటలు చాలటం లేదు. నాగేంద్రకుమార్ గారు హైదరాబాద్, ఒంగోలు శ్రీనుస్వామి ,మోహనకిశోర్ [ఢిల్లీ]మనోహర్ లాంటి భక్తులు సుందరాకాండను , రాజశేఖరునివిజయశర్మ గారు ,కృష్ణమూర్తి భట్టు, లాంటి విశేషవ్యక్తులు మన్యుసూక్తాదులను . అమెరికాలో కోటీ రుద్రపారాయణం జరుపుతున్నవారిలో ఒక బృందంగాఏర్పడి భాస్కర్ గారు రుద్రసూక్త పారాయణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు .ఇక ఎంతోమంది హనుమాన్ చాలీసా పారాయణం,ప్రదక్షిణలు మొదలుపెట్టామని తెలియజేస్తున్నారు .
ఆథ్యాత్మిక ,మానసిక, భౌతిక సంకటాలను తొలగించి విశేష శుభాలను అనుగ్రహించే ఈ యాగంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని మీకందరకూ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము.

Read more...

ఈ ఆథ్యాత్మిక ప్రయోగంలో మీరూ పాల్గొని మీజీవితంలో ఎదురవుతున్న సమస్యలను తొలగించుకోండి

>> Thursday, April 14, 2011

మనిషి జన్మించిన సమయం నుండి గ్రహస్థితులననుసరించి జీవనయానం జరుగుతుంది అని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఇదొక అపూర్వవిజ్ఞానం. మనదేశసంపద. ఎవరునమ్మినా నమ్మకున్నా ఆయా గ్రహాలు ఆజీవిపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఇక్కడ మనం ఎలాజరగాల్సుంటే అలాజరుగుతుంది కనుక మనమేమిచేయగలం అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఎండను తగ్గించలేకపోవచ్చు,కానీ గొడుగును ఉపయోగించుకుని ఎండతీవ్రతనుండి రక్షణపొందవచ్చు. అలాగే మానవజీవితంలో జాతకప్రకారం ఎదురయ్యే సంకటాలను వివిధ రీతులలో పరిష్కరించుకునేమార్గాలను మహర్షులు మనకు అందించారు. వీటిలో అత్యున్నతమైన పద్దతి భగవంతుని ఆశ్రయించి ఆయన ఆరాధన ,నామస్మరణలద్వారా చెడుకర్మలను నశింపజేసుకుని జాతకంలో గల ఇబ్బందులు మనపై ప్రభావం చూపకుండా నిరోధించగలగటం .
దీనికోసం రుషులు తాముదర్శించిన మంత్ర,స్తోత్రాదులను, మానవులకందించారు. వీటి జప పారాయణాదులు ద్వారా సత్ఫలితాలను పొంది అప్పుడు భగవత్ శక్తి పై విశ్వాసం పెంచుకుని సంపూర్ణమానవునిగా తనను తాను మలుచుకోవాలనే యత్నం చేస్తాడు అనేది వారి ఉద్దేశ్యం.
ఇక భగవంతుడున్నాడా ? మంత్రాలకు చింతకాయలు రాలతాయా ? వంటి తలతిక్క ప్రశ్నలువేసే స్థాయినుండి మనఋషులు చెప్పినదానిలో సత్యాసత్యాలను స్వయంగా నిరూపణచేసుకునేందుకు ప్రయత్నించటం విజ్ఞత.
చింతకాయలను రాల్చటం కోసం మంత్రాలవసరం లేదు అనే ప్రాథమికజ్ఞానం మనిషికి ఉంటుంది కదా ?

ఇక ఇప్పుడు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ఈ ఋషివిజ్ఞానాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించే అనేక ఆరాధనారీతులను నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో "హనుమత్ రక్షాయాగం" అనే ఆథ్యాత్మిక ప్రయోగాన్ని గతరెండు సంవత్సరాలుగా చేపడుతున్నది. ఇప్పుడు తాముఎదుర్కొంటున్న జీవిత సమస్యలను ఈ యాగంలో పాల్గొనుటద్వారా పరిష్కరించుకోగలమాలేదా ?అనే ప్రయోగాన్ని గత రెండు సంవత్సరాలుగా అనేకమంది భక్తులు స్వయంగా చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా తమ జీవితంలో ఎదురైన సమస్యలు విజయవంతంగా తొలగించుకున్నారు. అది వారి భక్తికి స్వామి శక్తికి నిదర్శనం.

ఎక్కడో సప్తసముద్రాలవతర ఉద్యోగవేటలో నిరాశలో మునిగున్నసమయంలో స్వామి అనుగ్రహంతో జయం సాధించినవారు. సంతానం కోసం తపించి సత్ఫలాన్ని పొందినవారు, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని తొలగించుకున్నవారు ,ఇలా ఎంతో మంది స్వామి అనుగ్రహాన్ని పొందారు. మహనీయులిచ్చిన పారాయణాదుల శక్తేమిటో స్వయంగా చవిచూసి ఉన్నారు. ముఖ్యంగా యువత స్వామి అండతో వారి క్షేత్రరంగాలలో విజయాలు సాధిస్తున్నారు .
ఈసంవత్సరం హనుమత్ రక్షాయాగం మూడవ ఆవృత్తిని ఏప్రిల్ పదహారునుంచి ప్రారంభించటం జరుగుతున్నది . సాధారణ నియమాలతోనూ.విశేషనియమాలతోనూ ఎలాపాల్గొనాలో వివరాలు ఈబ్లాగులో ఉన్న హనుమంతులవారి చిత్రంపై క్లిక్ చేసి చూడవచ్చు. మనసమస్య పరిష్కారం కోసం అనేకమందిని ఆశ్రయించి వారిచుట్టూ తిరగటం బదులు స్వామిచుట్టూ తిరిగి మనసమ్యలను ఎందుకు పరిష్కరించుఓకూడదు ? ఇంది మహాత్ములుచూపినబాట . మీరుకూడా ఈ ఆథ్యాత్మిక ప్రయోగంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము.
జైశ్రీరాం .

Read more...

రామనామం వింటే ఈపైత్యరోగులకెందుకు భయం ?

>> Wednesday, April 13, 2011

ేమనకీమధ్య రాముని మీద విమర్శలుచేసే మేతావులు ఎక్కువగా కనపడుతున్నారు . రాముడు అనేపదం వినపడితే పూర్వం రాక్షసులు ఎంతగా విలవిలలాడిపోయేవారో ,ఇప్పుడు వీళ్లకు రామచరితం గాని ఆయన గుణకీర్తనం గాని వింటేచాలు చెవుల్లో సీసం పోసినంత బాధకలుగుతుంది , సహజంగా శతృత్వం ఉన్నవాడికి సద్గుణధాముడైన రాముని చరిత్రం ఆయన కీర్తి ఒప్పుకోబుధ్ధి కాదు. కనుకనే రాముని గుణాలు తమకెలాగూ రావుకనుక ఆ సద్గుణాలను తమ తక్కువస్థాయి మెదళ్లతో చిన్నబుచ్చాలనే ద్వేషపూరిత యత్నాలు చేస్తుంటారు .
ఒకాయనంటాడు ,రాముడు ఇంజనీరా ? ఏకాలేజీలో చదివాడు ? అని . ఇంజనీరింగ్ అనేపదం ఏకాలంలో పుట్టిందో తెలియని మూర్ఖత్వం అనుకోవాలో, ఏమాత్రం నైతికవిలువలులేని ఈ నాయకునికి రాముని ఏకపత్నీత్వం లాంటి సుగుణమంటే ద్వేషమో మనం అంచనావేసుకోవాలి.
ఇక విషవృక్షాల సంగతి చెప్పనక్కరలేదు .అవిపుడతాయే గాని వాటి నీడనఎవరూ చేరరు.అవొకరకంగా నిరర్ధక జన్మలు.
ఇక రామాయణం ఏమిటో ? రాముని చరితమేమిటో తెలియకపోయినా రాముని రాజ్యంలో కరువొచ్చిందని , ఎవరినోచంపాడని ,స్త్రీలను ద్వేషించాడని ,రక్తమాంసాలు యజ్ఞాలలో పోసేవారు ఎంతో అహింసాపరులని అవి నిరోధించిన రాముడు హింసాత్మకుడని తమ పైత్యం వెళ్లగక్కే జాతి మొదలైంది .

ఏమాత్రం సామాజిక బాధ్యత గాని ,సంస్కారాలుగాని లేని ఒక సినీమేతావి [క్షమించాలి వీళ్లను మేథావులు అనకూడదు] రాముడివల్ల లోకానికేమి మేలు అని వెర్రిప్రశ్నలడుగుతాడు. నీబొంద !ఎప్పుడో రామునిగూర్చి పక్కనపెట్టు నీజన్మవల్ల ఏమన్నా ప్రయోజనముందా లోకానికి అదిచూడు ముందు అని అనుకుంటున్నారు జనం. వానికి సిగ్గుశరం ఉండవు కనుక ఏదైనా వాగగలుగుతారు .
అసలు ఈ తెగులు ఎందుకు పుడుతుంది ఈ బాపతు జనానికి ?

ఎందుకంటే రాముని సుగుణాలు లోకంలో ఆదర్శంగా ఉన్నంతకాలం తమ నీచపు చేష్టలు తమవాళ్లకే ఏవగింపు కలిగిస్తాయి కనుక . ఏమాత్రం ఆదర్శాలు లేని పిచ్చికుక్కలజాతిని పెంచాలంటే మానవీయవిలువలను బోధించే ఇలాంటి సత్ చరిత్రలు మానవాళికి అందకుండా ఉండాలి . అందుకే రాముని ఆదర్శలను ఔదలదాల్చే భారతజాతి లో రాముని పట్లచులకనభావనకలిగించాలని అవసరమున్నా లేకున్నా, పిచ్చివాదనలనులేవదీస్తూవిశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం గందరగోళం సృష్టించాలని తమ పైత్యప్రకోపాలను జనానికి అంతించాలని చూస్తుంటారురు. పాపం ఆకాశం పైన ఉమ్మెయ్యాలన్న వీరి వెర్రిప్రయత్నాలు విఫలమైనా సిగ్గుఉండదుకనుక తమలోని రాక్షసాంసలు మరలా అదేపనికి ప్రేరేపిస్తున్నంతకాలం ఈపని చేస్తూనే ఉంటారు.మానసిక రోగులైన వీరిస్థితికి జాలిపడి జనం చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. అది వీళ్ళగొప్పదనానికి మేతస్సుకు విజయంగా భావించిన ఈపిచ్చికుక్కలజాతి మరింతగా పెరేగుతుంది. జనం కర్రతీసుకుని చావబాదే రోజొచ్చేంతవరకు వీటి మొరుగుడు ఆపవు.
ఇది ఇప్పుడేకాదు ఆనాడు త్రేతాయుగంలోనూ అంతే .
అంతచదువుకుని తపస్సుచేసిన సిద్దులను పొందిన రావణుడుకూడా మారీచునితో రాముడు దుర్గుణపరుడని వాదిస్తాడు. ఎవడయ్యా ! నీపుర్రెకు ఇలాంటి విషమెక్కించినవాడు అని మారీచుడు హెచ్చరించినా వినడు. వినాశకాలే విపరీతబుధ్ధి అంటారు దీన్నే.

ఇక భారతీయ ధార్మిక నైతిక విలువలను దెబ్బతీసే యత్నంలోమునిగిఉన్న విదేశీ ఏజంట్లు,మతప్రచారవాదులు కోట్లకొలది డబ్బు వెచ్చించి పెంపుడుకుక్కల్లా ఈ పిచ్చికుక్కలను పెంచి ఉసిగొల్పుతుంటాయి . త్రేతాయుగంలో రామున్ని అనుసరించటం గొప్పకాదు ,కల్మషమయమవుతున్న ఈ కలియుగంలో రాముని ఆదర్శంగా తీసుకోవటమే గొప్ప ఆథ్యాత్మిక సాధన గా మనం గుర్తించాలి

ఆపదామప హర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం .

జైశ్రీరాం .

Read more...

హనుమత్ రక్షాయాగం [మూడవ ఆవృత్తి] ప్రారంభం కాబోతుంది .వివరములు చూడండి .

>> Sunday, April 10, 2011


శ్రీరామ

మహాబలి .శ్రీరామభక్త హనుమంతుడు సర్వలోక రక్షాకరుడు . భక్తితో ఆశ్రయించినవారి కి సర్వత్రారక్షకుడై సకల శుభములను చేకూరుస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో వున్న విపత్కరపరిస్థితులనుండి రక్షణ పొందటానికి సులభతరమైన ఆయన ఉపాసన ఎంతో శుభప్రదము జీవితాన మనం ఎదుర్కుంటున్న సకలసమస్యలను తొలగిస్తుంది. అదీగాక ఇప్పుడు భూమిపై పలు ఉత్పాతాలు సంభవించేకాలము. పలుప్రమదాలు పొంచిఉన్నాయని పంచాంగాలన్నీ హెచ్చరిస్తున్నాయి . ఈస్థితిలో కేవలం మనశక్తి సామర్ధ్యాలు మాత్రమే మనలను రక్షించజాలవు .శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం భక్తజనశ్రేయస్సుకై "హనుమత్ రక్షాయాగం" [మూడవ ఆవృత్తి] నిర్వహిస్తున్నది . ఒక ఆథ్యాత్మిక ప్రయోగంగా జరిగే ఈసాధనలో పాల్గొని గత రెండుసార్లు యాగంలో పాలగొన్నవారు స్వయంగా సాధనతో అద్భుతఫలితాలు పొందారు. ఎంతోమంది అనారోగ్య,వృత్తి,గ్రహదోష ,శతృబాధ,నరఘోష , సంతానలేమి ,ఉద్యోగం , మానసిక,ఆథ్యాత్మిక సమస్యలను తొలగించుకున్నారు.తమకష్టాలను సంకటాలను తొలగించుకుని తమజీవితాన మంచి మేలునుపొందియున్నారు. బుధ్ధిర్భాలాన్ని యశోధైర్యాలను ప్రసాదించగల ఈ యాగంలోఇక్కడ అంతర్జాలంలోనూ యెంతోమంది పాల్గొని స్వామి అనుగ్రహం చవిచూసిఉన్నారు .

తామున్న స్థలంనుండే ఈ యజ్ఞక్రియతో అనుసంధానింపబడి సాధన చేసుకొని తమ సమస్యలను తామే తమ ఆథ్యాత్మిక శక్తి ద్వారా పరిష్కరించుకోవటమే ఈ యాగనిర్వహణ లక్ష్యం. దీనిలో పాల్గొని స్వామి కృపకు పాతృలై మీ జీవితంలో మీరెదుర్కుంటున్న సంకటములను తొలగించుటలో స్వామి శక్తిని అనుభవంలోకి తెచ్చుకోగలరు. మీరు గోత్రనామాలను యాగనిర్వహణా కేంద్రమైన పీఠమునకు పంపి మీరు సూచించబడిన సాధనలను నియమానుసారంగా చేసి పూర్ణాహుతికి యజ్ఞకేంద్రమునకు గాని లేక సమీపంలోగల సిధ్ధ హనుమత్ క్షేత్రంనకు గానివెళ్లవలసి ఉంటుంది .

విధివిధానాలు
----------

దీక్షానియమము ,సాధారణ నియమముల లో చేయవచ్చు .మీకు ప్రస్తుతమున్న పరిస్థితులలో అనుకూలమైన మార్గంలో మీసాధన సాగించవచ్చు.

సాధారణ నియమపద్దతి
-------------------

పీఠానికి మీగోత్రనామాలు పంపి ,మీరు హనుమదాలయంలోగాని మీ పూజామందిరంలోగాని స్వామివారి కి అర్చనజరిపి మీ సమస్యను పరిష్కారం కోరుతూ స్వామివారిముందు సంకల్పం చెప్పుకోవాలి . ఉదయాన్నే శిరఃస్నానమాచరించి సింధూరధారణ, దీపారాధన ,లఘువుగానైనా దేవతార్చ చెసుకుని స్వామివారికి అరటిపండ్లు నివేదించుకోవాలి. ఆతరువాత మీకు వీలైతే సమీపంలో ఉన్న హనుమదాలయంలోగాని లేక చిత్రపటాన్ని తులసికోట లేదా ఒక కొత్త ఆసనంలో నూతన వస్త్రంపరచి దానిపై స్వామివారి చిత్రపటాన్నుంచి మీరు సంకల్పించుకున్న ప్రకారం 108--54--27 గాని మీ సంకల్పానుసారం ప్రదక్షినలు చేయాలి.
ఆతరువాత సుఖాసనంలో కూర్చుని హనుమాన్ చాలీసా 11 సార్లులేదా సుందరాకాండ పారాయణం గాని ఈనలభైరోజులు నియమము తప్పకుండాచేయాలి .రాత్రి ఆంజనేయస్వామి దండకం చదువుకోవాలి. హనుమత్ కథలను వినటమో చదవటమో చేయాలి.
హనుమత్ ప్రీత్యర్ధం రామనామజపం చేయాలి. శరీరం సహకరిస్తే ఏకభుక్తం ,లేదంటే శనివారం రోజు ఏకభుక్తంతోగడపాలి . బ్రహ్మచర్యం సాధనలో శక్తిని పెంచుతుంది. మద్యమాంసాదులు ,అధర్మ వర్తనం ,ధూమపానం నిషేధం .స్వామి ధర్మరక్షకుడు .
ఈసమయంలో ఇతరుల భోజనాలు చేయటం వలన మీసాధనాఫలితం వారికి ధారపోసినవారవుతారు కనుక సాధ్యమైనంతవరకు ఇతరులయింటికి భోజనానికి వెళ్లకపోవటం మంచిది. అశుభకర్మలకు వెళ్లరాదు. ఇంటిలో కూడా ఆడవారికి ఇబ్బంది ఉన్నప్పుడు వారు ఇంటిపనులుచేయకుండా తాకకుందా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మీరొకవేల ప్రయాణములలో ఉన్న ఎక్కడైనా ఈసాధనజరుపుకోవచ్చు . ఆడవారు మొదలుపెట్టినతరువాత ఇబ్బందివచ్చినప్పుడు ఆనాలుగురోజులాగి ఐదవరోజునుంచి మరలామొదలుపెట్టి నలభైరోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి నలభైరోజులతరువాత పూర్ణాహుతికి పీఠానికి రావచ్చు. వీలుకుదరని పక్షంలో సమీపంలోని హనుమదాలయానికి వెళ్ళి హనుమత్ వ్రతం చేసుకుని లేదా ఆకుపూజజరిపించి సాధనపూర్తిచేసుకోవాలి.


దీక్షానియమము.
---------------
ఈపద్దతిలో సాధకులు స్వామి వారి మాలధరించాలి . కాషాయవర్ణవస్త్రాలు ధరించాలి ,బ్రహ్మచర్యము,భూశయనము ,ఏకభుక్తము ,నిత్యం సుందరాకాండ లేక హనుమాన్ చాలీసా 11 సార్లకు తగ్గకుండా పారాయణం , ఉదయాన్నే హనుమత్ ప్రదక్షిణలు చేయాలి .స్వామివారి అర్చన సాగించాలి .సాధ్యమైనవాళ్ళు అనుబంధంగా రుద్రసూక్త,మన్యుసూక్తములతో అభిషేకములు , సూర్యనమస్కారములు నిర్వర్తించాలి ,ఆంజనేయస్వామి దండకం పఠించాలి . రామనామ జపం చేయాలి .మాలధారణలో నియమాలన్నీ పాటించాలి. పూర్ణాహుతికి పైన చెప్పినట్లుగానే చేయాలి .అయితే దీక్షను పురుషులు నెలసరి ఇబ్బందులు లేనివారు పిల్లలు మాత్రమే చేయాలి.

యాగంప్రారంభం ; 16-4-2011 శుద్ధత్రయోదశి శనివారం

నిత్యకార్యక్రమములు ః మన్యుసూక్త,రుద్రసూక్త సహితంగా అభిషేకములు తమాలార్చనలు
ప్రతిశనివారం విశేషద్రవ్యములతో అభిషేకములు ,108 సార్లు చాలీసా పారాయణం



హనుమజ్జయంతి ; 27 -5-2011 వైశాఖ బహుళదశమి శుక్రవారం సామూహికంగా హనుమత్ వ్రతం
పూర్ణాహుతి ; 28-5-2011 ఏకాదశి పూర్ణాహుతి ,అన్నదానం .


మీరుచేయవలసిన దేమిటి ?
-----------------------
మీసమస్య పరిష్కరించుకోవటానికి పైన సూచించినన పద్దతులలో మీకువీలైన రీతిలో సాధనమొదలుపెట్టండి. మీ గోత్రనామాలను యాగకేంద్రానికి పంపండి . మీతరపున ఒక కొబ్బరి కాయ ముడుపు కట్టబడుతుంది .ఆముడుపు పూర్ణాహుతిసమయంలో మీతరపున సమర్పిస్తారు . . ఈ నలభైరోజులు పూజలో ఉంచబడిన అత్యంతశక్తివంతమైన హనుమద్రక్షలు మీ కుటుంబానికి ఎన్నికావాలో తెలుపండి . [ఆముడుపు కు,ప్రసాదంపంపటానికి అయ్యే పోస్టల్ లేదా కొరియర్ ఖర్చులు మీరే భరించాలి] . మీరుకోరితే స్వామివారికి మీతరపున ప్రత్యేక అర్చనలు జరుపబడతాయి. ఇంకావివరములకొరకైతే ఫోన్లో లేదా మెయిల్ ద్వారా సంప్రదించండి .

గోత్రనామాలు పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com

శ్రీ వేంకటేశ్వర జగన్మాతపీఠం రవ్వవరం ,నూజండ్లమండలం ,గుంటూరు జిల్లా
సెల్ ః 9948235641

Read more...

అన్నాహజారే గారి దీక్షతో అవినీతి అంతమైపోతుందా ?????

>> Saturday, April 9, 2011

నేడు దేశం ఊగిపోతోంది . అన్నా హజారే ..అంటూ. శక్తులుమండే యువత చేవజచ్చి సినిమాలి క్రికెట్ల లో మునిగితేలుతుంటే పాపం ముసలితనం వచ్చినా సైనికుడినే నేనంటూ అన్నహజారే అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పాడు. ఆగొంతుతో పదిగొంతులు కలవగనే గుంపుకనపడితేగాని ధైర్యంరాని మనం ఊగిపోతూ పూనకంతోకోరస్ పాటెత్తుకున్నాం . అయ్యో ఇన్ని గొంతులు పాడుతుంటే మనం చూస్తుండటమా అని, సోనియా,జగన్,గాలిజనార్ధన్ రెడ్డి,యెడ్యూరప్ప వంటి త్యాగమూర్తులు సచ్చీలురంతా మేముసైతం అంటు కోరస్ పాడుతున్నారు. ఇక మనదేశంలో అవినీతి అవశేషాలు కూడామిగలకుండా నశించిపోతుందనే అమాయకపు ప్రాణులు ఏదో దింపుడుకళ్లం ఆశలు పెంచుకుంటారు . కానీ ఒకసారి వెనుతిరిగిచూసుకుంటే నిరాశే మిగులుతుంది . బాధాకరమే గాని ఇది సత్యం.

అసలుమనిషి అవినీతి కి ఎందుకు పాల్పడతాడు? . అతనిని ఎప్పుడవకాశమొస్తే అప్పుడు తప్పు చేయకుండా నిరోధిస్తున్న శక్తి ఏమిటి ? చట్టాలా !!! అయితే అనేకవిషయాలపై చేసిన చట్టాలన్నీ ఫలితాలనిచ్చాయా ? లేదే .
ఎందుకని ?

ముదుగా మనం ఓ చిన్న పరిశీలన చేసుకుందాం .ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్న వారెవరు ?
మనం రాజకీయ నాయకులు అంటాం .
మేము ఎలక్షన్లలో వేలుదాటి,లక్షలు దాటి,కోట్లలో ఖర్చుపెట్టాల్సివస్తుంది . మరదంతా ఎక్కడో ఒకచోటనుంచి తెచ్చిపెట్టాలి కదా ! ఆతెచ్చినదంతా మరలా వసూలుచేసుకోకుంటే మా అప్పులెలా తీరాలి ?మాపరిస్థితేమిటీ అంటారు రాజకీయ నాయకులు.
ఉద్యోగులు లంచావతారులు, అందామంటే .,మీరే మాపని ఎలగైనా త్వరగా పక్కవాడికంటే ముందుగా చేసిపెట్టమని వత్తిడిచేస్తుంటిరి ? చేయకపోతే ఏదో ఒక నాయకునితో చెప్పిస్తుంటిరి ! మాపైఅధికారులు,వారి పైవారు ఆపైన మంత్రులవరకు నెలవారీ ముడుపులు వసూలుచేయవలసి ఉండె ! ఇవన్నీ చేయకుండా మాకు మనుగడ ఉంటుందా అంటారు.
పోలీస్ ,రెవెన్యూ నుండి అన్నిశాఖలలోనూ నేడున్నదుస్థితి ఇది.
ఇక ఇలాంటి వాటిపై కన్నేసి అవినీతిని వెలికితీయాల్సిన పత్రికలన్నీ పెట్టుబడిదారుల మానసపుత్రికలాయె ! వారి వ్యాపారసామారాజ్యాలకు అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఏదైనా వ్రాయగలరు. తినటానికి నెలకుసరిపడా సరుకులుకూడా కొనలేని జీతాలతో పనిచేస్తున్న విలేఖరులు ఏవిధంగా బ్రతకాలని యాజమాన్యం అనుకుంతుందోగాని ఎలాబ్రతకాలో వాళ్ళే నేర్చుకున్నారు. ఇంకా ఒకరిద్దరు చాదస్తులు నిజాయితీగా వార్తలు వ్రాద్దామనుకున్నా నెలకింత యాడ్ రెవెన్యూ వసూలుచేయాలని యాజమాన్యాల వత్తిడిచేస్తుండటంతో ఎవరిదగ్గర యాడ్ లు సేకరిస్తున్నారో వాళ్లపై ఏమని వార్తలు వ్రాస్తామని మిన్నకుంటున్నారు. ఒకవేల చొక్కాలుచించుకున్నా ఒరిగేదేమీ లేదు అనే నిసృహకు లోనయ్యారు.
ఇక జనం విషయానికొస్తే అవినీతి ,అధికార దుర్వినియోగం లాంటివి కళ్ళెదుట కనపడ్డా నోరువిప్పరు. ఎక్కడో హైదరాబాద్లు ఢిల్లీ లలో జరిగిందంటూ రాస్తారోకోలకు దిగుతారు . గుంపులోచేరితే చాలు వీరావేశంతో బస్సులు వాహనాలు[తమవికాకుండా]ధ్వంశం చేస్తారు. తమకులపు వాడో ,పార్టీ వాడొనైతే చాలు వాడెన్ని తప్పులుచేసినా మనకు అవి పెద్దగా లెక్కగా కనపడవు. ఇక మనకునొక్కెయ్యాటానికి అవకాశం ఉంటె వదిలే ప్రశ్నలేదు. సాక్షాత్తూ దేవుని దర్శనానికెళ్ళినా అవినీతి మార్గంలో దర్శనానికెళ్లటానికి సిధ్ధం .
మాఊర్లో కెళ్లా అత్యంత ధనవంతులైన కుటుంబంలో మొగుడూపెళ్లాలిద్దర్కీ వృధ్ధాప్యపెన్షన్ వస్తుంది . చాలామంది ఇల్లువాకిలీ ఆస్తులు పిల్లలున్నా పెన్షన్లుతీసుకోవటం కోసం ఎగబడుతున్నారు. రాజకీయకారణాలవల్ల ఓట్ల రాజకీయాలతో నాయకులు సిఫారసు చేయటం ,అధికారులు ఒత్తిడులకు తలొగ్గటం వలన ఇవి నిరాటంకంగా సాగుతున్నాయి . ముంది ఇలా అడుక్కోవటం సిగ్గు అనిపించటంలా జనానికి
అవినీతిపరులు దోచుకుంటూన్నారు సార్ ! దేశాన్ని అని మా సోదర ఉపాధ్యాయుడొకరు ఆవేశంగా అన్నాడీమధ్య .
మాస్టర్ గారూ !మనబడికి బోడి పదివేలరూపాయలొస్తే నే ఎక్కడ దొంగ ఓచర్లు పెట్టి వందా పదీ నొక్కేద్దామని మనవాళ్ళే ప్రయత్నిస్తున్నారు కదా ! మరివందలకోట్లు కళ్లముందు ఆడుతుంటే వాళ్ళుమాత్రం ఎలా చూస్తూ ఊరకుండగలరు ? అని అన్నాను. ఇక్కడ సమస్య అదికాదు. వాడికి అందుబాటులో ఉన్నాయి నొక్కుతున్నాడు . మనకు అంత అందుబాటులో లేవు కనుక మనం విమర్శిస్తున్నాం అంతే ! అన్నాను . ఆయన మరిక మాట్లాడలేదు.

ఇక్కడమనంఒకటి మరచిపోయాం . చట్టాలులేకుండానే అసత్యం పలకకుండా ,అవినీతికి పాల్పడకుండా పొరుగువాడిసొమ్ము పాములాంటిదని భావించి ,నిత్యదరిద్రంలోనైనా బ్రతుకుతాంగాని నీతిమాలినపనులతో జీవించము అని నిర్ణయంతో ఆనందంగా బ్రతికిన మన పూర్వీకుల జీవితాలను మరచి పోతున్నాము . చట్టాలు చేసేది మనిషేకదా ! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లుగా అవసరమనుకుంటే ఆచట్టాలకు వందతూట్లుకూడా పొడవగలడు మనిషే . కాబట్టి అవినీతికి పాల్పడటం అడ్డగోలు సంపాదనకు ఆశపడకుండా నిరోధించటం కేవలం చట్టాలద్వారా మాత్రమే సాధ్యం కాదు .

ఇక్కడ అన్నహజారే జీవితంలోంచి ఒక ఉదాహరణ తీసుకుందాం .
రాలేగావ్ సిద్ధీ అనేగ్రామాన్ని అన్నహజారే గారు ఎంత శ్రమించి తీర్చిదిద్దారో మీకందరకూ తెలుసు . నైతికంగాను భౌతికంగానూ ఆవూరిని సంస్కరించి అభివృధ్ధిపథంలో నిలబెట్టాడాయన. ఆయన విజయాలను గూర్చి తెలుసుకున్న ప్రభుత్వ ఉన్నతాధికారొకరు ఆగ్రామం సందర్శించారు . గ్రామస్తులు ఉమ్మడిగా శ్రమించి కట్టుకున్న చెక్ డామ్ లు, గ్రామంలో అభివృధ్ధికార్యక్రమాలు చూశాక ఆయన ఆ ఊరిప్రజలు నిర్మించుకున్న మహాదేవుని ఆలయం దర్శించాడు. అప్పట్లోనే చాలాఖర్చుపెట్టి ఆలయాన్ని నిర్మించారని తెలుసుకుని చాలానొచ్చుకున్నాడు. హజారేగారూ! అభివృధ్ధి కార్యక్రమాలకు కాకుండా ఇలా గుళ్ళుగోపురాలకోసం ఇంతఖర్చుపెట్టాలా? ఆడబ్బుతో మరిన్ని అభివృధ్ధి కార్యక్రమాలు చేపడితే బాగుండేది కదా ? అన్నాడు. అప్పటికి అన్నా హజారె మౌనంగా ఉన్నారు
సాయంత్రం అధికారి ,హజారే గారు ఆగ్రామస్తులు పెంచుతున్న మామిడితోటలు చూడటానికి వెళ్లారు . తోటలన్నీ విరగకాసి ఉన్నాయి . కానీ ఎక్కడా కాపలాదారులు కనపడలేదు. ఆ అధికారి ఆశ్చర్యపోయి , ఇక్కడెక్కడా కాపలావారు లేరే దొంగలు కాయలు కోసుకుపోరా అని అడిగారు . లేదు . ఇక్కడెవరూ దొంగతనం చేయటానికి సాహసించరు . ఆపనిచేస్తే శిక్షింపబడతామని భయం . అన్నాడు హజారే శాంతంగా .
ఎవరు శిక్షించేది ? అడిగాడు అధికారి
పొద్దుట మీరడిగారే ! ఆ ఆలయంలోని మహాదేవుడు . ఇంతసంపదనిచ్చిన తమను కాపాడుతున్న ఆతండ్రి తప్పుచేస్తే దండిస్తాడని మానమ్మకం .అలాచేసినవాల్లకు పడిన శిక్షలు మాగ్రామానికి అనుభవమే .అందుకే తప్పుచేయటానికి మావాళ్లు అంగీకరించరు.
ఇప్పుడు చెప్పండి ఎన్నికోట్లు పెట్టి కాపలాదారులనూ ఏర్పరచినా మనుషులలో ఈ సచ్చీలత తేగలమా ? మహాదేవుని ఆలయానికి పెట్టిన ఖర్చు వృధానా ? అనడిగాడు హజారే గారు
తలపైకెత్తలేకపోయాడా అధికారి.
పాపభీతి లేకుండా పెరుగుతున్న మనుషులను చట్టాలు బెదిరించగలవు నిరోధించలేవు. నేడు అవినీతికి మూలం మనుషులలో మసులలో పెరుగుతున్న అత్యాశ. జీవితమంటే ఏమిటో తెలియని చదువు . భౌతికసుఖాలు పొందటానికి మాత్రమే మనిషిజన్మించాడని భావిస్తున్న అంథకారం . ఇవి తొలగించాలంటే నడుస్తున్న కలియుగంలో "కలిపురుషుడు" ఒప్పుకోడు మానవుని పతనానికి ప్రతినబూనిన ఆయన మనసులను కలుషితం చేస్తున్నాడు. భౌతికచట్టాలు, ఆయుధాలు మనిషిమనసులో దాగున్న ఆయననేమీ చేయలేవు మనిషిని మాత్రమే నశింపజేస్తాయి.గుర్రాన్ని బండివెనుకకడితే లాభంలేదు . అందుకే అన్నారు వివేకానందులు వ్యక్తిసంస్కరణకావాలి ముందు అని. సోషలిజం వచ్చేసి నాక సంపదంతా ఒకనికిచ్చి పదిమందికి పంచమన్నా వాడు అవినీతిపరుడైతే నేటిస్థితే ఎదురవుతుంది . కనుక జీవితమంటే ఏమిటో మానవజన్మకు సార్ధకత ఏమిటో నేర్పగలది,మనం మరచిపోయినది అయిన మనదైన విద్యకావాలి . అంతవరకు ఉద్యమాలొస్తుంటాయి ,మహానుభావులత్యాగాలు మరచిపోతూనే ఉంటుంది మానవజాతి

Read more...

తాగుబోతుల లెక్క తారుమారయ్యింది . హరిహరీ ! ఇంత మార్పా ???!!!

>> Thursday, April 7, 2011

. నాకు మరీ చిన్నతనంలో మాగ్రామంలో తాగుబోతులు కనపడితే చిన్నపిల్లలం దూరంగా పరిగెత్తేవాళ్లం . వాళ్ళు పిచ్చోళ్ళురోయ్ .రాళ్ళెసి కొడతారు అని చెప్పుకునేవాళ్లం . మొత్తంగ్రామంలో తాగుబోతులెవరంటే వేళ్లమీద లెక్కేసి పదిలోపే సంఖ్య చెప్పేవాళ్ళు . ఇక పండగపబ్బం సమయలలో కొద్దిమంది పెద్దలు ఏదో దొంగచాటుగా ఎక్కడో తాగి గప్ చుప్ న ఎవరికంటపడకుండా ఇంటికొచ్చి తొంగునేవాళ్ళు. ఇక ఎవడైనా సృతిమించి తాగితే అది లోపల ఇమడక కాబోలు బజార్లో వీరంగం వేస్తుంటే ఊరుఊరంతా అక్కడ తిరునాళ్లలా పోగై చెడతిట్టేవాళ్లు. చిన్నపిల్లలకు అదొక వినోదప్రదర్శన లాంటిది. ఇకపొద్దున్నే ఆతాగినవాడు జనమందరూ తననే చూస్తున్నారని గమనించి సిగ్గుతో చచ్చే వాడు . ఆతరువాత మేముహైస్కూల్ కొచ్చాక పుస్తకాలలో సప్తవ్యసనాలగూర్చి పాఠాలు చెబుతూ అయ్యవార్లు వాటిని అతి నికృష్ఠమైన అలవాట్లని జీవితాన్ని నాశనం చేస్తాయని చెబితే విని బయట ప్రభుత్వం దుకాణాలు పెట్టి పాకెట్లలో అమ్మేసారాయి షాపులు అక్కడ మందుబాబులచిందులు చూసి మాకు చెప్పిన పాఠాలు వీళ్లకెవరూ చెప్పలేదు కాబోలు ,చదువులేకుంటే అంతే అనుకునేవాళ్లం . సినిమాల్లోకూడా హీరోలు అలాతాగే విలన్లని భలే తన్నేవాళ్లు . కాబట్టి మేం పెద్దయ్యాక అటువంటి చెడుపనులు చేయకూడదని గాఠ్ఠిగా తీర్మానించుకునేవాళ్లం . మాచదువులతోపాటు తాగుబోతుల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వస్తూనే ఉంది . ఐతే మాకు ఉద్యోగాలొచ్చాక ఓసమస్య ఒచ్చిపడింది .ఒరే! తాగుడు తప్పురా అని పిల్లలకు మొదటిరోజులలో చెప్పగలిగాం కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాం . ఎందుకంటే ఆపిల్లల ముందు పెద్దవాళ్లంతా తాగుతుండటం ,సినిమాల్లో కూడా ఈరో లు తాగిచిందెయ్యటం ,ఈరోయిన్లు వాల్లనే అభిమానించటం [.మరీఘోరంగా వెనుకటిసినిమాలలో హీరోయిన్లను ఏడిపించేవాడు విలనైతే ఇప్పుడేమో వాడె హీరో]
ఇవన్నీ చూసేదానికీ మేం చెప్పిందివిన్నదానికీ పొంతనకుదరక పిల్లలమనసులు గిజగిజలాడుతాయని . ,కాబట్టి అటువంటి పాఠాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక ప్రభుత్వం వారుకూడా అటువంటి పాఠ్యాంశాలు లేకుండా చేశారు. కాకపోతే నైతిక విలువలు నేర్పండి ...నైతిక విలువలు నేర్పండి అని మాకు ట్రైనింగులలో చెబుతుంటారు. పోనీ నైతిక విలువలంటే రాముడు,సీత, ధర్మరాజు , శిబి, ఇలాంటివాళ్ల జీవితాలు చెప్పటమేమో నని ఆపనిచేస్తే చాదస్తుల్లావున్నారే అవి చెప్పకూడదు ? అవి ఒకమతానికి సంబంధించినవి అని తిడతారేమోనని భయం . [అలాఎందుకంటారనుకోకండి ఈమధ్యే వివేకానందుడి జీవితం పాఠ్యాంశంగా పెట్టాలనుకుంటే మా ఉపాధ్యాయసంఘాలే ఎదిరించాయి ,అలాంటివి పిల్లలకు చెప్పకూడదని .]

ఇక విషయం వదిలి దూరంగా పోతున్నాను. అసలు విషయానికొద్దాం .
నేను మాతాతగారు అమ్మవారి అనుగ్రహంతో స్థాపించిన పీఠాన్ని ఊరికిదూరంగా ఉన్న మాపొలంలో మందిరం నిర్మించి అక్కడకు తరలించడంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా నాకుటుంబ నివాసం ఒకరకంగా వనవాసం క్రిందలెక్క . కనుక నాకు ఊర్లో విషయాలు అంతగా తెలియవు . మొన్న ఒక పూజా కార్యక్రమానికి ఆడవాళ్లంతా వచ్చినప్పుడు ఆడవాళ్లంతా పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూన్నప్పుడు ఓమాట నా చెవినబడి నమ్మలేకపోయాను . ఏమిటంటే ఊరుమొత్తంలో "మందు తాగని వాళ్ళు మొత్తం ఆరుగురు" [ఊర్లో నే ఉండే మాతమ్ముడితో కలిపి] అని చెప్పుకుంటుంటే విని బిత్తరపోయాను . నా కు నలభైరెండు . ఇంత చిన్నకాలంలోనే వేల్లమీద లెక్కవేయగలిగిన తాగుబోతుల సంఖ్య తిరగబడి అది తాగనివాళ్ల సంఖ్యగా మారిందంటే ! ఇక అన్నిఊర్లూ కలిపి ఎంతమందుండొచ్చో ?
ఎంతశరవేగంగా మారిపోయింది పరిస్థితి ? ఔరా ! కలిపురుషుని మాయ .

ఒక్కసారి తాగితే వందజన్మల పుణ్యం కొట్టుకుపోతుందని శుక్రాచార్యుల వారిచ్చిన శాపం ఇంకెవడు పట్టించుకుంటాడు. ఖురాన్ లో ఓ కథ ఉంది . సైతాన్ ఓ మనిషికొక పరీక్ష పెట్టాడు. ఒకపసిపిల్లవాన్ని,యువతిని,మద్యాన్ని ముందుంచి ,పిల్లవాణ్ణి చంపుతావా ? యువతిని చెరుస్తావా ? మద్యం తాగుతావా ? వీటిలో ఏదో ఒక్కటి ఎంచుకుని చెయ్యాల్సిందే అని. అప్పుడతను అయ్యో పిళ్లవాణ్ని చంపటం,స్త్రీపై అత్యాచారం పాపం కనుక మద్యం మాత్రమే తాగుతాడు. ఆతరువాత మత్తులో పిళ్లవాణ్ణిచంపి,ఆస్త్రీని పాడుచేసి పతనమవుతాడు .
మరి ఈలెక్కన మందేసుకుని పరిపాలనచేసే మంత్రులు,అధికారులు ,ప్రజలతో ఈసమాజ భవిష్యచిత్రం ఎంతఘోరంగా ఉండబోతుందో ! ? .తాగితాగి శరీరాలు కృషించి నశించే యువత ఈదేశాన్ని రక్షంచటం మాటదేవుడెరుగు పెనుభారం అవుతారుకదా ? తాగినమత్తులో,అలవాటుపడిన పిచ్చిలో ఎన్ని ఘాతుకాలకు తెగబడి అల్లకల్లోలం సృష్టిస్తారో తలచుకుంటేనే భయం.
మీరు మరీనూ ! ఏదో సరదాగా తాగితే ఇన్ని జరుగుతాయా అని మీరు ఎగతాళి చేయవచ్చు. ఇప్పుడొకమాటడుగుతాను ఆలోచించండి . మాదకద్రవ్యాలు పెరిగి పోతున్నాయి ,అని గగ్గోలుపెడుతున్నవాళ్ళు అవి కూడా సరదాకి వేసుకునేవే అనుకోగలరా ? మద్యానికి వాటికీ పెద్దతేడా ఏముంది ? వాటి గాఢత ఎక్కువవటం వలన త్వరగా చస్తాడు ,మద్యంతో కొద్దినాళ్లాగి శరీరం శక్తిని కోల్పోతుంది అంతే తేడా . శక్తి హీనులచే నిర్ణయించబడే శాశనాలు,పరిపాలన ఖచ్చితంగా దౌర్భాగ్యకరంగనే ఉంటాయి . అవి మనకిప్పుడు బయట కనపడుతున్నాయి రేపు మనయింటిలో కొచ్చినప్పుడు నోటితో తాగినవన్నీ కళ్లనుంచి బయటకొచ్చే రోజులొస్తాయి .
అయినా ఏమీ చేయలేం మనం . కలిపురుషుని కరాళ నృత్యం సాగుతుంది . అడుగులు భగవంతునివైపుపడితే భవిష్యత్తు బంగారమవుతుంది లేదంటే భయంకర మైపోతుంది . ఈ యుగానికి ఉన్న రెండే దారులివి.

Read more...

నా బ్లాగులో ఇటువంటి నీచపుపనులుచేయకండి దయచేసి.

>> Wednesday, April 6, 2011

నేను బ్లాగునడుపుతున్న లక్ష్యం మీకుతెలుసు. ఇష్టమైన వాళ్లుచదువుతున్నారు . ఇష్టం లేనివాళ్లు చదవటం లేదు. వాళ్లతో ఇబ్బంది లేదు . కానీ కొందరు మానసిక రోగులు వాళ్లమనసుల్లో ద్వేషాన్ని వెళ్లగక్కటానికి నాబ్లాగును వేదికగా చేసుకుంటున్నారు అప్పుడప్పుడు . దీనిద్వారా ఎవరి మనసుగాయపడుతుందో దానికి నేనుకూడా పరోక్షంగా కారణమవుతున్నాను . నాబ్లాగునుచూసేవారి దృష్టిలో నేను చులకనవుతాను . నామానాన నాపని నేనుచేసుకుంటూ వెళుతుండగా ఈ దౌర్భాగ్యులద్వారా నాకీమానసికవేదనేంటి ? అని బాధపడతాను . మరి ఇలాంటిచర్యలద్వారా అలా చెత్తకామెంట్లు వ్రాసేవారికి ఒనగూడేపయోజనం ఏమీఉండదు సరికదా ఖచ్చితంగా ఇతరులకు వేదనకలిగించిన పాపాన ఖచ్చితంగా తిరిగి దుఃఖపడవలసిన సమయం వస్తుంది. గుర్తుంచుకోండి . నిన్న నేను ముక్కెళ్ళపాడు అనే గ్రామంలో దత్తక్షేత్రంలో అక్కడ నిర్వహకులతో దైవసంబంధిత విషయాలచర్చలో ఉండగా ,అంతర్జాలంలో ఉన్న మిత్రులనుంచిఫోన్ వచ్చింది "మీబ్లాగులో చండాలమైన కామెంట్లు పెట్టారు అని. అప్పటికప్పుడు నాపాస్వర్డ్ చెప్పి వాటిని తొలగించమని కోరాను. ఇలాంటి సమయంలో వచ్చే ఆవేదన ,కోపం ఆచర్యకు పాల్పడ్డవారికి మాత్రం హానికలిగిస్తాయి .దయచేసి ఎవరూ నన్ను నాబ్లాగును ఇబ్బంది పెట్టవద్దని వేడుకొంటున్నాను.

ఇంత ఇబ్బందెందుకు మోడరేషన్ పెట్టకూడదా అని అనొచ్చుమీరు. నాబ్లాగులో ఆథ్యాత్మికవిషయాలపై తమస్పందనలను తెలియజేసేవారు,వాటిమీద మరలా తమ అభిప్రాయాలను వ్రాసేవారు వెరసి ఇదంతా ఒక చర్చగా సాగుతూఉంటుంది . ఆయావిషయాలపై విషయావగాహ పెంచుకోవటానికి నాబ్లాగుపాఠకులకు నాకు ఒక అవకాశం ఇది. నాకు మీకుమల్లే అన్నిసందర్భాలలో నెట్ అందుబాటులో ఉండదు కనుక వ్యాఖ్యలపరిశీలనకు సమయం తక్కువగాఉంటుంది . అప్పటికీ ఈమధ్య మోడరేషన్ ఉంచుతున్నాను కానీ ఒక్కోసారి నాపరిజ్జ్ఞాన లోపంవలన పనిచేయటం లేదు .

దయచేసి మానసిక వికారాలను ఒలకబోయటానికి నాబ్లాగును వేదిక చేసుకోవద్దని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను .

జైశ్రీరాం

Read more...

కామెంట్లకు మోడరేషన్

>> Tuesday, April 5, 2011


ఇంతకుముందు కొన్ని కారణాలచేత ఈ బ్లాగుకు మోడరేషన్ పెట్టలేదు, అదే ఇప్పటిదాకా కొనసాగింది. ఐతే దాన్ని కొంతమంది ఇలా వాడుకుంటారని ఆయన అనుకోలేదు. కామెంట్లను వెంటనే డిలీట్ చెయ్యమని నన్ను అడిగారు. డిలీట్ చెయ్యడమూ జరిగింది, అలాగే మోడరేషన్ ఎనేబుల్ చెయ్యడం కూడా జరిగింది. ఈ సంఘటన వల్ల ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే వారందరికీ క్షమాపణలు చెప్పానని చెప్పమన్నారు.మాస్టరు గారు ఆలయనిర్మాణ పనుల్లో బిజీగా ఉండండంచేతా, ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం చేతా ఈ పోస్ట్ నన్ను రాయమన్నారు.


మనోహర్.చెనికల


Read more...

మహాత్ములజీవితాలలో అసలైన మహిమలను గుర్తించగలగాలి మనం.

>> Monday, April 4, 2011


మానవజీవితగమనానికి దిశానిర్దేశ్యం చేసేందుకు మహాత్ముల అవతరణ జరుగుతుంది . వారి చర్యలు చిత్రంగానూ ,విచిత్రంగానూ కనిపించినా వాటి లక్ష్యమేమిటో అవిరూపుతీసుకున్న తరువాత మనకు కనపడతాయి . వారిబోధలను వినటమేకాదు , అవి ప్రకృతినియమాలకు విరుద్ధంగా ఎట్టిపరిస్తితులలోనూ ఉండవు అనే విషయం మనం గమనించాలి. అవి సహజాతి సహజంగా జరుగుతాయి. సృష్టినియమాలకు విరుద్ధంగా తమ శరీరాలను నిలుపుకోవటం ఎట్టిపరిస్థితులలోనూ అంగీకరించరు.
పిల్లవానికి బడికిపంపటానికి మిఠాయిలు ఇచ్చిన తల్లివలె వారు కొద్దిమందిపై కొంత అనుగ్రహం చూపుతారు, కానీ తమజీవితం చమత్కారాలకోసమే కాదని హెచ్చరిస్తూనే ఉంటారు. వారి జీవితాలనుంచి మనం నేర్చుకోవలసినదేదో నేర్చుకోవాలి ,వారి ఏర్పరచిన దారిలో నడచి లోకకళ్యాణానికి తద్వారా ఆత్మకళ్యాణానికి పాటుపడటమే వారికిష్టం .అంతే తప్ప తమనే భగవంతునిగా భావించి తాము శాస్వతంగా భౌతికావధిలో ఉండాలని కోరుకోవడం వారికి నచ్చదు.
వారి భౌతికంగా చేయాల్సిన పనులు పూర్తయ్యాక సూక్ష్మశరీరాలతో చేయవలసిన పనులకోసం తరలివెళతారు దీనినే మహాసమాధి అంటారు. గర్విష్ఠులకు .అహంకారులకు ఆచర్యలు అర్ధం కావు . లోకాస్సమస్తా సుఖినోభవంతు

Read more...

మరో నవవసంతం తో మీకుటుంబాన ఆనందం వెల్లివిరియాలి .

>> Sunday, April 3, 2011


ఈనాడు ప్రవేశిస్తున్నమరోనవవసంత మీజీవితాన్న ఆనందమయంచేయాలని .సకలసౌభాగ్యాలు మీకుప్రాప్తించాలని ఆ జగన్మాత కరుణ మీపై ఉండాలని వేడుకుంటూ మీకు మీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Read more...

నూతన సంవత్సర పూజలకు మీ గోత్రనామాలు పంపండి.

>> Saturday, April 2, 2011








అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . కాలప్రవాహంలో మరో కొత్తసంవత్సరం "ఖర" ప్రవేసిస్తున్నది. కోటి ఆశలతో కొత్తసంవత్సరం లోకి అడుగిడుతున్న మీ అందరికీ సకలశుభాలు ప్రాప్తించాలని కోరుతూ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లోప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నవి . మీరు మీకుటుంబసభ్యుల గోత్రనామాలు పంపితే మీతరపున అర్చన నిర్వహించబడుతుంది .
ఉగాది రోజు జరగనున్న కార్యక్రమములు .

శ్రీసూక్త,పురుషసూక్త రుద్రసూక్తములతో స్వామివారలు,అమ్మవార్లకు వివిధద్రవ్యములతో అభిషేకములు అర్చనలు
కుంకుమ పూజలు ప్రత్యేక నివేదనలు జరుపబడుతాయి.

గోత్రనామాలు durgeswara@gmail.com నకు పంపండి .

Read more...

జయమంత్రం ఎవరు చదవాలి?

>> Friday, April 1, 2011


జయమంత్రం అంటే ఏమిటి. దాని అర్థం ఏమిటి? దాన్ని ఎవరు పఠించాలి?
- యస్.వి. రంగబాబు, కొత్తూరు, నెల్లూరు జిల్లా

సీతాన్వేషణకై లంకకు వెళ్లిన హనుమంతుని ఎనభైవేల మంది రాక్షసులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు హనుమ ఉద్ఘోషించినదే 'జయమంత్రం'. ఇది శ్రీవాల్మీకి రామాయణం సుందరకాండలో 42వ సర్గలో ఉంది. ఈ కింది నాలుగు శ్లోకాలనే జయమంత్రం అంటారు.

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః
నవరావణ సహస్రంమే యుద్ధే ప్రతిఫలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్దయిత్వాపురీం లంకాం అభివాద్యచమైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం
ఈ శ్లోకాల అర్థం ఇది. అధిక బలుడగు రాముడు, మహాబలుడగు లక్ష్మణుడు అతిశయంతో వర్ధిల్లుచున్నారు. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు జయము కలిగి ఒప్పుచున్నాడు. నేను కోసలేంద్రుడగు రాముని దాసుడను. శత్రుసైన్యమును చంపువాడను. వాయుపుత్రుడను, వేయి మంది రావణులు వచ్చినా యుద్ధంలో నన్నెదిరించి నిలువలేరు. శిలలతో వృక్షాలతో మాత్రమే నేను కొట్టెదను.

లంకాపురిని మర్దించి మైథిలికి నమస్కరించి, సాధింపవలసిన కార్యాన్ని సాధించి రాక్షసులందరు చూస్తుండగానే వెళ్లెదను. ఇది హనుమ రాక్షసులపై విజయానికి ఉపయోగించిన జయమంత్రం. ఈ మంత్రాన్ని అనుసంధిస్తే మనకు కూడా విరోధులు తొలగి విజయం చేకూరుతుంది. ఈ జయమంత్రంలోనే మొదటిసారిగా హనుమ తనను దాసునిగా పేర్కొన్నాడు. సీతమ్మను చూసిన తరువాతే హనుమకు స్వస్వరూపం తెలిసింది. ఆత్మలకు సహజ స్వరూపం భగవద్దాస్యమే.
రామాయణ పారాయణం చేసేటప్పుడు ఈ జయమంత్రాన్నే సంపుటీకరణ శ్లోకాలుగా అనుసంధిస్తారు. అంటే పారాయణం ముందు వెనుక ఈ నాలుగు శ్లోకాలు చదివితే 'సంపుటీకరణం' చేసిన ఫలం ఉంటుంది.
-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

Read more...

నరకానికి పంపే గుణాలు


ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప సద్గుణం. కానీ చేసిన వాగ్దానాన్ని భంగపరచడాన్ని పెద్ద విషయంగానే పట్టించుకోరు ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది. వాస్తవానికి వాగ్దానాన్ని నిలుపుకోకపోవడం, దాన్ని భంగపరచడం పెద్ద తప్పు.
కొంతమంది కొన్ని విషయాలను అసలు తప్పుగా, పాపాలుగా, నష్టదాయకమైనవిగా భావించరు. ఎందుకంటే అవి చూడడానికి చాలా చిన్న, సామాన్య విషయాల్లాగానే కనిపిస్తాయి. కాని పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స) చిన్న చిన్న తప్పిదాల నుంచి కూడా సురక్షితంగా ఉండాలని ఉపదేశించారు. ఉదాహరణకు అబద్దం. దీన్ని చాలామంది అసలు తప్పుగానే భావించరు.

చిన్న చిన్న విషయాలకు చాలా తేలిగ్గా అబద్దాలాడేస్తుంటారు. ఒకసారి అబద్దం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా దాన్ని సమర్థించుకోవడానికి అనేక అబద్దాలకు పాల్పడవలసి ఉంటుంది. అందుకే అబద్దం మనిషిని నరకానికి తీసుకుపోతుందని ముహమ్మద్ ప్రవక్త (స) తీవ్రంగా హెచ్చరించారు. అబద్దాల కోరు పరలోకంలో మాత్రమే కాదు, ఇహలోకంలో కూడా తీవ్ర పరాభవాన్ని చవిచూస్తారు. అబద్దాలు మాట్లాడేవారిని ఎవరూ ఒక పట్టాన నమ్మరు. బయటివారే కాదు, బంధుమిత్రులు కూడా దగ్గరికి చేరనివ్వరు. అందుకని అబద్దమనే దురలవాటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్దం చెప్పకుండా జాగ్రత్తపడాలి.

ఇవేం మాటలు?
ఈకాలంలో సర్వసాధారణం అయిపోయిన మరో తప్పిదం బూతులు పలకడం. మంచి అయినా చెడు అయినా రెంటికీ దీని వాడకం పరిపాటి అయిపోయింది. సినిమాల్లోనే కాదు మామూలు వ్యవహారికంలో కూడా అలవోకగా బూతులు మాట్లాడేస్తుంటారు. ఇది అశ్లీలం అన్న స్పృహ చాలామందికి ఉండడం లేదు. ఆగ్రహంలోనూ, ఆనందంలోనూ అశ్లీలమే అగ్రస్థానం అలంకరిస్తోంది. నిజానికి నోరు అద్భుతమైన వరం. మానవ సంబంధాల వారధి.

నోరు విప్పితే మాటల ముత్యాలు రాలాలి. అవి పరులకు మేలు చేయాలి. అంతేగాని ఎదుటివారి మనసుల్లో శూలాల్లా గుచ్చుకోకూడదు. ఎవరి హృదయాలనూ గాయపరచకూడదు. బూతులు మాట్లాడటం వల్ల గానీ, ఇతరుల మనసు నొప్పించడం వల్ల గానీ కొంతమందికి తాత్కాలిక ఆనందం కలిగితే కలగవచ్చేమోగానీ, దాని పర్యవసానం మాత్రం తీరిగ్గా అనుభవించాల్సి ఉంటుంది. ఇహలోక పరాభవంతో పాటు, పరలోక వైఫల్యాన్నీ మూటగట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి అశ్లీలం దొర్లకుండా నోటిని పవిత్రంగా ఉంచుకోవాలి. పరుల మనసు గాయపడకుండా ఉండేందుకు మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి.

ఆశపెట్టి తీర్చకపోతే...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్ప సద్గుణం. కానీ చేసిన వాగ్దానాన్ని భంగపరచడాన్ని పెద్ద విషయంగానే పట్టించుకోరు ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది. వాస్తవానికి వాగ్దానాన్ని నిలుపుకోకపోవడం, దాన్ని భంగపరచడం పెద్ద తప్పు. చాలామంది వెనుకా ముందూ చూసుకోకుండా, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వాగ్దానాలు చేసేస్తుంటారు. ఈ విషయంలో మన రాజకీయ నాయకులను మించినవారు ఎవరూ ఉండరు.

ఒక విషయంపై ఇతరులకు ఆశలు కల్పించడం కూడా పాపమే అన్న విషయం వీరికి తెలియదు. మీ వాగ్దానంపై నమ్మకంతో అవతలి వ్యక్తి మరొకరికి మాటిచ్చి ఉండవచ్చు. లేక అతనికి వేరే ఏవైనా అవసరాలు ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు ఈ వాగ్దానం పూర్తిచేయకపోతే ఆ వ్యక్తి ఇబ్బందుల పాలు కావచ్చు. అతని పరువు పోవచ్చు. చిన్నపాటి నష్టంతో పాటు పెద్ద నష్టం వరకు ఏమైనా జరగవచ్చు. అందుకని వాగ్దాన పాలన చాలా అవసరం. వాగ్దానాల విషయమై దైవం ప్రశ్నిస్తాడు. శిక్షిస్తాడు. కాబట్టి చిన్నచిన్న విషయాలే కదాఅని నిర్లక్ష్యం చేయకుండా స్వయం శ్రేయస్సుతో పాటు, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనుగడ సాగిస్తే ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందవచ్చు.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP