ఈ మొక్కలే నా ఆశకు ఆధారం .
>> Friday, April 22, 2011
నేను కూడా ఒక గిన్నె నీళ్ళుపోసి పెంచిన మొక్క కూడా సుఫలాలను ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
విషయమేమిటంటే మేము పీఠం తరపున నడుపుతున్న పాఠశాలను ఈసంవత్సరం ఆపిన విషయం మీకు తెలిసినదే. మాపిల్లలను అనేకపాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు . వినుకొండలోని ప్రముఖపాఠశాల గీతాంజలిలో కొంతమంది చేరారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన పేరం రాజమోహన్ రెడ్డి అనే పిల్లవాడు కూడా ఈపాఠశాలలో చేరాడు. అక్కడే హాష్టల్ ఉంటున్నాడు .
ఈమధ్య ఆపిల్లవాడు అడచివెళుతుంటే రెండువేలరూపాయల నోట్లకట్ట దొరికిందట. పక్కన ఉన్నపిల్లలంతా ఇది బజార్లో దొరికింది మనస్కూల్లో కూడా కాదు కదా ! నువ్వే ఉంచుకో అని సలహా ఇచ్చినా వినకుండా వెళ్ళి ఆ పాఠశాల ఉపాద్యాయులకిచ్చాడట . వాళ్ళు చాలా ఆస్చర్యపోయి .ఇంత డబ్బు మాకిచ్చవేరా ? నువ్వే ఉంచుకోలేదెందుకని అడిగారట.
లేదండి ! మనది కాని సొమ్మును మనం ఉంచుకోకూడదు ,అని మా దుర్గా మాష్టర్ గారు చెప్పారు . మాపాఠశాలలో ఏవైనా వస్తువులు దొరికితే అసెంబ్లీలో పిల్లలకు చూపి ఎవరివి వారికిస్తాము . డబ్బుదొరికితే అవి ఎవరివో కనుక్కుని వారికందజేస్తాము ,ఎవరివనేది తెలియకపోతే దేవుని హుండిలో వేస్తాముగానీ ఎవరం ఉంచుకోము . అని చెప్పాడట.
ఉపాధ్యాయులు చాలాసంతోషించి నీకేదైనా బహుమానం ఇస్తాము కోరుకోమంటే నాకేమీ వద్దు అని చెప్పాడట. వాళ్ళు పాఠశాల అసెంబ్లీలో ఈసంఘటన మిగతావిద్యార్థులందరికీ చెప్పి ఈపిల్లవాణ్ని అభినందించి ఒకశాలువా కప్పి సత్కరించారట . మాపాఠశాలగూర్చి ,మాశిక్షణగూర్చి మరీమరీ చెప్పారట . ఇదిచాలదా ? మాకు
0 వ్యాఖ్యలు:
Post a Comment