శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

యాగంలో పాల్గొంటున్నవారిపై స్వామి అనుగ్రహం వర్షిస్తున్నది.

>> Wednesday, April 20, 2011


హనుమత్ స్వామి పరమకృపాళువు . కొలచినవారికి కొంగుబంగారమై పిలిస్తే పలికేస్వామియని ప్రసిధ్ధిచెందాడు. ఈనాటికీ భూమిపై నివసిస్తూ ఆపదలలో ఉన్న భక్తులకు అండగాఉండి కాపాడుతున్నాడు . ఆయనను దర్శించిన సాధకులు ఈరోజులలోనూ ఎందరో ఉన్నారు. నాలాంటి సామాన్య సేవకుడు దర్శించలేరని జాలిచెంది ఆయన తన ఉనికిని తానేచాటుతుంటాడు . అలాంటి అనుభవమే ఈరోజు ఒకటి ప్రసాదించారు స్వామి. ఉదయం వాతావరణం చల్లగాఉంది . హనుమత్ రక్షాయాగం లో భాగంగా ఈ యాగంనకు అనుసంధానంగ పారాయణాదులను చేస్తున్న భక్తులతరపున అభిషేకం చేస్తూ ఉండగా ఈబుధ్ధిహీనుడికి [నాకు] ఓ చిన్న అనుమానం వచ్చింది . ఈయాగం స్వామి గమనిస్తున్నారా? పాల్గొంటున్నవారి పై స్వామి అనుగ్రహం ఉన్నదా ? అనే చంచలం మనసునకలిగింది .
పూజ అయిపోయాక కూర్చుని చాలీసా పారాయణం ప్రారంభించాను .అంతే స్వామి తన అనుగ్రహం వర్షంలా అనుగ్రహిస్తున్నారన్నట్లు గా చిరుజల్లు మొదలైంది .స్వామి ని సందేహించినందుకుమనసున క్షమాపణలు వేడుకుంటూ పదకొండుసార్లు పారాయణం చేయటం పూర్తయ్యేవరకు పడిన చిరిజల్లు పారాయణం పూర్తికాగానే ఆగిపోయింది . " ఇది తులసీదాసునకు నేనిచ్చిన వరం .ఎవరు నన్ను చాలీసాతో స్థుతించినా వారికి నేను రక్షణగా ఉంటానని వరమిచ్చాను" అని స్వామి ఇస్తున్న సంకేతంలాభావించి "బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యాదేహు మొహు హరహు కలేశవికార్ " అని క్షమాపణలుచెప్పుకున్నాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP