శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం [మూడవ ఆవృత్తి] ప్రారంభం కాబోతుంది .వివరములు చూడండి .

>> Sunday, April 10, 2011


శ్రీరామ

మహాబలి .శ్రీరామభక్త హనుమంతుడు సర్వలోక రక్షాకరుడు . భక్తితో ఆశ్రయించినవారి కి సర్వత్రారక్షకుడై సకల శుభములను చేకూరుస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో వున్న విపత్కరపరిస్థితులనుండి రక్షణ పొందటానికి సులభతరమైన ఆయన ఉపాసన ఎంతో శుభప్రదము జీవితాన మనం ఎదుర్కుంటున్న సకలసమస్యలను తొలగిస్తుంది. అదీగాక ఇప్పుడు భూమిపై పలు ఉత్పాతాలు సంభవించేకాలము. పలుప్రమదాలు పొంచిఉన్నాయని పంచాంగాలన్నీ హెచ్చరిస్తున్నాయి . ఈస్థితిలో కేవలం మనశక్తి సామర్ధ్యాలు మాత్రమే మనలను రక్షించజాలవు .శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం భక్తజనశ్రేయస్సుకై "హనుమత్ రక్షాయాగం" [మూడవ ఆవృత్తి] నిర్వహిస్తున్నది . ఒక ఆథ్యాత్మిక ప్రయోగంగా జరిగే ఈసాధనలో పాల్గొని గత రెండుసార్లు యాగంలో పాలగొన్నవారు స్వయంగా సాధనతో అద్భుతఫలితాలు పొందారు. ఎంతోమంది అనారోగ్య,వృత్తి,గ్రహదోష ,శతృబాధ,నరఘోష , సంతానలేమి ,ఉద్యోగం , మానసిక,ఆథ్యాత్మిక సమస్యలను తొలగించుకున్నారు.తమకష్టాలను సంకటాలను తొలగించుకుని తమజీవితాన మంచి మేలునుపొందియున్నారు. బుధ్ధిర్భాలాన్ని యశోధైర్యాలను ప్రసాదించగల ఈ యాగంలోఇక్కడ అంతర్జాలంలోనూ యెంతోమంది పాల్గొని స్వామి అనుగ్రహం చవిచూసిఉన్నారు .

తామున్న స్థలంనుండే ఈ యజ్ఞక్రియతో అనుసంధానింపబడి సాధన చేసుకొని తమ సమస్యలను తామే తమ ఆథ్యాత్మిక శక్తి ద్వారా పరిష్కరించుకోవటమే ఈ యాగనిర్వహణ లక్ష్యం. దీనిలో పాల్గొని స్వామి కృపకు పాతృలై మీ జీవితంలో మీరెదుర్కుంటున్న సంకటములను తొలగించుటలో స్వామి శక్తిని అనుభవంలోకి తెచ్చుకోగలరు. మీరు గోత్రనామాలను యాగనిర్వహణా కేంద్రమైన పీఠమునకు పంపి మీరు సూచించబడిన సాధనలను నియమానుసారంగా చేసి పూర్ణాహుతికి యజ్ఞకేంద్రమునకు గాని లేక సమీపంలోగల సిధ్ధ హనుమత్ క్షేత్రంనకు గానివెళ్లవలసి ఉంటుంది .

విధివిధానాలు
----------

దీక్షానియమము ,సాధారణ నియమముల లో చేయవచ్చు .మీకు ప్రస్తుతమున్న పరిస్థితులలో అనుకూలమైన మార్గంలో మీసాధన సాగించవచ్చు.

సాధారణ నియమపద్దతి
-------------------

పీఠానికి మీగోత్రనామాలు పంపి ,మీరు హనుమదాలయంలోగాని మీ పూజామందిరంలోగాని స్వామివారి కి అర్చనజరిపి మీ సమస్యను పరిష్కారం కోరుతూ స్వామివారిముందు సంకల్పం చెప్పుకోవాలి . ఉదయాన్నే శిరఃస్నానమాచరించి సింధూరధారణ, దీపారాధన ,లఘువుగానైనా దేవతార్చ చెసుకుని స్వామివారికి అరటిపండ్లు నివేదించుకోవాలి. ఆతరువాత మీకు వీలైతే సమీపంలో ఉన్న హనుమదాలయంలోగాని లేక చిత్రపటాన్ని తులసికోట లేదా ఒక కొత్త ఆసనంలో నూతన వస్త్రంపరచి దానిపై స్వామివారి చిత్రపటాన్నుంచి మీరు సంకల్పించుకున్న ప్రకారం 108--54--27 గాని మీ సంకల్పానుసారం ప్రదక్షినలు చేయాలి.
ఆతరువాత సుఖాసనంలో కూర్చుని హనుమాన్ చాలీసా 11 సార్లులేదా సుందరాకాండ పారాయణం గాని ఈనలభైరోజులు నియమము తప్పకుండాచేయాలి .రాత్రి ఆంజనేయస్వామి దండకం చదువుకోవాలి. హనుమత్ కథలను వినటమో చదవటమో చేయాలి.
హనుమత్ ప్రీత్యర్ధం రామనామజపం చేయాలి. శరీరం సహకరిస్తే ఏకభుక్తం ,లేదంటే శనివారం రోజు ఏకభుక్తంతోగడపాలి . బ్రహ్మచర్యం సాధనలో శక్తిని పెంచుతుంది. మద్యమాంసాదులు ,అధర్మ వర్తనం ,ధూమపానం నిషేధం .స్వామి ధర్మరక్షకుడు .
ఈసమయంలో ఇతరుల భోజనాలు చేయటం వలన మీసాధనాఫలితం వారికి ధారపోసినవారవుతారు కనుక సాధ్యమైనంతవరకు ఇతరులయింటికి భోజనానికి వెళ్లకపోవటం మంచిది. అశుభకర్మలకు వెళ్లరాదు. ఇంటిలో కూడా ఆడవారికి ఇబ్బంది ఉన్నప్పుడు వారు ఇంటిపనులుచేయకుండా తాకకుందా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మీరొకవేల ప్రయాణములలో ఉన్న ఎక్కడైనా ఈసాధనజరుపుకోవచ్చు . ఆడవారు మొదలుపెట్టినతరువాత ఇబ్బందివచ్చినప్పుడు ఆనాలుగురోజులాగి ఐదవరోజునుంచి మరలామొదలుపెట్టి నలభైరోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి నలభైరోజులతరువాత పూర్ణాహుతికి పీఠానికి రావచ్చు. వీలుకుదరని పక్షంలో సమీపంలోని హనుమదాలయానికి వెళ్ళి హనుమత్ వ్రతం చేసుకుని లేదా ఆకుపూజజరిపించి సాధనపూర్తిచేసుకోవాలి.


దీక్షానియమము.
---------------
ఈపద్దతిలో సాధకులు స్వామి వారి మాలధరించాలి . కాషాయవర్ణవస్త్రాలు ధరించాలి ,బ్రహ్మచర్యము,భూశయనము ,ఏకభుక్తము ,నిత్యం సుందరాకాండ లేక హనుమాన్ చాలీసా 11 సార్లకు తగ్గకుండా పారాయణం , ఉదయాన్నే హనుమత్ ప్రదక్షిణలు చేయాలి .స్వామివారి అర్చన సాగించాలి .సాధ్యమైనవాళ్ళు అనుబంధంగా రుద్రసూక్త,మన్యుసూక్తములతో అభిషేకములు , సూర్యనమస్కారములు నిర్వర్తించాలి ,ఆంజనేయస్వామి దండకం పఠించాలి . రామనామ జపం చేయాలి .మాలధారణలో నియమాలన్నీ పాటించాలి. పూర్ణాహుతికి పైన చెప్పినట్లుగానే చేయాలి .అయితే దీక్షను పురుషులు నెలసరి ఇబ్బందులు లేనివారు పిల్లలు మాత్రమే చేయాలి.

యాగంప్రారంభం ; 16-4-2011 శుద్ధత్రయోదశి శనివారం

నిత్యకార్యక్రమములు ః మన్యుసూక్త,రుద్రసూక్త సహితంగా అభిషేకములు తమాలార్చనలు
ప్రతిశనివారం విశేషద్రవ్యములతో అభిషేకములు ,108 సార్లు చాలీసా పారాయణం



హనుమజ్జయంతి ; 27 -5-2011 వైశాఖ బహుళదశమి శుక్రవారం సామూహికంగా హనుమత్ వ్రతం
పూర్ణాహుతి ; 28-5-2011 ఏకాదశి పూర్ణాహుతి ,అన్నదానం .


మీరుచేయవలసిన దేమిటి ?
-----------------------
మీసమస్య పరిష్కరించుకోవటానికి పైన సూచించినన పద్దతులలో మీకువీలైన రీతిలో సాధనమొదలుపెట్టండి. మీ గోత్రనామాలను యాగకేంద్రానికి పంపండి . మీతరపున ఒక కొబ్బరి కాయ ముడుపు కట్టబడుతుంది .ఆముడుపు పూర్ణాహుతిసమయంలో మీతరపున సమర్పిస్తారు . . ఈ నలభైరోజులు పూజలో ఉంచబడిన అత్యంతశక్తివంతమైన హనుమద్రక్షలు మీ కుటుంబానికి ఎన్నికావాలో తెలుపండి . [ఆముడుపు కు,ప్రసాదంపంపటానికి అయ్యే పోస్టల్ లేదా కొరియర్ ఖర్చులు మీరే భరించాలి] . మీరుకోరితే స్వామివారికి మీతరపున ప్రత్యేక అర్చనలు జరుపబడతాయి. ఇంకావివరములకొరకైతే ఫోన్లో లేదా మెయిల్ ద్వారా సంప్రదించండి .

గోత్రనామాలు పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com

శ్రీ వేంకటేశ్వర జగన్మాతపీఠం రవ్వవరం ,నూజండ్లమండలం ,గుంటూరు జిల్లా
సెల్ ః 9948235641

3 వ్యాఖ్యలు:

Ayyagari Surya Nagendra Kumar April 11, 2011 at 8:19 AM  

అద్భుతమైన కార్యక్రమం, లోక కళ్యాణార్థం మీరు చేస్తున్న ఈ మంచి పని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆకాంక్ష ఆపై సీతారామచంద్ర ప్రభువు ఆశీస్సులుండనే ఉన్నాయి.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ April 11, 2011 at 11:33 AM  

జై శ్రీరామ్

చింతా రామ కృష్ణా రావు. April 12, 2011 at 9:24 PM  

మనోజ్ఞ భావ! మరుతీ సమానులెంచ లేరుగా
యనాథనాథుడై కృపన్ మహత్యమెన్న గాచునే!.
ప్రణామ మాచరించి కోర రక్షణంబు చేయునే.
మనోజ్ఞ యాగ సత్ఫలంబు మంచివారికందెడున్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP