శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నాహజారే గారి దీక్షతో అవినీతి అంతమైపోతుందా ?????

>> Saturday, April 9, 2011

నేడు దేశం ఊగిపోతోంది . అన్నా హజారే ..అంటూ. శక్తులుమండే యువత చేవజచ్చి సినిమాలి క్రికెట్ల లో మునిగితేలుతుంటే పాపం ముసలితనం వచ్చినా సైనికుడినే నేనంటూ అన్నహజారే అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పాడు. ఆగొంతుతో పదిగొంతులు కలవగనే గుంపుకనపడితేగాని ధైర్యంరాని మనం ఊగిపోతూ పూనకంతోకోరస్ పాటెత్తుకున్నాం . అయ్యో ఇన్ని గొంతులు పాడుతుంటే మనం చూస్తుండటమా అని, సోనియా,జగన్,గాలిజనార్ధన్ రెడ్డి,యెడ్యూరప్ప వంటి త్యాగమూర్తులు సచ్చీలురంతా మేముసైతం అంటు కోరస్ పాడుతున్నారు. ఇక మనదేశంలో అవినీతి అవశేషాలు కూడామిగలకుండా నశించిపోతుందనే అమాయకపు ప్రాణులు ఏదో దింపుడుకళ్లం ఆశలు పెంచుకుంటారు . కానీ ఒకసారి వెనుతిరిగిచూసుకుంటే నిరాశే మిగులుతుంది . బాధాకరమే గాని ఇది సత్యం.

అసలుమనిషి అవినీతి కి ఎందుకు పాల్పడతాడు? . అతనిని ఎప్పుడవకాశమొస్తే అప్పుడు తప్పు చేయకుండా నిరోధిస్తున్న శక్తి ఏమిటి ? చట్టాలా !!! అయితే అనేకవిషయాలపై చేసిన చట్టాలన్నీ ఫలితాలనిచ్చాయా ? లేదే .
ఎందుకని ?

ముదుగా మనం ఓ చిన్న పరిశీలన చేసుకుందాం .ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్న వారెవరు ?
మనం రాజకీయ నాయకులు అంటాం .
మేము ఎలక్షన్లలో వేలుదాటి,లక్షలు దాటి,కోట్లలో ఖర్చుపెట్టాల్సివస్తుంది . మరదంతా ఎక్కడో ఒకచోటనుంచి తెచ్చిపెట్టాలి కదా ! ఆతెచ్చినదంతా మరలా వసూలుచేసుకోకుంటే మా అప్పులెలా తీరాలి ?మాపరిస్థితేమిటీ అంటారు రాజకీయ నాయకులు.
ఉద్యోగులు లంచావతారులు, అందామంటే .,మీరే మాపని ఎలగైనా త్వరగా పక్కవాడికంటే ముందుగా చేసిపెట్టమని వత్తిడిచేస్తుంటిరి ? చేయకపోతే ఏదో ఒక నాయకునితో చెప్పిస్తుంటిరి ! మాపైఅధికారులు,వారి పైవారు ఆపైన మంత్రులవరకు నెలవారీ ముడుపులు వసూలుచేయవలసి ఉండె ! ఇవన్నీ చేయకుండా మాకు మనుగడ ఉంటుందా అంటారు.
పోలీస్ ,రెవెన్యూ నుండి అన్నిశాఖలలోనూ నేడున్నదుస్థితి ఇది.
ఇక ఇలాంటి వాటిపై కన్నేసి అవినీతిని వెలికితీయాల్సిన పత్రికలన్నీ పెట్టుబడిదారుల మానసపుత్రికలాయె ! వారి వ్యాపారసామారాజ్యాలకు అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఏదైనా వ్రాయగలరు. తినటానికి నెలకుసరిపడా సరుకులుకూడా కొనలేని జీతాలతో పనిచేస్తున్న విలేఖరులు ఏవిధంగా బ్రతకాలని యాజమాన్యం అనుకుంతుందోగాని ఎలాబ్రతకాలో వాళ్ళే నేర్చుకున్నారు. ఇంకా ఒకరిద్దరు చాదస్తులు నిజాయితీగా వార్తలు వ్రాద్దామనుకున్నా నెలకింత యాడ్ రెవెన్యూ వసూలుచేయాలని యాజమాన్యాల వత్తిడిచేస్తుండటంతో ఎవరిదగ్గర యాడ్ లు సేకరిస్తున్నారో వాళ్లపై ఏమని వార్తలు వ్రాస్తామని మిన్నకుంటున్నారు. ఒకవేల చొక్కాలుచించుకున్నా ఒరిగేదేమీ లేదు అనే నిసృహకు లోనయ్యారు.
ఇక జనం విషయానికొస్తే అవినీతి ,అధికార దుర్వినియోగం లాంటివి కళ్ళెదుట కనపడ్డా నోరువిప్పరు. ఎక్కడో హైదరాబాద్లు ఢిల్లీ లలో జరిగిందంటూ రాస్తారోకోలకు దిగుతారు . గుంపులోచేరితే చాలు వీరావేశంతో బస్సులు వాహనాలు[తమవికాకుండా]ధ్వంశం చేస్తారు. తమకులపు వాడో ,పార్టీ వాడొనైతే చాలు వాడెన్ని తప్పులుచేసినా మనకు అవి పెద్దగా లెక్కగా కనపడవు. ఇక మనకునొక్కెయ్యాటానికి అవకాశం ఉంటె వదిలే ప్రశ్నలేదు. సాక్షాత్తూ దేవుని దర్శనానికెళ్ళినా అవినీతి మార్గంలో దర్శనానికెళ్లటానికి సిధ్ధం .
మాఊర్లో కెళ్లా అత్యంత ధనవంతులైన కుటుంబంలో మొగుడూపెళ్లాలిద్దర్కీ వృధ్ధాప్యపెన్షన్ వస్తుంది . చాలామంది ఇల్లువాకిలీ ఆస్తులు పిల్లలున్నా పెన్షన్లుతీసుకోవటం కోసం ఎగబడుతున్నారు. రాజకీయకారణాలవల్ల ఓట్ల రాజకీయాలతో నాయకులు సిఫారసు చేయటం ,అధికారులు ఒత్తిడులకు తలొగ్గటం వలన ఇవి నిరాటంకంగా సాగుతున్నాయి . ముంది ఇలా అడుక్కోవటం సిగ్గు అనిపించటంలా జనానికి
అవినీతిపరులు దోచుకుంటూన్నారు సార్ ! దేశాన్ని అని మా సోదర ఉపాధ్యాయుడొకరు ఆవేశంగా అన్నాడీమధ్య .
మాస్టర్ గారూ !మనబడికి బోడి పదివేలరూపాయలొస్తే నే ఎక్కడ దొంగ ఓచర్లు పెట్టి వందా పదీ నొక్కేద్దామని మనవాళ్ళే ప్రయత్నిస్తున్నారు కదా ! మరివందలకోట్లు కళ్లముందు ఆడుతుంటే వాళ్ళుమాత్రం ఎలా చూస్తూ ఊరకుండగలరు ? అని అన్నాను. ఇక్కడ సమస్య అదికాదు. వాడికి అందుబాటులో ఉన్నాయి నొక్కుతున్నాడు . మనకు అంత అందుబాటులో లేవు కనుక మనం విమర్శిస్తున్నాం అంతే ! అన్నాను . ఆయన మరిక మాట్లాడలేదు.

ఇక్కడమనంఒకటి మరచిపోయాం . చట్టాలులేకుండానే అసత్యం పలకకుండా ,అవినీతికి పాల్పడకుండా పొరుగువాడిసొమ్ము పాములాంటిదని భావించి ,నిత్యదరిద్రంలోనైనా బ్రతుకుతాంగాని నీతిమాలినపనులతో జీవించము అని నిర్ణయంతో ఆనందంగా బ్రతికిన మన పూర్వీకుల జీవితాలను మరచి పోతున్నాము . చట్టాలు చేసేది మనిషేకదా ! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లుగా అవసరమనుకుంటే ఆచట్టాలకు వందతూట్లుకూడా పొడవగలడు మనిషే . కాబట్టి అవినీతికి పాల్పడటం అడ్డగోలు సంపాదనకు ఆశపడకుండా నిరోధించటం కేవలం చట్టాలద్వారా మాత్రమే సాధ్యం కాదు .

ఇక్కడ అన్నహజారే జీవితంలోంచి ఒక ఉదాహరణ తీసుకుందాం .
రాలేగావ్ సిద్ధీ అనేగ్రామాన్ని అన్నహజారే గారు ఎంత శ్రమించి తీర్చిదిద్దారో మీకందరకూ తెలుసు . నైతికంగాను భౌతికంగానూ ఆవూరిని సంస్కరించి అభివృధ్ధిపథంలో నిలబెట్టాడాయన. ఆయన విజయాలను గూర్చి తెలుసుకున్న ప్రభుత్వ ఉన్నతాధికారొకరు ఆగ్రామం సందర్శించారు . గ్రామస్తులు ఉమ్మడిగా శ్రమించి కట్టుకున్న చెక్ డామ్ లు, గ్రామంలో అభివృధ్ధికార్యక్రమాలు చూశాక ఆయన ఆ ఊరిప్రజలు నిర్మించుకున్న మహాదేవుని ఆలయం దర్శించాడు. అప్పట్లోనే చాలాఖర్చుపెట్టి ఆలయాన్ని నిర్మించారని తెలుసుకుని చాలానొచ్చుకున్నాడు. హజారేగారూ! అభివృధ్ధి కార్యక్రమాలకు కాకుండా ఇలా గుళ్ళుగోపురాలకోసం ఇంతఖర్చుపెట్టాలా? ఆడబ్బుతో మరిన్ని అభివృధ్ధి కార్యక్రమాలు చేపడితే బాగుండేది కదా ? అన్నాడు. అప్పటికి అన్నా హజారె మౌనంగా ఉన్నారు
సాయంత్రం అధికారి ,హజారే గారు ఆగ్రామస్తులు పెంచుతున్న మామిడితోటలు చూడటానికి వెళ్లారు . తోటలన్నీ విరగకాసి ఉన్నాయి . కానీ ఎక్కడా కాపలాదారులు కనపడలేదు. ఆ అధికారి ఆశ్చర్యపోయి , ఇక్కడెక్కడా కాపలావారు లేరే దొంగలు కాయలు కోసుకుపోరా అని అడిగారు . లేదు . ఇక్కడెవరూ దొంగతనం చేయటానికి సాహసించరు . ఆపనిచేస్తే శిక్షింపబడతామని భయం . అన్నాడు హజారే శాంతంగా .
ఎవరు శిక్షించేది ? అడిగాడు అధికారి
పొద్దుట మీరడిగారే ! ఆ ఆలయంలోని మహాదేవుడు . ఇంతసంపదనిచ్చిన తమను కాపాడుతున్న ఆతండ్రి తప్పుచేస్తే దండిస్తాడని మానమ్మకం .అలాచేసినవాల్లకు పడిన శిక్షలు మాగ్రామానికి అనుభవమే .అందుకే తప్పుచేయటానికి మావాళ్లు అంగీకరించరు.
ఇప్పుడు చెప్పండి ఎన్నికోట్లు పెట్టి కాపలాదారులనూ ఏర్పరచినా మనుషులలో ఈ సచ్చీలత తేగలమా ? మహాదేవుని ఆలయానికి పెట్టిన ఖర్చు వృధానా ? అనడిగాడు హజారే గారు
తలపైకెత్తలేకపోయాడా అధికారి.
పాపభీతి లేకుండా పెరుగుతున్న మనుషులను చట్టాలు బెదిరించగలవు నిరోధించలేవు. నేడు అవినీతికి మూలం మనుషులలో మసులలో పెరుగుతున్న అత్యాశ. జీవితమంటే ఏమిటో తెలియని చదువు . భౌతికసుఖాలు పొందటానికి మాత్రమే మనిషిజన్మించాడని భావిస్తున్న అంథకారం . ఇవి తొలగించాలంటే నడుస్తున్న కలియుగంలో "కలిపురుషుడు" ఒప్పుకోడు మానవుని పతనానికి ప్రతినబూనిన ఆయన మనసులను కలుషితం చేస్తున్నాడు. భౌతికచట్టాలు, ఆయుధాలు మనిషిమనసులో దాగున్న ఆయననేమీ చేయలేవు మనిషిని మాత్రమే నశింపజేస్తాయి.గుర్రాన్ని బండివెనుకకడితే లాభంలేదు . అందుకే అన్నారు వివేకానందులు వ్యక్తిసంస్కరణకావాలి ముందు అని. సోషలిజం వచ్చేసి నాక సంపదంతా ఒకనికిచ్చి పదిమందికి పంచమన్నా వాడు అవినీతిపరుడైతే నేటిస్థితే ఎదురవుతుంది . కనుక జీవితమంటే ఏమిటో మానవజన్మకు సార్ధకత ఏమిటో నేర్పగలది,మనం మరచిపోయినది అయిన మనదైన విద్యకావాలి . అంతవరకు ఉద్యమాలొస్తుంటాయి ,మహానుభావులత్యాగాలు మరచిపోతూనే ఉంటుంది మానవజాతి

7 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ April 9, 2011 at 7:14 AM  

"మాఊర్లో కెళ్లా అత్యంత ధనవంతులైన కుటుంబంలో మొగుడూపెళ్లాలిద్దర్కీ వృధ్ధాప్యపెన్షన్ వస్తుంది"
మా ఊర్లో అయితే డబ్బున్నవాళ్ళతో పాటు 30ఏళ్ళ ముసలివారికి కూడా వస్తుంది.

కత పవన్ April 9, 2011 at 9:16 AM  

. శక్తులుమండే యువత చేవజచ్చి సినిమాలి క్రికెట్ల లో మునిగితేలుతుంటే
------
మీరు చాలా పోరపా్టుపడుతున్నారు దుర్గేశ్వర రావు గారు యువకులంటె క్రీకేట్ లు అమ్మాయిలు సినిమాలే కాదు , సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉంటున్నారు ప్రతి ఉద్యమం లోను పెద్ద పీట వేస్తున్నారు దానికి ఉదహరణ తెలగాణా ఉద్యమాన్ని చెప్పుకొవచ్చు ... అలాగే అన్నా హజారే ఉద్యమాన్ని కూడా బూజాల పై మొసింది కూడా ఈ యువకులే .. యువకులకు కావల్సిందల్లా ముందుడి నడిపించే నాయకుడు . ఆ బాద్యతను అన్నా హాజరే తిసుకున్నారు అయన వెనుక గళం విప్పి ముందుకు కదిలారు యువకులు. ఈ దేశంలో మార్పు రావాలన్నా లేదా అవినితి అంతం కావాలన్న అది నేటి యువతకే సాధ్యం .

కొత్త పాళీ April 9, 2011 at 10:49 AM  

సార్, చాలా సూటిగా మనం ఆలోచించాల్సిన విషయాల్ని రాశారు.
అసలు అవినీతి వ్యతిరేక పోరాటాన్నించి పౌరులుగా మనం ఏం ఆశిస్తున్నామని నిర్ణయించుకోవాలి.
లేకపోతే ఇది ఇప్పటికే ఒక రాజకీయ తమాషా అయింది. రేపటికల్లా సర్కసు, జాతర అయి కూర్చుంటుంది.

cheekati April 9, 2011 at 4:27 PM  

Excellent analysis brother. completely agree with you.
Many of our youth are feeling that, they did great service to nation by simply sharing AnnaHazaare's videos in internet, and scribing few comments in support of Lokpal bil, without even knowing whts there in that Bill.

durgeswara April 10, 2011 at 1:01 AM  

పవన్

కొంతమంది కుర్రవాళ్ళు ముందుయుగం దూతలు ,భావన నవజీవన బృందావన నిర్మాతలు.....ఇలాంటి యువత శాతం తగ్గిపోతుంది రానురాను ...అదే మా ఆవేదన

సత్య April 10, 2011 at 3:09 AM  

దుర్గేశ్వరగారు నమస్తే!

మీరన్నదంతా వాస్తవం.

చట్టలు అనూహ్యమైన మార్పులేమీతేవు ....

అయితే
చట్టాలు ఆయుధాలుగా సహాయపడతాయ్
ప్రజలని సాయుధులు గా సన్నద్దం చేస్తాయ్.
సమాధానాలు, పరిష్కారాలు సుళువుగా దొరకవు.
అవి పోరాటం ద్వారానే సాధించబడతాయ్.

-satya

suckerchallanged April 10, 2011 at 5:22 AM  

@durgeswara: youth tarapuna nenu haami isthunnaa, intha avineethi jariginaa kuda desaanni agra raajyaala sarasana nilabedutune vachaam,
kevalam swaatantram raavadamthone mana desam intha goppadi kaaledu, prathi pidikili kashtapadi, prathi kanDa chemata chimmi, raalchina paisallo nunche vachaayi
ivvaala mana desaaniki inni sobagulu, ivvaala NASA,Microsoft, GOOGLE, ISRO lo viplavaatmaka maarpulaku kaaranam okka thala nerisina medhaavule kaadu,
take it easy policy tho nadiche mana yuvatha kuda unnaaru, desaanni kaapaade javaanullo ekkuva saatham unnadi kuda yuvatha ante meeru kaadu antaara,
ivvaala ye udyamam jariginaa munduku teesukelledi yuvatha kaada, okka metuku patti annam gurchi cheppachu kada ani, okariddarni choosi mottam yuvasakthi ke nirvachanam cheppakudadu,
mana yuvakulu kanuka meeru cheppinantha nispruhalo undi chedu baata lo payinisthu unte, matonmaaadha saktulla chethullo keelu bommali, booju pattina siddaanthaalaku
lobadi oka pakistan laaga matham tappa maakemi vaddani 24 gantala beduru beduru ga gadipe jeevana saili mana desam lo aavirbhavinchedi,
kaani mana yuvakulu meeru anukuntunnantha ga chedipoledu, maa mundu tharam maaku aa paathaalu nerpaledu, chedu ni edirinchadame maaku telusu, alaagani prathi okkaru
tupaaki patti adavula paalu avvaalsina avasaram ledani maaku telusu, ivvaala lakshala kotla lo budget rupondinhca baduthondi ante, aa dabbem raashtrapathi beeruvaalo
nundi teesi ivvatledu, alaagani mundu taraalu maaku sampaadinchi ichchindi kaadu, desha sarihaddulu daati evarevariko maa medhassuni ammukoni (ikkada ammokovadam ishtam leka kaadu, cheta kaaka kaadu, enduku bayata ammukuntunnaamo seperate column lo raasthaanu) memu ikkadiki sampadanu teesukosthunnaam, alaagani maa mundu tharaalu maakemi ivvaledani cheppi tappu cheyam, enno sachcheelamaina vyaktitvaalanu maaku aaadarshangaa ichindi, maa bratukulu memu brataka galige swetchaa vaayuvulanu ichindi adi chaalu thanks

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP